person arrest
-
క్రైం సీరియల్ చూసి.. బాలిక కిడ్నాప్
సాక్షి,బెంగళూరు : ఓ హిందీ టీవీ చానెల్లో ప్రసారమయ్యే క్రైం ప్యాట్రోల్ సీరియల్ చూసి ఓ యువకుడు బాలికను అపహరించగా, గంట వ్యవధిలో పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. ఈ సంఘటన బెంగళూరు కాటన్‌పేటే పీఎస్ పరిధిలో జరిగింది. బసవనగుడి బుల్‌టెంపుల్ రోడ్డు చిరాగ్ ఆర్.మెహతా (21) పోలీసులకు పట్టుబడిన యువకుడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కేథరిన్ స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న 4వ తరగతి బాలికను చిరాగ్ మెహతా అపహరించి బాడుగ స్కూటర్లో ఉడాయించాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తండ్రి హీరాలాల్ తక్షణం పోలీసులకు సమాచారం అందించాడు. కాటన్‌పేటే సీఐ టీసీ.వెంకటేశ్ ల్యావెల్లీ రోడ్డు వద్ద వెళుతున్న చిరాగ్ మెహతాను పట్టుకుని బాలికను కాపాడారు. బాలిక తండ్రి హీరాలాల్, కాటన్‌పేటె మెయిన్‌రోడ్డులో నివాసముంటూ చిక్కపేటేలో ఎలక్ట్రిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద డబ్బు గుంజాలని దుండగుడు ఈ పథకం వేశాడు. చిరాగ్ మెహతా తండ్రి రాకేశ్ పెండ్లిపత్రికల దుకాణం నిర్వహిస్తుండేవాడు. టీవీ సీరియల్లో చూసి బాలికను కిడ్నాప్ చేసినట్లు నిందితుడు విచారణలో చెప్పాడు. కేసు విచారణలో ఉంది. -
అత్యాచారం చేసి ఆపై మర్మాంగం కోసేశాడు
సాక్షి, కృష్ణా : కృష్ణా జిల్లా జి. కొండూరు మండలం మునగపాడులో గురువారం దారుణం చోటుచేసుకుంది. మూడా బాలు అనే వ్యక్తి 45 సంవత్సరాల మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆపై మర్మాంగాన్ని కోసేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితురాలిని వైద్య పరీక్షల నిమ్మిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. కాగా బాధితురాలు నిందితుడికి చిన్నమ్మ వరుస అవుతుందని పోలీసులు వెల్లడించారు. -
వైఎస్ జగన్‌పై అసభ్యకర పోస్టింగ్.. వ్యక్తి అరెస్ట్
సాక్షి, విడపనకల్లు(అనంతపురం) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పై గడేకల్లుకు చెందిన రాజేష్ ఈ నెల 12న ఫేస్బుక్లో అసభ్యకరమైన వీడియోను పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు రాజేష్‌ను బుధవారం రాత్రి విడపనకల్లులో అరెస్ట్ చేశారు. అసభ్యకర పోస్టులు పెట్టినందుకు గాను రాజేశ్‌పై ఐపీసీ 59/19 యూ/505(2), 507, 153ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా నిందితుడికి రిమాండ్ విధించారని ఎస్ఐ గోపీ బుధవారం తెలిపారు. -
‘రైస్ పుల్లర్స్’ మాయగాడు అరెస్టు
సాక్షి, కొందుర్గు: ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం ఇలా ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేస్తేనే తప్పా జీవనం సాగించేది కష్టంగా మారింది. కానీ సంపాదనకు ఓ రాజామార్గం ఉందని, రూ.10 లక్షల పెట్టుబడి పెడితే వారంలో కోటి రూపాయలు సంపాదించవచ్చని అమాయకులను నమ్మించి మోసం చేసి రూ.కోట్లు గడించిన ఓ మాయగాడు గురువారం జిల్లేడ్‌చౌదరిగూడ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా వీరబల్లి మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములుగౌడ్ తన చిన్నతనంలో కుటుంబాన్ని విడిచి కేరళ వెళ్లాడు. మతం మార్చుకొని రెహమాన్ సాబ్‌గా పేరు మార్చుకొని ఎత్తి వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ జాతకరాళ్ల వ్యాపారం చేసేవాడు. అతడి కూమారుడు మహ్మద్ ఆసిఫ్ తన మామ స్వగ్రామం వరంగల్ వచ్చి సెంటు, అల్వా బిజినెస్ చేసేవాడు. అనంతర జాతకరాళ్ల వ్యాపారం చేసేవాడు. కాలక్రమేణ హైదరాబాద్ బహద్దూర్‌పూరాలో సూర్యప్రకాష్ అనే వ్యక్తితో ఆసిఫ్‌కు పరిచయం ఏర్పడింది. అతడి సలహా మేరకు పాతకాలం లోహపుకాయిన్ వస్తువులకు అతీతమైన శక్తి ఉంటుందని, దీంతో అపారంగా సంపాదించవచ్చని భావించారు. ఈ లోహపు వస్తువే రైస్ పుల్లర్‌గా చలామణి చేస్తూ రైస్ పుల్లర్‌తో కోట్ల రూపాయలు సంపాదించవచ్చని ఎందరో వ్యక్తులను నమ్మించి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ మోసం చేయడం మొదలెట్టాడు. ఇదే క్రమంలో జిల్లేడ్‌చౌదరిగూడ మండలం పద్మారం గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి ఇతడి వలలోపడి ఉన్న భూమిని తాకట్టుపెట్టి లక్షలు నష్టపోయారు. తెలుగు రాష్ట్రాల్లో బాధితులు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు, ముంబాయి, బెంగళూర్, తదితర ప్రాంతాల్లోని ఎందరో అమాయకులు ఇతడి వలలో పడి మోసపోయారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులు కూడా ఇతడి మాయలోపడ్డారంటే అతిశయోక్తిలేదు. ఇతడి మాయమాటలు నమ్మి మోసపోయిన వారంతా మహ్మద్ ఆసిఫ్ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారు. ఇతడి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలో రూ. 60,20,73,000 జమచేయడం జరిగిందని షాద్‌నగర్ రూరల్ సీఐ రామకృష్ణ గురువారం విలేకరులకు వెల్లడించారు. ఐదు పోలీసుస్టేషన్లలో కేసులు.. నిందితుడు మహమ్మద్ ఆసిఫ్‌పై ఇప్పటికే జిల్లేడ్ చౌదరిగూడతో పాటు షాద్‌నగర్, షాబాద్, కడప, బాలానగర్ పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. పద్మారం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కక్కులూర్ అనంతస్వామి, ఎల్కగూడెం భూపాల్‌రెడ్డి, షాద్‌నగర్ వెంకటేష్, హేమాజీపూర్ శంకర్, షాద్‌నగర్ మారుతి, నాగప్ప, జైపాల్‌రెడ్డి, మాణిక్యం, అన్వర్, జడ్చర్ల శ్రీనివాసురెడ్డి, కాటేదాన్ కుమారస్వామి తదితరులు ఆసిఫ్‌ను నమ్మి మోసపోయినవారే. ఎట్టకేలకు చిక్కిన నిందితుడు.. జిల్లేడ్‌చౌదరిగూడ పోలీసులు 2018 జనవరి 8న ఇతడిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇతడి కోసం గాలింపులు చేపట్టారు. కానీ, ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు గురువారం నిందితుడు పట్టుకున్నారు. పద్మారం గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి వద్దకు మహ్మద్ ఆసిఫ్ వెళ్తుండగా లాల్‌పహాడ్ వద్ద పోలీసులకు చిక్కినట్లు సీఐ రామకృష్ణ వెల్లడించారు. నిం దితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతడు ఇంతకాలం అమాయకులను నమ్మించి మోసం చేసి సంపాదించిన డబ్బుతో లగ్జరీ జీవితం గడిపాడని, ఎలాంటి స్థిరాస్తులు లేవని, ఇతడిపై పీడీయాక్ట్ నమోదు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి వారి మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. -
బాత్ రూంలో రహస్య కెమెరా పెట్టి..
సాక్షి, బనశంకరి: ఓ యువకుడు చేసిన వికృతచేష్టలకు కటకటాల పాలయ్యాడు. ఓ వ్యక్తి పక్కింటిలో ఉన్న బాత్రూంలో రహస్య కెమెరా అమర్చాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బనశంకరిలో చోటుచేసుకుంది. వివరాలివి.. మైకోలేఔట్ స్వారభౌమనగర్కు చెందిన జీవన్సెఠ్ ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తన ఇంటి పక్కన ఉన్న మరో ఇంటి బాత్రూంలో కెమెరా అమర్చాడు. ఉదయం స్నానాల గదిలోకి వెళ్లిన సదరు ఇంటి మహిళ కెమెరా ఉన్నట్లు గమనించి భర్తకు తెలిపింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన మైకో లేఔట్ పోలీసులు జీవన్‌ను గురువారం అరెస్టు చేశారు. -
ఇంటర్నెట్తో వాయిస్ కాల్స్ మళ్లింపు
సాక్షి, కడప అర్బన్ : సమాజంలో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ కోవలోనే ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్ మళ్లిస్తూ ప్రభుత్వ బొక్కసానికి చిల్లుపెడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కడప డీఎస్పీ షేక్ మాసూంబాషా విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని హాజీ గఫూర్‌సాబ్ వీధిలో ఉంటున్న హిమాయతుల్లా షరీఫ్ కుమారుడు షేక్ ముక్కపాలెం హఫీజుల్లా ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్‌ను అక్రమంగా మళ్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాడు. సమాచారం అందుకున్న కడప వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ, ఎస్ఐలు, సిబ్బంది అతడిని అరెస్టు చేశారు. అతని నుంచి ఒక్కొక్కటి రూ.లక్షకు పైగా విలువజేసే మూడు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(వీఓఐపీ) వస్తువులు, 120 ఒడాఫోన్, రిలయన్స్ సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారన్నారు. వీఓఐపీ ద్వారా కాల్స్ చేస్తే అది కంప్యూటర్ ద్వారా దేశంలోని అనధికారిక ఎక్స్ఛేంజిలకు వస్తుందని, అక్కడినుంచి సాధారణ కాల్స్ మాదిరి మారుతాయని ఆయన వివరించారు. ఆ కాల్స్‌ను నిందితుడు తనకు తెలిసిన సాంకేతికత, ఆధునిక పరికరాలతో సాధారణ కాల్స్ మాదిరి మార్చి డబ్బులు సంపాదించుకుంటున్నాడని డీఎస్పీ చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు. బీఎస్ఎన్ఎల్, ఇతర సెల్‌ఫోన్ సంస్థలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడన్నారు. హఫీజుల్లాకుతోడు విజయవాడలో చిరంజీవి అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తూ కాల్స్ మళ్లించడంలో నైపుణ్యం పొందాడన్నారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కృషి చేసిన చిన్నచౌక్ ఎస్ఐలు యోగేంద్ర, మోహన్, ఎస్బీ ఎస్ఐ నాగరాజు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
పోలీస్‌నంటూ బెదిరించి డబ్బు వసూలు
* మాజీ హోంగార్డుతో పాటు మరో వ్యక్తి అరెస్టు * కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రంగారెడ్డి చేవెళ్ల రూరల్: పోలీసు అధికారినంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఓ మాజీ హాంగార్డుతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సోమవారం సాయంత్రం చేవెళ్ల ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో డీఎస్పీ ఏవీ రంగారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని కందవాడ గ్రామానికి చెందిన రాయని శ్రీనివాస్ 2011లో హోంగార్డుగా ఎంపికై ఆగ్నిమాపక శాఖలో పనిచేశాడు. ఇటీవల నగరంలోని కూకట్‌పల్లిలో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని వెళ్తున్న ఓ వ్యక్తిని అతడు బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. దీంతో శ్రీనివాస్‌పై కేసు నమోదై జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. దీంతో అధికారులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటినుంచి శ్రీనివాస్ చిల్లర దొంగతనాలకు పాల్పడడం ప్రారంభించాడు. కాగా, ఎక్కడా కేసులు నమోదు కాలేదు. ఇదిలా ఉండగా, మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లికి చెందిన చాంద్‌ఖాన్, యాదయ్యలు మండలంలోని కందవాడ సమీపంలో ఉన్న ఓ ఫాంహౌస్‌లో పెయింటింగ్ పనిచేస్తున్నారు. వీరు ఆదివారం సాయంత్రం పని ముగించుకొని ఫాంహౌస్ సమీపంలో కూర్చొని బీర్ తాగుతున్నారు. అదే సమయంలో మాజీ హోంగార్డు రాయని శ్రీనివాస్ తన గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌తో కలిసి షార్ట్‌కట్ రూట్లో కందవాడకు వెళ్తున్నాడు. మద్యం తాగుతున్న చాంద్‌ఖాన్, యాదయ్యను గమనించి వారి వద్ద బైకు ఆపాడు. తన ఉన్న హోంగార్డు ఐడీకార్డుతో పాటు సెల్ఫోన్లో పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఓ ఫొటోను వారికి చూపించాడు. తాను పోలీసు అధికారిని అంటూ బెదిరించాడు. ఇలా.. బయట మద్యం తాగడం నేరం అంటూ.. వారి వద్దఉన్న రూ. 6700లను తీసుకొని పరారయ్యాడు. శ్రీనివాస్ బైక్‌పై కూడా పోలీస్ స్టిక్కర్ ఉంది. బాధితులు అదేరోజు రాత్రి చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు శ్రీనివాస్ అయి ఉండొచ్చనే అనుమానంతో అతడిని తీసుకొచ్చి బాధితులకు చూపించగా వారు గుర్తించారు. ఈమేరకు పోలీసులు డబ్బులు వసూలు చేసిన శ్రీనివాస్‌తో పాటు ఉన్న వినోద్‌కుమార్‌పై కూడా కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్ఐలు రాజశేఖర్, విజయభాస్కర్ ఉన్నారు. -
ఒక భక్తుడు.. 144 లడ్డూలు!
'ఏం నాయనా.. లడ్డూ కావాలా..?' అంటూ అడిగి మరీ వడ్డించడానికి అదేం సాదా సీదా లడ్డూ కాదు! వరల్డ్ మోస్ట్ ఫేమన్. అందుకే మరి.. కోట్ల సంఖ్యలో వచ్చే భక్తులకు సరిపడా అందించాలనే ఉద్దేశంతో పరిమిత సంఖ్యలో అందజేస్తూంటారు ఆలయ నిర్వాహకులు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.. మనం మాట్లాడుకుంటోంది తిరుమల- తిరుపతి ఏడుకొండలవాడి ప్రసాదం.. నేతి లడ్డూ గురించేనని! వెంకన్న దర్శనం అనంతరం టోకెన్ల ద్వారా పొందాల్సిన అంతటి ప్రశస్తమైన ప్రసాదం లడ్డూలు ప్రస్తుతం పక్కదారి పడుతున్నాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 144 లడ్డూల్ని కలిగి ఉన్న ఓ భక్తుణ్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆలయ ప్రాంగణంలో అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన రాథోడ్‌గా అతణ్ని గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది.. పరిమితికి మించి లడ్డులు ఎలా దొరికాయనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు. లడ్డూ ప్రసాదం విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయని గతంలోనూ వార్తలు వినవచ్చిన నేపథ్యంలో కోనేటిరాయుడి అమూల్యమైన ప్రసాదం కొందరు అక్రమంగా పొందుతుండటంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. -
మెయిన్ గేట్ దూకి లోపలకు వచ్చాడు
హైదరాబాద్ : అసెంబ్లీ ద్వారాన్ని పగులగొట్టిన ఆగంతకుడిని పోలీసులు గుర్తించారు. డీసీపీ కమలాసన్ రెడ్డి బుధవారం ఘటనాస్థలాన్ని సందర్శించి అసెంబ్లీ సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుడు వరంగల్ జిల్లాకు చెందిన అశోక్‌రెడ్డిగా గుర్తించినట్లు తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు అతడు మెయిన్ గేట్ దూకి లోపలకు వచ్చాడని చెప్పారు. అసెంబ్లీ గేట్ నెంబర్ 6 వద్ద తలుపులను పగలగొట్టాడని కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ ద్వారాన్ని బయట వ్యక్తులు బద్దలు కొట్టడం అసెంబ్లీకి భద్రత లేదనటానికి నిదర్శనమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఏపీ అసెంబ్లీ ప్రధాన ద్వారాన్ని పగులగొట్టిన వ్యక్తి
హైదరాబాద్ : అసెంబ్లీ ఆవరణలో మరోసారి భద్రత వైఫల్యం బయటపడింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రవేశ ద్వారాన్ని ఓ వ్యక్తి పగులగొట్టాడు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతను ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడ్డాడా లేక మానసిక స్థితి సరిగ్గా లేక ఈ పని చేశాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)