కారు అదుపు తప్పి గోడకు ఢీకొనడంతో ఓ ఫొటోగ్రాఫర్ అక్కడిక్కడే మృతిచెందాడు.
తొర్రూరు : కారు అదుపు తప్పి గోడకు ఢీకొనడంతో ఓ ఫొటోగ్రాఫర్ అక్కడిక్కడే మృతిచెందాడు. హైదరాబాద్‌లోని మోతీనగర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ యదాల శ్రీనివాస్‌రావు(41) మానుకోటలో జరిగే శుభకార్యానికి సంబంధించి ఫొటోలు తీసేందుకు కారులో బయల్దేరాడు.
మార్గం మధ్యలో తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం సమీపంలో అడ్డుగా వచ్చిన కుక్క పిల్లని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రహరీని ఢీకొట్టింది. దీంతో ముందు సీటులో కూర్చున్న శ్రీనివాస్‌రావు తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. డ్రైవర్ రాజశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్‌రావు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు.