అమెజాన్‌ మెగా సేల్‌, భారీ డిస్కౌంట్లు! | Amazon Plans Mega 30 Hours Sale Next Month | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ మెగా సేల్‌, భారీ డిస్కౌంట్లు!

Published Wed, Jun 20 2018 2:35 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

Amazon Plans Mega 30 Hours Sale Next Month - Sakshi

30 గంటల పాటు అమెజాన్‌ మెగా సేల్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌లు ఒకటైపోయాయి. ఈ రెండు జతగా ఇక దేశీయ ఈ-కామర్స్‌ రాజ్యాన్ని ఏలాలనుకుంటున్నాయి. కానీ వీటికి ఎలాగైనా చెక్‌ పెట్టాలని మరోవైపు నుంచి అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ చూస్తోంది. వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు అమెజాన్‌ త్వరలోనే ప్రైమ్‌ డే సేల్‌ను నిర్వహించబోతుంది. 30 గంటల పాటు ఈ సేల్‌ ఈవెంట్‌ను నిర్వహించాలని అమెజాన్‌ చూస్తోంది. ప్రైమ్‌ షాపర్స్‌ ఆధారంగా చేసుకుని భారీ డిస్కౌంట్లను అమెజాన్‌ ప్రకటించబోతుందని అమెజాన్‌ ఇండియాలో టాప్‌ సెల్లర్స్‌ చెప్పారు. జూలై 7 నుంచి జూలై 15 మధ్యలో అమెజాన్‌ ఇండియా ఈ సేల్‌ను నిర్వహించాలని ప్లాన్‌చేస్తుందని నలుగురు టాప్‌ విక్రయదారులు తెలిపారు. అంతకముందు ఎన్నడూ చూడని డిస్కౌంట్లను ఈ 30 గంటల సేల్‌లో వినియోగదారులు చూస్తారని పేర్కొన్నారు. 

అంతేకాక ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కస్టమర్లను తమవైపు తిప్పుకోవడంలో కూడా ఈ సేల్‌ దోహదం చేయనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సేల్‌తో ఎక్కువ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను కూడా పొందాలని అమెజాన్‌ చూస్తోంది. నెలవారీ రెవెన్యూ అంతా ఈ 30 గంటల్లోనే అమెజాన్‌ ఆర్జిస్తుందని విక్రయదారులు చెప్పారు. అమెరికా తర్వాత అమెజాన్‌కు, వాల్‌మార్ట్‌కు.. 672 బిలియన్‌ డాలర్లు కలిగిన భారత రిటైల్‌ మార్కెటే అత్యంత ప్రాధానమైనది.

ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను వాల్‌మార్ట్‌ కొనుగోలు చేసిన అనంతరం ఈ పోటీ మరింత తీవ్రతరమైంది. ఎక్కువగా డీల్స్‌ అందించేందుకు కేటగిరీలన్నింటిలో ప్రైవేట్‌ లేబుల్స్‌ అమెజాన్‌ ఎక్కువగా దృష్టిసారించిందని తెలిసింది. అదేవిధంగా వేర్‌హౌజ్‌ల సామర్థ్యాన్ని పెంచి, ఆర్డర్లను వెంటనే డెలివరీ చేయాలని చూస్తోంది. ఈ సేల్‌ ద్వారా కస్టమర్లను ప్రైమ్‌కు మార్చేందుకు ఓ గొప్ప అవకాశంగా భావిస్తుందని టాప్‌ విక్రయదారుడు ఒకరు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement