Shut Down
-
Dana Cyclone: కోల్ కతా ఎయిర్ పోర్ట్ మూసివేత
-
బ్రిటిషర్లు కొట్టిన దెబ్బ! ‘టాటా’ సాహసోపేత నిర్ణయం..
భారతీయ పరిశ్రమ పితామహుడిగా భావించే జమ్షెడ్జీ టాటా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అనేక పరిశ్రమలు, వ్యాపారాల ద్వారా భారతదేశ వ్యాపార ప్రపంచాన్ని మార్చిన జమ్షెడ్జీ టాటా బ్రిటిష్ పాలకులు కొట్టిన దెబ్బతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. టాటా గ్రూప్‌లో తొలి సంస్థ మూతపడింది...1890లలో టాటా షిప్పింగ్ లైన్‌ను మూసివేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ఇటీవల విడుదలైన ఒక పుస్తకంలో వివరించారు. క్లిష్ట సమయంలో నష్టాలను తగ్గించుకోవడానికి, మరింత ఆచరణీయమైన వెంచర్లపై దృష్టి పెట్టడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో జమ్షెడ్జీ టాటా చతురతను ఈ వ్యూహాత్మక చర్య తెలియజేస్తుంది. టాటా గ్రూప్‌నకు చెందిన వెటరన్లు ఆర్ గోపాలకృష్ణన్, హరీష్ భట్ రాసిన "జమ్సెడ్జీ టాటా - పవర్ఫుల్ లర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్" అనే పుస్తకంలో అప్పటి పరిస్థితులను వివరించారు.అది 1880, 90ల కాలం. భారతదేశం నుంచి షిప్పింగ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన P.&O సంస్థదే ఆధిపత్యం. ఆ గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ జమ్షెడ్జీ టాటా 'టాటా లైన్'ను ప్రారంభించారు. టాటా పేరును కలిగి ఉన్న మొదటి వ్యాపారం ఇదే. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం మద్దతుతో P.&O భారతీయ వ్యాపారులకు అధిక సరుకు రవాణా రేట్లు విధించింది. బ్రిటిష్, యూదు సంస్థలకు మాత్రం ఎక్కువ రాయితీలను అందించింది.టాటా లైన్ ప్రస్థానం..తన వస్త్ర వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని అనుభవించిన జమ్షెడ్జీ టాటా జపాన్‌లోని అతిపెద్ద షిప్పింగ్ లైన్ అయిన నిప్పాన్ యుసెన్ కైషా (NYK)తో కలిసి పనిచేయడానికి జపాన్‌కు వెళ్లారు. జమ్షెడ్జీ టాటా సమానమైన రిస్క్ తీసుకుని, నౌకలను స్వయంగా నిర్వహించినట్లయితేనే తమతో భాగస్వామ్యానికి ఎన్‌వైకే అంగీకరించింది. దీంతో టాటా 'అన్నీ బారో' అనే ఆంగ్ల నౌకను నెలకు 1,050 పౌండ్లకు అద్దెకు తీసుకున్నారు. ఇది 'టాటా లైన్'లో తొలి నౌక.తాను ప్రారంభించిన ఈ వ్యాపారం మొత్తం భారతీయ వస్త్ర పరిశ్రమకు షిప్పింగ్ రేట్లను తగ్గిస్తుందని, P.&O. గుత్తాధిపత్యాన్ని ఛేదించి టన్ను సరుకు రవాణాకు రూ. 19 నుంచి రూ. 12 వరకు తగ్గుతుందని జమ్సెడ్జీ విశ్వసించారు. అనతికాలంలోనే రెండవ ఓడ 'లిండిస్ఫార్న్'ను అద్దెకు తీసుకున్నారు. 1894 అక్టోబరులో ది ట్రిబ్యూన్ పత్రిక జమ్సెడ్జీ ప్రయత్నాలను ప్రశంసించింది.టాటా లైన్ వ్యాపారాన్ని దెబ్బకొట్టేందుకు P.&O సంస్థ ఎత్తుగడ వేసింది. టాటా లైన్, ఎన్‌వైకే షిప్‌లను ఉపయోగించని వ్యాపారులకు షిప్పింగ్ చార్జీని టన్నుకు 1.8 రూపాయలకు తగ్గిస్తామని ప్రకటించింది. దీంతోపాటు ఇలా అంగీకరించిన కొంతమంది వ్యాపారులకు ఉచితంగా రవాణాను కూడా అందించింది. 'లిండిస్ఫార్న్' నౌక పత్తి రవాణాకు పనికిరాదని పుకార్లు వ్యాప్తి చేసింది.క్రమంగా P.&O ప్రభావానికి భయపడి భారతీయ వ్యాపారులు టాటా లైన్‌తో వ్యాపారాన్ని ఉపసంహరించుకున్నారు. టాటా లైన్‌ను మూసివేస్తే భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని హెచ్చరించినప్పటికీ వారు అర్థం చేసుకోలేదు. ఫలితంగా జమ్షెడ్జీ టాటా నష్టాలను చవిచూశారు. ప్రతి నెలా రూ. వేలల్లో నష్టాలు.. ధరల పోటీ ముగిసే సమయానికి టాటా లైన్లో రూ. లక్షకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది.పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత టాటా లైన్‌కు స్థిరమైన మార్గం లేదని నిర్ధారించుకున్న జామ్‌సెడ్జీ విజయవంతమైన వ్యాపారవేత్తగా తన ప్రతిష్టను పణంగా పెట్టి వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారు. లీజుకు తీసుకున్న ఓడలను ఇంగ్లండ్‌కు తిరిగి పంపించి టాటా లైన్‌ను ముగించేశారు. అయితే ఎంప్రెస్ మిల్స్, స్వదేశీ మిల్స్, అహ్మదాబాద్ అడ్వాన్స్ మిల్స్, టాటా స్టీల్ టాటా పవర్‌తో సహా జమ్షెడ్జీ టాటా స్థాపించిన అనే వ్యాపారాలు విజయవంతమయ్యాయి. -
మస్క్‌కు పోటీగా ఎగసి.. అంతలోనే మూతపడిన ఇండియన్ యాప్
ఇలాన్ మస్క్ ఆధీనంలోని ట్విటర్ (ప్రస్తుతం ‘ఎక్స్’)కు పోటీగా వచ్చిన భారతీయ స్టార్టప్ ‘కూ’ (Koo) మూతపడింది. పలు పెద్ద ఇంటర్నెట్ కంపెనీలు, సమ్మేళనాలు, మీడియా హౌస్‌లతో కొనుగోలు చర్చలు విఫలం కావడంతో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు యాప్ వ్యవస్థాపకులు తెలిపారు.నాలుగు సంవత్సరాల క్రితం 2020లో అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదవత్కా ‘కూ’ను ప్రారంభించారు. భారత్‌లో యూఎస్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన అనేక కంపెనీలలో ‘కూ’ ఒకటి. స్థానిక భాషలలో వినియోగదారులకు సేవలు అందిస్తోంది.‘కూ’ వ్యవస్థాపకులు రాధాకృష్ణ, బిదవత్కా బుధవారం లింక్డ్ఇన్ పోస్ట్‌లో వివరాలు వెల్లడించారు. "పలు పెద్ద ఇంటర్నెట్ కంపెనీలు, సమ్మేళనాలు, మీడియా హౌస్‌లతో" కొనుగోలు చర్చలు విఫలమైన తర్వాత ‘కూ’ను మూసివేస్తున్నట్లు తెలిపారు. కాగా బెంగుళూరుకు చెందిన న్యూస్, కంటెంట్ అగ్రిగేటర్ డైలీహంట్ ద్వారా ‘కూ’ని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు ఫిబ్రవరిలో టెక్ క్రంచ్ నివేదిక పేర్కొంది.‘కూ’కు ఒకానొకప్పుడు దాదాపు కోటి మంది మంత్లీ యాక్టివ్ యూజర్లు, 21 లక్షల మంది డైలీ యాక్టివ్ యూజర్లు ఉండేవారు. ప్రభుత్వంతో కలిసి ట్విటర్ కంటెంట్‌పై ఆంక్షలు తీసుకొచ్చినప్పుడు ఆ సంస్థపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 2022లో ‘కూ’కు ఆదరణ విపరీతంగా పెరిగింది. ఆ సమయంలోనే ఈ ఇండియన్ యాప్ 50 మిలియన్ యూజర్ల మార్కును దాటింది.మరియు రోగి మూలధనం" అవసరమని రాధాకృష్ణ పేర్కొన్నారు. -
USA: కాలిఫోర్నియాలో మంచు తుపాను బీభత్సం
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మంచు కారణంగా సియెర్రా నెవడాలోని ప్రధాన రహదారిని మూసివేశారు. రాబోయే రోజుల్లో మంచు తుపాను మరింత తీవ్రమవనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. A snow storm hinders traffic on one of the main roads in California.#snow #Snowfall #snowstorm #California #USA pic.twitter.com/Jc8nam9SO2 — Anil Kumar Verma (@AnilKumarVerma_) March 3, 2024 పలు ప్రధాన రోడ్లపై మంచు కుప్పులకుప్పలుగా పేరుకుపోవడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఈ రోడ్లపై రాకపోకలు తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తారో స్పష్టత లేకుండా పోయింది. మంచు కారణంగా కరెంటు ఇళ్లు, షాపులకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. స్కై రిసార్టులను మూసివేశారు. ⏰#Breaking:❄🇺🇸 - It has snowed just a little bit in 📌Truckee ⛳️ California: Snow reports of up to 5 feet around downtown with another 8-14 inches to come by Monday. Semi trucks abandoned and buried on I-80 EB east of Truckee. pic.twitter.com/X5XkxqbYdt — SHORT NEWS (@BuonJose11019) March 3, 2024 ఇదీ చదవండి.. పాక్‌లో భారీ వర్షాలు.. 37 మంది మృతి -
సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. మూడోరోజూ కొనసాగుతున్న బంద్
సాక్షి, సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ బంద్ మూడో రోజు కొనసాగుతోంది. పవర్ లూమ్ సాంచాలు మూగబోయాయి. పాలిస్టర్ పరిశ్రమ బంద్‌తో సుమారు 20 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పాలిస్టర్‌కు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం దేశవ్యాప్తంగా సంక్షోభం నెలకొంది. ఇప్పటికే సిరిసిల్ల మిల్లుల్లో రూ. 35 కోట్ల రూపాయల పాలిస్టర్ బట్ట పేరుకు పోయింది. కార్ఖానాల్లోనే ఉత్పత్తి చేసిన బట్ట నిల్వలు ఉండటంతో కొత్త బట్ట ఉత్పత్తి చేయొద్దని సిరిసిల్ల మ్యానుప్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమస్యపై దృష్టి సారించారు. ఆర్వీఎం బట్టల ఉత్పత్తి ఆర్డర్లను మ్యాక్స్, ఎస్ఎస్ఐ యూనిట్లకు అప్పగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు.. ఎయిర్‌పోర్టు మూసివేత
ఇంఫాల్: గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు కనిపించడంతో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతంలలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు గుర్తు తెలియని డ్రోన్లు ఎగురుతుండటం గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. అదే విధంగా ఇంఫాల్‌కు రావాల్సిన విమానాలను సైతం ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శాంతిభద్రతలు అదుపులోకి రాకపోవడంతో మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ప్రభుత్వం మరో అయిదు రోజులు(నవంబర్ 23 వరకు) పొడిగించిన నేపథ్యంలో ఈ సంఘటన వెలుగుచూడటం గమనార్హం. అల్లర్లు, హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 3నుంచి మైతీ, కుకీ తెగల మధ్య చెలరేగిన ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోగా కనీసం 50వేల మంది నిరాశ్రయులయ్యారు.మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించేందుకు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కొండ ప్రాంతాల్లో అత్యధికంగా నివసించే కుకీ వర్గం ప్రజలు దీనిని వ్యతిరేకించారు. నాటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. -
అమెరికాకు తప్పిన షట్‌డౌన్ ముప్పు
వాషింగ్టన్: అమెరికాకు షట్‌డౌన్ ముప్పు తాత్కాలికంగా తప్పింది. వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుని ఆమోదించడానికి ప్రతిపక్ష రిపబ్లికన్లు ససేమిరా అనడంతో బిల్లులు చెల్లించలేక అగ్రరాజ్యం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదరకర పరిస్థితులు వచ్చాయి. అయితే శనివారం రాత్రి చివరి క్షణంలో స్వల్పకాలిక బిల్లుకి రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో ఆమోదించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చివరి క్షణంలో తాత్కాలిక నిధుల విడుదల బిల్లుపై సంతకాలు చేశారు. దీంతో దేశంలో వివిధ పథకాలు, సైనికులు, ప్రభుత్వ జీత భద్రతాలకు మరో 45 రోజులు ఢోకా లేదు. ఈ బిల్లు నుంచి ఉక్రెయిన్‌కు అందించే ఆర్థిక సాయాన్ని మినహాయించారు. అమెరికాలో కొత్త ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30 అర్ధరాత్రి 12 గంటల్లోగా ద్రవ్యవినిమయ బిల్లుల్ని ఆమోదించాల్సి ఉంది. అయితే ప్రతినిధుల సభలో మెజార్టీ కలిగిన రిపబ్లికన్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని ఆమోదించడానికి నిరాకరించారు. ప్రతినిధుల సభ స్పీకర్ మెకార్థీ రిపబ్లికన్ పార్టీకి చెందినవారే అయినప్పటికీ ద్రవ్య బిల్లుల్ని అడ్డుకుంటే ప్రజలకి ఇబ్బందులకు గురవుతారని నచ్చజెప్పడంతో వారు ఒక్క మెట్టు దిగారు. స్పీకర్ ప్రతిపాదించిన స్వల్పకాలిక బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. -
భారత్-కెనడా ఉద్రిక్తతలు: ఆనంద్ మహీంద్ర సంచలన నిర్ణయం
భారతదేశం-కెనడా ఉద్రిక్తతల నేపథ్యంలో ఎంఅండ్ ఎం ఆనంద్ మహీంద్రా అధినేత తీసుకున్న సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. కెనడాలోని మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ, రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఎంఅండ్ఎం గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది. ఇది మార్కెట్ వర్గాల్లోనూ, ఇటు బిజినెస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ నిర్ణయం రూ. 7200 కోట్ల ఆర్థిక సంక్షోభానికి దారితీయడం గమనార్హం. రెస్సన్ ఏరోస్పేస్ కోసం కార్యకలాపాలు నిలిపివేత.. వివరాలను పరిశీలిస్తే భారతదేశం కెనడాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య, కెనడాలోని మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) అనుబంధ సంస్థ 'రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్' స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు పేర్కొంటూ కెనడా కార్పొరేషన్స్‌కు దరఖాస్తు చేసింది. దీనికి సెప్టెంబర్ 20న ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో ఎంఅండ్ఎం స్టాక్‌ను భారీగా ప్రభావితం చేసింది. అంతేకాదు మహీంద్రా కీలక నిర్ణయం ద్వారా బహుళజాతి సంస్థలు, పెట్టుబడుల ప్రభావంతోపాటు విస్తృత ఆర్థిక రంగం మీద దౌత్యపరమైన ఒత్తిళ్లను చెప్పకనే చెప్పింది. (రూపాయి హై జంప్: కారణం ఇదే!) రూ. 7200 కోట్టు ఆవిరి ఈ డిక్లరేషన్ మహీంద్రా & మహీంద్రా షేర్లు 3 శాతం కుప్పకూలాయి. బీఎస్ఈ రూ. 1583.80 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్లో షేర్లు రూ. 1575.75 వద్ద రోజు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇటీవలి నష్టపోయినప్పటికీ కంపెనీ షేర్లు ఈ సంవత్సరం నిఫ్టీపై దాదాపు 26శాతం రాబడిని సాధించాయి. ఒక సంవత్సరం రాబడి 21% మించిపోయింది. తాజా నష్టాల ఫలితంగా రూ. 7200 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ప్రారంభ మార్కెట్ క్యాప్ రూ. 2 లక్షల కోట్ల నుండి, కంపెనీ మార్కెట్ విలువ కనిష్టంగా రూ. 1,95,782.18 కోట్లకు క్షీణించి, మార్కెట్ ముగిసే సమయానికి రూ. 1,96,950.10 కోట్ల వద్ద స్థిరపడింది. రెసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్లో మహీంద్రా & మహీంద్రా వాటా 11.18 శాతం.(క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ. 9 వేల కోట్లు..ఏం చేశాడంటే?) -
లండన్‌లోని ఇండియా క్లబ్ ఎందుకు మూతపడింది? స్వాతంత్య్రోద్యమంతో లింక్ ఏమిటి?
లండన్‌లోని చారిత్రాత్మక ఇండియా క్లబ్‌ను 2023, సెప్టెంబర్ 17న శాశ్వతంగా మూసివేశారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో భారతీయులకు ఈ క్లబ్ విశ్రాంతి స్థలంగా ఉండేది. ఇక్కడి రెస్టారెంట్లో భారతీయ వంటకాలు లభించేవి. బ్రిటన్‌లో భారతదేశంతో సంబంధం కలిగినవారు ఇక్కడ తరచూ కలుసుకునేవారు. పలువురు బ్రిటిష్ వారితో పాటు భారతీయ రాజకీయ నాయకులు ఇక్కడకు తరచూ వచ్చేవారు. గత కొన్నేళ్లుగా ఇండియా క్లబ్ చుట్టూ ఉన్న వాణిజ్య ఆస్తుల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ క్లబ్ లండన్‌లోని స్ట్రాండ్ కాంటినెంటల్ హోటల్లో ఉంది. దీనిని 1951లో ఇండియా లీగ్ ప్రారంభించింది. ఇది ఒక బ్రిటిష్ సంస్థ. ఇది భారత స్వాతంత్ర్యం, స్వరాజ్యానికి మద్దతుగా నిలిచింది. స్వాతంత్య్రానంతరం, ఈ క్లబ్ ఇండో-బ్రిటీష్ స్నేహాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. పీటీఐ నివేదిక ప్రకారం ఆసియా కమ్యూనిటీకి సేవలందిస్తున్న లీగ్ వంటి గ్రూప్‌లకు ఇండియా క్లబ్ అనతికాలంలోనే స్థావరంగా మారింది. క్లబ్ లండన్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్, ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్, ఇండియన్ సోషలిస్ట్ గ్రూప్ ఆఫ్ బ్రిటన్ తమ ఈవెంట్లు, కార్యకలాపాల కోసం ఇండియా క్లబ్‌ను ఉపయోగించుకునేవి. బ్రిటన్‌లోని ఆసియన్ల రోజువారీ జీవితం కష్టతరంగా ఉన్న సమయంలో లండన్ క్లబ్ ఉపఖండంలోని ప్రవాస సంఘాలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. జర్నలిస్ట్ చందన్ థరూర్ ఇండియా క్లబ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఆయన కుమార్తె స్మితా థరూర్ ఇప్పటికీ లండన్‌లోనే ఉంటున్నారు. స్మిత తరచూ తన సోదరుడు శశి థరూర్ (కాంగ్రెస్ ఎంపీ),ఇతర కుటుంబ సభ్యులతో కలిసి లండన్ క్లబ్‌లకు వెళ్లేవారు. లండన్ క్లబ్‌కు వచ్చిన విశిష్ట సందర్శకులలో స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఉన్నారని స్మిత తెలియజేశారు. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్‌లోని ఒక కథనం ప్రకారం క్లబ్‌ను సందర్శించిన వారిలో భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, తొలి బ్రిటీష్ ఇండియన్ ఎంపీ దాదాభాయ్ నౌరోజీ, తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్, కళాకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. ఇండియా క్లబ్ స్థాపనలో దౌత్యవేత్త, మాజీ భారత రక్షణ మంత్రి వీకే కృష్ణ మీనన్ పాత్ర కూడా ఉంది. సెంటర్ ఫర్ మైగ్రేషన్ అండ్ డయాస్పోరా స్టడీస్ వ్యవస్థాపక చైర్ పార్వతి రామన్ మాట్లాడుతూ భారతీయ యువతను ఆదుకునేందుకు, రాజకీయాలను చర్చించడానికి ఇండియా క్లబ్ ఉపయోగపడాలని మీనన్ భావించారన్నారు. మీనన్ తదుపరి కాలంలో యునైటెడ్ కింగ్డమ్కు భారత మొదటి హైకమిషనర్‌గా మారారు. రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం పార్సీ సమాజానికి చెందిన యాద్గార్ మార్కర్.. గోల్డ్‌సాండ్ హోటల్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా 1997 నుండి తన భార్య ఫ్రాంనీ, కుమార్తె ఫిరోజాతో కలిసి లండన్ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. ఆయన లండన్ క్లబ్‌ను కాపాడేందుకు ‘సేవ్ ఇండియా క్లబ్’ పేరుతో పబ్లిక్ అప్పీల్‌ను కూడా ప్రారంభించారు. 2018లో భవనం పాక్షిక కూల్చివేతను నిరోధించడానికి ఈ ఉద్యమం దోహదపడింది. లండన్ క్లబ్ నిర్వాహకులు హోటల్‌ను ఆధునికీకరించాలంటూ భూస్వాముల నుండి నోటీసు అందుకున్నారు. అయితే వెస్ట్‌మినిస్టర్ సిటీ కౌన్సిల్ విస్తరణ ప్రణాళిక దరఖాస్తును తిరస్కరించింది. దీనికి అనుమతి మంజూరు చేయడమంటే ఒక సాంస్కృతిక స్థలాన్ని దెబ్బతీయడమేనని పేర్కొంది. కోవిడ్-19 లాక్డౌన్ యూకేలోని పలు రెస్టారెంట్ల వ్యాపారాలను దెబ్బతీసింది. దీనికితోడు జీవన వ్యయ సంక్షోభం మధ్య అద్దెలు భారీగా పెరిగాయి. ఇటువంటి పరిస్థితిలో ఇండియా క్లబ్‌ను నిర్వహించడం దాని యజమానులకు కష్టతరంగా మారింది. ఇండియా క్లబ్ మేనేజర్ ఫిరోజా మార్కర్ మీడియాతో మాట్లాడుతూ రెస్టారెంట్ తరలించేందుకు సమీపంలోని మరో ప్రదేశం కోసం వెదుకుతున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: పార్లమెంట్ పాత భవనాన్ని ఏం చేయనున్నారు? 10 పాయింట్లలో పూర్తి వివరాలు.. I am sorry to hear that the India Club, London, is to close permanently in September. As the son of one of its founders, I lament the passing of an institution that served so many Indians (and not only Indians) for nearly three-quarters of a century. For many students,… pic.twitter.com/bwyOB1zqIu — Shashi Tharoor (@ShashiTharoor) August 19, 2023 -
యంత్రాలు రీప్లేస్ చేస్తాయి!
‘‘మనందరం ఇప్పుడు ఏకతాటిపై నిలవక΄ోతే కచ్చితంగా మనల్ని యంత్రాలు రీప్లేస్ చేస్తాయి’’ అన్నారు సాగ్–ఆఫ్ట్రా (సీనియర్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్) అధ్యక్షురాలు ఫ్రాన్ డ్రెస్చెర్. కొన్ని వారాలుగా సమ్మె చేస్తున్న డబ్లు్యజీఏ (రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా)కి పూర్తి మద్దతు ప్రకటించారామె. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘నటీనటులు అణచివేతకు గురవుతున్నారు. వారికి తగిన గౌరవం దక్కడంలేదు. చిత్రపరిశ్రమలో ఏం జరుగుతుందనేది అందరికీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో మిగతా అన్ని రంగాల్లోని కార్మికులకు అదే జరుగుతోంది. యజమానులు అత్యాశకు ΄ోతున్నారు. యంత్రాలను నడిపించే సహాయకులను (కార్మికులను ఉద్దేశించి) మర్చి΄ోతున్నారు. వారు చేస్తున్న సేవలను గుర్తించడంలేదు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. సీఈవోలకు ఏకంగా వందల మిలియన్ల డాలర్లలో అధిక వేతనాలు ఇవ్వడంవల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ బాధితులు ఎవరంటే మేమే (కార్మికులు). వ్యా΄ారంలో ఉన్నవాళ్లు మా పట్ల వ్యవహరిస్తున్న తీరు షాకింగ్‌గా ఉంది’’ అని ఘాటుగా స్పందించారు ఫ్రాన్ డ్రెస్చెర్. తగ్గేదే లే... ‘‘ఏఐ వల్ల ముప్పే’’ అంటూ సమ్మెలో భాగంగా నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏఐ న్యూస్ రీడర్స్ వచ్చిన నేపథ్యంలో ఏఐ వల్ల చిత్రపరిశ్రమలోనూ పెను మార్పు సంభవించే అవకాశం ఉందని హాలీవుడ్ కళాకారులు వా΄ోతున్నారు. అయితే ఏఐ వినియోగాన్ని తగ్గించాలన్న కళాకారుల డిమాండ్‌ని నిర్మాణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే నటీనటుల వేతనాలు పెంపుకు కూడా నిర్మాతలు సుముఖత వ్యక్తపరచడంలేదన్నది హాలీవుడ్ టాక్. ఈ నేపథ్యంలో నటీనటులు కూడా తమ డిమాండ్లను ఆమోదించేవరకూ సమ్మె కొనసాగించే తీరాలనీ, తగ్గేదే లే అనే పట్టుదలతో ఉన్నారనీ సమాచారం. -
బడ్ లైట్ వివాదం.. భారీగా ఉద్యోగుల తొలగింపు!
బడ్ లైట్ వివాదానికి ప్రభావితమైన 'గ్లాస్ బాట్లింగ్' (Glass Bottling) కంపెనీ ఎట్టకేలకు తన రెండు ప్లాంట్స్ మూసివేయనుంది. అమ్మకాల పరంగా అస్థిరమైన ఆర్ధిక నష్టాలను చవి చూస్తున్న కారణంగా ఈ ప్లాంట్స్‌లో ఏకంగా 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బాట్లింగ్ కంపెనీ మూసివేయడానికి కారణాన్ని వెల్లడించలేదు. అయితే రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బార్లు, కాంట్రాక్ట్ కంపెనీలు వివాదాస్పద బడ్‌పై దేశవ్యాప్త బహిష్కరణల ఆగ్రహాన్ని అనుభవిస్తున్నందున, బడ్ లైట్ అమ్మకాలను ట్యాంకింగ్ చేయడం వల్ల ప్లాంట్లు మూతపడుతున్నాయని భావిస్తున్నారు. గతంలో వెల్లడైన కొన్ని నివేదికల ప్రకారం, బాట్లింగ్ కంపెనీ ప్లాంట్లలోని కార్మికులు ఉత్పత్తి తగ్గినట్లు, డిమాండ్ తగ్గడం వల్ల లూసియానా అండ్ నార్త్ కరోలినా ప్లాంట్లు తమ మెషీన్లలో కొన్నింటిని ఆఫ్‌లైన్‌లో ఉంచవలసి వచ్చిందని సమాచారం. అయితే కంపెనీ పరిస్థితి రోజు రోజుకి క్షీణించడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చి ఉంటుందనుకుంటున్నారు. కంపెనీ మూసి వేసిన ప్లాంట్లలో బడ్వైజర్ అండ్ బడ్ లైట్ కోసం బాటిళ్లను ఉత్పత్తి చేసేవారు. అయితే బడ్వైజర్ ఇకపై బాటిల్‌ను విక్రయించనందున, వారికి ఇకపై బాట్లింగ్ ఉత్పత్తి అవసరం లేదు. ఇది కూడా కంపెనీ మూసివేతకు ప్రధాన కారణం. ఇది మాత్రమే కాకుండా గత ఏప్రిల్ నెలలో బీర్మేకర్ ఒక బాలిక సెలబ్రేషన్ సమయంలో ప్రత్యేక డబ్బాలను బహుమతిగా ఇచ్చినప్పటి నుంచి బడ్ లైట్ అమ్మకాలు క్షీణించాయి. (ఇదీ చదవండి: ఈ ఒక్క వైన్ బాటిల్ కొనాలంటే రూ. కోట్లు పెట్టాల్సిందే! ప్రత్యేకతేంటంటే?) మార్కెట్ విలువలో ఇప్పటికే బిలియన్ల డాలర్లను కోల్పోయిన బ్రాండ్ కొత్త వేసవి ప్రకటన ప్రచారాన్ని ప్రారంభించింది. బీర్మేకర్ పంపిణీదారులకు సహాయం చేయడానికి చర్యలు తీసుకుంది, దాని మార్కెటింగ్ బడ్జెట్‌ను కూడా పెంచింది. కంపెనీలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీర్ అమ్మకాలు క్రమంగా తగ్గుతుండటం వల్ల బడ్ లైట్ బ్రాండ్‌కు ఎదురుదెబ్బ తగులుతోంది. (ఇదీ చదవండి: హార్లే డేవిడ్సన్ బైక్ ధర ఇంత తక్కువంటే ఎవరైనా కొనేస్తారు - వివరాలు!) 2023 జూన్ 3 వరకు అమ్మకాలు భారీగా తగ్గాయి. గత సంవత్సరం అమ్మకాలతో పోలిస్తే ఈ అమ్మకాలు సుమారు 24.4 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీకి ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్న కారణంగా రెండు కంపెనీ ప్లాంట్స్ మూసివేయవల్సి వచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. -
క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్ మూసివేత
న్యూఢిల్లీ: అస్సెల్ మద్దతు కలిగిన క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్ ‘పిల్లో’ తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. జూలై 31 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. నియంత్రణల పరంగా అనిశ్చితి, కఠిన వ్యాపార పరిస్థితులను ఇందుకు కారణాలుగా పేర్కొంది. సిరీస్ ఏ రౌండ్లో 18 మిలియన్ డాలర్లు (రూ.147 కోట్లు) సమీకరించిన ఎనిమిది నెలలకే ఈ సంస్థ చేతులెత్తేయడం గమనార్హం. ‘పిల్లో యాప్ ద్వారా ఇక మీదట సేవలు అందించకూడదనే నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తున్నందుకు విచారిస్తున్నాం’’అని సంస్థ తన యూజర్లకు సమాచారం ఇచ్చింది. యూజర్ల నిధులపై వడ్డీ రాబడి ఇక్కడి నుంచి ఉండదని, రివార్డుల విభాగాన్ని యాక్సెస్ చేసుకోలేరని తెలిపింది. జూలై 31 వరకు క్రిప్టో విత్‌డ్రాయల్, జూలై 7 వరకు బ్యాంక్ విత్‌డ్రాయల్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. -
‘వెన్న తెచ్చిన తంటా’, ఉద్యోగుల తొలగింపు.. స్టార్టప్ మూసివేత!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టూల్స్ చాట్‌జీపీటీని విడుదలైన రెండు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది వాడటం మొదలుపెట్టారు. దీంతో ఏఐ టెక్నాలజీ ముంచుకొస్తుంది. సమీప భవిష్యత్‌లో కృత్రిమ మేధ ఆధారిత చాట్ జీపీటీ చాట్బోట్లతో భర్తీ చేస్తాయోమోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో ‘మానవాళి మనుగడకు టెక్నాలజీ ముప్పు’ అనే భయం నుంచి కాస్త ఉపశమనం కలిగించే ఘటన జరిగింది. కొన్నేళ్ల క్రితం ఏఐ టెక్నాలజీతో పనిచేసే రోబోట్ ఫిజ్జా డెలివరీ స్టార్టప్ 500 అమెరికన్ డాలర్ల ఫండ్‌ను సేకరించింది. కానీ, ఇప్పుడు ఆ సంస్థ దివాళా తీసింది. అందుకు కారణం ఏఐ ఆధారిత రోబోట్ టెక్నాలజీ కారణమని తెలుస్తోంది. అమెరికన్ టెక్ మీడియా సంస్థ ‘ది ఇన్ఫర్మేషన్’ కథనం మేరకు..కొన్నేళ్ల క్రితం పిజ్జాలను తయారు చేసేందుకు రోబోట్లను ఉపయోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన పిజ్జా తయారీ నిర్వాహకుల మదిలో మెదిలింది. కానీ టెక్నాలజీ పరంగా అనే ఒడిదుడుకులు ఎదురువుతాయనే అంచనాతో అనేక సంస్థలు తమ ఆలోచనల్ని ఆచరణలో పెట్టలేకపోయాయి. అదే సమయంలో 2015లో జుమే (Zume) సంస్థ ఏఐ ఆధారిత రోబోట్‌తో పిజ్జాలను తయారు చేసేందుకు ముందుకు వచ్చింది. నిర్వహణకోసం ఇన్వెస్టర్ల నుంచి కావాల్సిన నిధుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అనూహ్యంగా సాఫ్ట్ బ్యాంక్ కంపెనీతో సహా, పెట్టుబడిదారులు జుమేలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీపడ్డారు. వెరసీ 500 మిలియన్ డాలర్లను సమీకరించింది. మార్కెట్లో కృత్రిమ మేధ ఊహించని పురోగతి సాధించినప్పటికీ పిజ్జాను తయారు చేయడంలో విఫలమైంది. పిజ్జా తయారీ కోసం వెన్నను వినియోగించాలి. అయితే, తయారు చేసిన పిజ్జాను ముక్కలు, ముక్కలుగా చేసుకొని తినే సమయంలో అందులోని వెన్న కరిగిపోకుండా, అలాగే జారిపోకుండా నిరోధించేందుకు అనేక కంపెనీలు విఫలమవుతూ వచ్చాయి. వాటిల్లో జుమే ఒకటి. రోబోట్లతో పిజ్జాలను తయారు చేసే సమయంలో తలెత్తే ఈ సమస్యకు జుమే సైతం పరిష్కారం చూపలేకపోయింది. దీంతో ఇన్వెస్టర్లు ఫండింగ్ ఇవ్వడం ఆపేశారు. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు సగానికిపైగా ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా, సంస్థ దివాళా తీసింది. ఈ తరుణంలో ప్రస్తుత మార్కెట్లో ఏఐపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ సామర్ధ్యం పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి రావాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని, అందుకు షట్ డౌన్ చేసిన జుమే సంస్థేనని చెబుతున్నారు. అప్పటి వరకు మానవాళి మనుగడకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నారు. చదవండి👉 ‘మాకొద్దీ ఉద్యోగం’..టీసీఎస్‌కు షాకిస్తున్న మహిళా ఉద్యోగులు! -
ఉద్యోగులందరూ లేఆఫ్.. రియల్ ఎస్టేట్ యూనిట్ మూసివేత
ఆన్లైన్ మార్ట్గేజ్ సంస్థ బెటర్ డాట్ కామ్ (Better.com) తాజా లేఆఫ్‌లలో భాగంగా తమ రియల్ ఎస్టేట్ యూనిట్‌ను మొత్తానికే ఎత్తేసి అందులోని ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. టెక్లూసివ్ (TECHLUSIVE) నివేదిక ప్రకారం.. బెటర్ డాట్ కామ్ సీఈవో భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్ 2021 డిసెంబర్ నుంచి నుంచి ఇప్పటివరకు యూఎస్, భారత్ దేశాల్లో 4,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. అయితే తాజా రౌండ్ తొలగింపుల ప్రభావం ఎంత మంది ఉద్యోగులపై పడుతుందో స్పష్టత లేదు. బెటర్ డాట్ కామ్ అంతర్గత ఏజెంట్ మోడల్ నుంచి భాగస్వామ్య ఏజెంట్ మోడల్‌కు మారాలని యోచిస్తున్నట్లు నివేదికల ప్రకారం తెలుస్తోంది. 2021 డిసెంబర్ లో జూమ్ కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించినందుకు విశాల్ గార్గ్ విమర్శలు ఎదుర్కొన్నారు. 2022 మే లో ఉద్యోగులు స్వచ్ఛందంగా తప్పుకొనేందుకు అవకాశం ఇవ్వగా దాదాపు 920 మంది రాజీనామాలు చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో అమెజాన్, బెటర్ డాట్ కామ్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ద్వారా అమెజాన్ ఉద్యోగులు తమ కంపెనీ షేర్లను తనఖా కోసం అవసరమైన ప్రారంభ చెల్లింపునకు ఉపయోగించుకోవచ్చు. ఇందు కోసం 'ఈక్విటీ అన్‌లాకర్' అనే ప్రోగ్రామ్‌ను బెటర్ డాట్ కామ్ పరిచయం చేసింది. ఇది అమెజాన్ ఉద్యోగులు తమ వెస్టెడ్ ఈక్విటీని సెక్యూరిటీగా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు డౌన్ పేమెంట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. బెటర్ డాట్ కామ్ తరచూ ప్రకటిస్తున్న లేఆఫ్‌లు మార్ట్గేజ్ రంగంలో ప్రస్తుతం ఉన్న అనిశ్చిత మార్కెట్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇదీ చదవండి: Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ.. -
భారత్‌లో ఐఫోన్ల తయారీ నిలిపివేత..వ్యాపారంలో లాభాలు లేక సతమతం?
భారత్‌లో ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాభాల్ని గడించే విషయంలో విస్ట్రాన్ అసంతృప్తిగా ఉంది. కాబట్టే వచ్చే ఏడాది నాటికి దేశీయంగా మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లలో ఐఫోన్ల తయారీని దశల వారీగా నిలిపి వేయనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ అంశంపై విస్ట్రాన్ యాజమాన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. విస్ట్రాన్ భారత్‌లో అనుకున్నంత స్థాయిలో దీర్ఘకాలిక లాభాల్ని గడించడంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేలా వియాత్నం, మెక్సికో వంటి దేశాల్లో లాభదాయకమైన టెక్నాలజీ తయారీ సంబంధిత ప్రొడక్ట్‌లపై దృష్టి సారించినట్లు సమాచారం. ఐఫోన్‌తో జరిపిన చర్చలు విఫలం ఇక, ఐఫోన్ల తయారీ నిలిపివేతపై విస్ట్రాన్ ఎగ్జిక్యూటీవ్‌లు కీలక వ్యాఖ్యలు చేశారంటూ రిపోర్ట్లు పేర్కొన్నాయి. భారత్‌లో యాపిల్ చేస్తున్న బిజినెస్‌లో ప్రాఫిట్స్ రావడం లేదని, ఎక్కువ లాభాలు వచ్చేలా యాపిల్ సంస్థతో జరిపిన చర్చలు విఫలమైనట్లు హైలెట్ చేశాయి. అయితే అంతర్జాతీయ తయారీ సంస్థలైన ఫాక్స్‌కాన్, పెగాట్రాన్స్ స్థాయిలో విస్ట్రాన్ ఆదాయాన్ని అర్జించడంలో ఇబ్బందులు పడుతుందని సమాచారం. చదవండి👉 ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కూతురు.. ఇది కూడా ఎగతాళేనా? విస్ట్రాన్ భారత్‌లో యాపిల్ కోసం ఐఫోన్ ఎస్ఈలను తయారు చేయడమే కాదు..ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అంటే ఐఫోన్ల తయారీ, స్టోరేజ్ నిర్వహణ, అమ్మకాలు జరుపుతుంది. అయినప్పటికీ ఫ్రాఫిట్స్ పొందే విషయంలో ఇబ్బందులు పడుతుంది. వ్యాపారాన్ని మరింత విస్తరించలేకపోతుంది. వేధిస్తున్న అట్రిషన్ రేటు ఇంకా, కర్ణాటకలోని కోలార్ జిల్లా, అచ్చటనహళ్లి గ్రామ పారిశ్రామక వాడలో ఉన్న విస్ట్రాన్ తయారీ యూనిట్లో ఉద్యోగులు స్థిరంగా ఉండటం లేదు. అధిక వేతనం కోసం ఇతర సంస్థల్లో చేరుతున్న సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉంది. నివేదిక ప్రకారం.. చైనా - భారత్‌ల మధ్య వర్క్ కల్చర్ విషయంలో కంపెనీ అనేక సవాళ్లు విస్ట్రాన్ ఐఫోన్ తయారీ నిలిపివేయడానికి దోహదపడ్డాయి. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించకపోవడంతో అట్రిషన్ రేట్ పెరిగేందుకు దారి తీసింది. ఐఫోన్ 15 తయారు చేయనున్న టాటా! సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా, విస్ట్రాన్ తన ఐఫోన్ల తయారీని టాటా గ్రూప్‌కు విక్రయిస్తోంది. ట్రెండ్ ఫోర్స్ రిపోర్ట్ సైతం టాటా గ్రూప్ భారత్‌లో విడుదల కానున్న ఐఫోన్ 15 మోడళ్లను తయారు చేసేందుకు ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. చివరిగా.. 2008లో పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సర్వర్లతో సహా ఇతర సేవల్ని అందించేలా విస్ట్రాన్ భారతీయ మార్కెట్లో అడుగు పెట్టింది. 2017లో, కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించి యాపిల్ కోసం ఐఫోన్లను తయారు చేయడం ప్రారంభించింది. చదవండి👉‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వైరల్ -
ఊహించని విధంగా వందల కోట్ల నష్టం.. 50 స్క్రీన్లను మూసేస్తున్న పీవీఆర్?
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ల దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో రూ. 333 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 105 కోట్లకుపైగా నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 536 కోట్ల నుంచి రూ. 1,143 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో పీవీఆర్, ఐనాక్స్ విలీనమై పీవీఆర్ ఐనాక్స్‌గా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6 నుంచి విలీనం అమల్లోకి వచ్చింది. వెరసి అంతక్రితం ఏడాది క్యూ4తో తాజా ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ. 1,364 కోట్లను దాటాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం రూ. 336 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 3,751 కోట్లుగా నమోదైంది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. రెండు సంస్థలూ కలిపి గతేడాది 168 కొత్త తెరలను ఆవిష్కరించాయి. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ షేరు బీఎస్ఈలో 1.2 శాతం బలపడిరూ. 1,464 వద్ద ముగిసింది. 50 స్క్రీన్లను మూసేస్తున్న కాగా, మల్టీప్లెక్స్ చైన్ కంపెనీ పీవీఆర్ ఐనాక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన పీవీఆర్ సంస్థ దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
మూత పడనున్న మరో బ్యాంక్? షేర్లు భారీగా పతనం...
అమెరికా సిలికాన్ బ్యాంక్ దివాలా తర్వాత అమెరికాకు చెందిన మరో బ్యాంక్ మూతవేత దిశగా పయనిస్తోంది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ బ్యాంక్‌తోపాటు మరో ఐదు బ్యాంకింగ్ సంస్థలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ డౌన్‌గ్రేడ్ కోసం పరిశీలనలో ఉంచింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు ఆదివారం (మార్చి12న) ఓపెనింగ్‌లో రికార్డు స్థాయిలో 67 శాతం పడిపోయాయి. ఫెడరల్ రిజర్వ్, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కోతో సహా ఒప్పందాల కార్యకలాపాల నిర్వహణ కోసం 70 బిలియన్ డాలర్లకుపైగా అన్ఓపెన్డ్ లిక్విడిటీని కలిగి ఉన్నట్లు బ్యాంక్ ప్రకటించినప్పటికీ షేర్ల పతనం ఆగలేదు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం తర్వాత స్టాక్ మార్కెట్లో పెద్ద బ్యాంకింగ్ సంస్థలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. మూడీస్ పరిశీలనలో ఉంచిన బ్యాంకుల్లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌తో పాటు వెస్ట్రన్ అలయన్స్ బాన్‌కార్ప్, ఇంట్రస్ట్ ఫైనాన్షియల్ కార్ప్, యూఎంబీ ఫైనాన్షియల్ కార్పొరేషన్, జియన్స్ బాన్‌కార్ప్, కొమెరికా ఇంక్ సంస్థలు ఉన్నాయి. బ్యాంకింగ్ సంస్థలు బీమా చేయని నిధుల లిక్విడిటీపై ఆధారపడటం, పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలలో అవాస్తవిక నష్టాలపై క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ ఆందోళన వ్యక్తం చేసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు 61.83 శాతం తగ్గాయి. గత వారంలో ఈ బ్యాంక్ స్టాక్ విలువ 74.25 శాతం పడిపోయింది. ఇంతకుముందు ట్రేడింగ్ రోజున దీని విలువ ఒక్కో షేరుకు 19 డాలర్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనానికి చేరుకునే ముందు ఇలాంటి సంకేతాలకే ఇచ్చాయి. ట్రేడింగ్ నిలిపేసే ముందు ప్యాక్‌వెస్ట్ బ్యాంక్ షేర్లు 82 శాతం క్షీణించాయని, వెస్ట్రన్ అలయన్స్ బాన్‌కార్ప్ సంస్థ షేర్లు సగానికి పైగా పడిపోయాయని వియాన్ అనే సంస్థ నివేదించింది. -
దిగ్గజ బ్యాంక్ మూసివేత.. ప్రపంచ దేశాల్లో కలకలం!
అంతర్జాతీయ సంస్థల నుంచి స్టార్టప్ కంపెనీల్లో కలవరం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు (Silicon Valley Bank)ను ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Federal Deposit Insurance Corporation) మార్చి 10న షట్‌డౌన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో వాషింగ్టన్ మ్యూచువల్ తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా ఇది నమోదైంది. శాంతాక్లారా కేంద్రంగా శాంతాక్లారా కేంద్రంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (svb).. బ్యాకింగ్ కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. బ్యాంక్ డిపాజిట్లు, ఖజానా నిర్వహణ సంస్థలకు ( treasury management) లోన్స్, ఆన్లైన్ బ్యాకింగ్, విదేశీ మారక వాణిజ్యం (foreign exchange trade)తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు సేవలు అందిస్తుంది. ఎస్వీబీ మూసివేతకు కారణం ఎస్వీబీ షట్ డౌన్‌కు కారణంగా తన పేరెంట్ సంస్థ ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ చేసిన నిర్వాకమేనని తెలుస్తోంది. ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ తన పోర్ట్ పోలియాలో 21 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలు,2.25 బిలియన్ల షేర్లను విక్రయించినట్లు ప్రకటన చేసిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.ఎస్వీబీ బ్యాంకు సైతం నికర వడ్డీ ఆదాయం క్షీణించినట్లు నివేదించింది. అతిపెద్ద 16వ బ్యాంక్ ఎస్వీబీ అమెరికాలోనే అతి పెద్ద 16వ బ్యాంక్. కాలిఫోర్నియా, మసాచుసెట్స్లలో 17 బ్రాంచీల నుంచి వినియోగదారులకు సేవలందిస్తుంది. బ్యాంక్‌ను ఎఫ్డీఐసీను షట్‌డౌన్ చేసిందన్న వార్తల నేపథ్యంలో ఎస్వీబీ ఆస్తుల విలువ మంచులా కరిగి 209 బిలియన్ల డాలర్ల నుంచి 175.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. 80 బిలియన్ డాలర్ల నష్టం ఎస్వీబీ ప్రకటన రావడంతో మదుపర్లు బ్యాంకులో చేసిన డిపాజిట్లను వెనక్కి తీసుకున్నారు. కష్టకాలంలో అండగా నిలవాల్సిన వెంచర్ క్యాపిటలిస్టులు బ్యాంకులో ఉన్న పెట్టుబడులను పరిమితం చేసుకోవాలని,డబ్బును ఉపసంహరించుకోవాలని తమ పోర్ట్‌ఫోలియో వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేశాయి. వెరసి ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ షేరు 35 ఏళ్లలోనే అత్యంత దారుణంగా ముగిశాయి. గురువారం ఏకంగా 60శాతం షేర్లు క్షీణించడంతో 80 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. స్టార్టప్‌లకే నష్టం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ టెక్నాలజీ స్టార్టప్‌లకు రుణాలు ఎక్కువ ఇచ్చింది. ఈ పరిణామంతో ఇతర బ్యాంకులపై చూపకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన బ్యాంకులకు ఈ తరహా పరిస్థితులు రాకుండా కావలసినంత నిధులున్నాయని చెబుతున్నారు. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. పాన్, ఆధార్ కార్డ్ ఉన్న వారికి గుడ్ న్యూస్! -
మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు.. మరింత దిగజారుతున్న పాక్ పరిస్థితి..
ఇస్లామాబాద్: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతుండగా.. ఇప్పుడు పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయి. దీంతో వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ముప్పు ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ముడి పదార్థాలు దిగుమతి చేసుకోలేక పలు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే పాకిస్తాన్లో కర్యకలాపాలు నిలివేశాయి. సుజుకీ మోటార్ కార్పోరేషన్ మరికొన్ని రోజుల పాటు కార్యకలాపాలు నిలివేస్తున్నట్లు ప్రకటించింది. టైర్లు, ట్యూబ్‌లు తయారు చేసే ఘంధారా టైర్, రబ్బర్ కంపెనీ తమ ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు చెప్పింది. ముడిసరుకు దిగమతికి ఇబ్బందులు, వాణిజ్య బ్యాంకుల నుంచి కన్‌సైట్‌మెంట్ క్లియరెన్స్ పొందడానికి అడ్డంకులు ఎదురవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ రెండు కంపెనీలు కేవలం ఉదాహరణలే. ఫర్టిలైజర్స్, స్టీల్, టెక్స్ట్టైల్స్ రంగాలకు చెందిన అనేక పరిశ్రమలు పాకిస్థాన్‌లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. పాకిస్తాన్ విదేశీ కరెన్సీ నిల్వలు 3.19 బిలియన్ డాలర్లే ఉండటంతో దిగుమతులకు నిధులు సమకూర్చలేకపోతుంది. నౌకాశ్రయాల్లో వేలాది కంటైనర్ల సరఫరా నిలిచిపోయింది. పరిశ్రమల ఉత్పత్తి ఆగిపోయింది. వేల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. పరిశ్రమలు మూతపడితే నిరుద్యోగం పెరిగి ఆర్థిక వృద్ధిపై మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని పాక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో పరిశ్రమలు మూతపడటం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. సుజుకీతో పాటు హోండా మోటార్, టొయోటా మోటార్ కూడా కొద్దివారాల క్రితమే కార్యకలాపాలు నిలిపివేశాయి. దీంతో పాకిస్తాన్లో కార్ల సేల్స్ జనవరిలో 65శాతం పడిపోయాయి. ఆర్థిక సంక్షోభం వల్ల డిమాండ్ భారీగా తగ్గడమూ దీనికి మరో కారణం. చదవండి: లీటర్ పాలు రూ.250, కేజీ చికెన్ రూ.780.. పాకిస్తాన్ దివాళా తీసిందని ఒప్పుకున్న మంత్రి.. -
ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు...దెబ్బకు ఎయిర్పోర్ట్ క్లోజ్
సాధారణంగా విమానంలో ఏ ప్రయాణికుడి వద్దనైన విమానాశ్రయానికి తీసుకురాని వస్తువులు దొరికితే అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరుగుతుంది. అంతేగానీ ఎయిర్ పోర్ట్‌ని క్లోజ్ చేయరు. కానీ ఇక్కడొక ప్రయాణకుడి లగేజ్ బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు కారణంగా....మొత్తం ఎయిర్‌పోర్ట్‌నే క్లోజ్ చేశారు. వివరాల్లోకెళ్తే...స్కాట్లాండ్లోని విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద ప్యాకేజీ కనిపించింది. దీంతో వందలాదిమంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ డెస్క్ వద్ద క్యూలో నిలబడి ఉన్నారు. దీంతో విమానాల్లో వెళ్లాల్సిన మరికొంతమంది ప్రయాణికులు కార్ పార్కింగ్‌లోనే నిలబడిపోయి ఉండాల్సి వచ్చింది. విమానాశ్రయంలో సిబ్బంది లగేజీలపై దర్యాప్తు చేస్తున్నందున ఆలస్యమవుతుందని ఎయిర్పోర్ట్ అధికారి తెలిపారు. ఐతే ప్రయాణికుడి లగేజీలో అనుమానాస్పద వస్తువు కారణంగానే.. సిబ్బంది అప్రమత్తమైనట్లు తెలిపారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడంతో మరింతమంది ప్రయాణికులు క్యూలో పడిగాపులు పడాల్సి వచ్చింది. మరోవైపు విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణకుల రద్దీ ఎక్కువ అవ్వడంతో తనిఖీలు చేయడం మరింత ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. అందువల్లే తాము ముందు జాగ్రత్తగా టెర్మినల్ భవనాన్ని మూసివేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అంతేగానీ ఎయిర్‌పోర్ట్‌ని మొత్తం ఖాళీ చేయించలేదని చెప్పారు. (చదవండి: కరోనా విషయమై అగ్రరాజ్యం గుట్టు బట్టబయలు..వెలుగులోకి షాకింగ్ నిజాలు) -
వణికిస్తున్న ఆర్ధిక మాంద్యం..మరో బిజినెస్‌ను మూసేసిన స్విగ్గీ
జనాలా చేత డబ్బులు ఖర్చు పెట్టిచ్చే బిజినెస్ చేస్తున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ..రెసిషన్ ముంచుకొస్తోంది. డబ్బులు ఆదా చేసుకోండని సలహా ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసినందుకు గానూ బెజోస్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఎందుకంటే? ఆయన చేసేది కూడా వ్యాపారమే. కానీ వ్యాపార వేత్తలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఆర్ధిక మాంద్యం దెబ్బకు క్లౌడ్ కిచెన్ బ్రాండ్ ది బౌల్ కంపెనీని షట్ డౌన్ చేసింది.ఎందుకంటే? ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా తన మేజర్ బిజినెస్ ఫుడ్ అండ్ గ్రాసరీ విభాగంలో నష్టాలు పెరుగుతున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకంటూ, ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకక తప్పలేదని చెప్పిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. స్విగ్గీ మాత్రం క్లౌడ్ కిచెన్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. ఊహించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేదు.కాబట్టే ఢిల్లీ - ఎన్సీఆర్లలో మాత్రమే ఈ బిజినెస్‌ను క్లోజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక బెంగళూరు, చెన్నై,హైదరాబాద్ వంటి నగరాల్లో ది బౌల్ కంపెనీని పెట్టుబడులు పెట్టడం,అభివృద్ధి చేయడాన్ని కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. బౌల్ కంపెనీతో పాటు, స్విగ్గి బ్రేక్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, హోమ్లీ వంటి బ్రాండ్లను నిర్వహిస్తోంది. ఈ విభాగాల్లో స్విగ్గీ గణనీయమైన లాభాల్ని గడిస్తున్నట్లు తేలింది. గత వారం, కంపెనీలో 33 శాతం వాటాను కలిగి ఉన్న స్విగ్గీ ఇన్వెస్టర్ ‘ప్రోసస్’ 2022 మొదటి 6 నెలల కాలంలో అమ్మకాలు, గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ (జీఎంవీ) పరంగా సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించిందని చెప్పింది. ప్రోసస్ నివేదిక ప్రకారం.. సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఫుడ్ డెలివరీ వ్యాపారం 38 శాతం, జీఎంవీ విలువ 40 శాతం పెరిగింది. క్లౌడ్ కిచెన్ అంటే బ్యాచిలర్లు, కాలేజీ స్టూడెండ్స్, వ్యాపారాలతో తీరికలేని వాళ్లు స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్..లాంటి యాప్స్‌లో ఆర్డర్ పెట్టుకొని నచ్చిన రుచులను ఇంటికే తెప్పించుకుని ఆరగిస్తుంటారు. ఫుడ్ బాగుంటే ప్రతి సారి ఆ హోటల్ నుంచి తెప్పించుకొని తినడమే, లేదంటే వీలైనప్పుడు నేరుగా వెళ్లి తిని వస్తుంటారు. కానీ ఈ క్లౌడ్ కిచెన్ విభాగంలో అలా తినేందుకు వీలుపడదు. పైన మనం చెప్పుకున్నట్లుగా స్విగ్గీ ది బౌల్‌లాంటి క్లౌడ్ కిచెన్ సంస్థలు దేశంలోని ఆయా ప్రాంతాల్లో వంట చేసేలా పెద్ద పెద్ద గ్యాస్ స్టవ్‌లూ, ఫ్రిజ్‌లూ, ఓవెన్లూ, స్టోర్ రూమ్లూ, వంటసామానూ ఇలా అన్నీ అందుబాటులో ఉండేలా ఈ క్లౌడ్ కిచెన్లను అద్దెకు తీసుకుంటాయి. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్‌ను అప్పటికప్పుడు తయారు చేసి పంపిస్తుంటాయి. దీన్నే క్లౌడ్ కిచెన్ అంటారు. ఒక్క ముక్కలో చెప్పలాంటే మీకు కావాల్సిన ఆహార పదార్ధాలన్నీ దొరుకుతాయి. కానీ రెస్టారెంట్ల తరహాలో కూర్చొని తినేందుకు వీలుండదు. చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్‌లో మరో బిజినెస్‌ను మూసేస్తున్న అమెజాన్ -
కొన్ని గంటల్లో ఈ బ్యాంక్ షట్ డౌన్: అంతకుముందే సొమ్ము తీసుకోండి!
సాక్షి,ముంబై: మరి కొన్ని గంటల్లో దేశంలో మరో బ్యాంకు మూతపడనుంది. ఖాతాదారులు తమ డిపాజిట్లను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచిస్తోంది. అదే పూణేకు చెందిన రూపే కో-ఆపరేటివ్ బ్యాంకు. బ్యాంకు మార్గదర్శకాలను పాటించకపోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పూణేలోని రూపే కో ఆపరేటివ్‌బ్యాంకు మూసివేయాలని ఆగస్టులోనే ఆర్బీఐ ఆదేశించింది. సెప్టెంబర్ 22న బ్యాంక్ మూసివేయబడుతుందని కస్టమర్లకు ముందుగానే సమాచారం అందించారు. బ్యాంకు సజావుగా పనిచేయడానికి మూలధనం లేక, లాభదాయకంగా మారడానికి ఎలాంటి నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడంతో ఆర్థిక సంక్షోభంలోపడింది. ఆ తర్వాత ఆర్బీఐ లైసెన్స్‌ను రద్దు చేసింది. అయితే తాజా నిర్ణయంతో గడువు లోపు తమ సొమ్మును తీసుకోకపోతే డిపాజిటర్లు తమ డబ్బును పోగొట్టుకుంటారా? బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం, రూ. 5 లక్షల వరకు ఖాతాదారులకు చెల్లించనున్నారు. అంటే రూ.5 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నవారు తమ డబ్బును తిరిగి పొందుతారు. అయితే, ఐదు లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు అదనపు మొత్తాన్ని వదులుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అలాగే డీఐసీజీసీ బ్యాంకు ఖాతాదారులకు బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. -
భారత్‌కు భారీ షాక్.. దేశం నుంచి వెళ్లిపోతున్న ప్రఖ్యాత కార్ల కంపెనీ!
Ford Ends Production units In India భారతీయులు ఎక్కువ ఇష్టపడే కార్లు జాబితా తీస్తే అందులో తప్పకుండా ఫోర్డ్ కూడా ఉంటుంది. ఈ అమెరికన్ కంపెనీ భారత్ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకుంది. అయితే భారీ నష్టాలు కారణంగా ఈ సంస్థ దేశం నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. గత దశాబ్ద కాలంగా సుమారు 2 బిలియన్ డాలర్ల నష్టాలను చవిచూశామని కంపెనీ వెల్లడించింది. ఫోర్డ్‌కు భారతదేశంలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలోని సనంద్‌లో ఉండగా, మరొకటి తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉంది. సనంద్ ప్లాంట్ నుంచి, ఫోర్డ్ వారి ఫిగో, ఫ్రీస్టైల్, ఆస్పైర్ వంటి చిన్న కార్లను ఉత్పత్తి చేసేది. చెన్నై ప్లాంట్ నుంచి, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, ఎండీవర్‌లను ఉత్పత్తి చేస్తుంది. 9 సెప్టెంబర్ 2021న ఫోర్డ్ కంపెనీ భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగానే సనంద్ ప్లాంట్‌లో ఉత్పత్తిని అక్టోబర్ 2021లో నిలిపివేసింది. కార్లు, ఇంజిన్లు ఎగుమతి ప్రయోజనాల కోసం చెన్నై ప్లాంట్‌ని ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చింది. ప్రస్తుతం చెన్నై యూనిట్‌ని కూడా నిలిపివేయడంతో దేశంలో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసినట్లైంది. ఎకోస్పోర్ట్ ఫోర్డ్‌కు ఆటోమొబైల్ రంగంలో మంచి గుర్తింపును తీసుకొచ్చిందనే చెప్పాలి. దీని తర్వాత మార్కెట్లో ఇతర కార్లకు గట్టి పోటిని కూడా ఇవ్వగలిగింది ఫోర్డ్. అయితే కంపెనీ తీసుకొచ్చిన కొత్త డిజైన్ కార్లు మార్కెట్లో ఆశించినంతగా క్లిక్ కాలేదు. చివరికి, ఫోర్డ్‌కు భారీ నష్టాలు రావడంతో దేశం నుంచి నిష్క్రమించడం తప్ప వేరే మార్గం కనపడలేదు. చదవండి: Reliance Industries: ఇది టీజర్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. రిలయన్స్ వార్నింగ్ -
పాక్‌లో ఇంటర్నెట్ బంద్ హెచ్చరికలు!
ఇస్లామాబాద్: తీవ్ర విద్యుత్ సంక్షోభం నడుమ.. పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ బంద్ హెచ్చరికలు జారీ అయ్యాయి. టెలికామ్ ఆపరేటర్లు మూకుమ్మడిగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని గురువారం అల్టిమేటం జారీ చేశాయి. ఈ మేరకు.. నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు(NIBT) ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గంటల తరబడి కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి. అంతరాయం వారి(టెలికాం ఆపరేటర్ల) కార్యకలాపాలకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి. అందుకే టెలికామ్ ఆపరేటర్లు మొబైల్, ఇంటర్నెట్ సేవలు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు అని ఎన్ఐబీటీ ప్రకటించింది. పాక్ దేశ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో విద్యుత్ కోతలు ఎదుర్కొవడం ఇదే ప్రథమం. ఇక విద్యుత్సంక్షోభం మునుముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రధాని షెహబాబ్ షరీఫ్ ముందస్తు ప్రకటనలు చేయడం గమనార్హం. ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) సరఫరా ఇబ్బందికరంగా మారిందని, అయితే ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. మరోవైపు మునుపెన్నడూ లేని విధంగా జూన్ నెలలో.. నాలుగు ఏళ్ల తర్వాత అధికంగా చమురు ఇంధనాలను పాక్ దిగుమతి చేసుకుంది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సహజవాయువు విషయంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
ప్చ్.. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది
ఇంటర్నెట్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది. దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత ఎక్స్‌ప్లోరర్ సేవల్ని ఆపేస్తోంది మైక్రోసాఫ్ట్ కంపెనీ. జూన్ 15న ఈ యాప్ సేవల్ని పూర్తిగా నిలిపివేయనున్నట్లు సమాచారం. ►ఇంటర్నెట్ వాడకం వచ్చిన కొత్తలో బ్రౌజర్ల సంఖ్య తక్కువగా ఉండేది. ఆ టైంలో.. 1995 ఆగష్టులో విండోస్ 95 ప్యాకేజీ ద్వారా మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు.. దానిని ఫ్రీగా అందించింది. ► తాజాగా.. జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పనిచేయకుండా పోతుంది అని ఒక ప్రకటన వెలువడింది. ► 2003లో ఇంటర్నెట్ బ్రౌజర్లలో 95 శాతం వాడకం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్దే. కానీ.. ► ఆ తర్వాతి కాలంలో ఇతర బ్రౌజర్ల పోటీతత్వం నడుమ ఆ పొజిషన్‌ను కాపాడుకోలేకపోయింది ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. ► బ్రౌజర్ మార్కెట్లో స్మూత్ పర్ఫార్మెన్స్, ఇంటర్నెట్ స్పీడ్ ఇలా రకరకాల కారణాలతో పోటీతత్వంలోనూ ఎక్స్‌ప్లోరర్ వెనుకబడిపోయింది. పైగా వేగంగా అప్డేట్ లేకుండా సాదాసీదా బ్రౌజర్‌గా మిగిలిపోయింది. ► వీటికి తోడు హ్యాకింగ్ ముప్పుతో ఈ బ్రౌజర్‌ను ఉపయోగించేవాళ్లు గణనీయంగా తగ్గిపోయారు. దీంతో.. డెస్క్‌టాప్, ల్యాప్‌ట్యాప్‌లలో జస్ట్ ఒక డీఫాల్ట్ బ్రౌజర్‌గా మిగిలిపోయింది ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్. ► 2016 నుంచి మైక్రోసాప్ట్ కొత్త బ్రౌజర్ ఫీచర్‌ను డెవలప్మెంట్ చేయడం ఆపేసింది. ఈ టెక్ దిగ్గజం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను దశలవారీగా నిలిపివేయాలని నిర్ణయించుకోవడం అదే మొదటిసారి కూడా. ► ఎక్స్‌ఫ్లోరర్ స్థానే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉంటోంది. ఇది ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ కంటే సురక్షితమైన బ్రౌజింగ్ అని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రోగ్రామర్ మేనేజర్ సీన్ లిండర్సే చెప్తున్నారు. ► ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ ‘నైంటీస్, 2000వ’ దశకంలో ఎంతో మంది ఇంటర్నెట్ యూజర్లతో అనుబంధం పెనవేసుకుపోయింది. అందుకే విషయం తెలియగానే.. చాలామంది ఎమోషనల్ అవుతున్నారు. Internet Explorer is shutting down in three days. I haven't used IE in a decades but it was the browser I had used for the majority if my childhood. Whether you loved or hated Internet Explorer, it'll be the end if an era 💛 — Caesár (@CnaVD) June 11, 2022 ProductHunt: After 27 years of service, Microsoft is going to retire Internet Explorer for good on June 15th. pic.twitter.com/EEpvrx34FQ — ProductGram (@ProductGrams) June 12, 2022 -
డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. దుకాణం మూసేసిన ఉదయ్
కరోనా వైరస్ చెలరేగిన సమయంలో ప్రపంచం గజగజ వణికిపోయింది. కానీ ఆ సంక్షోభాన్ని అదనుగా చేసుకుని కొత్త వ్యాపారాలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గిపోయిందనే భావన నెలకొంది. ఫలితంగా కరోనా కష్టాల మీద పుట్టుకొచ్చిన పలు స్టార్టప్‌ల పుట్టి మునిగిపోతుంది. కరోనా కారణంగా లాక్డౌన్లు, కఠిన ఆంక్షల కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా స్కూళ్లు , కాలేజీలు నెలల తరబడి మూతపడ్డాయి. అంతేకాకుండా ప్రభుత్వాలే నేరుగా ఆన్లైన్ క్లాసుల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రతీ ఇంట ఆన్లైన్ క్లాసులు హోరు వినిపించింది. ఇదే సమయంలో ఎడ్టెక్ స్టార్టప్‌లు భారీ ఎత్తున మొదలయ్యాయి. బైజూస్‌తో మొదలైన విజయయాత్ర అప్‌గ్రాడ్, అన్అకాడమీ ఇలా ఉదయ్ వరకు కొనసాగింది. రెండేళ్లలో సీన్ రివర్స్ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగింది. మరోవైపు కొత్తగా వచ్చిన కరోనా వేరియంట్లు పెద్దగా ప్రభావం చూపలేదు. ఫలితంగా జనజీవనం గాడిన పడటం మొదలైంది. ఆన్లైన్ క్లాసుల స్థానే ఎప్పటిలాగే రెగ్యులర్ తరగతులు మొదలయ్యాయి. కేవలం రెండేళ్లలోనే మారిన పరిస్థితుల్లో ఎడ్టెక్ కంపెనీల పునాదులు కదులుతున్నాయి. ఎడ్‌టెక్‌లకు గడ్డుకాలం ఫిజికల్ క్లాసులకే మళ్లీ డిమాండ్ పెరగడంతో ఎడ్టెక్ కంపెనీలు వరుసగా నష్టాలను చవి చూస్తున్నాయి. ఇప్పటికే సగానికి పైగా ఎడ్టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించుకునే పనిని వేగంగా చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా స్టార్టప్‌లకు గడ్డు కాలం నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో స్టార్టప్‌లు 5,600ల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో ఎడ్టెక్ కంపెనీలు 3600ల మందిని తొలగించాయి. వీటి వాటానే 64 శాతంగా ఉంది. అస్తమయం ఉదయ్ స్టార్టప్‌ను ఢిల్లీ ఐఐటీ, స్టాన్ఫోర్డ్ పూర్వ విద్యార్థులు యాదవ్, మహేక్ గార్గ్, కరణ్‌లు 2019 జూన్‌లో ప్రారంభించారు. కరోనా సమయంలో భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తూ జుమ్మంటూ దూసుకుపోయింది. భారీ ఎత్తున పెట్టుడులు ఆకర్షిస్తూ తారాజువ్వలా దూసుకుపోయింది. అయితే ఇటీవల కాలంలో వరుసగా వస్తున్న నష్టాలను భరించలేక ప్రమోటర్లు చేతులెత్తారు. ఉదయ్‌ను పూర్తిగా మూసేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఉదయ్‌లో టీచింగ్‌లో ఉన్న వంద మంది ఉద్యోగుల భవిష్యత్తు డోలాయమానంలో పడింది. చదవండి: Deepika Padukone: రోడ్డున పడుతున్నాం..దీపికా ఇటు చూడవా! -
గూగుల్ అనూహ్య నిర్ణయం..! ఆ సేవలు పూర్తిగా షట్‌డౌన్..!
ప్రముఖ సెర్చ్-ఇంజిన్ దిగ్గజం గూగుల్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. జీ సూట్ (G Suite) యూజర్లకు కోసం రూపొందించిన కరెంట్స్ (Currents)ను మూసివేస్తున్నట్లు గూగుల్ నిర్ధారించింది. ఈ సేవలను మొదటిసారిగా 2019లో గూగుల్ ప్రారంభించింది. 3 ఏళ్ల తరువాత గూగుల్ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆదరణ అంతంతే..! గూగుల్ జీ సూట్ యూజర్లకు కోసం తీసుకొచ్చిన కరెంట్స్కు యూజర్ల నుంచి అత్యంత తక్కువ ఆదరణను నోచుకుంది. దీంతో గూగుల్ చేసేదేమీ లేక ఈ సేవలను పూర్తిగా నిలిపివేసే నిర్ణయం తీసుకుంది. ఇక కరెంట్స్ 2023లో పూర్తిగా మూసివేయబడుతుందని గూగుల్ ధృవీకరించింది. దాంతోపాటుగా కరెంట్స్ వాడుతున్న యూజర్లను గూగుల్ స్పేసెస్‌కు మారేందుకు సహాయాన్ని అందిస్తామని గూగుల్ పేర్కొంది. కరెంట్స్‌లోని అన్ని ఫీచర్స్‌ను గూగుల్ స్పేసెస్‌కు జోడిస్తామని గూగుల్ తెలిపింది. పెద్ద కమ్యూనిటీలు, అధిక సంఖ్యలో ఎక్కువ మంది యూజర్లు వాడడానికి గూగుల్ స్పేసెస్‌ను తీసుకొచ్చింది. గూగుల్ స్పేసెస్‌లో మరిన్ని సౌకర్యాలు..! యూజర్లు తమ ఆలోచనలను చాటింగ్ ద్వారా పంచుకుంటూనే ముఖ్యమైన సమాచారాన్ని ఒక చోటి నుంచి మరో చోటికి బదిలీ చేసేందుకు స్పేసెస్ ఎంతగానో ఉపయోగపడనుంది. జీ-మెయిల్ ఇన్‌బాక్స్ ద్వారా యూజర్లు గూగుల్ ఛాట్ చేయవచ్చు. గూగుల్ డాక్స్‌లో చెక్‌లిస్ట్ ఏర్పాటు చేసుకునేందుకు ఇందులోని స్మార్ట్ కాన్వాస్ ఫీచర్ సాయపడుతుంది. స్మార్ట్ కాన్వాస్ ఫీచర్ సాయంతో యూజర్లు తమ పత్రాలు, వర్క్షీట్లు, స్లైడ్స్‌ను గూగుల్ మీట్ కాల్లో ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. ఇది ఇంతకుముందు పెయిడ్ యూజర్లకే అందుబాటులో ఉండేది. దీనిని ప్రస్తుతం ప్రతి యూజరుకు ఉచితంగా అందిస్తోంది. చదవండి: 111 ఏళ్ల తరువాత రోల్స్ రాయిస్ సంచలన నిర్ణయం..! -
ఇన్వెస్టర్లకు రూ. 66 కోట్లు వెనక్కిచ్చేసిన భారత స్టార్టప్
బిజినెస్ డెస్క్: ఫ్లిప్‌కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరు విభిన్నమైన ఆలోచనతో మొదలుపెట్టిన ఓ స్టార్టప్.. ఆర్నెల్లు తిరగకుండానే మూతపడింది. బెంగళూరు, శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ప్రొటన్.. భారత్‌లో బోణీ మొదలుపెట్టకముందే మూతపడినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాదు ఇన్వెస్టర్లకు డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చేసినట్లు తెలిపారు. అనిల్ గోటేటి, మౌసమ్ భట్లు కిందటి ఏడాది ప్రొటన్ స్టార్టప్‌ను ప్రారంభించారు. 2021 జులైలో అమెరికాలో ఈ స్టార్టప్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. న్యాయవాదులు, గ్రాఫిక్ డిజైనర్లు, పోషకాహార నిపుణులు, ఇలా స్వతంత్ర నిపుణులకు.. తమ వ్యాపారాలను ఆన్లైన్లో ప్రారంభించడానికి, వీడియోలను రూపొందించడానికి, ప్రత్యక్ష సెషన్లను నిర్వహించడానికి, చెల్లింపు లింక్‌లను రూపొందించడానికి, వాళ్ల వ్యాపారాన్ని ట్రాక్ చేయడానికి ఇది తన ప్లాట్‌ఫారమ్‌గా ఉంటుందని ఆరంభంలో ప్రకటించుకుంది పొటాన్. దీంతో 9 మిలియన్ డాలర్ల(సుమారు 66 కోట్ల రూపాయలపైనే) ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అయితే.. కరోనా ఎఫెక్ట్‌తో ఈ స్టార్టప్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆదరణ దక్కకపోవడంతో భారత్‌లో ఇంకా కార్యకలాపాలు మొదలుపెట్టకముందే కార్యకలాపాలను మూసివేసింది. ఉద్యోగులందరినీ రీలీవ్ చేయడంతో పాటు ఇన్వెస్టర్లకు డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చినట్లు ప్రకటించుకుంది. ప్రొటన్‌లో మ్యాట్రిక్స్ పార్ట్నర్స్, 021 క్యాపిటల్, టాంగ్లిన్ వెంచర్ పార్ట్‌నర్స్‌తో పాటు బిన్నీ బన్సాల్, ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణమూర్తి, ఉడాన్ కో-ఫౌండర్ సుజీత్ కుమార్, క్రెడ్ కునాల్ షా సైతం ప్రొటన్‌లో పెట్టుబడులు పెట్టారు. గోటేటి గతంలో ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెడిసెంట్‌గా పని చేసి.. 2020 నవంబర్‌లో కంపెనీని వీడారు. అలాగే భట్ గతంలో ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసి.. ఆపై గూగుల్లోనూ పని చేశారు. ఇదిలా ఉంటే ముంబైకి చెందిన ఇన్సూరెన్స్ స్టార్టప్ బీమాపే కూడా కార్యకలాపాల్ని ప్రారంభించిన ఏడాదిలోపే మూతపడడం విశేషం. ఇక భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా పప్రోద్భలంతో మొదలైన ఏఐ ఛాట్‌బోట్ డెవలపర్ నికీ కూడా కిందటి ఏడాది మూతపడింది. -
ఇకపై పేటీఎం యాప్ సేవలు బంద్! ఎక్కడంటే..!!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం' కెనడా యూజర్లకు భారీ షాకిచ్చింది. కెనడాలో పేటీఎం సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తొలిసారి పేటీఎం 2014లో కెనడాలో సేవలందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అనంతరం 2017లో పేటీఎం మొబైల్ యాప్‌ను లాంఛ్ చేసింది. ఈఫీచర్ సాయంతో బిల్స్, ఇతర ట్రాన్సాక్షన్ల కోసం సౌకర్యంగా ఉండేందుకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పుడు పేటీఎం కెనడాలో సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ మార్కెట్లో పేటీఎం కార్యకలాపాలపై దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. కాగా, కెనడాలో పేటీఎం యాప్ సేవలు నిలిపివేసినా.. ఇండియన్ యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వెల్లడించారు. దురదృష్టవశాత్తూ.. సేవల్ని నిలిపివేయడంపై పేటీఎం తన బ్లాగ్ పోస్ట్‌లో ఇలా పేర్కొంది. కొన్ని సార్లు కఠినమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు ఈ ఏడాది మార్చి14 నాటికి పూర్తిగా సేవల్ని నిలిపివేస్తాం. నేటి నుంచి (జనవరి14) ఈ పేటీఎం కార్యకలాపాలు దశలవారీగా అమల్లోకి వస్తాయని తెలిపింది. చదవండి: మాకు బజాజ్ ఫైనాన్స్ ఒక్కటే బెంచ్‌మార్క్: పేటీఎం సీఈవో విజయ్‌శేఖర్ శర్మ -
భారీగా కేసులు.. వారందరికీ వర్క్ ఫ్రం హోం ఇవ్వండి!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి థర్డ్‌వేవ్ రూపంలో మరోసారి తన పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ప్రమాదకరంగా నమోదవుతున్నాయి. అధిక సంఖ్యలో జనాలు కోవిడ్ బారిన పడుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రంలో వీకెండ్ లాక్డౌన్ అమలు చేస్తోంది. అలాగే ప్రస్తుతం 50శాతం సామర్థ్యంతో నడుస్తున్న బార్లు, రెస్టారెంట్లు సోమవారం మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఒక జోన్లో రోజుకు ఒకే మార్కెట్‌కు అనుమతి ఇచ్చింది. చదవండి: థర్డ్‌వేవ్ ప్రారంభమైంది.. జనవరి చివరి నాటికి.. తాజాగా కరోనా పాజిటివిటీ రేటు 23శాతానికి పెరిగిన నేపథ్యంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవలు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయాలని ఢిల్లీవిపత్తు నిర్వహణ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులందరికీ వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల నుంచి ప్రైవేటు బ్యాంకులు, అత్యవసర సేవలు అందించే కార్యాలయాలు, బీమా కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, లాయర్లు కార్యాలయాలు, కొరియర్ సేవలకు మినహయింపు ఇచ్చింది. ఈ మేరకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీడీఏంఏ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: పాజిటివ్ వ్యక్తుల్లో ధైర్యం నింపేందుకు.. ఢిల్లీ సర్కార్ వినూత్న కార్యక్రమం మరోవైపు ఢిల్లీలో లాక్డౌన్ ఉండబోదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అదే విధఃగా దేశ రాజధానిలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి తగిన ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ఢిల్లీ వ్యాప్తంగా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ‘ఎవరూ ఏం మాట్లాడటం లేదు. పాజిటివిటీ రేటు 25శాతం పెరిగింది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని తెలిపారు. పబ్లిక్‌ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని సూచించారు. ప్రస్తుత సమయంలో తీసుకునే జాగ్రత్తలను బట్టి ఉద్యోగులపై ఎటువంటి ప్రభావం ఉండబోదని, అమలు చేస్తున్న ఆంక్షలన్నింటినీ పరిస్థితులు అదుపులోకి వచ్చాక తీసేస్తామని పేర్కొన్నారు. -
అమెజాన్ సంచలన నిర్ణయం..! ఇక పై ఆ సేవలు బంద్..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత 25 సంవత్సరాలుగా కంపెనీ నిర్వహిస్తోన్న వెబ్సైట్ ర్యాంకింగ్ సర్వీస్ Alexa.comను మూసివేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ సర్వీస్ ద్వారా పలు వెబ్సైట్లకు ఎస్ఈవో (సెర్చ్ ఇంజన్ అప్టిమైజేషన్), అనాలిసిస్ టూల్స్‌ను అమెజాన్ అందిస్తోంది. వచ్చే ఏడాది నుంచి వెబ్సైట్ల స్టాటిస్టిక్స్, వాటి ర్యాంకింగ్‌లను అందించే సర్వీసులను అమెజాన్ నిలిపివేయనుంది. అలెక్సా ఇంటర్నెట్ షట్ డౌన్ అయిన తర్వాత, API సర్వీసెస్‌ను 2022 డిసెంబర్ నుంచి పూర్తిగా మూసివేయనుందని తెలుస్తోంది. సర్వీస్ షట్ డౌన్ అయ్యేలోపు ఆయా వెబ్సైట్ల డేటాను పొందేందుకు వినియోగదారులకు అమెజాన్ వీలును కల్పించనుంది. పలు వెబ్సైట్లకు ర్యాంకింగ్ సేవలను అందించే Alexa.comను మే 2022 మూసివేస్తోందనే కథనాన్ని కంపెనీ వెబ్సైట్లో తొలిసారిగా ప్రముఖ టెక్ బ్లాగ్ బీపింగ్ కంప్యూటర్ గుర్తించింది. అలెక్సా ఇంటర్నెట్ సర్వీసులను డిసెంబరు 8 నుంచి కొత్త సబ్స్క్రిప్షన్లను ఆమోదించడం ఆపివేసింది. కాగా ప్రస్తుతం ఉన్న కస్టమర్లకు సర్వీస్ షట్ డౌన్ అయ్యే వరకు సేవలను అందించనుంది. 1996 నుంచి ప్రస్థానం మొదలు..! ఏప్రిల్ 1996లో అలెక్సా ఇంటర్నెట్ను అమెజాన్ ప్రారంభించింది. అత్యంత ప్రజాదరణ పొందిన మెట్రిక్ ట్రాఫిక్ ర్యాంక్ వెబ్‌సైట్‌గా అలెక్సా. కామ్ నిలిచింది. చదవండి: పరిమితికి మించి సిమ్ కార్డులు తీసుకుంటున్నారా..! అయితే.. -
100 కోట్ల యూజర్లకు షాకిచ్చిన ఫేస్బుక్..ఇకపై..
గత కొంత కాలంగా ఏదో ఓ రూపంలో ఫేస్బుక్ సంస్థ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మంగళవారం ఎఫ్బీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్ జెరోమ్ పెసెంటి తన బ్లాగులో పోస్ట్ చేశారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్ వాడుతున్న సుమారు వంద కోట్ల మంది యూజర్ల ఫేషియల్ డేటాను కూడా డిలీట్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఆప్షన్‌పై ప్రభుత్వం కూడా స్పష్టమైన నిబంధనలను రూపొందించలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. ఇటువంటి టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు కంటే ప్రమాదాలే ఎక్కువని సోషల్‌మీడియాలో పెరుగుతున్న ఆందోళనలు, రెగ్యులేటరీ కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్బీ వెల్లడించింది. కాగా ఫేస్బుక్ వాడుతున్న యూజర్లలో మూడవ వంతు మంది ఈ టెక్నాలజీని వాడుతుండగా, ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలు డిసెంబర్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. ఓ వైపు సరైన అనుమతి లేకుండా వినియోగదారుల బయోమెట్రిక్ డేటాను సేకరించి, నిల్వ చేసిందనే ఆరోపణలు, మరో వైపు వినియోగదారుల భద్రత, దాని ప్లాట్‌ఫారమ్‌లలో అనేక రకాల దుర్వినియోగాలపై చట్టసభలలో దీనిపై తీవ్రమైన ఆరోపణలు పరిశీలనలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చదవండి: ఇకపై జీ మెయిల్ ఓపెన్ చేయాలంటే ఇవి తప్పనిసరి.. అమల్లోకి కొత్త రూల్స్ -
చైనాకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్..!
ప్రముఖ అమెరికన్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ చైనాకు గట్టి షాక్‌ను ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్ఇన్ కెరీర్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా తెచ్చిన చట్టాలను కట్టుబడి ఉండటం సవాలుగా మారడంతో లింక్డ్ ఇన్ సేవలను మూసివేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది. చైనా జర్నలిస్టుల ప్రోఫైళ్లను మైక్రోసాఫ్ట్ బ్లాక్‌చేసింది. దీంతో మైక్రోసాఫ్ట్‌ను అక్కడి ప్రభుత్వం ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. చదవండి: 4 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు...! ఎలాగంటే... లింక్డ్ ఇన్ ప్లేస్‌లో...! లింక్డ్ ఇన్ సేవలను నిలిపివేసినప్పటికీ చైనా మార్కెట్లను వదిలివెళ్లడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధంగా లేనట్లు కన్పిస్తోంది. లింక్డ్ ఇన్ స్థానంలో ఇన్‌జాబ్స్‌ను త్వరలోనే మైక్రోసాఫ్ట్ లాంచ్ చేయనుంది. లింక్డ్ ఇన్‌లో మాదిరిగా ఇన్‌జాబ్స్‌లో యూజర్లు తమ అభిప్రాయాలను పంచుకొలేరు. లింక్డ్ ఇన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మొహక్ ష్రాఫ్ మాట్లాడుతూ.... అమెరికన్ కంపెనీలపై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా పలు కంపెనీలను తమ అధీనంలో ఉంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని వెల్లడించారు. కంపెనీలపై డ్రాగన్ వీపరితబుద్ది..! గత కొద్ది రోజుల నుంచి దిగ్గజ కంపెనీలపై చైనా విరుచుకుపడుతుంది. ఆయా అమెరికన్ కంపెనీలను కట్టడి చేసేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలను చేస్తోంది. చైనా నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన ఆంక్షలను పెడుతుంది. అమెరికన్ కంపెనీలపైనే కాకుండా స్వదేశీ కంపెనీలపై కూడా వీపరితంగా ప్రవర్తిస్తోంది. చదవండి: లీకుల పేరుతో ఉద్యోగులపై ఆపిల్ వేటు -
ముంచుకొస్తున్న సౌర తుఫాన్..! అదే జరిగితే అంధకారమే...!
గతంలో 16 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాను భూమిని తాకే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ సౌర తుఫాను ముప్పు పోయిందని ఆనందించే లోపే మరో సౌర తుఫాను వేగంగా వస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ సౌర తుఫాను అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 12 వరకు భూమిని తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా అంధకారంలోకి వెళ్తోందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు తరచుగా అంతరాయం కూడా కల్గుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: వారెవ్వా ! వైన్‌తో నడిచే కారు.. యువరాజు కారంటే అంతేమరి!! భారీగా ప్రభావం..! సౌర తుఫాను నేపథ్యంలో జీ2 జియోమాగ్నెటిక్ తుఫాను భూమిపై భారీగా ప్రభావం చూపుతోందని నేషనల్ ఓషియానిక్ అండ్ ఆట్మాస్పియర్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ), స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ పేర్కొంది. జియో మాగ్నెటిక్ తుఫానులు ఎక్కువగా కోరనల్ మాస్ ఎజక్షన్ వల్ల ఏర్పడుతాయి. అంటే సూర్యుడి కోరనల్ (ఉపరితలం)పై జరిగే భారీ విస్పోటనాలతో ఈ తుఫానులు ఏర్పడుతాయి. సూర్యుడి నుంచి వచ్చే కోరనల్ మాస్ ఎజక్షన్స్ భూమిని కేవలం 15 నుంచి 18 గంటల్లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సౌర తుఫాన్ భూమిని తాకితే...! రేడియో కమ్యూనికేషన్లు బాగా ప్రభావితమయ్యాయి. జీపీఎస్ ఆధారిత వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఇంటర్నెట్కు విఘాతం కల్గవచ్చును. ఆర్కిటిక్ దృవాల వద్ద ఏర్పడే అరోరా బొరియాలిస్ ఇతర ప్రాంతాల్లో కూడా కన్పిస్తాయి. ముఖ్యంగా న్యూయర్క్ లాంటి ప్రాంతాల్లో అరోరా బోరియాలిస్ కాంతులను చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పవర్గ్రిడ్లలో విద్యుత్ హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. చదవండి: కాసుల కోసం కక్కుర్తి..! వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..! -
భారత్‌లో యాహూ న్యూస్ బంద్
Yahoo News India: వెబ్ సర్వీసుల ప్రొవైడర్ యాహూ.. భారత్‌లో న్యూస్ ఆపరేషన్స్‌ను నిలిపివేసింది. 20 ఏళ్ల సేవలకు నేటితో(ఆగష్టు 26) పుల్‌స్టాప్ పెట్టింది. ఈ మేరకు న్యూస్ ఆధారిత వెబ్సైట్ల కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించిన యాహూ.. మెయిల్ సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. అమెరికాకు చెందిన వెబ్ సేవల కంపెనీ యాహూ.. ఇవాళ్టి నుంచి వార్తా సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. గురువారం నుంచి ఎలాంటి కొత్త కంటెంట్‌ను పబ్లిష్ చేయకపోవడం విశేషం. అయితే ఈ షట్‌డౌన్‌తో మిగతా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఆగష్టు 26 నుంచి యాహూ ఇండియా.. ఎలాంటి కంటెంట్‌ను పబ్లిష్ చేయబోదు. యాహూ అకౌంట్‌తో పాటు మెయిల్, సెర్చ్ అనుభవాలపై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదు. యూజర్లు వాళ్ల అకౌంట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేద’’ని యాహూ ఇండియా హోం పేజీలో ప్రకటించింది. క్లిక్ చేయండి: వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డు.. ఇలా చేయొచ్చు ఇక ఈ ప్రకటనతో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకర్స్‌కు సంబంధించిన కంటెంట్ నిలిచిపోనుంది. ఎఫ్‌డీఐ కొత్త రూల్స్.. విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ స్పష్టం చేసింది. డిజిటల్ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను.. అదీ కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే కొత్త చట్టాలు అనుమతించనున్నాయి. అక్టోబర్ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానుంది. డిజిటల్ కంటెంట్.. ముఖ్యంగా యాహూ క్రికెట్‌పై ఈ నిర్ణయం ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. గత 20 ఏళ్లుగా యాహూ సేవలు ప్రీమియం, లోకల్ కంటెంట్ అందిస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్కి పర్యాయపదంగా యాహూను.. అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్ 2017లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ముట్టుకోకుండానే ఫోన్ పని చేస్తుందిక -
కరోనా బీభత్సం: రేపటి నుంచి సినిమాహాళ్లు బంద్
సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం కోవిడ్ ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు, మాల్స్, బార్స్, సెలూన్లను మూసేయనుంది. ఈ నెల 26 నుంచి ఇది అమల్లోకి వస్తుందని శనివారం ప్రభుత్వం ప్రకటించింది. ఇక రెస్టారెంట్లు, ఇతర కాఫీ షాపుల నుంచి టేక్ అవేలకి మాత్రమే అనుమతి ఉంది. పెళ్లిళ్లకి 50 మంది, అంత్యక్రియలకి 25 మంది మాత్రమే హాజరవాలి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా తమిళనాడుకు రావాలనుకుంటే ఇ–రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూ 10 నుంచి ఉదయం 4 వరకు, ఆదివారం లాక్డౌన్ కొనసాగుతుంది. -
రుజువైతే ..టెస్లా కంపెనీ మూసివేత..!
వాషింగ్టన్: టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ శనివారం సంచలన ప్రకటన చేశారు. టెస్లా కార్లతో గూఢచర్యానికి పాల్పడినట్లు రుజువైతే కంపెనీని మూసివేస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు. టెస్లాకార్లు గూఢచర్యం కోసం ఉపయోగిస్తున్నారనే అనుమానాన్ని చైనా మిలటరీ భావించింది. దీంతో మస్క్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. చైనా ప్రభుత్వం వారి దేశంలో మిలటరీ వాడుతున్న టెస్లా కార్లను పూర్తిగా నిషేధించింది. మస్క్ ‘ఒకవేళ టెస్లా కార్లు చైనాలో కాని, వేరే దేశాల్లో కాని గూఢచర్చానికి పాల్పడినట్లతే టెస్లా కంపెనీ ను మూసివేస్తానని చైనాకు చెందిన ప్రముఖ సంస్థతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో తెలిపారు. ప్రముఖ మీడియా సంస్థల కథనం ప్రకారం... చైనా రక్షణ దళం భద్రత కారణాలరీత్యా, సైనిక సమూదాయాల్లోకి టెస్లా కార్లను రాకుండా నిషేధించిందని తెలిపింది.టెస్లా కార్లకున్న కెమెరాలతో తమ దేశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుందని చైనా రక్షణ దళం భావించిందని పేర్కొన్నారు. అలాస్కాలో చైనా, యూఎస్ దౌత్యవేత్తల మధ్య జరిగిన సమావేశం తరువాత ఈ నిషేధాజ్ఞలు వెలువడ్డాయి. జనవరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇరు దేశాల మధ్య జరిగిన తొలి భేటి. గత ఏడాది చైనాలో టెస్లా 1,47,445 కార్లను కంపెనీ అమ్మగా ప్రస్తుతం ఈ ఏడాది చైనా కంపెనీ నియో నుంచి టెస్లా గట్టి పోటినీ ఎదుర్కొంటుంది. (చదవండి: ఒక్క రోజులోనే మస్క్ సంపద ఎంత పెరిగిందో తెలుసా?) -
మైక్రోసాఫ్ట్ ఎక్స్‌ప్లోరర్ శకం ముగిసినట్టే!
సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు చెందిన ప్రతిష్టాత్మక వెబ్ బ్రౌజర్ "ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్" సేవలు నిలిచిపోనున్నాయి. ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనతను దక్కించుకున్న వెబ్ బ్రౌజర్ ఇక కనుమరుగు కానుంది. వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందని మైక్రోసాఫ్ట్ అధికారికంగా వెల్లడించింది. 2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్ 365, వన్ డ్రైవ్, ఔట్లుక్ వంటివి ఎక్స్‌ప్లోరర్11కు సపోర్టు చేయవని తెలిపింది. దశలవారీగా దీని సేవలను నిలిపివేస్తామని ఈ ఏడాది నవంబర్ 30 తర్వాత నుంచి తమ టీమ్ కూడా అందుబాటులో ఉండదని ఇటీవల వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సేవలు భవిష్యత్తులో దీనిని సపోర్ట్ చేయవని పేర్కొంది. అలాగే మార్చి 9, 2021 తరువాతనుంచి ఎడ్జ్ లెగస్సీ డెస్క్ టాప్ యాప్ కొత్త సెక్యూరిటీ అప్ డేట్స్ పొందలేదని స్పష్టం చేసింది. దీనికి బదులుగా కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉంటుందనితెలిపింది. మైక్రోసాఫ్ట్ ప్రకారం గూగుల్ క్రోమ్ మాదిరిగానే ఉండే కొత్త బ్రౌజర్ వేగంగా, సమర్ధవంతంగా పనిచేస్తుంది. జనవరిలో ఇది లాంచ్ అయినప్పటినుంచి లక్షలాది మంది యూజర్లు తమ బ్రౌజర్లను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌కు అప్‌గ్రేడ్ చేసుకున్నారు. కాగా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 25 ఏళ్ల క్రితం, ఆగస్టు,1995లో విడుదలైంది. 2003లో 95 శాతం యూజర్ వాటాతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్ గా నిలిచింది. అయితే ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ ఈ పోటీలో దూసుకు రావడంతో క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. -
బైక్ లవర్స్ కు షాకింగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా హై-ఎండ్ బైక్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ కీలక నిర్ణయం దిశగా యోచిస్తోంది. కుర్రకారు డ్రీమ్ బైక్ అమ్మకాలు పడిపోవడంతో భారతదేశ కార్యకలాపాలనుంచి నిష్ర్కమించాలని భావిస్తోంది. భవిష్యత్తు డిమాండ్ పై అనిశ్చితి నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుందని తాజా వార్తల ద్వారా తెలుస్తోంది. హర్యానాలోని బావాల్ వద్ద తన ప్లాంట్ ను త్వరలోనే మూసివేయనుంది. ఈ మేరకు ఔట్సోర్సింగ్ ఒప్పందం నిమిత్తం కొంతమంది వాహన తయారీదారులను సంప్రదించినట్లు సమాచారం. గత నెలలో రెండవ త్రైమాసిక ఫలితాల సందర్భంగా హార్లే-డేవిడ్సన్ ఈ సంకేతాలు అందించింది. భవిష్యత్ వ్యూహానికి అనుగుణంగా లాభాలు లేని అంతర్జాతీయ మార్కెట్ల నుండి నిష్క్రమించే ఆలోచనలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. 2009 లో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన అమెరికాకు చెందిన హార్లే-డేవిడ్సన్ 10 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతి బైక్‌లతో దేశీయ కస్టమర్లను, ముఖ్యంగా యువతను ఆకర్షించింది. అంతేకాదు కొత్త బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా కొత్త మోడళ్లను కూడా విడుదల చేసింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో అటు దేశీయంగా ఇటు, అంతర్జాతీయంగా ఆటో మొబైల్ రంగం ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోయింది. విక్రయాలు దాదాపు శూన్యం కావడంతో స్పేర్ పార్ట్స్ ని కూడా విక్రయించుకోలేని స్థితికి దిగజారింది. ఈ నేపథ్యంలోనే హార్లే డేవిడ్సన్ ఇండియాలో గత ఆర్థిక సంవత్సరంలో 2,500 కన్నా తక్కువ యూనిట్లు విక్రయించింది. 2018 లో విక్రయించిన 3,413 యూనిట్లతో పోలిస్తే 2019 లో 22 శాతం తగ్గి 2,676 యూనిట్లకు చేరుకోగా, 2020 ఏప్రిల్- జూన్ మధ్య కేవలం 100 బైక్‌లను మాత్రమే విక్రయించినట్టు కంపెనీ తాజా నివేదికలో తెలిపింది. మార్కెట్ పరంగా తమకు భారత్ అత్యంత చెత్త మార్కెట్ అని పేర్కొంది. అయితే తాజా ఊహాగానాలపై స్పందించేందుకు సంస్థ నిరాకరించింది. హార్లే-డేవిడ్సన్ నిష్క్రమణ అంచనాలు నిజమైతే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుండి భారతదేశంలో కార్యకలాపాలను మూసివేసిన రెండవ వాహన తయారీదారుగా హార్లే-డేవిడ్సన్. 2017 లో జనరల్ మోటార్స్ గుజరాత్ ప్లాంట్ ను విక్రయించిన సంగతి తెలిసిందే. -
31 వరకు విద్యాసంస్థలన్నీ మూతే: యూజీసీ
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటిని ఈ నెల 31 వరకు బంద్ చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యదర్శి రజనీశ్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు ఈ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. యూజీసీ ఆదేశాల నేపథ్యంలో తమ పరిధిలోని అన్ని కాలేజీలు, లైబ్రరీలను ఈ నెల 31 వరకు బంద్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేసింది. -
కీలక నిర్ణయం దిశగా రాయల్ ఎన్ఫీల్డ్
ముంబై: దిగ్గజ ఐకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ కీలక నిర్ణయం తీసుకోనుంది. వ్యాపారాన్ని పుంజుకునేందుకు అనేక చర్యలు చేపట్టబోతుంది. దేశంలోని డజన్‌కుపైగా ప్రాంతీయ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు సంస్థ ఉద్యోగులు తెలిపారు. నష్టాలను పూడ్చుకునేందుకు గుర్గావ్, చెన్నై, బెంగుళూరు, ముంబై, జార్ఖండ్, హైదరాబాద్, భువనేశ్వర్ తదితర రాష్ట్రాలలో ప్రాంతీయ కార్యాలయాలను వేంటనే మూసివేయనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల తొలగింపు ఉండకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్యాలయాల మూసివేతపై పరిపాలన విభాగం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యాలయ మూసివేత నిర్ణయంపై సీసీఓ(చీఫ్ కమర్షియల్ ఆఫీసర్) లలిత్ మాలిక్ దృవీకరించారు. ఆయన విలేకర్ల సమావేశంలో స్పందిస్తు.. కొన్ని ప్రాంతీయ కార్యాలయాలను మూసివేత నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దీని ద్వారా తమ ఉద్యోగులకు ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుతం లాక్‌డౌన్‌ను సడలించడం ద్వారా తమ అమ్మకాలు పుంజుకున్నాయని రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది. దేశంలో సంస్థ డీలర్‌షిప్‌లను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 100కుపైగా నూతన రిటైల్ స్టోర్స్‌ను తెరవబోతున్నట్లు ప్రకటించింది. అత్యాధునిక బైక్‌ల రూపకల్పనలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రత్యేక స్థానం సాధించిన విషయం తెలిసిందే. (చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ : తక్కువ ధరలో) -
‘అట్లాస్’ మళ్లీ వస్తుందా..?
న్యూఢిల్లీ: అట్లాస్ సైకిల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దశాబ్దాలుగా లక్షలాది భారతీయుల కుటుంబాలకు సైకిళ్లను అందించిన ఈ కంపెనీ ఇప్పుడు నిధుల్లేక అల్లాడిపోతోంది. కార్యకలాపాల నిర్వహణకు చిల్లిగవ్వకూడా లేని పరిస్థితి ఏర్పడడంతో దేశ రాజధాని సమీపంలోని సాహిదాబాద్లో ఉన్న చివరి ప్లాంట్‌ను కూడా అట్లాస్ సైకిల్స్ మూసివేసింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం అయిన జూన్ 3నే కంపెనీ ప్లాంట్ మూతపడడం యాదృచ్ఛికం. అయితే, ప్లాంట్ మూసివేత తాత్కాలికమేనని కంపెనీ సీఈవో ఎన్పీ సింగ్ రాణా ప్రకటించారు. తాము అనుకున్నట్టుగా కంపెనీ వద్ద మిగులు భూమిని విక్రయించి రూ.50 కోట్లు సమీకరించగలిగితే.. కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అట్లాస్ సైకిల్స్ సాహిదాబాద్ ప్లాంట్‌లో 431 మంది కార్మికులు పనిచేస్తుండగా.. ఇప్పుడు వారు ఉపాధి కోల్పోయారు. నష్టాల వల్లే..: అట్లాస్ సైకిల్స్‌ను నష్టాలే ముంచేశాయి. 2014 నుంచి ఈ కంపెనీ వ్యాపార కార్యకలాపాలపై నష్టాలను ఎదుర్కొంటోంది. దీంతో 2014 డిసెంబర్లో మలన్పూర్ ప్లాంట్‌కు కంపెనీ తాళాలు వేసేసింది. ముఖ్యంగా గత రెండేళ్ల కాలంలో నష్టాలు మరింత అధికమయ్యాయి. ఫలితంగా 2018 ఫిబ్రవరిలో హరియాణాలోని సోనిపట్ ప్లాంట్‌ను కూడా కంపెనీ మూసేసింది. సోనిపట్ ప్లాంట్ కంపెనీకి మొదటిది. 1951లో దీన్ని జానకిదాస్ కపూర్ ప్రారంభించారు. 1965 నాటికి అట్లాస్ సైకిల్స్ దేశంలోనే అతిపెద్ద సైకిళ్ల తయారీ కంపెనీగా అవతరించింది. విదేశాలకూ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా 40 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచంలోనే ప్రముఖ సైకిళ్ల కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు సంపాదించుకుంది. 1982లో ఏషియన్ గేమ్స్‌కు సైకిళ్లను సరఫరా చేసింది. తిరిగి వస్తాం..: కంపెనీ సీఈవో రాణా మాత్రం ప్లాంట్ మూసివేత తాత్కాలికమేనని స్పష్టం చేశారు. ‘‘ప్లాంట్‌ను మూసివేయలేదు. దీనిపై ఎంతో తప్పుడు సమాచారం నెలకొని ఉంది. ప్లాంట్‌ను తిరిగి ప్రారంభిస్తాం. ఉద్యోగులను కూడా తొలగించలేదు. తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేశామంతే. మిగులు భూమి విక్రయానికి అనుమతించాల్సిందిగా ఎన్సీఎల్టీకి దరఖాస్తు చేసుకున్నాం. అనుమతి వచ్చిన వెంటనే భూ విక్రయాన్ని చేపట్టి, నిధులు అందిన వెంటనే ప్లాంట్‌ను తిరిగి తెరుస్తాం. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ సమస్య లేదు. 70 ఏళ్ల బ్రాండ్ మాది. తిరిగి నిలదొక్కుకుంటాం’’ అని రాణా వివరించారు. -
హైదరాబాద్ ఐటీ కంపెనీల షట్‌డౌన్
-
కరోనా: అవి తప్ప అన్ని మాల్స్ మూత
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19(కరోనా వైరస్) విస్తరణకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని అన్ని మాల్స్‌ను మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రకటించారు. అయితే కిరాణా, ఫార్మసీ కూరగాయల దుకాణాలకు దీన్నుంచి మినహాయింపు వుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, అన్ని మాల్స్ (కిరాణా, ఫార్మసీ, కూరగాయల షాపులు మినహా) మూసివేస్తున్నామని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందితే, అలాంటి పరిస్థితులను ఎదుర్కొంనేందుకు ఆస్పత్రులు సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఎంఆర్ఐ,ఇతర మెషీన్లు, వెంటిలేటర్లు, తగినంత మందులు, వినియోగ వస్తువులు, సిబ్బంది మొదలైనవి అందుబాటులో వుండాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు, ఆయా విభాగాల అధిపతులు, కార్యదర్శులతో సమీక్షించినట్టు కేజ్రీవాల్ వెల్లడించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 10031కి చేరింది. బాధితుల సంఖ్య 244 602కి చేరింది. In view of the prevailing situation, we are closing down all Malls (except grocery, pharmacy and vegtable shops in them) — Arvind Kejriwal (@ArvindKejriwal) March 20, 2020 -
హైదరాబాద్ షట్ డౌన్!
సాక్షి, సిటీబ్యూరో: ‘కోవిడ్’ కలకలంతో గ్రేటర్ నగరం చిగురుటాకులా వణికిపోతోంది. నిత్యం లక్షలాది మంది జన సంచారంతో సందడిగా ఉండే మహానగర రహదారులు కరోనా ఎఫెక్ట్‌తో బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆదివారం ఇంటిల్లిపాది కలిసి వినోదం, విహారానికి వెళ్లే సిటీజనులు ఈ సండే ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న మాల్స్, సినిమాహాళ్లు, హోటళ్లు, బార్లు, పబ్బులు దాదాపు మూతపడ్డాయి. కరోనా నివారణ చర్యలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు పౌరసమాజం చక్కగా సహకరిస్తోంది. ఆదివారం కళకళ లాడే మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు సహా సాధారణ మార్కెట్లు జనం తాకిడిలేక వెలవెలబోయాయి. కోటి జనాభా దాటిన మహానగరంలో ఇప్పుడు కర్ఫ్యూ వాతావరణం నెలకొందంటే అతిశయోక్తి కాదు. నాంపల్లి కోళ్ల మార్కెట్ ఎప్పుడూ సందడిగా కనిపిస్తుంటుంది. కరోనా ఎఫెక్ట్‌తో మార్కెట్లో వ్యాపారం పూర్తిగా స్తంభించింది. ఆదివారం రోజున కూడా మాంసం విక్రయాలు జరగలేదు. ఇక్కడి నుంచి ఇరానీ హోటల్స్‌కు చికెన్ ఎక్కువగాసరఫరా జరుగుతుంటుంది. నాన్ వెజ్ హోటల్స్‌లో వినియోగదారుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో కోడి మాంసం ధరలు అమాంతం తగ్గిపోయాయి. ఇక కరోనా వైరస్ దెబ్బకు జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. బయటి నుంచి కొనుగోలు చేసిన తినుబండారాలు స్వీకరించాలంటేనే భయపడుతున్నారు. గడచిన వారం రోజులుగా మార్కెట్లు, హోటల్స్‌లో గిరాకీ అమాంతం పడిపోయింది. కరోనా వైరస్ ఇతరులు వాడే పదార్థాలు, వస్తువులను తాకడం, తుమ్మినా, దగ్గినా వస్తుండటం మూలంగా ఛాయ్ తాగేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఆదివారం నిలోఫర్ ఆసుపత్రికి సమీపంలో ఉండే ఇరానీ హోటల్స్ అన్నీ ఖాళీగా కన్పించాయి. ఇక నెహ్రూ జూలాజికల్ పార్కును సైతం మూసివేశారు. వన్యప్రాణులకు వ్యాధులు, వైరస్లు సోకకుండా జూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్లీచింగ్ పౌడర్‌తో పాటు బలవర్ధకమైన ఆహరం, మందులను అందిస్తున్నారు. వినోదం వెలవెల.. ఆదివారం సందర్శకులతో కిట కిటలాడే ఐమాక్స్, ఎన్టీఆర్గార్డెన్, లుంబినీపార్క్, జలవిహార్లు మూసివేయడంతో ఆయా ప్రాంతాలు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. వీకెండ్స్‌లో వేల సంఖ్యలో సందర్శకులు ఐమాక్స్, లుంబినీపార్క్, ఎన్టీఆర్గార్డెన్లకు కుటుంబ సమేతంగా వచ్చి సినిమాలు చూస్తూ, పార్కుల్లో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తారు. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా లక్షణాలు నగరంలో వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం సినిమా థియేటర్లు, పార్క్‌లు మూసివేయాలని సూచించిన నేపథ్యంలో ఆదివారం ఐమాక్స్‌తో పాటు పార్కులు మూసివేయడంతో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సందర్శకులు గేట్లు మూసివేయడంతో నిరాశగా వెనుదిరిగి వెళ్లారు. నెక్లెస్ రోడ్డులో జలవిహార్‌ను సైతం నిర్వాహకులు మూసివేశారు. దీంతో నెక్లెస్ రోడ్డు పొడవునా రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇక కోవిడ్ వైరస్ దెబ్బకు సికింద్రాబాద్(లష్కర్) ఖాళీగా కనిపించింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసర పనులపై తప్ప బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. సినిమాహాళ్లు, షాపింగ్‌మాల్స్, విద్యాసంస్థలు మూసివేయడంతో సికింద్రాబాద్‌లోని రహదారులు ఆదివారం ఖాళీగా కనిపించాయి. పాఠశాలల సెలవులతో విద్యార్థులకు నష్టం జరుగుతుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆర్థికభారం మరింత పెరుగుతుందని కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. (భారత్‌లో కోవిడ్ కేసులు 107) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
68 కాలేజీల మూసివేతకు అనుమతివ్వండి
సాక్షి, హైదరాబాద్: అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) లేకుండా నిర్వహిస్తున్న 68 కార్పొరేట్ కాలేజీలను మూసేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. వాటిలో నారాయణ కాలేజీలు 26, శ్రీచైతన్య కాలేజీలు 18 ఉన్నాయని తెలిపింది. ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ వెలువడిన దృష్ట్యా మూసివేత నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇప్పటికే 68 కాలేజీలకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పింది. ఇంటర్ పరీక్షలు అయ్యాక ఈ ఏడాది మార్చి 28 తర్వాత 68 కాలేజీల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కోరింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ అఫిడవిట్ ద్వారా హైకోర్టుకు నివేదించారు. అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్‌కు చెందిన డి.రాజేశ్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఇంటర్ పరీక్షలు అవ్వగానే మార్చి 28 తర్వాత ఎన్ఓసీలు లేకుండా నడుపుతున్న కాలేజీలను మూసివేయాల్సిందేనని ఇంటర్మీడియట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ హామీని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసింది. నారాయణ, శ్రీచైతన్య ఇతర విద్యా సంస్థలు ఎన్ఓసీ లేకుండా ఎన్ని కాలేజీలను నిర్వహిస్తున్నాయో, ఎన్ని కాలేజీలను అధికారులు తనిఖీలు చేశారో, ఆయా కాలేజీల్లో పరిస్థితులెలా ఉన్నాయో పూర్తి వివరాలతో ఏప్రిల్ 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. షోకాజ్ నోటీసుల జారీ అనేది కంటితుడుపు చర్యే అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. కాలేజీలకు నోటీసులు ఇచ్చాం..: ఇంటర్ బోర్డు తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ స్పందిస్తూ.. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకోడానికి వీలుకాదన్నారు. ఆ 68 కాలేజీలు తాత్కాలిక ఎన్వోసీలతో నడుపుతున్నాయని, ఇకపై అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ ఇచ్చే అవకాశాలు కూడా లేవని చెప్పారు. షోకాజ్ నోటీసుకు స్పందించి వివరణ ఇస్తున్నాయని తెలిపారు. ఈ 68 కాలేజీల్లో 29,808 మంది విద్యార్థులున్నారని చెప్పారు. వీరందరి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం (2020–21) నుంచి ఆ కాలేజీలకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ప్రభుత్వమే అన్నీ చేయలేక..: ప్రభుత్వ కాలేజీల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు లేనందున ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇవ్వాల్సి వచ్చిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ హైకోర్టుకు నివేదించారు. గతంలో హైకోర్టు ఆదేశించిన మేరకు ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్వోసీ లేని కాలేజీల్లోని విద్యార్థులు వారు చదివే కాలేజీలకు బదులుగా మరో కాలేజీలో పరీక్షలు రాస్తారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం పూర్తి అవ్వగానే మార్చి 28 తర్వాత నుంచే ఎన్ఓసీలు లేని 68 కాలేజీలను మూసేస్తామని పేర్కొన్నారు. -
కోవిడ్-19 : ఎలక్ట్రానిక్ పరిశ్రమలు మూత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న కోవిడ్-2019 (కరోనా వైరస్) ప్రకంపనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తోంది. చైనాతో సంబంధమున్న పలు వ్యాపారాలు ఇప్పటికే దెబ్బ తినగా, చైనాలో పలు కంపెనీలు మూసివేతల వైపుగా పయనిస్తున్నాయి. తాజాగా భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ మూసివేస్తున్నట్లు ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఆఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ బుధవారం తెలిపారు. చైనాలోని వుహాన్‌లో కోవిడ్ వైరస్ వ్యాప్తి అనేక దేశాలలో వాణిజ్యం, అనేక పరిశ్రమలపై ప్రభావం చూపుతోందని మోహింద్రూ వెల్లడించారు. ముఖ్యంగా ఏవియేషన్ , ఎలక్ట్రానిక్స్ సహా భారతదేశంలో పలు రంగాలలో వైరస్ వ్యాప్తి ప్రభావం ఆందోళన కరంగా ఉందన్నారు. చైనాలోని కొన్ని కర్మాగారాలు తెరిచినప్పటికీ, కార్మికులు విధులకు హాజరవుతారా లదా అనేది ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. భారతీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో చైనా ప్రధాన పాత్ర పోషిస్తుందనీ, విడిభాగాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటుందన్నారు. అలాగే స్మార్ట్‌ఫోన్ బిజినెస్‌లో కూడా విడి భాగాలు చాలా వరకు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయని తెలిపారు. కాగా కోవిడ్-19 శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చైనాలో పరిశ్రమలు తాత్కాలికంగా మూసివేయడంతో ఉత్పత్తులు నిలిచిపోయాయి. ప్రధానంగా చైనా నుంచి దిగుమతి అయ్యే విడి భాగాల సరఫరా నిలిచిపోయింది. దీంతో భారత్‌లోని ఆటో ఉత్పత్తులపై ప్రభావం పడనుందని ఆటో పరిశ్రమ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో భారత్‌లో ఆటో ఉత్పత్తులు 8.3 శాతం మేర పడిపోవచ్చునని ఫిచ్ సొల్యూషన్స్ బుధవారం అంచనా వేసింది. దేశీయ ఉత్పత్తిపై కూడా పడిపోనుందని అభిప్రాయపడింది. చదవండి : ప్రాణాంతక కరోనా పేరు మార్పు కరోనా ప్రమాదం : మన ర్యాంకు ఎంతంటే? -
ఇంటర్నెట్ షట్‌డౌన్‌తో లక్షల కోట్ల నష్టం
న్యూఢిల్లీ : భారత్‌లో ప్రజాందోళనలు చెలరేగినప్పుడల్లా ఇంటర్నెట్ సేవలను రద్దు చేయడం పరిపాటిగా మారిపోయింది. దీనివల్ల వినియోగదారులకు అసౌకర్యం ఏర్పడడమే కాకుండా టెలికామ్ కంపెనీలకు కొన్ని లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ న ష్టం వాటిల్లుతోంది. దేశంలో 2012 నుంచి 2019 వరకు ఏడేళ్ల కాలంలో 374 సార్లు ఇంటర్నెట్ సౌకర్యాలను రద్దు చేశారు. 2012లో ఒక్క జమ్మూ కశ్మీర్లో మాత్రమే నెట్ సేవలను నిలిపివేయగా, ఈ రోజుకు దేశంలోని 14 రాష్ట్రాల్లో వీటి సేవలను నిలిపివేశారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నుంచి ఇంటర్నెట్ను రద్దు చేయగా, జమ్మూ కశ్మీర్లో గత ఆగస్టు ఐదవ తేదీ నుంచి మొబైల్ ఇంటర్నెట్ సదుపాయాలు పనిచేయడం లేదు. ఇదివరకు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తోన్న దేశాల్లో ఇరాక్, సిరియా దేశాలు మొదటి స్థానంలో, పాకిస్థాన్ రెండో స్థానంలో ఉండగా, నేడు భారత్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికమ్ సర్వీసెస్ (పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ పబ్లిక్ సేఫ్టీ)’ చట్టం కింద ప్రభుత్వం తరచూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తోంది. 2015, జూలై నెల నుంచి 2016, జూన్ మధ్య ఇంటర్నెట్ సేవలను దేశంలో నిలిపి వేయడం వల్ల 968 మిలియన్ డాలర్ల రెవెన్యూను, అదే 2012 నుంచి 2017 మధ్య ఐదేళ్ల కాలంలో మూడు బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రెండు లక్షల పదిహేను వేల కోట్ల రూపాయల రెవెన్యూను భారత్ టెలికామ్ కంపెనీలు కోల్పోయాయని ఢిల్లీలోని ‘ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్’ అంచనావేసింది. ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడం పౌరుల ప్రాథమిక హక్కు అని ఐక్యరాజ్య సమతి 2016లో పేర్కొంది. ఈ హక్కును భారత దేశంలో ఒక్క కేరళ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే గుర్తిస్తోంది. 2017లో కేరళ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇంటర్నెట్ సేవలను పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్నట్లు అప్పటి కేరళ ప్రభుత్వం గుర్తించింది. (చదవండి: రావత్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోరా?) -
నేడు సంపూర్ణ సూర్యగ్రహణం
-
రికార్డు సృష్టిస్తున్న భారత్
కశ్మీర్లో కల్లోలం.. ఇంటర్నెట్ కట్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తం.. సమాచారం షట్ డౌన్ సున్నిత అంశాలపై కీలక తీర్పు.. బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవ్ ఏ ఆందోళనకైనా, ఏ నిరసనకైనా అదే తంత్రం, అదే వ్యూహం వాషింగ్టన్: నిన్నటికి నిన్న పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడిగాయి. దేశంలో ముస్లిం మైనార్టీలకు భద్రత ఉండదన్న ఆందోళనతో జనం రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. బిల్లుకి వ్యతిరేకంగా అస్సాంలో అంతకంతకూ ఆందోళనలు అధికమవడంతో పది జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని 24 గంటల సేపు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పుడే కాదు 2018లో భారత్‌లో పలు సందర్భాల్లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. భద్రతా కారణాల రీత్యా సమాచార సంబంధాలను నిలిపివేయడం ఇవాళ, రేపు చాలా దేశాల్లో జరుగుతోంది. ఆందోళనల్ని అణచివేయాలంటే ప్రజలకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేకుండా చేయడమే మార్గమన్న ఉద్దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయి. భారత్‌తో పాటు చైనా, ఇరాన్, ఇథియోపియా దేశాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫ్రీడమ్ హౌస్ సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఇంటర్నెట్, డిజిటల్ మీడియా స్వేచ్ఛపై 65కు పైగా దేశాల్లో ఈ సంస్థ సమగ్ర అధ్యయనాన్నే నిర్వహించింది. ఎప్పుడెప్పుడు ఇంటర్నెట్ షట్డౌన్లు మన దేశంలో మొదటిసారిగా 2010లో గణతంత్ర దినోత్సవాలకు ముందు కశ్మీర్ లోయలో ఇంటర్నెట్, ఫోన్ సేవల్ని నిలిపివేశారు. ►2016లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హన్ వనిని హతం చేసిన తర్వాత కశ్మీర్‌తో బయట ప్రపంచానికి 133 రోజుల పాటు సంబంధాలు తెగిపోయాయి. ►కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ముందు రోజు ఆగస్టు 4 నుంచి కశ్మీర్లో ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిపివేశారు. ఇప్పుడు ఫోన్ సేవలు పునరుద్ధరించారు కానీ, 130 రోజులు గడుస్తున్నా ఇంటర్నెట్ ఇంకా వాడకంలోకి రాలేదు. ►2016లో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లో ప్రత్యేక గోర్ఖాల్యాండ్ ఆందోళన సమయంలో 100 రోజులు ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. ►2015లో గుజరాత్లో విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తూ పటీదార్ ఉద్యమం సందర్భంలోనూ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ►గత నెలలో రామజన్మ భూమి తీర్పుకు ముందు ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ బంద్ అయింది. హోంశాఖకి అధికారాలు భారత్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చిన్నపాటి అనిశ్చితి పరిస్థితులకి కూడా ఇంటర్నెట్ సేవల వినియెగాన్ని నిలిపివేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేరళ హైకోర్టు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అన్నది ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించింది. రోజుల తరబడి ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం చట్టవ్యతిరేకమని సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సొసైటీ సభ్యుడు ప్రణేష్ ప్రకాశ్ అంటున్నారు. -
‘స్కూళ్ల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయం తిరోగమన చర్యేనని, గత ఆరేళ్లలో విద్యారంగాన్ని సర్కార్ నిర్లక్ష్యం చేసిందని రౌండ్ టేబుల్ సమావేశం ఆరోపించింది. బీజేపీ రిటైర్డ్ టీచర్స్, ఎంప్లాయీస్ సెల్ చైర్మన్ బి.మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 12 వేల పాఠశాలల మూసివేతకు చేసిన సిఫార్సులను రద్దు చేయాలని భేటీలో పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ నిలిపేయాలని, బడ్జెట్లో విద్యకు 15 శాతం నిధులు విడుదల చేయాలని వారు కోరారు. ఐదున్నర ఏళ్లలో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 8 వేల పోస్టులనే భర్తీ చేశారన్నారు. 20 దేశాలు వ్యతిరేకించిన సీసీఐ విధానాన్ని మన రాష్ట్రం కూడా నిలిపేయాలని పేర్కొన్నారు -
రెండు యూనిట్లు మూత: సైంటిస్టులపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : వరుస నష్టాలు లేదా ఖర్చులు తగ్గించుకునే క్రమంలో కార్పొరేట్ దిగ్గజాలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి తాత్కాలిక ఉద్యోగులను తొలగించగా, ఫార్మ దిగ్గజం సన్‌ఫార్మ కూడా బాటలో ఇదే పయనిస్తోంది. రెండు యూనిట్లను మూసి వేయడంతో ఇక్కడ పనిచేస్తున్న సైంటిస్టులను పెద్ద సంఖ్యలో తొలగించింది. క్లినికల్ ఫార్మకాలజీ విభాగంలో పనిచేస్తున్న 85 మందికి ఉద్వాసన పలికింది. వడోదర ఆర్ అండ్ డి యూనిట్లలో పనిచేస్తున్న వీరిని ముందస్తు సమాచారం లేకుండానే వేటు వేసింది. ఇది ఉద్యోగుల్లో ఆందోళనకు దారి తీసింది. వడోదరలోని తాండల్జా, అకోటాలోని తమ రెండు కేంద్రాల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వాటిని బయో-ఈక్వెలెన్స్ స్టడీస్‌కు ఉపయోగించినట్టు చెప్పింది. అయితే, ఈ యూనిట్లలో తమ కార్యకలాపాలను నిలిపివేసి, ఇతర సౌకర్యాలకు మార్చామని సన్ ఫార్మాస్యూటికల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ఆర్ అండ్ డి కార్యకలాపాలలో పెట్టుబడులు కొనసాగిస్తామని పేర్కొంది. బయో-ఈక్వెలెన్స్ స్టడీస్ నిర్వహించే క్లినికల్ ఫార్మకాలజీ యూనిట్ల (సీపీయూ) సరైన వినియోగాన్ని నిర్ధారించడానికి వడోదరలోని తాండల్జా, అకోటాలోని రెండు కేంద్రాలలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని సన్‌ఫార్మ ప్రతినిధి చెప్పారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల జీతం ఇచ్చి వెళ్లిపోవాలని చెప్పింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో ఉద్యోగులను నియంత్రించేందుకు బౌన్సర్లను వినియోగించారన్న వార్తలు సోషల్ మీడియాలోగుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను సన్‌ఫార్మ ఖండించింది. బాధిత ఉద్యోగులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. అవుట్‌ప్లేస్‌మెంట్ కోసం సహాయం చేస్తున్నామని ప్రకటించింది. నిబంధనలకనుగుణంగానే వ్యవహరిస్తున్నామనీ రెగ్యులేటరీ అధికారులకు పూర్తి సమాచారాన్ని అందిస్తున్నామనికూడా కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. -
ఫొని షాక్ : కోల్‌కతా విమానాశ్రయం మూసివేత
కోల్‌కతా : ఫొని తుపాన్ పలు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపుతోంది. ఒడిషా తీరాన్ని తాకిన ఫొని తుపాన్ ప్రచండ వేగంతో కదులుతుండగా కొల్కతా విమానాశ్రయాన్ని శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం ఉదయం వరకూ మూసివేయాలని పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదేశించింది. కోల్‌కతా విమానాశ్రయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ విమానాల రాకపోకలు నిలిపివేసినట్టు డీజీసీఏ పేర్కొంది. ఫొని తుపాన్ పురోగతిని పరిశీలించి కోల్‌కతా విమానాశ్రయంలో విమాన రాకపోకల నిలిపివేత సమయాన్ని సవరించామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు విమానాల రద్దుపై ఎలాంటి సమాచారం రాకపోవడంతో కోల్‌కతా విమానాశ్రయంలో పెద్దసంఖ్యలో ప్రయాణీకులు నిలిచిపోవడంతో గందరగోళం నెలకొంది. -
పడకేసిన ‘జెట్’
నాలుగైదు నెలలుగా ఆకాశయానంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎలాగోలా నెట్టుకొస్తున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ చివరకు తన ప్రయాణాన్ని ముగించింది. అమృత్సర్–న్యూఢిల్లీ మధ్య బుధవారం రాత్రి నడిపిన విమానంతో ఆ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయి. నిధుల కొరతతో నీరసపడిన సంస్థను ఆదుకునేందుకు రూ. 400 కోట్ల మేర అత్యవవసర నిధుల్ని అందించాలన్న బోర్డు ప్రతిపాదనకు బ్యాంకులు ససేమిరా అనడంతో అది పడకేసింది. సంస్థను విక్రయించే ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో, దానికి మున్ముందు ఎదురయ్యే అడ్డంకులేమిటో ఇప్పుడే ఎవరూ చెప్పే స్థితి లేదు. విమానయాన రంగంలో ఇంతవరకూ మూతబడిన సంస్థల్లో ఏ ఒక్కటీ తెరుచుకున్న దాఖలా లేదు గనుక జెట్ ఎయిర్వేస్ కూడా ఆ దోవనే చరిత్రలో కలిసిపోతుందా అని కొందరు ఆందోళనపడుతున్నారు. (చదవండి : ‘జెట్ రూట్లలో ఎయిర్ఇండియా సర్వీసులు’) దేశంలో ఆర్థిక సంస్కరణలు మొగ్గతొడిగి, ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేస్తున్న తొలిరోజుల్లో అవకాశాలను ఒడిసిపట్టుకుని జెట్ ఎయిర్వేస్ పేర సొంత విమానయాన సంస్థతో ఈ రంగంలోకి అడుగుపెట్టిన నరేష్ గోయల్ 2012 నాటికి దాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ప్రయాణీకుల వాటాలో అగ్ర తాంబూలం అందుకున్నారు. ఆ తర్వాతే కష్టాలు మొదలయ్యాయి. ఏళ్లు గడుస్తున్నకొద్దీ అవి పెరుగుతూపోయాయి. వరస సంక్షోభాలు వెంటతరుముతుంటే చివరకు రూ. 8,500 కోట్ల అప్పుల్ని ఎలా తీర్చాలో దిక్కుతోచని స్థితికి ఆ సంస్థ చేరుకుంది. ఒకప్పుడు 124 విమానాలతో రోజుకు 600 సర్వీసులు నడిపిన ఆ సంస్థ గత కొన్ని వారాలుగా అయిదారు విమానాలతో, దాదాపు 40 సర్వీసులతో నెట్టుకొస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా అవి కూడా నిలిచిపోవడంతో ప్రయాణీకులకు వేలాదికోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రపంచ దేశాల్లోని విమానయాన సంస్థలు అనేకం లాభాల దారిలో దూసుకుపోతుంటే మన సంస్థలే ఇలా కళ్లు తేలేయడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత అయిదేళ్లలో దేశంలోని పెద్దా చిన్నా ప్రైవేటు విమానయాన సంస్థలు ఆరు మూతబడగా, ఇది ఏడోది. 2012లో మూతబడిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ తర్వాత జెట్ ఎయిర్వేస్ సంస్థే పెద్దది. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాను కేంద్రం ఎప్పటికప్పుడు ఆదుకుంటూ దాన్ని నిలబెడుతోంది. ఒకపక్క దేశంలో 2016–18 మధ్య ఉద్యోగావకాశాలు క్షీణించడంతోపాటు 50 లక్షలమంది ఉద్యోగాలు గల్లంతయ్యాయని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ నివేదిక వెలువరించినరోజే 23,000మందికి ప్రత్యక్షంగా, మరిన్ని వేలమందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఒక పెద్ద విమానయాన సంస్థ మూతబడటం ఆందోళన కలిగించే అంశం. ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక మన దేశంలో విమానయాన రంగానికి ప్రాముఖ్యత పెరిగింది. అది దేశాభివృద్ధికి దోహదపడే మౌలిక సదుపాయ రంగంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కనుకనే ఈ రంగం వెలుగులీనుతుందని అందరూ జోస్యం చెప్పారు. ఇప్పటికీ అందరూ ఆ మాటే అంటున్నారు. ఆర్నెల్లక్రితం అంతర్జాతీయ విమానయాన సంఘం(ఐఏటీఏ) ఏకరువుపెట్టిన గణాంకాలు కూడా ఆశావహంగా ఉన్నాయి. దాని ప్రకారం రాగల ఇరవైయ్యేళ్లలో ప్రపంచ విమానయానంలో చైనా, అమెరికాల తర్వాత భారత్‌ది మూడో స్థానం. 2037నాటికల్లా భారత విమానయాన ప్రయాణికుల సంఖ్య 57.2 కోట్లకు చేరుకుంటుందని దాని అంచనా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లమంది ప్రయాణికులుండగా అది 2037నాటికి రెట్టింపవుతుందని తెలిపింది. నెలవారీ గణాంకాలు చూసినా పరిస్థితి బాగానే ఉంది. మొన్న జనవరిలో దేశీయ ప్రయాణికుల సంఖ్య కోటీ 25 లక్షల పైమాటేనని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ప్రకటించింది. వీటిని గమనిస్తే విమానయానం నానాటికీ వృద్ధి చెందుతుందన్న భావం కలుగుతుంది. ప్రయాణికుల సంఖ్య మాత్రమే కాదు...సరుకు రవాణాలోనూ వృద్ధి రేటు బాగానే ఉంది. ఇన్ని అనుకూలతలనూ మూలకు నెట్టి విమానయాన సంస్థలను కుంగదీస్తున్న సమస్యలెన్నో ఉన్నాయి. దేశీయ విమానయాన సర్వీసులకు వినియోగిస్తున్న ఇంధనంపై పన్నుల బాదుడు, వేరే సంస్థలతో పోటీపడి చార్జీలు తగ్గించాల్సి రావడం, విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల లేమితో డిమాండ్‌కు తగినట్టుగా అదనపు విమానాలను ప్రవేశపెట్టలేకపోవడం వగైరా కారణాలు ప్రస్తుత స్థితికి దోహదపడ్డాయని చెబుతున్నారు. దానికితోడు 2007లో రూ. 1,450 కోట్లు వెచ్చించి కొన్న ఎయిర్ సహారాతో అదనపు భారం పడిందంటున్నారు. విమాన ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని విమానయాన సంస్థల డిమాండ్‌పై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం కూడా ప్రస్తుత స్థితికి కారణం. ఒక విమానయాన సంస్థ మూతబడిందంటే దాని ప్రకంపనలు సాధారణంగా ఉండవు. సంస్థ సిబ్బంది రోడ్డునపడటంతోపాటు విమానాశ్రయాల నిర్వాహకులకూ, ఇంధన సరఫరాదారులకూ ఒక పెద్ద ఖాతాదారు నుంచి వచ్చే నికరాదాయం ఆగిపోతుంది. రంగం నుంచి ఒక విమానయాన సంస్థ తప్పుకున్నప్పుడు తగినంతగా సర్వీసుల లభ్యత లేక ప్రయాణికులకు ఇబ్బందు లెదురవుతాయి. సహజంగానే ఇతర సంస్థలు టికెట్ చార్జీలు పెంచుతాయి. ఇదంతా మన విమాన యాన రంగం ప్రతిష్టను మసకబారుస్తాయి. విషాదమేమంటే ఈ ఏడాది మొదట్లో నరేష్ గోయ ల్ను పక్కనబెట్టి యాజమాన్య బాధ్యతలు స్వీకరించిన బ్యాంకులు, ఇతర మదుపుదార్లు కనీసం వాటాల విక్రయ ప్రక్రియ పూర్తయ్యేవరకైనా దాన్ని ఏదోవిధంగా నడపాలనుకోలేదు. అప్పులు మినహా విమానాలుగానీ... పైలట్లుగానీ... నిపుణులైన ఇంజనీర్లుగానీ...సిబ్బందిగానీ లేని సంస్థను కొనుగోలుదార్లు ఏం చూసి సొంతం చేసుకుంటారని బ్యాంకులు అనుకున్నాయో అనూహ్యం. ఈ రంగంలోని సంస్థల నిర్వహణపై ఒక కన్నేసి ఉంచి సకాలంలో హెచ్చరించడం, అధిక పన్నుల భారాన్ని తగ్గించడంతోసహా అవసరమైన చర్యలు తీసుకోవడంపై పాలకులు దృష్టి పెట్టాలి. -
జెట్ రూట్లపై కన్నేసిన ఎయిర్ ఇండియా
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో జెట్ ఎయిర్వేస్ విమాన సేవలు నిలిచిపోయిన కొన్ని రూట్లను టేకోవర్ చేసేందుకు ఎయిర్ ఇండియా సంసిద్ధమైంది. గతంలో జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు నడిచిన కొన్ని రూట్లలో తన బోయింగ్-777 విమానాలను నడిపేందుకు ఎయిర్ ఇండియా ముందుకొచ్చింది. మరోవైపు జెట్ ఎయిర్వేస్ సీఈవో కోరిన రూ 400 కోట్ల తక్షణ నిధులను చెల్లించేందుకు బ్యాంకర్లు నిరాకరించడంతో సంస్థ షట్డౌన్కు చేరువైన సంగతి తెలిసిందే. కాగా జెట్ ఎయిర్వేస్ రూట్లలో తమ విమాన సేవలను అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎయిర్ ఇండియా సీఎండీ అశ్వని లోహని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌కు లేఖ రాశారు. జెట్ ఎయిర్వేస్ తాత్కాలికంగా మూతపడటంతో ఆయా రూట్లలో ప్రయాణీకుల అసౌకర్యాన్ని నివారించేందుకు తాము ఈ ప్రతిపాదన చేశామని లేఖలో పేర్కొన్నారు. కాగా ఎయిర్ ఇండియా ప్రతిపాదనపై ఎస్బీఐ ఇంకా స్పందించలేదు. -
ఇండియాలో మూతపడ్డ 12 ఎయిర్‌లైన్ కంపెనీలు
-
జెట్ ఎయిర్వేస్ కథ ముగిసింది!
సాక్షి, ముంబై : తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ తన సర్వీసులు నిలిపివేయడానికి సిద్ధమైంది. బుధవారం( ఏప్రిల్ 17) రాత్రి నుంచే తమ సేవలను పూర్తిగా నిలిపివేయనుంది. రాత్రి 10:30కు అమృత్సర్ నుంచి ముంబై వెళ్లే ఫ్లైట్.. జెట్ ఎయిర్వేస్కు చివరి విమాన సర్వీస్ కానుంది. మంగళవారం నాటి జెట్ ఎయిర్వేస్ బోర్డు సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. అదనపు నిధులకు సంబంధించి జెట్ ఎయిర్వేస్ విన్నపాన్ని బ్యాంకులు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక జెట్‌ఎయిర్‌వేస్ మూసివేత నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ అత్యవసరంగా రూ.400 కోట్లు ఇవ్వాలని ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియంను కోరిన విషయం తెలిసిందే. రూ. 3500 కోట్ల రుణ భారానికి తోడు, టికెట్ల కాన్సిలేషన్ ద్వారా ప్రయాణికులకు చెల్లించాల్సిన చార్జీల విలువ రూ.3500 కోట్లకు చేరింది. దీంతో జెట్ ఎయిర్వేస్ అప్పుల భారం మొత్తం రూ. 8500 కోట్లకు ఎగబాకింది. ఈ తీవ్ర సంక్షోభంతో గత మూడు నెలలుగా ఉద్యోగులకు జెట్ ఎయిర్వేస్ జీతాలు చెల్లించలేదు. ఇప్పటికే వారు నిరసన వ్యక్తం చేశారు. జెట్ ఎయిర్వేస్ అంశంలో జోక్యం చేసుకుని, సంస్థను కష్టాల నుంచి గట్టెక్కించాలని పైలెట్ల యూనియన్ ప్రధాని మోదీని కూడా అభ్యర్థించాయి. జెట్‌ఎయిర్‌వేస్ తాజా నిర్ణయంతో 16వేలమంది ఉద్యోగుల భవిష్యత్తు అంధకారమైంది. ఆల్ఇండియా జెట్ ఎయిర్వేస్ సిబ్బంది ఏప్రిల్ 18న మేనేజ్మెంట్తో సమావేశం అవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
సంక్షోభంలో జెట్ ఎయిర్వేస్
-
జెట్ ఎయిర్వేస్ మూతపడనుందా?
సాక్షి, ముంబై : జెట్ ఎయిర్వేస్ సంక్షోభానికి ఇంకా తెర పడలేదు. నిధుల లేమితో పాతాళానికి పడిపోయిన జెట్ ఎయిర్వేస్ కార్యకాలాపాలు మూడ పడనున్నాయని తెలుస్తోంది. మంగళవారం నాటి జెట్ ఎయిర్వేస్ బోర్డు సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. ముంబైలో కొనసాగుతున్న బోర్డు సమావేశంలో ఆర్థిక సహాయం అందని కారణంగా జెట్ఎయిర్వేస్ను మూసివేతకు బోర్డు ప్రతిపాదించిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మార్కెట్లో ఇన్వెస్టర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో జెట్ ఎయిర్వేస్ షేర్ 18శాతం కుప్పకూలింది. మధ్యంతర నిధులను సమకూర్చేందుకు బ్యాంకుల మధ్య అంగీకారం కుదరలేదని ఈ రోజు సమావేశమైన జెట్ ఎయిర్వేస్ బోర్డు తెలిపింది. అలాగే సంస్థను గట్టెక్కించే నాధుడు ఇంకా వెలుగులోకి రాలేదు. జెట్ ఎయిర్వేస్ వాటాల కొనుగోలుకు దాఖలు చేయాల్సిన గడువును మరోసారి పొడిగించింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు బిడ్డర్లు తమ బిడ్స్ సమర్పించుకోవచ్చని కంపెనీ తాజాగా వెల్లడించింది. అలాగే సంస్థ మాజీ ఫౌండర నరేష్ గోయల్ కొనుగోలు రేస్ నుంచి తప్పుకున్నారు. ఈ తాజా పరిణామాలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఇది ఇలా వుంటే సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఈ పరిణామాలను పరిశీలిస్తోందని కేంద్రమంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. మరోవైపు అంతర్జాతీయ సర్వీసులన్నింటిని సోమవారం దాగా రద్దు చేసుకున్న సంస్థ మరోసారి ఈ గడువును పొడిగించింది. ఏప్రిల్ 18వరకు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ తాజాగా ప్రకటించింది. అంతేకాదు ఏప్రిల్ 18 వరకు జెట్ ఎయిర్వేస్కు ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఐవోసీ తెలిపింది. కాగా రూ. 3500 కోట్ల రుణ భారానికి తోడు, టికెట్ల కాన్సిలేషన్ ద్వారా ప్రయాణికులకు చెల్లించాల్సిన చార్జీల విలువ రూ.3500 కోట్లకు చేరింది. దీంతో జెట్ ఎయిర్వేస్ అప్పుల భారం మొత్తం రూ. 8500 కోట్లకు ఎగబాకింది. జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం 7 విమానాలను నడుపుతోంది. ఈ వార్తలు నిజమైతే 16వేలమంది ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడిపోనుంది. Directed Secretary @MoCA_GoI to review issues related to Jet Airways, especially increasing fares, flight cancellations etc. Asked him to take necessary steps to protect passenger rights and safety; and to work with all stakeholders for their well being. — Chowkidar Suresh Prabhu (@sureshpprabhu) April 16, 2019 -
నేడు టింబర్ డిపోల బంద్
హైదరాబాద్: తెలంగాణ అటవీ శాఖ విధించిన నూతన ఆంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని సామిల్స్, టింబర్ డిపోలను ఈ నెల 11, 12, 13 తేదీల్లో సామూహికంగా బంద్ చేస్తున్నట్లు ది తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ టింబర్ మర్చంట్స్, సామిల్లర్స్, అలైడ్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఆదివారం సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన టింబర్ మర్చంట్స్ అసోసియేషన్ ముఖ్య ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ టింబర్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.గోపీకృష్ణ మాట్లాడుతూ.. జీవో 55ను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 55 తమకు తీవ్ర ఇబ్బందిగా పరిణమించిందని అన్నారు. వాల్టాపై ఆన్లైన్ అనుమతిని ఎత్తివేయాలని, ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నట్లుగా వేప, తుమ్మ, మామిడి చెట్లకు రూ. 450కి బదులుగా రూ. 50 చొప్పున అమలు చేయాలని కోరారు. రైతు పట్టా భూమిలో టేకుచెట్ల కొనుగోలుకు రవాణా అనుమతిని వారం రోజుల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు వాసుదేవరావు, విజయ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
షట్డౌన్కు తాత్కాలిక బ్రేక్
వాషింగ్టన్: అమెరికాలో గత 35 రోజులుగా కొనసాగుతున్న షట్డౌన్కు పాక్షికంగా తెరపడింది. రాజకీయ ఒత్తిడికి తలొగ్గిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫిబ్రవరి 15 వరకూ ప్రభుత్వం నడిచేందుకు అవసరమైన నిధుల విడుదలకు ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లును కాంగ్రెస్‌లోని ఉభయసభలు మూజువాణీ ఓటుతో ఆమోదించగా, ట్రంప్ సంతకం చేయడంతో చట్టంగా మారింది. దీంతో దాదాపు 8,00,000 మంది ఫెడరల్ ఉద్యోగులకు ఈ నెల వేతనాలు అందనున్నాయి. రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 3 వారాల్లోగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం, వలసవిధానంపై ఇరుపార్టీలు ఓ అంగీకారానికి రావాలి. డెమొక్రాట్లకు మినహాయిపు కాదు.. షట్‌డౌన్ ముగిసిన నేపథ్యంలో వైట్‌హౌస్‌లో శుక్రవారం(స్థానిక కాలమానం) నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘వలసల్ని సమీక్షించే హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి ఏడాది కాలానికి అవసరమైన నిధుల్ని కేటాయించే విషయమై ఉభయ సభలతో త్వరలోనే చర్చిస్తా. 35 రోజులుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న 8 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులకు పూర్తి నెల జీతాన్ని అందిస్తాం. షట్‌డౌన్‌ను ఎత్తివేస్తూ నేను తీసుకున్న నిర్ణయం డెమొక్రాట్లకు ఇచ్చిన మినహాయింపు కానేకాదు. సరిహద్దులో బలమైన గోడ లేదా ఉక్కు కంచె నిర్మించడం తప్ప మనకు మరో ప్రత్యామ్నాయం లేదు. ఫిబ్రవరి 15లోగా ఆమోదయోగ్య ఒప్పందం కుదరకుంటే మళ్లీ షట్‌డౌన్ తప్పదు’ అని అన్నారు. హెచ్1బీ ప్రీమియం ప్రాసెసింగ్ రేపటి నుంచే హెచ్–1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను సోమవారం నుంచి పునఃప్రారంభించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) ప్రకటించింది. వార్షిక పరిమితి (మొత్తం 85,000) కిందకు వచ్చే అన్ని రకాల హెచ్–1బీ వీసా కోటాలకు ప్రీమియం ప్రాసెసింగ్ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ పరిమితి కిందకు రాని పలు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన హెచ్–1బీ ప్రీమియం ప్రాసెసింగ్ ఫిబ్రవరిలో తిరిగి ప్రారంభమవుతుందని సమాచారం. ప్రీమియం ప్రాసెసింగ్ కింద దరఖాస్తుదారులు నిర్దిష్ట మొత్తంలో ఎక్కువ రుసుమును చెల్లిస్తే కేవలం 15 రోజుల్లోనే వారి దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటారు. -
స్పీకర్ విదేశీ పర్యటనకు ట్రంప్ చెక్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి షాకిచ్చారు. అమెరికా–మెక్సికో సరిహద్దు గోడకు నిధుల్ని అడ్డుకుంటున్నందుకు ప్రతీకారంగా ఆమె బ్రస్సెల్స్, ఈజిప్టు, అఫ్గానిస్తాన్ పర్యటనకు మిలటరీ విమానాన్ని ఇచ్చేందుకు సర్వసైన్యాధ్యక్షుడి హోదాలో నిరాకరించారు. ఈ మేరకు ట్రంప్ ఆమెకు లేఖ రాశారు. ‘షట్‌డౌన్ కారణంగా మీ విదేశీ పర్యటన వాయిదా పడింది. షట్‌డౌన్ ముగిశాక పర్యటనను రీషెడ్యూల్ చేస్తాం. కానీ మీరు ఈ పర్యటనకు ప్రైవేటుగా వెళ్లాలని అనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లొచ్చు. అమెరికాకు చెందిన 8 లక్షల మందికిపైగా గొప్ప ఉద్యోగులకు 27 రోజులుగా వేతనాలు అందడం లేదన్న విషయాన్ని మీరు ఒప్పుకుంటారనే అనుకుంటున్నా. మన సరిహద్దుకు అత్యవసరంగా కావాల్సిన భద్రత, నిధుల విషయంలో మిమ్మల్ని త్వరలోనే కలుసుకుంటానని ఆశిస్తున్నా’ అని ట్రంప్ లేఖలో తెలిపారు. మరోవైపు, షట్‌డౌన్ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఐదురోజులపాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు అమెరికా ప్రతినిధుల బృందం పర్యటనను ట్రంప్ రద్దుచేశారు. -
అమెరికా చరిత్రలో షట్‌డౌన్ రికార్డు
వాషింగ్టన్: అమెరికా–మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి నిధుల విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్లతో విభేదాల కారణంగా మొదలైన అమెరికా షట్‌డౌన్ రికార్డు స్థాయిలో 22వ రోజుకు చేరుకుంది. ఈ షట్‌డౌన్ కారణంగా దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు. గతంలో 1995–96లో బిల్ క్లింటన్ హయాంలో 21 రోజుల పాటు కొనసాగిన షట్‌డౌన్ రికార్డును శుక్రవారం రాత్రితో అధిగమించింది. మరోవైపు, మీ సెలవులు ముగించుకుని వైట్హౌస్కొచ్చి షట్డౌన్కు ముగింపు పలికండి అంటూ ప్రతిపక్ష డెమోక్రాట్ సభ్యులను ట్రంప్ చర్చలకు ఆహ్వానించారు. గోడ నిర్మాణానికి నిధులపై ఆమోదం లభించకుంటే మిగతా బడ్జెట్ బిల్లులపై తాను సంతకం చేయబోనని వ్యాఖ్యానించారు. ‘డెమోక్రాట్లకు, కాంగ్రెస్ ప్రతినిధులకు మీరైనా చెప్పండి. ‘షట్డౌన్కు ముగింపు పలకమనండి’ అంటూ తన 5.72 కోట్ల ట్విట్టర్ ఫాలోయర్లను కోరారు. -
నిధులివ్వకుంటే.. ఎమర్జెన్సీ
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి కాంగ్రెస్ నిధులు మంజూరు చేయకుంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ప్రతిష్టంభన తొలగకుంటే ప్రభుత్వ షట్‌డౌన్ నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగొచ్చని ప్రతిపక్ష డెమొక్రటిక్ సభ్యులతో చెప్పారు. రెండు వారాలుగా కొనసాగుతున్న పీటముడిని పరిష్కరించేందుకు శుక్రవారం అధ్యక్షుడు, డెమొక్రటిక్ సభ్యుల మధ్య జరిగిన సమావేశం విఫలమైంది. గోడతోనే అక్రమ వలసల కట్టడి.. సమావేశం ముగిశాక ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అనుమతి లేకుండానే గోడ నిర్మాణానికి నిధులు పొందేందుకు అవసరమైతే జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తానని వెల్లడించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తనకు ఈ విషయంలో విశేష అధికారాలున్న సంగతిని ప్రస్తావించారు. అయితే పరిస్థితి అంతదాకా రాకపోవచ్చని, కాంగ్రెస్ సమ్మతితోనే ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి ప్రాధాన్యమిస్తానని చెప్పారు. గోడతోనే అక్రమ వలసల కట్టడి సాధ్యమన్నారు. విద్యార్థి మేధావుల్లారా వెళ్లకండి అమెరికా ఉత్తమ విద్యా సంస్థల్లో చదువు ముగించుకున్న విద్యార్థులు దేశం విడిచి వెళ్లొద్దని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. అమెరికాలోనే ఉండి అక్కడి కంపెనీల అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. వీసా విధానంలోని లొసుగుల్ని సరిదిద్ది మేధావుల్ని, ప్రతిభావంతుల్ని ఆకర్షించేందుకు కట్టుబడి ఉన్నానన్నారు. -
కాస్ట్ కటింగ్ సెగ : ఆకాశవాణి జాతీయ ఛానెల్ మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : ఆలిండియా రేడియో జాతీయ చానల్‌కు కాస్ట్ కటింగ్ సెగ తాకింది. ఆకాశవాణి జాతీయ ఛానల్ ప్రసారాలు హేతుబద్దీకరణ, నిర్వహణ వ్యయం తగ్గింపులో భాగంగా ఆల్ ఇండియా రేడియో (ఎఐఆర్) జాతీయ ఛానల్‌ను మూసివేయాలని ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ప్రసార భారతి నిర్ణయించింది. ఈ మేరకు ప్రసారభారతి తన నిర్ణయాన్నిడిసెంబరు 24న ఎఐఆర్ డైరెక్టరేట్‌కు తెలిపింది. ఇందుకోసం గత ఏడాది పలుమార్లు సంప్రదింపులు, చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని వెంటనే అమలు చేయాలని ఆలిండియా రేడియోను ఆదేశించింది. అలాగే అకాడమీస్ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ మల్టీ మీడియాను కూడా మూసివేయాలని నిర్ణయించింది. అలాగే ఐదు నగరాలు, అహ్మదాబాద్ హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్, తిరువనంతపురంలోని ప్రాంతీయ శిక్షణా అకాడెమీలను రద్దు చేయనుంది. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. తోడాపూర్, నాగపూర్ సహా ఇతర నగరాల్లోని సిబ్బందిని వేరే ప్రదేశాలకు సర్దుబాటు చేయనుంది. జాతీయ చానెల్ ద్వారా భద్రపరిచే కార్యక్రమాల ఆర్కైవ్స్‌ను, డిజిటలైజేషన్‌కోసం ఢిల్లీలోని సెంట్రల్ ఆర్కైవ్స్ సెంటర్‌కు పంపించాలని జనవరి 3, 2019 తేదీన ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొంది. జాతీయ ఛానల్‌కు సంబంధించిన ట్రాన్స్మీటర్లు బలహీనంగా ఉండటం కూడా మూసివేతకు కారణమని ఏఐఆర్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. నాగపూర్‌లో ఉన్న ఒకే ఒక ట్రాన్స్‌మీటరు మాత్రమే ఒక మెగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉందనీ, ప్రస్తుత డిజిటల్ రేడియో యుగంలో ఇది సరిపోదని వ్యాఖ్యానించారు. అలాగే పటిష్టమైన శ్రోతల ప్రాతిపదిక లేని ఛానల్లో పెట్టుబడులు పెట్టడం సరైంది కాదని సీనియర్ నిర్వాహకులు భావించారని ఆయన వివరించారు. అంతేకాదు ప్రస్తుతం కొన్ని ఏఐఆర్ కార్యక్రమాలను అవుట్సోర్స్ ద్వారా నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ఏఐఆర్ వెబ్‌సైట్‌ను ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏఐఆర్‌లోని కొన్ని విభాగాలు ఈ నిర్ణయంపై విచారాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ ఛానల్ ప్రసారాలు చాలా ముఖ్యమైన భాగమని, మొత్తంగా దాన్ని మూసివేయడం కంటే ఖర్చులను తగ్గించుకునేందుకు ఇతర మార్గాలను అన్వేషించాలని కోరుతున్నాయి కాగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు జాతీయ ప్రసారాలు ప్రసారమయ్యే నేషనల్ చానల్ 1987లో ప్రారంభమైంది. 31 సంవత్సరాలకుపైగా జాతీయ వార్తలను, కీలక అంశాలను ప్రజలకు చేరవేయడంలో చురుకైన కీలక పాత్ర పోషించింది. -
అమెరికా షట్‌డౌన్
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలన మరోసారి పాక్షికంగా స్తంభించింది (షట్‌డౌన్). అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10.30) కొన్ని అత్యవసర, కీలక విభాగాలు తప్పించి మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ మూతపడ్డాయి. అమెరికాలో ఇలా జరగడం ఈ ఏడాదిలోనే ఇది మూడోసారి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండానే, అలాగే మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ అడిగిన 500 కోట్ల డాలర్ల డబ్బుపై ఏ నిర్ణయమూ తీసుకోకుండానే శుక్రవారం కాంగ్రెస్ వాయిదా పడింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు సకాలంలో కాంగ్రెస్ అమోదం పొందకపోయినా, అధ్యక్షుడు సంతకం చేయకపోయినా పాలన స్తంభిస్తుంది. పాలన నిలిచిపోకుండా చూసేందుకు చివరి నిమిషం వరకు కాంగ్రెస్ నేతలు, శ్వేతసౌధం అధికారుల మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ప్రభుత్వానికి చెందిన కొన్ని కీలక భద్రతా సంస్థలు, అత్యవసర సేవల సంస్థలు మాత్రమే ప్రస్తు తం అమెరికాలో పనిచేస్తున్నా యి. అమెరికా రక్షణ మంత్రి పదవికి జిమ్ మ్యాటిస్ రాజీనామా చేసిన మరుసటి రోజునే పాలన స్తంభించడంతో అమెరికాలో కల్లోలిత వాతావరణం నెలకొంది. షట్‌డౌన్ కారణంగా 8 లక్షల మంది అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికి వేత నం లేని సెలవులు లభించనుండగా, మరికొందరు జీతం లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఈసారి ఎక్కువ కాలం.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ ఆమోదించేంత వరకు అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతుంది. ఈ సారి షట్‌డౌన్ ఎక్కువ కాలం కొనసాగుతుందనీ, దానికి తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ అధికారం చేపట్టాకా షట్‌డౌన్ అమలు కావడం ఇది మూడో సారి. ఈ ఏడాది జనవరి, జూన్ నెలలలో కూడా కొన్ని రోజుల పాటు పాలన స్తంభించింది. షట్‌డౌన్ కాలంలో చాలా మంది ఉద్యోగులకు సెలవులు ఇస్తారు. అత్యవసర విభాగాల సిబ్బంది యథావిధిగా పని చేస్తారు. ఈ కాలంలో సామాజిక తనిఖీ విభాగం, వైద్యశాఖ, తపాలా విభాగాలపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. అవన్నీ యథా ప్రకారం పని చేస్తాయి. ఎఫ్‌బీఐ, సరిహద్దు గస్తీ, తీరరక్షణ, ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, ఆహార తనిఖీ, హోంలాండ్ సెక్యూరిటీ విభాగం వంటి అత్యవసర విభాగాలు కూడా మామూలుగానే పని చేస్తాయి. షట్‌డౌన్ కాలంలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న మ్యూజియంలు, ఉద్యానవనాలు, షాపింగ్ మాల్స్ మూతపడతాయి. సెనెట్ అప్రాప్రియేషన్ కమిటీలోని డెమోక్రాట్ల నివేదిక ప్రకారం 4,20,000 మంది ఈ షట్డౌన్లో జీతం లేకుండా పని చేస్తారు. షట్డౌన్లు కొత్త కాదు అమెరికాకు షట్డౌన్లు కొత్త కాదు. దాదాపు ప్రతి సంవత్సరం జనవరిలో కొన్ని రోజుల పాటు పాలన స్తంభిస్తుంటుంది. దైనందిన ప్రభుత్వ వ్యవహారాలకు అవసరమైన నిధులను ఖర్చు చేయడానికి ద్రవ్యవినిమయ బిల్లును జనవరిలో కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదం సకాలంలో లభించకపోతే షట్‌డౌన్ అవుతుంది. జిమ్మి కార్టర్ హయాంలో ప్రతి ఏడూ సరాసరి 11 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి నెలకొంది. రోనాల్డ్ రీగన్ రెండు దఫాల పాలనలో ఆరు షట్డౌన్లను అమెరికా చూసింది. 2013లో ఏకంగా 16 రోజుల పాటు ప్రభుత్వ పాలన స్తంభించిపోయింది. ఈ ఏడాది జనవరిలో మూడు రోజుల పాటు, జూన్‌లో కొన్ని గంటలపాటు షట్‌డౌన్ అయ్యింది. అయితే ఒకే సంవత్సరంలో మూడు సార్లు షట్‌డౌన్ కావడం మాత్రం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. -
మరోసారి స్తంభించిన అమెరికా ప్రభుత్వం
వాషింగ్టన్ : అమెరికా - మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి కావాల్సిన నిధుల మంజూరు బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో మరోసారి అమెరికా ప్రభుత్వం స్తభించింది. దాంతో భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 12. 01 గంటల నుంచి పలు ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలను, పార్కులను మూసి వేశారు. మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించే నిమిత్తం ట్రంప్ ప్రభుత్వం 5 బిలియన్ల అమెరికన్ డాలర్లను డిమాండ్ చేసింది. కానీ డెమొక్రాట్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వ స్తంభన ఏర్పడింది. ఫలితంగా శుక్రవారం అర్థరాత్రి 12 గంటలు దాటిన తరువాత ఏ ప్రభుత్వ కార్యాలయానికి కూడా ఖజానా నుంచి నిధులు మంజూరు కావు. దాంతో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితవ్వాలి.. లేదా వేతనం లేకుండా పని చేయాల్సి రావచ్చని తెలిసింది. ప్రభుత్వ స్తంభన విషయాన్ని ట్రంప్ కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు. డెమోక్రాట్ల వల్లే ప్రభుత్వాన్ని స్తంభింపజేయాల్సి వచ్చిందని ఆయన అసహనం చెందారు. అయితే ఇది ఎంతోకాలం ఉండకపోవచ్చని ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రభుత్వం స్తంభించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. -
షాకింగ్: సగం ఏటీఎంలు మూత
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికి సగానికి సగం ఏటీఎంలు మూత పడనున్నాయనే షాకింగ్ న్యూస్ సంచలనంగా మారింది. స్వయంగా ట్రీ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi) బుధవారం (21 నవంబరు) నివేదించింది. దేశవ్యాప్తంగా దాదాపు 1.13 లక్షలఏటీఎంలు మూతపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ) అంచనా ప్రకారం దేశంలో ప్రస్తుతం 2.38 లక్షల ఏటీఎంలు అందుబాటులో ఉండగా, అందులో సగానికి పైగా అంటే దాదాపు 1.13 లక్షల ఏటీఎంలు 2019 మార్చి కల్లా మూతపడే అవకాశాలున్నాయి. ఈ మేరకు సర్వీస్ ప్రొవైడర్లు ఒత్తిడి చేయనున్నారని పేర్కొంది. వీటిల్లో సుమారు లక్ష ఆఫ్ సైట్ ఎటిఎంలు, 15వేల వైట్ లేబుల్ ఏటీఎంలు ఉన్నాయని తెలిపింది. తాజా నియంత్రణలు, మార్పులు కారణంగా ఈ మూత తప్పకపోవచ్చని వెల్లడించింది. వీటిలో మెజారిటీ ఏటీఎంలు పట్టణేతర ప్రాంతాల్లో ఉండొచ్చని, ప్రభుత్వ సబ్సిడీ లబ్ధిదారులు మెషీన్ల ద్వారా తీసుకునేందుకు వీలు కల్పించే చర్యలకు ఏటీఎంల మూత విఘాతం కావచ్చని తెలిపింది. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పిఎంజెడివై) పథకం కింద మిలియన్లమంది లబ్దిదారులు తీవ్రంగా ప్రభావితం కానున్నారని పేర్కొంది. ఇటీవల చేపట్టిన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ అప్‌గ్రేడేషన్, ఇతర నియంత్రణ చర్యల్లో మార్పులు, క్యాష్ లోడింగ్‌కు అనుసరిస్తున్న క్యాసెట్ స్వాపింగ్ పద్ధతి వల్ల ఎటీఎం ఆపరేషన్లు ఆచరణ సాధ్యం కాకపోవచ్చని, ఫలితంగా ఏటీఎంలు మూతపడొచ్చని పేర్కొంది. సాంకేతిక పద్ధతుల్లో మార్పు, క్యాసెట్ క్యాష్ స్వాప్ విధానానికే కేవలం రూ.3,000 కోట్లు ఖర్చవుతుందని సీఏటీఎంఐ అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎం ఇండస్ట్రీ ఎదుర్కొన్న పరిస్థితికి అదనపు సాంకేతిక పరిజ్ఞానం తోడై పరిస్థితి మరింత దిగజారవచ్చని, సర్వీస్ ప్రొవైడర్ల నెత్తిన మోయలేని భారం పడుతుందని తెలిపింది. ఇది ఏటీఏంల మూతకు దారితీస్తుందని సీఏటీఎంఐ ప్రకటించింది. ఏటీఎంల మూత కారణంగా వేలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని సీఏటీఎంఐ పేర్కొంది. అంతేకాదు నగదు కొరత వస్తే ఏటీఎంల దగ్గర భారీ క్యూలు, గందరగోళం తప్పదని కూడా వ్యాఖ్యానించింది. -
ఐదేళ్లలో 235 కాలేజీలమూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో 235 కాలేజీలు (అన్ని రకాలు) మూతబడ్డాయి. అందులో గత రెండేళ్లలోనే భారీగా కాలేజీలు మూతబడ్డాయి. రాష్ట్రంలో ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేయడం, మెరుగైన విద్య అందించేలా అనేక సంస్కరణలు తీసుకు రావడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అందులోనూ చాలా వరకు కాలేజీలను యాజమా న్యాలు స్వచ్ఛందంగానే రద్దు చేసుకున్నాయి. అయితే ఇప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ, కర్ణాటకలోనే అత్యధిక కాలేజీలు ఉన్నట్లు కేంద్రం లెక్కలు తేల్చింది. దేశవ్యాప్తంగా సగటున ప్రతి లక్ష మందికి 28 కాలేజీలు మాత్రమే ఉంటే.. తెలంగాణ, కర్ణాటకల్లో మాత్రం ప్రతి లక్ష మందికి 51 కాలేజీలు ఉన్నట్లు వెల్లడించింది. అందులో 82 శాతం కాలేజీలు ప్రైవేటు రంగంలోనే ఉన్నట్లు తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యలో మాత్రం ఐదేళ్లలో పెద్దగా పెరుగుదల నమోదు కాలేదు. ఐదేళ్లలో కేవలం 50 వేల మంది విద్యార్థులే పెరిగారు. 2013–14లో రాష్ట్రంలోని కాలేజీల్లో 14,19,307 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 14,69,484కు పెరిగింది. పెరిగినా.. భారీగానే మూత రాష్ట్రంలో 2013–14లో 2,280 ఉన్నత విద్య కాలేజీలు ఉంటే 2016 నాటికి వాటి సంఖ్య 2,454కు పెరిగింది. ఆ మేరకు 174 కాలేజీలు పెరిగాయి. దాని ప్రకారం 2016లో ప్రతి లక్ష మందికి 60 కాలేజీలు ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గిపోయింది. దేశంలో అత్యధిక కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక మొదటి స్థానంలో ఉన్నాయి. సంఖ్యాపరంగా తగ్గినా ఈ రెండు రాష్ట్రాల్లోనే కాలేజీలు అధికంగా ఉండటం గమనార్హం. తెలంగాణ, కర్ణాటకలో ప్రతి లక్ష మందికి 51 కాలేజీలు ఉండగా, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా అంత ఎక్కువ కాలేజీలు లేవు. పైగా 2013–14లో ప్రతి లక్ష మందికి 55 కాలేజీలు ఉంటే.. ఇపుడు 51కి తగ్గాయి. అంటే ప్రతి లక్ష మందికి 4 చొప్పున కాలేజీలు తగ్గిపోయాయి. బిహార్‌లో తక్కువ కాలేజీలు దేశంలో 18 నుంచి 23 ఏళ్ల వయసున్న ప్రతి లక్ష మందికి (డిగ్రీ, ఆపై చదువులను అందించే) కాలేజీలు సగటున 28 ఉన్నాయి. అయితే బిహార్‌లో ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంది. అక్కడ ప్రతి లక్ష మందికి కేవలం ఏడు కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత తక్కువ కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ, జార్ఖండ్ ఉన్నాయి. అక్కడ ప్రతి లక్ష మందికి 8 కాలేజీలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో ప్రతి లక్ష మందికి 12 కాలేజీలే ఉన్నాయి. దేశంలో అత్యధిక కాలేజీలు ఉన్న మొదటి 10 జిల్లాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. భాగ్యనగరంలో 472 కాలేజీలు ఉన్నాయి. 343 కాలేజీలతో రంగారెడ్డి 5వ స్థానంలో ఉంది. రంగారెడ్డి జిల్లాలో 2016–17లో 438 కాలేజీలు ఉంటే 2017–18 నాటికి వాటి సంఖ్య 343కు పడిపోయింది. -
ఈఫిల్ టవర్ సందర్శన నిలిపివేత
పారిస్ : పారిస్‌లోని ఈఫిల్ టవర్ సందర్శనను అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిలిపివేశారు. సైట్ యాజమాన్యం తీసుకొచ్చిన నూతన విధానంతో ఈఫిల్ టవర్ సందర్శనకులు భారీ క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వారిని నిలువరించడం సిబ్బందిగా కష్టంగా మారింది. దీంతో బుధవారం మధ్యాహ్నం సమ్మెకు దిగిన ఉద్యోగులు టవర్ మూసివేశారు. అప్పటికే లోనికి వెళ్లిన పర్యాటకులకు మాత్రం మినహాయింపునిచ్చారు. గురువారం కూడా ఇదే రకంగా నిరసన తెలుపనున్నట్టు ఉద్యోగులు ముందుగానే ప్రకటించారు. గతేడాది ప్రఖ్యాత కట్టడాన్ని దాదాపు 60 లక్షల మంది సందర్శించారు. గత నెలలో ఈఫిల్ టవర్ సందర్శన టిక్కెట్లను సగం వరకు ఆన్లైన్లో ఉంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో బుక్ చేసుకునే వారికి టైమ్‌స్లాట్‌లను ఎంచుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా సందర్శకులు తీసుకునే టికెట్‌ను బట్టి వారికి ఒక్కోరకం ఎలివేటర్లను కేటాయించారు. దీంతో అసలు సమస్య తలెత్తింది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి కేటాయించే ఎలివేటర్లు మధ్యాహ్నం వరకు సగం మేర ఖాళీగా దర్శనమిస్తాయి. ఆ తర్వాత ఎలివేటర్లలో రద్దీ పెరుగుతోంది. దీంతో పర్యాటకులు భారీ క్యూలైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి. దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. చాలా మంది పర్యాటకులు కూడా క్యూ లైన్లలో వేచి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సందర్శకులను నియంత్రించడంలో తాము సహనం కొల్పోతున్నామని పేర్కొన్నారు. ఏ రకం టికెట్ తీసుకున్నా వారైనా అన్ని ఎలివేటర్లను ఉపయోగించుకునేలా నిబంధనల్లో మార్పులు చేయాలని కోరారు. కాగా ఈఫిల్ టవర్‌ను నిర్వహిస్తున్న ఎస్ఈటీఈ కంపెనీ మాత్రం తాము రోజుకు 10,000 టికెట్లు మాత్రమే ఆన్లైన్లో విక్రయిస్తున్నామని చెప్పారు. వేచి చూడాల్సిన సమయం కూడా చాలా తక్కువని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఏదో ఒక అంశంపై ఇక్కడి సిబ్బంది నిరసనలకు దిగడం తరచు జరుగుతూనే ఉంది. -
నెట్ సర్వీసులను నిలిపివేయడం నేరమే!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్, జైపూర్, జోద్పూర్ నగరాల్లో మూడు రోజుల క్రితం అంటే, 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులను సంపూర్ణంగా షట్‌డౌన్ చేసింది. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవడం వల్లనో, పిల్లలను ఎత్తుకుపోయే కిడ్నాపర్లు తచ్చాడుతున్నారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయన్న కారణంగానో, మత విద్వేషాల కారణంగానో ఇంటర్నెట్ను షట్‌డౌన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం పరీక్షల పేరిట, అందులోను పోలీసు కానిస్టేబుళ్ల నియామక పరీక్షల కోసం నెట్ సర్వీసులను నిలిపి వేశారంటే ఆశ్ఛర్యం కలుగుతోంది. రాష్ట్రంలో 13000 వేల పోలీసు ఉద్యోగాల కోసం 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉండడంతో మూడు నగరాల్లో పరీక్షా కేంద్రాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. అత్యాధునిక పద్ధతుల్లో కాపీ కొట్టకుండా అభ్యర్థులను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు వివరించారు. ఇంటర్నెట్ సర్వీసులను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవడం అన్నది ప్రజల స్వేచ్ఛ. పరీక్షల పేరిట ప్రజల స్వేచ్ఛను హరించడం అన్యాయమని ప్రజా సంఘాలు వాదిస్తున్నాయి. పరీక్షలకు ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారన్నది ఇక్కడ ముఖ్యంకాదని ఆ సంఘాలు పేర్కొన్నాయి. ఆ మాటకొస్తే ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ విషయంలో ఘోరంగా విఫలమవడమే అధిక పోటీకి కారణమని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాపీ కొడతారన్న కారణంగా పరీక్షల సందర్భంగా ఇంటర్నెట్ సౌకర్యాలను పూర్తిగా నిలిపివేయడం అంటే నీటిని తస్కరిస్తున్నారనో, వృధా చేస్తున్నారన్న కారణంగా ప్రజలందరికి నీటి సరఫరాను నిలిపివేయడంలా ఉందని ఆ సంఘాలు ఆరోపించాయి. ప్రజల స్వేచ్ఛను హరించే ఏ నిర్ణయమైన అది నేరమే అవుతుందని విమర్శించాయి. -
పబ్‌ల మూసివేతకు ఆదేశాలు..
సాక్షి, బెంగళూర్ : లైసెన్స్ లేకుండా మ్యూజిక్ ప్లే చేస్తున్న 27 పబ్‌లపై బెంగళూర్ పోలీసులు కొరడా ఝళిపించారు. పబ్‌లు, రెస్టారెంట్లలో లైవ్ మ్యూజిక్ ప్రదర్శించాలంటే అనుమతి తప్పనిసరి అని కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించిన నేపథ్యంలో 27 పబ్‌లను మూసివేయాల్సిందిగా బెంగళూర్ పోలీసులు ఆదేశించారు. అయితే లైవ్ మ్యూజిక్ లేకుండా కార్యకలాపాలు సాగించేందుకు ఈ పబ్‌లను అనుమతించారు. సంగీత కార్యక్రమాలు నిర్వహించేందుకు పబ్ యాజమాన్యాలు లైసెన్సు కోసం దరఖాస్తు చేయకపోవడంతో వీటిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సెక్షన్ 294 కింద వీటిని మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేయగా, మరికొన్ని పబ్‌లకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇదేతరహాలో గత నెలలో ఢిల్లీ ప్రభుత్వం రెస్టో బార్లను తమ ప్రాంగణాల్లో రికార్డింగ్ డ్యాన్స్‌లు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు నిర్వహించడంపై హెచ్చరికలు జారీ చేసింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని ఢిల్లీ ప్రభుత్వం రెస్టో బార్ యాజమాన్యాలను హెచ్చరించింది. -
యాహూ మెసేంజర్‌కి ఇక గుడ్ బై
కాలిఫోర్నియా: యాహూ అభిమానులకు చేదువార్త. యాహూ మెసెంజర్ 20 ఏళ్ల ప్రస్థానానికి తెరదించుతూ యాహూ మెసేజింగ్ యాప్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. జూలై 17వ తేదీ నుంచి యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేస్తున్నట్లు దాని మాతృ సంస్థ ఓత్ ఐఎన్‌సీ వెల్లడించింది. ఇకపై యాహూ మెసెంజర్ పనిచేయదని ఓత్ తెలిపింది. అలాగే యాహూలో మెయిల్, ఇతర సేవలను వాడుకునేందుకు ఆ ఐడీ పనికొస్తుందని పేర్కొంది. అయితే యాహూ మెసెంజర్ సర్వీసులు ఇకపై స్క్విరల్ (Squirrel) అనే కొత్త ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌కి మళ్లిస్తున్నట్టు తెలిపింది. అలాగే యూజర్లు తమ చాట్ హిస్టరీని డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తునట్టు వెల్లడించింది. ఇందుకు ఆరు నెలల సమాయాన్ని కూడా ఇచ్చింది. https://messenger.yahoo.com/getmydata లింక్‌ను సందర్శిస్తే యూజర్లు తమ యాహూ మెసెంజర్ చాట్ హిస్టరీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
తగ్గిన క్యాంపస్ జాబ్స్.. 101 కాలేజీల మూసివేత
న్యూఢిల్లీ : ప్రాంగణ నియమాకాలు తగ్గడం, కళాశాలల్లో సీట్ల మిగులు పెరగడంతో 2017-18 సంవత్సరానికి గాను స్వచ్ఛంద మూసివేతకు అనుమతి ఇవ్వాల్సిందిగా దేశ వ్యాప్తంగా దాదాపు 100 మేనేజ్మెంట్ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నట్లు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) తెలిపింది. జాతీయ సాంకేతిక విద్య సమాఖ్య(ఏఐసీటీఈ) వివరాల ప్రకారం మేనేజ్మెంట్ కోర్సులైన ఎంబీఏ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ కోర్సును అందించే ఈ 101 బిజినెస్ స్కూల్స్‌లో అత్యధిక భాగం ఉత్తరప్రదేశ్ (37)కు చెందినవి కాగా తరువాతి స్థానాల్లో కర్ణాటక (10), మహారాష్ట్ర (10) నిలిచాయి. ఈ దరఖాస్తుల్లో ఎక్కువ శాతం కళాశాలలు మూసివేతకు అనుమతి పొందుతాయని అధికారులు తెలిపారు. ఏఐసీటీఈ నివేదికి ప్రకారం 2015-16 సంవత్సరంలో 66 కళాశాలలు, 2016-17లో 76 మేనేజ్మెంట్ సంస్థలు మూతపడినట్లు వెల్లడించారు. కారణాలు ఇవే... ‘కొన్నాళ్ల కిందట మేనేజ్మెంట్ విద్య ఐఐఎమ్‌ల్లో, కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ మార్కెట్లో మేనేజ్మెంట్ కోర్సులు చదివిన విద్యార్థులకు డిమాండ్ పెరగడంతో ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో మేనేజ్మెంట్ కళాశాలను ఏర్పాటు చేసింది. కానీ సరైన వసతులు, ప్రావీణ్యం కల అధ్యాపకులను నియమించడంలో వెనకబడింది. దాంతో ప్రాంగణ నియమాకలు తగ్గాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 3వేల సాంకేతిక, మేనేజ్మెంట్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో చాలా కళాశాలలు కనీస నిబంధనలను కూడా పాటించడం లేదు. విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించడంలో విఫలమవుతున్నాయి. దాంతో ఏటా ప్రాంగణ నియమాకాలు తగ్గిపోతున్నాయి. 2016-17 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 1.50 లక్షల మంది ఎంబీఏ పట్టభద్రులు మాత్రమే ప్రాంగణ నియమాకాల ద్వారా ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం మూతపడనున్న 101 కాలేజీల వల్ల 10 వేల సీట్లు తొలగించబడతాయి. ఇవేకాక మరికొన్ని సంస్థలు కేవలం మేనేజ్మెంట్ కోర్సులను మాత్రమే రద్దు చేయాల్సిందిగా ఏఐసీటీఈని కోరాయి. ఫలితంగా మరో 11 వేల సీట్లు తొలగించబడతాయ’ని ఏఐసీటీఈ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ స్పందన... ప్రాంగణ నియామకాలు లేకపోవడమే కళాశాలల మూసివేతకు ప్రధాన కారణమని ఏఐసీటీఈ చైర్మన్ ఎస్ఎస్ మంథ తెలిపారు. కళాశాలల మూసివేతను ప్రభుత్వం పెద్ద సమస్యగా భావించడం లేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్ సుబ్రమణ్యం అన్నారు. ‘నాణ్యతా ప్రమాణాలు పాటించని కళాశాలలు స్వచ్ఛందగా మూతబడటం మంచి విషయమే. ఎందుకంటే ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించాలనుకుంటుంది. దానికి నంబర్లతో పనిలేదు. విద్యాప్రమాణాలను పెంచడం కోసం ప్రభుత్వం నూతన విధానాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా కళాశాలల గుర్తింపు కోసం మెనటర్‌షిప్ విధానాన్ని, విద్యార్థుల కోసం ఇండక్షన్ కార్యక్రమాలను రూపొందించింది. విద్యార్థులకు, పరిశ్రమకు మధ్య వారధి నిర్మించి అర్హులైన వారి ఉపాధి కల్పనకు ప్రభుత్వ కృషి చేస్తుంద’ని చెప్పారు. -
10 నిమిషాల పాటు ట్విటర్ డౌన్
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ఒక్కసారిగా స్తంభించిపోయింది. ప్రపంచంలో చాలా దేశాల్లో ట్విటర్ డౌన్ అయినట్టు తెలిసింది. సుమారు 7 గంటల ప్రాంతం నుంచి ట్విటర్ ఆగిపోవడం ప్రారంభించింది. దీంతో యూజర్ల నుంచి పెద్ద ఎత్తున్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ స్తంభన కొనసాగింది. డౌన్‌డిటెక్టర్ అనే ఇంటర్నెట్ ట్రాకర్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈశాన్య అమెరికా, యూకేలో కొన్ని ప్రాంతాలు, ఫ్రాన్స్, జపాన్, భారత్ దేశ యూజర్లు ఈ టెక్నికల్ సమస్యను ఎదుర్కొన్నారని డౌన్‌డిటెక్టర్ రిపోర్టు చేసింది. ట్విటర్‌కు ప్రధాన వనరు అయిన ఆండ్రాయిడ్ యాప్ నుంచే 28 శాతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఐప్యాడ్ యాప్ యూజర్లు కూడా ఇదే రకమైన సమస్యను ఎదుర్కొన్నట్టు డౌన్‌డిటెక్టర్ తెలిపింది. మొత్తం ఫిర్యాదుల్లో 18 శాతం ఐప్యాడ్ యాప్ వారివి కూడా ఉన్నట్టు పేర్కొంది. వెబ్ సైట్ యూజర్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. అయితే ఏ కారణం చేత ట్విటర్ స్తంభించిపోయిందో ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ ఇంకా ప్రకటించలేదు. కానీ ట్విటర్ డౌన్ అయినప్పడు ‘టెక్నికల్‌గా కొంత సమస్య ఉంది. నోటీసు చేసినందుకు ధన్యవాదాలు. దాన్ని ఫిక్స్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే సాధారణం అయిపోతుంది’ అనే మెసేజ్ ఈ ప్లాట్‌ఫామ్‌పై దర్శనమిచ్చింది. ట్విటర్ ఇలా డౌన్ అవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు ఇలా ట్విటర్ ఆగిపోయింది. -
ముంబైకి విమానంలో వెళ్లేవారికి గమనిక
ముంబై: విమానంలో ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి, ఇతర ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చే వారికి ముఖ్య గమనిక. ఏప్రిల్ 9, 10 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య చత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చే విమానాలు రద్దయ్యాయి. రన్‌వేపై ఉన్న రబ్బర్ డిపాజిట్స్‌ను తొలగించడంలో భాగంగా ఈ సమయాల్లో విమానాల అనుమతిని నిలిపేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. పూర్తిగా కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విమానాశ్రయ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో పలు విమానయాన సంస్థలు విమాన సర్వీసులను రద్దు చేసి రీషెడ్యూల్ చేశాయి. ఈ రెండు తేదీల్లో విమానయాణం చేసే ప్రయాణికులు సమయ మార్పుల గురించి తమ ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లలో తెలుసుకోవాలని సూచించారు. చత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు గతంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఇండియా(ఏఏఐ) ఆధీనంలో ఉండేది. 2006 నుంచి పీపీపీ పద్ధతిలో ముంబై ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు ప్రైవేటు లిమిటెడ్, జీవీకే-లెడ్ కన్సార్టియం, ఏఏఐలు కలిసి ఎయిర్‌పోర్టును నిర్వహణను చూస్తున్నాయి. 75 ఏళ్ల క్రితం సింగిల్ ఇంజిన్ కలిగిన ఒకే విమానంతో ఎయిర్‌పోర్టు ప్రారంభమైంది. ప్రస్తుతం 867 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సంవత్సరానికి 4.52 కోట్ల మంది ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణం చేస్తున్నారు. సింగిల్ రన్‌వే పై ఒకే రోజు 935 విమానాలు రాకపోకలు సాగించడం చత్రపత్రి శివాజీ ఇంటర్నేషనల్ సాధించిన ప్రపంచ రికార్డు. -
అమెరికా షట్‌డౌన్ ముగిసింది
వాషింగ్టన్ : అమెరికా షట్‌డౌన్ ముగిసింది. ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి తెరుచుకున్నాయి. బడ్జెట్ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో కార్యకలాపాలు యథావిధిగా మళ్లీ ప్రారంభమయ్యాయి. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం ఆలస్యం కావడంతో.. 5 గంటపాటు అమెరికా ప్రభుత్వం కార్యకలాపాలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మూతపడకుండా ఉండేందుకు గురువారం అర్ధరాత్రిలోగా బిల్లును కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉండగా.. సెనేట్‌లో ఆలస్యం జరిగింది. సెనేట్ 71-28 ఓట్ల తేడాతో, ప్రతినిధుల సభ 240-186 ఓట్ల తేడాతో దీన్ని ఆమోదించింది. ''బిల్లుపై సంతకం చేశా. మా మిలటరీ ముందు కంటే చాలా బలమైనదిగా ఉంది. మేము మిలటరీని ప్రేమిస్తాం. ప్రతిఒక్కటీ అందిస్తాం. చాలా కాలంలో తొలిసారి ఇది జరిగింది. జాబ్స్..జాబ్స్..జాబ్స్!'' అని డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం ఈ బిల్లుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అంతకముందు జనవరిలో కూడా ఓసారి ఇలానే అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ అయింది. హౌజ్‌లో బిల్లుకు మద్దతు ఇచ్చిన 73 మంది డెమొక్రాట్లకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. -
ట్రంప్‌కు భారీ షాక్: రెండోసారి షట్‌డౌన్
వాషింగ్టన్: అమెరికా మరోసారి షట్‌డౌన్ అయింది. కీలకమైన బిల్లుకు అమెరికా సేనేట్‌లో మరోసారి వీగిపోవడంతో మూడువారాల్లో రెండోసారి ప్రభుత్వం స్థంభించింది. దీంతో ట్రంప్ ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. కీలకమైన బడ్జెట్‌కు ఆ దేశ కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో ఈ అర్థరాత్రినుంచి ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయనున్నారు. ఫెడరల్ ఫండింగ్ బిల్లు గత రాత్రితో ముగిసిపోయింది. అయితే కొత్త ద్రవ్యపరపతి బిల్లుకు ఆమోదం దక్కాల్సి ఉంది. సేనేట్తో పాటు హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కొత్త బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే సేనేట్‌లో ఆమోదం దక్కితేనే ఆ బిల్లుకు హౌజ్‌లో ఆమోదం దక్కే ఛాన్సుంది. కాంగ్రెస్(సేనేట్, హౌజ్ ఆఫ్ కామన్స్), వైట్‌హౌజ్‌లో ట్రంప్ ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నా.. షట్‌డౌన్ లాంటి పరిస్థితిని రెండోసారి ఎదుర్కోవల్సి రావడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురు దెబ్బేనని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా జనవరిలోనూ ద్రవ్యపరపతి బిల్లుకు ఆమోదం దక్కకపోవడం వల్ల మూడు రోజుల పాటు ప్రభుత్వ పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. -
మూతపడిన 25వేల మార్కెట్లు
న్యూఢిల్లీ : ఈ వీకెండ్లో షాపింగ్ చేయాలని ఏమైనా ప్లాన్స్ వేసుకున్నారా? అయితే అవన్నీ ఫ్లాపే. ఢిల్లీలో కన్నాట్ ప్లేస్, ఖాన్ మార్కెట్ వంటి ముఖ్యమైన మార్కెట్లన్నీ మూత పడ్డాయి. మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న సీలింగ్ డ్రైవ్‌ను నిరసిస్తూ.. నేడు, రేపు ఢిల్లీలో మార్కెట్లను మూసివేస్తున్నట్టు ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫడరేషన్ ప్రకటించింది. రెండు రోజుల పాటు తాము ఈ బంద్‌ను చేపడతామని తెలిపింది. 2వేల మంది ట్రేడర్స్ అసోసియేషన్స్ ఈ బంద్‌కు మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ పురీ ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటామని మాట ఇచ్చినప్పటికీ ట్రేడర్లు బాడీ మాత్రం నిరసనను పాటించాలనే నిర్ణయించింది. ఈ విషయంపై బీజేపీ ఢిల్లీ లీడర్లు, రాజధాని పరిధిలో ఉన్న మూడు మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్లు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లు సమావేశమయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న ఈ సీలింగ్ డ్రైవ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రవీణ్ ఖండేల్వాల తెలిపారు. మొత్తంగా 25వేల మార్కెట్లను మూసివేస్తున్నట్టు చెప్పారు. 500 మార్కెట్లలో ఆందోళనలు చేపడుతున్నారు. సీపీ, ఖాన్ మార్కెట్‌తో పాటు ఛాందినీ చౌక్, కరోల్ భాగ్, కమలా నగర్, సౌత్ ఎక్స్టెన్షన్, గ్రేటర్ కైలాష్, లజపత్ నగర్, డిఫెన్స్ కాలనీ, గ్రీన్ పార్క్, రాజౌరి గార్డెన్, తిలక్ నగర్ మార్కెట్లు మూతపడ్డాయి. -
అమెరికాలో షట్డౌన్కు ముగింపు!
వాషింగ్టన్: మూడ్రోజులపాటు అమెరికాను స్తంభింపజేసిన షట్డౌన్కు ముగింపు పలికే దిశగా అధికార రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమొక్రాట్ కాంగ్రెస్ సభ్యుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. సోమవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఈ చర్చల్లో డెమొక్రాట్ల ‘స్వాప్నికుల’ డిమాండ్‌పై చర్చకు సెనెట్ మెజారిటీ (రిపబ్లికన్) నేత మిచ్ మెక్‌కన్నెల్ అంగీకారం తెలిపారు. దీంతో ప్రభుత్వ నిర్వహణకు నిధులు ఇచ్చే బిల్లుపై చర్చించేందుకు మార్గం సుగమమైంది. బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని డెమొక్రాట్ల నేత చుక్ షుమర్ ప్రకటించారు. ‘షట్‌డౌన్ మరికొద్ది గంటల్లో ముగుస్తుంద’ని షుమర్ పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో పెద్దగా కనిపించని అమెరికా షట్‌డౌన్ ప్రభావం సోమవారం తీవ్ర ప్రభావాన్ని చూపింది. వేల మంది ప్రభుత్వోద్యోగులు వేతనాల్లేకుండా ఇళ్లలోనే ఉండటంతో కార్యాలయాలన్నీ బోసిపోయాయి. అత్యవసర సేవలు మినహా అమెరికా దాదాపుగా స్తంభించిపోయింది.