ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ 9 సిరీస్ మొబైల్స్ మార్చి 23న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వన్‌ప్లస్ 9ప్రో కెమెరాకు సంబందించిన కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. వన్‌ప్లస్ ప్రధాన లోపం కెమెరా కాబట్టి ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి హస్సెల్ బ్లేడ్ తో కలిసి వస్తుంది. రాబోయే వన్‌ప్లస్ 9 సిరీస్ మొబైల్స్ కెమెరా పనితీరు ఇతర ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల కంటే మెరుగ్గా ఉండనున్నట్లు తెలుస్తుంది. వన్‌ప్లస్ 9 ప్రో ప్రధాన కెమెరాలో సోనీ IMX789 సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాలో సోనీ IMX766 సెన్సార్‌ను తీసుకొస్తున్నట్లు గతంలో ధృవీకరించారు.
వన్‌ప్లస్ సీఈఓ పీట్ లా వన్‌ప్లస్ 9 సిరీస్ కెమెరా పనితీరును పరీక్షించడం కోసం DxOMarkకు పంపించరని తెలుస్తుంది. DxOMark కెమెరా పనితీరుతో పాటు డిస్ ప్లే, ఆడియో, వైర్ లెస్ స్పీకర్ వంటి కీలక అంశాలకు సంబంధించి రేటింగ్ ఇచ్చే ఒక స్వతంత్ర సంస్థ. వన్‌ప్లస్ 9 ప్రో వేరియంట్ ఆస్ట్రల్ బ్లాక్, మార్నింగ్ మిస్ట్, పైన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుందని వస్తుందని తెలుస్తుంది. రాబోయే వన్‌ప్లస్ 9 సిరీస్‌లో క్వాల్‌కామ్ రాబోయే స్నాప్‌డ్రాగన్ 875 చిప్ మరియు 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం. ఈ మొబైల్ యొక్క అవుట్ ఆఫ్ ది బాక్స్ లో ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్ 11ను తీసుకొస్తునట్లు సమాచారం.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment