సాక్షి,హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ బాత్‌రూమ్‌లో కెమెరాలు లభ్యమైన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎంఆర్ కాలేజీ గాల్ట్స్ హాస్టల్ ఘటనపై విచారణకు మహిళా కమిషన్ సెక్రెటరీ ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సైబారాబాద్ సీపీ అవినాష్ మహంతికి సూచించారు.
ఈ సందర్భంగా , రాష్ట్ర ఉమెన్ కమిషన్ మెంబర్ పద్మజా రమణ మాట్లాడుతూ.. సీఎంఆర్ గర్ల్స్ కాలేజీలో జరిగిన ఘటనపై స్టూడెంట్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. పూర్తి వివరాలు ఉమెన్ కమిషన్ చైర్మన్‌కి అందిస్తాం. ఉమెన్ కమిషన్ చైర్మన్ సుమోటాగా కేసు తీసుకున్నారు. అటు సీఎంఆర్ కాలేజ్ మేనేజ్మెంట్‌కి నోటీసులు ఇచ్చాం. స్టూడెంట్స్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా తేడా జరిగితే సీఎంఆర్ గర్ల్స్ కాలేజీ యాజమాన్యంపై సీరియస్ యాక్షన్ ఉంటుంది’ అని హెచ్చరించారు.
బాత్‌రూమ్‌లో లభ్యమైన కెమెరాలపై విద్యార్థినుల చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. న్యూ ఇయర్ వేడుకల్లో తాముండగా.. అగంతకులు హాస్టల్ బాత్‌రూమ్‌లో కెమెరాలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా బాత్‌రూమ్‌లలో మూడు చోట్ల కెమెరాలను గుర్తించినట్లు విద్యార్థునులు స్పష్టం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన స్మార్ట్ ఫోన్‌లలో ఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. అయితే, ఈ తరుణంలో గురువారం సాయంత్రం సీఎంఆర్ కాలేజీ హాస్టల్‌ను మహిళా కమిషన్ తనిఖీ చేసింది. అనంతరం, సీఏంఆర్ కాలేజి హాస్టల్లో జరిగిన నిజానిజాలను తేల్చాలని సైబారాబాద్ సీపీ అవినాష్ మహంతికి సూచించింది.
👉చదవండి : సీక్రెట్ కెమెరాలపై విద్యార్థినుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment