ఇదీ ఐఫోన్ 13 సినిమాటిక్ మోడ్‌తో తీసిన షాట్
అందమైన ఫొటోలు, వీడియోలు తీయాలంటే ప్రొఫెషనల్ కెమెరాపర్సన్ అయ్యి ఉండాలా?. చేతిలో ఫోన్, కెమెరాలు ఉంటే చాలూ తీసేయొచ్చు. కాకపోతే ఈరోజుల్లో సోషల్‌మీడియాలో షేర్ చేయడానికి ‘జస్ట్ వాంట్ టు షూట్ ఏ లిటిల్ వీడియో’ అనుకునే వాళ్లు.. అది కచ్చితంగా అందరూ మాట్లాడుకునేలా ఉండాలని అనుకుంటున్నారు. ఇందుకోసం ‘క్వాలిటీ’ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. అలాంటి వాళ్ల కోసం సినిమాటిక్ మోడ్‌ను అందిస్తోంది ఐఫోన్ 13.
పైన మీరు చూస్తున్నది మెక్సికో సిటీలో గత కొంతకాలంగా తీసిన దృశ్యాలు. ఎంత బాగున్నాయో కదా! ఏదో హాలీవుడ్ రేంజ్ వీడియోలాగా అనిపిస్తుందా? కానీ, ఇది తీసింది ఓ ఫోన్‌తో. అదీ ఐఫోన్ 13 ప్రోతో. ఇందులోని సినిమాటిక్ మోడ్ వెర్షన్ ఇప్పుడు యూత్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
వీడియోగ్రాఫర్ జె.మారిసన్, సింగర్ జూలియ వోల్ఫ్(ఫాలింగ్ ఇన్ లవ్ సాంగ్ ఫేమ్) మ్యూజిక్ వీడియోలను స్టూడియోలలో కాకుండా రోడ్ల మీద చిత్రీకరించి శబ్భాష్ అనిపించుకున్నాడు. దీనికి కారణం ఐఫోన్13 సినిమాటిక్ మోడ్ అంటాడు మారిసన్. ‘ఐఫోన్13 ప్రో నా చేతుల్లోకి తీసుకోగానే మొదట నేను ఆసక్తితో పరీక్షించింది సినిమాటిక్ మోడ్. చాలా షార్ప్ అనిపించింది. మీలో టాలెంట్ తక్కువైనా సరే, సాధారణ లొకేషన్స్ అయినా సరే ఖరీదైన లుక్ తీసుకురావచ్చు. కిట్ భారం లేకుండా ట్రావెల్ వీడియోలకు సినిమాటిక్ లుక్ ఇవ్వొచ్చు’ అంటున్నాడు మారిసన్. అడ్వాన్స్‌డ్ వీడియో రికార్డింగ్ ఫీచర్ ‘సినిమాటిక్ మోడ్’ ఐఫోన్13 నాలుగు మోడల్స్‌లోనూ అందుబాటులో ఉంది.
చదవండి: ఐఫోన్-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఇండియన్స్..!
సెప్టెంబర్ 14 ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్ ఈవెంట్’ జరిగిన తరువాత యాపిల్ ఐఫోన్13 సిరీస్‌లోని లాంగర్ బ్యాటరీలైఫ్, హైయర్ స్క్రీన్‌బ్రైట్‌నెస్, మెరుగైన కెమెరాసిస్టమ్...ఇలా ఆసక్తికరమైన విషయాలు, ఫెంటాస్టిక్ అప్‌గ్రేడ్‌ల గురించి మాట్లాడుకోవడం ఎక్కువైంది. వీటిలో యూత్‌ను ఆకట్టుకుంటున్న ఫీచర్... సినిమాటిక్ మోడ్.
డిజిటల్ ఫొటోగ్రఫీ శకం మొదలైన తరువాత ఆనాటి ఫిల్మ్‌కెమెరాలతో సాధ్యమైనవి సాధ్యం చేయడం తోపాటు ‘రీల్’కు అందని సూక్ష్మఅంశాలను కాప్చర్ చేయడం, పరిమితులతో కూడిన విన్‌యెటింగ్(రిడక్షన్ ఆఫ్ ఇమేజెస్ బ్రైట్‌నెస్) పరిధిని పెంచడం లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ వీడియో ప్రేమికులను ఆకట్టుకునే ఫీచర్లకు ప్రాధ్యానత ఇస్తుంది.
తాజా ‘సినిమాటిక్ మోడ్’ హెడ్‌లైన్ న్యూఫీచర్‌గా నిలిచింది. ‘సినిమాటిక్ మోడ్’తో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే, ముఖ్యంగా...వీడియో బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయవచ్చు. ఆటో–ఫోకస్ సెట్ చేసుకోవచ్చు. పోట్రాయిట్ మోడ్ వీడియోలకు, ఫోకస్ పాయింట్లను ఎంపిక చేసుకోవడానికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ట్రెడిషనల్ వీడియో మోడ్‌తో పోల్చితే ‘స్పెషల్’ మోడ్‌గా చెప్పే దీనిలో రిజల్యూషన్, ఫ్రేమ్‌రేట్ మెరుగ్గా ఉంటుంది.
డెప్త్ ఇన్‌ఫర్‌మేషన్(సైట్‌లో ఉండే అబ్జెక్ట్స్‌కు కెమెరాకు మధ్య ఉండే దూరం)ను రికార్డ్ చేస్తుంది. ఈ సమాచారంతో వీడియో షూట్ చేసిన తరువాత కూడా సీన్‌లో ఫోకస్‌ను షిఫ్ట్ చేసుకోవచ్చు.
మోడ్రన్ డే మూవీస్‌లో ‘డెప్త్ ఆఫ్ ఫీల్డ్’ కీలక పాత్ర పోషిస్తుంది. ‘డెప్త్ ఆఫ్ ఫీల్డ్’ను ఎడిట్ చేసుకోవడానికి ఇక ప్రొఫెషనల్ కెమెరాలు మాత్రమే అవసరం లేదు. మూవీస్‌లో కనిపించే ‘ఐకానిక్ విజువల్ ఎఫెక్ట్’ను సినిమాటిక్‌మోడ్‌తో పునఃసృష్టి చేసే ప్రయత్నం చేసింది ఐఫోన్ 13. డాల్బీ విజన్ హెచ్‌డీఆర్‌లో సినిమాటిక్‌మోడ్ వీడియోలను రికార్డ్ చేస్తుంది. స్థూలంగా చెప్పాలంటే స్టూడియో లు, ప్రొఫెషనల్ లైటింగ్, ఖరీదైన సాంకేతిక పరికరాలు అవసరం లేకుండానే... వీడియోలకు సినిమాటిక్ లుక్ తీసుకు రావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment