This Is The Reason Look Between On Your Keyboard Viral Social Media, Interesting Details Inside | Sakshi
Sakshi News home page

లుక్‌ బిట్‌వీన్ కీబోర్డ్‌: ఓ ఊపు ఊపేస్తున్న ట్రెండ్‌ ఎలా పుట్టిందంటే..

Published Thu, Apr 25 2024 1:57 PM | Last Updated on Thu, Apr 25 2024 1:57 PM

This Is The Reason look between on your keyboard Viral Social Media - Sakshi

సీఎం జగన్‌కు మద్ధతు ఇచ్చేది ఎవరు?.. ఏపీ అభివృద్ధిలో భాగం.. 

సోషల్‌ మీడియాలో క్రియేటివిటీ తారాస్థాయికి చేరుకుంటోంది. గుడ్‌ బ్యాడ్‌ ఆర్‌ అగ్లీ.. అది ఏ కోణంలో ఉన్నాసరే నెటిజన్స్‌ ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్న ఓ లేటెస్ట్‌ ట్రెండ్‌ గురించి తెలుసుకుందాం.

లుక్‌ బిట్‌వీన్‌ యువర్ కీ బోర్డు..look between on your keyboard సోషల్‌ మీడియాను ప్రస్తుతం ఊపేస్తున్న ట్రెండ్‌. కొత్తదేం కాకపోయినా.. ప్రస్తుతం దీనిని తెగ వాడేస్తున్నారంతా. వివిధ నగరాల పోలీసులు, ఐపీఎల్‌ జట్లు, ఫుడ్‌ యాప్స్‌, అమెజాన్‌ లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ ఈ ట్రెండ్‌లో భాగం అయ్యాయి. మరోవైపు.. ఎన్నికల వేళ రాజకీయపార్టీలు సైతం ఈ ట్రెండ్‌ను ఫాలో అయిపోతున్నాయి. 

 

 

 

 

 

 

సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పలేం. అర్థమైతే సరే సరి.  కొందరైతే ఈ పోస్టులకు అర్థమేంటో తెలుసుకోవడంలో ఇబ్బందిపడుతుంటారు. మరి లుక్‌ బిట్‌వీన్‌ యువర్ కీ బోర్డు ట్రెండ్‌ గురించి తెలియని వాళ్ల కోసం.. ఈ ట్రెండ్‌ అసలు ఎక్కడ మొదలైందంటే.. 

ఇంగ్లీష్‌ ఆల్పాబెట్స్‌ కీ బోర్డు బేస్‌ చేసుకుని పుట్టిందే ఈ ట్రెండ్‌.  2021లో 4Chan అనే వెబ్‌సైట్‌ ఈ ట్రెండ్‌ను ఆరంభించింది. కాన్‌(K-ON) అనే యానిమేటెడ్‌ సిరీస్‌లో పాత్రను పరిచయం చేయడానికి ఈ ట్రెండ్‌ను ఉపయోగించారు. లుక్ బిట్‌వీన్‌ T అండ్‌ O అంటూ ‘YUI’(యూఈ) అనే పాత్రను పరిచయం చేశారు. అయితే ఆ తర్వాత ఈ ట్రెండ్‌ అంతగా ప్రాచుర్యంలో లేకుండా పోయింది. ఇప్పుడు భారతీయుల దెబ్బకు మళ్లీ తెర మీదకు వచ్చేసింది.

ఈ ట్రెండ్‌లో.. 
ఉదాహరణకు.. లుక్‌ బిట్‌వీన్‌ H అండ్‌ L ఆన్‌ యువర్‌ కీ బోర్డు అన్నారనుకోండి. మనం వాడే కీబోర్డుల్లో వాటి మధ్య లెటర్స్‌ ‘JK’ ఉంటాయి. షార్ట్‌ కట్‌లో దానికి జస్ట్‌ కిడ్డింగ్‌ అనే అర్థం ఉంది.

ఇక.. ఇంటర్వ్యూయర్‌ చూపు ఎప్పుడూ X అండ్‌ B మధ్య ఉంటుందని ఓ వ్యక్తి పోస్ట్‌ చేశాడు. ఆ రెండు లెటర్స్‌ మధ్య కీబోర్డులో ఉండేది CV(కరికులమ్‌ విటే-రెజ్యూమ్‌). ఇలా కీబోర్డులోని వివిధ అక్షరాలతో తమదైన శైలిలో నెటిజన్లు సరదా సరదా పోస్టులు పెడుతున్నారు. దీంతో మీమ్స్‌ స్థాయికి దాకా చేరుకుంది.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement