హైదరాబాద్ : అసెంబ్లీ ఆవరణలో మరోసారి భద్రత వైఫల్యం బయటపడింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రవేశ ద్వారాన్ని ఓ వ్యక్తి పగులగొట్టాడు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతను ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడ్డాడా లేక మానసిక స్థితి సరిగ్గా లేక ఈ పని చేశాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.