ఢిల్లీ: ఇన్‌స్ట్రామ్‌లో రీల్స్ చేసి ఫేమస్ కావాలనుకున్న ఓ పని మనిషి కెమెరా కొనుక్కొవటం కోసం.. ఓనర్ ఇంట్లోనే రూ.లక్షల విలువైన బంగారు నగలను చోరీ చేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకొంది. నగలతో పరారైన ఆమెను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వివరాలు.. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఓ బంగ్లాలో నీతూ యాదవ్ అనే మహిళ పని చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ కావాలనుంది.
అందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి పోస్టు చేస్తుండేది. అక్కడితో ఆగకుండా యూట్యూబ్ ఒక ఛానెల్‌ను ఓపెన్ చేసి డబ్బు సంపాదించాలిని ప్లాన్ వేసింది. అయితే దానికి రీల్స్ చేసేందుకు మంచి క్వాలిటీ ఉన్న డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా కొనాలనుకుంది. అయితే ఆమె వద్ద అంత డబ్బు లేకపోవడంతో కుటుంబ సభ్యులును డబ్బు అడిగింది.
కానీ వారం సహాయం చేయకపోవటంతో తాను పనిచేసే ఓనర్ ఇంట్లోనే చోరీ చేయాలని నిర్ణయించుకుంది. ఓనర్లు లేని సమయం చూసి బంగారం, వెండి వస్తువులతో పారిపోయింది. ఇంట్లో కనిపించని ఆమెకు ఒనర్లు కాల్ చేస్తే.. ఫోన్ స్విచ్‌ఆఫ్ వచ్చింది. ఇంట్లో ఉండే నగలు కనిపించకపోవడంతో పనిమనిషిపై వచ్చి.. ఓనర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక.. స్థానికుల సమాచారంతో నగల బ్యాగ్‌తో ఢిల్లీ దాటాలనుకున్న ఆమెన పోలీసులు అరెస్టు చేశారు. అయితే కెమెరాను కొనడానికి ఎవ్వరు అప్పుగానైనా డబ్బు ఇవ్వకపోవటంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడి అయినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment