Rape Attempt
-
మతిస్థిమితంలేని ఏడేళ్ల బాలికపై అత్యాచారం!
రెంజల్(బోధన్): తాత వయస్సున్న వ్యక్తి మతిస్థిమితం లేని ఏడేళ్ల బాలిక పై అత్యాచారం చేసినట్లు అనుమానించిన బాలిక బంధువులు తీవ్రంగా దా డి చేయడంతో నిందితుడు మృతి చెందిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెంజల్ మండలం వీరన్నగుట్ట తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని బాలిక నాయనమ్మతో పక్కనే గల కిరాణా దుకాణానికి వెళ్లింది. బాలిక అక్కడే నిలిచి పోవడంతో వృద్ధురాలైన నా యనమ్మ ఇంటికి చేరుకుంది. కొద్ది సేపటికి బాలిక కోసం తల్లి అక్కడికి వెళ్లింది. బాలికపై దుకాణ యజమాణి రత్నావర్ రెడ్యా అత్యాచారం జరిపినట్లు అనుమానించిన తల్లి కుటుంబీకులకు తెలిపింది. ఈ క్రమంలో ఇరువురి కుటుంబాల మహిళలు పరస్పరం దూషించుకుంటూ ఘర్షణకు పాల్పడ్డారు. బాలిక తండ్రితో పాటు అతని సోద రులు అక్కడికి చేరుకుని రెడ్డ్యాను రొడ్డు పైకి తీసుకొచ్చి తీవ్రంగా చితకబాదారు. కిరాణ దుకాణం ధ్వంసం చేయడంతో పాటు ఇంటిని తగుల బెట్టేందుకు ప్రయత్నించారు. బాలిక బంధువు డయల్ 100కు ఫోన్ చేయడంతో రెంజల్ ఎస్సై సాయన్న సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. రెడ్యాను ని జామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించిన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెడ్యా శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. రూరల్ సీఐ విజయ్, ఎస్సై సాయన్న గ్రామానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అప్పటికే రెడ్యా మృతి చెందిన సమాచారం అందిన మృతుని బంధువులు దాడికి పాల్పడిన వ్యక్తుల ఇళ్ల పై దాడికి ప్రయత్నించారు. బాలిక తండ్రి ఇంటిని తగుల బెట్టేందుకు పెట్రోల్ బాటిల్‌తో రాగా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో పరిస్థితి విషమించడంతో ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మృతుని కుటుంబీకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ట్రెయినీ ఐపీఎస్ అధికారి పత్తిపాక సాయికిరణ్ గ్రామానికి చేరుకుని పరిస్థితులను తెలుసుకున్నారు. రెడ్యా గతంలో స్థానికంగా వడ్డీలకు ఇస్తుండేవాడని, అతని వద్ద వడ్డీలకు డబ్బులు తీసుకున్న బాలిక బంధువులు చెల్లించలేక అత్యాచారం చేశాడని చితకబాది హత్య చేశారని ఆరోపించారు. పథకం ప్రకారం దాడి చేసినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌కు వివరించారు. రూరల్ సీఐతో పాటు నిజామాబాద్ సీఐ సురేశ్, ట్రాఫిక్ సీఐ చందర్రాధిడ్, ఆర్ఐ శ్రీకాంత్‌లతో పాటు సర్కిల్ పరిధిలోని నలుగురు ఎస్సైలు అదనపు పోలీసులు గ్రామంలో బందోబస్తులో పాల్గొన్నారు. -
డాక్టర్‌పై అఘాయిత్యం కేసు విచారణ బెంగాల్లోనే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై చోటుచేసుకున్న అఘాయిత్యంపై దర్యాప్తు కొనసాగిస్తున్న సీబీఐ ఆరో స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టులో సమరి్పంచింది. వైద్య సిబ్బంది భద్రత కోసం ప్రోటోకాల్ రూపొందించడానికి ఏర్పాటైన నేషనల్ టాస్‌్కఫోర్స్(ఎన్టీఎఫ్) సైతం తమ నివేదికను అందజేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ... ఈ నివేదికను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పంచుకోవాలని ఎన్‌టీఎఫ్‌కు సూచించింది. 10 మంది సభ్యులతో ఎన్టీఎఫ్ను సుప్రీంకోర్టు గతంంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును పశ్చిమబెంగాల్లోనే కొనసాగించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై కోల్‌కతా కోర్టులో ఈనెల 4న అభియోగాల నమోదయ్యాయని, ఈ నెల 11 నుంచి రోజువారీ విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి బాంబే హైకోర్టు అనుమతి
ముంబై: పదకొండేళ్ల రేప్ బాధితురాలు తన 30 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతించింది. 11 ఏళ్ల చిన్నారి అబార్షన్‌కు మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉందని వైద్య నిపుణుల బృందం చెప్పడాన్ని పరిగణలోకి తీసుకొని 30 వారాల గర్భవిచ్ఛిత్తికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా చిన్నారి పొత్తికడుపు గట్టిపడిందని భావించామని, థానే ఆసుపత్రిలోనూ డాక్టర్లు అలాగే భావించి మందులు రాసిచ్చారని తండ్రి కోర్టుకు తెలిపారు. అయినా బాలిక పరిస్థితిలో మార్పేమీ రాకపోవడంతో అక్టోబరు 24న ముంబై ఆసుపత్రికి తీసుకెళ్లామని, అక్కడ బాలిక గర్భం దాల్చిందనే విషయాన్ని డాక్టర్లు ధ్రువీకరించారని ఆమె తండ్రి కోర్టుకు విన్నవించారు. గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోర్టును కోరడంతో 30 వారాల గర్భాన్ని తొలగించడానికి అనుమతిస్తూ జస్టిస్ షర్మిల దేశ్‌ముఖ్, జస్టిస్ జితేంద్ర జైన్ల ధర్మాసనం తీర్పునిచ్చింది. -
నిరసన దీక్షను విరమించండి: సీఎం మమతా
కోల్‌కతా: ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టిన వైద్యులతో సీఎం మమతా బెనర్జీ శనివారం ఫోన్లో మాట్లాడారు. డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించినందున దీక్ష విరమించాలని వారిని కోరారు. అదే సమయంలో, డాక్టర్లు డిమాండ్ చేస్తున్న విధంగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని మాత్రం తొలగించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురిని తొలగించామంటూ ఆమె..ఫలానా అధికారిని తొలగించాలని మీరెలా అడుగుతారు? మమ్మల్ని మీరెలా ఆదేశిస్తారు? అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే, దీనివల్ల ప్రజా సేవలకు అంతరాయం కలగరాదని, వెంటనే దీక్ష విరమించాలని కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవా రం తనను సెక్రటేరియట్‌కు వచ్చి కలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ శనివారం కోల్‌కతాలోని ఎస్ప్లనేడ్లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. జూనియర్ వైద్యులు రెండు వారాలుగా నిరశన సాగిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో దీక్షలో పాల్గొన్న ఆరుగురు వైద్యులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని రాష్ట్ర వైద్యుల సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మంగళవారం దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు
గాందీనగర్: గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు శనివారం బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రంతిజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి గజేంద్రసిన్హ్ పర్మార్ 2020 జూలై 30న గాందీనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్‌కు తనను పిలిపించుకున్నారని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబర్చుకున్నారని దళిత బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత తన ఫోన్‌కాల్స్‌కు ఆయన స్పందించలేదని తెలిపింది. ఓసారి మాత్రం తమ మధ్య సంబంధం విషయం ఎవరికైనా చెబితే కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెడతానంటూ కులం పేరుతో దూషించారని పేర్కొంది. ఈ మేరకు ఆమె అందజేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో, బాధితురాలు 2021లో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల తీరును ప్రశ్నించింది. ఎమ్మెల్యేపై వెంటనే అత్యాచారం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గాం«దీనగర్ సెక్టార్–21 పోలీస్‌స్టేషన్ పోలీసులు అత్యాచారం, పోక్సో తదితర కేసులు పెట్టారు. -
పరువుగల కుటుంబాలు అత్యాచార కేసులు పెట్టడం లేదు!
సాక్షి, అమరావతి: ‘మీకు తెలుసు కదా పెద్ద పెద్ద కుటుంబాలు, పరువుగల కుటుంబాల్లో అత్యాచారాలు జరిగినా కేసులు పెట్టడం లేదు. కేసులు నమోదుకాని అత్యాచారాలు ఎక్కువే జరుగుతున్నాయి’అని రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావుతో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అత్యాచారాలకు పాల్పడేవారిని గుర్తించి కచ్చితంగా శిక్షిస్తామన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచారం దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామని తెలిపారు. వారిలో మైనర్లు ఉన్నారని చెప్పారు. అత్యాచార కేసులను ప్రత్యేక కోర్టుల ద్వారా విచారించాలని హైకోర్టుకు ప్రభుత్వం లేఖ రాయనుందని మంత్రి అనిత చెప్పారు. ప్రైవేటు సంస్థలు, ప్రాంగణాల్లో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పోలీసు శాఖతో అనుసంధానిస్తే నిందితులను త్వరగా పట్టుకునేందుకు అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు. ఇవేం వ్యాఖ్యలు మంత్రిగారూ.. అత్యాచారాలపై హోమ్ మంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు బాధితులను విస్మయానికి గురి చేశాయి. ‘అంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న అత్యాచార బాధితులంతా పరువులేని కుటుంబాలకు చెందినవారా’అని పరిశీలకులు మంత్రి అనితను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అత్యాచార బాధితులపై సానుభూతి చూపాల్సిన మంత్రి అనిత అందుకు విరుద్ధంగా వారిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించడం విభ్రాంతికి గురిచేస్తోందని విమర్శిస్తున్నారు. అత్యాచారం వంటి దురదృష్టకర ఘటనలు జరిగితే బాధిత మహిళలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయండి... వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోమ్ మంత్రిగా, అందులోనూ మహిళగా ఆమె కోరాలి. అందుకు విరుద్ధంగా అత్యాచారాలపై ఫిర్యాదులు చేసేవారు పరువుగల కుటుంబాలకు చెందినవారు కాదనే అర్థం వచ్చేలా మాట్లాడటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బాలికపై అత్యాచార యత్నం
శ్రీకాళహస్తి : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సంత మైదానం వద్ద శనివారం ఐదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన గుర్తుతెలియని యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు.. సంతమైదానం సమీప ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలికను గుర్తుతెలియని యువకుడు స్కూటర్ పై తీసుకొచ్చి నిర్మాణంలో ఉన్న ఇంటి మిద్దెపైకి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. అటుగా వెళ్తున్న సుబ్బలక్ష్మి అనే యువతి అతని వాలకంపై అనుమానంతో గమనించింది. ఆపై విషయాన్ని స్థానికులకు చెప్పింది. దీంతో స్థానికులు మిద్దెపైకి వెళ్లి బాలికపై అఘాయిత్యం చేయబోతున్న యువకుడిని పట్టుకుని కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. పోలీసులు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. -
మండపాలు వేదికగా నిరసనలు
నవరాత్రి ఉత్సవాలు అంటే.. బెంగాల్. బెంగాల్ అంటే నవరాత్రి ఉత్సవాలు. అలాంటిది ఈ సారి పండుగ దృశ్యం పూర్తిగా మారిపోయింది. కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తరువాత.. దుర్గామాత మండపాలు సైతం నిరసనలను ప్రతిబింబిస్తున్నాయి. సాధారణంగా బెంగాల్‌లోని దుర్గా పూజ మండపాల్లో దేవత నిలబడి ఉంటుంది. ఇరువైపులా వినాయకుడు, కార్తికేయుడు, దేవతలు లక్ష్మీ, సరస్వతులు ఉంటాయి. ఆమె పాదాల దగ్గర రాక్షసుడు ఉంటాడు. ఇంకొందరైతే మరికొంత విశాలంగా ఆలోచించి.. బుర్జ్ ఖలీఫా ప్రతీకనో, సుందర్బన్ అడవులనో ప్రతిబింబిస్తారు. ఇంకొందరు నీటి సంరక్షణ, ప్రపంచశాంతి వంటి సామాజిక సందేశాలను ప్రదర్శిస్తారు. కానీ ఈసారి ఇవేవీ జనాన్ని ఆకర్షించడం లేదు. చాలా మండపాలు నిరసన ప్రదర్శనలుగా మారాయి. వాటిని చూడటానికి కూడా జనం ఆసక్తి చూపుతున్నారు. కోల్‌కతాలోని కంకుర్గచ్చిలో పూజ ఇతివృత్తంగా లజ్జ(õÙమ్)ను ఎంచుకున్నారు. దుర్గాదేవి కళ్లు మూసుకుని ఉండగా.. తెల్లని షీటుతో చుట్టిన ఒక మహిళ శరీరంపై ఓ సింహం నిఘా పెట్టింది. పక్కనే బాధిత కుటుంబాన్ని ప్రదర్శించారు. మంచంపై కూర్చున్న తల్లి, కుట్టు మిషన్ దగ్గర కూర్చున్న తండ్రి, గోడపై కుమార్తె ఫొటో ఉన్నాయి. మహిళల ఆధ్వర్యంలో నడిచే ఓ మండపం థీమ్ వివక్ష. ఈ సంవత్సరం వారు దుర్గా పూజను పండుగ అని కాకుండా ప్రతిజ్ఞ అని పిలుస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని, అందులోని అధికరణలను నేపథ్యంగా తీసుకున్నారు. ఒక మహిళ న్యాయం చేయాలనే రెండు చేతులు పైకెత్తి శూన్యంలోకి సహాయం కోసం అరి్ధస్తోంది. ‘రాజ్యాంగం చెప్తున్నదేమిటి? వాస్తవానికి జరుగుతున్నదేమిటి?’అంటూ స్థానిక నటులు వీధి నాటకం ప్రదర్శిస్తున్నారు. మరోచోట దేవత శక్తిని.. నిరసనల్లోని కొవ్వొత్తిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేశారు. దక్షిణ కోల్‌కతాలోని బాఘా జతిన్ మండపం... దుర్గా మాతను మరింత భయానకంగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది వేడుకలు జరుపుకొనే ఉత్సాహం లేదని.. అందుకే డ్యాన్సులను రద్దు చేసుకున్నామని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
RG Kar Medical Hospital: బెంగాల్లో కొనసాగుతున్న వైద్యుల రాజీనామాలు
కోల్‌కతా: ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని, ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతు పెరుగుతోంది. వారికి సంఘీభావంగా గురువారం ప్రభు త్వ ఆధ్వర్యంలోని ఎస్ఎస్కేఎం ఆస్పత్రి లోని 40 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలో ఏడుగురు, ఉత్తర బెంగాల్లో ఇద్దరు జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న వైద్యుల ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని ఎస్ఎస్కేఎం ఆస్పత్రి డాక్టర్ గౌతమ్ దాస్ తెలిపారు. ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదని ఆయన విమర్శించారు. పరిష్కరించడంలో పురోగతి లేదని ఆయన ఎత్తిచూపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే రాజీనామాల నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆమరణ దీక్ష చేస్తున్న జూనియర్లకు మద్దతుగా గురువారం సీనియర్ డాక్టర్లు కూడా నిరసనలో పాల్గొన్నారు. వారికి సంఘీభావంగా ఆర్.జి.కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కు చెందిన 54 మంది సీనియర్ డాక్టర్లు మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కు చెందిన సుమారు 35 మంది వైద్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కాగా, జూనియర్ డాక్టర్లు చేస్తున్న దీక్ష గురువారం ఐదో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా నిరాహార దీక్షా స్థలాన్ని సందర్శించిన పోలీసు బృందం... జూనియర్ డాక్టర్ల ఆరోగ్యం క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీక్షను విరమించాలని కోరింది. -
CBI: నిందితుడి డీఎన్ఏ, రక్తనమూనాలు సరిపోలాయి
కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైన ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ వైద్యురాలిపై హత్యాచారం ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడి పనేనని సీబీఐ తెలిపింది. వైద్యురాలి మృతదేహంపై ఉన్న డీఎన్ఏ, రక్తనమూనాలు నిందితుని నమూనాలతో సరిపోలాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. సంజయ్ రాయ్‌కు వ్యతిరేకంగా 11 సాంకేతిక ఆధారాలను చార్జిషీటులో పొందుపర్చింది. బాధితురాలి మృతదేహం నుంచి సేకరించిన డీఎన్ఏ సంజయ్ రాయ్ డీఎన్ఏతో సరిపోలిందని తెలిపింది. అలాగే కురచ వెంట్రుకలు, పెనుగులాటలో సంజయ్ రాయ్ ఒంటిపై అయిన గాయాలు, అతని శరీరంపై, ప్యాంటుపై బాధితురాలి రక్తపు మరకలు, సీసీటీవీ ఫుటేజీ, అతని మొబైల్ ఫోన్ లొకేషన్, ఫోన్‌కాల్ వివరాలు.. ఇవన్నీ సంజయ్ రాయ్ పాత్రను నిర్ధారిస్తున్నాయని పేర్కొంది. సంజయ్ రాయ్ ఒంటిపై బలమైన గాయాలున్నాయని, వైద్యురాలు తీవ్రంగా ప్రతిఘటించినపుడు ఇవి జరిగాయని వివరించింది. పాశవిక హత్యాచారం జరిగిన ఆగస్టు 9న సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ మెడికల్ కాలేజిలో మూడో అంతస్తులోని సెమినార్ హాల్ వద్ద ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజి, అతని కాల్ డేటా ధ్రువీకరిస్తోందని తెలిపింది. సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు ఆగస్టు 10న అరెస్టు చేయగా.. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ చేపట్టిన విషయం తెలిసిందే. సెమినార్ హాల్ వైపు వెళుతున్నపుడు సంజయ్ రాయ్ మెడపై ఉన్న బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నెక్‌బ్యాండ్ తర్వాత అతను తిరిగి వెళుతున్నపుడు లేదని, సంజయ్ రాయ్ ఫోన్‌తో ఇది అనుసంధానమైనట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లా»ొరేటరీ నివేదిక ఇచి్చందని స్థానిక కోర్టుకు సీబీఐ తెలిపింది. -
పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఆటోలో ఊరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక బంధువు ఫిర్యాదుపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పిఠాపురానికి చెందిన దుర్గాడ జాన్ టీడీపీ నేత. ఆయన భార్య దుర్గాడ విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్, ప్రస్తుతం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు.ఆటో డ్రైవర్ జాన్ మరో మహిళతో కలిసి సోమవారం సాయంత్రం పట్టణంలోని స్టేట్ బ్యాంకు వద్ద ఉన్న ఓ బాలికను మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నారు. పిఠాపురం శివారు మాధవపురం సమీపంలోని డంపింగ్ యార్డు వద్దకు తీసుకెళ్లి అక్కడ మహిళను కాపలాగా పెట్టి, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా డంపింగ్ యార్డులో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకునే వారు జాన్‌ను, మహిళను పట్టుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాధితురాలిని పిఠాపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. జాన్‌ను కేసు నుంచి తప్పించాలంటూ టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే బాధితురాలి బంధువులు ఆందోళనకు సిద్ధపడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
స్ట్రీట్‌లో స్టెప్పులు.. నిరసన నిప్పులు
స్త్రీ అమ్మ... అన్యాయం జరిగితే ఆదిపరాశక్తి.స్త్రీ భూదేవి... సహనం కోల్పోతే అపరకాళి.ఈ జగత్తును తల్లిలా ఆదరించే ప్రతి స్త్రీ ఈ జగత్తులో తానొక భాగం అనుకుంటుంది. తనకు గౌరవప్రదమైన ఉనికి కోరుకుంటుంది. కానీ, మనుషులు ఘోరంగా వ్యవహరించి ఆమె విశ్వాసాన్ని ధ్వంసం చేస్తుంటారు. ఆమె సహనాన్ని పరీక్షిస్తుంటారు. కోల్‌కతాలో డాక్టర్‌పై జరిగిన ఘోరకలి ఈ దేశంలో ప్రతి స్త్రీని భద్రకాళిని చేసింది. ఆ సమయంలో ఎగసిన నిరసనల్లో కోల్‌కతా వీధుల్లో ఉగ్రతాండవం చేసింది మోక్షా సేన్ గుప్తా. ‘సాక్షి’తో ఆమె మాట్లాడింది.‘‘సమాజంలోని చీడపురుగులకు చికిత్స చేయాలి. లేకపోతే వైద్యులనే కబళించేస్తాయి. చికిత్స ఎంత తీవ్రంగా ఉంటే సమాజానికి అంత మేలు’’ అంటున్నారు మోక్షా సేన్ గుప్తా. కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా మోక్షా సేన్ గుప్తా స్ట్రీట్ డ్యాన్స్‌తో పాటు ఇంకా పలు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ‘అలనాటి రామచంద్రుడు’తో తెలుగు తెరపై కనిపించిన ఆమె త్వరలో విడుదల కానున్న ‘రామం రాఘవం’లోనూ నటించారు. బెంగాలీ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇక ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షా సేన్ గుప్తా చెప్పిన విషయాలు.→ వీధుల్లో కళా ప్రదర్శన మా సంస్కృతివీధుల్లో కళా ప్రదర్శన అనేది చాలా సంవత్సరాల నుండి వస్తున్న మా బెంగాల్ సంస్కృతి. వర్జీనియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు విభజనకు ముందు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో బెంగాల్ కూడా రాజధానిగా ఉండేది. మన పూర్వీకులు వీధి కళ, వీధి నాటకం, వీధి నృత్యం, వీధి పాటల ద్వారా వీధి ప్రదర్శనలు చేసేవారు. దర్శకుడు సత్యజిత్ రే ఏదైనా సమస్య అంటే బెంగాలీలు అందరూ ఎలా ఒక్కటవుతారో కూడా తన సినిమాల్లో చూపించారు. మన స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో బెంగాలీ స్వాతంత్య్ర సమరయోధులు వీధుల్లోకి వచ్చి, నిరసనలు చేశారు. నా రాష్ట్రం, నా కుటుంబం నేర్పిన, పెంపకం నుంచి నాకు సామాజిక బాధ్యత వచ్చింది. పూరీ్వకులు చేసిన నిరసనలే నాకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే కోల్‌కతా వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా వీధుల్లో కళా ప్రదర్శనలు చేశాను. → సత్యం కోసం... కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం స్వాతంత్య్ర సమయంలో తన కవితలు, పాటల ద్వారా బెంగాల్లో పునరుజ్జీవనం తేవడానికి ప్రయత్నించిన గొప్ప వ్యక్తి. ఆయన్ను నేతాజీ సుభాష్ చంద్రబో‹స్, స్వామి వివేకానంద వంటి మహానుభావులు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇక నేను వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం పాటను స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను రామకృష్ణ పరమహంస ఆరాధకురాలిని. ఆ విధంగా మంచి కోసం నిలబడటం అనేది నా రక్తంలోనే ఉంది. ఏ కళాకారుడైనా... అది వీధి కళాకారుడైనా ‘సత్యమేవ జయతే’ అంటూ నిజం వైపు నిలబడే ధైర్యం ఆ ఆరి్టస్ట్కి ఉండాలి. నేను డ్యాన్స్ చేసిన పాట అర్థం కూడా దాదాపు ఇలానే ఉంటుంది. ‘ఒకవేళ నువ్వు చెరసాలలో ఉన్నట్లయితే నిజం కోసం గొంతు ఇవ్వడానికి ఆ చెరసాలను బద్దలు కొట్టి బయటకు రావాలి. సత్యం కోసం స్వరం వినిపించాలి’ అన్నట్లుగా ఆ పాట ఉంటుంది. → వ్యవస్థకి వ్యతిరేకంగా.. మృత్తిక అనే స్వచ్ఛంద సేవా సంస్థ, ఇంకా మరికొన్ని అలాంటి సంస్థలు అణగారిన స్త్రీలు, పిల్లల సంక్షేమం కోసం పని చేస్తుంటాయి. వారితో మేం కలిసి పని చేస్తాం. అభయ సంఘటన విషయంలో వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడే వైద్యులతో మేం నిలబడ్డాం. నేను మాత్రమే కాదు... ఎందరో కళాకారులు మాతో వీధుల్లోకి వచ్చారు. అభయ కుటుంబానికి, వైద్యుల కోసం, న్యాయం కోసం మేం అంతా ఉన్నామని చూపించడానికి నాట్యాన్ని ఎన్నుకున్నాం. మేం చేస్తున్న నిరసన కార్యక్రమాలు చాలామందిని ప్రభావితం చేస్తున్నాయని నమ్ముతున్నాను. → డ్యాన్స్ కాదు... నిరసన నేను చేసినది డ్యాన్స్ అని నాకనిపించలేదు. ఎందుకంటే సరైన కొరియోగ్రఫీ లేదు. నిజానికి నేను వేరొక నిరసన ప్రదర్శన నుండి నేరుగా అక్కడికి వెళ్లాను. ఓ 20, 25 కిలోమీటర్ల నిరసన కార్యక్రమం అది. ఆ నిరసన పూర్తయ్యాక అక్కడికి వెళ్లాను. ఒక బలమైన విషయాన్ని నృత్యరూపంలో చె΄్పాలనుకున్నప్పుడు సరైన వేదిక అక్కర్లేదు... కెమెరా, యాక్షన్, లైట్లు అవసరంలేదు. ఓ ఆరి్టస్ట్ సత్యం కోసం ఎక్కడ నిలబ డితే అదే పెద్ద వేదిక అవుతుంది. ఆ వేదిక సత్యం, న్యాయం కోసం మాత్రమే నిలబడే వేదిక అయితే చాలు... ముందస్తు ప్రిపరేషన్ లేకుండా చేసేయొచ్చు. → ఐక్యత కోసమే... పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని స్థానిక పార్టీ సమరి్థస్తోంది. అంటే... కొందరు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్లు, స్థానికులు. నా డ్యాన్స్ గురించి కూడా చాలా అవమానకరంగా మాట్లాడారు. ఇది నిరసనా లేక మీరు రెచ్చగొడుతున్నారా? అన్నారు. అయితే ఇప్పుడు కామన్ మేన్ కూడా తన గొంతు విప్పడానికి సిద్ధమయ్యాడు. సో... ఎక్కడో చోట మొదలయ్యే నిరసనలు సాధారణ వ్యక్తులను ప్రభావితం చేసేందుకూ ఉపయోగపడతాయి. కొన్నేళ్లుగా బెంగాలీల మధ్య ఉన్న ఐక్యత కాస్త సన్నగిల్లింది. అభయ రూపంలో మళ్లీ ఆ ఐక్యతను తిరిగి తేగలిగాం. → తలో చేయీ వేద్దాం రాష్ట్ర ప్రభుత్వం 21 మంది లాయర్లను నియమించింది. వారికి వ్యతిరేకంగా డాక్టర్లు, అభయ కుటుంబం పోరాడుతోంది. ఎందరో పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారిని ఎదిరించి పోరాడాలంటే ఆర్థిక బలం అవసరం. వెస్ట్ బెంగాల్ డాక్టర్స్ నిధిని సమకూర్చా లని అనుకుంటున్నారు. నా వంతుగా నేనూ ఫండ్ రైజ్ చేస్తున్నాను. 100 రూపాయలు కూడా మాకు ఎక్కువే. 50 మంది 100 రూపాయలు ఇస్తే... అదే పెద్ద మొత్తం అవుతుంది. అలా తలో చెయ్యీ వేసి, ముందుకొస్తే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే వీలుంటుంది. అభయ కేసుని ఓ ఉదాహరణగా నిలపగలిగితే ఇలాంటి వెయ్యి సమస్యలను అధిగమించగలం. ‘మేం భారతీయులమని చెప్పుకోవడానికి గర్వపడుతు న్నాం’ అని ప్రపంచానికి చెప్పగలుగుతాం.→ అవసరమైతే మళ్లీ డ్యాన్స్ మలయాళంలో నేను చేసిన ‘చిత్ని’ ఈ 27న రిలీజైంది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అలాగే తెలుగులో నా ఫస్ట్ మూవీ ‘అలనాటి రామచంద్రుడు’ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాని చూడనివాళ్లు ఓటీటీలో చూడాలని కోరుకుంటున్నాను. ఇలా నా సినిమా విషయా లను ఫోకస్ చేస్తూనే డిజిటల్‌గా బాధితుల పక్షాన వీలైనంతగా ప్రచారం చేస్తున్నాను. అవసరమైతే మళ్లీ ‘స్ట్రీట్ డ్యాన్స్’ చేస్తా. ఆ ప్రదర్శనతో ఐదు రూపాయలు లాంటి చిన్న మొత్తం వచ్చినా అది ‘అభయ క్లినిక్’కి, అది ఏర్పాటు చేసిన డాక్టర్లకు వెళుతుంది. ఎందుకంటే ఈ క్లినిక్ నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఉపయోగపడాలన్నది మా ఆశయం. అందుకే సాయం చేయాలనుకునేవారు ఈ ఫోను నంబరు +91 6291485209 లేదా ఠీb్జunజీౌటఛీౌఛ్టిౌటటజటౌn్టఃజఝ్చజీ .ఛిౌఝ ని సంప్రదించాలని కోరుకుంటున్నాను’’ అని మోక్ష విజ్ఞప్తి చేశారు. పార్టీలకు తటస్థంగా ఉంటే కొన్ని ప్రశ్నలు లేవనెత్తలేం. అయితే ప్రశ్నలు వేస్తే మీరు ప్రతిపక్ష పార్టీ కేడర్ అని అర్థం... ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల ప్రభావం నేనో కొత్త కల కనేలా చేశాయి. ‘మావన హక్కు’ల గురించి క్షుణ్ణంగా చదవాలన్నదే ఆ కల.అభయ అనేది అంతర్గతంగా, బాహ్యంగా నన్ను మార్చేసింది. ఇక ఇప్పుడు నేను దేని గురించీ పట్టించుకోను. ఎంత దూరం అయినా ఏ మార్గంలో అయినా వెళ్లగలను. ఇది ‘మోక్ష 2.ఓ’ వెర్షన్. ఈ మారిన మోక్ష డాక్లర్లకు సపోరి్టవ్గా ఉంది... న్యాయం పక్షాన ఉంటుంది. – డి.జి. భవాని -
కామాంధుడి చెర నుంచి రక్షించిన కోతులు!!
దేశంలో అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. కఠిన చట్టాలు.. శిక్షలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. పసికందుల నుంచి పండు ముసలి దాకా.. హత్యాచారాలకు బలైపోవడం నిత్యకృత్యంగా మారిపోయింది. అయితే.. కోతుల గుంపు ఓ అఘాయిత్యాన్ని నిలువరించాయన్న వార్త ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఉత్తర ప్రదేశ్ భాగ్పట్లో ఆసక్తికరమైన ఘటన చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిని ఓ మానవ మృగం చిదిమేందుకు ప్రయత్నించగా.. హఠాత్తుగా హీరో మాదిరి ఎంట్రీ ఇచ్చిన కోతుల గుంపు అతనిపై దాడి చేసి ఆ ఘోరాన్ని ఆపాయి!!.బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. దౌలా గ్రామంలో సెప్టెంబర్ 20వ తేదీన ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను నిందితుడు బలవంతంగా ఎత్తుకెళ్లాడు. పాడుబడ్డ ఓ భవనంలోకి తీసుకెళ్లి బెదిరించి అఘాయిత్యానికి ప్రయత్నించబోయాడు. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతుల గుంపు.. నిందితుడిని బెదరగొట్టి అక్కడి నుంచి తరిమి కొట్టాయి. అయితే ఈ క్రమంలో ఆ చిన్నారిని మాత్రం అవి గాయపర్చలేదు.అక్కడి నుంచి పరిగెత్తి ఇంటికి చేరుకున్న చిన్నారి.. జరిగిన ఘటనను.. కోతులు తననెలా రక్షించాయో తల్లిదండ్రులకు చెప్పింది. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించారు. పరారీలో ఉన్న అతన్ని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. కోతుల గుంపు రాకపోయి ఉంటే తమ బిడ్డ పరిస్థితి ఏమైపోయేదో అని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. -
వాళ్లలా నేనూ రేపిస్ట్‌నే
అవిగ్నోన్(ఫ్రాన్స్): అత్యంత జుగుప్సాకరమైన, అమానవీయ ఘటనకు వేదికగా నిలిచిన ఫ్రాన్స్‌లోని అత్యాచారాల పర్వంలో ప్రధాన నిందితుడు, బాధితురాలి మాజీ భర్త ఎట్టకేలకు తన తప్పును ఒప్పుకున్నాడు. తనను క్షమించాలని మాజీ భార్య, తన ముగ్గురు పిల్లలను వేడుకున్నాడు. అవిగ్నోన్ పట్టణంలోని కోర్టులో సెప్టెంబర్ రెండో తేదీన కేసులో వాదోపవాదనలు మొదలెట్టాక తొలిసారిగా నిందితుడు మంగళవారం తన తప్పును ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇచ్చారు. మిగతా రేపిస్టుల్లాగే తాను కూడా భార్యను రేప్చేశానని ఏడుస్తూ చెప్పాడు. వాంగ్మూలం ఇచ్చిన సమయంలో ప్రధాన నిందితుడితోపాటు దాదాపు 50 మంది ఇతర రేపిస్ట్ నిందితులూ కోర్టు హాలులోనే ఉన్నారు. గతంలో ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసిన 71 ఏళ్ల డొమినిక్ పెలికోట్ తన భార్య గిసెలీకి భోజనంలో మత్తు మందు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లాక ముక్కూముఖం తెలియని, దారిన పోయే వాళ్లను పిలిచి మరీ రేప్ చేయించాడు. ఇలా 72 మంది గిసెలీని 92 సార్లు రేప్‌చేశారు. ఈ అత్యాచారపర్వం పదేళ్లపాటు అంటే 2011 నుంచి 2020దాకా కొనసాగింది. అయితే 2020లో ఒక సూపర్మార్కెట్లో అమ్మాయిలను స్కర్టుల కింది నుంచి వీడియోలు తీస్తూ పెలికోట్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఇంటికొచ్చి అతని వస్తువులకు పోలీసులు తనిఖీచేశారు. దీంతో ఫోన్, కంప్యూటర్లో వెలుగుచూసిన అంశాలు చూసి పోలీసులే విస్తుపోయారు. భార్యను అపరిచితులు రేప్ చేస్తున్న డజన్ల కొద్దీ వీడియోలు, ఫొటోలు అందులో ఉన్నాయి. మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న పెలికోట్ మంగళవారం కోర్టులో మాట్లాడాడు. ‘‘ ఎవరూ తప్పుడు నడవడికతో పుట్టరు. పరిస్థితులు అలా మారుస్తాయి’’ అని అన్నారు. నేరం రుజువైతే పెలికోట్కు కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది. పెలికోట్ భార్యను రేప్ చేసిన వారిలో 26 ఏళ్ల యువకుల నుంచి 74 ఏళ్ల వృద్దుల వరకు ఉన్నారు. మత్తులోకి జారకముందే ఆమె తన సమ్మతి తెలిపిందని, భర్త తమతో ఇలా చేయిస్తున్నట్లు తమకు నిజంగా తెలియదని వారిలో చాలా మంది చెప్పడం గమనార్హం. -
కోల్‌కతా సీపీగా మనోజ్ వర్మ
కోల్‌కతా: జూనియర్ డాక్లర్లు డిమాండ్ చేసినట్లుగానే కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్‌పై వేటు పడింది. కొత్త కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మను బెంగాల్ ప్రభుత్వం మంగళవారం నియమించింది. జూడాలకు ఇచి్చన హామీ మేరకు ఆరోగ్య సేవల డైరెక్టర్ దెవాశిష్ హల్దర్, వైద్య విద్య డైరెక్టర్ కౌస్తవ్ నాయక్‌లను మమత సర్కారు తొలగించింది. కోల్‌కతా నార్త్ డివిజన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ అభిõÙక్ గుప్తా పైనా వేటు వేసింది. మనోజ్ వర్మ జంగల్‌మహల్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతలో కీలకపాత్ర పోషించారు. కిషన్‌జీ (కోటేశ్వర రావు) ఎన్కౌంటర్లోనూ ముఖ్యభూమిక వహించారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు 39 రోజులుగా విధులను బహిష్కరిస్తున్నారు. సోమవారం రాత్రి మమతతో సమావేశమయ్యారు. వారి ప్రధాన డిమాండ్లను మమత అంగీకరించడం తెలిసిందే. -
నైట్ షిఫ్టులు వద్దంటారా?
న్యూఢిల్లీ: మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలా చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ‘‘పైలట్లుగా, సైనికులుగా మహిళలు రాత్రి విధులు నిర్వహించడం లేదా? మీ నిర్దేశాలు మహిళా వైద్యుల కెరీర్‌పై ప్రభావం చూపుతాయి. రాత్రి విధుల్లో సమస్యలు ఎదుర్కోకుండా వారికి అవసరమైన భద్రత కలి్పంచడం ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప వాటిని మానుకోవాలని చెప్పడం సరికాదు’’ అంటూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం మందలించింది. దాంతో సదరు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటామని బెంగాల్ సర్కారు విన్నవించింది. కోల్‌కతాలో ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రిలో ట్రైనీ వైద్యురాలు రాత్రి విధుల్లో ఉండగా హత్యాచారానికి గురవడం, ఈ ఉదంతం దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడం తెలిసిందే. దాంతో నెల రోజులకు పైగా మమత సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో మహిళా వైద్యుల భద్రత నిమిత్తం సలహాలు, సూచనలతో ‘రాతిరేర్ సాథి’ పేరిట ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్యురాలి హత్యాచారోదంతంపై విచారణ సందర్భంగా మంగళవారం ఈ అంశం ధర్మాసనం దృష్టికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించింది. ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది భద్రత నిమిత్తం కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రైవేట్ సెక్యూరిటీని నియమించాలన్న నిర్ణయాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘వైద్యులకు భద్రతే లేని పరిస్థితి నెలకొని ఉంది. కనుక ప్రభుత్వాసుపత్రుల్లో పోలీసు సిబ్బందినైనా నియమించడం రాష్ట్ర ప్రభుత్వ కనీస బాధ్యత. వాటిలో యువ వైద్య విద్యార్థులు, ఇంటర్న్లు పని చేస్తున్నారు’’ అని గుర్తు చేసింది. మా లాయర్లకు బెదిరింపులు: సిబల్ ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఇది ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న కేసు. దీని విచారణ ఎలా జరుగుతోందో దేశ ప్రజలంతా తెలుసుకుని తీరాలి’’ అని స్పష్టం చేసింది. ప్రత్యక్ష ప్రసారం తమ లాయర్ల బృందానికి సమస్యలు సృష్టిస్తోందని సిబల్ వాదించారు. ‘‘ఇది విపరీతమైన భావోద్వేగాలతో కూడిన కేసు. మేం వాదిస్తోంది బాధితురాలి తరఫున కాదు గనుక మా బృందంలోని మహిళా లాయర్లకు యాసిడ్ దాడులు, అత్యాచారాలు చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. పైగా మా క్లయింట్ (బెంగాల్ సర్కారు) గురించి ధర్మాసనం ఎలాంటి వ్యాఖ్యలు చేసినా లాయర్లుగా పేరుప్రఖ్యాతు లన్నీ మట్టిలో కలిసిపోతున్నాయి’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. లాయర్లకు రక్షణ లభించేలా జోక్యం చేసుకుంటామని ధర్మాసనం హామీ ఇచి్చంది. ప్రత్యక్ష ప్రసారాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మమత రాజీనామాకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఇదేమీ రాజకీయ వేదిక కాదంటూ సదరు న్యాయవాదికి తలంటింది.సీరియస్ అంశాలివి! వైద్యురాలి కేసులో దర్యాప్తు ప్రగతిపై సీబీఐ సమరి్పంచిన స్థాయీ నివేదికను సీజేఐ ధర్మాసనం మంగళవారం పరిశీలనకు స్వీకరించింది. అందులోని అంశాలు తమనెంతగానో కలచివేశాయంటూ ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచి్చంది. ‘‘నివేదికలో సీబీఐ పేర్కొన్నవి చాలా సీరియస్ అంశాలు. వాటిని చదివిన మీదట మేమెంతో ఆందోళనకు లోనవుతున్నాం. అయితే వాటిని ఈ దశలో వెల్లడించలేం. అది తదుపరి దర్యాప్తుకు విఘాతం కలిగించవచ్చు’’ అని పేర్కొంది. ‘‘జరిగిన దారుణానికి సంబంధించి మృతురాలి తండ్రి కొన్ని విలువైన అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. వాటిపైనా దర్యాప్తు చేయండి’’ అని సీబీఐకి సూచించింది. ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి ఆర్థిక అవకతవకల కేసు దర్యాప్తుపైనా స్థాయీ నివేదిక సమరి్పంచ్సాలిందిగా నిర్దేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.పేరు, ఫొటో తొలగించండి హతురాలి పేరు, ఫొటో ఇప్పటికీ వికీపీడియాలో కనిపిస్తున్నట్టు సీబీఐ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో వాటిని తక్షణం తొలగించాలని వికీపీడియాను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో తామిచి్చన గత ఆదేశాలకు కట్టుబడాలని స్పష్టం చేసింది. సమ్మె, ఆందోళనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలూ చేపట్టబోమని బెంగాల్ ప్రభుత్వం ఈ సందర్భంగా హామీ ఇచి్చంది. వైద్యురాలిపై అఘాయిత్యం జరుగుతుండగా అక్కడ ఎవరెవరున్నదీ జూనియర్ వైద్యులకు తెలుసని వారి తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ సమాచారాన్ని సీబీఐకి సీల్డ్కవర్లో అందజేస్తామన్నారు. తక్షణం విధుల్లో చేరాల్సిందిగా డాక్టర్లకు ధర్మాసనం మరోసారి సూచించింది. -
Guidance for parents: మా అమ్మాయి సేఫ్‌గా ఉందా?
కోల్‌కతాలో హత్యాచార ఘటన జరిగాక స్కూలుకెళ్లే ఆడపిల్లల తల్లిదండ్రులు... ఉద్యోగం కోసం, ఇంటి పనుల కోసం బయటకు వెళ్లే ఆడపిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లల క్షేమం గురించి ఆందోళన పెంచుకున్నారు. గంట గంటకూ ఫోన్ చేసి ‘ఎక్కడున్నావ్’ అంటున్నారు. సాయంత్రం ట్యూషన్లు మాన్పిస్తున్నారు. కాని అంత భయపడాల్సిన అవసరం భయపెట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చెప్తే చాలు.ఒక పెద్ద ఘటన జరిగినప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం గాయపడుతుంది. గాయం తీవ్రంగా ఉన్నప్పుడు అయోమయం, ఆందోళన, భయం, అభద్రత అన్నీ చుట్టుముడతాయి. ఇవన్నీ పిల్లల గురించి, ఆడపిల్లల గురించి అయినప్పుడు ఆ ఆందోళనకు అంతు ఉండదు. ఇప్పుడు కోల్‌కతాలోని స్కూళ్లు చైల్డ్ సైకాలజిస్ట్‌లు, కౌన్సెలర్లతో కిటకిటలాడుతున్నాయి.అక్కడ ఏం జరిగింది?పిల్లలకు సహజంగానే కుతూహలం అధికం. కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై దారుణకాండ జరిగిన సంగతి దేశాన్ని కుదిపేస్తే కోల్‌కతా హోరెత్తింది. ఇంటా బయట ఆ సంఘటన గురించే చర్చలు. పిల్లల చెవుల్లో ఆ మాటలు పడనే పడతాయి. అదొక్కటే కాదు... వారికి ఆ సంఘటన గురించి దాచి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. స్కూళ్లు కొన్ని తన విద్యార్థులతో స్వచ్ఛందంగా నిరసనల్లో పాల్గొని ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్నాయి కూడా. వీటన్నింటి దరిమిలా పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ప్రశ్నలతో ముంచెత్తసాగారు టీచర్లని, తల్లిదండ్రులను. డాక్టర్‌కు ఏం జరిగింది? ఆమె ఎలా చనిపోయింది? చేసిన వారిని పట్టుకున్నారా? అలాంటివి మాక్కూడా జరుగుతాయా?... ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక టీచర్లు అవస్థ పడి కౌన్సెలర్లను స్కూళ్లకు పిలుస్తున్నారు.రెండు విధాలా...ఇప్పుడు స్కూలు పిల్లలు, ఇంటర్ స్థాయి పిల్లలకు బయట దారుణమైన మనుషులు ఉంటారనే భయంతో వేగడం ఒక సమస్య అయితే అంత వరకూ కొద్దో గొ΄్పో స్వేచ్ఛ ఇస్తూ వచ్చిన తల్లిదండ్రులు స్కూల్ నుంచి లేట్‌గా వచ్చినా, ట్యూషన్‌కు వెళ్లినా, ఇంటి పనుల కోసం బయటకు వెళ్లినా పదే పదే ఫోన్లు చేసి వెంటపడటం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొందరు తల్లిదండ్రులు పెప్పర్ స్ప్రేలు కొనిస్తుండటంతో పిల్లలు మరింత బెంబేలు పడుతున్నారు.పిల్లలకు ధైర్యం చెప్పాలిఇప్పుడు జరగాల్సినది... పిల్లలకు ధైర్యం చెప్పడమే కాకుండా రక్షణ గురించి తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించుకోవాలి. నిర్లక్ష్యం అసలు పనికిరాదని కోల్‌కతా ఘటన తెలియచేస్తోంది. ఎవరూ లేని హాల్లో ఒంటరిగా నిద్రపోవడం ఎంత సురక్షితమో ఆ డాక్టర్ అంచనా వేసుకోలేకపోయింది. తల్లిదండ్రులు కూడా నైట్ డ్యూటీ సమయంలో వీడియో కాల్స్ చేసి ఆమె తిరుగాడక తప్పని పరిసరాలను గమనించి ఉంటే తగిన సూచనలు చేసి ఉండేవారు. అందుకే తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.⇒ పిల్లల రాకపోకల సమయాలను నిర్దిష్టంగా తల్లిదండ్రులు తెలుసుకుని ఉండాలి ⇒ స్కూల్‌కు వెళ్లే సమయం వచ్చే సమయం వారు వచ్చి వెళ్లే దారి, రవాణ వ్యవస్థ, ఎవరైనా కొత్త మనుషులు కలుస్తున్నారా... వంటివి ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి ⇒ ర్యాపిడో వంటి వాహనాలు ఎక్కి రావాల్సి ఉంటే ఎక్కే ముందు ఆ డ్రైవర్‌తో మాట కలిపించి, అతని నంబర్ తీసుకోవాలి లేదా తల్లిదండ్రులే ఫోన్‌పే చేస్తే అతని నంబర్ వచ్చేసినట్టే. ⇒ కొత్త ్రపాంతాలకు వెళ్లేటప్పుడు అవి ఏ మేరకు సురక్షితమో తెలుసుకుని పంపాలి. ⇒ పిల్లలు బయట ఉన్నప్పుడు తప్పకుండా ఫోన్ ఉండేలా చూసుకోవాలి. అది సైలెంట్ మోడ్‌లో లేకుండా పెట్టమని చెప్పాలి. ⇒ పిల్లలను ఊరికే కాల్ చేసి విసిగించకుండా ప్రతి గంటకూ ఒకసారి మెసేజ్ పెడితే చాలని చెప్పాలి. ⇒ పోలీసులకు కాల్ చేయడానికి భయపడకూడదని తెలియజేయాలి. ⇒ ఇంటి బయట, స్కూల్ దగ్గర, బంధువులుగాని, స్కూలు సిబ్బందిగాని ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంటే వెంటనే తమకు చెప్పాలని భయపడకూడదని తెలియజేయాలి. ⇒ చట్టం చాలా శక్తిమంతమైనా, ఆపదలో చిక్కుకున్నప్పుడు దూసుకొచ్చే సాటి మనుషులు ఉంటారని, గట్టిగా సాయం కోరితే అందరూ కాపాడతారని పిల్లలకు చెబుతుండాలి. ⇒ అపరిచిత కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని ఊరికే భయపెట్టే విషయాలను ఆలోచిస్తూ కూచోవద్దని చెప్పాలి. ⇒ ధ్యాస మళ్లించే మంచి స్నేహాలలో ఉండేలా చూసుకోవాలి. -
దిగొచ్చిన దీదీ
కోల్‌కతా: మమతా బెనర్జీ సర్కారు దిగివచ్చింది. జూనియర్ డాక్టర్ల ఐదు డిమాండ్లలో మూడింటిని ఆమోదించింది. వైద్య విద్య డైరెక్టర్, ఆరోగ్య సేవల డైరెక్టర్లను తొలగించడానికి అంగీకరించింది. వైద్యురాలి తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వజూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ పైనా వేటు వేసింది. మంగళవారం కొత్త కమిషనర్‌ను నియమిస్తామని సీఎం మమత ప్రకటించారు. వినీత్ గోయల్ కమిషనర్‌గా కొనసాగడానికి సుముఖంగా లేరన్నారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్)ను తొలగించాలని నిర్ణయించామన్నారు. జూనియర్ల డాక్టర్ల ఇతర డిమాండ్లను పరిశీలించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఐదింటిలో మూడు డిమాండ్లను అంగీకరించినందుకు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని జూనియర్ డాక్టర్లను కోరినట్లు మమత వెల్లడించారు. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత మమత మీడియాతో మాట్లాడుతూ సమావేశపు వివరాలను వెల్లడించారు. 42 మంది జూనియర్ డాక్టర్లు, బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ సమావేశపు మినిట్స్‌పై సంతకాలు చేశారని మమత తెలిపారు. జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని ప్రకటించారు. చర్చించుకొని తమ నిర్ణయం చెబుతామని జూనియర్ డాక్టర్లు తెలిపారని మమత వెల్లడించారు. రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విధులకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఆరోగ్యశాఖ కార్యదర్శిని కూడా బదిలీ చేయాలనేది జూడాల డిమాండ్లలో ఒకటి. కాళిఘాట్‌లోని సీఎం నివాసంలో సోమవారం జూనియర్ డాక్టర్లతో రాత్రి 7 గంటలకు మొదలైన చర్చలు 9 దాకా కొనసాగాయి. 42 మంది జూడాలు మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా సీఎం ముందుంచారు. అనంతరం ఇరుపక్షాలు రెండున్నర గంటల పాటు సమావేశపు మినిట్స్‌కు తుదిరూపునిచ్చాయి. చర్చలు సానుకూలంగా జరిగాయని మమత అన్నారు. అందుకే ఇరుపక్షాలు మినిట్స్‌పై సంతకాలు చేశాయని అభిప్రాయపడ్డారు. అంతకుముందు సోమవారం ఉదయం మమత సర్కారు జూనియర్ డాక్టర్లను చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు íపిలవడం ఇది ఐదో, ఆఖరుసారని కూడా స్పష్టం చేసింది.నేడు సుప్రీం విచారణ న్యూఢిల్లీ: ఆర్.జి.కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు మంగళవారం ఈ కేసును మరోసారి విచారించనుంది. సహచర డాక్టర్ పాశవిక హత్యను నిరసిస్తూ ఆగస్టు 9 నుంచి పశి్చమబెంగాల్ జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరిస్తున్నారు. క్రమశిక్షణ చర్యల బారినపడకుండా ఉండాలంటే సెప్టెంబరు 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు గతంలో జూడాలను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ జూడాలను సమ్మె కొనసాగించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం జరిపే విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. -
Allahabad High Court: సమ్మతి ఉన్నా, భయపెడితే అత్యాచారమే
ప్రయాగ్‌రాజ్: సమ్మతితో లైంగిక సంబంధం పెట్టుకున్నాసరే ఆ సంబంధం భయంతో కొనసాగితే అత్యాచారంగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళ వేసిన కేసు విచారణ సందర్భగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో విచారణ ఆపాలంటూ తమను ఆశ్రయించిన రాఘవ్ కుమార్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువరించింది. బాధితురాలు సివిల్ సరీ్వసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో రాఘవ్ పరిచయమయ్యాడు. ఆమెను అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత పెళ్లిచేసుకుంటానని నమ్మించి బలవంతంగా ఆ బంధాన్ని కొనసాగించాడంటూ బాధితురాలు ఆగ్రా జిల్లా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు ఆగ్రా జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీన్ని సవాలు చేస్తూ రాఘవ్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ అనీస్ కుమార్ గుప్తా సారథ్యంలోని అలహాబాద్ హైకోర్టు బెంచ్ కొట్టేసింది. -
సాక్ష్యాలను నాశనం చేశారు
కోల్‌కతా: దేశవ్యాప్త ఆగ్రహావేశాలకు, ఆందోళనలకు కారణమైన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఉదంతం శనివారం కీలక మలుపు తిరిగింది. ఆర్.జి.కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఈ దారుణం జరిగిన సమయంలో ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్ సాక్ష్యాధారాలను నాశనం చేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆస్పత్రి నిధుల దురి్వనియోగం కేసులో ఆయన ఇప్పటికే జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. సాక్ష్యాలను నాశనం చేయడం, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యంతో పాటు కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయతి్నంచారని ఘోష్‌పై అభియోగాలు మోపింది. ఇవే అభియోగాలపై స్థానిక తలా పోలీసుస్టేషన్ సీఐ అభిజిత్ మండల్‌ను కూడా అరెస్టు చేసింది. ఆర్.జి.కర్ ఆసుపత్రి తలా పోలీసుస్టేషన్ పరిధిలోకే వస్తుంది. అభిజిత్ మండల్‌ను శనివారం సీబీఐ తమ కార్యాలయంలో కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో మండల్‌ను అరెస్టు చేసింది. అతన్ని ప్రశ్నించడం ఇది ఎనిమిదోసారి అని. ప్రతిసారీ మండల్ భిన్నమైన కథనం చెబుతున్నాడని సీబీఐ వర్గాలు తెలిపాయి. సందీప్ ఘోష్‌ను కస్టడీ కోరుతూ సీబీఐ న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. సీబీఐ కస్టడీ నిమిత్తం ఘోష్‌ను హాజరుపర్చాల్సిందిగా కోర్టు జైలు అధికారులను ఆదేశించిందని సీబీఐ అధికారి ఒకరు శనివారం తెలిపారు. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్ హాల్లో శవమై కని్పంచడం తెలిసిందే. ఆమెపై పాశవికంగా అత్యాచారం జరిపి దారుణంగా హతమార్చినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఒక రోజు అనంతరం ఆస్పత్రిలో పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణంపై వైద్యలోకం భగ్గుమంది. దీనివెనుక చాలామంది ఉన్నారని, ఆ వాస్తవాలను తొక్కిపెట్టేందుకు మమత సర్కారు ప్రయతి్నస్తోందని డాక్టర్లు ఆరోపించారు. వైద్యశాఖ కీలక డైరెక్టర్లు, కోల్‌కతా పోలీసు కమిషనర్ తదితరుల రాజీనామా కోరుతూ పశి్చమ బెంగాల్ వ్యాప్తంగా నిరసనలతో వైద్యులు హోరెత్తిస్తున్నారు. అనంతర పరిణామాల్లో కేసు దర్యాప్తును సీబీఐకి కలకత్తా హైకోర్టు అప్పగించింది. దర్యాప్తు పురోగతిపై మూడు వారాల్లోగా నివేదిక సమరి్పంచాల్సిందిగా ఆదేశించింది. ఆ మేరకు సెపె్టంబర్ 17లోగా దర్యాప్తు సంస్థ నివేదిక సమరి్పంచనుందని సమాచారం. ఘోష్‌కు నేరగాళ్లతో లింకులు వైద్యురాలిపై దారుణం జరిగిన మర్నాడే సందీప్ ఘోష్ హడావుడిగా ఆస్పత్రిలో మరమ్మతులకు ఆదేశాలు జారీ చేసినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. ఆ మేరకు ఘోష్ ఆదేశాలిచి్చ న లేఖను కూడా బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ కేసు నిందితులతో ఘోష్‌కు నేరపూరిత బంధం ఉందని, వారితో కలిసి పలు తప్పుడు పనులకు కూడా పాల్పడ్డారని సీబీఐ గత వారమే అభియోగాలు మోపింది. -
మీరిక వెళ్లొచ్చు
కోల్‌కతా: రోజంతా హైడ్రామా తర్వాత బెంగాల్ ప్రభుత్వం, జూనియర్ డాక్టర్లకు మధ్య శనివారం చర్చలు అసలు ప్రారంభమే కాలేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యర్థన మేరకు ‘ప్రత్యక్ష ప్రసారం’ డిమాండ్‌ను పక్కనబెట్టి చర్చలకు సిద్ధపడ్డ జూనియర్ డాక్టర్లను ఆకస్మాత్తుగా సీఎం నివాసం దగ్గర నుంచి పంపేశారు. చాలా మొరటుగా మీరికి వెళ్లిపోవచ్చని చెప్పారని జూడాలు ఆరోపించారు. ‘చర్చలకు ఆహ్వానించడంతో సీఎం నివాసానికి వచ్చాం. ప్రత్యక్షప్రసారం లేదా వీడియో రికార్డింగు ఉండాలని డిమాండ్ చేశాం. సీఎం మమతా బెనర్జీ బయటకు వచ్చి చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం మినిట్స్‌ను మాకు ఇస్తామని హామీ ఇచ్చారు. మాలో మేము చర్చింకున్నాం. సీఎం విజ్ఞప్తి మేరకు ప్రత్యక్షప్రసారం, వీడియో రికార్డింగు లేకుండా చర్చలకు అంగీకరించాం. ఇదే విషయాన్ని ఆరోగ్యమంత్రి చంద్రిమ భట్టాచార్యకు తెలుపగా.. ఇక చాలు మీరు వెళ్లిపోండని ఆమె చెప్పారు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, మీకోసం మూడు గంటలుగా వేచిచూస్తున్నామని తెలిపారు. అర్ధంతరంగా మమ్మల్ని పంపేశారు’ అని సీఎం నివాసం వద్ద జూనియర్ డాక్టర్లు మీడియాతో వాపోయారు. చర్చలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ‘ఈ ఉదంతం ప్రభుత్వం అసలు రంగును బయటపెట్టింది. చర్చలపై ఎవరికి చిత్తశుద్ధి లేదో తెలుపుతోంది’ అని ఒక జూనియర్ డాక్టర్ కన్నీరుపెట్టుకుంటూ అన్నారు. ‘ఈ రోజుకు ఇక ముగిసినట్లే. మూడు గంటలుగా మేం వేచిచూస్తున్నాం. మీరు సీఎం నివాసం లోపలికి రాలేదు. ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది (రాత్రి అయిందని)’ అని ఆరోగ్యమంత్రి చంద్రిమ అంటున్న వీడియోను జూడాలు మీడియాకు షేర్ చేశారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్లు నెలరోజులకు పైగా విధులను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. సెపె్టంబరు 10న సాయంత్రానికల్లా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ సమ్మె కొనసాగిస్తున్నారు. చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. జూడాల డిమాండ్ మేరకు స్వయంగా చర్చల్లో పాల్గొనడానికి మమత అంగీకరించారు. ప్రత్యక్షప్రసారంపై పీటముడి పడినా.. చివరకు శనివారం జూడాలు దానిపై వెనక్కితగ్గారు. అయినా సర్కారు వైఖరితో చర్చలు సాధ్యపడలేదు. ఎన్నిసార్లు నన్నిలా అవమానిస్తారు: మమత అంతకుముందు సీఎం నివాసం వద్దకు చేరుకొని జూనియర్ డాక్టర్లు చర్చల ప్రత్యక్షప్రసారం డిమాండ్‌తో బయటే నిలబడిపోయా రు. వర్షంలో తడుస్తూ అలాగే నిలబడ్డారు. దాంతో సీఎం మమత బయటకు వచి్చ.. ‘మీరందరూ లోపలికి వచ్చి చర్చల్లో పాల్గొనాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. వైద్యురాలి హత్యాచారం కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రత్యక్షప్రసారం సాధ్యం కాదు. చర్చలను వీడియో రికార్డు చేసి.. సుప్రీంకోర్టు అనుమతితో మీకొక కాపీ అందజేస్తాం. ఈ రోజు సమావేశమవుదామని మీరే కోరారు. మీకోసం వేచిచూస్తున్నా. మీరెందుకు నన్నిలా అవమానిస్తున్నారు. దయచేసి నన్నిలా అవమానించొద్దు. ఇదివరకు కూడా మూడుసార్లు మీకోసం ఎదురుచూస్తూ కూర్చున్నా. కానీ మీరు రాలేదు’ అని మమత జూడాలతో అన్నారు. జూడాల శిబిరం వద్ద ప్రత్యక్షం శనివారం ఉదయం అందరినీ ఆశ్చర్యపరుస్తూ సీఎం మమతా బెనర్జీ స్వయంగా జూనియర్ డాక్టర్ల వద్దకు వచ్చారు. ఐదురోజులుగా జూడాలు బైఠాయించిన స్వాస్థ్య భవన్ (ఆరోగ్యశాఖ కార్యాలయం) వద్దకు చేరుకున్నారు. జూడాల డిమాండ్లను పరిశీలిస్తానని, ఎవరైనా తప్పుచేశారని తేలితే వారిపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మెడికోలు వర్షాలకు తడుస్తూ రోడ్డుపై ఆందోళనలు కొనసాగిస్తుంటే తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పారు. తానిక్కడి రావడం సమస్య పరిష్కారం దిశగా చివరి ప్రయత్నమని తెలిపారు. సమ్మె చేస్తున్న జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలుండవని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యయుత ఆందోళనను అణిచివేయడానికి ఇది ఉత్తరప్రదేశ్ కాదు, బెంగాల్ అని సీఎం వ్యాఖ్యానించారు. -
‘సంజయ్ రాయ్‌పై నార్కో టెస్ట్ వద్దు’
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీ కర్ వైద్యకళాశాల జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు నార్కో అనాలసిస్ పరీక్ష చేసేందుకు కోల్‌కతా కోర్టును సీబీఐ అనుమతి కోరగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఆ కుటుంబాలకు ఆర్థికసాయం జూనియర్ వైద్యుల సమ్మె కారణంగా ఆస్పత్రుల్లో వైద్యం అందక మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేసేందుకు పశి్చమబెంగాల్ ప్రభుత్వం ముందుకొచి్చంది. 29 మంది మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు ఇస్తామని సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రపతి, ప్రధానికి జూడాల లేఖ ఈ ఉదంతంలో స్వయంగా కలగజేసుకోవాలంటూ రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి జూనియర్ డాక్టర్లు గురువారం రాత్రి లేఖలు రాశారు. ఈ లేఖల ప్రతులను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాలకూ పంపించారు. ‘‘ అత్యంత జుగుప్సాకరమైన నేరానికి మా తోటి సహాధ్యాయి బలైంది. న్యాయం జరిగేలా మీరు జోక్యం చేసుకోండి. అప్పుడే ఎలాంటి భయాలు లేకుండా మళ్లీ మా విధుల్లో చేరతాం’’ అని ఆ లేఖలో జూనియర్ వైద్యులు పేర్కొన్నారు. -
Mamata Banerjee: రాజీనామాకైనా సిద్ధం
కోల్‌కతా: బెంగాల్ ప్రజల కోసం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని తెలిపారు. ‘వైద్యుల సమ్మెపై ప్రతిష్టంభన ఈ రోజుతో తొలిగిపోతుందని ఆశించిన బెంగాల్ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను. జూనియర్ డాక్టర్లు నబన్నా (సచివాలయం)కు వచ్చి కూడా చర్చలకు కూర్చోలేదు. తిరిగి విధులకు వెళ్లాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని మమత గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. ‘సదుద్దేశంతో గత మూడురోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మెడికోలు చర్చలకు నిరాకరించారు’ అని సీఎం అన్నారు. ‘ప్రజల కోసం నేను రాజీనామా చేసేందుకు సిద్ధం. కానీ ఇది పద్ధతి కాదు. గడిచిన 33 రోజులుగా ఎన్నో అభాండాలను, అవమానాలను భరించాం. రోగుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో చర్చలకు వస్తారని భావించా’ అని మమత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినా.. తమ ప్రభుత్వం జూనియర్ డాక్టర్లపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోదని హామీ ఇచ్చారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారంతో జూనియర్ డాక్టర్లు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. నెలరోజులకు పైగా వీరు విధులను బహిష్కరిస్తున్నారు. సెపె్టంబరు 10న సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను బేఖాతరు చేశారు. మమత సమక్షంలో చర్చలకు జూడాలు డిమాండ్ చేయగా.. బెంగాల్ ప్రభుత్వం దానికి అంగీకరించి వారిని గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చల కోసం నబన్నాకు రావాల్సిందిగా ఆహా్వనించింది. అయితే ప్రత్యక్షప్రసారం ఉండాలనే జూడాల డిమాండ్‌ను ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చర్చలు జరగలేదు. రెండుగంటలు వేచిచూశా సమ్మె చేస్తున్న డాక్టర్లను కలవడానికి రెండు గంటల పాటు సచివాలయంలో వేచిచూశానని, వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని మమత అన్నారు. గురువారం సాయంత్రం 5:25 గంటలకు సచివాలయానికి చేరుకున్న డాక్టర్లు ప్రత్యక్షప్రసారానికి పట్టుబట్టి బయటే ఉండిపోయారు. ప్రత్యక్షప్రసారం డిమాండ్‌కు తాము సానుకూలమే అయినప్పటికీ హత్యాచారం కేసు కోర్టులో ఉన్నందువల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే.. చర్చల రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశామని మమత వివరించారు. ‘పారదర్శకత ఉండాలని, చర్చల ప్రక్రియ పక్కాగా అధికారిక పత్రాల్లో నమోదు కావాలనే రికార్డింగ్ ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు అనుమతిస్తే జూడాలతో వీడియో రికార్డును పంచుకోవడానికి కూడా సిద్ధం పడ్డాం’ అని మమత చెప్పుకొచ్చారు. రహస్య పత్రాలపై ఇలా బాహటంగా చర్చించలేమన్నారు. గడిచిన నెలరోజుల్లో వైద్యసేవలు అందక రాష్ట్రంలో 27 మంది చనిపోయారని, 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ‘15 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని చర్చలకు పిలిచాం. కానీ 34 మంది వచ్చారు. అయినా చర్చలకు సిద్ధపడ్డాం. చర్చలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతోనే వైద్యశాఖ ఉన్నతాధికారులెవరినీ పిలువలేదు (వైద్యశాఖ కీలక అధికారుల రాజీనామాకు జూడాలు డిమాండ్ చేస్తున్నారు)’ అని మమతా బెనర్జీ అన్నారు. నబన్నాకు చేరుకున్న జూనియర్ డాక్టర్లను ఒప్పించడానికి ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్, డీజీపీ రాజీవ్ కుమార్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. ముమ్మర సంప్రదింపులు జరిపారు. అయినా జూడాలు తమ డిమాండ్‌పై వెనక్కితగ్గలేదు. ప్రభుత్వం జూడాలను చర్చలకు పిలవడం రెండురోజుల్లో ఇది మూడోసారి. రాజకీయ ప్రేరేపితంచర్చలు జరపాలని తాము చిత్తశుద్ధితో ఉన్నామని, అయితే డాక్టర్ల ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని మమతా బెనర్జీ సూచనప్రాయంగా చెప్పారు. ‘డాక్టర్లలో చాలామంది చర్చలకు సానుకూలంగా ఉన్నారు. కొందరు మాత్రమే ప్రతిష్టంభన నెలకొనాలని ఆశిస్తున్నారు’ అని ఆరోపించారు. బయటిశక్తులు వారిని నియంత్రిస్తున్నాయన్నారు. ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని, వాటికి వామపక్షాల మద్దతుందని ఆరోపించారు. మమత రాజీనామా కోరలేదు: జూడాలు ప్రత్యక్షప్రసారాన్ని అనుమతించకూడదనే సర్కారు మొండి పట్టుదలే చర్చలు కార్యరూపం దాల్చకపోవడానికి కారణమని జూనియర్ వైద్యులు ఆరోపించారు. తామెప్పుడూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా కోరలేదని స్పష్టం చేశారు. ప్రతిష్టంభనకు వైద్యులే కారణమని మమత పేర్కొనడం దురదృష్టకరమన్నారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల బహిష్కరణ కొనసాగిస్తామని తేలి్చచెప్పారు. -
Junior doctors: ప్రత్యక్షప్రసారం చేయాలి
కోల్‌కతా: నెలరోజులకు పై గా విధులను బహిష్కరిస్తున్న జూనియర్ డాక్టర్లతో చర్చలకు పశి్చమబెంగాల్ ప్రభుత్వం వరుసగా రెండోరోజు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి సమక్షంలోనే చర్చలు జ రగాలని జూనియర్ డాక్టర్లు పట్టుబట్టారు. అలాగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, తమ తరఫున 30 మంది ప్రతినిధుల బృందాన్ని చర్చలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. సచివాలయం నబన్నాలో బుధవారం సాయంత్రం 6 గంటలకు చర్చలకు రావాలని బెంగాల్ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ జూనియర్ డాక్టర్లకు ఈ–మెయిల్ ద్వారా ఆహా్వనాన్ని పంపారు. 12 నుంచి 15 మంది రావాలని కోరారు. సీఎం మమతా బెనర్జీ నేరుగా చర్చల్లో పాల్గొనే విషయాన్ని సీఎస్ మెయిల్లో ధృవీకరించలేదు. చట్టానికి బద్ధులై ఉండే పౌరులుగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం ప్రతి ఒక్కరి విధి అయినప్పటికీ జూనియర్ డాక్టర్లు దానికి కట్టుబడలేదని పంత్ పేర్కొన్నారు. దీనిపై సాయంత్రం 5:23 గంటలకు జూనియర్ డాక్టర్లు విలేకరుల సమావేశంలో స్పందించారు. ‘సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే చర్చలు జరగాలి. టీవీల్లో ప్రత్యక్షప్రసారం ఉండాలి. పలు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులకు చెందిన జూనియర్ డాక్టర్లు ఆందోళనలో పాలుపంచుకొంటున్నందున కనీసం 30 మందిని చర్చలకు అనుమతించాలి’ అని జుడాల ఫోరం ప్రకటించింది. షరతులకు ఒప్పుకోం బేషరతుగా చర్చలకు రావాలని, జూనియర్ డాక్టర్లు పెట్టిన ఏ షరతునూ అంగీకరించాడానికి బెంగాల్ సర్కారు సిద్ధంగా లేదని ఆరోగ్యమంత్రి చంద్రిమా భట్టాచార్య స్పష్టం చేశారు. షరతులు పెట్టారంటే వారు మనస్ఫూర్తిగా చర్చలకు సిద్ధంగా లేరని అర్థమన్నారు. -
నిరసనలు కేంద్రం కుట్ర: మమత
కోల్‌కతా: వైద్యురాలి హత్యాచారంపై నిరసనల వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. వామపక్షాలూ ఈ కుట్రలో భాగమయ్యాయన్నారు. సచివాలయం నబన్నాలో సోమవారం ఒక అధికారిక సమీక్షలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ రేప్, హత్య ఉదంతంలో నెలరోజులుగా బెంగాల్లో ప్రజలు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. బాధితురాలి తల్లిదండ్రులకు తానెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదని మమత అన్నారు. ఈమేరకు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. దుర్గాపూజ సమీపిస్తున్నందున నిరసనలు వీడి.. పండుగ ఏర్పాట్లు చేపట్టాలని ప్రజలను కోరారు. ‘వైద్యురాలి కుటుంబానికి నేనెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదు. అభాండాలు వేస్తున్నారు. కూతురి జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం చేపట్టదలిస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుందని తల్లిదండ్రులకు చెప్పాను. ఎప్పుడేం మాట్లాడాలో నాకు తెలుసు. నిరసనలు ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కుట్రే. కొన్ని వామపక్ష పార్టీలకు ఇందులో భాగస్వామ్యముంది. పొరుగుదేశంలో అస్థిరత చూసి.. ఇక్కడా అలాంటి ఆందోళనలు రేకెత్తించాలని కొందరు చూస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్‌లు రెండు వేర్వేరు దేశాలని వారు మర్చిపోయారు’ అని మమత ధ్వజమెత్తారు. ఆందోళన నేపథ్యంలో కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని, దుర్గాపూజ వేళ శాంతి భద్రతలపై పట్టున్న అధికారి అవసరం ఉందని దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. -
Supreme Court of India: జనం ఏమైపోయినా పట్టించుకోరా?
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని తేలి్చచెప్పింది. విధులను పక్కనపెట్టి నిరసనలు కొనసాగించడం సరైంది కాదని అభిప్రాయపడింది. సాధారణ ప్రజల అవసరాలను పట్టించుకోకుండా డాక్టర్లు ఇలా విధులకు గైర్హాజరు కావడం ఏమిటని ప్రశ్నించింది. జనం ఏమైపోయినా పట్టించుకోరా? అని నిలదీసింది. విధుల్లో చేరితే ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఉండబోవని వెల్లడించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మీ భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటారు, వెంటనే వెళ్లి డ్యూటీలో చేరండి అని డాక్టర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ విధులకు దూరంగా ఉంటూ నిరసనలు కొనసాగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినప్పుడు సంబంధిత డాక్టర్లకు ఇచ్చిన చలాన్ కనిపించకపోవడం పట్ల న్యాయస్థానం అనుమానం వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని సీబీఐని, పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చలాన్ మాయం కావడంపై దర్యాప్తు జరపాలని సీబీఐకి సూచించింది. జూనియర్ డాక్టర్‌పై అఘాయిత్యం కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. శవపరీక్ష కోసం ఉపయోగించిన చలాన్ తమ రికార్డుల్లో లేదని చెప్పారు. అయితే, అది ఎక్కడుందో తేల్చాలని ధర్మాసనం పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదులో 14 గంటలు ఆలస్యం కావడం పట్ల మరోసారి అసహనం వ్యక్తం చేసింది. బాధితురాలి ఫోటోలు, వీడియోలను అన్ని రకాల సోషల్ మీడియా వేదికల నుంచి తక్షణమే తొలగించాలని పేర్కొంది.విరమించబోం: జూనియర్ డాక్టర్లు కోల్‌కతా: ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ నెలరోజులుగా విధులను బహిష్కరిస్తున్న పశి్చమబెంగాల్ జూనియర్ డాక్టర్లు సమ్మె కొనసాగిస్తామని సోమవారం రాత్రి ప్రకటించారు. విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ తాము సమ్మె విరమించబోమని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. సీఐఎస్ఎఫ్కి వసతులు కలి్పంచండి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీల్డ్ కవర్లో సమరి్పంచిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై ఈ నెల 17వ తేదీలోగా తాజా నివేదిక సమరి్పంచాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. ఆర్జీ కర్ ఆసుపత్రిలో భద్రతా విధుల్లో చేరిన మూడు కంపెనీల సీఐఎస్ఎఫ్ సిబ్బందికి తగిన వసతి సౌకర్యాలు కల్పించాలని పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారికి అవసరమైన పరికరాలు ఇవ్వాలని పేర్కొంది.ఫోరెన్సిక్ నివేదికపై అనుమానాలు డాక్టర్ ఫోరెన్సిక్ నివేదికపై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. తదుపరి పరీక్షల కోసం బాధితురాలి నమూనాలను ఢిల్లీ–ఎయిమ్స్‌కు పంపించాలని నిర్ణయించినట్లు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. డాక్టర్ కేవలం హత్యకు గురైనట్లు నివేదిక తేలి్చందని చెప్పారు. కానీ, ఆమెను లైంగికంగా చిత్రహింసలకు గురిచేసి, అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు. -
నిశీధి వీధుల్లో అగ్ని నక్షత్రాలు..
రాత్రిళ్లు తారలు కనపడటం సహజం. కాని కోల్‌కతా వీధుల్లో అగ్ని నక్షత్రాలు దర్శనమిస్తున్నాయి. ‘రీక్లయిమ్ ది నైట్’ పేరుతో మహిళలు అనూహ్య సంఖ్యలో రాత్రిళ్లు దివిటీలతో నిరసనలు చేస్తున్నారు. అభయ ఘటన జరిగి నెల అయిన సందర్భంగా సెప్టెంబర్ 8 రాత్రి కోల్‌కతాలోని ఏ కూడలిలో చూసినా దగ్ధ కాగడాలు చేతబూనిన స్త్రీలే. కోల్‌కతాలో సాగుతున్న నిరసనలపై కథనం.‘రాత్రి ఎవరిది?’ ఈ ప్రశ్న పిక్కటిల్లుతోంది కోల్‌కతాలో. ‘రాత్రి మాది కూడా’ అని అక్కడి స్త్రీలు ఎలుగెత్తి నినదిస్తున్నారు. వందల వేల సంఖ్యలో స్త్రీలు రాత్రిళ్లు బయటకు రావడం... కాగడానో, కొవ్వొత్తినో, సెల్‌ఫోన్ లైట్‌నో వెలిగిస్తూ సామూహికంగా నడవడం... ఆ నగరం ఎప్పుడూ ఎరగదు. ఇప్పుడు చూస్తోంది. ‘కోల్‌కతాలో దుర్గాపూజ సమయంలో ఇలాంటి వాతావరణం ఉంటుంది. కాని అభయ విషయంలో న్యాయం కోసం స్త్రీలు రోడ్ల మీదకు వస్తున్నారు. పురుషులు కూడా వారికి స΄ోర్ట్ ఇస్తున్నారు’ అంటున్నారు స్త్రీలు.ఎన్నడూ ఎరగని భయంకోల్కతాలో క్రైమ్ రేటు ఉన్నా ఆగస్టు 8 రాత్రి అభయపై జరిగిన అత్యాచారం, హత్యవల్ల నగరం పూర్తిగా భయపడి΄ోతోంది. స్త్రీలు బయటకు రావాలంటేనే సంకోచించే స్థితి ఈ ఘటన తర్వాత చోటు చేసుకున్నా మెల్లమెల్లగా ఎందుకు బయటకు రాకూడదనే తెగింపు కూడా మొదలయ్యింది. ఆగస్టు 14 అర్ధరాత్రి (స్వాతంత్య్రం వచ్చిన సమయం) రాత్రి భారీస్థాయిలో స్త్రీలు రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అయితే పార్టీలు ఉసికొల్పడం వల్ల ఇలాంటి నిరసనలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఎదురుదాడి చేసింది. కాని ఆ తర్వాత ఏ పార్టీతో సంబంధం లేని రిమ్‌ఝిమ్ శర్మ అనే సామాజిక కార్యకర్త న్యాయం కోసం నిరసన తప్ప వేరే మార్గం లేదనే ఉద్దేశంతో అర్ధరాత్రి నిరసనలకు పిలుపునిచ్చింది. నెప్టెంబర్ 4న కోల్‌కతా పట్టపగలులా మారింది. వేలాదిగా మహిళలు బయటకు వచ్చారు. ఈసారి వారందరి చేతుల్లో పార్టీల జండాలు కాకుండా త్రివర్ణ పతాకాలు ఉన్నాయి. ఇది జనం నిరసన. కోల్‌కతా నగరం దిగ్గున వెలిగింది– న్యాయ ఆకాంక్షతో.నెల రోజుల రాత్రిఆగస్టు 8 రాత్రి కోల్‌కతాలోని ఆర్.జి. కార్ ఆస్పత్రిలో ‘అభయ’ అనే జూనియర్ డాక్టర్‌పై పాశవికంగా అత్యాచారం, హత్య జరిగి నెల రోజులు అవుతుండటంతో ‘ఇంకా జరగని న్యాయానికి’ నిరసనగా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ‘నైట్ ఆఫ్ అభయ’ పేరుతో నిరసనకు సామాజిక కార్యకర్తలు పిలుపునివ్వడంతో కోల్‌కతాతో పాటు ముఖ్యపట్టణాల్లో స్త్రీలు సెప్టెంబర్ 8 (ఆదివారం) రాత్రి వేలాదిగా రోడ్ల మీదకు వచ్చారు. నినాదాలు, పాటలు, కవితలు... రోడ్ల మీద బొమ్మలు వేయడం ఎక్కడ చూసినా చైతన్యజ్వాలలు. ‘ఉయ్ వాంట్ జస్టిస్’ నినాదం మార్మోగి΄ోయింది. సి.బి.ఐ అనునిత్యం ఏవో స్టేట్మెంట్లు ఇవ్వడం ఆస్పత్రిలోని మూడు గదులను త్రీడి మ్యాపింగ్ ద్వారా విశ్లేషిస్తున్నామని చెప్పడం పాలిగ్రాఫ్ పరీక్షలు చేయించడం తప్ప అసలు ఏం జరిగిందో దీని వెనుక ఎవరున్నారో తెలుపడం లేదు. అభయ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ 9న (నిన్న) విచారణ చేసినా అందులో అటాప్సీ రి΄ోర్టులో కీలకపత్రం లేక΄ోవడాన్ని గుర్తించి నిలదీసింది. అంటే ఈ కేసు అంతు లేకుండా సాగేలా ఉంది.గగుర్పాటు క్షణం‘ఘటన జరిగి నెల రోజులైనా నా కూతురు ఆ క్షణంలో ఎంత తల్లడిల్లి ఉంటుందో గుర్తుకొస్తే నేటికీ గగుర్పాటుకు గురవుతూనే ఉన్నాను’ అని అభయ తల్లి సెప్టెంబర్ 8 రాత్రి నిరసనలో తెలిపింది. మరోవైపు ఆర్.జి. కార్ ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు ఆస్పత్రిలోని పరిస్థితుల్లో ఏమీ మార్పు లేదని, íసీసీ కెమెరాలు బిగించలేదని, భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. రోడ్లపైకి వస్తున్న మహిళలను అడిగితే ‘దేశంలో పెరిగి΄ోయిన రేప్ కల్చర్‌తో విసిగి΄ోయాం. దీనికి ముగింపు పలకాల్సిందే. అంతవరకూ రోడ్ల మీదకు వస్తూనే ఉంటాం’ అంటున్నారు. ఏ జాగృదావస్థ అయినా ప్రక్షాళనకే దారి తీస్తుంది. ఈ ప్రక్షాళనే ఇప్పుడు కావాల్సింది. -
కర్ణాటకలో యువతిపై హత్యాచారం
బీదర్: కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో ఓ యువతి అత్యాచారం, హత్యకు గురైంది. ప్రధాన నిందితుడైన ఆమె బంధువు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. గుణతీర్థవాడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల తమ కుమార్తె ఆగస్ట్ 29వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ ఒకటిన∙స్థానిక పాఠశాల వద్ద ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. సాంకేతిక ఆధారాల సాయంతో అదృశ్యమైన రోజున ఆమెతో ఫోన్లో మాట్లాడిన ముగ్గురిని గుర్తించారు. అదే గ్రామానికి చెందిన ముగ్గురిలో ఒకరు ఆమెను ఆరోజు కలుసుకున్నట్లు తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఘటనాస్థలానికి కొద్ది దూరంలో తన ఇద్దరు మిత్రులు వాహనంతో కాపలాగా ఉండగా యువతిని రేప్ చేసి, తలపై బండరాయితో మోది చంపినట్లు ఒప్పుకున్నాడు. మృతురాలు, ప్రధాన నిందితుడు బంధువులవుతారని బీదర్ ఎస్పీ తెలిపారు. హత్యాచారం ఘటనపై బీదర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. -
మైనర్‌పై అత్యాచారం
అవుకు: ఇంట్లో ఎవరూ లేని సమయం తెలుసుకున్న ఓ ప్రబుద్ధుడు తాగడానికి మంచినీళ్లు అడిగి... అదే అదునుగా మైనర్‌పై అత్యాచారం చేసిన ఘటన నంద్యాల జిల్లా, అవుకు మండల పరిధిలోని కాశీపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాశీపురం గ్రామానికి చెందిన మైనర్ కోవెలకుంట్ల పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ప్రభుదాసు అనే వ్యక్తి ఇదే పాఠశాల వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.రోజూ బాలిక ఇదే వ్యాన్‌లో ఊరికి వచ్చేది. ఆదివారం బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరనే విషయం తెలుసుకున్న నిందితుడు ఇంటి వద్దకు వెళ్లి బాలికను..మీ నాన్న ఇంట్లోలేడా అని అడిగి.. తాగేందుకు మంచినీళ్లు తీసుకురమ్మన్నాడు. బాలిక ఇంట్లోకి వెళ్లగానే నిందితుడు తలుపులు వేసి బాలికనోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతలో బాలిక తల్లి ఇంటికి తిరిగి వచ్చి గేటు తీసింది. గేటు శబ్దం విన్న నిందితుడు బాలికను బెదిరించి మంచం కింద దాక్కున్నాడు. అప్పటికే భయాందోళనగా ఉన్న బాలిక తలుపులు తెరవగానే చెంపపై కాట్లు ఉండటంతో తల్లి ప్రశి్నస్తూనే నిందితుడిని గమనించింది. దీంతో కేకలు వేయగా, చుట్టుపక్కల వారు, బంధువులు బాలిక ఇంటికి వచ్చి నిందితుడిని కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
‘సత్వర న్యాయం’తోనే భద్రతపై భరోసా
న్యూఢిల్లీ: మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం లభించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వేగంగా న్యాయం చేకూర్చే పరిస్థితి ఉంటే భద్రత పట్ల మహిళలకు గొప్ప భరోసా దక్కుతుందని ఉద్ఘాటించారు. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య, మహారాష్ట్రలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలో శనివారం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జిల్లా న్యాయ వ్యవస్థపై ప్రారంభమైన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగానికి దేశ న్యాయ వ్యవస్థను ఒక సంరక్షకురాలిగా పరిగణిస్తుంటామని చెప్పారు. సుప్రీంకోర్టుతోపాటు మొత్తం న్యాయ వ్యవస్థ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పని చేస్తే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... క్రియాశీలకంగా మానిటరింగ్ కమిటీలు ‘‘దేశంలో మహిళలు, చిన్నారులపై వేధింపులు, నేరాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత కోసం చట్టాల్లో కఠినమైన నిబంధనలు చేరుస్తున్నాం. 2019లో ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టుల పథకాన్ని ప్రారంభించాం. అడబిడ్డలపై జరిగే నేరాల విషయంలో తీర్పులు వేగంగా రావాలి. నేరగాళ్లకు శిక్షలు పడాలి. బాధితులకు సత్వర న్యాయం దక్కాలి. అలా జరిగితేనే జనాభాలో సగం మందికి వారి భద్రతపై ఒక భరోసా, నమ్మకం లభిస్తాయి. మహిళలపై నేరాలు అరికట్టే విషయంలో జిల్లా జడ్జి, మేజి్రస్టేట్, ఎస్పీతో కూడిన జిల్లా మానిటరింగ్ కమిటీల పాత్ర చాలా కీలకం. కింది కోర్టులే మొదటి మెట్టు దేశంలో రాజ్యాంగాన్ని, చట్టాల స్ఫూర్తిని న్యాయ వ్యవస్థ చక్కగా పరిరక్షిస్తోంది. సుప్రీంకోర్టు పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలు ఏనాడూ అపనమ్మకం వ్యక్తం చేయలేదు. న్యాయ వ్యవస్థపై వారికి ఎంతో విశ్వాసం ఉంది. దేశ న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ ఒక బలమైన పునాది అనడంలో సందేహం లేదు. బాధితులకు న్యాయం చేకూర్చడంలో కింది కోర్టులే మొదటి మెట్టు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. కోర్టులను ఆధునీకరిస్తున్నాం. పెండింగ్ కేసులను విశ్లేíÙంచడానికి, భవిష్యత్తులో రాబోయే కేసులను అంచనా వేయడానికి కృత్రిమ మేధ(ఏఐ), ఆప్టికల్ క్యారెక్టర్ రికగి్నషన్ వంటి నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’’ అని ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు. భారత సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంప్, నాణేన్ని ఆవిష్కరించారు. బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరమెందుకు: కపిల్ సిబల్ ఎలాంటి సంకోచాలు, పక్షపాతానికి తావులేకుండా తీర్పులు ఇచ్చేలా ట్రయల్ కోర్టులు, జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టులు బలోపేతం కావాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ చెప్పారు. క్షేత్రస్థాయిలోని కింది కోర్టులు ఒత్తిళ్లను తట్టుకొని స్థిరంగా నిలవకపోతే మొత్తం న్యాయ, రాజకీయ వ్యవస్థ సమగ్రత ప్రమా దంలో పడుతుందని అన్నారు. జిల్లా కోర్టులపై సదస్సులో ఆయన మాట్లాడుతూ... బెయిల్ ఒక నియమం, జైలు ఒక మినహాయింపు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును ప్రస్తావించారు. కీలకమైన కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి ట్రయల్ కోర్టులు, జిల్లా కోర్టులు నిరాకరిస్తున్నాయని ఆక్షేపించారు. తన వృత్తి జీవితంలో కింది కోర్టులు బెయిల్ ఇవ్వగా చూసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇది కేవలం తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని చెప్పారు. బెయిల్‌ను కింది కోర్టులు ఒక మినహాయింపుగా భావిస్తుండడంతో పై కోర్టులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల చెప్పారని గుర్తుచేశారు. కింది కోర్టుల్లో బెయిల్ రాకపోవడంతో నిందితులు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని సూచించారు. జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని, న్యాయమూర్తుల వేతనా లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కోర్టులే వెన్నెముక: జస్టిస్ చంద్రచూడ్ దేశంలో మొత్తం న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ వెన్నుముక అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభివరి్ణంచారు. చట్టబద్ధ పాలనకు జిల్లా జ్యుడీíÙయరీ అత్యంత కీలకమని చెప్పారు. జిల్లా కోర్టులను కింది కోర్టులు అని పిలవడం ఆపేయాలని సూచించారు. జిల్లా కోర్టులపై జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లా న్యాయ వ్యవస్థలో కొన్నేళ్లుగా మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోందని అన్నారు. న్యాయాన్ని పొందడానికి ప్రజలకు మొదటి వేదిక జిల్లా కోర్టులేనని తెలిపారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. 2023–24లో 46.48 కోట్ల పేజీల కోర్టు రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చామని వెల్లడించారు. 3,500 కోర్టు కాంప్లెక్స్‌లను, 22,000 కోర్టు రూమ్‌లను కంప్యూటరీకరించడానికి ఈ–కోర్టుల ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్పారు. న్యాయమూర్తులపై ఒత్తిడి అధికంగా ఉంటుందని, వారు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. -
బెంగాల్ బంద్ హింసాత్మకం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనతోపాటు మంగళవారం జరిగిన ‘నబన్నా అభియాన్’పై పోలీసుల దాడికి నిరసనగా ప్రతిపక్ష బీజేపీ బుధవారం తలపెట్టిన 12 గంటల రాష్ట్ర బంద్ హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో జనాన్ని చెదరగొట్టడానికి లాఠీచార్జి చేయాల్సి వచి్చంది. బీజేపీ కార్యకర్తలు రైలు పట్టాలపై నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రమంతటా ర్యాలీలు నిర్వహించారు. ఉదయం రోడ్లపై బైఠాయించిన బీజేపీ మాజీ ఎంపీలు రూపా గంగూలీ, లాకెట్ చటర్జీ, రాజ్యసభ సభ్యుడు సమిక్ భట్టాచార్య, ఎమ్మెల్యేల అగ్నిమిత్ర పాల్‌తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ‘బంగ్లా బంద్’కు మిశ్రమ స్పందన లభించింది. వ్యాపార, విద్యా సంస్థలు, కార్యాలయాలు పాక్షికంగా మూతపడ్డాయి. రోడ్లపై ఘర్షణలు జరుగుతాయన్న అనుమానంతో ప్రజలు చాలావరకు ఇళ్లకే పరిమితమయ్యారు. రాజధాని కోల్‌కతాలో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. బలవంతంగా దుకాణాలు మూసివేయిస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కాల్పులు! ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భాత్పారాలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కాల్పులు జరిగాయని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే, ఇందులో నిజం లేదని, ఆ ఇద్దరు కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులు చెప్పారు. ఈ దాడిలో గాయపడిన బాధితులను చికిత్స కోసం ఆసుపత్రిలో చేరి్పంచామని తెలిపారు. తమ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తుపాకీతో కాల్పులు జరిపారని బీజేపీ మాజీ ఎంపీ అర్జున్ సింగ్ పేర్కొన్నారు. బంద్‌పై పిటిషన్ కొట్టివేత బీజేపీ తలపెట్టిన 12 గంటల బంగ్లా బంద్ చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ సంజయ్ దాస్ అనే లాయర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కలకత్తా హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఇదే కోర్టులో ఇష్టారాజ్యంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయకుండా గతంలోనే ఆయనపై నిషేధం విధించామని న్యాయస్థానం తేలి్చచెప్పింది. నిషేధం అమల్లో ఉండగా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించలేమని స్పష్టం చేసింది. పిటిషనర్ సంజయ్ దాస్‌కు రూ.50 వేల జరిమానా విధించింది. ఈ సొమ్మును 10 రోజుల్లోగా పశి్చమ బెంగాల్ స్టేట్ లీగల్ సరీ్వసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. డిమాండ్లు నెరవేర్చేదాకా ఉద్యమిస్తాం పశ్చిమ బెంగాల్లో గత 20 రోజులుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్ హత్యకు ఖండిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఆందోళనలు విరమించి, విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరగా జూనియర్ డాక్టర్ల ఫోరమ్ అందుకు నిరాకరించింది.నిందితుడితో సంబంధం ఉన్న ఏఎస్ఐకి పాలిగ్రాఫ్ టెస్టు జూనియర్ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్‌తో సంబంధాలున్న ఏఎస్ఐ అనూప్ దత్తాకు సీబీఐ అధికారులు బుధవారం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. ఈ కేసులో అనూప్ దత్తాను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఎనిమిది మందికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. అనూప్ దత్తా కోల్‌కతా పోలీసు వెల్ఫేర్ కమిటీలో పనిచేస్తున్నాడు. వైద్యురాలిపై అఘాయిత్యం జరిగాక నిందితుడు సంజయ్ రాయ్ ఈ విషయాన్ని అనూప్ దత్తాకు తెలియజేసినట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు. -
నైట్ పెట్రోలింగ్ ఉండాలి
న్యూఢిల్లీ: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై రేప్, హత్య ఘటనసహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందిపై లైంగికదాడుల ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. వైద్య సిబ్బంది భద్రతకు ఆస్పత్రుల్లో అమలుచేయాల్సిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం బుధవారం జారీచేసింది. బుధవారం వర్చువల్ విధానంలో జరిగిన నేషనల్ టాస్క్ ఫోర్స్ భేటీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, ప్రధాన కార్యదర్శలు, డీజీపీలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భేటీలో సూచించిన మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి..→ పెద్ద ఆస్పత్రుల్లో జనం పెద్దగా తిరగని చోట్ల, చీకటి ప్రాంతాలు, మూలగా ఉండే చోట్ల సీసీటీవీలు బిగించాలి→ ఆస్పత్రుల్లో భద్రతపై జిల్లా కలెక్టర్లు, డీఎస్పీలు, జిల్లా ఆస్పత్రి యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి తగు సెక్యూరిటీ ఏర్పాట్లు చూసుకోవాలి→ సెక్యూరిటీ, ఇతర సిబ్బందిని భద్రతా తనిఖీలు చేయాలి→ రాత్రుళ్లు అన్ని ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో సెక్యూరిటీ పెట్రోలింగ్ తరచూ జరుపుతుండాలి→ పెద్ద జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేయాలి. సీసీటీవీలను ఎప్పటికప్పుడు చెక్చేస్తూనే డాటాను కూడా తరచూ బ్యాకప్ తీసుకోవాలి→ అత్యవసర కాల్స్‌కు స్పందించి కంట్రోల్ రూమ్, సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి. కాంట్రాక్ట్ సెక్యూరిటీ సిబ్బంది శారీరకదారుఢ్యం మెరుగు కోసం వారికి శిక్షణ ఇప్పించాలి→ రోగులను స్ట్రెచర్, ట్రాలీ, చక్రాల కుర్చీల్లోకి మారుస్తూ ఎక్కువ మంది బంధువులు ఆస్పత్రుల్లో పోగుబడుతున్నారు. వీరి సంఖ్యను తగ్గించేందుకు ఆస్పత్రులే ఈ పనులకు తగు సిబ్బందిని నియమించాలి→ వైద్యారోగ్య సిబ్బంది రక్షణ కోసం ఉన్న భారతీయ న్యాయ సంహిత చట్టాలు, వారిపై దాడులకు పాల్పడితే బాధ్యులకు విధించే శిక్షలకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి ప్రాంగణంలో స్పష్టంగా ప్రదర్శించాలి→ తమ రాష్ట్రాల్లో హెల్ప్‌లైన్ నంబర్లు 100, 112 ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చాలా రాష్ట్రాలు స్పష్టంచేశాయి.→ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో వైద్య సిబ్బంది రక్షణ కోసం మెరుగైన విధానాలు అమల్లో ఉన్నాయని ఆయా రాష్ట్రాలను కేంద్రం మెచ్చుకోవడం విశేషం. -
Mamata Banerjee: రేపిస్టులకు మరణశిక్షే
కోల్‌కతా: అత్యాచారం కేసుల్లో మరణశిక్ష విధించేలా చట్టాలను సవరిస్తామని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. వచ్చేవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను పెట్టి ఈ బిల్లును ఆమోదిస్తామన్నారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రేప్ లాంటి నేరాలను తాము ఏమాత్రం ఉపేక్షించబోమని మమత అన్నారు. అత్యాచారానికి మరణశిక్ష విధించే సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంలో ఆలస్యం చేసినా, రాష్ట్రపతికి పంపినా.. తాను రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తానని ప్రకటించారు. రేప్ కేసుల్లో దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టం తేవాలని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి టీఎంసీ శనివారం నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేస్తుందని తెలిపారు. గవర్నర్ తమ బిల్లును తొక్కిపెడితే రాజ్‌భవన్ ఎదుట మహిళలతో పెద్ద ఎత్తున ధర్మా చేస్తామని మమత అన్నారు. టీఎంసీ ఛాత్ర పరిషద్ వ్యవస్థాపక దినోత్సవం ర్యాలీని ఉద్దేశించి మమత బుధవారం ప్రసంగించారు. రాజ్‌భవన్‌లో తనను లైంగిక వేధింపులకు గురిచేశారని గతంలో ఒక ఉద్యోగిని ఆరోపించడాన్ని ప్రస్తావించారు. గవర్నర్ సి.వి.ఆనంద బోస్ తమ ప్రభుత్వంపై, టీఎంసీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 20 రోజులుగా సమ్మెలో ఉన్న జూనియర్ డాక్టర్లను తక్షణం విధుల్లో చేర్చాల్సిందిగా కోరారు. ‘తమ సహచరిణికి న్యాయం కోరుతున్న డాక్టర్ల ఆవేదన పట్ల నేను మొదటినుంచీ సానుభూతితోనే ఉన్నాను. ఘటన జరిగి చాలా రోజులు గడిచిపోయినా జూనియర్ డాక్టర్లపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు దిగలేదు. వారి ఆవేదనను అర్థం చేసుకోగలం. కానీ రోగులు ఇబ్బందిపడుతున్నారు. దయచేసి విధుల్లోకి తిరిగిరండి’ అని మమత విజ్ఞప్తి చేశారు. మెడికోల కెరీర్‌కు ఇబ్బంది రాకూడదనే ఒక్క డాక్టర్‌పై కూడా ఎఫ్ఐఆర్ను నమోదు చేయలేదన్నారు. ‘ఆర్.జి.కర్ వైద్యురాలి హత్యాచార కేసును సీబీఐ స్వా«దీనం చేసుకొని 16 రోజులు అయింది. దర్యాప్తు పురోగతిని సీబీఐ బయటపెట్టాలి’ అని మమత డిమాండ్ చేశారు. శవాలపై రాజకీయ లబ్ధి పొందాలనే బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపిచి్చందని ధ్వజమెత్తారు. వైద్యురాలి హత్యను చూపి బీజేపీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటోందని మండిపడ్డారు. ప్రధాని ఎందుకు రాజీనామా చేయలేదు? ఆర్.జి.కర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లపై మమతా తీవ్రంగా స్పందించారు. ‘ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, మణిపూర్‌లతో మహిళలపై లైంగిక దాడులు, హింసను నిరోధించలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు రాజీనామా చేయలేదని నేను బీజేపీ అడుగుతున్నా. అస్సాంలో ఒక నిందితుడినే ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, భవిష్యత్తులో గెలవలేమని తెలుసు కాబట్టే తన రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఆరి్టఫిషియల్ ఇంటలిజెన్స్‌ను వాడి బీజేపీ పెద్ద ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడుతోందని, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తోందని ఆరోపించారు. దుర్గా పూజ సంబరాలను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర పన్నిందన్నారు. బెంగాల్ తగలబెడితే.. ఢిల్లీ కూడా బెంగాల్‌ను అపఖ్యాతి పాల్జేయడానికి కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి కుట్ర పన్నారని బీజేపీపై మమత ధ్వజమెత్తారు. బెంగాల్‌ను తగలబెడితే అసోం, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ, యూపీల్లోనూ అగ్గి రాజుకుంటుందని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం సిగ్గుచేటని బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి సుకాంత మజుందార్ అన్నారు. బెంగాల్లో శాంతిభద్రతలు కాపాడాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చేసిన ఫిర్యాదులో కోరారు. -
సుమోటోగా స్వీకరించిన సుప్రీం
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 20న ఈ కేసు విచారణ చేపట్టనుంది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం వెబ్సైట్లో వివరాలు పొందుపర్చారు. దేశాన్ని కుదిపేస్తున్న వైద్యురాలి హత్య కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఘటనపై 14న సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు పలువురు న్యాయవాదులు సుప్రీంకోర్టు సీజేఐకు లేఖ రాశారు. డాక్టర్ హత్య ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రత్యేక చట్టం తీసుకురావాలి కోల్‌కతాలో వైద్యురాలి హత్యపై 70 మందికిపైగా పద్మ అవార్డుల గ్రహీతలైన డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో పని చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిపై హింసను అరికట్టడానికి, వారి తగిన భద్రత కల్పించడానికి, ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. వైద్యులపై, సిబ్బందిపై దాడులకు పాల్పడేవారిని, మానసికంగా వేధించేవారిని శిక్షించడానికి ఆర్డినెన్స్ తేవాలని సూచించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వైద్యుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయని, ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. బాధితురాలి కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని మోదీకి లేఖ రాసినవారిలో ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్, ఎయిమ్స్ రెసిడెంట్స్ డాక్టర్లు తదితరులు ఉన్నారు. -
ఇంకెన్నాళ్లు ఈ దారుణాలు.. ఇంకెంతకాలం భరించాలి: నటి ఆవేదన
నటి సోనా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈమె బహు భాషా నటి. అంతకు మించి ఏదో ఒక ఘటనతో వార్తలో తరచుగా కనిపించే నటి. శృంగార తారగానూ ముద్ర వేసుకున్న సోనాలో నిర్మాత, దర్శకురాలు కూడా ఉన్నారు. తాజాగా తన బయోపిక్‌ను స్మోక్ అనే పేరుతో స్వీయ దర్శకత్వంలో వెబ్ సిరీస్‌గా రూపొందిస్తున్నారు. కాగా ఇటీవల పాండిచ్చేరిలో జరిగిన బాలిక అత్యాచారం, హత్యా ఘటనపై స్పందించింది. ఈ రోజు మనం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని.. కానీ ఇటీవల పాండిచ్చేరిలో చిన్నారికి జరిగిన దారుణ ఘటన తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక అమ్మాయిగా ఎలా ఉండాలో అనేది కూడా తెలియని ఆ బాలికను చిత్ర వధ చేసి ప్రాణాలు తీయడం తీవ్రంగా పరిగణించాలన్నారు. ఇలాంచి క్రూరమైన ఘటనతో మనం మానవ సమాజంలోనే బతుకుతున్నామా? లేక మృగాల మధ్య జీవిస్తున్నామా? అని తెలియడం లేదన్నారు. ఒక నటిగా తానూ ఇలాంటి సంఘటనలను ఎదుర్కొని బయట పడ్డానని చెప్పారు. మృగాల్లాంటి మగాళ్ల మధ్య జీవించడానికి.. రక్షించుకోవడానికి అనునిత్యం పరుగులు తీస్తూనే ఉన్నామన్నారు. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. అభివృద్ధి చెందుతున్న ఈ నాగరిక ప్రపంచంలో మహిళలను అణచివేయడం.. కించపరచడం, తప్పుగా చిత్రీకరించడడం కొనసాగుతూనే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిని ఇంకా ఎంతకాలం మౌనంగా భరించాలి.. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నటి సోనా పేర్కొన్నారు. -
ఆ కేసు కథ కంచికేనా?
సాక్షి, హైదరాబాద్: ఇతర కేసుల మాట ఎలా ఉన్నా.. అత్యాచారం ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులకు మాత్రం పోలీసులు ప్రాధాన్యం ఇస్తారు. బాధితురాలిని వెంటనే భరోసా సెంటర్‌కు పంపడంతో పాటు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. దీనికి తోడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కూడా తోడయ్యే వాటి విషయంలో మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉంటారు. అయితే బంజారాహిల్స్ ఠాణాలో ఇన్స్పెక్టర్గా పని చేసి, లంచం ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదై, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఓ అధికారి తీరు మాత్రం దీనికి భిన్నం. తన వద్దకు వచ్చిన బాధితురాలికి న్యాయం చేయడం మాట అటుంచి ‘పెద్దలైన’ నిందితులతో కలిసి ఆమెనే బెదిరించాడు. ఈ కారణంగానే దారుణమైన ఉదంతానికి సంబంధించిన ఈ కేసు నమోదు దాదాపు నాలుగు నెలలు ఆలస్యమైంది. ఎట్టకేలకు విషయం బయటకు రావడంతో తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు కేసును సీసీఎస్‌కు బదిలీ చేయడంతో పాటు సదరు ఇన్స్పెక్టర్ను నిందితుడిగా చేర్చాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అప్పట్లోనే ఫిర్యాదు చేసిన బాధితురాలు... జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ ఛైర్మన్ మురళీ ముకుంద్, ఆయన కుమారుడు ఆకర్ష్ కృష్ణ బంజారాహిల్స్ రోడ్ నెం.12లో నివసిస్తున్నారు. వీరి వద్ద పని చేస్తున్న ఓ దళిత యువతిపై (22) అత్యాచారం చేశారన్నది ప్రధాన ఆరోపణ. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు గత ఏడాది జూన్‌లో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న మురళీ ముకుంద్ కుటుంబీకులు ఈ కేసు నమోదు కాకుండా చూడటానికి ఆ బాధితురాలినే బెదిరించాలని పథకం వేశారు. ఈ విషయాన్ని అప్పట్లో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన అధికారి దృష్టికి తీసుకువెళ్ళారు. ఆయన ప్రోద్భలంతో ముకుంద్ కుటుంబీకులు బాధితురాలిపై ఓ ‘చిత్రమైన కేసు’ పెట్టారు. ఆమె తమ ఇంట్లో పని చేస్తూ ఐఫోన్‌లోని సిమ్‌కార్డులు తస్కరించినట్లు అందులో ఆరోపించారు. ఈ ఫిర్యాదును బాధితురాలికి చూపించిన సదరు ఇన్స్పెక్టర్ బెదిరింపులకు దిగారు. ముకుంద్ కుటుంబీకులపై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోకపోతే ఈ ఫిర్యాదు ఆధారంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తానని బెదిరించాడు. ఆమెకు జరిగిన అన్యాయానికి రేటు... అక్కడితో ఆగకండా ఆ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించాడు. పలుమార్లు ఆమెకు ఫోన్ చేసిన సదరు అధికారి పదేపదే బెదిరింపులకు దిగాడు. ఓ దశలో ఆమెకు జరిగిన అన్యాయానికి రూ.1.7 లక్షల రేటు కట్టిన ఇన్స్పెక్టర్ ముకుంద్ కుటుంబీకుల నుంచి ఆ మొత్తం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ సెటిల్మెంట్ చేసినందుకు సదరు అధికారికి భారీ మొత్తమే ముకుంద్ కుటుంబీకుల నుంచి అందినట్లు తెలిసింది. ఈ ఖాకీ బెదిరింపులకు భయపడిన బాధితురాలు తన ఫిర్యాదును వెనక్కు తీసుకుని మిన్నకుండిపోయింది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన పరిణామాలతో ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న బాధితురాలు ధైర్యం చేసి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు విషయాన్ని అప్పటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. వారి ఆదేశాల మేరకు ఈ కేసును మహిళ భద్రత విభాగం అధికారులకు అప్పగించారు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వాస్తవాలు.. తమ దర్యాప్తులో భాగంగా మహిళ భద్రత విభాగం బాధితురాలిని సంప్రదించింది. ఆమె నుంచి వాంగ్మూలం సైతం నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే గత ఇన్స్పెక్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై మహిళ భద్రత విభాగం అధికారులు నగర పోలీసు కమిషనర్‌కు నివేదిక అందించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన బంజారాహిల్స్ మాజీ ఇన్స్పెక్టర్పై కేసు నమోదుకు ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధక చట్టంలో ఓ కీలకాంశం ఉంది. ఈ ఆరోపణల కింద వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి నిరాకరించిన, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులనూ నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. దీని ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేసి, తదుపరి చర్యలకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అత్యాచారం కేసును దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి (సీసీఎస్) బదిలీ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మురళీ ముకుంద్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మాజీ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకునే అంశానికి అనివార్య కారణాల నేపథ్యంలో బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. -
అయినవారిపైనే అకృత్యాలు
ఆఫీస్ పని ముగించుకుని ధరణి (పేరు మార్చాం) ఇంటికెళ్లింది. భర్త పవన్ ఓ పెద్దాయనతో మాట్లాడుతున్నాడు. ఆ పెద్దాయన ఎవరా అనుకుంటూ గదిలోకి వెళ్లబోయింది ధరణి. ఇంతలో భర్త పవన్.. ‘ధరణీ.. ఈయన నీకు మావయ్య అవుతారట. చిన్నప్పుడు మీ ఇంటి పక్కనే ఉండేవారట. నువ్వు ఈయన చేతుల్లోనే పెరిగావట. ఈ ఊళ్లో బంధువుల ఇంటికి వచ్చారట. నువ్వు ఇక్కడే ఉంటున్నావని తెలిసి చూసి పోదామని వచ్చారట’ అన్నాడు. ధరణి లోనికి వెళ్లిపోయింది. చిన్ననాటి ఘటనలు ఆమె కళ్లముందు కదలాడాయి. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు.. పక్కింట్లో ఉండే ఆ పెద్దాయన తనను ఆడించేవాడు. ఆ ముసుగులో ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు. అలా రోజురోజుకు అతడి అకృత్యాలు పెరుగుతూ వచ్చాయి. ఆ విషయాలు గుర్తొచ్చి ధరణి వళ్లు జలధరించింది. కళ్లు కోపంతో ఎరుపెక్కాయి. ఆ పెద్దాయనకు భార్య కాఫీ తీసుకొస్తుందనుకున్నాడు పవన్. ఎంతసేపటికీ ధరణి బయటకు రాలేదు. ‘తనకు నేను గుర్తు రాలేదనుకుంట’ అంటూ ఆ పెద్దాయన మెల్లగా జారుకున్నాడు. ధరణి లాంటి బాలికలు, మహిళలు తెలిసిన వారి చేతిలోనే అత్యాచారాలకు గురవుతున్నారని జాతీయ నేర గణాంకాల సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. సాక్షి, అమరావతి: కుటుంబ సభ్యులు.. బంధువులు.. స్నేహితులు.. సహోద్యోగులు.. సోషల్ మీడియా ఫ్రెండ్స్.. అందరూ తెలిసినవారే. కానీ.. అందరూ తమ మంచి కోరుకునే వారేనని బాలికలు, మహిళలు అనుకుంటే పొరపాటే. బాగా తెలిసిన ఆ గోముఖాల మాటున ఎన్నో వ్యాఘ్రాలుంటాయి. అవకాశం చిక్కితే.. ఒంటరిగా ఉంటే కబళించేందుకు ఏమాత్రం వెనుకాడవు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక మరోసారి ఈ విషయంలో బాలికలు, మహిళలను అప్రమత్తం చేస్తోంది. దేశంలో బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిలో అత్యధికులు వారికి బాగా తెలిసిన వారేనని నివేదిక వెల్లడించింది. ఏకంగా 96 శాతం అత్యాచార కేసుల్లో దోషులు బాధిత మహిళలకు బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారు, సహోద్యోగులేనని సవివరంగా నివేదించింది. 2022లో దేశంలో మహిళలపై అత్యాచారాలకు సంబంధించి ఎన్సీఆర్బీ తాజాగా విడుదల చేసిన ఈ నివేదిక విస్మయపరిచే వాస్తవాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా సగటున రోజుకు 88 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని ఆ నివేదిక తెలిపింది. స్నేహం.. ప్రేమ.. పెళ్లి పేరిట 2022లో దేశవ్యాప్తంగా 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. వాటిలో 14,582 కేసుల్లో స్నేహం, ప్రేమ, పెళ్లి పేరిట నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారు. 248 కేసుల్లో లైంగిక దాడి / సామూహిక లైంగిక దాడి, హత్యలకు బరితెగించారు. ఈ కేసుల్లో మొత్తం 29,900 మంది దోషులుగా తేలారు. వారిలో ఏకంగా 28,873 మంది లైంగిక వేధింపులకు గురైన బాలికలు, మహిళలకు తెలిసిన వారే అకృత్యాలకు పాల్పడటం గమనార్హం. కేవలం 1,027 మంది మాత్రమే బాధిత మహిళలకు ఏమాత్రం పరిచయం లేనివారు లేదా ఇప్పటికీ ఇంకా గుర్తించనివారు ఉన్నారు. అత్యధికంగా రాజస్థాన్‌లో.. దేశంలో విస్తీర్ణం, జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలుగా గుర్తింపు పొందిన 13 రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాల్లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో అత్యాచార కేసుల్లో 5,399 మంది దోషులుగా అభియోగాలు నమోదదయ్యాయి. వారిలో బాధిత మహిళలకు తెలిసిన వారు 5,131 మంది ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో నమోదైన అత్యాచార కేసుల్లో తెలంగాణ 814 మంది నిందితులతో 12వ స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ చివరి (15వ స్థానం)లో ఉంది. 2022లో ఏపీలో అత్యాచార కేసుల్లో 621 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో బాధిత మహిళలకు తెలిసిన వారే 604 మంది ఉన్నారు. వారిలో కుటుంబ సభ్యులు 39 మంది, స్నేహితులు, విడిపోయిన భర్తలు 294 మంది, కుటుంబ స్నేహితులు, ఇరుగుపొరుగు వారు, సహోద్యోగులు 271 మంది ఉన్నారు. అవగాహన పెంపొందించాలి బాగా పరిచయం ఉన్నవారే బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వారిలో కుటుంబ సభ్యుల నుంచి సహోద్యోగుల వరకు ఉంటున్నారు. బాలికలు, మహిళల్లో సరైన అవగాహన పెంపొందిచడమే ఈ సమస్యకు సరైన పరిష్కారం. ప్రధానంగా బాలికలతో తల్లిదండ్రులు వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. లైంగిక దాడులకు గురికాకుండా ఉండేలా అవగాహన కల్పించాలి. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి తెలియజేయాలి. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తే వెంటనే ప్రతిఘటించేలా.. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలనే అవగాహన పెంపొందించాలి. సోషల్ మీడియాలో స్నేహాలు, ఆన్లైన్ ఛాటింగ్‌లలో విషయంలో తగిన పరిధిలో ఉండటం, అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఇబ్బందికర పరిస్థితులు తెలెత్తితే వెంటనే రక్షణ ఎలా పొందాలన్నది బాలికలకు, మహిళలకు తెలియజేయాలి. మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ వంటి వాటిని సద్వినియోగం చేసుకోవడంపై అవగాహన కల్పించాలి. – కేజీవీ సరిత, ఎస్పీ, మహిళా భద్రత విభాగం, సీఐడీ -
అత్యాచార ఆరోపణలను ఖండించిన సజ్జన్ జిందాల్
ముంబై: తనపై నమోదైన అత్యాచార కేసుపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ స్పందించారు. ఆ ఆరోపణలు అవాస్తవమని, నిరాధారమని పేర్కన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న సజ్జన్ జిందాల్ కేసు విచారణ కొనసాగుతున్నందున దీనిపై మరింతగా వ్యాఖ్యానించలేనని వివరించారు. సజ్జన్ జిందాల్‌పై 30 ఏళ్ల వైద్యురాలైన మహిళ ఈ ఆరోపణలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ముంబైలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫిర్యాదు చేసి చాలా నెలలు గడిచినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆ మహిళ ఆరోపించారు. 2021లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్‌లో తాను సజ్జన్ జిందాల్‌ను కలిశానని ఆ మహిళ తెలిపారు. పెళ్లి చేసుకుంటానని సజ్జన్ జిందాల్ తనను నమ్మించాడని, 2022 జనవరి 24న తనపై అత్యాచారం చేశాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. -
త్రిషపై సంచలన కామెంట్స్.. లియో నటుడిపై సినీతారల ఆగ్రహం!
నటి త్రిషై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్‌పై కోలీవుడ్ తారలు ఫైరవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలసుకుందాం. విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం లియో. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రలో కనిపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మన్సూర్ త్రిషపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతను చేసిన అసభ్యకరమైన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. 'లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటించా. కానీ సినిమాలో ఒక్క బెడ్రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నా. నేను ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్రూమ్కు తీసుకెళ్తానని అనుకున్నా. ఇంతకుముందు సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. సినిమాల్లో ఇది నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు.' అంటూ కామెంట్స్ చేశారు. దీంతో మన్సూర్ అలీ ఖాన్‌పై పలువురు తారలు మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి సినిమాల్లో ఎందుకు అవకాశాలిస్తున్నాంటూ నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. The thing about men like Mansoor Ali Khan - they have always been talking like this. Never been condemned, with other men in power, money and influence laughing along; eeyy aamaa da macha correct ra maccha sorta thing. Robo Shankar said something on how he wants allowed to touch… pic.twitter.com/ZkRb2qxmMl — Chinmayi Sripaada (@Chinmayi) November 18, 2023 -
స్నేహితుడి కుమార్తెపై అత్యాచారయత్నం.. పండంటి కాపురం నాశనం
అనంతపురం క్రైం: నాన్నతో కలసి ఆయన మిత్రుడు ఇంటికొస్తే ఆత్మీయంగా పలకరించి అన్నం పెట్టిన వివాహితపై కన్నేశాడు ఓ కామాంధుడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమైపె అత్యాచారం చేయబోయాడు. గట్టిగా ప్రతిఘటించడంతో గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిన ఆ దుర్మార్గుడు.. చివరకు ఆమె భర్తకు దగ్గరై లోబర్చుకునేందుకు ఎత్తుగడ వేశాడు. దీంతో విషయం కాస్త భర్తకు తెలిసి భార్యకు దూరమయ్యాడు. పండంటి కాపురం కూలిపోయాక అసలు విషయాన్ని దిశ పోలీసులో బాధితురాలు మొరబెట్టుకుంది. వివరాలు... అనంతపురంలోని లక్ష్మీనగర్‌కు చెందిన ఓ కుటుంబ పెద్దకు కరుడు కట్టిన నేరస్తుడు టెంకాయల రాము స్నేహితుడు. ఈ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని తరచూ వారి ఇంటికి రాము వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఆ కుటుంబంలోని యువతికి తల్లిదండ్రులు పెళ్లి చేసి, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు. అయితే స్నేహితుడి కుమార్తైపె కన్నేసిన రాము.. ఎలాగైనా ఆమెను లోబర్చుకోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. 2018లో ఘటన 2018, డిసెంబర్ 14న ఉదయం వివాహిత భర్త పనిపై బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంటికి చేరుకున్న టెంకాయల రాము... ఆమె ఒంటరిగా ఉన్నట్లు నిర్ధారించుకుని, తనకు మంచినీళ్లు కావాలని అడిగాడు. నీళ్లు తెచ్చి ఇచ్చిన ఆమె ఫోన్ కోసం పడకగదిలోకి వెళ్లగా వెనుకనే అనుసరించిన రాము బలాత్కరించబోయాడు. ఆ సమయంలో ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. బయటకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్న తర్వాత జరిగిన విషయం మొత్తం వారితో బాధితురాలు చెప్పుకుని ఏడ్చింది. అయితే రాము కరుడు కట్టిన నేరస్తుడు కావడంతో విషయం వివాదస్పదమైతే తమ ప్రాణాలకే ప్రమాదమని భావించిన కుటుంబసభ్యులందరూ బయటకు చెప్పుకోలేక లోలోనే మదనపడుతూ వచ్చారు. ఈ విషయం భర్తకు తెలిస్తే ఆయన ఎక్కడ అపార్థం చేసుకుని దూరమవుతాడోననే భయం కూడా వారిని వెన్నాడుతూ వచ్చింది. విషయం తెలిసి దూరమైన భర్త ఎలాగైనా స్నేహితుడి కుమార్తెను లోబర్చుకోవాలనుకున్న రాము.. చివరకు ఆమె భర్తకు సన్నిహితమవుతూ వచ్చాడు. ఇటీవల ఈ విషయాన్ని గమనించిన ఆమె వెంటనే తన భర్తను హెచ్చరిస్తూ రాముతో కలసి తిరగడం మంచిది కాదని హితవు చెప్పింది. రాము చేసిన దురాగతాన్ని తల్లిదండ్రులతో కలసి వివరించింది. ఆపత్కాలంలో బాధితురాలికి అండగా నిలవాల్సిన భర్త ఆమెను అపార్థం చేసుకున్నాడు. ఆ రోజునే ఆమెకు దూరమయ్యాడు. నీచుడి ప్రవర్తన కారణంగా తన సంసారం కుప్పకూలడంతో తీవ్ర వేదనకు లోనైన బాధితురాలు గత నెల 25న దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఐ చిన్నగోవిందు... సిబ్బంది సాయంతో మంగళవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా తలుపులలో టెంకాయల రామును గుర్తించి అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
ఉజ్జయిని హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్ అత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిపై బుల్డోజర్‌యాక్షన్‌కి సిద్ధమయ్యారు అధికారులు. అక్రమంగా నిర్మించారనే కారణంతో.. అతని ఇంటికి కూల్చేయబోతున్నారు. జరిగింది ఇదే.. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన 12 ఏళ్ల.. సెప్టెంబర్ 25వ తేదీన ఉజ్జయినిలో లైంగిక దాడికి గురైంది. అనంతరం గాయాలతోనే ఆమె సాయం కోసం ఉజ్జయినిలో నడిరోడ్డుపై 8 కిలోమీటర్లు తిరిగింది. సుమారు 2 గంటల పాటు ఇంటింటికి వెళ్లి సాయం అర్థించింది. చివరకు ఓ ఆశ్రమం వద్ద స్పృహ తప్పిపడిపోయిన ఆమెను ఓ పూజారి పోలీసుల సాయంతో దవాఖానకు తరలించారు. ప్రధాన నిందితుడి అరెస్టు? లైంగికదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెతో మాట్లాడిన ఐదుగురిని ప్రశ్నించారు. ఓ ఆటోడ్రైవర్ సహా నలుగురిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో ఆటో డ్రైవర్ భరత్ సోనిని ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: ఉజ్జయిని కేసులో పోలీసుల కృషిని కొనియాడిన ఏఎస్పీ.. వారిపై కూడా చర్యలు తప్పవు.. -
ఎయిర్ హోస్టెస్ రూపా కేసులో వీడిన మిస్టరీ
ముంబయి: ముంబయి ఎయిర్ హోస్టెస్ రూపా ఓగ్రే హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఫ్లాట్‌లో హౌజ్‌కీపింగ్ చేసే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు విక్రవ్ అట్వాల్(40)ను కోర్టులో హాజరుపరిచారు. దిగ్భ్రాంతి కలిగించే విషయాలను జడ్జి ముందు నిందితుడు ఒప్పుకున్నాడు. అసలేం జరిగింది..? ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపా ఓగ్రే (25) ముంబయి ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ ట్రైనీగా విధుల్లో చేరారు. అంధేరీ హౌజింగ్ సొసైటీలో ఒక ఫ్లాట్ తీసుకుని తన సోదరితో కలిసి నివసిస్తున్నారు. వీరితోపాటు రూపా బాయ్‌ఫ్రెండ్ కూడా ఇదే ఫ్లాట్‌లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితమే అతను తన సొంతూరు వెళ్లాడు. అయితే.. రెండు రోజుల క్రితం రూపా తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె గొంతును కత్తితో కోసిన ఆనవాళ్లు కనిపించాయి. అత్యాచారం ప్లాన్ బెడిసికొట్టడంతో.. రూపా హత్య కేసులో బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రూపా ఫ్లాట్‌లో విక్రమ్ అట్వాల్ క్లీనింగ్ పనులు నిర్వహిస్తుండేవాడు. అతడు ఆ హౌజింగ్ సొసైటీలో క్లీనింగ్ నిర్వహించే ఏజెన్సీలో ఉద్యోగి. తన ఫ్లాట్‌లో విధులు సరిగా నిర్వహించట్లేదని రూపా అతనిని ఇటీవల మందలించింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న విక్రమ్.. పక్కా ప్లాన్ చేసుకుని పదునైన ఆయుధంతో రూపా ఫ్లాట్‌కు వెళ్లాడు. రూపా ఇంటికి వెళ్లి మొదట ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ రూపా విక్రమ్‌ని నెట్టివేసి బయటకు పరుగులు పెట్టే ప్రయత్నం చేసింది. విషయం బయటపడుతుందని బయపడిన విక్రమ్.. ఆమె మెడను పదునైన ఆయుధంతో కోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రూపాను సన్నిహితులు గుర్తించి ఆస్పత్రికి తరలించినా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఈ కేసులో హౌజింగ్ సొసైటీలో దాదాపు 45 మందిని పోలీసులు విచారించారు. An airhostess - Rupal Ogrey - was found dead at her luxury flat in Mumbai. She was a trainee air hostess. It is reported that her throat has been slit. She had joined the training last April and was residing with her beau and brother. The incident came to light when police paid… pic.twitter.com/CUKzwGksgI — NewsFirst Prime (@NewsFirstprime) September 4, 2023 ఇదీ చదవండి: ఢిల్లీ: ఆ ముగ్గురు మృగోన్మాదులకు మరణశిక్ష ఖరారు -
వీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై అనర్హులు..! ప్రభుత్వం కీలక నిర్ణయం..
జైపూర్: దేశంలో మహిళలపై అమానవీయ ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై జరిగిన దారుణం యావత్ దేశాన్ని తలదించుకునేలా చేసింది. అటు.. రాజస్థాన్‌లోని బిల్వారాలో నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన దేశాన్ని కలచివేసింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉంటే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటించారు. మహిళలపై వేధింపులు, అత్యాచార, అసభ్య ప్రవర్తనకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు ఉన్నా, హిస్టరీ షీట్స్ నమోదైనా.. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలాంటి అవకాశం ఉండబోదని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించిన లిస్ట్ ఇకపై పోలీసు స్టేషన్లలో ఉంటుందని చెప్పారు. ఇలాంటి నిందితుల ప్రవర్తన పత్రాలను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. ఇటీవల రాజస్థాన్‌లో మహిళలపై దారుణాలు ఎక్కువయ్యాయి. ఆగష్టు 2నే ఓ నాలుగేళ్ల బాలికను ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ అమానవీయ ఘటనపై యావత్ రాష్ట్రం నివ్వెరబోయింది. ఇదే గాక ఇంతకు ముందే జోద్పూర్లోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఈ కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఈ దారుణ ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ఈ మేరకు చట్టాలను తీసుకువచ్చింది. ఇదీ చదవండి: లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన మహా ఎంపీ.. -
నయవంచన..నటిపై పలుసార్లు అత్యాచారం.. !
ఆర్థిక రాజధాని ముంబయిలో దారుణం జరిగింది. పెళ్లి పేరుతో ఓ బిజినెస్మెన్ అత్యాచారానికి పాల్పడినట్లు నటి పోలీసులను ఆశ్రయించింది. దీంతో నటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా ఏఎన్ఐ ట్వీట్ చేసింది. (ఇది చదవండి: 'నన్ను తెలుగు అమ్మాయిలా ఆదరించారు'.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్!) కాగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై పలుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని నటి ముంబై పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టాంజానియాకు చెందిన వ్యాపారి వీరేన్ పటేల్‌పై ఎన్ఎం జోషి మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్.. డబ్బులిస్తా వచ్చేయన్నాడు: హీరోయిన్) On the basis of a complaint from a female actor, a rape case has been registered against a businessman in NM Joshi Marg police station. The complainant told police that the businessman raped her several times on the pretext of marriage. Further investigation underway: Mumbai… — ANI (@ANI) August 5, 2023 -
వేధింపుల నిరోధక చట్టంలో బాధితులకూ శిక్షలా?
-
అక్కా చెల్లెళ్లపై లైంగిక వేధింపులు.. నిందితుల్లో బీజేపీ నాయకుని కుమారుడు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. నలుగురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె మైనర్ సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నిందితుల్లో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దతియా జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి రాగా.. నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధిత బంధువులు స్థానిక పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సొంత గడ్డపై ఈ ఘటన జరగడం గమనార్హం. బాధితుల్లో మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం చేయగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. బాధితులు, నిందితులు విద్యార్థులని వెల్లడించారు. నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. తన సోదరిని నలుగురు యువకులు ఎత్తుకుపోయారని మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం తన సోదరిపై అత్యాచారం చేశారని పేర్కొంది. నిందితులు ఉన్నావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని వారని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: ‘మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు’ అనగానే బామ్మ ఆగ్రహంతో.. -
జైలు భయంతో బల్లిని మింగేశాడు..!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ వ్యక్తి బల్లిని మింగేశాడు. కాన్పూర్ జిల్లాలోని మల్లవాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అత్యాచార కేసులో అదుపులోకి తీసుకున్న మహేశ్ అనే నిందితున్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. నిందితున్ని రాత్రి సమయంలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ సమయంలోనే మహేశ్ నోట్లో బల్లి ఉండటం చూసి కంగుతిన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తమైన వైద్యులు మహేశ్ కడుపులో నుంచి బల్లిని బయటకు తీశారు. ప్రాణాపాయం ఏం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. అయితే.. ఈ అత్యాచార కేసులో మహేశ్‌పై చేసిన ఫిర్యాదును బాధితురాలు వెనక్కి తీసుకున్నారు. బల్లిని ఎందుకు మింగావని మహేశ్‌ను పోలీసులు అడగగా.. జైలంటే చాలా భయమని తెలిపాడు. అందుకే బల్లని మింగి.. ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఇదీ చదవండి: హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..! -
'ది కేరళ స్టోరీ' సినిమా చూసొచ్చి.. బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టిన మహిళ
ది కేరళ స్టోరీ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఎట్టకేలకు ఏదోలా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఏదో ఒక నెపంతో సినిమా బ్యాన్ చేయడం, థియేటర్ల ప్రదర్శించకుండా నిషేధించడం వంటి కష్టాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ ఆ సినిమా ఐ డేంట్ కేర్ అంటూ మంచి కలెక్షన్లు రాబడుతూ ప్రభంజన సృష్టించింది. ఐతే తాజాగా ఈ సినిమా ఓ ప్రేమ జంట నడుమ చిచ్చు పెట్టి..పోలీసు కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ఏం జరిగిందంటే..పోలీసులు తెలిపన కథనం ప్రకారం..మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 23 ఏళ్ల వ్యక్తిని పోలీసులు ఓ మహిళ ఫిర్యాదుపై అరెస్టు చేశారు. వారిద్దరు ఇటీవలే ది కేరళ స్టోరీ చూశారు. ఏమైదో ఏమో ఆ సినమా చూసొచ్చాక ఒక్కసారిగా ఆమెలో చైతన్యం కట్టుతెంచుకుంది. తనను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, అత్యాచారం చేశాడంటూ బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టింది. ప్రస్తుతం అతనితో కలిసి జీవిస్తున్నట్లు పేర్కొంది సదరు మహిళ. తనను మతం మారాలని మానసికంగా ఏడిపిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవలే తాము ది కేరళ స్టోరీ సినిమా చూశామని, ఆ తర్వాత తమ మధ్య వాగ్వాదం తలెత్తిందని పోలీసులకు తెలిపింది. తదనంతరం తనపై దాడి చేసి పరారయ్యాడని వాపోయింది సదరు మహిళ. ఈ మేరుకు ఆమె 19న పోలీసులను ఆశ్రయించి బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టినట్లు తెలిపారు పోలీసులు. కాగా, నిందితుడు 12వ తరగతి చదువుకున్న నిరుద్యోగి కాగా, బాధిత మహిళ ఉన్నత విద్యావంతురాలు, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. నాలుగేళ్లక్రితం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు పోలీసు అధికారి దినేష్ వర్మ పేర్కొన్నారు. తాము ఆరోపణలను క్షణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. (చదవండి: రూ.2 వేల నోట్లు వెనక్కి.. ఏ పత్రాలు అవసరం లేదు.. కేంద్రం తెలివి తక్కువ పని.. చిదంబరం సెటైర్లు) -
13 మందిపై అత్యాచారం, వీడియో రికార్డింగ్.. బాలేశ్ ధన్కర్ అకృత్యాలు
సిడ్నీ: ఉద్యోగాల పేరుతో ఇంటర్వ్యూలకు పిలిచి, మత్తు కలిపిన డ్రింక్స్ తాగించి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు.. ఆ దురాగతాలను వీడియో రికార్డింగ్ చేసేవాడు. కొరియా మహిళలంటే ఇతడికి పిచ్చి. బాధితుల్లో వీరే ఎక్కువమంది. వీరి పేర్లు, వివరాలను దాచుకున్నాడు. అతడి గదిలో బెడ్ పక్కనే అలారం క్లాక్‌లోని సీక్రెట్ కెమెరా ద్వారా అన్నీ రికార్డయ్యేవి...ఇవన్నీ ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన భారత సంతతి వ్యక్తి బాలేశ్ ధన్కర్ అకృత్యాలు. 2018 జనవరి– అక్టోబర్కాలంలో ఇతడు 13 మంది ఇతడు మహిళలను రేప్ చేశాడు. 2018 అక్టోబర్‌లో పోలీసులు ఇతడి సొంత ఫ్లాట్‌తోపాటు ఓ హోటల్ గదిలో సోదాలు జరపగా మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్ బాటిళ్లు, రేప్ దృశ్యాలు, మహిళలతో ఏకాంతంగా ఉండగా తీసిన మొత్తం 47 వీడియోలతో హార్డ్‌డ్రైవ్ దొరికింది. బాలేశ్ నేరాలపై న్యూసౌత్ వేల్స్ జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. కొన్ని వీడియోల్లోని అసహ్యకర దృశ్యాలను జడ్జీలు కూడా చూడలేకపోయారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. -
నాపై పలుమార్లు అత్యాచారం చేశాడు.. నటి భర్తపై ఫిర్యాదు
రాఖీ సావంత్ భర్త ఆదిల్ దురానీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే భర్త మోసం చేశాడంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది రాఖీ సావంత్. తాజాగా ఆదిల్‌పై మరో మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఇరాన్ మహిళ ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పెళ్లికి నిరాకరించాడని.. అలాగే చాలా మంది అమ్మాయిలతో ఇలాంటి సంబంధాలు కలిగి ఉన్నాడని ఆ మహిళ ఆరోపించింది. ఇరాన్ మహిళ ఫిర్యాదుతో రాఖీ సావంత్ భర్త ఆదిల్ దురానీపై మైసూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మైసూర్లో సహజీవనం చేసేటప్పుడు పెళ్లి పేరుతో ఆదిల్ తనపై అత్యాచారం చేశాడని ఇరాన్ మహిళ ఆరోపించింది. అయితే ప్రస్తుతం రాఖీ సావంత్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు ఆదిల్. ఐదు నెలల క్రితం తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయగా.. బెదిరించాడని ఇరానీ మహిళ పోలీసులకు తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని బెదిరించాడని పేర్కొంది. అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను లీక్ చేస్తానని చెప్పాడని వాపోయింది. ఈ వార్త విన్న రాఖీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆదిల్‌పై రాఖీ ఓషివారా పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదిల్ తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని రాఖీ కంప్లెంట్లో పేర్కొంది. ఆదిల్‌కు వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) -
కాళ్లు మొక్కుతా.. వదిలేయండి
ఖిలా వరంగల్: ఇంటర్ ఫస్టియర్ బాలిక.. క్లాస్మేట్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు.. ప్రేమ, పెళ్లి పేరిట శారీరకంగా లొంగదీసుకున్నా డు.. మాట్లాడుకుందామని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ‘కాళ్లు మొ క్కుతా వదిలేయండి’అని ప్రాధేయపడ్డా వదలలేదు. చివరికి విషయం బయటికి చెప్పొద్దని బెదిరించి ఇంటి వద్ద వదిలిపెట్టారు. ఆవేదన భరించలేని బాలిక తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ కాశీబుగ్గలో మంగళవారం జరి గిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రి లేని బాలిక..: పోలీసుల కథనం ప్రకారం.. నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ.. భర్తను కోల్పోవడంతో తమ గ్రామాన్ని వీడి ఇద్దరు కుమార్తెలతో వరంగల్ కాశిబుగ్గకు వలస వచ్చింది. అద్దె ఇంట్లో ఉంటూ, కూలి పనులకు వెళ్తూ కుమార్తెలను చదివిస్తోంది. పెద్ద కుమార్తె ఇంటర్ సెకండియర్, చిన్నకుమార్తె ఫస్టియర్ చదువుతున్నారు. ఫస్టియర్ చదువుతున్న బాలికకు అదే కాలేజీలో చదివే స్నేహితురాలి ద్వారా నర్సంపేట సమీపంలోని మాదన్నపేటకు చెందిన దూడల ప్రభాస్ (22)తో పరిచయం ఏర్పడింది. ప్రభాస్ ప్రేమ పేరిట బాలికను నమ్మించాడు. పలుమార్లు మాదన్నపేటకు రప్పించుకున్నాడు. పెళ్లి చేసుకుంటానంటూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. మాట్లాడుకుందాం రమ్మని చెప్పి.. ప్రభాస్ మంగళవారం ఉదయం మాట్లాడుకుందామని చెప్పి ఆ బాలికను మాదన్నపేటకు రప్పించాడు. ఇంట్లో బంధువులు ఉన్నారని, బయటికి వెళ్దామని చెప్పాడు. తన స్నేహితులు భరత్, బన్నిలను అడిగితే ఖిలా వరంగల్ శివార్లలో నిర్మానుష్య ప్రదేశాలు ఉన్నాయని చెప్పారని.. అటు తీసుకెళ్లాడు. బైక్‌పై ఆ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కాసేపటికే భరత్, బన్ని, మరో యువకుడు కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఏం చేస్తున్నారని బెదిరిస్తున్నట్టుగా నటిస్తూ.. బాలి క సెల్‌ఫోన్ లాక్కున్నారు. ‘కాళ్లు మొక్కుతా నన్ను వదిలేయండి’అని ప్రాధేయపడినా వినకుండా భరత్, బన్ని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరో యువకుడు వారికి కాపలా ఉన్నాడు. బాలిక ఈ ఘటనతో షాక్‌లోకి వెళ్లి స్పృహ కోల్పోయింది. ఆమె తిరిగి లేచే వరకు ప్రభాస్ అక్కడే ఉన్నాడు. అత్యాచారం విషయాన్ని బాలిక తల్లికి చెప్తుందేమోనని భయపడి.. ఆమెను మాదన్నపేటలోని అతడి బావ అనిల్ ఇంటికి తీసుకెళ్లాడు. బాలిక తనపై జరిగిన దారుణాన్ని చెప్పడంతో అనిల్, బాలికను అద్దె కారులో ఇంటికి పంపించారు. తర్వాత బాలిక ఘటనను తల్లికి చెప్పగా.. బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు యువకులతోపాటు వీరికి సహకరించిన మరో వ్యక్తిపై దాడి, పోక్సో చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, గాలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. -
ఢిల్లీలో ఘోరం..ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముంగిట ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఒక దుండగుడు. ఈ ఘటన బుధవారం ఉత్తర ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...చిన్నారి తల్లిదండ్రులు తమ పాప కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ చిన్నారి ఫోటోను అన్ని పోలీస్టేషన్లకు పంపించి వెతకడం ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా... ఒక అపరిచిత వ్యక్తి చిన్నారిని ఎత్తుకుని తీసుకువెళ్తున్నట్లు కనిపించింది. దీంతో పోలీసులు ఆ రోజు రాత్రి వరకు ఆ చిన్నారి కోసం తీవ్రంగా గాలించారు. ఐతే ఎట్టకేలకు ఆ పాప ఒక పార్క్ సమీపంలో కనిపించింది. ఈ మేరకు పోలీసులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె అత్యాచారానికి గురైనట్లు వైద్యుల ధృవీకరించారు. దీంతో పోలీసులు అతడి ఆచూకి కోసం బృందాలుగా ఏర్పడి గాలించడం ప్రారంభించారు. ఈ మేరకు డిప్యూటీ కమీషనర్ దేవేశ్ కుమార్ మహల్ మాట్లాడుతూ...ఆ చిన్నారి తల్లిదండ్రులు దినసరి కూలీలని చెప్పారు. ఉత్తర ఢిల్లీలో ఆ చిన్నారి కోసం తీవ్రంగా గాలించామని, ఎట్టకేలకు ఆ బాలికను గుర్తించగలిగామని అన్నారు. తొందరలోనే నిందితుడి ఆచూకిని కనుక్కొని అరెస్టు చేస్తామని వెల్లడించారు. 5-YR-OLD KIDNAPPED & RAPED IN DELHI A five-year-old girl was #kidnapped and then raped in #Delhi's Bhalswa diary. #Police said the girl was kidnapped by a man when she was playing outside her home in Bhalswa Dairy area on Wednesday.@Verma__Ishika reports pic.twitter.com/YCzHdx5Poa — Mirror Now (@MirrorNow) December 23, 2022 (చదవండి: హెడ్ మాస్టర్ బాగోతం.. హాస్టల్ విద్యార్థినులను ప్రత్యేక క్లాస్‌ల పేరుతో పిలిచి..) -
అన్నయ్యలతో ఆడుకుందామని వెళ్తే..
సైదాబాద్: ఇంటి పక్కనే ఉండే అన్నయ్యలు ఆడుకుందామని అంటే వెళ్లిన అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారి లైంగిక దాడికి గురైన దారుణ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఓ కుటుంబం స్థానిక పూసలబస్తీలో నివసిస్తోంది. సోమవారం సాయంత్రం ఆ కుటుంబానికి చెందిన ఐదేళ్ల పాప ఇంటి ముందు ఆడుకుంటోండగా.. అదే సమయంలో పక్కింటి పైన ముగ్గురు బాలురు పతంగులు ఎగురవేస్తున్నారు. చిన్నారి ఒక్కతే ఉండటాన్ని గమనించిన వారు ఆడుకోవటానికి రమ్మంటూ పైకి పిలిచారు. పాప వారు ఉన్న దగ్గరికి వెళ్లడంతో ముగ్గురూ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అసలు తన పట్ల ఏం జరుగుతుందో కూడా తెలియని పాప రోదిస్తూ ఉండిపోయింది. బాలుర కదలికలు అనుమానంగా ఉండటం గమనించిన స్థానిక మహిళ ఒకరు పాప తల్లికి విషయం చెప్పింది. వారు చిన్నారిని అడగ్గా బాలుర అఘాయిత్యం బయటపడింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరి వయసు 16 కాగా, మిగిలిన ఇద్దరిలో ఒకరికి 11ఏళ్లు కాగా, మరొకరు 9 సంవత్సరాల బాలుడని తెలుస్తోంది. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
ఆమెకు రూ.10కోట్లు కావాలి అందుకే ఇలా...: కాంగ్రెస్ ఎమ్మెల్యే
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింఘార్.. భార్య ఫిర్యాదు మేరకు గృహహింస, అత్యాచారం, బెదిరింపులు వంటి క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఉమంగ్ భార్య తన ఇంటి సహాయకురాలి భర్త పేరుతో కూడా ఆస్తులు కలిగి ఉన్నారని, అలాగే ఆయన సహజీవనం చేసిన సోనియా భరద్వాజ్ ఆత్మహత్యలో కూడా ఉమంగ్ ప్రమేయం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆయనపై నౌగోన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐతే ఆ ఆరోపణలన్నింటిని ఖండించారు ఉమంగ్. తన భార్య తనను బ్లాక్మెయిల్ చేస్తోందని చెప్పారు. తనను మానసికంగా వేధించి, బ్లాక్మెయిల్ చేస్తున్నందుకు నవంబర్2న ఆమెపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. అంతేగాక తనను తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించి రూ. 10 కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ కూడా ఆ ఆరోపణలకు బలం చేకూరేలా ఉమంగ్‌కు గతంలో కొంతమంది భార్యలు ఉన్నారని అన్నారు. ఐతే ఉమంగ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శక్తిమంతమైన గిరిజన నాయకుడు. పైగా మాజీ ముఖ్యమంత్రి జమునాదేవి మేనల్లుడు కూడా. గత కమల్ నాథ్ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన ఉమంగ్ ప్రస్తుతం గంద్వాని స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. (చదవండి: దాహమేసి నీరు తాగిందని.. గోమూత్రంతో వాటర్ ట్యాంక్ శుభ్రం!) -
హైదరాబాద్‌లో దారుణం.. రెచ్చిపోయిన మృగాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో దారుణం జరిగింది. కొందరు దుండగులు లెనిన్‌నగర్‌లో బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణ ఘటన నవంబర్ 5వ తేదీన జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. వివరాల ప్రకారం.. మీర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడియత్నం చేశారు. కాగా, లెనిన్‌నగర్‌కు చెందిన బాధితురాలు.. తన రాత్రి సమయంలో తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం, బైక్‌పై ఎక్కించుకుని బడంగ్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాల వెనుకకు తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడియత్నం చేశారు. ఈ క్రమంలో బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల రాకను గమినించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, లైంగికయత్నంలో నిందితులు.. బాధితురాలిని బెదిరింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది. తమ గురించి ఎవరికైని చెబితే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనపై బాధితురాలు, ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
అన్నదమ్ములిద్దరూ ఇద్దరే!...వాంటెడ్ క్రిమినల్స్
ఎక్కడైన అన్నదమ్ములు అనగానే ఒకరు ఒకలా మరోకరు డిఫరెంట్‌గా ఉంటారు. ఇది సర్వసాధారణం. మరికొన్ని చోట్ల ఒకరుకొకరు ఆదర్శవంతంగా ఐక్యమత్యంగా ఉంటారు. ఇక్కడ మాత్రం పూర్తి విరుద్ధం ఈ అన్నదమ్ములిద్దరూ. పైగా ఒకరుకి మించి మరొకొకరు వాంటెడ్ క్రిమినల్స్ వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్లో నివశిస్తున్న27 ఏళ్ల వ్యక్తి అతని సోదరుడు ఇద్దరు వేర్వేరు కేసుల్లో వాంటెడ్ క్రిమనల్స్. 27 ఏళ్ల ఆశిష్ చౌహన్ ఆగస్టు 29, 2017న తన సహచరులతో కలసి ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి దాదాపు రూ. 3 కోట్లు డిమాండ్ చేశాడు. సమాచారం అందుకున్న అప్పటి పోలీసులు ఆశిష్‌ని ట్రేస్ చేసి పట్టుకుంటున్న సమయంలో బహిరంగంగా పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు ఎన్కౌంటర్ దాడులు జరపడంతో ఆశిష్ అతను సహచరుడు తీవ్రంగా గాయపడి పట్టుబడ్డారు. ఈ మేరకు అలీపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆశిష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఐతే ఆశిష్‌కి నవంబర్3, 2020న బెయిల్ మంజూరయ్యింది. కానీ కోర్టు నిబంధనలను ఉల్లంఘించడంతో నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసి మళ్లీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే అతని సోదరుడు కాల్సెంటర్లో పనిచేస్తున్న 23 ఏళ్ల దీపక్ తన సహచర ఉద్యోగినే అత్యాచారం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎట్టకేలకు పోలీసుల జరిపిన దర్యాప్తులో ఆశిష్ సోదరుడు దీపక్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: ఉసురు తీసిన అతివేగం...ఆటోను ఢీ కొట్టిన ట్రక్కు) -
ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు.. సస్పెండ్ చేసిన పార్టీ..
తిరవనంతపురం: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్దోస్ కున్నప్పిల్లిని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆరు నెలల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే తన సొంత నియోజకవర్గం పెరుంబవోర్లో మాత్రం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. శనివారం సమావేశమైన పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కే సుధాకరణ్ వెల్లడించారు. కున్నప్పల్లిపై ఆయన పాత స్నేహితురాలే అత్యాచార, హత్యాయత్నం ఆరోపలు చేస్తూ కేసు పెట్టింది. దీంతో పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు. గురవారం ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు హాజరుకావాలని సూచించింది. దీంతో 11 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న ఎల్దోస్.. శనివారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనను ప్రశ్నించిన అధికారులు, సోమవారం మరోసారి విచారణకు రావాలన్నారు. ఎల్దోద్ పాత స్నేహితురాలైన ఓ మహిళ.. తనను అతను కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని ఆరోపించారు. కోవలం బీచ్‌లోని కొండపైనుంచి తోసేసేందుకు ప్రయత్నించాడని పోలీసులను ఆశ్రయించారు. చదవండి: వైఫల్యాలు ఏమార్చేందుకే కొత్త ఎత్తులు: మాయావతి -
రిసెప్షనిస్ట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది?
దేహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్, 19ఏళ్ల యువతి హత్య కేసు రాజకీయంగా దుమారానికి దారితీసింది. ఈ కేసులో బహిష్కృత భాజపా నేత కుమారుడు, రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య, ఇద్దరు సిబ్బందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. హత్యకు ముందు యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవని పోస్ట్‌మార్టం నివేదికలో తేలినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఆమె వేళ్లు, చేతులు, వీపు భాగాల్లో గాయాలైనట్లు గుర్తులు కనిపించినట్లు పేర్కొన్నాయి. ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దిశగా చర్యలు చేపట్టారు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించనున్నట్లు చెప్పారు. అలాగే మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. అంకిత తండ్రితో సీఎం మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఈ కేసు విచారణను వేగంగా జరిపించి నిందితులకు కఠినశిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మరునాడే పరిహారం ప్రకటించారు. ఇదీ కేసు.. భాజపా బహిష్కృత నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు రిషికేశ్‌లో రిసార్టు ఉంది. అందులో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోన్న 19 ఏళ్ల యువతి ఇటీవలే హత్యకు గురైంది. కొద్దిరోజుల తర్వాత అక్కడికి దగ్గర్లోని కాలువలో ఆమె మృతదేహం లభించింది. రిసార్టుకు వచ్చే అతిథులకు ఆమె ‘ప్రత్యేక’ సేవలు చేసేందుకు నిరాకరించినందుకే పుల్కిత్, మరో ఇద్దరు సిబ్బంది ఆమెను హత్యచేసినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు పోలీసులు. తనను వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నిస్తున్నారని వాట్సాప్‌లో స్నేహితుడితో ఆమె మొరపెట్టుకున్న స్క్రీన్ షాట్లు, ఓ ఫోన్ కాల్ వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదీ చదవండి: Uttarakhand: రిసెప్షనిస్ట్ అంకిత కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం -
ఆరేళ్ల బాలికపై లైంగికదాడి.. ఆదిలాబాద్ కోర్టు సంచలన తీర్పు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఆదిలాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. కాగా, కోర్టు తీర్పుపై బాధితులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఉట్నూర్ బస్‌స్టేషన్ సమీపంలో ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన షేక్ ఖాలిద్(45) అనే వ్యక్తి ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో విచారణ సందర్భంగా జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా రూ. 2వేల జరిమానా విధించింది. కాగా, ఈ జైలు శిక్ష.. జీవిత ఖైదు కన్నా ఎక్కువ కావడం విశేషం. ఈ సందర్భంగా కోర్టు తీర్పుపై పోలీసులు స్పందించారు. ఈ దారుణ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని పట్టకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం, 60 రోజుల్లోనే ఛార్జ్‌షీట్ వేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. తర్వాత, పోలీసులందరూ టీమ్‌గా వర్క్‌గా పనిచేసి కోర్టుకు సకాలంలో అన్ని ఆధారాలను సమర్పించారు. కేవలం 135 రోజుల్లోనే కోర్టు విచారణ చేసినట్టు తెలిపారు. ఇక, నిందితుడి ఇలాంటి వేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుతోనైనా భవిష్యత్త్‌లో ఇలాంటి దారుణాలు చేసేందుకు నిందితులు భయపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఫుల్లుగా తాగొచ్చి మహిళపై అత్యాచారం.. రూంలో లాక్ చేసిన బాధితురాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. ఓ మహిళను తెలిసిన వ్యక్తే రేప్ చేశాడు. తాగిన మత్తులో ఆమె ఇంటికి వెళ్లి ఈ అఘాత్యానికి ఒడిగట్టాడు. దక్షిణ ఢిల్లీ మెహ్రౌలీ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోంది. అయితే ఘటన అనంతరం బాధితురాలు చాకచక్యంగా వ్యవహరించింది. నిందితుడు గదిలో ఉండగా.. ఎలాగోలా తాను బయటకు వచ్చి తాళం వేసింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. రంగంలోకి దిగిన వాళ్లు అతడ్ని అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. నిందితుడు ఖాన్పూర్కు చెందిన హర్జీత్ యాదవ్ అని పోలీసులు వెల్లడించారు. ఇతడు బాధితురాలికి 45 రోజులుగా తెలుసని పేర్కొన్నారు. అంతేకాదు అతడు ఓ రాజకీయ పార్టీకి బ్లాక్ స్థాయి అధ్యక్షుడు అని వివరించారు. మద్యం మత్తులో వెళ్లి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పారు. చదవండి: పీఎఫ్ఐపై రెండో విడత దాడులు.. కర్ణాటకలో 45 మంది అరెస్టు -
మాట్లాడుకుందామని పిలిచి.. అత్యాచారం.. ఆపై హత్య
రాజేంద్రనగర్/మైలార్‌దేవ్‌పల్లి/ఖిల్లా ఘనపురం: పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలు సాయిప్రియ(20)ను చంపి, కేఎల్ఐ కాల్వలో పూడ్చిపెట్టిన కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సాయిప్రియను ప్రియుడు శ్రీశైలం అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు తేలింది. మాట్లాడుకుందామని తన స్వగ్రామం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటకు పిలిపించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడితో పాటు సహకరించిన వ్యక్తిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా మానాజీపేట ప్రాంతానికి చెందిన బత్తిని అంజన్న 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం శంషాబాద్‌కు వలసవచ్చారు. డెయిరీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈయన చిన్న కుమారుడు బత్తిని శ్రీశైలం(23) ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ కావడంతో మానాజీపేటలో డెయిరీ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శ్రీశైలానికి మిత్రుల ద్వారా హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు చెందిన కావటి వెంకటేశ్ కూతురు సాయిప్రియ(20)తో పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని శ్రీశైలం ఇరు కుటుంబాలకు చెప్పాడు. దీనికి అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు. అమ్మాయి ఉన్నత చదువులు చదవాల్సి ఉందని ఇప్పుడే పెళ్లి చేసే ఆలోచన లేదని తెలిపారు. చంపి.. కాల్వలో పూడ్చి.. ఇదిలా ఉండగా, కరోనా కాలంలో ప్రేమికుల మధ్య సంబంధాలు తెగిపోయాయి. మళ్లీ మూడు నెలల క్రితం సాయిప్రియ, శ్రీశైలంల మధ్య సెల్‌ఫోన్ సంభాషణలు, చాటింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 5న మాట్లాడుకుందామని చెప్పి సాయిప్రియను శ్రీశైలం మానాజీపేటకు రమ్మన్నాడు. సాయిప్రియ కళాశాలకు వెళ్తున్నానని మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వరకు రాగా.. అక్కడి నుంచి శ్రీశైలం బైక్‌పై మధ్యాహ్నం మానాజీపేటలోని తన షెడ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అనంతరం సమీపంలోని మబ్బు గుట్ట దగ్గరికి తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. ఆపై చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి తన మేనత్త కుమారుడు శివతో కలిసి గుట్ట దగ్గరకు చేరుకుని కేఎల్ఐ కాల్వ దగ్గర గుంత తవ్వి అందులో పూడ్చిపెట్టారు. సాయిప్రియ బ్యాగ్‌ను షెడ్లోనే భద్రపరిచారు. అనంతరం ఎవరికి ఇంటికి వారు వెళ్లారు. తండ్రి ఫిర్యాదుతో.. సాయిప్రియ సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్లో ఆమె తండ్రి వెంకటేష్ ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులతో వివరాలు సేకరించగా.. శ్రీశైలంపై అనుమానం ఉన్నట్లు చెప్పారు. దీంతో పోలీసులు బుధవారం ఖిల్లాఘనపురం పోలీసుల సహకారంతో శ్రీశైలంను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తానే చంపానని అంగీకరించాడు. గురువారం సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక తహసీల్దార్ భానుప్రకాష్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం చేశారు. నిందితుడు శ్రీశైలం, అతడికి సహకరించిన శివను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కాగా, నిందితులిద్దరిని కస్టడీ కోరుతూ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి.. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురిని దారుణంగా హత్య చేసిన నిందితుడితో పాటు సహకరించిన వారందరిని ఉరి తీయాలని సాయిప్రియ కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. విదేశాల్లో ఉన్నత చదువు చదవాలని సాయిప్రియ లక్ష్యం అని అందుకు అనుగుణంగా తాము ప్రయత్నిస్తున్న దశలో ప్రేమ పేరుతో శ్రీశైలం మోసం చేసి హత్య చేశాడని ఆరోపించారు. -
ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడిపై అత్యాచార యత్నం కేసు నమోదు
ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడు, నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు సారధి సందీప్ లామిచ్చెన్‌పై అత్యాచార యత్నం కేసు నమోదైంది. సందీప్ అభిమానిగా చెప్పుకునే 17 ఏళ్ల మైనర్ బాలిక అత్యాచార అరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సందీప్‌పై కేసు నమోదు చేశారు. గౌశాల మెట్రోపాలిటిన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖాట్మండుకు చెందిన మైనర్ బాలిక సందీప్ లామిచ్చెన్ ఆటకు వీరాభిమానినని చెప్పుకుంది. గత కొద్దికాలంగా సందీప్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ వస్తున్న ఆ అమ్మాయి.. నానా తంటాలు పడి తన అభిమాన క్రికెటర్ ఫోన్ నంబర్ సంపాదించింది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా సందీప్‌తో వాట్సాప్‌లో చాటింగ్ చేస్తుండేది. Nepal Police starts investigation over alleged rape complaint against Nepali national Cricket team Captain Sandeep Lamichhane, after a minor aged 17 lodged the case, stated Nepal Police in a statement (Photo courtesy: Sandeep Lamichhane's Twitter handle) pic.twitter.com/3HK386a6n5 — ANI (@ANI) September 7, 2022 దీన్ని ఆసరాగా తీసుకున్న సందీప్.. బాలికను పర్సనల్‌గా కలవాలని కోరాడు. ఈ క్రమంలో గత నెల (ఆగస్ట్) 21న వీరిద్దరు ఓ హోటల్ గదిలో కలిశారు. ఆ సమయంలో సందీప్ రెండుసార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆ అమ్మాయి తెలిపింది. మైనర్ స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకున్న పోలీసులు సందీప్‌పై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. గతేడాదే నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన సందీప్.. ప్రస్తుతం కెన్యా పర్యటనలో ఉన్నాడు. లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్ అయిన సందీప్.. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయాడు. చదవండి: దేశం కోసం గెలవాలన్న కసి టీమిండియాలో పోయింది.. ఐపీఎల్ బాయ్‌కాట్ చేస్తేనే..! -
సోలార్ స్కాంలో కాంగ్రెస్ ఎంపీని ప్రశ్నించిన సీబీఐ!
న్యూఢిల్లీ: కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ను సీబీఐ ప్రశ్నించింది. లైంగికంగా వేధించారంటూ కుంభకోణంలో ప్రధాన నిందితురాలైన మహిళ చేసిన ఆరోపణలపై ఆయన స్టేట్మెంట్ నమోదు చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి వేణుగోపాల్‌తో పాటు కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ, హిబి ఈడెన్, మాజీ మంత్రి ఏపీ అనిల్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాశ్, బీజేపీ లీడర్ ఏపీ అబ్దుల్లా కుట్టీలపై కేసు నమోదైంది. 2012, మే నెలలో జరిగిన సంఘటనపై కేసీ వేణుగోపాల్‌ను ప్రశ్నించింది సీబీఐ. ఈ కేసును తొలుత కేరళ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేపట్టింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు విచారణ గతేడాది సీబీఐకి బదిలీ అయింది. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు ఆజాద్ షాక్.. ఆ బాధ్యతలకు నిరాకరణ.. కీలక పదవికి రాజీనామా! -
భక్తురాలిపై అఘాయిత్యం... దేవతే అలా చేసిందని బుకాయింపు
ఇటీవల కాలంలో స్వామిజీ పేరుతో భక్తులపై అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. అయినా ప్రజల్లో కూడా మార్పు రావడం లేదు. ఈ డిజిటల్ యుగంలో పిచ్చి బాబాలు, స్వామీజీల మాయలో పడి కోరి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ స్వామీజీని నమ్మీ జీవితాన్ని నాశనం చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మధ్యప్రధేశ్లో ఒక వ్యక్తి తనను దేవుడిగా ప్రకటించుకుని స్వామి వైర్యాగ్యనంద గిరిగా పబ్లిక్‌లో చెలామణి అవుతున్నాడు. ఈ మేరకు ఒక మహిళ తనకు చాలా ఏళ్లుగా పిల్లలు కలగకపోవడంతో ఈ వైర్యాగ్యనంద స్వామిని కలిసినట్లు పోలీసులుకు తెలిపింది. కొన్ని పూజలు చేస్తే పిల్లలు కలుగుతారని నమ్మబలికి ఒక ప్రసాదం ఇచ్చాడని చెప్పింది. సదరు మహిళ ఆ ప్రసాదం తిని స్ప్రుహ కోల్పోయాననని, ఆ తర్వాత ఆ వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చింది. ఐతే తనకు మెలుకువ వచ్చిన తర్వాత ఆ వైరాగ్యానంద స్వామీ.. దేవత నీపై అత్యాచారం చేసిందని చెబుతున్నాడని వాపోయింది. ఆ బాధిత మహిళ వెంటనే ఆ స్వామీజీ పై ఫిర్యాదు చేయలేకపోయింది. ఎందుకంటే ఆ స్వామిజీకి రాజకీయ పార్టీల అండదండ ఉంది. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి మద్దతుగా నిలబడటమే కాకుండా ఒక సీనియర్ నాయకుడి గెలుపు కోసం యజ్ఞం చేశాడు. పైగా అతను గెలవకపోతే సమాదిలోకి వెళ్లిపోతానంటూ ప్రగల్పాలు కూడా పలికాడు. ఆ వ్యక్తికి సమాజంలో కాస్త పలుకుబడి ఉండడంతో భయప్డడానని చెప్పుకొచ్చింది సదరు బాధితరాలు. ఈ మేరకు పోలీసులు అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: లాలు యాదవ్ కుమార్తె ట్వీట్... బలపడనున్న 'గత బంధం') -
సీఎం క్షమాపణలు చెప్పాల్సిందే! ఔను వాస్తవమే చెప్పా!
రాజస్తాన్: రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ రేప్ కేసు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రజలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ఆయన చేసిన వ్యాఖ్యలకు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చకునేందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఈ మేరకు ఆశోక్ గెహ్లాట్ నిర్భయ కేసు తర్వాత నిందితులు ఉరి తీయాలన్న డిమాండ్ ఊపందుకుని చట్టం అమలులోకి వచ్చంది గానీ ఆ తర్వాత ఇలాంటి ఘటనల తోపాటు హత్యలు కూడా ఎక్కువయ్యాయని అన్నారు. దీంతో బీజేపీ కాంగ్రెస్‌ని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలు అస్తిరంగా ఉన్నాయనడానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి షేకావత్. ఈ విషయమై జాతీయ మహిళా కమిషన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి అన్నారు. రాజస్తాన్ ప్రభుత్వం ఏకైక ప్రాధాన్యత రాష్ట్రంలో తమ సీటును కాపాడు కోవడమేనని దుయ్యబట్టారు. గత మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను గురించి పట్టించికోవడం లేదంటూ షేకావత్ విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టారు. వివరణ ఇచ్చిన సీఎం రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ బీజేపీ ఆరోపణలకు స్పందిస్తూ...తాను వాస్తవమే మాట్లాడానని అన్నారు. తన వ్యాఖ్యలను వివాదాస్పదం మార్చేందుకు యత్నిస్తున్నారంటూ ఆక్రోశించారు. ఈ మేరకు ఆయన వివరణ ఇస్తూ...నిర్బయ ఘటన నుంచి నిందితులను ఉరి తీయడం వంటి చట్టం అమలులోకి వచ్చింది. అందువల్లే అత్యాచార బాధితురాళ్లను చంపడం కూడా ఎక్కువైంది. ఎందుకంటే నిందితుడు తాను పట్టుబడతాననే భయంతో హత్యలు చేస్తున్నారని, పైగా అందువల్ల ఎప్పుడూ లేని విధంగా హత్యలు కూడా పెరిగాయని అన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని వివరణ ఇచ్చారు. ఐతే బీజేపీ ఆశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలను సిగ్గుచేటు, దురదృష్టకరం అని అభివర్ణించింది. ఈ విషయమై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాని వివరణ ఇవ్వాలంటూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా డిమాండ్ చేశారు. ఆమె ఒక వైపు పార్టీలో "నేను అమ్మాయిని పోరాడగలను" అంటూ నినాదాలు చేస్తూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను ప్రోత్సహిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు ఆయన గెహ్లాట్ ప్రభుత్వంలోని మంత్రి శాంతిలాల్ ధరివాల్ వ్యాఖ్యలను కూడా ఉదహరించారు. ఆయన గతంలో రాజస్తాన్ పురుషుల రాష్ట్రం అని అత్యాచారాల్లో రాజస్తాన్ నంబర్ వన్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. తాజాగా ఆశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలకు ముడిపెడుతూ షెహజాద్ పూనావల్లా విమర్శలు ఎక్కుపెట్టారు -
జ్యూస్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం
బంజారాహిల్స్ (హైదరాబాద్): మహిళా ఉద్యోగినికి జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ హోంగార్డు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి డబ్బుల కోసం డిమాండ్ చేస్తుండటంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్టీఏలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి తన భర్త నుంచి విడిగా ఉంటోంది. 2018లో ఆమె ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడ ఆమెకు ఆర్టీఏలో పనిచేసే హోంగార్డు స్వామి పరిచయమయ్యాడు. అతనే ఆమెకు అద్దె ఇల్లు చూపించి పిల్లలను స్కూల్లో జాయిన్ చేశాడు. ఆమె కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ నమ్మకం పెంచుకున్నాడు. ఆమె ద్వారా కుటుంబ విషయాలు అన్ని తెలుసుకున్నాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై కన్నేసిన స్వామి ఓ పథకం వేశాడు. ఓ రోజు జ్యూస్ తీసుకొని ఇంటికి వచ్చాడు. జ్యూస్ తాగిన ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలను తన సెల్‌ఫోన్ కెమెరాలో చిత్రీకరించాడు. విషయం బయటకు చెబితే వీడియో ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు వీడియో కాల్ చేస్తూ దుస్తులు తీసి చూపించాలంటూ వేధించేవాడు. తీసిన వీడియోను డిలీట్ చేయాలంటే తనకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయసాగాడు. దీంతో అతని వేధింపులు భరించలేక ఆ మహిళ ఈ ఏడాది హైదరాబాద్‌కు బదిలీ చేయించుకుంది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉంటోంది. అయినప్పటికి స్వామి వేధింపులు ఆగలేదు. నగరానికి కూడా వచ్చి ఆమె వీడియోను తోటి సిబ్బందికి చూపిస్తానంటూ బెదిరించసాగాడు. ఇది భరించలేక బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్వామిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
కెమికల్ కాస్ట్రేషన్ బిల్లుకు ఆమోదం..ఏ దేశాల్లో అమల్లో ఉందంటే..!
బ్యాంకాక్: ప్రపంచవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. భారత్‌లో నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ లాభం లేకుండా పోతోంది. అలాంటి వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపిస్టులపై కొరడా ఝులిపించింది థాయ్‌లాండ్. అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినమైన కెమికల్ కాస్ట్రేషన్‌కు గురి చేసే చట్టానికి ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం.. సైకియాట్రిక్, అంతర్గత మెడిసన్ స్పెషలిస్ట్‌ల ఆమోదంతో పాటు నేరస్థుడి అనుమతితో కెమికల్ కాస్ట్రేషన్ చేపట్టాలి. లైంగిక సామర్థ్యాన్ని తగ్గించేలా శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయులను తగ్గించే ఇంజెక్షన్లు, చికిత్సకు అంగీకరించిన వారి జైలు శిక్ష తగ్గించనున్నారని బ్యాంకాక్ పోస్ట్ తెలిపింది. 'హింస సంబంధిత పునర్విచారణ నిరోధక బిల్లు'ను న్యాయశాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును దిగువ సభ గత ఫిబ్రవరిలోనే ఆమోదించగా.. తాజాగా ఎగువసభ సెనేట్ ఆమోద ముద్ర వేసింది. 147 సభ్యులతో కూడిన సభలో బిల్లుకు ఇద్దరు గైర్హాజరు కాగా 145-0 తేడాతే ఏకగ్రీవంగా ఆమోదం లభించటం గమనార్హం. స్వచ్ఛంద కెమికల్ కాస్ట్రేషన్ బిల్లుకు ఆమోదం లభించిన క్రమంలో.. చేపట్టాల్సిన ప్రక్రియను అధికారులు సిద్ధం చేయనున్నారు. ఈ బిల్లు రాయల్ గెజిట్‌లో పబ్లీష్ అయ్యాక చట్టంగా మారనుంది. ఏ దేశాలు ఈ శిక్షను అమలు చేస్తున్నాయి? కెమికల్ కాస్ట్రేషన్ అనేది శిక్షల్లో కొత్తదేమి కాదు. ఇది దక్షిణ కొరియా, పాకిస్థాన్, పోలాండ్, అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తున్నారు. మరోవైపు.. నార్వే, డెన్మార్క్, జర్మనీ వంటి దేశాల్లో సర్జికల్ కాస్ట్రేషన్‌ను పాటిస్తున్నారు. అయితే.. ఈ విధమైన శిక్షలు మానవ హక్కులను హరిస్తున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాస్ట్రేషన్ చేయటం వల్ల నేరస్థుడు తన జీవితాంతం లైంగిక చర్యలో పాల్గొనలేడు. దీనికి గురైన వ్యక్తి క్రూరంగా ప్రవర్తించటం, వివాహద్వేషిగా మారతాడని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలు, బాలికలను ద్వేషించటం, వారికి హాని కలిగించటం వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. సెక్స్ అనేది ఒక్కటే దాడికి మార్గం కాదని, ఇతర దారుల్లో మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు.. అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న క్రమంలో ఇలాంటి కఠిన శిక్షలు అవసరమని మరోవర్గం వాదిస్తోంది. కాస్ట్రేషన్ భయంతో నేరాలకు పాల్పడేందుకు వెనకడుగువేస్తారని బావిస్తున్నారు. ఇదీ చూడండి: యూపీలో 'బై బై మోదీ' హోర్డింగ్.. అది టీఆర్ఎస్ మద్దతుదారుల పనేనా? -
అత్యాచార నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్షలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనలోని నిందితులకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం ఉదయం సైదాబాద్ జువెనైల్ హోం నుంచి ఐదుగురు మైనర్లను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరో నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులోని ఆరుగురు నిందితులు ప్రస్తుతం పోలీసుకస్టడీలో ఉన్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య మూడు ప్రైవేట్ కార్లలో మైనర్లను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరి ముఖానికి మాస్క్‌లు వేసి ఒక్కొక్కరిని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. వీరందరికి డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో రెండుగంటలపాటు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఐదుగురు మైనర్లను జువెనైల్ హోంకు, సాదుద్దీన్ మాలిక్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, సైదాబాద్ జువెనైల్ హోంలో ఉన్న నిందితులను మొదటిరోజైన శుక్రవారం ఉత్తర్వు కాపీలు ఆలస్యంగా అందటంతో పోలీసులు కస్టడీకి తీసుకోలేకపోయారు. -
పబ్ దగ్గర దింపేస్తామని తీసుకెళ్లి..
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రొమేనియా బాలికపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి పోలీసు కస్టడీలో ఉన్న ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కీలక విషయాలు బయటపెడుతున్నాడు. జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అతడితో క్రైమ్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ను పూర్తి చేశారు. అతడిని పబ్‌తోపాటు కాన్సూ బేకరీ, అత్యాచారం జరిగిన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44లోని పవర్‌స్టేషన్ పరిసరాలకు తీసుకువెళ్లి అనేక అంశాలు రికార్డు చేశారు. సాదుద్దీన్ విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలివీ.. ఒకరొకరుగా కలిసి.. గత నెల 28న మధ్యాహ్నం 2 గంటల సమయంలో సాదుద్దీన్ తన స్నేహితుడైన పొరుగు జిల్లా కార్పొరేటర్ కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లో ఉన్న టెండర్ కట్స్ దుకాణం వద్దకు వెళ్లాడు. అప్పటికే ఎమ్మెల్యే కుమారుడు, రాజేంద్రనగర్‌లోని చింతల్‌మెట్‌కు చెందిన బాలుడు అక్కడ ఉన్నారు. కొద్దిసేపటికి హైదర్‌గూడకు చెందిన మరో బాలుడు బెంజ్ కారులో అక్కడికి చేరుకున్నాడు. కార్పొరేటర్ కుమారుడు ద్విచక్ర వాహనాన్ని అక్కడే పెట్టేయగా.. అంతా కలిసి బెంజ్ కారులో అమ్నీషియా పబ్‌కు వెళ్లారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు అతడి ఇన్నోవా కారులో మరో స్నేహితుడితో కలిసి పబ్‌కు వచ్చాడు. పబ్‌లో దాదాపు 200 మంది ఉండగా.. వీరిలో 70 మంది వరకు బాలికలు, యువతులు ఉన్నారు. పబ్‌లో పరిచయం చేసుకుని.. పబ్ మొదటి అంతస్తులో జరుగుతున్న ఈ పార్టీలో జ్యూస్ కౌంటర్ వద్ద ఉన్న రొమేనియా బాలికను తొలుత చింతల్‌మెట్‌కు చెందిన బాలుడు గుర్తించాడు. ఆమెను పరిచయం చేసుకుని డ్యాన్స్ ఫ్లోర్‌కు తీసుకెళ్లాడు. పక్కనే ఉన్న మరో బాలికను సాదుద్దీన్ పరిచయం చేసుకున్నాడు. కాసేపటికి సాదుద్దీన్, ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు, కార్పొరేటర్ కుమారుడు, మిగతా ఇద్దరు మైనర్లు కలిసి.. ఆ బాలికల చుట్టూ చేరి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీనితో ఇబ్బందిపడిన బాలికలు సాయంత్రం 4.30 గంటల సమయంలో పబ్ నుంచి బయటికొచ్చారు. వారిని అనుసరిస్తూ సాదుద్దీన్ సహా ఆరుగురూ బయటకు వచ్చారు. ఇంట్లో దింపేస్తామని చెప్పి.. ఓ బాలిక క్యాబ్‌లో వెళ్లిపోగా.. రొమేనియా బాలిక తిరిగి పబ్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే చేతికి ఉన్న ట్యాగ్‌ను ఆమె తీసేయడంతో సిబ్బంది లోనికి అనుమతించలేదు. ఇది గమనించిన సాదుద్దీన్ సహా ఆరుగురూ ఆమెను ఇంటివద్ద దింపుతామంటూ కారు ఎక్కించుకుందామని, అవకాశం చిక్కితే అఘాయిత్యానికి పాల్పడొచ్చని ప్లాన్ వేసుకున్నారు. చింతల్మెట్ బాలుడు ఆమె వద్దకు వెళ్లి.. తమ బెంజ్ కారులో ఇంట్లో దింపుతామని నచ్చజెప్పాడు. ఆమె అంగీకరించడంతో కారులో ఎక్కించుకున్నారు. ఒక మైనర్ కారు డ్రైవింగ్ చేయగా పక్కన వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు కూర్చున్నాడు. వెనుక సీటులో ఎమ్మెల్యే కుమారుడు, చింతల్మెట్ బాలుడు, ఇద్దరి మధ్యలో రొమేనియా బాలిక కూర్చుంది. సాదుద్దీన్, సైఫ్ అనే స్నేహితుడు, కార్పొరేటర్ కుమారుడు, మరో బాలుడు ఇన్నోవా కారులో బెంజ్‌ను అనుసరించారు. ఆ సమయంలో ఇన్నోవాను డ్రైవర్ జమీల్ నడిపాడు. కాన్సూ బేకరీ వద్దకు వెళ్లేటప్పుడే బాలికతో ఎమ్మెల్యే కుమారుడు, మిగతావారు అసభ్యంగా ప్రవర్తించారు. బేకరీ వద్ద ఆగాక ఈ విషయం సాదుద్దీన్కు తెలిసింది. పబ్ వద్దకు వెళ్లాలనడంతో.. బేకరీ వద్దకు వెళ్లేప్పటికి రొమేనియా బాలికకు ఆమెను పబ్‌కు తీసుకువచ్చిన స్నేహితుడి నుంచి పదేపదే ఫోన్లు వచ్చాయి. సాదుద్దీన్, మిగతావారు ఆమెను ఫోన్ మాట్లాడనివ్వలేదు. చివరికి బాలిక తన స్నేహితుడి వద్దకు వెళతానని, పబ్ వద్ద డ్రాప్ చేయాలని కోరింది. దీన్ని అలుసుగా తీసుకున్న సాదుద్దీన్, మిగతావారు ఆమెపై అఘాయిత్యానికి ప్లాన్ చేశారు. హైదర్‌గూడ బాలుడు పథకం ప్రకారం బెంజ్ కారులో డీజిల్ లేదని చెప్పాడు. జమీల్, సైఫ్ బేకరీ వద్దే ఆగిపోగా.. బాలిక, మిగతావారు ఇన్నోవాలో ఎక్కారు. దానిని కార్పొరేటర్ కుమారుడు నడపగా.. పక్కన హైదర్‌గూడ బాలుడు కూర్చున్నాడు. మధ్య సీట్లలో ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు, వెనుక సీట్లలో చింతల్మెట్ బాలుడు, రొమేనియా బాలిక కూర్చున్నారు. కొంతదూరం వెళ్లాక ఓ ఫోన్‌కాల్ రావడంతో ఎమ్మెల్యే కుమారుడు ఇన్నోవా దిగి వెళ్లిపోయాడు. మిగతావారు బాలికను తీసుకుని రోడ్ నంబర్ 44లోని పవర్‌స్టేషన్ పరిసరాల్లో నిర్మానుష్య ప్రాంతంలో ఇన్నోవా ఆపారు. బాలికను కారులో ఉంచి అంతా కిందికి దిగారు. ఆపై చింతల్మెట్ బాలుడు, సాదుద్దీన్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు, హైదర్‌గూడ బాలుడు, కార్పొరేటర్ కుమారుడు ఒకరి తర్వాత ఒకరు కారులో ఎక్కి ఆమెపై అఘాయిత్యం చేశారు. తర్వాత బాలికను పబ్ వద్ద వదిలేశారు. జరిగిన విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి వెళ్లిపోయారు. గత నెల 31 వరకు ఎవరి ఇళ్లలో వారు ఉన్నారు. ఆ రోజు కేసు విషయం బయటికి రావడంతో ఫోన్లు స్విచాఫ్ చేసుకుని పరారయ్యారు. గాయాలు చేసి.. బెదిరించి.. నిందితులు అఘాయిత్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన బాలిక శరీరంపై గోళ్లతో రక్కి, కొరికి గాయాలు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులకు నివేదిక ఇచ్చిన వైద్యులు.. బాధితురాలి ఒంటిపై 12 గాయాలు ఉన్నట్టు గుర్తించారు. మెడపై తీవ్రగాయాలు ఉన్నట్టు పేర్కొన్నారు. బాలికపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు ఫేస్బుక్లో ఉన్నాయి. వాటిని తొలగించాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ సంస్థకునోటీసులిచ్చారు. పోలీసు కస్టడీకి ఎమ్మెల్యే కుమారుడు రొమేనియా బాలికపై అఘాయిత్యం కేసులో జువెనైల్ కోర్టు తొలుత ముగ్గురు మైనర్లను.. తర్వాత ఎమ్మెల్యే కుమారుడు, మరో మైనర్‌ను పోలీసు కస్టడీకి అనుమతించింది. తొలుత అనుమతించిన మేరకు పోలీసులు శుక్రవారం ముగ్గురు మైనర్లను జువెనైల్ హోంలో విచారించారు. శనివారం నుంచి మొత్తం ఐదుగురు మైనర్లను ఠాణాకు తరలించి ప్రశ్నించనున్నారు. సివిల్ దుస్తుల్లో ఉండే పోలీసులు రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. న్యాయవాదుల సమక్షంలో వారిని విచారించనున్నారు. ఒక్కొక్కరిని విడివిడిగా, ఆపై అందరినీ ఒకేసారి ప్రశ్నిస్తూ.. సాదుద్దీన్ వాంగ్మూలంలోని అంశాలు, సీసీ కెమెరా ఫుటేజీలను ప్రస్తావిస్తూ విచారణ చేయనున్నారు. మరోవైపు ‘కారులో బాలిక’ వీడియోలను వైరల్ చేసిన మరో ఇద్దరిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. -
ట్రాప్ చేసింది ప్రజాప్రతినిధుల కుమారులే!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రొమేనియా బాలికపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి ప్రజాప్రతినిధుల కుమారులే కీలక సూత్రధారులని నిందితుడు సాదుద్దీన్ పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. పబ్ దగ్గర మాటలు కలిపింది, కారులో అసభ్య ప్రవర్తన మొదలుపెట్టింది వారేనని పేర్కొన్నట్టు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఘటనకు సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైప ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ జువెనైల్ జస్టిస్ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు వారిని శుక్రవారం నుంచి తమ కస్టడీలో విచారించనున్నారు. రెండు నెలలుగా పరిచయం వెస్ట్‌జోన్ అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ, బంజారాహిల్స్ ఏసీపీ మంత్రి సుదర్శన్ నేతృత్వంలోని బృందాలు సాదుద్దీన్‌ను విచారిస్తున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు మైనర్లతో పరిచయం సహా మొత్తం ఘటన వివరాలను రాబట్టడంపై దృష్టిపెట్టారు. పోలీసువర్గాల సమాచారం మేరకు.. ఐదుగురు మైనర్లతో తనకు దాదాపు రెండు నెలల పరిచయమైందని సాదుద్దీన్ చెప్పాడు. ఘటన జరిగిన రోజున తాను వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడితో కలిసి ఇన్నోవా కారులో పబ్‌కు వచ్చానని.. కారును డ్రైవర్ జమీల్ నడిపాడని వివరించాడు. ఓ స్నేహితుడితో కలిసి అమ్నీషియా పబ్‌కు వచ్చిన బాలికను మొదట వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు పరిచయం చేసుకున్నాడని.. పొరుగు జిల్లాకు చెందిన కార్పొరేటర్ కుమారుడు ఆమెతో మాటలు కలిపాడని, తర్వాత తానూ అక్కడికి వెళ్లానని వివరించాడు. తానేంటో హోదా చెప్తూ.. కాసేపటికి ఆరుగురం ఆమె వద్దకు వెళ్లి మాట్లాడటం మొదలెట్టామని.. దీంతో విసుగు చెందిన బాలిక పబ్ నుంచి బయటికి వెళ్లడంతో వెనకే వెళ్లామని సాదుద్దీన్ వివరించాడు. పబ్ బయట ఎమ్మెల్యే కుమారుడు ఆమెతో మాటలు కలిపాడని.. తన హోదా, ఇతర అంశాలు చెప్తూ ట్రాప్ చేసి, ఇంటి వద్ద దింపుతానంటూ బెంజ్ కారులో ఎక్కించుకున్నాడని తెలిపాడు. బెంజ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆమెతో అసభ్య ప్రవర్తన మొదలుపెట్టినది ఎమ్మెల్యే కుమారుడేనని, తర్వాత ఒకరొకరుగా బెంజ్‌కారులో ఉన్న నలుగురూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని సాదుద్దీన్ చెప్పాడు. ఆ సమయంలో తాను వెనుక ఉన్న ఇన్నోవాలో ఉన్నానని పేర్కొన్నాడు. బాలిక ఇల్లు బంజారాహిల్స్‌లోని కాన్సూ బేకరీ సమీపంలోనే ఉందని చెప్పిందని.. అటుగా వెళ్తూనే తమ కారును కాన్సూ బేకరీ పార్కింగ్‌లోకి తీసుకువెళ్లామని వివరించాడు. అక్కడ కార్పొరేటర్ కుమారుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడని తెలిపాడు. వాంగ్మూలాలను సరిచూస్తూ.. సాదుద్దీన్‌ను విచారిస్తున్న పోలీసులు అతడిని అరెస్టు చేసినప్పుడు ఇచ్చిన ఎనిమిది పేజీల వాంగ్మూలాన్ని.. తర్వాత పట్టుబడిన మైనర్లు ఇచ్చిన వాంగ్మూలాలను సరిపోలుస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన రోజున వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను సాదుద్దీన్కు చూపిస్తూ కొన్ని అంశాలపై స్పష్టతకు వస్తున్నారు. కాన్సూ బేకరీ దగ్గర బాలిక ఇన్నోవాలోకి ఎక్కిన తర్వాత అప్పటివరకు ముందు సీట్లో ఉన్న సాదుద్దీన్ వెనుక సీట్లోకి మారాడని గుర్తించారు. అంతకన్నా ముందే బాలిక బెంజ్ కారులో ఉండగానే ఆమె సెల్‌ఫోన్, కళ్లజోడును ఎమ్మెల్యే కుమారుడు లాక్కున్నాడని.. అవి తిరిగి ఇవ్వాలంటే ఇన్నోవా కారులో ఎక్కాలని బెదిరించాడని సాదుద్దీన్ వెల్లడించాడు. బాధితురాలితో గుర్తింపు పరేడ్ కోసం ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి నుంచి రక్త నమూనాల సేకరణ, బాధితురాలి ద్వారా టెస్ట్ ఐడెంటిఫికేషన్ (టీఐ) పరేడ్ నిర్వహణకు అనుమతి కోరుతూ పోలీసులు ఆయా కోర్టుల్లో పిటిషన్లు వేశారు. న్యాయమూర్తి సమక్షంలో జైలులో జరిగే టీఐ పెరేడ్, వాహనాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నమూనాల విశ్లేషణ, డీఎన్ఏ పరీక్షలు వంటివి నేర నిరూపణలో కీలకం కానున్నాయి. ఘటన సమయంలో నిందితులు ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పగలు ఠాణాలో.. రాత్రికి హోమ్‌లో.. గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు మైనర్లను నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జువైనల్ కోర్టు గురువారం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి పోలీసులు వారిని విచారించనున్నారు. చట్టప్రకారం వారిని పగటిపూట ఠాణాలో విచారిస్తూ.. రాత్రివేళల్లో జువైనల్ హోమ్‌కే తరలించనున్నారు. ఇప్పటికే సాదుద్దీన్ పోలీసు కస్టడీలో ఉండటంతో శుక్రవారం నుంచి ఆరుగురినీ కలిపి విచారించాలని నిర్ణయించారు. ఇక ఢిల్లీ నిర్భయ కేసు విచారణను ప్రస్తావిస్తూ.. ఈ కేసులోనూ మైనర్లుగా ఉన్న వారిని మేజర్లుగా పరిగణిస్తూ ట్రయల్ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి కోరనున్నారు. -
సరదాగా కలుద్దామన్నాడు.. స్టార్ హోటల్లో కాటేశాడు
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో పరిచయమైన మహిళపై కన్నేశాడు. సరదాగా కలుద్దామన్నాడు. నమ్మకం కలిగేలా ప్రవర్తించాడు. స్టార్ హోటల్‌కు తీసుకెళ్లాడు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ముఖం చాటేశాడు. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా వ్యాపారి ఢిల్లీలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అక్కడి ద్వారక పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఎస్సై కునాల్ కుమార్ నేతృత్వంలోని బృందం బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంది. బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి తృటిలో తప్పించుకున్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తోంది. టిండర్ యాప్ ద్వారా పరిచయం నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన మొహక్ గుప్తాకు ఉత్తరాఖండ్‌లోని రుషికేష్‌తో పాటు ఢిల్లీలో కంపెనీ, కార్యాలయాలు ఉన్నాయి. ఢిల్లీలోని ద్వారక సెక్టార్ 23లో ఓ ఇల్లు కూడా ఉంది. ఈయనకు టిండర్ యాప్ ద్వారా అక్కడి గురుద్వార సింగ్ సభ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పరిచయమైంది. ఈ వివాహిత 2017 నుంచి తన భర్తకు దూరంగా పిల్లలతో కలిసి ఉంటోంది. గత నెల్లో ఢిల్లీలో ఉన్న గుప్తా 27న ఆమెకు ఫోన్ చేశాడు. ఆ రోజు రాత్రి సరదాగా కలుద్దామని చెప్పాడు. దీంతో సదరు వివాహిత తన సోదరితో వచ్చి ఓ కెఫేలో అతన్ని కలిసింది. డిన్నర్ చేస్తున్న సమయంలో మొహక్ ఆమె వద్ద ప్రేమ ప్రతిపాదన చేశాడు. అయితే ఆమె జవాబు దాటవేసింది. తొలుత మర్యాదగా ప్రవర్తించి.. మరుసటి రోజు మరోసారి ఫోన్ చేసి కలవాలని ఉందంటూ చెప్పాడు. దీంతో ఆమె మెట్రో రైల్లో ద్వారక స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ తన బీఎండబ్ల్యూ కారుతో వేచి ఉన్న మొహక్ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాక కారు ఆపి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఆమెకు నమ్మకం కలిగించేందుకు గుప్తా చాలా మర్యాదగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో గత నెల 30న ఆమెపై అఘాయిత్యానికి పథకం వేశాడు. ఫోన్ చేసి రప్పించాడు. ప్రేమ, పెళ్లి విషయాలు మాట్లాడుకుందామంటూ సమీపంలోని ఓ స్టార్ హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఎలాంటి అంతరాయాలు లేకుండా మాట్లాడుకుందామని చెప్పి రూమ్ బుక్ చేశాడు. మత్తులో ఉండగా ... హోటల్ గదిలోకి వెళ్లిన తర్వాత కూడా కొద్దిసేపు నమ్మకంగా ప్రవర్తించిన మొహక్.. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. మత్తులో ఉన్న మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు హోటల్ నుంచి వెళ్తూ పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి హైదరాబాద్ వచ్చేశాడు. తర్వాత ఆమె ఎంత ప్రయత్నించినా ఫోన్ స్విచ్చాఫ్ రావడం, ఒకవేళ ఫోన్ కలిసినా సరైన స్పందన లేకపోవడంతో.. తనపై అఘాయిత్యం చేయడానికే మొహక్ పథకం వేశాడని గ్రహించి గత శుక్రవారం ద్వారక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గుప్తాపై అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించారు. వెనుక గోడ దూకి పరారీ మొహక్ స్టార్ హోటల్లో ఇచ్చిన గుర్తింపు కార్డులతో పాటు ఫోన్ నంబర్ ఆధారంగా అతను హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం సాయంత్రం అతని ఇంటిపై దాడి చేశారు. అయితే విషయం గమనించిన గుప్తా ఇంటి వెనుక గోడ దూకి పరారయ్యాడు. దీంతో నగరంలోనే బస చేసిన ఢిల్లీ పోలీసు బృందం మొహక్ కోసం గాలిస్తోంది. ఇంటితో పాటు సోమాజిగూడలో ఉన్న మొహక్ ఆఫీసు, మరికొన్ని ప్రాంతాల్లోనూ నిఘా వేసి ఉంచింది. -
అత్యాచార ఘటనలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన అత్యాచార ఘటన లపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన మైనర్ బాలిక అత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ రాష్ట్ర డీజీపీని పూర్తిస్థాయి నివేదిక కోరింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ మంగళవారం డీజీపీ మహేందర్ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. రాష్ట్రంలో వరుసగా జరిగిన ఐదు అత్యాచార ఘటన లపై ఏడు రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక అందించాలని కమిషన్ ఆదేశించింది. ఐదు అత్యాచార ఘటనల్లో ముగ్గురు మైనర్ బాలికలు బాధితులు కావడంతో మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనల్ని సుమోటోగా స్వీకరించినట్లు పేర్కొంది. పోలీస్ శాఖ నేరాలు జరగకుండా చూసుకోవడమేకాక, ఇలాంటి అత్యాచార ఘటనల్లో నిందితులను త్వరితగతిన గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచిం చింది. ఇదే అంశంపై హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్‌కు సైతం మరో లేఖ రాసినట్టు రేఖ శర్మ వెల్లడించారు. -
సీబీఐ విచారణ జరిపించాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: సామూహిక అత్యాచార కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ కేసులో హోంమంత్రి మనవడు, ఎంఐఎం ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారులతోపాటు టీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయని అన్నారు. వారందరిపై కేసుల్లేకుండా తప్పించాలని సీఎంవో నుంచి పోలీసులకు ఆదేశాలొచ్చాయని ఆరోపించారు. ఈ మేరకు కేసును నీరుగార్చేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. గతనెల 28న జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఒక బాలికపై అత్యాచారం జరిగిందని, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. శుక్రవారంరాత్రి బీజేపీ కార్యాలయంలో సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఇన్ని రోజులు గడిచినా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ ఘటనను గోప్యంగా ఎందుకు ఉంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘పోలీసులు, ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. అత్యాచారాలకు, నేరస్తులకు హైదరాబాద్ అడ్డాగా మారింది. హోంమం త్రిపైనే ఆరోపణలొస్తుంటే, ట్విట్టర్ పిట్ట హోంమంత్రితోనే విచారణ జరిపించాలని ఆదేశిస్తారా? ట్విట్టర్ పిట్ట చెబితే తప్ప స్పం దించరా? దీనిని ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై మతంరంగు పులిమి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. అత్యాచారానికి గురైన బాలికది ఏ మతమో మాకు ఇంతవరకు తెలియదు. బీజేపీ మానవతా దృక్పథంతో మాత్రమే స్పందిస్తోంది’అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నిర్వహించిందెవరో.. జూబ్లీహిల్స్ పరిధిలోని ఆమ్నీషియా పబ్‌లో పార్టీ నిర్వహించిందెవరు, ఆ పార్టీకి బాధిత బాలికను పిలిచిందెవరు, అత్యాచారం చేసినవారు ఎవరెవరో స్పష్టంగా ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు స్పందించలేదని సంజయ్ ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు ఎందుకు నమోదు చేయలేదని నిలదీశారు. ‘అత్యాచారం జరిగి 5 రోజులైనా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడంలేదు. బాలికపై అత్యాచారం జరిగితే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి, మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం రికార్డు చేయాలి. కానీ, ఇక్కడెందుకు ఆ పనిచేయడం లేదు? సీసీ ఫుటేజీలో అన్ని ఆధారాలు రికార్డై ఉన్నాయి. ఇన్ని రోజులపాటు సీసీ పుటేజీలు ఎందుకు దొరకలేదు? హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ లేదా?’ అని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లిప్తత వల్ల పోలీస్ వ్యవస్థ మీద రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది’ అని సంజయ్ ధ్వజమెత్తారు. -
ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడి
చోడవరం: అభం శుభం తెలియని 8 ఏళ్ల చిన్నారిపై ఒక కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారిని జీడి తోటల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడి పళ్లు కోద్దాం రమ్మని నమ్మబలికి అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన 8 ఏళ్ల వయస్సు గల చిన్నారిని అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం జీడితోటల్లో తీసుకువెళ్లాడు. ఎవరూ లేని చోట ఆ చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలు 2వ తరగతి చదువుతోంది. ఆ బాలిక తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు చోడవరం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ విభూషణరావు దర్యాప్తు ప్రారంభించి పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. దాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నామని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించామని ఎస్ఐ తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. వారికి గ్రామస్తులు అండగా నిలిచారు. -
లైంగికదాడి కేసులో నిందితుల అరెస్టు
నిజామాబాద్ సిటీ: మానసిక దివ్యాంగురా లిపై లైంగిక దాడి చేసి ఆమె గర్భం దాల్చడానికి కారణమైన కానిస్టేబుల్, మరో నిందితుడైన బాధితురాలి పెదనాన్నను, వీరికి సహకరించిన పెద్దమ్మను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఆ వివరాలను నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్‌కాలనీకి చెందిన ఓ యువతి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. తన పెద్దమ్మ రామవ్వ దగ్గర ఉంటోంది. కాగా రామవ్వకు పరిచయమున్న ఏఆర్ కానిస్టేబుల్‌తోపాటు, రామవ్వ భర్త, యువతికి పెదనాన్న వరసైన గంగారాం కూడా మూడేళ్లుగా యువతిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. గురువారం మరోసారి దాడికి ప్రయతి్నస్తుండగా గమనించిన స్థానికులు అతనికి దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. -
ప్రియుడే కాలయముడు
పరిగి: మైనర్‌పై అత్యాచారం, హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రేమికుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ‘పూడూరు మండలం అంగడిచిట్టంపల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని (15), అదే గ్రామానికి చెందిన కావలి మహేందర్ (నాని) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ వ్యవహారం మైనర్ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో 27వ తేదీన కూతురును తల్లి మందలించింది. ఈ విషయాన్ని సదరు మైనర్ మహేందర్‌కు చెప్పడంతో 28న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రమ్మని చెప్పాడు. లైంగిక వాంఛ తీర్చాలని మహేందర్ ఒత్తిడి చేయడంతో ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యతోపులాట జరిగింది. ఆమెను పక్కకుతోయడంతో తలకు బలమైన గాయమై స్పృహ కోల్పోయింది. అదే సమయంలో ఆమెపై అత్యాచారం చేయడంతో ఊపిరి ఆడక మైనర్ మృతి చెందింది. చనిపోయిందని నిర్ధారించుకున్నాక మహేందర్ తన స్నేహితుడు సుఖిందర్ ఇంటికి వెళ్లాడు. తెల్లారాక ఇద్దరూ కలసి ఘటనా స్థలంలో దూరం నుంచి మరోసారి మైనర్ మృతదేహాన్ని చూసి వెళ్లిపోయారు’అని ఎస్పీ చెప్పారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. తల్లిని కూడా విచారించామని, అయితే ఆమె పాత్ర లేదని చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. అబ్బాయిల ప్రలోభాలకు అమ్మాయిలు గురికావొద్దని ఎస్పీ సూచించారు. ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. -
విద్యార్థిని స్నేహితుడే హతమార్చాడా..?
వికారాబాద్: పదో తరగతి విద్యార్థిని హత్య ఘటనలో విస్మయకర విషయాలు బహిర్గతమైనట్టు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా అంగడి చిట్టెంపల్లిలో పదిహేనేళ్ల విద్యార్థినిని హతమార్చిన ఘటన సోమవారం వెలుగుచూసిన విషయం తెలి సిందే. కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు బృందా లుగా ఏర్పడి అనేక కోణాల్లో దర్యాప్తును ముమ్మ రం చేశారు. ఆ విద్యార్థినితో ప్రేమ పేరిట సన్నిహితంగా మెలిగిన ఓ యువకుడిని ప్రధాన నిందితుడిగా భావిస్తూ దర్యాప్తు చేపట్టారు. అతనితోపాటు మరో స్పేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం విద్యార్థిని తల్లిని, ఆమెతో సన్నిహితంగా ఉండే మరోవ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో తల్లిపాత్ర కూడా ఏమైనా ఉందా..? అనే కోణంలోనూ విచారిస్తున్నట్టు సమాచారం. పోలీసులు హైదరాబాద్ నుంచి రప్పించిన క్లూస్ టీం ద్వారా మంగళవారం మరోసారి ఆధారాలు సేకరించారు. ఆ యువకుడే హత్య చేశాడా?: కొంతకాలంగా విద్యార్థినిని ప్రేమపేరిట వేధిస్తున్న యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో బయటపడిందని తెలుస్తోంది. సోమవా రం తెల్లవారుజామున 3–00 గంటల ప్రాంతంలోనేవిద్యార్థినిని ఇంటి నుంచి తీసుకువెళ్లిన యువకుడు అప్పటికే పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్టు, మరోసారి బలవంతంగా లైంగిక దాడికి యత్నించగా విద్యార్థిని అంగీకరించకపోవటంతో హత్య చేసినట్టు తెలుస్తోంది. విద్యార్థినిని తీసుకువెళ్లటానికి ముందే అతడు స్నేహితుడితో కలసి మద్యం తాగినట్టుగా పోలీసుల విచారణలో అంగీకరించినట్టు సమాచారం. అయితే లైంగికదాడికి పాల్పడింది అతడొక్కడేనా.. అతడి స్నేహితుల పాత్ర కూడా ఉందా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిందితులు వెల్లడించిన విషయాలకు సాంకేతికతను జోడించి సరిపోల్చి నిర్ధారణకు వచ్చేందుకే కొంత సమయం తీసుకుంటున్నట్టు పోలీసువర్గాలు భావిస్తున్నాయి. ఎస్పీ కోటిరెడ్డి, అడిషనల్ ఎస్పీ రషీద్, డీఎస్పీ శ్రీనివాస్ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తుండగా సీఐ వెంకటరామయ్య, ఎస్ఐ శ్రీశైలం ఇతర పోలీసు బృందాలతో కలసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు బుధవారం కేసు విషయాలు వెల్లడించే అవకాశముంది. -
Marital Rape: కూతురి ముందే అసహజ శృంగారం.. భర్తకు చెంపపెట్టు
బెంగళూరు: వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని.. నేరంగా పరిగణించాలంటూ తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఓ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇవాళ(బుధవారం) కీలక ఆదేశాలు ఇచ్చింది. వివాహం జరిగినప్పటి నుంచి తనని భర్త ఒక సెక్స్ బానిసగానే చూస్తున్నాడని, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడని, చివరికి కూతురి ముందే అదీ అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నాడంటూ కోర్టుకెక్కింది ఓ బాధితురాలు. ఈ క్రమంలో ఆమె అత్యాచార ఆరోపణల కింద కోర్టును ఆశ్రయించింది. అయితే ఐపీసీ సెక్షన్ 375 కింద నమోదు అయిన కేసును కొట్టేయాలంటూ సదరు భర్త కోర్టులో అభ్యర్థన దాఖలు చేయగా.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న కీలక వ్యాఖ్యలు చేస్తూ సదరు భర్త అభ్యర్థనను తోసిపుచ్చారు. భార్యపై భర్త చేసే లైంగిక వేధింపులు ఆమె మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. భర్తల ఇలాంటి చేష్టలు.. భార్యల ఆత్మకు మాయని మచ్చను మిగులుస్తాయి. అనాదిగా.. భర్తలు తమ భార్యలకు తామే పాలకులని భావిస్తున్నారు. భార్యల శరీరం, మనస్సు, ఆత్మను అన్నింటిని అణచివేయాలనే ఆలోచన బలంగా నాటుకుపోయిందని జస్టిస్ నాగప్రసన్న వ్యాఖ్యానించారు. వివాహం అనేది మనిషిలోని మృగాన్ని బయటకు రప్పించి.. భార్యలను శారీరకంగా హింసించేందుకు దొరికిన లైసెన్స్ కాదంటూ వ్యాఖ్యానించారాయన. కాబట్టి, భార్యతో బలవంతపు శృంగారం చేస్తూ.. ఆమెనొక సెక్స్ బానిసగా చూస్తున్న మీకు(భర్తకు) ఈ కేసు నుంచి విముక్తి ఇవ్వడం కుదరదు అంటూ పిటిషన్‌ను ఏకసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. అత్యాచారమే అవుతుంది భార్యపై భర్త చేసే లైంగిక దాడిని.. అత్యాచారంగా పరిగణించేందుకు నిర్దిష్టమైన చట్టం లేకపోవచ్చు. అయితే మినహాయింపులనేవి కొన్ని ఏళ్ల కిందటివని న్యాయమూర్తి ప్రస్తావించారు. పీనల్ కోడ్ చట్టాలు, అందులో సెక్షన్లు ఎప్పటివో. మధ్యయుగ చట్టంలో.. భర్తలు తమ భార్యలపై తమ అధికారాన్ని ఉపయోగించుకునే ఒప్పందంలో భాగంగా ఆ చట్టాలు పుట్టుకొచ్చాయి. కానీ, స్వాతంత్ర్యం వచ్చాక మనం రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం. అందులో సమానత్వం అనేది ఒకటి ఉంది. నా దృష్టిలో.. మనిషంటే మనిషి. చట్టం అంటే చట్టం. అత్యాచారం అంటే అత్యాచారం, అది స్త్రీ అయిన భార్యపై పురుషుడైన భర్త చేసినా సరే అని పేర్కొన్నారు న్యాయమూర్తి. నేరంగా గుర్తించకపోయినా.. వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని.. అత్యాచారంగా, తీవ్ర నేరంగా పరిగణించడం గురించి మేం చర్చించ దల్చుకోలేదు. ఎందుకంటే అది చట్టసభలకు సంబంధించిన అంశం. కేవలం భార్యపై అఘాయిత్యానికి పాల్పడుతున్న భర్త విషయంలో మాత్రమే మేం ఈ ఆదేశాలు ఇస్తున్నాం అని ప్రత్యేకంగా ప్రస్తావించారు హైకోర్టు న్యాయమూర్తి. ఈ సమాజంలో భర్త అయినా ఇంకెవరైనా అత్యాచార ఆరోపణలకు అతీతులేం కారని, అలా చేస్తే.. చట్టం ముందు అసమానత్వం ప్రదర్శించడమే కాకుండా.. రాజ్యాంగాన్ని అవమానించినట్లు అవుతుందని బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘రాజ్యాంగానికి అంతా సమానమే. నేరం ఎవరు చేసినా నేరమే!. అత్యాచార సెక్షన్‌కూ మినహాయింపు ఉండద’ని అన్నారు. చాలా దేశాలు మారిటల్ రేప్‌ను గుర్తిస్తున్నాయని ఈ సందర్భంగా జస్టిస్ నాగప్రసన్న ప్రత్యేకంగా ప్రస్తావించారు. -
సుప్రియ ఆత్మహత్య కేసులో నలుగురు అరెస్టు
నెల్లికుదురు/కురవి/మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన సుప్రియ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎస్పీ శరత్చంద్ర పవార్ నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. స్నేహితురాలి ఇంటికి వెళ్లిన సుప్రియపై నిందితులు రెండు రోజులు లైంగిక దాడికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఆలేరు గ్రామానికి చెందిన సుప్రియ లైంగిక దాడి గురించి ఎవరికీ చెప్పుకోలేక మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నెల 18న ఆమె పురుగు మందు తాగడంతో చికిత్స పొందుతూ 22వ తేదీన మృతిచెందింది. నిందితులను విచారించి రిమాండ్‌కు తరలించామని ఎస్పీ తెలిపారు. వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు కోర్టులో కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, సుప్రియ ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుప్రియ కుటుంబానికి న్యాయం చేసి, దోషులను కఠినంగా శిక్షించాలంటూ మహబూబాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద బీజేపీ, ప్రగతిశీల మహిళా సంఘం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ, టీడీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీస్ పహారాలో సుప్రియ మృతదేహాన్ని ఆలేరుకు తరలించారు. -
అత్యంత ఘోరం! మైనర్ బాలికపై అత్యాచారం.. మృతి చెందినా వదల్లేదు
Accused continued to rape Bundi girl even after her death: సమాజంలో మహిళలకు భద్రత కరువైందని అనాలో లేక వాళ్ల మనుగడే ప్రశ్నర్థకంగా ఉందని చెప్పాలో తెలియడం లేదు. స్త్రీలపై జరుగుతున్న భయంకరమైన అత్యాచారాలను గురించి వింటుంటే శరీరం గగుర్పాటుకు గురవ్వకుండా ఉండదు. మరీ ఇంత అమానుషంగా, క్రూరంగా ప్రవర్తిస్తున్న వాళ్లను చూస్తే అసహ్యం కలగక మానదు. ఇదేకోవలో రాజస్థాన్‌కి చెందిన 16 ఏళ్ల బాలికను ముగ్గురు కిరాతుకులు అత్యంత ధారుణంగా అత్యాచారం చేసి చంపిన ఘటన తాజాగా కలకలం రేపుతోంది. (చదవండి: ఎంత పె...ద్ద.. ‘పేరు’!) పోలీసుల కథనం ప్రకారం...రాజస్థాన్‌లోని బుండీకి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక మేకలు మేపేందుకు వెళ్లి డిసెంబర్ 23న అదృశ్యమైంది . ఆ తర్వాత ఆమె బుండీకి సమీపంలోని అడవుల్లో శవమై పడి ఉంది. ఈ మేరకు పోస్ట్ మార్టంలో చాలా భయంకరమైన విషయాలు బయట పడ్డాయి . ఆ బాలిక పై ముగ్గురు వ్యక్తులు సాముహికంగా అత్యాచారం చేసి చంపేశారని నివేదిక పేర్కొంది. అంతేకాదు ఆ బాలిక ప్రతిఘటించటంతో గొంతు నులిమి చంపారని తెలిపింది. అయితే బాలిక చనిపోయిన తర్వాత కూడా అత్యాచారం కొనసాగించారని, పైగా ఆమె ప్రైవేట్ భాగాల్లో 30కి పైగా గాయలయ్యాయని పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది. ఈ మేరకు బుండీ పోలీసులు మాట్లాడుతూ..."నా జీవితంలో ఇంత దారుణమైన సంఘటన చూడలేదు. బుండీ బార్ అసోసియేషన్ సభ్యులు కూడా తాము నిందితుల తరుఫున వాదించమని ప్రకటించారు" అని అన్నారు. (చదవండి: మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే పుట్టిన బామ్మ బర్త్‌డే!)