torruru
-
అక్షర యజ్ఞం
పేదబిడ్డల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలని.. వారికి నాణ్యమైన విద్య అందాలని దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ సంస్థ అక్షర యజ్ఞం చేస్తోంది. అభాగ్యులకు అక్షరాలు నేర్పించి సమాజంలో నిలబెట్టాలని సంకల్పించింది. బడిఈడు పిల్లలకు సంస్కారవంతమైన చదువునిచ్చి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పనిచేస్తోంది ‘వందేమాతరం ఫౌండేషన్’. – తొర్రూరుతొర్రూరు కేంద్రంగా..మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంగా కొనసాగుతున్న వందేమాతరం ఫౌండేషన్ ఎందరో సామాన్య పేదబిడ్డలను అసామాన్యులుగా తీర్చిదిద్దింది. అక్షరాస్యత పెరుగుతోంది..అరాచకాలు తగ్గలేదు. ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి.. నిర్భాగ్యులు ఉంటూనే ఉన్నారు. ఈ విషయాలే తొర్రూరు నివాసి తక్కెళ్లపల్లి రవీంద్రను ఆలోచనలో పడేశాయి. దీనికోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే 2005లో వందేమాతరం ఉద్యమానికి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈమేరకు తన విద్యా ఉద్యమానికి ‘వందేమాతరం’ అని పేరుపెట్టారు. దీనిలో భాగంగా ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. దీంట్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతోపాటు గ్రామస్తుల్ని భాగం చేశారు. ‘వందేమాతరం ఫౌండేషన్’ కార్యక్రమాలు నచ్చి తొర్రూరులో ఎన్నారై డాక్టర్ అశోక్‌రెడ్డి తన కుమారుడు నితిన్ జ్ఞాపకార్థం కట్టించిన సామాజిక భవనాన్ని ఫౌండేషన్ కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి ఇచ్చారు. ఏటా ‘పది’విద్యార్థులకు ఉచిత శిక్షణ శిబిరంఅనేకానేక కారణాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు మార్కుల్లో కార్పొరేట్ విద్యాసంస్థల విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. ఆ పరిమితులను అధిగమించడానికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదోతరగతి పిల్లలకు వార్షిక పరీక్షల ముందు 45 రోజులపాటు విద్యా శిబిరాలు ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, జీవన నైపుణ్య శిక్షకుల చేత మెళకువలు నేర్పిస్తున్నారు. తొమిదేళ్లుగా చేపడుతున్న ఈ శిబిరంలో ఏటా 500 మంది విద్యార్థులకు భోజన, వసతి కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. ఎంతోమంది విద్యార్థులు పదికి పది గ్రేడ్ తెచ్చుకొని ట్రిపుల్ ఐటీల్లో చేరుతున్నారు. ఈ శిక్షణకు హాజరైన రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామానికి చెందిన పుల్లూరు శరత్ ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. ఈ విధానం మెచ్చి పలు జిల్లాల కలెక్టర్లు ఇలాంటి శిబిరాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. » ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఫౌండేషన్ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభా పురస్కారాలు అందిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. రవీంద్ర కృషిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం పురస్కారాలు అందిస్తుందని సీఎం ప్రకటించారు. » వీఎంఎఫ్ సంస్థ నిర్వహించే ఉచిత శిక్షణ శిబిరాల్లో శిక్షణ పొందిన వారిలో దాదాపు 680 మంది ఐఐటీలకు, 1,500 మంది పేరుమోసిన కళాశాలల్లో ఫ్రీ సీట్లకు అర్హత పొందారు. » అక్షరాభ్యాసం కార్యక్రమం ద్వారా పదేళ్లలో పలు జిల్లాలకు చెందిన 1,93,500 మందికి పైగా విద్యార్థులను పాఠశాలకు దూరం కాకుండా ఉండేందుకు తోడ్పడింది. » రాష్ట్రంలో చదువుపై అమితాసక్తి, చాలా ఉత్సాహవంతులైన ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను ‘కలాం–100’అనే కార్యక్రమం ద్వారా ఎంపిక చేసి వారికి మెడిసిన్, ఐఐటీ, ఇతర పోటీ పరీక్షలకు అవసరమైన ఉచిత శిక్షణను ఫౌండేషన్ అందిస్తోంది. ఆరో తరగతిలో ఉన్నప్పుడే ఎంపిక చేసిన పిల్లలకు దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘకాలం పాటు శిక్షణ అందించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతోంది. » సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 70 గ్రామాల్లో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి పేద బిడ్డలకు విద్యనందిస్తున్నారు. » ఎస్సీఆర్టీతో కలిసి విద్యా ముసాయిదాను తయారు చేశారు. » అక్షరాభ్యాసం మొదలు తల్లిదండ్రులకు వందనం వంటి కార్యక్రమాల ద్వారా స్ఫూర్తిగా నిలిచింది. » బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమ ముసాయి దాకు ఫౌండేషన్ రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.7,200 కోట్లు కేటాయించేందుకు మూలమైంది. » ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన 680 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. రూ.2.80 కోట్ల ఉపకార వేతనాలు అందుకున్నారు. » గత కొన్నేళ్లలో 903 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు, 47 మంది ఐఐటీలకు ఎంపికయ్యారు. వివిధ ఎన్ఐటీల్లో 105 మంది, 2,400 మంది విద్యార్థులు పాలిటెక్నిక్‌కు, 4వేల మంది ఇంటర్ ఉచిత విద్య అవకాశాలను అందిపుచ్చుకున్నారు. 280 మంది ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు. » సంస్థ కార్యక్రమాలు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ కొనసాగుతున్నాయి. » వందేమాతరం ఫౌండేషన్‌కు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు రావాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రతిభలో ఎవరికీ తీసిపోరు. వారికి తగిన తోడ్పాటు అందించకపోవడమే వారి ప్రతిభకు ప్రతిబంధకంగా మారుతోంది. వారిలోని నైపుణ్యాలను వెలికితీసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకే ఏటా ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. దాతల సహాయంతో శిబిరం విజయవంతంగా నడుపుతున్నాం. విద్యతోపాటు జీవితంపై పలురకాల నైపుణ్య అంశాలపై విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నాం. ప్రభుత్వం సైతం ఇలాంటి శిబిరాలను నిర్వహిస్తే పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. – తక్కెళ్లపల్లి రవీంద్ర, వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ ఫౌండేషన్ కృషితో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులుపేద బిడ్డల అభ్యున్నతికి వందేమాతరం ఫౌండేషన్ చేస్తున్న కృషి వెలకట్టలేనిది. అక్షరాలు అందిస్తే పేద బిడ్డలు అత్యున్నత స్థాయికి ఎదుగుతారని రవీంద్ర అభిలాష. ఆయన సంకల్పానికి 2009 నుంచి తోడుగా ఉన్నాను. నా శేష జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చే సేవ ఇదే. విద్యార్థులు చదువుతో సంస్కారం, క్రమశిక్షణ నేర్చుకోవడం మంచి పరిణామం. – చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త -
మోదీ కొత్త స్కీం తెచ్చిండ్రు.. పైసలన్నీ ఒక్కరి ఖాతాలోకే..! కేటీఆర్ సెటైర్లు
సాక్షి, మహబూబాబాద్: తొర్రూరు మహిళా సభలో మాట్లాడుతూ కేంద్రంపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. బీజేపీ అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనం మొత్తం తీసుకు వస్తానన్న ప్రధాని మోదీ.. అధికారంలోకి వచ్చాక మొత్తం పైసలన్నీ ఒక్కరి ఖాతాలో వేసిండని ధ్వజమెత్తారు. మొదట వన్ నేషన్ వన్ ట్యాక్స్.. వన్ నేషన్ వన్ రేషన్ అన్నారని, ఇప్పుడు కొత్త స్కీమ్ తెచ్చి వన్ నేషన్ వన్ ఫ్రెండ్- ఒక దేశం ఒక దోస్త్ అంటూ దేశ సంపదను అదానీకి దోచి పెడుతున్నాడని విమర్శలు గుప్పించారు. 'శ్రీలంక పోయి రూ.6,000 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పించారు. గవర్నమెంట్ అగ్రిమెంట్ అని నమ్మబలికి దోస్త్‌కు దోచిపెట్టి, దొంగ సొమ్ముతో ఎమ్మెల్యేలు కొనాలి.. ప్రభుత్వాలను కూల్చాలని పార్టీలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎనిమిదిన్నర ఏళ్ళలో ఏం చేసావయ్యా మోదీ.. అంటే చెప్పడానికి ఏమీ లేదు. ఆకాశంలో అప్పులు ఉన్నాయి. దేశంలో ఉన్నవాళ్లంతా పిచ్చోళ్ళు రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1,200 చేసినా కరుకాచి నాకు వాత పెడతలేరు అనుకుంటున్నాడు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేకపోయారు. కేవలం హిందూ ముస్లిం పంచాయతీలు పెట్టి మత పరమైన విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారు. గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచి అన్ని పిరం చేశారు. అలాంటి ప్రధాన మంత్రి మనకు అవసరమా? అని కేసీఆర్ ఫైర్ అయ్యారు. అలాగే వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల కంటే పాలకుర్తిలో బీఆర్ఎస్కు అత్యధిక మెజార్టీ తీసుకురావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రూ.1,550 కోట్లు మహిళా దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ చిరు కానుకగా అందజేయడం జరుగుతుందన్నారు. సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో దేశవ్యాప్తంగా 20 పంచాయితీలను ఎంపికచేస్తే 19 తెలంగాణకు చెందినవే ఉన్నాయన్నారు. త్రీ స్టార్, ఫోర్ స్టార్‌లో మన పంచాయతీలే అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి కేసీఆర్ అని, కేసీఆర్ అంటే కాలువలు చెరువులు రిజర్వాయర్లు అని పేర్కొన్నారు. తొర్రూరుపై వరాల జల్లు.. తొర్రూరు మున్సిపాలిటీకి రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కొడకండ్లలో రెండు ఎకరాల్లో మినీ టెక్ట్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తొర్రూర్ లో 50 పడకలు, పాలకుర్తిలో మరో 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు తాము ఏం చేశామో ఘంటాపథంగా చెప్పగలుగుతాం, మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బేజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పగలుగుతుందా? అని ఛాలెంజ్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతులు ఉల్లిగడ్డ పండిస్తే కేవలం 2 రూపాయలే వచ్చాయట అని సైటర్లు వేశారు. చదవండి: ఢిల్లీ వెళ్లేముందు కేసీఆర్‌తో మాట్లాడిన కవిత.. ఏం చెప్పారంటే..? -
ఆస్పత్రి నుంచి తప్పించుకుని సొంతూరుకు
సాక్షి, తొర్రూరు : కరోనా వైరస్ బారిన పడి హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి తప్పించుకుని వచ్చాడు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురానికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో పని చేసేవాడు. అక్కడ ఆయనకు వైరస్ సోకగా.. ఈనెల 15న కింగ్ కోఠి ఆస్పత్రిలో చేరాడు. అయితే, బుధవారం తెల్లవారుజామున ఆస్పత్రి నుంచి తప్పించుకుని హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి ఆర్టీసీ బస్సులో సూర్యాపేట వరకు, మరో బస్సులో తొర్రూరుకు చేరుకున్నాడు. కాగా, హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరే సమయంలో తన సోదరుడికి ఫోన్ చేసి విషయం తెలుపగా.. అతను వెంటనే వైద్య, పోలీసు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం, ఎస్సై నగేష్, సిబ్బందితో కలసి తొర్రూరు బస్టాండ్‌లో కరోనా సోకిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పీపీఈ కిట్ తొడిగాక అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి కోవిడ్ వార్డుకు తరలించారు. తర్వాత అతను ఏ బస్సులో ఎక్కాడు, అందులో ఎందరు ప్రయాణించారనే అంశాలపై విచారణ చేపట్టారు. -
దారుణం : కూతురుపై కన్నతండ్రి లైంగిక దాడి
సాక్షి, వరంగల్ : హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. కాపాడాల్సిన తండ్రే మానవత్వం మరిచి కన్న కూతూరిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా తొర్రురుకు చెందిన కుమారస్వామి వృత్తి రిత్యా కారుడ్రైవర్. కుటుంబంతో కలిసి హన్మకొండలోని కెఎల్ఎన్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న కుమారస్వామికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు . ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున చిన్న కూతురుపై లైంగాకదాడికి పాల్పడుతుండగా పెద్దకూతురు చూసి తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని హన్మకొండ పోలీసులకు తెలపడంతో కుమారస్వామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా మూడు నెలలుగా కూతురిపై కామవాంచ తీర్చుకుంటున్నట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
పెళ్లికని వచ్చి, కానరానిలోకాలకు..
-
పెళ్లికని వచ్చి, కానరానిలోకాలకు..
సాక్షి, మహబూబాబాద్ : తొర్రూర్ మండలం మాటెడు గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం పెను ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న కారు, లారీలు ఎదురెదురుగా ఢీకొనడంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడ మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే నెల్లికుదురుకు చెందిన నల్లా శ్రీనివాసరెడ్డి కుటుంబం సమీప బంధువుల పెళ్లికి దంతాలపల్లికి హాజరయ్యారు. అనంతరం కారులో స్వగ్రామం బయలుదేరారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు శివారు వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నల్లా శ్రీనివాసరెడ్డి(40)తో పాటు తల్లి లక్ష్మి (66), భార్య మాధవి(33), కూతురు కృష్ణవేణి (10)లు అక్కడిక్కడే మృతి చెందారు. -
రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ ఫొటోగ్రాఫర్ దుర్మరణం
తొర్రూరు : కారు అదుపు తప్పి గోడకు ఢీకొనడంతో ఓ ఫొటోగ్రాఫర్ అక్కడిక్కడే మృతిచెందాడు. హైదరాబాద్‌లోని మోతీనగర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ యదాల శ్రీనివాస్‌రావు(41) మానుకోటలో జరిగే శుభకార్యానికి సంబంధించి ఫొటోలు తీసేందుకు కారులో బయల్దేరాడు. మార్గం మధ్యలో తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం సమీపంలో అడ్డుగా వచ్చిన కుక్క పిల్లని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రహరీని ఢీకొట్టింది. దీంతో ముందు సీటులో కూర్చున్న శ్రీనివాస్‌రావు తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. డ్రైవర్ రాజశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్‌రావు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ప్రొ.కోదండరామ్ కు తప్పిన ప్రమాదం
నల్లగొండ: తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్(టీజేఏసీ) ప్రొ.ముద్దసాని కోదండరామిరెడ్డికి శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. జిల్లాలోని తుంగతుర్తి నుంచి వరంగల్ వెళ్తున్న కారు తొర్రూరు వద్ద పంక్చర్ కావడంతో డివైడర్ ను ఢీ కొట్టింది. వరంగల్ జిల్లా తొర్రూరులో సభలో పాల్గొని తిరిగి టీజేయేసీ అంతర్గత సమావేశంలో పాల్గొనడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదంలో కోదండరామ్ తో పాటు కారులో ప్రయాణిస్తున్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద స్థలం నుండి అదే కారులో వరంగల్ లో టీజేయేసీ సమావేశానికి బయలుదేరి వెళ్లినట్లు టీజేయేసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పిట్టల రవీందర్ తెలిపారు. -
తాతకు తలకొరివి పెట్టిన మనవరాలు
అనారోగ్యంతో మృతి చెందిన తాతకు తన మనవరాలు తలకొరివి పెట్టిన సంఘటన తొర్రూరు మండలంలోని చింతలపెల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కొండం చంద్రారెడ్డి (75) ఒక్కగానొక్క కొడుకు యాకూబ్‌రెడ్డి గతంలో మృతి చెందాడు. యాకూబ్‌రెడ్డికి కుమారై శ్రావ్య మాత్రమే ఉంది. దీంతో చంద్రారెడ్డికి మనవరాలు శ్రావ్యతో తలకొరివి పెట్టించారు. అతి చిన్న వయసులోనే తాతకు మనవరాలు తలకొరివి పెట్టడాన్ని చూసిన ప్రజలు కన్నీరుమున్నీరుగా రోదించారు. -
వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సర్పంచ్
వరంగల్: ప్రజా ప్రతినిధులు ఎవరైనా తమ బాధ్యతను గుర్తించి సమాజం పట్ల అంకిత భావంతో పని చేయాలి. అటువంటిది వారే పక్క తోవపట్టి కనీస విలువలు మరచిపోతే..ఇక ప్రజల గురించి పట్టించుకునే వారెవరు. గ్రామ సర్పంచ్ గా ఉంటూ పంచాయతీ కార్యాలయంలోనే వ్యభిచారం చేస్తే ఇక చేసేదేముంది. ఇటువంటి ఘటన తాజాగా తొర్రూరు గ్రామంలో కలకలం రేపింది. తొర్రూరు గ్రామానికి సర్పంచ్ గా ఉన్న రాజేశ్ నాయక్ అనే వ్యక్తి కాసేపు ప్రజా సమస్యలను పక్కకు నెట్టాడు. పంచాయతీనే వేదికగా చేసుకునే వ్యభిచారానికి పూనుకున్నాడు. ఈ నిర్వాకం బయటపడటంతో అతను కంగుతిన్నాడు. సర్పంచ్ ఉదంతాన్ని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. ఆ వ్యక్తి టీడీపీ సర్పంచ్ కావడంతో కేసు నుంచి తప్పించేందుకు... టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది..