camera
-
ప్రపంచంలో అతిచిన్న కెమెరా ఇదే
ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఇమేజ్ సెన్సర్ చిప్. అమెరికన్ కెమెరాల తయారీ కంపెనీ ‘ఓమ్నివిజన్’ కెమెరాల్లో ఉపయోగించే ఈ ఇమేజ్ సెన్సర్ చిప్‌ను ‘ఓవీఎం 6948’ పేరుతో ఇటీవల రూపొందించింది.‘చిప్ ఆన్ టిప్’ అనే ప్రచారంతో అందుబాటులోకి తెచ్చిన ఈ చిప్ ప్రపంచంలోనే అత్యంత చిన్న ఇమేజ్ సెన్సర్ చిప్‌గా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. దీని పొడవు 0.65 మి.మీ., వెడల్పు 0.65 మి.మీ., మందం 1.158 మి.మీ. అంటే, దాదాపు ఒక పంచదార రేణువంత పరిమాణంలో ఉంటుంది.ఇది 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఫొటోలు తీయడానికి ఉపయోగపడుతుంది. ఎండోస్కోప్ సహా వివిధ వైద్య పరికరాల కెమెరాల్లో ఉపయోగించడానికి ఇది అత్యంత అనువుగా ఉంటుంది. ఇది సెకనుకు 30 ఫ్రేముల సామర్థ్యంతో వీడియోలు కూడా తీయగలదు. -
ఈ ఐఫోన్ వాడుతుంటే.. మీకే ఈ అలర్ట్!
ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) వినియోగదారులకు యాపిల్ ముఖ్యమైన అలర్ట్‌ను జారీ చేసింది. కొన్ని నెలల క్రితం తయారైన ఐఫోన్ 14 ప్లస్ యూనిట్లలో తలెత్తిన రియర్ కెమెరా సమస్య కోసం యాపిల్ ప్రత్యేక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ప్రభావితమైన ఫోన్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అధీకృత యాపిల్ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద సర్వీసింగ్ పొందవచ్చని కంపెనీ ప్రకటించింది.రియర్ కెమెరా సమస్య తమ హ్యాండ్‌సెట్‌పై ప్రభావం చూపిందో లేదో కస్టమర్లు తమ క్రమ సంఖ్యను కంపెనీకి అందించడం ద్వారా ధ్రువీకరించుకోవచ్చు. ఐఫోన్ 14 ప్లస్‌లో రియర్ కెమెరాకు మరమ్మతుల కోసం ఇప్పటికే డబ్బు చెల్లించినవారు ఆ మొత్తాన్ని రీఫండ్ పొందవచ్చు.సమస్య ఇదే..ఐఫోన్ 14 ప్లస్‌లో రియర్ కెమెరా సమస్య మరమ్మతు కోసం యాపిల్ ప్రత్యేక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందుకోసం సపోర్ట్ పేజీని ఏర్పాటు చేసింది. అసలేంటి సమస్య అంటే.. రియర్ కెమెరాతో ఫొటో తీసినప్పుడు ప్రివ్యూ చూపించడం లేదు. అయితే ఈ చాలా తక్కువ ఫోన్లలోనే ఉత్పన్నమైనట్లు కంపెనీ పేర్కొంది. ఇవి 2023 ఏప్రిల్ 10 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 28 మధ్య తయారైనవి.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అదిరిపోయే ప్రయోజనాలు!అయితే తమ ఫోన్లలో ఇలా సమస్య ఉంటే కంపెనీ ఉచిత సర్వీసింగ్ ప్రోగ్రామ్ పొందడానికి అర్హత ఉందా.. లేదా అన్న విషయాన్ని యాపిల్ ఏర్పాటు చేసిన సపోర్ట్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నంబర్ నమోదు చేస్తే మీ ఫోన్‌కి ఫ్రీ సర్వీసింగ్ వస్తుందో రాదో తెలుస్తుంది. యాపిల్ సర్వీస్ ప్రోగ్రామ్ ఫోన్ కొనుగోలు తేది నుంచి మూడేళ్లపాటు వర్తిస్తుంది. -
ప్రపంచంలోనే పే....ద్ద కెమెరా!
ఏకంగా 3,200 మెగాపిక్సెల్స్. సామర్థ్యం. 5.5 అడుగుల ఎత్తు, ఏకంగా 12.25 అడుగల పొడవుతో పెద్ద సైజు కారును తలపించే పరిమాణం. దాదాపు 2,800 కిలోల బరువు! 320–1,050 ఎన్ఎం వేవ్‌లెంగ్త్ రేంజ్. ఒక్కో ఇమేజ్ కవరేజీ పరిధిలోకి కనీసం 40 పూర్ణ చంద్రులు పట్టేంత ఏరియా! ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా తాలూకు విశేషాల్లో ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంతకీ ఇది ఎక్కడుందంటారా? చిలీలో రూపుదిద్దుకుంటున్న వెరా రూబిన్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేస్తున్న సరికొత్త టెలిస్కోప్‌లో. రాజధాని శాంటియాగోకు 500 కి.మీ. దూరంలోని సెరో పాచ్న్ పర్వత శిఖరంపై 2015 నుంచీ నిర్మాణంలో ఉన్న ఈ అబ్జర్వేటరీ త్వరలో ప్రారంభం కానుంది. అందులోని ఈ అతి పెద్ద కెమెరా ప్రతి మూడు రోజులకోసారి రాత్రివేళ దాని కంటికి కని్పంచినంత మేరకూ ఆకాశాన్ని ఫొటోల్లో బంధించనుంది. అలా అంతరిక్ష శాస్త్రవేత్తలకు పదేళ్లపాటు రోజుకు కనీసం వెయ్యి చొప్పున ఫొటోలను అందుబాటులోకి తెస్తుంది! అంటే రోజుకు 20 టెరాబైట్ల డేటాను అందజేస్తుంది. ఇది ఒక యూజర్ నెట్‌ఫ్లిక్స్‌లో సగటున మూడేళ్లపాటు చూసే ప్రోగ్సామ్స్, లేదా స్పాటిఫైలో ఏకంగా 50 ఏళ్ల పాటు వినే పాటల డేటాకు సమానం! ఈ క్రమంలో మనకిప్పటిదాకా తెలియని ఏకంగా 1,700 కోట్ల కొత్త నక్షత్రాలను, 2,000 కోట్ల నక్షత్ర మండలాలను ఈ కెమెరా వెలుగులోకి తెస్తుందని భావిస్తున్నారు. దీన్ని లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ (ఎల్ఎస్ఎస్టీ) కెమెరాగా పిలుస్తున్నారు. అంతేగాక అంతరిక్షంలో సంభవించే చిన్నా పెద్దా మార్పులకు సంబంధించి ప్రతి రాత్రీ ఏకంగా కోటి అలెర్టులను కూడా ఈ టెలిస్కోప్ పంపనుందట కూడా! ‘‘ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే. వెరా రూబిన్ అబ్జర్వేటరీ మున్ముందు మరెన్నో ఘనకార్యాలు చేయనుంది’’ అని ఆ సంస్థ ఆస్ట్రానమిస్టు క్లేర్ హిగ్స్ చెబుతున్నారు. కృష్ణపదార్థం (డార్క్ మ్యా టర్), కృష్ణ శక్తి (డార్క్ ఎనర్జీ) వంటి పలు మిస్టరీలను ఛేదించడంలో కూడా కీలకపాత్ర పోషించే చాన్సుందన్నారు. ఈ టెలిస్కోప్‌కు 2016లో మరణించిన అమెరికా అంతరిక్ష శాస్త్రజు్ఞడు వెరా రూబిన్ పేరు పెట్టారు. ఇది ఏడాది లోపులో అందుబాటులోకి వస్తుందని అంచనా.– సాక్షి, నేషనల్ డెస్క్ -
తల్లిని కెమెరాలో బంధిస్తున్న ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య (ఫోటోలు)
-
గుడ్లవల్లేరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనలో వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలను అమర్చి వీడియోలను చిత్రీకరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎన్నో రోజులుగా వ్యవహారం జరుగుతున్నా బయటకెందుకు రాలేదని ప్రశి్నంచింది. అర్థరాత్రి వరకూ విద్యార్థినులు ధర్నా చేయడం.. ఘటనపై వివిధ పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచి్చనట్లు ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.పత్రికా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీచేసింది. విద్యార్థినుల వీడియోలను రహస్య కెమెరాలతో రికార్డ్ చేసి, వాటిని అమ్మడం వంటి వ్యవహారాలు జరగడం అత్యంత దుర్మార్గమంటూ మండిపడింది. ఈ విషయంలో కళాశాల యాజమాన్యం ఎందుకింత నిర్లక్ష్యంగా ఉందని తీవ్రస్థాయిలో ప్రశి్నంచింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సైతం తమకు వివరించాలని అందులో పేర్కొంది. -
కొత్త ఫోన్: ప్రీమియం కెమెరా ఫీచర్స్ బడ్జెట్ ధరలోనే..
తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లు అందించే మొబైల్ బ్రాండ్ పోకో (Poco) భారత్‌లో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న పోకో ఎం6 (Poco M6) సిరీస్‌కి ‘పోకో ఎం6 ప్లస్ 5జీ’ (Poco M6 Plus 5G) పేరుతో ఇంకొక ఫోన్‌ను జోడించింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే పోకో ఎం6, పోకో ఎం6 ప్రో మోడల్స్ ఉన్నాయి.Poco M6 Plus స్పెసిఫికేషన్స్ » స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ (యాక్సిలరేటెడ్ ఎడిషన్) » గరిష్టంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ » అదనంగా 8GB వర్చువల్ ర్యామ్» ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ ఓఎస్» 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.79-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే» డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ 3x ఇన్-సెన్సార్ జూమ్ సపోర్ట్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో 108-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ » సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా» 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5030mAh బ్యాటరీ» సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్Poco M6 Plus ధర, లభ్యతపోకో ఎం6 ప్లస్ 5జీ గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే 6GB + 128GB వేరియంట్ ధర రూ.13,499. అదే 8GB + 128GB వేరియంట్ అయితే రూ. 14,499. ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. -
రీల్స్ కోసం కెమెరా కొనేందుకు ఓనర్ ఇంట్లో చోరీ
ఢిల్లీ: ఇన్‌స్ట్రామ్‌లో రీల్స్ చేసి ఫేమస్ కావాలనుకున్న ఓ పని మనిషి కెమెరా కొనుక్కొవటం కోసం.. ఓనర్ ఇంట్లోనే రూ.లక్షల విలువైన బంగారు నగలను చోరీ చేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకొంది. నగలతో పరారైన ఆమెను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వివరాలు.. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఓ బంగ్లాలో నీతూ యాదవ్ అనే మహిళ పని చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ కావాలనుంది.అందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి పోస్టు చేస్తుండేది. అక్కడితో ఆగకుండా యూట్యూబ్ ఒక ఛానెల్‌ను ఓపెన్ చేసి డబ్బు సంపాదించాలిని ప్లాన్ వేసింది. అయితే దానికి రీల్స్ చేసేందుకు మంచి క్వాలిటీ ఉన్న డీఎస్ఎల్ఆర్ కెమెరా కొనాలనుకుంది. అయితే ఆమె వద్ద అంత డబ్బు లేకపోవడంతో కుటుంబ సభ్యులును డబ్బు అడిగింది. కానీ వారం సహాయం చేయకపోవటంతో తాను పనిచేసే ఓనర్ ఇంట్లోనే చోరీ చేయాలని నిర్ణయించుకుంది. ఓనర్లు లేని సమయం చూసి బంగారం, వెండి వస్తువులతో పారిపోయింది. ఇంట్లో కనిపించని ఆమెకు ఒనర్లు కాల్ చేస్తే.. ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చింది. ఇంట్లో ఉండే నగలు కనిపించకపోవడంతో పనిమనిషిపై వచ్చి.. ఓనర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక.. స్థానికుల సమాచారంతో నగల బ్యాగ్‌తో ఢిల్లీ దాటాలనుకున్న ఆమెన పోలీసులు అరెస్టు చేశారు. అయితే కెమెరాను కొనడానికి ఎవ్వరు అప్పుగానైనా డబ్బు ఇవ్వకపోవటంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడి అయినట్లు పోలీసులు తెలిపారు. -
చిత్తంతో చిత్రప్రయాణం
ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగికి ఆఫీస్‌కు అవతలి ప్రపంచంపై దృష్టి మళ్లదు. పనే ప్రపంచం అవుతుంది. దీప్తి ఆస్థాన మాత్రం ఆఫీస్ క్యూబికల్‌కు ఆవలి ప్రపంచాన్ని చూడాలనుకుంది. కెమెరా తన నేస్తం అయింది. దేశమంతా తిరుగుతూ స్త్రీల జీవితంలోని ఎన్నో కోణాలను కెమెరా కంటితో ఆవిష్కరిస్తోంది... సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం నుంచి సెల్ఫ్ లెర్నింగ్ ఫోటోగ్రాఫర్‌గా ప్రయాణం దీప్తి అస్థాన జీవన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆఫీసు క్యూబికల్ అవతల తనకు తెలియని ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంది. ఎక్కడికి ప్రయాణం చేసినా కెమెరా తనతోపాటు వచ్చేది. సంభాషించేది. కెమెరా ద్వారా ప్రయాణాలలో లోతైన అర్థాన్ని, సామాజిక ప్రయోజ నాన్ని కనుగొంది దీప్తి. మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి, తాను కలుసుకున్న వ్యక్తుల జీవిత కథలను ప్రపంచంతో పంచుకోవడానికి ఫొటోగ్రఫీ దీప్తికి బలమైన మాధ్యమంలా ఉపయోగపడింది. సాధారణంగా దూర ప్రయాణాలు అనగానే ప్రముఖ, ప్రసిద్ధ స్థలాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ దీప్తి మాత్రం అనామక, అంతగా ఎవరూ పట్టించుకోనిప్రాంతాలకు వెళ్లేది. ఆప్రాంతాల గురించి ఎవరూ పనిగట్టుకొని ఫొటోలు తీసి ఉండరు. నాలుగు ముక్కలు రాసి ఉండరు. ఆ పని దీప్తి చేసింది. ఆ తరువాత...‘ఉమెన్ ఇండియా’ప్రాజెక్ట్‌తో తన ప్రయాణాన్ని మరింత విస్తృతం చేసుకుంది. ఇది ఒకటి రెండు నెలల పరిమిత కాల ప్రయాణం కాదు. సంవత్సరాలుగా సాగిన ప్రయాణం. పట్టణాల్లోని మార్పుల సంగతి ఎలా ఉన్నా, పల్లెప్రజలు మాత్రం గతంలోనే ఉన్నారని గ్రహించింది దీప్తి. బాల్య వివాహాల నుంచి ఆడపిల్లలు చదువుకు దూరం కావడం వరకు కెమెరా కంటితో ఎన్నో సమస్యలను లోకం దృష్టికి తీసుకువచ్చి మహిళలు తమ గళం విప్పడానికి ఒక వేదికను నిర్మించింది. సోషల్ మీడియా దృష్టిలో పడని మహిళల సమస్యలను అదే మీడియా ద్వారా నలుగురి దృష్టికి తీసుకు వచ్చింది. సమస్యల గురించి మాత్రమే కాకుండా వివిధప్రాంతాలలోని సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టింది. ‘నా ప్రాజెక్ట్‌లో అన్ని కథలు మనుగడ కోసం చేసే పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాదు. జీవితాన్ని, సంస్కృతిని సెలబ్రెట్ చేసుకునేవి కూడా’ అంటుంది దీప్తి. స్ఫూర్తిదాయకమైన కథలు మార్పు తీసుకురాగలవా?’ అని అడిగితే ‘అందుకు నేనే ఉదాహరణ. ఆ మార్పు ముందు నాలోనే వచ్చింది’ అంటుంది దీప్తి. తాను షూట్ చేయడానికి ఎంచుకునే ప్రదేశాలతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. గుజరాత్‌లోని మిధాపూర్లో పన్నెండేళ్ల భారతితో మాట్లాడింది దీప్తి. ఆ అమ్మాయి ఎప్పుడూ బడి ముఖం చూడలేదు. కొంతకాలం ఇంటిపట్టునే ఉన్న భారతి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు కూలిపనికి వెళుతుంది. ఈ చిన్నారి పెద్ద పెద్ద తట్టలను మోస్తున్న దృశ్యం చూసి దీప్తికి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘భారతి అందమైన, చురుకైన అమ్మాయి. ఆమె భవిష్యత్ కూలిపనులకు పరిమితం కావాల్పిందేనా? అనే బాధ కలిగింది. కెమెరా గురించి భారతి ఆసక్తిగా తెలుసుకుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న ఇలాంటి పిల్లలకు కొత్త దారి చూపితే పురోగమించగలరు’ అంటుంది దీప్తి. భారతి లాంటి ఎంతోమంది పిల్లల కథలను లోకం దృష్టికి తీసుకువచ్చింది. పట్టణ ప్రాం తాలలో పెరిగిన దీప్తి దేశ విదేశాల్లో ఎన్నో మెట్రోపాలిటన్ నగరాలలో పనిచేసింది. ‘సమాజ నిర్మాణంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి సమాన అవకాశాలు లేవు’ అనే ఎరుక ఆమెను ఎప్పటికప్పుడు కొత్తప్రాంతాలకు తీసుకు వెళుతుంది. కొత్త జీవితాలను ఆవిష్కరించేలా చేస్తున్న దీప్తి ప్రస్తుతం గోవాలో ఉంటోంది. లక్ష్యంతో కూడిన ప్రయాణం భావాలను వ్యక్తీకరించడానికి పుస్తకం రాయడం, ఉపన్యాసం చేయడం లాగే ఫొటోగ్రఫీ కూడా ఒక సాధనం. నేను తీసిన చిత్రాలు నా భావాలకు అద్దం పట్టేలా ఉంటాయి. ఒక మహిళగా ఇతర మహిళలు, పిల్లలతో మాట్లాడడం నాకు సులువు అయింది. సోలోగా ట్రావెల్ చేయడంలో లైఫ్‌స్కిల్స్ క్రమక్రమంగా నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ప్రయాణానికి ఒక లక్ష్యం తోడైతే అది అద్భుతంగా ఉంటుంది. – దీప్తి అస్థాన వారి జీవితంలో భాగం అవుతాను కెమెరా ఉన్నా సరే, ఎదుటి వ్యక్తి జీవితపు లోతు అప్పటికప్పుడు ఆవిష్కారం కాదు. వారితో సరిగ్గా కనెక్ట్ కాగలగాలి. మనం వారిని అర్థం చేసుకున్నట్లే వారూ మనల్ని అర్థం చేసుకోవాలి. తమ గురించి తెలుసుకోవడంలో, కెమెరా ఉపయోగించడంలో ఎలాంటి వాణిజ్య ప్రయోజనం లేదనే భావన వారికి కలగాలి. ఇదేమంత సులభం కాదు. అలా అని జటిలం కాదు. మన ఓపిక, ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఫోటోలు తీసుకున్నప్పుడు వారి జీవితంలో భాగం అవుతాను. వారు నాలో భాగం అవుతారు. కలిసి భోజనం చేస్తాం. సరదా కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటాం. ఇప్పటివరకు ఈ దేశంలో ఏ మూలకు వెళ్లినా తమలో భాగంగా చూసుకున్నారు. ఆత్మీయత పంచారు. ఇది నా అదృష్టం. – దీప్తి అస్థాన -
కవిత్వాన్ని ముద్రించే కెమెరా
ప్రపంచవ్యాప్తంగా కెమెరాలు ఫొటోలు, వీడియోలు తీయడానికే ఉపయోగపడతాయి. పోలరాయిడ్ కెమెరాలైతే, తక్షణమే ఫొటోలను ముద్రించి అందిస్తాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న కెమెరాను పోలరాయిడ్ కెమెరా స్ఫూర్తితోనే తయారు చేశారు. అయితే, ఇది ఫొటోలకు బదులుగా కవిత్వాన్ని ముద్రిస్తుంది. ఈ కెమెరాతో ఏవైనా దృశ్యాలను బంధిస్తే, దృశ్యాలకు అనుగుణమైన కవిత్వాన్ని ముద్రించి అందిస్తుంది. దృశ్యాల ద్వారా కవిత్వాన్ని సృష్టించడానికి ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. ఈ కెమెరా విడిభాగాలుగా దొరుకుతుంది. విడిభాగాలను జోడించుకుని, దీనిని ఎవరికి వారే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో సింగిల్బోర్డ్ కంప్యూటర్, రేకు డబ్బా, వెబ్‌కామ్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దీని ద్వారా కోరుకున్న స్థానిక భాషల్లో కూడా కవిత్వాన్ని ముద్రించుకోవచ్చు. థర్మల్ పేపర్‌పై ఈ కెమెరా ముద్రించే కవితల కాగితాలు చూడటానికి సూపర్ మార్కెట్ రశీదుల్లా కనిపిస్తాయి. అమెరికన్ డిజైనర్ శామ్ గార్ఫీల్డ్ ఈ కెమెరాకు రూపకల్పన చేశాడు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
మొక్కల ఊసులు రికార్డయ్యాయి ఇలా!
ఇంతకుమునుపు మొక్కలు మాట్లాడతాయని, అవి కూడా బాధలకు ప్రతిస్పందిస్తాయని విన్నాం. అందుకు సంబంధించిన విషయాలను శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా వెల్లడించారు కూడా. ఎప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసుకుని ప్రతిస్పందిస్తాయన్నది ఓ మిస్టరీగా మిగిలిపోయింది. దీన్ని పరిశోధకులు తాజాగా చేధించడమే గాక మొక్కలు మాట్లాడుకోవడాన్ని కెమెరాలో బంధించి మరీ వివరించారు. వివరాల్లోకెళ్తే..జపాన్‌కి చెందిన శాస్త్రవేత్తల బృందం అందుకు సంబంధించిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసింది.మొక్కలు ఒకదానికొకటి మాట్లాడుకోవడం నిజమేనని వీడియోలో బంధించి మరీ ప్రూవ్ చేసి చూపించారు. మొక్కలు కమ్యూనికేట్ చేయడానికి గాలిలో ఉండే సమ్మేళనాలను వినియోగించుకుంటాయిని, అవి పొగమంచుతో చుట్టబడి ఉంటాయని అన్నారు. ఈ సమ్మెళనాలను వాసనలుగా వినియోగించుగకుని ప్రమాదం గురించి మరొక మొక్కను హెచ్చరిస్తాయని చెబుతున్నారు. ఈ మేరకు జపాన్ శాస్త్రవేత్తలు రికార్డ్ చేసిన వీడియోలో.. మొక్కలు ఎలా ఆ సిగ్నల్స్‌ని స్వీకరించి ప్రతిస్పందిస్తాయన్నది ప్రత్యక్షంగా చేసి చూపించారు. సైతామ యూనివర్సిటీకి చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ మసాత్సుగు టొయోటా నేతృత్వంలోని పరిశోధకులు బృందం ఈ విషయాన్నికమ్యూనికేషన్స్ జర్నల్‌లో వెల్లడించింది. ఇక్కడ మొక్కలు కీటకాలు లేదా ఇతరత్ర కారణాల వల్ల గాయపడిన లేదా దెబ్బతిన్న మొక్కలు మరోక మొక్కను హెచ్చరించేందుకు అస్థిర కర్బన సమ్మేళనాలను(వీఓసీ) విడుదల చేస్తుందని తెలిపారు పరిశోధకులు. గాల్లో విడుదలైన ఆ వీఓసీలను గాయపడిన మొక్కలు గ్రహించి తక్షణమే వివిధ రక్షణ ప్రతిస్పందనలు ప్రేరేపిస్తాయని తెలిపారు. అస్థిర కర్బన సమ్మేళనాలలో కాల్షియం అయాన్లు ఉండటం వల్ల మొక్కలు జరిపే ఈ కమ్యూనికేషన్ ప్రక్రియను కాల్షియం సిగ్నలింగ్ అని పిలవొచ్చని సైంటిస్టులు అన్నారు. ఈ ప్రయోగంలో భాగంగా రెండు టమాటా మొక్కలు, ఆవాల జాతికి చెందిన రెండు అరబిడోప్సిస్ థాలియానా జాతి కలుపుమొక్కలను పక్కపక్కన తొట్టిల్లో ఉంచారు. కాల్షియం సిగ్నలింగ్ అనేది మొక్కల ఆకులపై స్పష్టంగా కనిపించేలా ఈ మొక్కలకు బయో సెన్సర్లను బిగించారు. అనంతరం ఒక టమాటా మొక్క, ఒక అరబిడోప్సిస్ థాలియానా మొక్క ఉన్న తొట్టిలలోకి గొంగళి పురుగులను వేశారు. ఆ వెంటనే పురుగులు మొక్కలపైకి ఎక్కి ఆకులను తినడం ప్రారంభించాయి. దీంతో ఈ మొక్కలు స్పందించి.. వెంటనే కాల్షియం సిగ్నళ్లను రిలీజ్ చేశాయి. ఆ పక్కనే ఆరోగ్యకర స్థితిలో ఉన్న రెండు మొక్కలు ఈ సిగ్నళ్లను గ్రహించడం కూడా జరిగిపోయింది. దీంతో వెంటనే మొక్కల్లోని బయోసెన్సర్లు స్పందించి.. ఆకుల్లో కాల్షియం అయాన్లు యాక్టివేట్ అయిన ప్రదేశాన్ని మెరుస్తున్నట్లుగా హైలైట్ చేసి చూపించాయి. ఇదంతా లైవ్‌లో కెమెరాలో రికార్డయింది. If #plants could talk, they’d do so thru chemical signals about predators (aphids, caterpillars, gardeners with shears/pesticides…). Plants CAN talk (which we’ve known), but molecular biologists at Saitama University in Japan caught it 1st on film. https://t.co/44gXzMerK5 pic.twitter.com/DcLAlV1iti — HoneyGirlGrows (@HoneyGirlGrows) January 20, 2024 (చదవండి: మగవాళ్లు రోజూ వేడినీటి స్నానాలు చేయకూడదా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
నిషిద్ధ కాంతి చిక్కింది
ఇప్పటిదాకా వినడమే తప్ప కంటికి కనబడని విశ్వపు సుదూరాల్లోని నిషిద్ధ కాంతి ఎట్టకేలకు చిక్కింది. దాన్ని హబుల్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరాలో బంధించింది. భూమికి ఏకంగా 27.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హైడ్రా నక్షత్ర రాశిలో ఉన్న ఎంసీజీ–01–24–014 స్పైరల్ గెలాక్సీ నుంచి వెలువడుతున్న ఈ కాంతి తరంగాలను ఒడిసిపట్టింది. వాటికి సంబంధించి అబ్బురపరిచే ఫొటోలను భూమికి పంపింది. టెలిస్కోప్ తాలూకు అడ్వాన్స్డ్ కెమెరా ఫర్ సర్వేస్ (ఏసీఎస్) ఈ ఘనత సాధించింది. అత్యంత స్పష్టతతో ఉన్న ఫొటోలు చూసి నాసా సైంటిస్టులతో పాటు అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఈ కిరణాల వెలుగులో కనువిందు చేస్తున్న ఎంసీజీ గెలాక్సీ అందాలకు ఫిదా అవుతున్నారు. కాస్మిక్ ఫొటోగ్రఫీ చరిత్రలోనే దీన్ని అత్యంత అరుదైన ఫీట్‌గా అభివరి్ణస్తున్నారు. హబుల్ ఫొటోల్లో కన్పిస్తున్న ఎంసీజీ గెలాక్సీ పూర్తిస్థాయిలో వికసించిన నిర్మాణం, అత్యంత శక్తిమంతమైన కేంద్రకంతో కనువిందు చేస్తోంది. ఇది అత్యంత చురుకైన కేంద్రకాలున్న టైప్–2 సీఫెర్ట్ గెలాక్సీల జాబితాలోకి వస్తుందని నాసా పేర్కొంది. సీఫెర్ట్ గెలాక్సీలు అంతరిక్షంలో మనకు అత్యంత దూరంలో ఉండే అతి ప్రకాశవంతమైన నక్షత్ర మాలికలైన క్వాసార్ల సమీపంలో ఉంటాయి. అయితే క్వాసార్లు తామున్న గెలాక్సీలను బయటికి ఏమాత్రమూ కని్పంచనీయనంతటి ప్రకాశంతో వెలిగిపోతుంటాయి. సీఫెర్ట్ గెలాక్సీలు మాత్రం వీక్షణకు అనువుగానే ఉంటాయి. కానీ అత్యంత సుదూరంలో ఉన్న కారణంగా వీటి వెలుతురు ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కలేదు. ఆ కారణంగానే సైంటిస్టుల పరిభాషలో దాన్ని ‘నిషిద్ధ కాంతి’గా ముద్దుగా పిలుచుకుంటూ వస్తున్నారు. పైగా ఈ కాంతి పుంజాలు భూమ్మీద మనకు ఇప్పటిదాకా తెలిసిన పరిమాణ భౌతిక శాస్త్ర నియమాలకు పూర్తిగా అతీతమన్నది సైంటిస్టుల నమ్మకం. అనంత విశ్వంలో అంతటి సుదూర అంతరిక్ష క్షేత్రంలో మన భౌతిక శాస్త్ర నియమాలన్నీ తల్లకిందులవుతాయని వారు చెబుతుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎవ్వరినీ వదలని ఏఐ కెమెరాలు.. ఈ సారి పోలీసులకే..
అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై సుమారు 726 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేసింది. సేఫ్ కేరళ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కెమెరాలు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిని గుర్తించి వారికి చలానాలు జారీ చేస్తాయి. ఏఐ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి కేరళలో ట్రాఫిక్ ఉల్లంఘనలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. సీట్ బెల్టు ధరించకపోయినా, హెల్మెట్ పెట్టుకోకపోయినా ఆలాంటి వాహనాలను గుర్తించి ఏఐ కెమరాలు ఫోటోలు తీస్తాయి. సంబంధిత అధికారులు చలానాలు జారీ చేస్తారు. గతంలో ఓ స్కూటరిస్టుకు ఏకంగా రూ. 86,500 చలాన్ జారీ చేసిన సంఘటన మరువక ముందే.. ఏఐ కెమెరా ఇటీవల పోలీస్ వాహనానికి కూడా చలాన్ జారీ చేసింది. KL01 BK 5117 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన కారులో వెళ్తున్న పోలీసు (కో-ప్యాసింజర్) సీట్ బెల్ట్ ధరించకపోవడంతో ఫోటో తీసి చలాన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by modz_own_country (@modz_own_country) -
కార్మికులు కనిపించారు
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగం కూలిన 10వ రోజైన మంగళవారం సానుకూల పరిణామం సంభవించింది. లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులతో వారి కోసం బయట వేచి ఉన్న కుటుంబసభ్యులు మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడారు. అంతేకాకుండా, లోపలున్న వారికి సంబంధించిన విజువల్స్ మొట్టమొదటిసారిగా బయటకు వచ్చాయి. దీంతో, కూలిన సొరంగం శిథిలాల్లోంచి తవ్విన ఆరంగుళాల పైప్‌లైన్ ద్వారా ఎండోస్కోపిక్ కెమెరాను పంపించి, లోపలున్న వారి యోగ క్షేమాలను తెలుసుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనట్లయింది. ఈ పైపును 53 మీటర్ల మేర అడ్డుపడిన శిథిలాల గుండా సోమవారం లోపలికి ప్రవేశపెట్టారు. కెమెరాను సోమ వారం రాత్రి ఢిల్లీ నుంచి అక్కడికి పంపించారు. పసుపు, తెలుపు రంగుల హెల్మెట్లను ధరించిన కార్మికులు, పైపులైన్‌ద్వారా లోపలికి పంపించిన ఆహార పదార్థాలను ఒకరికొకరు అందించుకుంటూ, మాట్లాడుకుంటూ ఆ విజువల్స్‌లో కనిపించారు. బయటున్న అధికారులు పెద్ద స్క్రీన్‌పై వారిని చూస్తూ తగు సూచనలు ఇచ్చారు. కెమెరా లెన్స్ శుభ్రంగా ఉంచుతూ, తమను తాము పరిచయం చేసుకోవాలని కోరారు. పైప్‌లైన్ దగ్గరకు చేరుకుని లోపలికి పంపించిన వాకీటాకీలతో మాట్లాడాలని చెప్పారు. అనంతరం ఆ కెమెరాను వెనక్కి తీశారు. ఇప్పటికే కొందరి కుటుంబసభ్యులు నాలుగంగుళాల కంప్రెషర్ ట్యూబ్ ద్వారా లోపలున్న తమ వారితో మాట్లాడారు. ఆ ట్యూబ్ ద్వారానే డ్రైఫ్రూట్స్ వంటివి కూడా లోపలికి పంపించారు. అయితే, తాజాగా అందుబాటులోకి వచ్చిన పైప్‌లైన్ కార్మికుల పాలిటి లైఫ్‌లైన్‌గా మారింది. ఇంతకుముందు కంటే ఎక్కువ ఆహారాన్ని పంపొచ్చు. కుటుంబసభ్యులతో మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. కొత్త పైపు ద్వారా లోపలున్న వారికి నారింజ, అరటి, యాపిల్ పండ్లు, బాటిళ్లలో కిచిడీ, సెల్ఫోన్లు, చార్జెర్లను సైతం పంపించారు. ఒక డాక్టర్ కూడా లోపలున్న కార్మికులతో మాట్లాడారు. వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడుపులో మంట, మూత్ర విజర్జనలో సమస్య..తదితరాలను తెలపగా వారికి మల్టీవిటమిన్ ట్యాబెట్లు, ఎలక్ట్రోలైట్ పౌడర్, యాంటీ డిప్రెస్సెంట్లను పంపినట్లు డాక్టర్ పీఎస్ పొఖ్రియాల్ చెప్పారు. సొరంగంలో చిక్కుకుపోయిన ప్రదీప్ కిక్సు క్షేమంగానే ఉన్నట్లు ఆయన మరదలు తెలిపారు. -
సొరంగ బాధితుల ఫొటోలను ఎండోస్కోపిక్ కెమెరా ఎలా తీసింది?
ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్లో గత 9 రోజులుగా 41 మంది కూలీలు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో వారికి పైపు ద్వారా ఘన ఆహారాన్ని అందించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. దీనితోపాటు ఎండోస్కోపిక్ కెమెరా ద్వారా కార్మికుల పరిస్థితిని అధికారులు గమనించారు. రెస్క్యూ బృందం ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున వారి దగ్గరకు ఎండోస్కోపిక్ ఫ్లెక్సీ కెమెరా పంపారు. వారి క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అందుకే ఎండోస్కోపిక్ కెమెరా అంటే ఏమిటో.. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోస్కోపిక్ కెమెరాలను మానవ శరీరంలోని అంతర్గత అవయవాలను పరిశీలించడానికి ఉపయోగిస్తారు. ఎండోస్కోపిక్ కెమెరాలు అత్యంత సాంకేతికంగా పనిచేస్తాయి. సరైన రోగనిర్ధారణ, వ్యాధులకు తగిన చికిత్స అందించేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వైద్యులు వినియోగిస్తారు. ఆధునిక ఎండోస్కోపిక్ కెమెరాలు ‘చిప్-ఆన్-టిప్’ సాంకేతికతతో పనిచేస్తాయి. కెమెరా చివరిలో ఉన్న సాఫ్ట్ ప్యాకేజీ ద్వారా ఫొటోలు తీయడం జరుగుతుంది. ఈ కెమెరా పైన ఎల్ఈడీ లైట్ ఉంటుంది. ఫలితంగా ఈ కెమెరా చీకటిగా ఉన్న ప్రదేశాలలో కూడా చిత్రాలను క్లిక్ చేయగలుగుతుంది. ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం అధికారులు ఫ్లెక్సీ కెమెరాను ఉపయోగించారు. పైప్‌లైన్‌లోని చిన్న రంధ్రం ద్వారా కెమెరాను సొరంగం లోనికి పంపించి బాధితుల గురించి తెలుసుకున్నారు. ఇది కూడా చదవండి: యాంటీమాటర్ అంటే ఏమిటి? ఎందుకు అత్యంత శక్తివంతం? -
కెమెరాల్లో రీళ్లు వేసుకుని, ఫొటోలు తీసేలా ఫిల్మ్‌రోల్
డిజిటల్ కెమెరాలు, స్మార్ట్ఫోన్లు వచ్చాక రీళ్లు వేసుకునే పాతకాలం కెమెరాలు కనుమరుగైపోయాయి. పాత పద్ధతిలో కెమెరాల్లో రీళ్లు వేసుకుని, ఫొటోలు తీయడం ఇష్టపడేవారి కోసం తాజాగా డిజిటల్ ఫిల్మ్‌రోల్ అందుబాటులోకి వచ్చింది. అమెరికన్ ఫొటోగ్రఫీ కంపెనీ ‘ఐయామ్ బ్యాక్’ ఈ డిజిటల్ ఫిల్మ్రోల్ను ఇటీవల రూపొందించింది. ఇందులోని ఫిల్మ్ రోల్ హోల్డర్‌లో 20 మెగాపిక్సెల్ సోనీ 4/3 సెన్సర్, బ్యాటరీ, మెమరీ కార్డ్ స్లాట్ ఉంటాయి. ఈ డిజిటల్ ఫిల్మ్ రోల్ హోల్డర్‌ను ఎలాంటి 35 ఎంఎం కెమెరాలోనైనా ఉపయోగించుకోవచ్చు. పాతకాలం నికాన్, కేనన్, పెంటాక్స్, ఒలింపస్ తదితర కంపెనీల 35 ఎంఎం కెమెరాల్లో ఈ డిజిటల్ ఫిల్మ్రోల్ను వేసి, వాటితో ఇంచక్కా ఫొటోలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది ‘కిక్‌స్టార్టర్’ ద్వారా ఆన్లైన్లో ప్రీఆర్డర్‌పై అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. -
కెమెరాలో ఎన్ని ట్రిక్కులుంటాయంటే.. చూసేదంతా భ్రమే
-
బాల ఫొటోగ్రాఫర్ల కోసం అదిరిపోయే కెమెరా..ఫీచర్లు ఏంటంటే?
చిన్నారులు ఫొటో తీసుకుంటున్న ఈ కెమెరా ప్రత్యేకంగా బాల ఫొటోగ్రాఫర్ల కోసం రూపొందించినది. ఇందులో ఫొటోలు తీసుకోవడంతో పాటు ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఆస్ట్రేలియన్ కంపెనీ వీ–టెక్ ‘కిడిజూమ్’ పేరుతో ఈ కెమెరాను మార్కెట్లోకి తెచ్చింది. ఇది 2.0 మెగాపిక్సెల్ కెమెరా. ఇందులో నాలుగు రెట్లు జూమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో 35 ఫొటో ఎఫెక్ట్స్, నాలుగు గేమ్స్, నాలుగు యాప్స్ కూడా ఉంటాయి. ఈ కెమెరాతో తీసుకున్న ఫొటోలను చిన్నారులు తమంతట తామే కోరుకున్న రీతిలో ఎడిట్ చేసుకోవచ్చు. వాటిని కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలకు ఈ కెమెరా చక్కని కాలక్షేపంగా ఉంటుంది. పొరపాటున చేయిజారినా పగిలిపోని విధంగా దీన్ని దృఢంగా రూపొందించడం విశేషం. దీని ధర 63.74 డాలర్లు (రూ.5,306) మాత్రమే! -
రొమాంటిక్ ఫోటో క్లిక్ చేసిన ఏఐ కెమెరా.. వావ్ అంటున్న నెటిజన్లు!
ఆధునిక కాలంలో టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని ఉపయోగించుకుంటూ మనుషులు తమ పనిని మరింత సులభతరం చేసుకుంటున్నారు. కేరళ ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేయడానికి ఈ ఏడాది ప్రారంభంలో సుమారు 726 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఆ ఫోటోలను గమనించి చలానాలు విధిస్తున్నారు. ఇటీవల ఒక AI ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏఐ కెమెరా తీసిన ఫోటోలో ఓ క్యూట్ రొమాంటిక్ జంటను చూడవచ్చు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హైరిజల్యూషన్ కెమెరా రాత్రి సమయంలో కూడా అద్భుతంగా వైట్ అండ్ బ్లాక్ ఫోటో తీసింది. ఇందులో బైక్ రైడర్ హెల్మెట్ ధరించాడు, వెనుక ఉన్న అమ్మాయి హెల్మెట్ ధరించలేదు. ఈ కారణంగా వారికి జరిమానా విధించారు. ఈ ఫోటోలు అమ్మాయి నవ్వుతుండటం చూడవచ్చు. వండి భ్రాంతన్‌మార్ తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ ఫోటో పోస్ట్ చేస్తూ.. డబ్బులిచ్చి పెట్టుకునే పెయిడ్ ఫోటోగ్రాఫర్లు కూడా ఇంతమంచి ఫోటో తీయలేరేమో? అయితే ఇది కలర్ ఫోటో అయితే ఇంకా బాగుండేదని వెల్లడించాడు. అయితే జరిమానా అందుకున్న వ్యక్తి ఇలాగే భావించాడా? లేదా అనే తెలియాలి. ఇదీ చదవండి: యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను.. ఏఐ కెమెరాలు అందుబాటులోకి వచ్చిన తరువాత కేరళలో ప్రమాదాలలలో మరణించే వారి సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. ఈ ప్రాజెక్టు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 232 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘన సంఖ్య కూడా బాగా తగ్గింది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. 500, టూ వీలర్ మీద ముగ్గురు వ్యక్తులు వెళ్తే రూ. 1,000. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా రైడింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తే రూ. 2000 జరిమానా విధించబడుతుంది. View this post on Instagram A post shared by Vandibhranthanmar (@vandi_bhranthanmar) -
ఆదిత్య సెల్ఫీ..!
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడి దిశగా దూసుకుపోతున్న ఆదిత్య–ఎల్1 కెమెరా పని మొదలుపెట్టింది. తన సెల్ఫీతోపాటు భూమి, చంద్రుడిని కూడా క్లిక్ మనిపించింది. ఈ మేరకు ఆదిత్య–ఎల్1 నుంచి అందుకున్న ఫొటోలను బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం గురువారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో విడుదల చేసింది. ఆదిత్య–ఎల్1లో అమర్చిన కెమెరా ఈనెల 4న తీసిన సెల్ఫీలో వీఈఎల్సీ (విజిబుల్ ఎమిషన్ లైన్), ఎస్‌యూఐటీ(సోలార్ అ్రల్టావయొలెట్) పరికరాలు కనిపిస్తున్నాయి. అదే కెమెరా భూమి, చంద్రుడి ఫొటోలను కూడా తీసింది. ఆదిత్య–ఎల్1లో అమర్చిన ఏడు వేర్వేరు పేలోడ్లలో వీఈఎల్సీ, ఎస్యూఐటీలు కూడా ఉన్నాయి. ఆదిత్య–ఎల్1 భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజియన్ పాయింట్1(ఎల్1)లోని తన నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్నాక సూర్యుడి చుట్టు పరిభ్రమిస్తూ వీఈఎల్సీ పేలోడ్ ద్వారా రోజుకు 1,440 ఫొటోలను తీసి భూనియంత్రిత కేంద్రాలకు విశ్లేషణ నిమిత్తం పంపించనుంది. -
అత్యంత అరుదైన చేప! ఐతే ఇది ఈత కొట్టదట..ఏకంగా..
నీటిలో చేపలు ఈతకొడతాయి. అయితే, ఇదొక వింత చేప. నీటి అడుగున ఇది నడుస్తుంది. దీనికి ముందు వైపు చేతుల్లా ఉపయోగపడే కాళ్లు పెద్దగా ఉంటాయి. వెనుకవైపు కాళ్లు చాలా చిన్నగా ఉంటాయి. అందువల్ల దీనిని హ్యాండ్‌ఫిష్ అంటారు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ రకమైన చేప కెమెరా కంటికి చిక్కింది. ఇదివరకు విక్టోరియా తీరానికి చేరువలోని సముద్రంలో 1986లో ఒకసారి, 1996లో ఒకసారి ఇలాంటి హ్యాండ్‌ఫిష్ చేప కనిపించింది. ఇటీవల టాస్మానియా ఈశాన్యాన ఉన్న ఫ్లిండర్స్ దీవికి చేరువలో సముద్రం అడుగున నడుస్తున్న ఈ హ్యాండ్‌ఫిష్ అండర్‌వాటర్ కెమెరాకు చిక్కింది. ఇది నీటికి 292 అడుగుల లోతున ఉండగా కెమెరాకు చిక్కినట్లు కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ) శాస్త్రవేత్త కార్లీ డివైన్ తెలిపారు. సీఎస్ఐఆర్ఓ శాస్త్రవేత్తలు టాస్మానియా సముద్ర జలాల్లో పరిశోధనల కోసం ‘ఆర్వీ ఇన్వెస్టిగేటర్’ ఓడలో అన్వేషణ సాగిస్తుండగా, ఈ అరుదైన చేప వారి కెమెరాకు చిక్కడం విశేషం. (చదవండి: అక్కడ హోటళ్లలోని గదులను చూస్తే..కంగుతినడం ఖాయం!) -
వాట్ ఏ టెక్నాలజీ.. ఈజీగా ఈత కొట్టేయొచ్చు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే తొలి అండర్‌వాటర్ కెమెరా ఇది. ఈత కొట్టేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్లు ప్రమాదాలకు గురైతే, ఈ కెమెరా వెంటనే గుర్తిస్తుంది. ఇందులోని డ్రౌనింగ్ డిటెక్షన్ సిస్టమ్ మునిగిపోతున్న వారిని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ఇళ్లలోను, హోటల్స్‌లోను ఉండే స్విమింగ్‌పూల్స్‌లో ఉపయోగించడానికి ఇది పూర్తిగా అనువుగా ఉంటుంది. అమెరికన్ గృహోపకరణాలు, స్విమింగ్‌పూల్ రక్షణ పరికరాల తయారీ సంస్థ ‘కోరల్’ ఈ అండర్‌వాటర్ సెక్యూరిటీ కెమెరాను ‘మైలో’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ‘మైలో’ కెమెరా నిరంతరం స్విమింగ్‌పూల్‌ను కనిపెడుతూనే ఉంటుంది. ఈతకొడుతూ ఎవరైనా మునిగిపోతున్నట్లు గుర్తిస్తే, దీని యాప్ ద్వారా అనుసంధానమైన కుటుంబ సభ్యులు, సంబంధీకుల స్మార్ట్ఫోన్లకు తక్షణమే సమాచారం పంపుతుంది. దీని ధర 1499.15 డాలర్లు (సుమారు రూ.1.25 లక్షలు). (చదవండి: ఇలా కూడా నిద్రపోవచ్చా!..వర్క్‌ప్లేస్‌లో కూడా..) -
ప్రాణాలు కాపాడే.. ప్రపంచంలోనే తొలి ‘AI’ కెమెరా.. ధర ఎంతంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే తొలి అండర్‌వాటర్ కెమెరా ఇది. ఈత కొట్టేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్లు ప్రమాదాలకు గురైతే, ఈ కెమెరా వెంటనే గుర్తిస్తుంది. ఇందులోని డ్రౌనింగ్ డిటెక్షన్ సిస్టమ్ మునిగిపోతున్న వారిని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ఇళ్లలోను, హోటల్స్‌లోను ఉండే స్విమింగ్‌పూల్స్‌లో ఉపయోగించడానికి ఇది పూర్తిగా అనువుగా ఉంటుంది. అమెరికన్ గృహోపకరణాలు, స్విమింగ్‌పూల్ రక్షణ పరికరాల తయారీ సంస్థ ‘కోరల్’ ఈ అండర్‌వాటర్ సెక్యూరిటీ కెమెరాను ‘మైలో’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ‘మైలో’ కెమెరా నిరంతరం స్విమింగ్‌పూల్‌ను కనిపెడుతూనే ఉంటుంది. ఈతకొడుతూ ఎవరైనా మునిగిపోతున్నట్లు గుర్తిస్తే, దీని యాప్ ద్వారా అనుసంధానమైన కుటుంబ సభ్యులు, సంబంధీకుల స్మార్ట్ఫోన్లకు తక్షణమే సమాచారం పంపుతుంది. దీని ధర 1499.15 డాలర్లు (సుమారు రూ.1.25 లక్షలు). -
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని చంద్రుని ఉపరితలం..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. రోవర్ ప్రగ్యాన్ ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉందని ఇస్రో తెలిపింది. అన్ని ప్రక్రియలు అనుకున్న ప్రకారమే షెడ్యూల్లో పూర్తి అయ్యాయని స్పష్టం చేసింది. రోవర్ కదలికలు ప్రారంభమయ్యాయని తెలిపింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగేప్పుడు చివరి క్షణంలో తీసిన జాబిల్లి వీడియోను షేర్ చేసింది. Chandrayaan-3 Mission: All activities are on schedule. All systems are normal. 🔸Lander Module payloads ILSA, RAMBHA and ChaSTE are turned ON today. 🔸Rover mobility operations have commenced. 🔸SHAPE payload on the Propulsion Module was turned ON on Sunday. — ISRO (@isro) August 24, 2023 దక్షిణ ధృవంపైనే ఎందుకు..? చంద్రయాన్ 3 దిగ్విజయంగా జాబిల్లిపై కాలు మోపింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అయితే.. దక్షిణ ధృవాన్ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నపై ఇస్రో చీఫ్ సోమనాథ్ సమాధానమిచ్చారు. 'చంద్రుని దక్షిణ ధృవంపై సూర్మరశ్మి పడే అవకాశాలు లేవు. నీరు, ఖనిజాలకు సంబంధించిన వివరాలు లభించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా చంద్రుని నివాసానికి సంబంధించిన వివరాలు కూడా దక్షిణ ధృవం వద్ద లభిస్తాయి. అందుకే ఈ ధృవం వైపే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడానికి పలు దేశాలు ప్రయత్నించాయి' అని తెలిపారు. 'చంద్రయాన్ 2 ప్రయత్నంలో విఫలమైన తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమయ్యాం. ఓ ఏడాది చంద్రయాన్ 2లో జరిగిన తప్పిదాలపైనే అధ్యయనం చేశాం. మరో ఏడాది ఆ తప్పులను సరిచేయడంపైనే పనిచేశాం. మరో ఏడాది వాటిని పరీక్షించి చూసుకున్నాం. చివరగా నాలుగేళ్లకు చంద్రయాన్ 3ని ప్రయోగించాం.' అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై ల్యాండ్ అయింది. ఇప్పటికే ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. మరో 14 రోజులపాటు చంద్రునిపై పనిచేయనుంది. ఇదీ చదవండి: జాబిల్లిపై మూడు సింహాల అడుగులు.. రోవర్‌కు సారనాథ్ అశోక చిహ్నం.. -
డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్లో ఫైటింగ్.. పొట్టుపొట్టు కొట్టుకున్నారు..!
అమెరికాలోని అలబామాలోని రివర్ ఫ్రంట్ పార్క్‌లో దారుణం జరిగింది. కొందరు యువకులు ఓ సెక్యూరిటీ గార్డ్‌పై పిడిగుద్దులు కురిపించారు. ఓ బోటును పక్కకు జరపమని సెక్యూరిటీ గార్డ్ అడిగిన నేపథ్యంలో ఆయన అభ్యర్థనను తిరస్కరించిన కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. Yo this is wild 😭 A group of white men attacked a black security guard after the security asked them to move their pontoon boat so the big Harriot can dock. They refused to & attacked the security guard. A group of black men seen & went defend him by beating the white men 💯🙌🏾 pic.twitter.com/Qzo3U3Kq1r — Shannonnn sharpes Burner (PARODY Account) (@shannonsharpeee) August 6, 2023 యువకులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. మొదట ఓ యువకుడు సెక్యూరిటీ గార్డ్‌పై దాడి చేశాడు. అనంతరం అతనికి మద్దతుగా వచ్చిన మరికొందరు పిడిగుద్దులు కురిపించారు. విచక్షణా రహితంగా ఆయనపై దాడి చేశారు. చొక్కాలు విప్పుకుని ఒకరిపై మరొకరు దాడికి తెగబడ్డారు. డబ్ల్యడబ్ల్యూఈ స్థాయిలో కుర్చీలతో చొక్కాలు విప్పుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇందులో మహిళలు కూడా పాలు పంచుకున్నారు. ఘర్షణలో కొందరిని నదిలో నెట్టేశారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే.. -
టెక్ టమారం : ఎగిరిపోయే సెల్ఫీ కెమెరాలు వచ్చేశాయి..ధరెంతంటే?!
స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు తీసుకోవడం అందరికీ తెలిసిన సంగతే! స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీలు తీసుకోవడంలో చాలా పరిమితులు ఉన్నాయి. పరిమితమైన భంగిమల్లోనే ఫొటోలు తీసుకోవడం సాధ్యమవుతుంది. సెల్ఫీలను మరింత చక్కగా, స్పష్టంగా తీసుకునేందుకు వీలైన డ్రోన్ కెమెరాను అమెరికన్ కంపెనీ ‘హోవర్’ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. అరచేతిలో ఇమిడిపోయే పరిమాణంలో ఉండే ఈ డ్రోన్ కెమెరా చాలా తేలికగా కూడా ఉంటుంది. దీని బరువు 125 గ్రాములు మాత్రమే. దీనిని అరచేతి నుంచే టేకాఫ్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా దీని కదలికలను నియంత్రించవచ్చు. ఇందులో క్విక్షాట్ మోడ్‌ను ఎంపిక చేసుకుంటే, వెంట వెంటనే సెల్ఫీ ఫొటోలు, వీడియోలు తీస్తుంది. ఫాలో మోడ్‌ను ఎంపిక చేసుకుంటే, మనం కోరుకున్న చోటుకు అనుసరిస్తూ వీడియోలు చిత్రిస్తుంది. ఇది తీసే ఫొటోలను, వీడియోల ప్రీవ్యూలను మొబైల్లో లైవ్‌లో చూసుకోవచ్చు. ‘హోవర్ కెమెరా ఎక్స్1’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ కెమెరా వీడియో బ్లాగర్లకు, ఔత్సాహిక ఫిలిమ్ మేకర్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని ధర 389 డాలర్లు (రూ.31,924) మాత్రమే!