టెక్ దిగ్గజం శామ్‌సంగ్ 600 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ పేర్కొంది. ఇటీవలి తన ట్వీట్‌లో శామ్‌సంగ్ “నిజంగా 600 ఎంపీ సెన్సార్‌లను అభివృద్ధి చేస్తోంది!” అని టిప్‌స్టర్ పేర్కొన్నారు. 4కె, 8కె వీడియో రికార్డింగ్ టెక్నాలజీ కోసం దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మనిషి కంటి(576 ఎంపీ) కంటే చాలా శక్తివంతమైన కెమెరా సెన్సార్ గా నిలుస్తుంది. మామూలుగా మన కళ్లకి కనిపించని ఎన్నో రకాల డీటెయిల్స్ ఇలాంటి కెమెరా ద్వారా క్యాప్చర్ చేయబడతాయి. (చదవండి: బిగ్ బ్యాటరీతో రానున్న మోటో జీ9 పవర్)
Samsung is really doing 600MP sensors! pic.twitter.com/vGgsfxsGGh
— Ice universe (@UniverseIce) December 5, 2020
కొన్ని నివేదికల ప్రకారం శామ్‌సంగ్ కెమెరా ఐసోసెల్ 600ఎంపీ సెన్సార్ పై పని చేయనుందని సమాచారం. మనం వీడియో తీసేటప్పుడు జూమ్ చేసినప్పుడు 4కె, 8కె వరకు వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుందని లీకైన స్క్రీన్ షాట్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లో 600 ఎంపీ కెమెరాను తీసుకొస్తే కెమెరా బంప్ 22 మిమీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఫోన్ వెనుక భాగంలో 12 శాతం స్థలాన్ని ఆక్రమించనుంది. ప్రస్తుతానికి ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది భవిష్యత్ లో దీనిని తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దీని గురుంచి శామ్‌సంగ్ నుండి ఎటువంటి సమాచారం లేదు. శామ్‌సంగ్ సంస్థ సుదీర్ఘకాలంగా స్మార్ట్ ఫోన్ డిస్ప్లేలతోపాటు, శక్తివంతమైన కెమెరా సెన్సార్లని కూడా స్వయంగా తయారు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment