ప్చ్‌.. ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ కథ ముగిసింది | Microsoft to shut down Internet Explorer Reasons Behind It | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. ఇంటర్నెట్‌ను శాసించిన ఎక్స్‌ప్లోరర్‌ కథ ముగిసింది, పతనానికి కారణాలు ఇవే!

Published Mon, Jun 13 2022 8:29 PM | Last Updated on Mon, Jun 13 2022 8:29 PM

Microsoft to shut down Internet Explorer Reasons Behind It - Sakshi

ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ కథ ముగిసింది. దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత ఎక్స్‌ప్లోరర్‌ సేవల్ని ఆపేస్తోంది మైక్రోసాఫ్ట్‌ కంపెనీ. జూన్‌ 15న ఈ యాప్‌ సేవల్ని పూర్తిగా నిలిపివేయనున్నట్లు సమాచారం. 

ఇంటర్నెట్‌ వాడకం వచ్చిన కొత్తలో బ్రౌజర్ల సంఖ్య తక్కువగా ఉండేది. ఆ టైంలో.. 1995 ఆగష్టులో విండోస్‌ 95 ప్యాకేజీ ద్వారా మైక్రోసాఫ్ట్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు.. దానిని ఫ్రీగా అందించింది. 

► తాజాగా.. జూన్‌ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పనిచేయకుండా పోతుంది అని ఒక ప్రకటన వెలువడింది. 

► 2003లో ఇంటర్నెట్‌ బ్రౌజర్‌లలో 95 శాతం వాడకం ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌దే.  కానీ.. 

► ఆ తర్వాతి కాలంలో ఇతర బ్రౌజర్ల పోటీతత్వం నడుమ ఆ పొజిషన్‌ను కాపాడుకోలేకపోయింది ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌.

► బ్రౌజర్‌ మార్కెట్‌లో స్మూత్‌ పర్‌ఫార్మెన్స్‌, ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఇలా రకరకాల కారణాలతో  పోటీతత్వంలోనూ ఎక్స్‌ప్లోరర్‌ వెనుకబడిపోయింది. పైగా వేగంగా అప్‌డేట్‌ లేకుండా సాదాసీదా బ్రౌజర్‌గా మిగిలిపోయింది. 

వీటికి తోడు హ్యాకింగ్‌ ముప్పుతో ఈ బ్రౌజర్‌ను ఉపయోగించేవాళ్లు గణనీయంగా తగ్గిపోయారు. దీంతో.. డెస్క్‌టాప్‌, ల్యాప్‌ట్యాప్లలో  జస్ట్‌ ఒక డీఫాల్ట్‌ బ్రౌజర్‌గా మిగిలిపోయింది ఇంటర్నెట్‌ ఎక్స్‌ఫ్లోరర్‌. 

► 2016 నుంచి మైక్రోసాప్ట్‌ కొత్త బ్రౌజర్‌ ఫీచర్‌ను డెవలప్‌మెంట్‌ చేయడం ఆపేసింది. ఈ టెక్ దిగ్గజం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను దశలవారీగా నిలిపివేయాలని నిర్ణయించుకోవడం అదే మొదటిసారి కూడా. 

► ఎక్స్‌ఫ్లోరర్‌ స్థానే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉంటోంది. ఇది ఇంటర్నెట్‌ ఎక్స్‌ఫ్లోరర్‌ కంటే సురక్షితమైన బ్రౌజింగ్‌ అని మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ ప్రోగ్రామర్‌ మేనేజర్‌  సీన్‌ లిండర్‌సే చెప్తున్నారు.

► ఇంటర్నెట్‌ ఎక్స్‌ఫ్లోరర్‌ ‘నైంటీస్‌, 2000వ’ దశకంలో ఎంతో మంది ఇంటర్నెట్‌ యూజర్లతో అనుబంధం పెనవేసుకుపోయింది. అందుకే విషయం తెలియగానే.. చాలామంది ఎమోషనల్‌ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement