పెళ్లికని వచ్చి, కానరానిలోకాలకు.. | Four persons killed in road accident near torrur | Sakshi
Sakshi News home page

మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం

Published Fri, Nov 24 2017 6:30 PM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM

Four persons killed in road accident near torrur - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : తొర్రూర్ మండలం మాటెడు గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం పెను ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న కారు, లారీలు ఎదురెదురుగా ఢీకొనడంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడ మృతి చెందారు.

వివరాల్లోకి వెళ్తే నెల్లికుదురుకు చెందిన నల్లా శ్రీనివాసరెడ్డి కుటుంబం సమీప బంధువుల పెళ్లికి దంతాలపల్లికి హాజరయ్యారు. అనంతరం కారులో స్వగ్రామం బయలుదేరారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు శివారు వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నల్లా శ్రీనివాసరెడ్డి(40)తో పాటు తల్లి లక్ష్మి (66),  భార్య మాధవి(33), కూతురు కృష్ణవేణి (10)లు అక్కడిక్కడే మృతి చెందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement