బాల ఫొటోగ్రాఫర్ల కోసం అదిరిపోయే కెమెరా..ఫీచర్లు ఏంటంటే? | VTech KidiZoom Creator Cam review | Sakshi
Sakshi News home page

బాల ఫొటోగ్రాఫర్ల కోసం అదిరిపోయే కెమెరా..ఫీచర్లు ఏంటంటే?

Published Sun, Nov 12 2023 9:29 AM | Last Updated on Sun, Nov 12 2023 9:29 AM

VTech KidiZoom Creator Cam review - Sakshi

చిన్నారులు ఫొటో తీసుకుంటున్న ఈ కెమెరా ప్రత్యేకంగా బాల ఫొటోగ్రాఫర్ల కోసం రూపొందించినది. ఇందులో ఫొటోలు తీసుకోవడంతో పాటు ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఆస్ట్రేలియన్‌ కంపెనీ వీ–టెక్‌ ‘కిడిజూమ్‌’ పేరుతో ఈ కెమెరాను మార్కెట్‌లోకి తెచ్చింది.

ఇది 2.0 మెగాపిక్సెల్‌ కెమెరా. ఇందులో నాలుగు రెట్లు జూమ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో 35 ఫొటో ఎఫెక్ట్స్, నాలుగు గేమ్స్, నాలుగు యాప్స్‌ కూడా ఉంటాయి. ఈ కెమెరాతో తీసుకున్న ఫొటోలను చిన్నారులు తమంతట తామే కోరుకున్న రీతిలో ఎడిట్‌ చేసుకోవచ్చు.

వాటిని కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలకు ఈ కెమెరా చక్కని కాలక్షేపంగా ఉంటుంది. పొరపాటున చేయిజారినా పగిలిపోని విధంగా దీన్ని దృఢంగా రూపొందించడం విశేషం. దీని ధర 63.74 డాలర్లు (రూ.5,306) మాత్రమే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement