
వాషింగ్టన్: మూడ్రోజులపాటు అమెరికాను స్తంభింపజేసిన షట్‌డౌన్‌కు ముగింపు పలికే దిశగా అధికార రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమొక్రాట్ కాంగ్రెస్ సభ్యుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. సోమవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఈ చర్చల్లో డెమొక్రాట్ల ‘స్వాప్నికుల’ డిమాండ్‌పై చర్చకు సెనెట్ మెజారిటీ (రిపబ్లికన్) నేత మిచ్ మెక్‌కన్నెల్ అంగీకారం తెలిపారు. దీంతో ప్రభుత్వ నిర్వహణకు నిధులు ఇచ్చే బిల్లుపై చర్చించేందుకు మార్గం సుగమమైంది.
బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని డెమొక్రాట్ల నేత చుక్ షుమర్ ప్రకటించారు. ‘షట్‌డౌన్ మరికొద్ది గంటల్లో ముగుస్తుంద’ని షుమర్ పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో పెద్దగా కనిపించని అమెరికా షట్‌డౌన్ ప్రభావం సోమవారం తీవ్ర ప్రభావాన్ని చూపింది. వేల మంది ప్రభుత్వోద్యోగులు వేతనాల్లేకుండా ఇళ్లలోనే ఉండటంతో కార్యాలయాలన్నీ బోసిపోయాయి. అత్యవసర సేవలు మినహా అమెరికా దాదాపుగా స్తంభించిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment