అద్దెకు తీసుకున్న కెమెరాతో పరార్‌ | Man Theft Rental Camera In Hyderabad | Sakshi
Sakshi News home page

అద్దెకు తీసుకున్న కెమెరాతో పరార్‌

Feb 22 2021 2:43 PM | Updated on Feb 22 2021 2:45 PM

Man Theft Rental Camera In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వారం రోజులు అవుతున్నా కెమెరా తీసుకురాలేదు. వారికి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వస్తోంది.

అమీర్‌పేట: ఓఎల్‌ఎక్స్‌ ద్వారా కెమెరాను అద్దెకు తీసుకున్న వ్యక్తులు కనిపించకుండా పోయారు. దీంతో బాధితుడు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కడప జిల్లా ఎర్రగొండ్లకు చెందిన విక్రమ్‌కుమార్‌రెడ్డి అమీర్‌పేట శవభాగ్‌లోని చిలుకూరి బాలాజీ బాయ్స్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. షార్డ్‌ ఫిలీం తీసేందుకు గత ఏడాది రూ.60 వేలు వెచ్చించి కెనాన్‌ కెమెరా కొనుగోలు చేశాడు. కాగా ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి కెమెరాను అద్దెకు ఇవ్వడం ప్రారంభించాడు.

ఈ నెల 16న లింగరాజు, కిషోర్‌ అనే వ్యక్తులు వచ్చి రెండు రోజుల పాటు కెమెరా అద్దెకు కావాలని తీసుకుని వెళ్లారు. వారం రోజులు అవుతున్నా కెమెరా తీసుకురాలేదు. వారికి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వస్తోంది. దీంతో విక్రమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఓ తండ్రి కన్న కూతురునే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement