Latest Trend
-
కలిసే దూరంగా ఉందాం!
పెళ్లయిన కొత్తలో ఆమె ఏం చెప్పినా, చేసినా అతనికి ఎంతో ఇష్టం. ఇద్దరికీ నచ్చిన ఫుడ్, నచ్చిన రంగు, నచ్చిన హాలిడే వెకేషన్. కొన్నాళ్లు గడిచాక సీన్ రివర్స్. ఏం చేసినా తప్పే. చేయకపోయినా తప్పే. టాయిలెట్ కమోడ్ మూత వేయకపోతే మాటల యుద్ధం. మంచంపై తడిసిన తువ్వాలు కనిపిస్తే పెద్ద వాగ్వాదం. ఏసీ నంబర్ పెంచినా, తగ్గించినా పట్టరానంత కోపాలు. పెద్దలు కుదిర్చిన పెళ్లికావొచ్చు మనసులు కలిపిన ప్రేమ వివాహం కావొచ్చు. కీచులాటలు కామన్. ఇలా కొట్టుకుంటూ కలిసుండే బదులు విడిపోతే బాగుండు అనే జంటలు కోకొల్లలు. శాశ్వతంగా విడిపోకుండా దూరం దూరంగా వేర్వేరు ఇళ్లలో ఉంటూ ఒకరికిపై మరొకరు గాఢమైన ప్రేమానుబంధాలను పెంచుకునే కొత్త ధోరణి ఇప్పుడు మొగ్గ తొడిగి వేగంగా విస్తరిస్తోంది. దీనికే ఇప్పుడు చాలా జంటలు ‘దూరంగా కలిసి బతకడం( లివింగ్ అపార్ట్ టుగెదర్ ) అనే కొత్త పేరు పెట్టి ఆచరిస్తున్నాయి. ఈ నయా ట్రెండ్‌లోని విశేషాలను తెల్సుకునేందుకు ఆయా జంటల జీవితాల్లోకి ఓసారి తొంగిచూద్దాం.. ఏమిటీ ఎల్ఏటీ? లివింగ్ అపార్ట్ టుగెదర్ (ఎల్ఏటీ) గురించి 19వ శతాబ్దానికి చెందిన లెబనాన్ మూలాలున్న అమెరికన్ రచయిత కహ్లిల్ గిబ్రాన్ తన ‘పెళ్లి’కవితలో తొలి సారిగా ప్రస్తావించారు. భా ర్యభర్తలు ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ తమ అహం కిరీటం కిందపడొద్దనే కారణంగా తమ మాటే నెగ్గాలనే మొండిపట్టుదలతో చిన్నపాటి వాగ్వాదాలకు దిగుతారు. తర్వాత బాధపడతారు. మళ్లీ అంతా సర్దుకోవడానికి కాస్తంత సమ యం పడుతుంది.ఇప్పుడున్న ఆధునిక యుగంలో భార్యాభర్తలిద్దరూ సొంత కెరీర్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, వృత్తుల్లో నిమగ్నమవుతున్నారు. పని కోసం వేరే చోట ఉండాల్సి రావడం, వ్యక్తిగత అభిప్రాయాలకు గౌరవించాల్సి రావడం, అన్యోన్యంగా ఉన్నాసరే కొన్నిసార్లు వ్యక్తిగత ఏకాంతం(పర్సనల్ స్పేస్) కోరుకోవడం వంటివి జరుగుతున్నాయి. వీటికి పరిష్కార మార్గంగా జంటలే తమకు తాముగా ఎల్ఏటీకి జై కొడుతున్నాయి. చినికిచినికి గాలివాన దుమారంగా మారే ప్రమాదాలను దూరం దూరంగా ఉండటం వల్ల తప్పించుకోవచ్చని జంటలు భావిస్తున్నాయి.ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇస్తూనే ఇలా దూరంగా ఉంటూ మానసికంగా అత్యంత దగ్గరగా ఉంటున్నామని ఎల్ఏటీ జంటలు చెబుతున్నాయి. ‘‘సాన్నిహిత్యంలోనూ కా స్తంత ఎడం ఉంచుదాం. ఈ స్వల్ప దూరా ల్లోనే స్వర్గలోకపు మేఘాల స్పర్శను స్పశిద్దాం’’అంటూ జంటలు పాటలు పాడుకుంటున్నాయని కవి గిబ్రాన్ ఆనాడే అన్నారు. ఎవరికి బాగా నప్పుతుంది?వేర్వేరు చోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే జంటలు ఈ సిద్ధాంతాన్ని ఆచరించి మంచి ఫలితాలు పొందొచ్చు. ముఖ్యమైన పనుల మీద దూరంగా, విదేశాల్లో గడపాల్సిన జంటలు ఈ మార్గంలో వెళ్లొచ్చు. వ్యక్తిగత ఏకాంతం కోరుకుంటూనే జీవిత భాగస్వామికి అత్యంత విలువ ఇచ్చే జంటలూ ఈ సిద్ధాంతం తమకు ఆమోదయోగ్యమేనని చెబుతున్నాయి. వేర్వేరు కార్యాలయాలు, భిన్న వృత్తుల్లో, విభిన్న సమయాల్లో పనిచేసే జంటలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భాగస్వామికి అతిభారంగా మారకూడదని, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడదామని భావించే జంటలూ ఈ ట్రెండ్‌ను ఫాలో కావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎలా సాధ్యం?కథలు, సినిమాల్లో, నవలల్లో ప్రస్తావించినట్లు దూరంగా ఉన్నప్పుడు ప్రేమికులను విరహవేదన కాల్చేస్తుంది. అదే వేదన ఈ జంటలకు ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. కలిసిమెలిసి ఉంటేనే బంధం బలపడుతుందన్న భావనకు భిన్నమైన సిద్ధాంతం ఇది. కాస్తంత కష్టపడితే ఈ బంధాన్నీ పటిష్టపరుచుకోవచ్చని మనోవిజ్ఞాన నిపుణులు చెప్పారు. ‘‘వారాంతాలు, సెలవు దినాల్లో ఒకరి నివాస స్థలానికి ఇంకొకరు వచ్చి ఆ కాస్త సమయం అత్యంత అన్యోన్యంగా గడిపివెళ్తే చాలు. తమ మధ్య దూరం ఉందనే భావన చటక్కున మటుమాయం అవుతుంది.కలిసి ఉన్నప్పటి సరదా సంగతులు, మధుర స్మృతులను మాత్రమే టెక్ట్స్ రూపంలో సందేశాలు పంపుతూ గుర్తుచేసుకుంటూ ప్రేమ వారధికి మరింత గట్టిదనం కల్పించొచ్చు. కలిసి ఉన్నప్పుడు జరిగిన గొడవలను భూతద్దంలోంచి చూడటం మానేయాలి. ఆధునిక జంటల్లో స్వతంత్ర భావాలు ఎక్కువ. గతంతో పోలిస్తే వ్యక్తిగత ఏకాంతం ఎక్కువ కోరుకుంటారు. జీవిత భాగస్వామి ఆలోచనలకు విలువ ఇవ్వాలి. పాత, చేదు విషయాలను తవ్వుకోవడం తగ్గించాలి’’అని ఢిల్లీలోని ఎల్ఏటీ నిపుణుడు రుచీ రూహ్, మానసిక నిపుణుడు, జంటల మధ్య మనస్పర్థలను తగ్గించే డాక్టర్ నిషా ఖన్నా సూచించారు. చివరగా చెప్పేదేమంటే? విడివిడిగా జీవించే సమయాల్లో ఇద్దరి మధ్యా నమ్మకం అనేది అత్యంత కీలకం. ఆర్థిక, శారీరక, మానసిక అంశాలను నిజాయతీగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడుకుని కష్టాల కడలిలోనూ జీవననావ సాఫీగా సాగేలా చూసుకోవాలి. ఎప్పుడు కలవాలి? ఎక్కడ కలవాలి? ఎంతసేపు కలవాలి? ఏమేం చేయాలి? అనేవి ముందే మాట్లాడుకుంటే వేచి చూడటం వంటి ఉండవు. అనవసర కోపాలు, అపార్థాలు రావు. భారత్‌లో బ్రతుకు దెరువు కోసం లక్షలాది కుటుంబాల్లో పురుషులు వేరే జిల్లాలు, రాష్ట్రాలకు వలసవెళ్తూ భార్యను గ్రామాల్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నారు.విశాల దృక్పథం, మానసిక పరిణతి కోణంలో చూస్తే భారత్‌లో దశాబ్దాలుగా ఎల్ఏటీ సంస్కృతి ఉందనే చెప్పాలి. ప్రత్యేకంగా పేరు పెట్టకపోయినా నోయిడా, గుర్గావ్, ఢిల్లీ, ముంబైలలో ఇద్దరూ పనిచేసే చాలా జంటలు ఇదే సంస్కృతిని ఆచరిస్తున్నాయి. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, సొంతూర్లలో వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతల కారణంగా మెట్రో నగరాల్లో చాలా జంటలు దూరంగా ఉంటున్నాయి. పశ్చిమదేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి బాగా విస్తరిస్తోంది. -
కుట్టు.. ఫొటో ఆకట్టు..
మనలో చాలా మంది జీవితంలో మరపురాని సందర్భాలను పదిలపరుచుకుంటారు. కొందరు వీడియోల రూపంలో దాచుకుంటే మరికొందరు ఫొటోల రూపంలో భద్రపరుచుకుంటారు. పుట్టిన పిల్లలకు సంబంధించి ప్రతి నెలా, ప్రతి సంవత్సరం విభిన్నంగా ఫొటో షూట్స్ చేసుకుంటున్నారు. అందరిలాగే మనం ఎందుకు ఉండాలని కొందరు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఉండేవి కదా.. మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్తున్నారు. అలా సాధారణ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు కొత్త సొబగులు అద్దుతూ సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు చేతులతో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ కొత్త లుక్ తీసుకొస్తారు. చీరలకు, జాకెట్లకు, డ్రెస్‌లకు ఎంబ్రాయిడరీ వర్క్స్ తరహాలోనే.. ఫొటోలకు ఎంబ్రాయిడరీ ఏంటని ఆశ్చర్యపోయేలా వర్క్ చేస్తున్నారు. అవును ఈ సరికొత్త ట్రెండ్ గురించే ఈ కథనం... ఫొటోలపై హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇటీవల నగరంలో ఫేమస్ అవుతోంది. చాలా ఏళ్ల నుంచి ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ పనితీరు ట్రెండింగ్‌లో ఉండగా, తాజాగా మన నగరంలోకి వచి్చంది. పెళ్లి ఫొటోలు, బర్త్‌డే ఫొటోలు, బేబీ బంప్ సందర్భంగా తీసిన ఫొటోలను ఫ్రేమ్స్ రూపంలో ఇంట్లో పెట్టుకోవాలనుకునే వారు.. నార్మల్‌గా కాకుండా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఫొటోలకు డిఫరెంట్ లుక్ తీసుకొచ్చి తగిలించుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఫొటోలకే కాకుండా ఇంటికి కూడా సరికొత్త కళ వస్తోందని కస్టమర్లు అంటున్నారని నగరానికి చెందిన ఓ ఫొటోగ్రాఫర్ చెబుతున్నాడు. ఎంబోజ్ వంటి ప్రింటింగ్‌తో కూడా ఇలాంటి ఎఫెక్ట్ తీసుకురావొచ్చని, అయితే దానికన్నా ఎంబ్రాయిడరీకే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని తెలిపాడు. ముఖ్యంగా ఇంట్లో తగిలించుకునే ఫొటో ఫ్రేమ్స్ విషయంలో ఎక్కువ మంది ఇలాగే అడుగుతున్నారని పేర్కొన్నాడు. ఎలా చేస్తారు..? సాధారణంగా పెళ్లి ఫొటోలు లేదా ప్రత్యేక అకేషన్లలో దిగిన ఫొటోలను బ్లాక్ అండ్ వైట్ లేదా కలర్లో ప్రింట్ చేస్తారు. మనకు కావాల్సిన పరిమాణంలో ప్రింట్ తీసుకున్నాక.. మనకు కావాల్సిన మోడల్లో ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. కలర్ ఫొటోల వెనుక తెలుపు రంగులో ఫొటో పేపర్‌ను అతికించి, దానిపై ఫ్రేమ్ మాదిరిగా, ఫ్లవర్స్ లేదా మరేదైనా మనకు కావాల్సిన డిజైన్ హ్యాండ్‌తో ఎంబ్రాయిడరీ చేస్తుంటారు. లేదంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలపై వేసుకున్న డ్రెస్ కానీ, ధరించిన పూల దండలు, నగలను మాత్రమే హైలైట్ చేస్తూ రంగురంగుల దారాలతో అల్లుతారు. దీంతో ఫొటోకు సరికొత్త కళ వస్తుందని చెబుతున్నారు. కాస్త సమయం పట్టినా.. సాధారణంగా ఫొటో ఎడిటింగ్, ప్రింటింగ్ నిమిషాల్లో అయిపోతుంది. కానీ ఎంబ్రాయిడరీకి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. సైజును బట్టి.. ఫొటోపై కుట్టాల్సిన ఎంబ్రాయిడరీని బట్టి సమయం తీసుకుంటున్నారు. ఒక్క ఫొటో పూర్తి చేసేందుకు కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుందని ఓ షాప్ నిర్వాహకుడు వివరించాడు. సాధారణ ఫొటోలతో పోలిస్తే కాస్త ఖరీదు ఎక్కువ అయినా గిఫ్ట్‌లు ఇచ్చేందుకు ఫొటో ఎంబ్రాయిడరీని ఎంచుకుంటున్నారని చెబుతున్నాడు.బహుమతులకు పర్ఫెక్ట్.. ఫొటో ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ నగరంలో కొత్తగా వచి్చంది. ఎంబోజ్, గ్లిట్టర్ వంటి ఫొటో ప్రింటింగ్ టెక్నాలజీని ఆల్బమ్‌లు రూపొందించేందుకు ఎక్కువగా వాడుతుంటాం. వీటితో ఆల్బమ్‌కు, ఫొటోలకు మంచి లుక్ వస్తుంటుంది. అయితే ఫొటో ఎంబ్రాయిడరీని ఆల్బమ్‌లో పెట్టడం కాస్త కష్టం. అందుకే చాలా మంది ఫొటో ఫ్రేమ్స్ చేయించుకునేందుకు ఫొటో ఎంబ్రాయిడరీ గురించి అడుగుతున్నారు. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్, పెళ్లి వంటి శుభకార్యాల్లో గిఫ్ట్‌గా ఇచ్చేందుకు దీన్ని ఎంచుకుంటున్నారు. చూసేందుకు బాగుండటమే కాకుండా రిచ్‌గా, సరికొత్తగా ఉంటోందని చెబుతున్నారు. :::బీసు విష్ణుప్రసాద్, ఫొటోగ్రాఫర్ ::: సాక్షి, సిటీబ్యూరో -
ఇంటర్నెట్ను ఓ ఊపు ఊపేస్తోంది!
సోషల్ మీడియాలో క్రియేటివిటీ తారాస్థాయికి చేరుకుంటోంది. గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ.. అది ఏ కోణంలో ఉన్నాసరే నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ను కుదిపేస్తున్న ఓ లేటెస్ట్ ట్రెండ్ గురించి తెలుసుకుందాం.లుక్ బిట్వీన్ యువర్ కీ బోర్డు..look between on your keyboard సోషల్ మీడియాను ప్రస్తుతం ఊపేస్తున్న ట్రెండ్. కొత్తదేం కాకపోయినా.. ప్రస్తుతం దీనిని తెగ వాడేస్తున్నారంతా. వివిధ నగరాల పోలీసులు, ఐపీఎల్ జట్లు, ఫుడ్ యాప్స్, అమెజాన్ లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఈ ట్రెండ్‌లో భాగం అయ్యాయి. మరోవైపు.. ఎన్నికల వేళ రాజకీయపార్టీలు సైతం ఈ ట్రెండ్‌ను ఫాలో అయిపోతున్నాయి. Wanna know what their favourite key is? 👀Look between 5 & 7 on your keyboard 😋 pic.twitter.com/GRbD9aLOAr— SunRisers Hyderabad (@SunRisers) April 23, 2024 Who’s whistling today? 🥳Check your keyboard between Q and R!⌨️#CSKvLSG #WhistlePodu 🦁💛@msdhoni pic.twitter.com/GFqamYkcZk— Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2024 Curious to know who will support CM YS Jagan in doubling the growth of Andhra Pradesh?Just read the letters between Q and R on your keyboard!— YSR Congress Party (@YSRCParty) April 23, 2024 Applicant: "I want to break the record for the longest time without sleep!!"Us: Look between T and U on your keyboard— Guinness World Records (@GWR) April 23, 2024 సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పలేం. అర్థమైతే సరే సరి. కొందరైతే ఈ పోస్టులకు అర్థమేంటో తెలుసుకోవడంలో ఇబ్బందిపడుతుంటారు. మరి లుక్ బిట్వీన్ యువర్ కీ బోర్డు ట్రెండ్ గురించి తెలియని వాళ్ల కోసం.. ఈ ట్రెండ్ అసలు ఎక్కడ మొదలైందంటే.. ఇంగ్లీష్ ఆల్పాబెట్స్ కీ బోర్డు బేస్ చేసుకుని పుట్టిందే ఈ ట్రెండ్. 2021లో 4Chan అనే వెబ్సైట్ ఈ ట్రెండ్‌ను ఆరంభించింది. కాన్(K-ON) అనే యానిమేటెడ్ సిరీస్‌లో పాత్రను పరిచయం చేయడానికి ఈ ట్రెండ్‌ను ఉపయోగించారు. లుక్ బిట్వీన్ T అండ్ O అంటూ ‘YUI’(యూఈ) అనే పాత్రను పరిచయం చేశారు. అయితే ఆ తర్వాత ఈ ట్రెండ్ అంతగా ప్రాచుర్యంలో లేకుండా పోయింది. ఇప్పుడు భారతీయుల దెబ్బకు మళ్లీ తెర మీదకు వచ్చేసింది.ఈ ట్రెండ్‌లో.. ఉదాహరణకు.. లుక్ బిట్వీన్ H అండ్ L ఆన్ యువర్ కీ బోర్డు అన్నారనుకోండి. మనం వాడే కీబోర్డుల్లో వాటి మధ్య లెటర్స్ ‘JK’ ఉంటాయి. షార్ట్ కట్లో దానికి జస్ట్ కిడ్డింగ్ అనే అర్థం ఉంది.ఇక.. ఇంటర్వ్యూయర్ చూపు ఎప్పుడూ X అండ్ B మధ్య ఉంటుందని ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. ఆ రెండు లెటర్స్ మధ్య కీబోర్డులో ఉండేది CV(కరికులమ్ విటే-రెజ్యూమ్). ఇలా కీబోర్డులోని వివిధ అక్షరాలతో తమదైన శైలిలో నెటిజన్లు సరదా సరదా పోస్టులు పెడుతున్నారు. దీంతో మీమ్స్ స్థాయికి దాకా చేరుకుంది. look between Y and P on your keypad. pic.twitter.com/v9klSewlKS— Xavier Uncle (@xavierunclelite) April 23, 2024 Opening Twitter app and watching people here talk like look in keyboard betweenH and LY and OQ and RX and VZ and CE and YF and HI and P pic.twitter.com/kPtJKOybhb— Nabeel Shah (@nabeel_AMU) April 23, 2024 -
ఆభరణాల డిన్నర్ సెట్
కంఠహారం, చెవి జూకాలు, ఉంగరాలు.. ఇలా ఆభరణాలను ఒక సెట్‌గా తీసుకోవడం మనకు తెలిసిందే! ఇప్పుడు డిన్నర్ సెట్ ఆభరణాల అలంకరణ కొత్త ట్రెండ్‌గా మారింది. డిన్నర్‌సెట్ ఆభరణాలు ఇంటికి మరింత కళను తీసుకువస్తున్నాయి. పింగాణీ కప్పులు, ప్లేట్ల మీద ఇంపైన ఆభరణాల డిజైన్లు భలే మెరుస్తున్నాయి. డిజైన్‌ను బట్టి, వాటికి వాడిన రంగుల నాణ్యతను బట్టి వీటి ధరలు ఉంటున్నాయి. వీటిలో పూసలు, ముత్యాలు, స్టోన్స్, ఎనామిల్ పెయింట్స్‌ను కూడా వాడుతున్నారు. ఈ డిజైన్లలో బంగారు పూత, నిజమైన రత్నాలు వాడినవీ ఉంటున్నాయి. ప్లెయిన్‌గా ఉండే పింగాణీ కప్పుల మీద అందమైన ఆభరణాల డిజైన్లను తీర్చిదిద్దేతే అవి కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. ప్లెయిన్ పింగాణీ వస్తువులను కొనుక్కుని, వాటిపై స్వయంగా రంగులు వేసుకోవచ్చు. ఆభరణాల డిజైన్‌నూ దిద్దుకోవచ్చు. అతిథులను ఆకట్టుకునేలా వీటిని వేడుకలలో ఉపయోగిం చవచ్చు. -
వాటితో డిజైన్.. ఇంటిని ప్యాలస్‌లా మార్చండి!
ఆకాశంలో విరిసే హరివిల్లుతో పాటు అక్కడ ఉండే మబ్బులు, తారలు, చందమామ.. అన్నీ మన ఇంటి రూఫ్ మీద కనువిందు చేస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుందో కదా! ‘ఆ హంగులన్నీ ఏ ప్యాలెస్‌లోనో కనిపిస్తాయి.. మన ఇళ్లకు అంత సీన్ లేదు’ అని అనుకోనక్కర్లేదు. ఇప్పుడు ఆ ప్యాలెస్ స్టైల్ ట్రెండ్‌లోకి వచ్చేసింది. సీలింగ్ స్టిక్కర్‌తో మనిళ్లనూ అలా అలంకరించుకోవచ్చు. గది గదికో తీరు లివింగ్ రూమ్ గ్రాండ్‌గా కనిపించే స్టిక్కర్ డిజైన్స్‌లో అడవి అందాలు, వన్యమృగాలు, పువ్వుల చందాలతో సీలింగ్ సిత్రాలు కనువిందు చేస్తున్నాయి. బెడ్రూమ్లో చుక్కల ఆకాశాన్ని, సముద్రపు సొగసును దించేస్తున్నాయి. ఎలాంటి ఆర్భాటాలూ వద్దూ అనుకునేవారికి సింపుల్ చిత్రాలూ ఉన్నాయి. మది మెచ్చిన జోరు కార్లు, విమానాలు.. ఏవి కోరుకుంటే అవి సీలింగ్‌కి అతికించేసి ముచ్చట తీర్చేసుకునే రోజు వచ్చేసింది. లైట్లు ఆర్పేస్తే తళుక్కున చుక్కలు మెరిసేలా రూఫ్ డిజైన్ చేయించుకునేవారు ఇదివరకు. ఇప్పుడు ఇది కాస్త అడ్వాన్స్ అయ్యి ఏకంగా ఆకాశాన్నే ఇంటి పైకప్పుకు కట్టేసుకుంటున్నారు ఈ రూఫ్ స్టిక్కర్స్‌తో. సీలింగ్ ఆర్ట్ యాంటిక్ థీమ్‌నూ రూఫ్ మీద పరచవచ్చు. దాని కోసం ఎంపిక చేసుకున్న డిజైన్‌ను వాల్ ఆర్ట్‌లాగే రూఫ్ మీదా ఆర్ట్‌గా వేయించుకోవచ్చు. కార్టూన్ హుషారు పిల్లల బెడ్రూమ్లలో పాలపుంతనే కాదు కామిక్ రూపాలనూ కనువిందుగా డిజైన్ చేయించవచ్చు. ఇందుకు సులువైన ఎంపిక సీలింగ్ స్టిక్కర్సే! పిల్లలకు ఇష్టమైన కామిక్ క్యారెక్టర్లు, బొమ్మల చిత్రాలు, కార్ల జోరు.. వగైరా రూఫ్ పేపర్స్ జాబితాలో ఉన్నాయి. రూ.200 నుంచి లభించే ఈ సీలింగ్ స్టిక్కర్స్‌తో ఇంటి రూపాన్నే మార్చేయచ్చు. కొంచెం బోర్ కొట్టిన ఇంటి రొటీన్ డిజైన్ నుంచి ‘వావ్’ అనిపించేలా క్రియేట్ చేయచ్చు. -
ఎస్‌యూవీలు.. తగ్గేదేలే!
గత కొన్నేళ్లుగా దేశీ ఆటో రంగంలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. కార్ల విభాగంలో కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్‌యూవీలు) అమ్మకాలు యమ స్పీడ్‌గా వృద్ధి చెందుతున్నాయి. వెరసి అత్యధిక శాతం కస్టమర్లు ఆసక్తి చూపే చిన్న ప్రీమియం కార్ల విక్రయాలను ఇవి వెనక్కి నెడుతున్నాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి 11 నెలల్లో మొత్తం అమ్మకాలలో చిన్న ఎస్‌యూవీల వాటా 22 శాతానికి ఎగసింది. ఇదే సమయంలో హ్యాచ్‌బ్యాక్ కార్ల వాటా 19 శాతంగా నమోదైంది. ఇతర వివరాలు చూద్దాం... దేశీయంగా ప్రయాణికుల(ప్యాసింజర్) వాహనాల విభాగంలో ఇటీవల కొన్నేళ్లుగా ఎస్‌యూవీలు యమ స్పీడును ప్రదర్శిస్తున్నాయి. అమ్మకాలలో ప్రీమియం చిన్న కార్లను దాటి వేగంగా పరుగెడుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది తొలి 11 నెలల్లో వీటి వాటా 22 శాతానికి చేరింది. వెరసి ఎప్పటినుంచో అమ్మకాలలో మార్కెట్ లీడర్లుగా నిలుస్తున్న హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాలను వెనక్కి నెట్టాయి. ఏప్రిల్–ఫిబ్రవరిలో వీటి వాటా 19%కి పరిమితంకావడమే ఇందుకు నిదర్శనం. ఈ బాటలో దేశీయంగా విక్రయమవుతున్న ప్రతీ రెండు కార్లలో నూ ఒకటి ఎస్‌యూవీయే ఉంటున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. వెరసి మార్చితో ముగియనున్న ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడవుతున్న విభాగంగా ఎంట్రీలెవెల్ ఎస్‌యూవీలు నిలవనున్నట్లు తెలియజేశారు! వివిధ మోడళ్ల ఎఫెక్ట్ కొన్నేళ్లుగా రూ. 10 లక్షల ధరలలోపు కొత్త యూఎస్వీ మోడళ్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. వీటికి సులభమైన ఫైనాన్స్ సౌకర్యాలు జత కలుస్తున్నాయి. మరోపక్క సరఫరా సమస్యలతో హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల తయారీ నీరసించడం ఎస్‌యూవీలకు డిమాండును పెంచుతోంది. పరి శ్రమ వర్గాల అంచనాల ప్రకారం మారుతీ సుజుకీ బ్రెజ్జా, టాటా నెక్సాన్, పంచ్, రేనాల్ట్ కైగర్, హ్యుందాయ్ వెన్యూ మోడళ్లు ఉమ్మడిగా తొలి 11 నెలల్లో 6,00,000 వరకూ విక్రయమయ్యాయి. ఇదే కాలంలో వివిధ కంపెనీల హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు 5,40,000 అమ్ముడైనట్లు అంచనా. ప్రారంభ శ్రేణి ఎస్‌యూవీల స్పీడుకు ప్రధానంగా మూడు కారణాలున్నట్లు మారుతీ సుజుకీ సీనియర్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ చెబుతున్నారు. పలు కొత్త మోడళ్లు విడుదలకావడం, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ సెడాన్ ధరలతో పోలిక వంటి అంశాలను ప్రస్తావించారు. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో బ్రెజ్జా అత్యధికంగా విక్రయమవుతున్న మోడల్‌గా పేర్కొన్నారు. జాబితాలో కంపెనీలు.. హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలలో సగం వాటా ఎస్యూవీలదేకాగా.. టాటా మోటా ర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా , జీప్, కియా, ఎంజీ మోటార్స్, నిస్సాన్ ఎస్‌యూవీలను రూపొందించడంలో ముందుంటున్నాయి. గత మూడు, నాలుగేళ్లలోనే 12 రకాల కొత్త యూఎస్‌వీలు మార్కెట్లలోకి ప్రవేశించాయి. మొత్తం ఎస్‌యూవీల మార్కెట్లో ఎంట్రీలెవెల్ ఎస్‌యూవీల వాటా 60 శాతంకావడం గమనించదగ్గ అంశం! -
ఎవరబ్బా ఈ వీడియో తీసింది.. ఓ రేంజ్లో ఉంది
అందమైన ఫొటోలు, వీడియోలు తీయాలంటే ప్రొఫెషనల్ కెమెరాపర్సన్ అయ్యి ఉండాలా?. చేతిలో ఫోన్, కెమెరాలు ఉంటే చాలూ తీసేయొచ్చు. కాకపోతే ఈరోజుల్లో సోషల్‌మీడియాలో షేర్ చేయడానికి ‘జస్ట్ వాంట్ టు షూట్ ఏ లిటిల్ వీడియో’ అనుకునే వాళ్లు.. అది కచ్చితంగా అందరూ మాట్లాడుకునేలా ఉండాలని అనుకుంటున్నారు. ఇందుకోసం ‘క్వాలిటీ’ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. అలాంటి వాళ్ల కోసం సినిమాటిక్ మోడ్‌ను అందిస్తోంది ఐఫోన్ 13. పైన మీరు చూస్తున్నది మెక్సికో సిటీలో గత కొంతకాలంగా తీసిన దృశ్యాలు. ఎంత బాగున్నాయో కదా! ఏదో హాలీవుడ్ రేంజ్ వీడియోలాగా అనిపిస్తుందా? కానీ, ఇది తీసింది ఓ ఫోన్‌తో. అదీ ఐఫోన్ 13 ప్రోతో. ఇందులోని సినిమాటిక్ మోడ్ వెర్షన్ ఇప్పుడు యూత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీడియోగ్రాఫర్ జె.మారిసన్, సింగర్ జూలియ వోల్ఫ్(ఫాలింగ్ ఇన్ లవ్ సాంగ్ ఫేమ్) మ్యూజిక్ వీడియోలను స్టూడియోలలో కాకుండా రోడ్ల మీద చిత్రీకరించి శబ్భాష్ అనిపించుకున్నాడు. దీనికి కారణం ఐఫోన్13 సినిమాటిక్ మోడ్ అంటాడు మారిసన్. ‘ఐఫోన్13 ప్రో నా చేతుల్లోకి తీసుకోగానే మొదట నేను ఆసక్తితో పరీక్షించింది సినిమాటిక్ మోడ్. చాలా షార్ప్ అనిపించింది. మీలో టాలెంట్ తక్కువైనా సరే, సాధారణ లొకేషన్స్ అయినా సరే ఖరీదైన లుక్ తీసుకురావచ్చు. కిట్ భారం లేకుండా ట్రావెల్ వీడియోలకు సినిమాటిక్ లుక్ ఇవ్వొచ్చు’ అంటున్నాడు మారిసన్. అడ్వాన్స్డ్ వీడియో రికార్డింగ్ ఫీచర్ ‘సినిమాటిక్ మోడ్’ ఐఫోన్13 నాలుగు మోడల్స్‌లోనూ అందుబాటులో ఉంది. చదవండి: ఐఫోన్-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఇండియన్స్..! సెప్టెంబర్ 14 ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్ ఈవెంట్’ జరిగిన తరువాత యాపిల్ ఐఫోన్13 సిరీస్‌లోని లాంగర్ బ్యాటరీలైఫ్, హైయర్ స్క్రీన్బ్రైట్నెస్, మెరుగైన కెమెరాసిస్టమ్...ఇలా ఆసక్తికరమైన విషయాలు, ఫెంటాస్టిక్ అప్గ్రేడ్ల గురించి మాట్లాడుకోవడం ఎక్కువైంది. వీటిలో యూత్‌ను ఆకట్టుకుంటున్న ఫీచర్... సినిమాటిక్ మోడ్. డిజిటల్ ఫొటోగ్రఫీ శకం మొదలైన తరువాత ఆనాటి ఫిల్మ్కెమెరాలతో సాధ్యమైనవి సాధ్యం చేయడం తోపాటు ‘రీల్’కు అందని సూక్ష్మఅంశాలను కాప్చర్ చేయడం, పరిమితులతో కూడిన విన్యెటింగ్(రిడక్షన్ ఆఫ్ ఇమేజెస్ బ్రైట్నెస్) పరిధిని పెంచడం లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ వీడియో ప్రేమికులను ఆకట్టుకునే ఫీచర్లకు ప్రాధ్యానత ఇస్తుంది. తాజా ‘సినిమాటిక్ మోడ్’ హెడ్లైన్ న్యూఫీచర్గా నిలిచింది. ‘సినిమాటిక్ మోడ్’తో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే, ముఖ్యంగా...వీడియో బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయవచ్చు. ఆటో–ఫోకస్ సెట్ చేసుకోవచ్చు. పోట్రాయిట్ మోడ్ వీడియోలకు, ఫోకస్ పాయింట్లను ఎంపిక చేసుకోవడానికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ట్రెడిషనల్ వీడియో మోడ్‌తో పోల్చితే ‘స్పెషల్’ మోడ్‌గా చెప్పే దీనిలో రిజల్యూషన్, ఫ్రేమ్‌రేట్ మెరుగ్గా ఉంటుంది. డెప్త్ ఇన్ఫర్మేషన్(సైట్లో ఉండే అబ్జెక్ట్స్కు కెమెరాకు మధ్య ఉండే దూరం)ను రికార్డ్ చేస్తుంది. ఈ సమాచారంతో వీడియో షూట్ చేసిన తరువాత కూడా సీన్లో ఫోకస్‌ను షిఫ్ట్ చేసుకోవచ్చు. మోడ్రన్ డే మూవీస్‌లో ‘డెప్త్ ఆఫ్ ఫీల్డ్’ కీలక పాత్ర పోషిస్తుంది. ‘డెప్త్ ఆఫ్ ఫీల్డ్’ను ఎడిట్ చేసుకోవడానికి ఇక ప్రొఫెషనల్ కెమెరాలు మాత్రమే అవసరం లేదు. మూవీస్‌లో కనిపించే ‘ఐకానిక్ విజువల్ ఎఫెక్ట్’ను సినిమాటిక్మోడ్తో పునఃసృష్టి చేసే ప్రయత్నం చేసింది ఐఫోన్ 13. డాల్బీ విజన్ హెచ్‌డీఆర్‌లో సినిమాటిక్మోడ్ వీడియోలను రికార్డ్ చేస్తుంది. స్థూలంగా చెప్పాలంటే స్టూడియో లు, ప్రొఫెషనల్ లైటింగ్, ఖరీదైన సాంకేతిక పరికరాలు అవసరం లేకుండానే... వీడియోలకు సినిమాటిక్ లుక్ తీసుకు రావచ్చు. చదవండి: Apple iPhone 13 .. యాపిల్ అదిరిపోయే ఆఫర్ -
పాపాయి అడుగే పచ్చబొట్టు!
టాటూలు వేయించుకోవడం లేటెస్ట్ ట్రెండ్. అందమైన కార్టూన్లు, దేవతలు, దెయ్యాలు, పుర్రె బొమ్మలు..ఇలా రకరకాల డిజైన్ల పచ్చబొట్లు తమ శరీరాలపై వేయించుకుని మురిసిపోతూంటారు. ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ఓ అడుగు ముందుకు వేశారు. ఓ సందర్భంలో ఇమ్రాన్ ఖాన్ భార్య అవంతిక తమ కూతురు ఇమార చిన్ననాటి పాదముద్రలను భద్రంగా దాచుకోవాలనుకున్నారు. పాపాయి కాలి అడుగులను ఓ కాగితంపై గీసుకున్నారు. ఇది చూసిన ఇమ్రాన్ టాటూకు కాదేది అనర్హం అని అనుకున్నారు కాబోలు... వెంటనే పాపాయి పాదాలను టాటూగా శరీరంపై ముద్రించుకున్నారు. ఏది ఏమైనా... వాట్ యాన్ ఐడియా ఇమ్రాన్‌జీ!. -
ఒకటికి మూడు హారాలు...
ట్రెండ్ రోజువారీ వేషధారణలో ఇతర అలంకరణ వస్తువులన్నీ అతి ముఖ్యమైనవే! ఆభరణాలు లేకుండా అలంకరణ పూర్తి కాదు. అవీ ఉండాల్సిందే! అయితే ఇప్పటి వరకు ఒక గొలుసు లేదా నెక్లెస్‌తో సరిపెట్టేశారు. కానీ, ప్రస్తుతం రెండు, మూడు ఆభరణాలు వేసుకోవడం అనేది సరికొత్త ట్రెండ్. ‘హారాలు సంప్రదాయ వేడుకలకు మాత్రమే వేసుకోవాలని ఏమీ లేదు. కాలేజీకి వెళ్లే విద్యార్థులు సైతం ఈ తరహా ఆభరణాలను ధరించవచ్చు. మూడు విభిన్న తరహా హారాలలో ఒకటి పొడవుగా ఉండే ‘ఫంకీ’ లాకెట్టు ధరిస్తే సర్వసాధారణంగా ఎదుటివారి చూపు ఆ హారం మీద నిలిచిపోతుంది. హైదరాబాద్ ఫ్యాషన్ అండ్ ఆభరణాల డిజైనర్ సుహానీ పిట్టె ఈ తరహా ట్రెండ్ గురించి మాట్లాడుతూ ‘నాకు వరుసలుగా ఉండే ‘లేయర్డ్ కఫ్స్’ అంటే చాలా ఇష్టం. రెండు విభిన్నమైన డిజైన్లతో, రంగులతో, లోహాలతో ఉండే చైన్లు, హారాలు ధరిస్తే ఆ స్టైలే వేరు. హారాల నేపథ్యం ఒక కథలా ఉంటుంది. ఉదాహరణకు.. చెక్క గాజులు ధరించినప్పుడు వాటి మధ్య చిన్నా పెద్ద ‘గోల్డ్ కఫ్స్’, పూసల బ్రేస్లెట్స్ ధరించండి. పూర్తి గిరిజన స్టైల్ కనువిందు చేస్తుంది. ముఖ్యంగా నలుపు రంగు దుస్తులు ధరించినప్పుడు ఈ తరహా ‘మిక్స్ అండ్ మ్యాచ్’ ఆభరణాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి’ అని వివరించారు. ఒకటి బంగారం.. మరొకటి వెండి... ‘హారాలు, తేలికపాటి గొలుసులలో ఒకటి బంగారం, మరొకటి వెండి లోహాలతో చేసినవి కలిపి ధరించాలి. ఎప్పుడైనా దుస్తులకు పూర్తి భిన్నమైన ఆభరణాలు ధరిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తారు’ అని తెలిపారు సుహాని. ధరించిన దుస్తులు చాలా సాధారణంగా ఉన్నప్పుడు ప్రత్యేక ఆభరణాలు సరైన ఎంపిక అంటారా అని డిజైనర్ స్టైలిస్ట్ రిక్రాయ్ని అడిగితే - ‘ఏ దుస్తులైనా సరే చూడటానికి ఆకర్షణీయంగా ఉండాలి. అందుకు ఒకటే మార్గం - ‘ఆభరణాల ఎంపికపై దృష్టి పెట్టడం. సాధారణంగా టీ-షర్ట్ ధరించినా ఒక పొడవాటి ఆభరణాన్ని మెడలో వేసుకోండి. ఆ స్టైల్ చాలా భిన్నంగా ఆకర్షణీయంగా మారిపోతుంది’ అన్నారు. ఏ వయసు వారైనా ఈ తరహా దుస్తులను, ఆభరణాలను ధరించవచ్చు. ఇలా స్టైల్‌గా ఉండాలంటే క్రమబద్ధంగా ఉండే ‘ఫార్మల్’ వేషధారణ చేసుకోకూడదు. - సుహానీ పిట్టె, ఆభరణాల డిజైనర్ -
పూలచొక్కాలోయ్!
స్టైల్: మర్యాదకరంగా కనిపించే దుస్తులను మాత్రమే ధరించే అలవాటు మీకు ఉండొచ్చుగాక, కానీ అప్పుడప్పుడూ లేటెస్ట్ ట్రెండ్ మీద కూడా ఒక నజర్ వేయండి. కాస్త భిన్నంగా ఉండడానికి ప్రయత్నించండి. హాటెస్ట్ ట్రెండ్‌లో ‘ఫ్లోరల్స్’ షర్ట్స్ ధరించడం కూడా ఒకటి. ఈ పూల చొక్కాలు మీ లుక్కును పూర్తిగా మార్చేస్తాయి. ఈ వారమే ప్రయత్నించి చూడండి మరి. -
పక్కా నిఘానేతల దగా
కొత్త టెక్నిక్కులు అనుసరిస్తున్న అభ్యర్థులు అధికారుల కళ్లుగప్పి బహుమతుల పంపిణీ ప్రచారంలో ప్రతిదానికీ సెప‘రేటు’ ట్రిక్ సాక్షి, సిటీబ్యూరో: ప్రదర్శనలో పాల్గొంటే 300.. బైక్ ర్యాలీ అయితే 500.. ప్రచారం చేసే కుర్రాళ్లకు ఓ రేటు.. కాలనీ సంఘాలకు ఇంకో రేటు.. కుల సంఘాలకు సెప‘రేటు’.. ఇదంతా ప్రతీ ఎన్ని కల్లో ‘మామూలే’. చెక్కులతో చిక్కులు తప్పిం చు కోవడం.. హోటళ్లు, బార్ల యజ మానులతో ఒప్పందాలు.. చీటీలతో షాపుల్లోనే గిఫ్ట్‌లు అందించే ఏర్పాట్లు.. వెరసి ఎన్నికల యం త్రాగం నిఘాకు చిక్కకుండా దగా చేస్తున్న అభ్యర్థుల లేటెస్ట్ ట్రెండ్ ఇది. సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై తీవ్ర నిఘా ఉండటంతో.. ఆయా పార్టీల అభ్యర్థులు కొత్త పోకడలు పోతున్నారు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు.. అధికార యంత్రాంగం రెప్పవాల్చని నిఘా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. కన్నుగప్పి తమ పని తాము చేసుకుపోతున్నారు. ఎవరికీ దొరక్కుండా ప్రజలను ఆకట్టుకునేం దుకు కొత్త టెక్నిక్కులు అవలంభిస్తున్నారు. పెద్దమొత్తాల్లో డబ్బు పంపిణీ తీవ్ర సమస్యగా మారడంతో పలు ఆధునిక పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. నామినేషన్ల నుంచి ప్రారంభించిన ఈ ప్రక్రియను నిరాటంకంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రచారం ఊపందుకోవడంతో మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కూడా బయటకు కనిపించకుండా తమకు పనికి వస్తారనుకున్నవారికి, వందమందితో ఓట్లు యించగలరనుకున్నవారికి వివిధ రూపాల్లో బహుమతులు పంపిణీ చేస్తున్నారు. అందుకు పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్నారు. ప్రతిదానికీ ఓ లెక్క కట్టి తమ పని కొనసాగిస్తున్నారు. నగదు, పోస్ట్ డేటెడ్ చెక్కులు, బహుమతులు, స్పోర్ట్స్ కిట్లు తదితర రూపాల్లో పంపిణీ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా.. వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎమ్మెల్యేలైతే రూ. 28 లక్షలు, ఎంపీ అభ్యర్థులు రూ. 70 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాలి. కానీ.. గ్రేటర్లో ఈ పరిమితిని ఇప్పటికే దాటిపోయిన వారు ఎందరో ఉన్నారు. గుట్టు చప్పుడు కాకుండా పనులు -
అన్ని పార్టీల్లోనూ ఇదే లేటెస్టు ట్రెండ్
-
వీకెండ్ వెరైటీగా గడిపేందుకు ఆసక్తి
నగరవాసుల అభి‘రుచి’ మారుతోంది.. వీకెండ్ భిన్నంగా గడపాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వెరైటీ రుచులతో పాటు డ్యాన్స్... మ్యూజిక్... మేజిక్కుల మేలుకలయికతో మురిసి మెరవాలన్నది సిటీజనుల లే‘టేస్ట్’ జీవనశైలి. వారంలోని ఐదురోజుల ఒత్తిడి వీకెండ్లో చిత్తయ్యేలా ఎంజాయ్ చేయాలని తపిస్తున్నారు. వీరికి తగ్గట్టే ఆహారంతో పాటు వడ్డించే వారి ఆహార్యమూ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నాయి నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు. ‘మా ఆతిథ్యంలో కిక్కు ఉంది... దానికో లెక్క ఉంది..’ అంటూ కొత్త థీమ్‌లతో ఆకట్టుకుంటున్నాయి. చేస్తున్నాయి పలు హోటళ్లు. ఈ క్రమంలో కొన్ని హోటళ్ల సిబ్బంది సంప్రదాయ వస్త్రధారణతో సందడి చేస్తున్నారు. ప్రాంతాలను బట్టి తమ రూపురేఖలను మార్చుకుంటూ కొత్తదనంతో వడ్డించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బార్బిక్యూ నేషన్ గతంలో సముద్రపు దొంగల థీమ్‌తో ప్రత్యేకంగా ఆహారోత్సవం ఏర్పాటు చేసింది. ఇందులో బాగంగా అక్కడి సిబ్బంది అచ్చంగా సముద్రపు దొంగలు ఎలా ఉంటారో అలా తయారై ఆహూతులకు వడ్డించారు. అంతేకాకుండా సముద్రపు ఉత్పత్తులను అలాగే పెట్టి అందులో వండిన పదార్థాలతో అతిథులకు అందించి కొత్తదనం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక కిచెన్ కార్నివాల్ పేరుతో సైతం ఇలానే రైలుబండిలో లభించే ఆహార పదార్థాలను హోటల్‌కు వచ్చిన వారికి అందించారు. ఛాయ్.. బేల్‌పురి, సమోసా, కిళ్లీ.. ఇలా ప్రతి వాటిని అందించే ప్రయత్నం చేశారు. మాబ్‌లతో మెరిసి.. కలిసి.. మరికొన్ని రెస్టారెంట్లు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌ను అనుసరిస్తూ అతిథులను ఆకట్టుకుంటున్నాయి. కేవలం ప్రత్యేకమైన రుచులు అందించడమే కాకుండా సంగీత, నృత్యాలతో అలరిస్తున్నాయి. అతిథుల మధ్య మెరుపులా సిబ్బంది ప్రత్యక్షమై నృత్యాలు చేస్తూ ఆరగింపులో కొత్త కిక్కు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అతిథులు భోజనం చేస్తుండగా మంద్రంగా వచ్చే సంగీతం రెట్టింపవుతుంది. ఉత్సాహం ఉరకలెత్తించేలా అక్కడ జోష్ పెంచుతున్నారు. ఫ్లాష్‌మాబ్‌తో మెరిసిపోతున్నారు. సమయానికి, ఆహారోత్సవానికి అనుగుణంగా నృత్యాలతో ముందుకు వస్తున్నారు. అక్కడ భోజనం చేసే వారు సైతం అందులో కలిసి ఆడిపాడుతున్నారు. చిన్నపెద్ద అంతా అందులో ఆనందపారవశ్యం పొందుతున్నారు. అంతేకాదు ప్రత్యక్షంగా సైతం పాటలు పాడించే పద్ధతిని ఇప్పుడు చాలా హోటల్స్ అనుకరిస్తున్నాయి. వచ్చినవారికికొసరి కొసరి వడ్డించడమే కాదు.. కావాల్సిన పాటలు సైతం వెంటనే పాడి వినిపించి ఆనందింపజేస్తున్నాయి. అభిరుచి మారుతోంది నగర వాసుల అభిరుచి మారుతోంది. ఇందుకనుగుంగానే మేమందించే ఆహారంతోపాటు ప్రత్యేకమైన అంశాలను మా మెనూలో చేర్చుతున్నాం. వినోదాన్ని పంచాలనే నేపథ్యంతో కొత్త కొత్త డ్యాన్స్ థీమ్‌లను ఏర్పాటుచేస్తున్నాం. మంచి స్పందన వస్తుంది. - రాజేష్‌కుమార్ భగత్, ఎగ్జిక్యూటివ్ ఛెఫ్, బార్బిక్యూ నేషన్ కొత్తదనం చూపిస్తున్నాం నిత్యం వచ్చేవారు ఒకే విధమైన ఆహారాన్ని కోరుకోరు. కొత్తదనం కోసం చూస్తారు. తమకు కావాల్సిన వంటకాల కోసం అన్వేషిస్తుంటారు. అందుకే వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలతో కూడిన ఆహారోత్సవాలను ఏర్పాటు చేస్తున్నాం. రోజురోజుకు ఈ ఆహారోత్సవాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. - నితిన్, తాజ్‌కృష్ణ ఎగ్జిక్యూటివ్ చెఫ్ లైవ్లీగా ఉంటే ఇష్టం భోజనానికి చాలా చోట్లకు వెళ్తుంటాం. కాని ఎక్కడకు వెళ్లినా మా కళ్ల ముందు తయారు చేసి వంట వండి అందించేవారు చాలా తక్కువ. అంతేకాకుండా మేం భోజనానికి బయటకు వచ్చేది అప్పుడప్పుడే. అలాంటప్పుడు కాస్త విభిన్నంగా ఉండే హోటల్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటాం. తద్వారా మాకు కావల్సిన ఆనందం దక్కుతుంది. - భార్గవ్, తిలక్‌నగర్, విద్యార్థి స్పెషల్ థీమ్స్‌తో వినోదం వారంలో 5 రోజులూ పని ఒత్తిడితో ఉంటాం. వారాంతాల్లోనే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బయటకు వస్తుంటాం. అందువల్ల ఈ సమయంలో మ్యాగ్జిమం ఎంజాయ్ చేయాలి. నగరంలోని పలు హోటల్స్ ఇప్పుడు ప్రత్యేకమైన థీమ్స్‌తో ముందుకు వస్తున్నాయి. వీటివల్ల రిలాక్స్ అవుతాం. - దీప్తి, ఉద్యోగిని రుసి ఐడొనిలో చాక్లెట్ జార్ సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి: ఫ్లవర్‌వాజ్ గురించి విన్నాం కానీ... చాక్లెట్ జార్ గురించి విన్నారా? బంజారాహిల్స్ రోడ్‌నెం.10లో ఉన్న రుసిఐడొని రెస్టారెంట్ పరిచయం చేసిన సరికొత్త ‘రుచి’ ఇది. ఫడ్జ్ బ్రౌనీ ఇన్ ఎ జార్ పేరుతో దీన్ని ప్రత్యేకంగా అతిథులకు అందిస్తున్నట్టు రెస్టారెంట్ మేనేజర్ ప్రవీణ్ తెలిపారు. చిక్కటి పాలతో తయారు చేసిన ఈ డిజర్ట్‌ను ప్లేట్లో సర్వ్చేయడం కుదరదు కనుక ఈ తరహాలో సర్వ్ చేస్తున్నట్టు వివరించారు. సీత్రూ గ్లాస్ కారణంగా దీనిలో ఉన్న చాక్లెట్ కేక్, క్రీమ్... వగైరాలు చవులూరించేలా కను‘విందు’ చేస్తాయన్నారు. ఇది 4 లేయర్లు(పొరలు) ఉన్న డిజర్ట్. అడుగు భాగంలో డార్క్ చాక్లెట్ మూజ్, దానిపైన వైట్చాక్లెట్, ఫడ్జ్ బ్రౌనీ, మిక్స్‌డ్‌నట్స్, హాట్ ఫడ్జ్ చాక్లెట్ వేసి అందిస్తున్నారు. ఈ సరికొత్త డిజర్ట్ ధర రూ.120గా నిర్ణయించినట్టు ప్రవీణ్ తెలిపారు.