jwellery robbery
-
రీల్స్ కోసం కెమెరా కొనేందుకు ఓనర్ ఇంట్లో చోరీ
ఢిల్లీ: ఇన్‌స్ట్రామ్‌లో రీల్స్ చేసి ఫేమస్ కావాలనుకున్న ఓ పని మనిషి కెమెరా కొనుక్కొవటం కోసం.. ఓనర్ ఇంట్లోనే రూ.లక్షల విలువైన బంగారు నగలను చోరీ చేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకొంది. నగలతో పరారైన ఆమెను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వివరాలు.. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఓ బంగ్లాలో నీతూ యాదవ్ అనే మహిళ పని చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ కావాలనుంది.అందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి పోస్టు చేస్తుండేది. అక్కడితో ఆగకుండా యూట్యూబ్ ఒక ఛానెల్‌ను ఓపెన్ చేసి డబ్బు సంపాదించాలిని ప్లాన్ వేసింది. అయితే దానికి రీల్స్ చేసేందుకు మంచి క్వాలిటీ ఉన్న డీఎస్ఎల్ఆర్ కెమెరా కొనాలనుకుంది. అయితే ఆమె వద్ద అంత డబ్బు లేకపోవడంతో కుటుంబ సభ్యులును డబ్బు అడిగింది. కానీ వారం సహాయం చేయకపోవటంతో తాను పనిచేసే ఓనర్ ఇంట్లోనే చోరీ చేయాలని నిర్ణయించుకుంది. ఓనర్లు లేని సమయం చూసి బంగారం, వెండి వస్తువులతో పారిపోయింది. ఇంట్లో కనిపించని ఆమెకు ఒనర్లు కాల్ చేస్తే.. ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చింది. ఇంట్లో ఉండే నగలు కనిపించకపోవడంతో పనిమనిషిపై వచ్చి.. ఓనర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక.. స్థానికుల సమాచారంతో నగల బ్యాగ్‌తో ఢిల్లీ దాటాలనుకున్న ఆమెన పోలీసులు అరెస్టు చేశారు. అయితే కెమెరాను కొనడానికి ఎవ్వరు అప్పుగానైనా డబ్బు ఇవ్వకపోవటంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడి అయినట్లు పోలీసులు తెలిపారు. -
ఒంటిపై ఉన్న బంగారం కోసం హత్యలు..
సాక్షి, నెల్లూరు : మహిళల ఒంటిపై ఉన్న బంగారం కోసం దుండగులు దారుణానికి పాల్పడుతున్నారు. జిల్లాలోని రెండు వేరు వేరు చోట్ల ఓకే తరహాలో ఇద్దరు మహిళలు దారుణంగా హత్యకు గురయ్యారు. సోమవారం కుసుమూరులో దుండగులు గుంజి రమణమ్మ(45)అనే మహిళను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇదే తరహాలో శేషమ్మ(45) అనే మహిళను ఆత్మకూరు సమీపంలోని ఆనంతరాయని వద్ద కత్తులతో పొడిచి ఒంటిపై ఉన్న బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. ఒంటిపై ఉన్న బంగారం కోసం మహిళలపై దారుణాలకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. -
మాజీ డీజీపీ సోదరుని ఇంట్లో నగలు పోలేదట..
బంజారాహిల్స్ (హైదరాబాద్): మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి సోదరుని కుమార్తె నివాసంలో అదృశ్యమైన విలువైన వజ్రాభరణాలు... భద్రంగా ఉన్నట్టు తెలియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గత నెల అమెరికాకు వెళ్లే సమయంలో దినే ష్‌రెడ్డి సోదరుని కుమార్తె ఐశ్వర్య బంగారు గాజులు, ఉంగరాలను ఓ చీరలో ఉంచి అలమారాలో పెట్టారు. తాను అమెరికా నుంచి తిరిగి వచ్చాక అవి కనిపించకపోవడంతో చోరీకి గురయ్యాయంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటి విలువ చాలా ఉంటుందని కూడా ఆమె పేర్కొనడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో పని చేస్తున్న డ్రై వర్లను, పని మనుషులను, వంట మనుషులను వారం రోజుల పాటు విచారించారు. ఫలితం లేకపోవడంతో ఎవరైనా దొంగల ముఠా ఈ చోరీకి పాల్పడి ఉంటుందని భావిస్తున్న తరుణంలో తమ నగలు దొరికాయంటూ ఐశ్వర్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. చీరలో నగలు భద్రంగా ఉన్నాయని తెలియజేయడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.