Amazon Mega Electronics Day sale: Top deals on laptops, smartwatches and more - Sakshi
Sakshi News home page

Amazon Mega Electronics Day sale: అద్భుతమైన ఆఫర్లు, డోంట్‌ మిస్‌!

Published Sat, Mar 11 2023 5:59 PM | Last Updated on Sat, Mar 11 2023 6:11 PM

Amazon Mega Electronics Day sale Top deals on laptops smartwatches - Sakshi

సాక్షి,ముంబై:  ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎలక్ట్రానిక్స్‌పై మరో సేల్‌ను ప్రకటించింది. మెగా ఎలక్ట్రానిక్స్‌ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు హెడ్‌ఫోన్‌లు తదితర ఉత్పత్తులపై  భారీ  డిస్కౌంట్స్‌  ప్రకటించింది.  మార్చి 14  వరకు కొనసాగనున్న ఈ స్పెషల్‌ సేల్‌ ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవచ్చు.  ‍

(ఇదీ చదవండి:  బ్లూటూత్‌ కాలింగ్‌ స్మార్ట్‌ ‘రిథమ్‌’ సన్‌గ్లాసెస్‌: భారీ తగ్గింపుతో)
మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ ఈవెంట్‌లో  శాంసంగ్‌, యాపిల్‌, బోట్‌, పైర్‌ బాల్ట్‌, లెనోవో, ఆసుస్‌, కెనాన్‌, సోనీ లాంటి ప్రముఖ బ్రాండ్స్‌ ఉత్పత్తులు తగ్గింపు ధరల్లో అందించనుంది. హెడ్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు,పీసీ యాక్సెసరీలు, కెమెరాలతో పాటు మరిన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై అద్భుతమైన డీల్స్ , ఆఫర్‌లను అందిస్తుంది. దీంతోపాటు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, ఎస్‌ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌  ద్వారా 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. 

మెగా సేల్‌లో కొన్ని ప్రత్యేక ఆఫర్లు
ఆసుస్‌ వివో బుక్‌ 14 ల్యాప్‌టాప్ 3 నెలల వరకు నో-కాస్ట్ EMIతో రూ. 35,990కి అందుబాటులో ఉంది
లెనోవో ఐడియాప్యాడ్‌ స్లిమ్‌ 3ల్యాప్‌టాప్ 3 నెలల వరకు నో-కాస్ట్ EMIతో రూ. 33,490కే కొనుగోలు చేయవచ్చు
ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ స్మార్ట్ వాచ్ రూ. 1,699కే లభ్యం. 
రూ. 34,990కే యాపిల్‌ వాచ్‌  ఎస్‌ఈ లభిస్తుంది.  బ్యాంకు కార్డ్‌ కొనుగోళ్లగా రూ. 1500 తగ్గింపు అదనం 
ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో రూ. 1,599కి, నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్ వాచ్ రూ. 1,199కి అందుబాటులో ఉంది.
సోనీ డిజిటల్ వ్లాగ్ కెమెరా జెడ్‌వీ 1 రూ. 69,490కి  లభిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement