
పక్కా నిఘానేతల దగా
- కొత్త టెక్నిక్కులు అనుసరిస్తున్న అభ్యర్థులు
- అధికారుల కళ్లుగప్పి బహుమతుల పంపిణీ
- ప్రచారంలో ప్రతిదానికీ సెప‘రేటు’ ట్రిక్
సాక్షి, సిటీబ్యూరో: ప్రదర్శనలో పాల్గొంటే 300.. బైక్ ర్యాలీ అయితే 500.. ప్రచారం చేసే కుర్రాళ్లకు ఓ రేటు.. కాలనీ సంఘాలకు ఇంకో రేటు.. కుల సంఘాలకు సెప‘రేటు’.. ఇదంతా ప్రతీ ఎన్ని కల్లో ‘మామూలే’. చెక్కులతో చిక్కులు తప్పిం చు కోవడం.. హోటళ్లు, బార్ల యజ మానులతో ఒప్పందాలు.. చీటీలతో షాపుల్లోనే గిఫ్ట్‌లు అందించే ఏర్పాట్లు.. వెరసి ఎన్నికల యం త్రాగం నిఘాకు చిక్కకుండా దగా చేస్తున్న అభ్యర్థుల లేటెస్ట్ ట్రెండ్ ఇది.
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై తీవ్ర నిఘా ఉండటంతో.. ఆయా పార్టీల అభ్యర్థులు కొత్త పోకడలు పోతున్నారు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు.. అధికార యంత్రాంగం రెప్పవాల్చని నిఘా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. కన్నుగప్పి తమ పని తాము చేసుకుపోతున్నారు. ఎవరికీ దొరక్కుండా ప్రజలను ఆకట్టుకునేం దుకు కొత్త టెక్నిక్కులు అవలంభిస్తున్నారు. పెద్దమొత్తాల్లో డబ్బు పంపిణీ తీవ్ర సమస్యగా మారడంతో పలు ఆధునిక పద్ధతులను ఆశ్రయిస్తున్నారు.
నామినేషన్ల నుంచి ప్రారంభించిన ఈ ప్రక్రియను నిరాటంకంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రచారం ఊపందుకోవడంతో మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కూడా బయటకు కనిపించకుండా తమకు పనికి వస్తారనుకున్నవారికి, వందమందితో ఓట్లు యించగలరనుకున్నవారికి వివిధ రూపాల్లో బహుమతులు పంపిణీ చేస్తున్నారు. అందుకు పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్నారు. ప్రతిదానికీ ఓ లెక్క కట్టి తమ పని కొనసాగిస్తున్నారు. నగదు, పోస్ట్ డేటెడ్ చెక్కులు, బహుమతులు, స్పోర్ట్స్ కిట్లు తదితర రూపాల్లో పంపిణీ చేస్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా..
వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎమ్మెల్యేలైతే రూ. 28 లక్షలు, ఎంపీ అభ్యర్థులు రూ. 70 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాలి. కానీ.. గ్రేటర్‌లో ఈ పరిమితిని ఇప్పటికే దాటిపోయిన వారు ఎందరో ఉన్నారు. గుట్టు చప్పుడు కాకుండా పనులు