వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సర్పంచ్ | sarpanch Prostitution in panchayati office of torruru | Sakshi
Sakshi News home page

వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సర్పంచ్

Published Thu, Oct 17 2013 9:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM

sarpanch Prostitution in panchayati office of torruru

వరంగల్: ప్రజా ప్రతినిధులు ఎవరైనా తమ బాధ్యతను గుర్తించి సమాజం పట్ల అంకిత భావంతో పని చేయాలి. అటువంటిది వారే పక్క తోవపట్టి కనీస విలువలు మరచిపోతే..ఇక ప్రజల గురించి పట్టించుకునే వారెవరు. గ్రామ సర్పంచ్ గా ఉంటూ పంచాయతీ కార్యాలయంలోనే వ్యభిచారం చేస్తే ఇక చేసేదేముంది. ఇటువంటి ఘటన తాజాగా తొర్రూరు గ్రామంలో కలకలం రేపింది. తొర్రూరు గ్రామానికి సర్పంచ్ గా ఉన్న రాజేశ్ నాయక్ అనే వ్యక్తి కాసేపు ప్రజా సమస్యలను పక్కకు నెట్టాడు. పంచాయతీనే వేదికగా చేసుకునే వ్యభిచారానికి పూనుకున్నాడు. ఈ నిర్వాకం బయటపడటంతో అతను కంగుతిన్నాడు. సర్పంచ్ ఉదంతాన్ని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు.

ఆ వ్యక్తి టీడీపీ సర్పంచ్ కావడంతో కేసు నుంచి తప్పించేందుకు... టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement