ట్రావెల్ టిప్స్ | Travel Tips | Sakshi
Sakshi News home page

ట్రావెల్ టిప్స్

Published Mon, May 4 2015 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

ట్రావెల్ టిప్స్

ట్రావెల్ టిప్స్

ఎక్కడికెళ్లినా సుందరప్రదేశాలను కెమేరాలో బంధించాలని, జ్ఞాపకాల ద్వారా ప్రయాణ ఆనందాలను పదిలపరుచుకోవాలని చాలామంది ఆశిస్తారు. అయితే, అందుకు తగిన ప్రణాళిక లేకపోవడంతో సరైన ఫొటోలను తీసుకోలేకపోయామని బాధపడుతుంటారు. ఈ పరిస్థితి రాకుండా ఉండటానికి...

టిప్: 01: బరువైన కెమేరాలు విమానాల్లో తీసుకెళ్లడానికి నిబంధనలు ఉంటాయి. దుస్తులంత తేలికైన కెమేరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వెంట తీసుకెళ్లడానికి ఇబ్బందిలేని పాకెట్ కెమెరాలు ఉత్తమం. ముందుగా మీరు వెళ్లబోయే చోటు ఎలాంటిదో తెలుసుకోండి. సాధారణ ఇంటర్‌నెట్ బ్రౌజింగ్ మెరుగైన సమాచారం ఇవ్వకపోవచ్చు. కొన్ని వెబ్‌సైట్స్‌లో ట్రావెల్ ఎక్స్‌పర్ట్స్ తమ విలువైన సమాచారం పొందుపరుస్తుంటారు. అందుకని, లోతైన పరిశోధన అవసరం.

టిప్: 02: సూర్యాస్తమయానికి ముందే నిద్రలేవాలి. అప్పుడే ఉషోదయ వేళలో ఉండే ప్రకృతి అద్భుత సౌందర్యాన్ని కెమేరాలో బంధించవచ్చు. అలాగే సూర్యాస్తమ సమయమూ అత్యద్భుతంగా ఉంటుంది.
 
టిప్: 03: ప్రయాణంలో కెమేరా ఫీచర్స్ గురించి తెలుసుకుంటూ వెళితే, సరైన ఫొటో మీకు లభించదు. బయల్దేరకముందే కెమరా, లెన్స్,

ఫ్లాష్.. వంటివి ఇంటి వద్దే చూసి, నేర్చుకోవాలి.
 
టిప్: 04: దేవాలయాలు, ఆర్ట్ గ్యాలరీలు, నృత్యం, సంగీతం.. వంటివి ఫొటోలలో బంధించేముందు వాటికి సంబంధించిన కొన్ని పుస్తకాలను చదవడం వల్ల మరింత పరిజ్ఞానం లభిస్తుంది. దీని వల్ల ఒక క్రమపద్ధతిలో కళాత్మకంగా ఫొటోలు తీసే నేర్పు అలవడుతుంది.
 
టిప్: 05: టూర్ అన్నాం కదా అని అన్నీ వేగంగా చూసేస్తే సరిపోతుంది అనుకోకూడదు. దారిలో ఎంతో మంది వ్యక్తులు ఉంటారు. ఆ ప్రాంత ప్రత్యేకత ఫొటోల ద్వారా తెలియజేయాలను కుంటే స్థానికులతో మాట్లాడితే సరైన సమాధానం లభిస్తుంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement