Internet browsing
-
సగానికిపైగా వినియోగదారులకు ఇంటర్నెట్ కష్టాలు!
జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ సరఫరాకు సంబంధించి గత ఆరు నెలలుగా వందలాది ఫిర్యాదులు నమోదయ్యాయి. బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్, డీఎస్ఎల్ సేవలపై కొన్ని సంస్థలు ఇంటర్నెట్ అంతరాయంపై సర్వే నిర్వహించాయి. ఇంటర్నెట్ సేవలు అందించే కంపెనీలు దాదాపు రూ.75వేల కోట్లతో వినియోగదారులకు సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి. అయినప్పటికీ కనెక్టివిటీ కష్టాలు మాత్రం తప్పడం లేదు. నిరంతరం ఇంటర్నెట్ సరఫరాలో తీవ్ర అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో 56శాతం మంది నెట్ కనెక్షన్లో అంతరాయం వల్ల ఇబ్బందిపడుతూ సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. కంపెనీలు ముందుగా వాగ్ధానం చేసిన వేగం కంటే నెట్ తక్కువ వేగంతో వస్తుందని ఫిర్యాదులో తెలిపారు. వీరిలో 21శాతం మంది ప్రతి నెలా మూడుసార్లకు పైగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశం అంతటా 303 జిల్లాల నుంచి 51,000 మందితో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 67శాతం పురుషులు, 33శాతం మహిళలు ఉన్నారు. 46శాతం మంది వినియోగదారులు తమ ఫిర్యాదులను పరిష్కరించడానికి సర్వీస్ ప్రొవైడర్లు 24 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారని తెలిపారు. ఇదీ చదవండి: డేటా సెంటర్లలోకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రిమోట్ వర్క్, వర్క్‌ఫ్రంహోం, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని నివేదిక చెబుతుంది. 70శాతం మంది యూజర్లు ఇంటర్నెట్ సరఫరాలో మెరుగైన సేవలందించే ఇతర సర్వీస్ ప్రొవైడర్‌కు మారడానికి ఆసక్తిగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. కొన్ని సర్వేల నివేదికల ప్రకారం దేశంలో ఇంటర్నెట్ వినియోగించే సరళి ఈ కింది విధంగా ఉంది. * ఇంటర్నెట్ వ్యాప్తి 2012లో దేశవ్యాప్తంగా 12.6 శాతం నుంచి 2022 నాటికి 48.7 శాతానికి పెరిగింది. * ప్రపంచ వ్యాప్తంగా 692 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులతో భారత్ రెండో స్థానంలో ఉంది. * గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ కేంద్రాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు ఎక్కువ. * తక్కువ ధరలకే ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నప్పటికీ..పేదరికం, అవగాహన లేకపోవడం, స్పష్టమైన లింగ వ్యత్యాసం వంటి కారణాల వల్ల దేశంలో ఇంటర్నెట్ వినియోగం ఇంకా ఆశించినమేర ఉండడం లేదు. * 2028 నాటికి 244 మిలియన్ కుటుంబాలు ఇంటర్నెట్ వినియోగిస్తాయని అంచనా. * 2020 నాటికి దేశంలో 622 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య వచ్చే ఐదేళ్లలో దాదాపు 45 శాతం పెరుగుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2025 నాటికి 900 మిలియన్లకు చేరుకోనుంది. -
ప్చ్.. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది
ఇంటర్నెట్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది. దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత ఎక్స్‌ప్లోరర్ సేవల్ని ఆపేస్తోంది మైక్రోసాఫ్ట్ కంపెనీ. జూన్ 15న ఈ యాప్ సేవల్ని పూర్తిగా నిలిపివేయనున్నట్లు సమాచారం. ►ఇంటర్నెట్ వాడకం వచ్చిన కొత్తలో బ్రౌజర్ల సంఖ్య తక్కువగా ఉండేది. ఆ టైంలో.. 1995 ఆగష్టులో విండోస్ 95 ప్యాకేజీ ద్వారా మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు.. దానిని ఫ్రీగా అందించింది. ► తాజాగా.. జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పనిచేయకుండా పోతుంది అని ఒక ప్రకటన వెలువడింది. ► 2003లో ఇంటర్నెట్ బ్రౌజర్లలో 95 శాతం వాడకం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్దే. కానీ.. ► ఆ తర్వాతి కాలంలో ఇతర బ్రౌజర్ల పోటీతత్వం నడుమ ఆ పొజిషన్‌ను కాపాడుకోలేకపోయింది ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. ► బ్రౌజర్ మార్కెట్లో స్మూత్ పర్ఫార్మెన్స్, ఇంటర్నెట్ స్పీడ్ ఇలా రకరకాల కారణాలతో పోటీతత్వంలోనూ ఎక్స్‌ప్లోరర్ వెనుకబడిపోయింది. పైగా వేగంగా అప్డేట్ లేకుండా సాదాసీదా బ్రౌజర్‌గా మిగిలిపోయింది. ► వీటికి తోడు హ్యాకింగ్ ముప్పుతో ఈ బ్రౌజర్‌ను ఉపయోగించేవాళ్లు గణనీయంగా తగ్గిపోయారు. దీంతో.. డెస్క్‌టాప్, ల్యాప్‌ట్యాప్‌లలో జస్ట్ ఒక డీఫాల్ట్ బ్రౌజర్‌గా మిగిలిపోయింది ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్. ► 2016 నుంచి మైక్రోసాప్ట్ కొత్త బ్రౌజర్ ఫీచర్‌ను డెవలప్మెంట్ చేయడం ఆపేసింది. ఈ టెక్ దిగ్గజం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను దశలవారీగా నిలిపివేయాలని నిర్ణయించుకోవడం అదే మొదటిసారి కూడా. ► ఎక్స్‌ఫ్లోరర్ స్థానే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉంటోంది. ఇది ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ కంటే సురక్షితమైన బ్రౌజింగ్ అని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రోగ్రామర్ మేనేజర్ సీన్ లిండర్సే చెప్తున్నారు. ► ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ ‘నైంటీస్, 2000వ’ దశకంలో ఎంతో మంది ఇంటర్నెట్ యూజర్లతో అనుబంధం పెనవేసుకుపోయింది. అందుకే విషయం తెలియగానే.. చాలామంది ఎమోషనల్ అవుతున్నారు. Internet Explorer is shutting down in three days. I haven't used IE in a decades but it was the browser I had used for the majority if my childhood. Whether you loved or hated Internet Explorer, it'll be the end if an era 💛 — Caesár (@CnaVD) June 11, 2022 ProductHunt: After 27 years of service, Microsoft is going to retire Internet Explorer for good on June 15th. pic.twitter.com/EEpvrx34FQ — ProductGram (@ProductGrams) June 12, 2022 -
నెట్ యూజర్లపై నిఘా
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్లపై క్రమంగా నిఘా కన్ను పెరుగుతోంది. ఇంతవరకు సర్వీసు ప్రొవైడర్ల వద్ద మాత్రమే ఉండే యూజర్ల బ్రౌజింగ్ హిస్టరీ వివిధ దేశాల పోలీసు వ్యవస్థ చేతుల్లోకి వెళుతోంది. ఈ విషయంలో బ్రిటన్ అన్ని దేశాలకన్నా ఒక అడుగు ముందే ఉన్నది. ఇంతవరకు యూజర్లు ఎన్ని వెబ్సైట్లలో బ్రౌజ్ చేశారో సమస్త సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా బ్రిటన్ ‘కొత్త ఇన్వెస్ట్గేటరీ పవర్స్ బిల్’ తీసుకొస్తోంది. ఇంటర్నెట్పై పోలీసులకు విస్తృత అధికారాలను కల్పిస్తున్న ఈ బిల్లు ముసాయిదాను రూపొందించింది. ఈ బిల్లులో పేర్కొన్న పోలీసు అధికారాల ప్రకారం వారు ఎప్పుడైనా, ఏ యూజర్ బ్రౌజింగ్ హిస్టరీని ఇమ్మంటే ఆ యూజర్ బ్రౌజింగ్ హిస్టరీ కాదనుకుండా సంబంధిత సర్వీసు ప్రొవైడర్ ఇవ్వాల్సిందే. ఇందుకోసం ప్రతి యూజర్ బ్రౌజింగ్ హిస్టరీ ఏడాది కాలంపాటు సర్వీస్ ప్రొవైడర్ తప్పనిసరిగా భద్రపర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వానికున్న కంప్యూటర్ హ్యాకింగ్ అధికారాలను కూడా విస్తృతం చేశారు. మొదటి బిల్లులో పోలీసులకు మాత్రమే హ్యాకింగ్ అధికారాలు ఇవ్వగా ఇప్పుడు పునర్ రూపొందించిన బిలులో ఆదాయం పన్నుశాఖ, హోం శాఖల అధికారాలకు కూడా హ్యాకింగ్ అధికారాలను కట్టబెట్టారు. మొదటి బిల్లులో పోలీసుల్లో ముఖ్యదర్యాప్తు బృందానికి మాత్రమే, అదీ దొంగ వెబ్సైట్ల యూజర్ల బ్రౌజింగ్ వివరాలను తెలుసుకునే అవకాశం ఉండగా, పునర్ రూపొందించిన బిల్లులో ప్రతి యూజర్ బ్రౌజింగ్ హిస్టరీని పోలీసు వ్యవస్థలోని ప్రతి విభాగానికి తెలుసుకునే హక్కును కల్పించారు. టెలిఫోన్ కాల్ డాటాను అడిగట్లే ఇప్పుడు(ఇంటర్నెట్ కనెక్షన్ రికార్డ్స్-ఐసీఆర్) యూజర్ బ్రౌజింగ్ వివరాలను అడుగుతారు. మొదటి బ్రౌజింగ్ బిల్లుపైనే విపక్షాల నుంచి విమర్శలు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వం పోలీసు అధికారుల ఒత్తిడి మేరకు వారికి విస్తృత అధికారాలను కల్పిస్తూ సవరించిన బిల్లును తీసుకొచ్చింది. ఇంకా ఈ బిల్లును బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఆధునిక యుగంలో నేరాల నైజం మారిపోయిందని, సున్నితమైన పంథాలో నేరాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలంటే ఇంటర్నెట్ యూజర్లపై తమ పట్టు ఉండాలన్నది బ్రిటన్ పోలీసు అధికారుల వాదన. దీనిపై సోషల్ మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి. -
ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం.. రోజుకు 2.2 గంటలు ఫోన్‌పైనే..!
న్యూఢిల్లీ: భారత యువజనం రోజుకు సగటున 2.2 గంటల పాటు మొబైల్ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ను బ్రౌజ్ చేస్తున్నారని అంతర్జాతీయ రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ టీఎన్ఎస్ సర్వే నివేదిక ఒకటి వెల్లడించింది. భారత్‌లో 16-30 ఏళ్ల వయస్కులు సగటున రోజుకు 2 గంటల 20 నిమిషాల పాటు(ఏడాదికి 34 రోజులు) మొబైల్ ఫోన్లపై ఇంటర్నెట్ కోసం వెచ్చిస్తున్నారని ఈ సంస్థ వెల్లడించింది. అయితే ఇది అంతర్జాతీయ సగటు (రోజుకు 3.2 గంటలు/ ఏడాదికి 49 రోజులు) కంటే తక్కువగానే ఉందని వివరించింది. భారత్‌లో 31-45 ఏళ్ల వయస్కులు రోజుకు సగటున 1.8 గంటల పాటు, 46-65 ఏళ్ల వయస్కులు రోజుకు సగటున 1.5 గంటల పాటు మొబైల్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ను బ్రౌజ్ చేస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. -
ట్రావెల్ టిప్స్
ఎక్కడికెళ్లినా సుందరప్రదేశాలను కెమేరాలో బంధించాలని, జ్ఞాపకాల ద్వారా ప్రయాణ ఆనందాలను పదిలపరుచుకోవాలని చాలామంది ఆశిస్తారు. అయితే, అందుకు తగిన ప్రణాళిక లేకపోవడంతో సరైన ఫొటోలను తీసుకోలేకపోయామని బాధపడుతుంటారు. ఈ పరిస్థితి రాకుండా ఉండటానికి... టిప్: 01: బరువైన కెమేరాలు విమానాల్లో తీసుకెళ్లడానికి నిబంధనలు ఉంటాయి. దుస్తులంత తేలికైన కెమేరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వెంట తీసుకెళ్లడానికి ఇబ్బందిలేని పాకెట్ కెమెరాలు ఉత్తమం. ముందుగా మీరు వెళ్లబోయే చోటు ఎలాంటిదో తెలుసుకోండి. సాధారణ ఇంటర్నెట్ బ్రౌజింగ్ మెరుగైన సమాచారం ఇవ్వకపోవచ్చు. కొన్ని వెబ్‌సైట్స్‌లో ట్రావెల్ ఎక్స్పర్ట్స్ తమ విలువైన సమాచారం పొందుపరుస్తుంటారు. అందుకని, లోతైన పరిశోధన అవసరం. టిప్: 02: సూర్యాస్తమయానికి ముందే నిద్రలేవాలి. అప్పుడే ఉషోదయ వేళలో ఉండే ప్రకృతి అద్భుత సౌందర్యాన్ని కెమేరాలో బంధించవచ్చు. అలాగే సూర్యాస్తమ సమయమూ అత్యద్భుతంగా ఉంటుంది. టిప్: 03: ప్రయాణంలో కెమేరా ఫీచర్స్ గురించి తెలుసుకుంటూ వెళితే, సరైన ఫొటో మీకు లభించదు. బయల్దేరకముందే కెమరా, లెన్స్, ఫ్లాష్.. వంటివి ఇంటి వద్దే చూసి, నేర్చుకోవాలి. టిప్: 04: దేవాలయాలు, ఆర్ట్ గ్యాలరీలు, నృత్యం, సంగీతం.. వంటివి ఫొటోలలో బంధించేముందు వాటికి సంబంధించిన కొన్ని పుస్తకాలను చదవడం వల్ల మరింత పరిజ్ఞానం లభిస్తుంది. దీని వల్ల ఒక క్రమపద్ధతిలో కళాత్మకంగా ఫొటోలు తీసే నేర్పు అలవడుతుంది. టిప్: 05: టూర్ అన్నాం కదా అని అన్నీ వేగంగా చూసేస్తే సరిపోతుంది అనుకోకూడదు. దారిలో ఎంతో మంది వ్యక్తులు ఉంటారు. ఆ ప్రాంత ప్రత్యేకత ఫొటోల ద్వారా తెలియజేయాలను కుంటే స్థానికులతో మాట్లాడితే సరైన సమాధానం లభిస్తుంది. -
మెరుపు బ్రౌజింగ్ కోసం..
నెట్‌బ్రౌజింగ్ మెరుపువేగంతో జరిగిపోవాలంటే ఎన్నో చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. బ్రౌజర్ ఓపెన్ చేసిన ప్రతిసారీ వెబ్సైట్ పేరు మొత్తం టైప్ చేయాల్సిన పనిలేదు. కొంత శ్రమకోర్చి షార్ట్‌కట్‌లను ఏర్పాటు చేసుకుంటే మీరు తరచూ చూసే వెబ్సైట్లను చటుక్కున ఓపెన్ చేయవచ్చు. మీరు క్రోమ్ బ్రౌజర్ వాడుతూంటే ఓమ్నీ బాక్స్ (వెబ్ అడ్రస్ టైప్ చేసే చోటు)పై రైట్ క్లిక్ చేసి ‘ఎడిట్ సెర్చ్ ఇంజిన్స్’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఒక డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. దాంట్లో అదర్ సెర్చ్ ఇంజిన్స్ అని ఉన్న చోట మీరు తరచూ బ్రౌజ్ చేసే వెబ్‌సైట్‌ను ఏ ‘కీవర్డ్’తో ఓపెన్ చేయాలనుకుంటున్నారో, యూఆర్ఎల్ లను టైప్ చేయండి. అంతే. ఆ తరువాత మీరు కేవలం ఆ కీవర్డ్ ఒక్కటి కొడితే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మౌస్ ముట్టుకోకుండానే... కొంతమందికి టైపింగ్, ఇంకొంతమందికి మౌస్ క్లిక్లంటే పరమచిరాకు. అలాంటి వారికోసం కీబోర్డు షార్ట్కట్లు ఎంతో ఉపయోగపడతాయి. వీలైనన్ని ఎక్కువ కీబోర్డు షార్ట్‌కట్‌లను నేర్చుకుంటే సర్ఫింగ్ మరింత సులువు అవుతుంది. టైపింగ్ కంటే మౌస్ క్లిక్‌ల ద్వారా వేళ్లు, చేతి కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుందన్నది గమనార్హం. కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలంటే ‘కంట్రోల్ + టీ’, ఉపయోగిస్తున్న ట్యాబ్‌ను క్లోజ్ చేసేందుకు ‘కంట్రోల్ + డబ్ల్యూ’, ఒక ట్యాబ్ నుంచి మరోదానికి వెళ్లేందుకు ‘కంట్రోల్ + ట్యాబ్’, ఉపయోగిస్తున్న పేజీని రిఫ్రెష్ చేసేందుకు ‘ఎఫ్5’ ఫంక్షన్ కీ, ఫుల్స్క్రీన్లోకి మారేందుకు, వెనక్కు వచ్చేందుకు ‘ఎఫ్11’, అడ్రస్బార్లోని విషయాలను హైలైట్ చేసేందుకు, కర్సర్‌ను అక్కడ ఉంచేందుకు ‘ఎఫ్6’, పనికొస్తాయి.