
సంఘటనా స్థలంలో మృతురాలు, హత్యకు ఉపయోగించిన కత్తి
సాక్షి, నెల్లూరు : మహిళల ఒంటిపై ఉన్న బంగారం కోసం దుండగులు దారుణానికి పాల్పడుతున్నారు. జిల్లాలోని రెండు వేరు వేరు చోట్ల ఓకే తరహాలో ఇద్దరు మహిళలు దారుణంగా హత్యకు గురయ్యారు. సోమవారం కుసుమూరులో దుండగులు గుంజి రమణమ్మ(45)అనే మహిళను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇదే తరహాలో శేషమ్మ(45) అనే మహిళను ఆత్మకూరు సమీపంలోని ఆనంతరాయని వద్ద కత్తులతో పొడిచి ఒంటిపై ఉన్న బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు.
ఒంటిపై ఉన్న బంగారం కోసం మహిళలపై దారుణాలకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment