
బీదర్: కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో ఓ యువతి అత్యాచారం, హత్యకు గురైంది. ప్రధాన నిందితుడైన ఆమె బంధువు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. గుణతీర్థవాడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల తమ కుమార్తె ఆగస్ట్ 29వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ ఒకటిన∙స్థానిక పాఠశాల వద్ద ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. సాంకేతిక ఆధారాల సాయంతో అదృశ్యమైన రోజున ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన ముగ్గురిని గుర్తించారు.
అదే గ్రామానికి చెందిన ముగ్గురిలో ఒకరు ఆమెను ఆరోజు కలుసుకున్నట్లు తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఘటనాస్థలానికి కొద్ది దూరంలో తన ఇద్దరు మిత్రులు వాహనంతో కాపలాగా ఉండగా యువతిని రేప్ చేసి, తలపై బండరాయితో మోది చంపినట్లు ఒప్పుకున్నాడు. మృతురాలు, ప్రధాన నిందితుడు బంధువులవుతారని బీదర్ ఎస్‌పీ తెలిపారు. హత్యాచారం ఘటనపై బీదర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment