సాక్షి, కృష్ణా : కృష్ణా జిల్లా జి. కొండూరు మండలం మునగపాడులో గురువారం దారుణం చోటుచేసుకుంది. మూడా బాలు అనే వ్యక్తి 45 సంవత్సరాల మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆపై మర్మాంగాన్ని కోసేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితురాలిని వైద్య పరీక్షల నిమ్మిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. కాగా బాధితురాలు నిందితుడికి చిన్నమ్మ వరుస అవుతుందని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment