
సాక్షి, వరంగల్ : హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. కాపాడాల్సిన తండ్రే మానవత్వం మరిచి కన్న కూతూరిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా తొర్రురుకు చెందిన కుమారస్వామి వృత్తి రిత్యా కారుడ్రైవర్. కుటుంబంతో కలిసి హన్మకొండలోని కెఎల్‌ఎన్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న కుమారస్వామికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు . ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున చిన్న కూతురుపై లైంగాకదాడికి పాల్పడుతుండగా పెద్దకూతురు చూసి తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని హన్మకొండ పోలీసులకు తెలపడంతో కుమారస్వామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా మూడు నెలలుగా కూతురిపై కామవాంచ తీర్చుకుంటున్నట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment