village sarpanch
-
మహిళా ప్రజాప్రతినిధులంటే అలుసా?
న్యూఢిల్లీ: ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధిని పదవి నుంచి తొలగించడాన్ని సాధారణ విషయంగా తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధిగా గెలిచిన మహిళలను ఇష్టారాజ్యంగా పదవుల నుంచి తొలగించడం సరైంది కాదని పేర్కొంది. మహారాష్ట్రలో ఓ గ్రామ మహిళా సర్పంచిని పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును న్యాయస్థానం కొట్టివేసింది. మహిళలు గ్రామ సర్పంచి కావడాన్ని చాలామంది తట్టుకోలేకపోతున్నారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. దేశమంతటా ఇలాంటి పరిస్థితి ఉందని పేర్కొంది. నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం మహిళల్లో ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని వెల్లడించింది. నిజానికి మహిళల్లో చక్కటి పరిపాలనా సామర్థ్యాలు ఉంటాయని, వారిని తక్కువ అంచనా వేయొద్దని సూచించింది. మనీశ్ రవీంద్రపన్ పాటిల్ అనే మహిళ మహారాష్ట్రలో జలగావ్ జిల్లా విచ్ఖేడ్ గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనంలో ఆమె తన అత్తతో కలిసి నివసిస్తున్నారని గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఒక ప్రజాప్రతినిధి కబ్జా చేసిన స్థలంలో కట్టిన ఇంట్లో నివసించడం చట్టవిరుద్ధమని ఆమెపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ ఆరోపణలను మనీశ్ రవీంద్రపన్ పాటిల్ ఖండించారు. తాను భర్త, పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నానని స్పష్టంచేశారు. కలెక్టర్ సరైన విచారణ చేయకుండా తెలుసుకోకుండా పాటిల్‌ను సర్పంచి పదవి నుంచి తొలగించారు. దీన్ని ఆమె బాంబే హైకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు కూడా కలెక్టర్ నిర్ణయాన్ని సమర్థించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బాంబే హైకోర్టు ఉత్తర్వును తోసిపుచ్చింది. పాటిల్ సర్పంచిగా విధులు నిర్వర్తించవచ్చంటూ తీర్పు వెలువరించింది. దేశంలో లింగ సమానత్వం కోసం, మహిళా సాధికారత కోసం ఒకవైపు కృషి కొనసాగుతుండగా, మరోవైపు వారిని నిరుత్సాహపర్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వెలిబుచ్చింది. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని, మహిళలను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. వారిని కింపచర్చడం, అలుసుగా తీసుకోవడం తగదని హితవు పలికింది. పేర్కొంది. -
కొండాపూర్ సర్పంచ్ ఆకస్మిక మృతి
గండేడ్: మండలంలోని కొండాపూర్ సర్పంచ్ చాకలి శ్రీనివాస్ శుక్రవారం రాత్రి మృతి చెందారు. రాజకీయాల్లో చురుకుగా ఉండే శ్రీనివాస్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ముమ్మర ప్రచారం నిర్వహించారు. గురువారం ఓటు వేద్దామనే సమయానికి స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఓటు వేయకుండానే మహబూబ్‌నగర్‌లోని తన ఇంటికి వెళ్లిపోయారు. అతడి పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి మృతి చెందారు. అతను గతంలో రెండు సార్లు ఎంపీటీసీగా పనిచేశారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య పుష్పలత స్టాఫ్‌నర్సుగా పనిచేస్తుంది. గ్రామంలో విషాదం సర్పంచ్ శ్రీనివాస్ మృతితో కొండాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉంటూ.. మూడు సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికయిన శ్రీనివాస్‌కు అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంత్యక్రియల్లో పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, జితేందర్‌రెడ్డి, నారాయణ, పెంట్యానాయక్, సర్పంచ్ పుల్లారెడ్డి, సునీత, మాజీ ఎంపీపీ శాంతి, మాజీ వైస్‌ఎంపీపీ రాధారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం నాగర్‌కర్నూల్ క్రైం: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాములు యాదవ్ కథనం మేరకు.. ఖానాపూర్‌కు చెందిన రాములు (59) పాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకొని తిరిగి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. ఇది చదవండి: రిటైర్డ్ ఉపాధ్యాయుడిపై దాడి.. చివరికి రక్షణగా ఇద్దరు కానిస్టేబుల్స్ -
సర్పంచ్‌గా ‘ఎంబీబీఎస్’ విద్యార్థిని.. ఎన్నికల్లో ఘన విజయం
ముంబై: యశోధరా షిండే.. 21 ఏళ్ల ఈ యువతి డాక్టర్ కావాలని కలలు కన్నది. అందుకు తగ్గట్లుగా జార్జియా వెళ్లి ఎంబీబీఎస్ చదువుతోంది. కానీ, ఆమెకు విధి మరో కొత్త రంగాన్ని అందించాలని తలపించింది. ఆమెను గ్రామానికి తిరిగి వచ్చేలా చేసింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచింది యశోధరా. భారీ మెజారిటీతో సర్పంచ్‌గా ఘన విజయం సాధించింది. చిన్న వయసులోనే సర్పంచ్‌గా ఎన్నికై అందరి మన్ననలు పొందుతోంది. ఈ సంఘటన మహారాష్ట్ర, సంగ్లీ జిల్లాలోని మిరాజ్ తహసీల్ వడ్డి గ్రామంలో జరిగింది. యశోధరా సర్పంచ్‌గా పోటీ చేయాల్సి రావటంపై ఆమె మాటల్లోనే.. ‘జార్జియాలోని న్యూ విజన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను నాలుగో సంవత్సరంలో ఉన్నా. ఇంకా ఏడాదిన్నర కోర్సు మిగిలి ఉంది. మా గ్రామంలో ఎన్నికలు ప్రకటించిన క్రమంలో మా ఇంటి నుంచి ఎవరైనా పోటీ చేయాలని స్థానికులు కోరారు. సర్పంచ్‌గా నన్ను బరిలో నిలపాలని మా కుటుంబంతో పాటు అంతా నిర్ణయించారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పడంతో వచ్చాను. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను.’ - యశోధరా షిండే, వడ్డి గ్రామ సర్పంచ్ తమ గ్రామం వడ్డి అభివృద్ధి కోసం పాటుపడతానని, మహిళలు స్వయంసమృద్ధిగా ఎదిగేందుకు, విద్యార్థుల కోసం ఈ లర్నింగ్, ఇతర మెరుగైన విద్యావిధాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొంది యశోధరా. రైతుల సంక్షేమంతో పాటు యువతకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తానని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు సమానమైన అవకాశాలు రావాలని, అందుకు తగినట్లుగా వారు చదువుకుని స్వతంత్రంగా జీవించేందుకు కృషి చేస్తానని నొక్కి చెప్పారు యశోధరా. మరోవైపు.. తన ఎంబీబీఎస్ చదువును కొనసాగిస్తానని, ఆన్లైన్ విధానంలో పూర్తి చేస్తానని వెల్లడించింది. మహారాష్ట్రలోని 7,682 గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 18న ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ ఎన్నికల ఓటింగ్ ఫలితాలను గత మంగళవారం వెల్లడించారు. ఇదీ చదవండి: కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళనకరమే.. కానీ: అదర్ పూనావాలా -
Photo Feature: ‘ఉపాధి’కి రండి..
కమ్మర్పల్లి (నిజామాబాద్): మండలంలోని హాసాకొత్తూర్‌లో శనివారం పంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధి పనులకు రావాలని కోరుతూ గ్రామంలో ఇంటింటా బొట్టు పెట్టి పిలిచే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ఏనుగు పద్మ, ఉపాధి హామీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కూలీలకు బొట్టు పెట్టి ఉపాధి హామీ పనులకు రావాలని ఆహ్వానించారు. ఉపసర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, జీపీ కార్యదర్శి రజనీకాంత్‌రెడ్డి, సిబ్బంది రమణ, వార్డు సభ్యులు కుందేటి పుష్ప, మేట్లు పాల్గొన్నారు. -
పంచాయతీ లెక్కలు అడిగినందుకు.. విద్యుత్ తీగలు పట్టుకున్న సర్పంచ్
న్యాల్కల్(జహీరాబాద్): గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చుల వివరాలు సభ్యులు అడగడంతో మనస్తాపానికి గురైన ఓ సర్పంచ్ విద్యుత్ తీగలను పట్టుకునాన్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధి రేజింతల్ గ్రామంలోజరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. సర్పంచ్ కుత్బుద్దీన్, కార్యదర్శి, వార్డు సభ్యులు హాజరయ్యారు. ‘పంచాయతీ అభివృద్ధికి ఎన్ని నిధులొచ్చాయి? ఏయే పనులు చేపట్టారు?’ వివరాలు కావాలని సభ్యులు నిలదీశారు. దీంతో అభివృద్ధి పనులను వివరించాలని రికార్డులను పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్ ఇచ్చారు. ఆమె వివరాలు వెల్లడిస్తున్న సమయంలో వార్డు సభ్యులు, సర్పంచ్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘గ్రామాభివృద్ధి కోసం పంచాయతీ నిధులతో పాటు ఇతర నిధులను తీసుకొచ్చినా నిలదీస్తారా? అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నా నన్నే అనుమానిస్తారా?’ అంటూ తీవ్ర మనస్తాపానికి గురైన సర్పంచ్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రైతు వేదిక దగ్గరకు వెళ్లి అక్కడున్న విద్యుత్ ట్రాన్స్పార్మర్ తీగలను పట్టుకున్నాడు. విద్యుదాఘాతంతో కింద పడిపోయాడు. విషయాన్ని గమనించిన పలువురు చికిత్స నిమిత్తం గంగ్వార్ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది బీదర్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో బీదర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని గ్రామస్తులు తెలిపారు. ‘సభ్యులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలే కాని విద్యుత్ తీగలు పట్టుకోవడం ఏమిటి’ అని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
సర్పంచ్‌లకు సస్పెన్షన్ టెన్షన్!
సాక్షి, వరంగల్ రూరల్: గ్రామ సర్పంచ్‌లకు ‘సస్పెన్షన్’టెన్షన్ పట్టుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018–37(5) చట్టం ప్రకారం విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే సర్పంచ్‌లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టడంతో వారు దినదినగండంగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, హరితహారం, పల్లెప్రకృతివనం పనుల్లో జాప్యం జరిగినా సస్పెండ్ చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పలానా సమస్య పరిష్కరించుకుండా సర్పంచ్ నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఫిర్యాదు చేసినా సరే వేటు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామాలుంటే 2,145 మంది సర్పంచ్‌లకు ఆయా జిల్లా కలెక్టర్లు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వరంగల్ రూరల్‌లో ముగ్గురు, నిర్మల్‌లో ఇద్దరు.. మొత్తం ఐదుగురిని విధుల నుంచి తొలగించారు. ఇలా 2021 మే వరకు రాష్ట్రవ్యాప్తంగా 139 మంది సర్పంచ్‌లు సస్పెండయ్యారు. ప్రత్యర్థి పార్టీ వారిపై.. ► వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామం సర్పంచ్ శ్రీధర్ది కాంగ్రెస్ పార్టీ. అధికార పార్టీకి చెందిన ఆ గ్రామ నేతలు ఊరిలో పారిశుధ్యం లోపించిందంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో 2020 సెప్టెంబర్ 26న సస్పెండ్ చేశారు. అయితే ఇందుకు తగిన చర్యలు తీసుకుంటానని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి తిరిగి అక్టోబర్ 9న విధుల్లో చేరారు. ► నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ సర్పంచ్ శారద కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. ఆమెపై గతేడాది నవంబర్ 3న సస్పెన్షన్ వేటుపడింది. నిధులు దుర్వినియోగం చేశారని, అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేశారంటూ అధికార పార్టీకి చెందిన ఇద్దరు వార్డు మెంబర్లు ఆమెపై ఫిర్యాదు చేయగా, కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఆమె కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తే వారం తర్వాత సస్పెన్షన్ ఎత్తేశారు. ఆధిపత్య పోరు.. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామ సర్పంచ్ వరలక్ష్మిపై సస్పెన్షన్ వేటు పడింది. నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ గ్రామస్తులు కొందరు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన అనంతరం అధికారులు సస్పెండ్ చేశారు. అధికార పార్టీ అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు వర్గం కావడంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అనుచరులు అధికారులపై ఒత్తిడి తేవడంతో ఆమెను సస్పెండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ దుమారం చెలరేగడంతో రెండు నెలల తర్వాత ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఏ జిల్లాలో ఎందరు సస్పెండయ్యారంటే.. వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 8, ములుగు 3, జనగాం 3, మహబూబాబాద్ 2, కరీంనగర్ ఒకటి, జగిత్యాల 7, మంచిర్యాల 7, ఖమ్మం 9, భద్రాద్రి కొత్తగూడెం 4, నిజామాబాద్ 4, కామారెడ్డి 11, మెదక్ 5, సంగారెడ్డి 8, రాజన్న సిరిసిల్లా 2, జోగుళాంబ గద్వాల 5, నాగర్ కర్నూలు 6, వనపర్తి 2, నల్లగొండ 12, సూర్యాపేట 1, ఆదిలాబాద్ ఒకటి, మేడ్చల్ మల్కాజ్గిరి 1, రంగారెడ్డి 19, వికారాబాద్ 1, యాదాద్రి భువనగిరి 7. కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నా కూడా.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామ సర్పంచ్ చిలుక లింగయ్య వైకుంఠ ధామం నిర్మాణపనులు చేయకపోవడంతో తొలుత షోకాజ్ నోటీసు ఇచ్చారు. సమాధానం సంతృప్తికరంగా లేదని కలెక్టర్ సస్పెండ్ చేశారు. చిలుక లింగయ్య హైకోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయినా ఇంకా అధికారుల నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో ఉప సర్పంచ్ చిరంజీవి సర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సస్పెన్షన్‌కు గురైన చిలుక లింగయ్య మండలంలో బీజేపీకి చెందిన సర్పంచ్ కావడం గమనార్హం. సబ్‌స్టేషన్ కోసం స్థలం అడిగితే సస్పెండ్ చేస్తారా? మా గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ కోసం స్థలం కేటాయించలేదని నాలుగో విడత పల్లెప్రగతి తొలిరోజు గ్రామసభను పాలకవర్గమంతా బహిష్కరించాం. దీంతో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 2021 జూలై 15న కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే ఊరి బాగు కోసం నేను ఈ విషయాన్ని లేవనెత్తితే సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమో కలెక్టర్ ఆలోచించుకోవాలి. - ప్రకాశ్‌రెడ్డి, సర్పంచ్ పెద్దకోడెపాక, వరంగల్ రూరల్ జిల్లా గవర్నర్ జోక్యం చేసుకోవాలి చాలా జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రుల జోక్యంతో చిన్నచిన్న కారణాలకే ఇతర పార్టీలకు చెందిన సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. పంచాయతీ నిధుల దుర్వినియోగం, స్వ లాభానికి అధికార దుర్వినియోగం వంటి వాటికే సస్పెండ్ చేసే చేసేలా చట్టాన్ని సవరణ చేయాలి. ట్రిబ్యునల్‌లో అప్పీల్ ఫీజు రూ.25 వేల నుంచి రూ.100కి తగ్గించాలి. ఈ చట్ట సవరణ జరిగే వరకు చిన్న చిన్న కారణాలతో సర్పంచ్‌లను సస్పెండ్ చేయవద్దని సంబంధిత అధికారులకు తెలపాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు గ్రామ సభను బహిష్కరించిన పెద్దకొడెపాక గ్రామ సర్పంచ్‌ను సస్పెండ్ చేయడం సరికాదు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని వినతి పత్రం కూడా ఇచ్చాం. – ఎం.పద్మనాభరెడ్డి, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి -
సీఎం జగన్‌పై అభిమానంతో..
ఇచ్ఛాపురం రూరల్ (శ్రీకాకుళం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో రూ.లక్షల విలువైన భూమిని సచివాలయం నిర్మాణానికి అందజేసి తన పెద్దమనసు చాటుకున్నాడు ఓ వీరాభిమాని. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామానికి చెందిన మేరుగు నారాయణరెడ్డికి 80 సెంట్లు భూమి ఉంది. ఆయనకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే ఎనలేని అభిమానం. సీఎంగా పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నచ్చి గ్రామ సచివాలయం నిర్మించేందుకు రూ.10 లక్షల విలువైన 6 సెంట్ల స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు శనివారం గ్రామ సర్పంచ్ పాతిర్ల రాజశేఖరరెడ్డికి భూ పత్రాలను అందజేశారు. పెద్దమ్మను ఒప్పించి వెల్నెస్ సెంటర్‌కు స్థలం మేరుగు నారాయణరెడ్డి తన స్థలాన్ని సచివాలయానికి ఇవ్వడంతో పాటు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ‘వెల్నెస్ సెంటర్’కు తన పెద్దమ్మ మేరుగు కామమ్మకు చెందిన రూ.25 లక్షల విలువైన 10 సెంట్ల స్థలాన్ని కూడా ఇచ్చేలా ఆమెను ఒప్పించారు. కొద్ది రోజుల క్రితం రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. -
పంచాయతీ కార్యాలయం కట్టకపోతే బతకను
రాయగడ : కల్యాణ సింగుపురం సమితిలోని కొందొకత్తిపాడు గ్రామంలోనే పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆ గ్రామ సర్పంచ్ సునీత హికాక హెచ్చరించారు. ఈ విషయమై ఆమె తమ పంచాయతీలోని దంతలింగి, పొంగళి, ఒడాగుడ, చింతలిగుడ, కెందుగుడ గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్లోని సబ్‌కలెక్టరు ప్రతాప్‌చంద్ర ప్రధాన్‌కి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదివరకు పొలమ పంచాయతీలో ఉండే కొందొకత్తిపాడుని 6 నెలల క్రితం ఆ పంచాయతీ నుంచి వేరుచేసి, కొత్త పంచాయతీగా చేశారని తెలిపారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న పంచాయతీ కార్యా లయాన్ని కొత్త పంచాయతీ కొందొకత్తిపాడులోనే ఏర్పాటు చేయాలని ఆమె పట్టుబట్టారు. అయితే కొద్దిరోజుల క్రితం పంచాయతీ కార్యాల యం నిర్మాణానికి సంబంధించి, పొలమ పంచాయతీకి దగ్గరలోని 7 సెంట్ల ప్రభుత్వ భూమిని అధికారులు పరిశీలించారని ఆమె పేర్కొన్నారు. కొందొకత్తిపాడులోని 10 సెంట్ల ప్రభుత్వ స్థలంలో పంచాయతీ కార్యాలయం నిర్మాణం చేపట్టకుండా వేరేచోట ఆ నిర్మాణం చేపట్టడం వెనక ఉన్న ఆంత్యర్యమేంటని ఆమె ప్రశ్నించారు. ఎటువంటి గ్రామసభలు నిర్వహించకుండా పంచాయతీ కార్యాలయం నిర్మాణం చేపట్టేందుకు అధికారులు ఈ ఏకపక్ష నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా కొందొకత్తిపాడులో ఉన్న అనువైన స్థలంలోనే పంచాయతీ కార్యాలయం నిర్మాణం జరిగేలా చూడాలని సబ్‌కలెక్టర్‌ని ఆమె కోరారు. దీనిపై స్పందించిన సబ్‌కలెక్టరు ఈ సమస్యని కలెక్టరు దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
‘డిజిటల్’ కిరికిరి!
సాక్షి, నేరడిగొండ(ఆదిలాబాద్) : గ్రామ పంచాయతీల్లో కొత్త సర్పంచులకు అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో వారు అయోమయానికి గురవుతున్నారు. చెక్‌పవర్ వ్యవహారాన్ని తేల్చిన ప్రభుత్వం మరిన్ని సమస్యలను సృష్టించి పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీల్లో చేసిన పనులకు బిల్లులు తీసుకోవాలన్నా, నిధులు డ్రా చేసుకోవాలన్నా సర్పంచులకు తల ప్రాణం తోకకు వచ్చేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రామపంచాయతీలో చేసిన పనులకు సంబంధించి వివరాలన్నీ యాప్‌లోనే అప్లోడ్ చేయాలన్న నిబంధన పెట్టారు. అలా అప్లోడ్ చేశాకే ఆన్లైన్లోనే డిజిటల్ చెక్కులు పొందేలా కొత్త పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో గ్రామపంచాయతీలో ఎలాంటి పనిచేసినా ఆ పనికి సంబంధించి డబ్బులు డ్రా చేయాలంటే పెద్ద తతంగమే జరగాల్సి ఉంది. డిజిటల్ చెక్కు పొందేందుకు సర్పంచ్, ఉప సర్పంచులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం చెక్‌పవర్ ఇచ్చినా, డిజిటల్ యాప్ అందుబాటులోకి రాని కారణంగా డబ్బులు డ్రా చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 467 గ్రామపంచాయతీలు ఉన్నా యి. అందులో 465 గ్రామ పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. మిగతా రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పంచాయతీ చట్టం కారణంగా పంచాయతీల్లో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. సర్పంచులకు చెక్‌పవర్ విషయంలోనే ఆచితూచి అడుగులు వేసింది. ఈ ఏడాది జనవరిలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. కాగా ఆ తర్వాత నూతన పంచాయతీ పాలనపై సర్పంచులకు మూడు విడతల్లో జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు శిక్షణ కూడా ఇచ్చారు. చెక్‌పవర్‌పై తర్జనభర్జనలు పంచాయతీ పాలనకు తీసుకొచ్చిన నూతన పంచాయతీ చట్టం ప్రకారం జాయింట్ చెక్‌పవర్ ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై పెద్ద తతంగమే నడిచింది. జనవరిలో ఎన్నికలు పూర్తి కాగా, ఫిబ్రవరిలో శిక్షణ కూడా నిర్వహించారు. గతంలో మాదిరిగా సర్పంచుకు కార్యదర్శికి చెక్‌పవర్ ఇవ్వాలా..? లేక సర్పంచ్, ఉప సర్పంచుకు కలిపి ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వం పలు విధాలుగా తర్జనభర్జనలు చేసింది. ఇక 14వ ఆర్థిక సంఘం నిధులు గత పాలకవర్గాల హయాంలోనే మంజూరయ్యాయి. కాని ప్రభుత్వం ఫ్రీజింగ్ పెట్టి నిలిపివేసింది. ఆ పాలకవర్గాలు ఆ నిధులను డ్రా చేయలేకపోయాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు సైతం తాము ఎన్నికై నాలుగు నెలలు గడిచినా, అందుబాటులో నిధులు ఉన్నా, చివరకు వేసవిలో అత్యవసర పనులకు కూడా నిధులు డ్రా చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. గ్రామంలో అత్యవసరమైన తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు వంటి వాటికి కొందరు సర్పంచులు అప్పులు చేసి, మరికొందరు సొంత డబ్బులు ఖర్చు చేశారు. నిధులు ఉన్నా ప్రభుత్వం చెక్‌పవర్ విషయం తేల్చని కారణంగా అప్పులు చేసి పనులు చేయాల్సి వచ్చింది. గత నెల 22న తేలిన చెక్‌పవర్ గత నెల 22న ప్రభుత్వం చెక్‌పవర్ అంశాన్ని తేల్చేసింది. సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ ఇస్తూ గెజిట్ జారీ చేసింది. జిల్లా పంచాయతీ అధికారి జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు చెక్‌పవర్‌పై ప్రొసీడింగ్స్‌ను గత నెల 27న ఇచ్చారు. వాటన్నింటినీ జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపడంతో పాటు జిల్లాలోని 18 మండలాల ఎంపీడీఓలకు చెక్‌పవర్ ప్రొసీడింగ్స్‌ను పంపించారు. చెక్‌పవర్ వచ్చినా.. డిజిటల్ కిరికిరి ప్రభుత్వం ఎట్టకేలకు సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం యాప్‌ను నేటికీ విడుదల చేయలేదు. దీంతో చెక్‌పవర్ వచ్చినా అది ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి ఆన్లైన్లో మీసేవా కేంద్రం నుంచి అప్లోడ్ చేయాలి. ప్రభుత్వం విడుదల చేసే ఆ యాప్‌ను డౌన్లోడ్ చేయాలి. అందులోకి వెళ్లి ఆ గ్రామపంచాయతీకి సంబంధించిన కోడ్‌ను నమోదు చేయాలి. సంబంధిత పని వివరాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత ఆ పనికి సంబంధించి ఎంబీ రికార్డు నంబర్‌ను నమోదు చేయాలి. ఆ పని ఎంత విలువైందో ఆ మొత్తాన్ని కూడా అందులో నమోదు చేయాలి. అప్పుడు ఆ అప్లికేషన్ పూర్తయినట్లవుతుంది. ఆ తర్వాత ఆన్లైన్లో సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలతో కూడిన డిజిటల్ చెక్కు బయటికి వస్తుంది. ఆ చెక్ రాగానే సర్పంచ్, ఉప సర్పంచ్ సెల్‌ఫోన్ నంబర్లకు ఓటీపీ నంబర్ వెళ్తుంది. దాన్ని తీసుకొని డీటీఓ, ఎంపీడీఓల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఎంపీడీఓ వద్దకు వెళ్లి సర్పంచ్, ఉప సర్పంచ్‌లు మూడు మూడు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కాగితంపై ఎంపీడీఓ, సర్పంచ్, ఉప సర్పంచ్ కలిసి వచ్చి తన ముందే సంతకాలు చేశారని ధ్రువీకరిస్తూ ఎస్టీఓకు లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్ తీసుకొని ఎస్టీఓ వద్దకు వెళ్లాలి. ఎస్టీఓ, సర్పంచ్, ఉప సర్పంచ్ మొబైళ్లకు వచ్చిన ఓటీపీ నంబర్లను అడుగుతారు. ఎంపీడీఓ ఇచ్చిన లెటర్‌ను తీసుకొని దానిపై ఎస్టీఓ ముందు మళ్లీ సర్పంచ్, ఉప సర్పంచ్ ఇరువురూ రెండేసి సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు పూర్తిస్థాయిలో బిల్లు కోసం ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది. ఎస్టీఓ ఆ బిల్లును పాస్ చేస్తాడు. ప్రస్తుతం చెక్‌పవర్ విషయంలో ఇప్పటికే డీపీఓ, ఎస్టీఓ, ఎంపీడీఓలకు పంపిన ప్రొసీడింగ్ల ఆధారంగా అన్ని గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచుల డిజిటల్ సంతకాలను తీసుకుంటున్నారు. ఆ సంతకాలే డిజిటల్ చెక్ మీద రానున్నాయి. మొత్తానికి ప్రభుత్వం ఓ పక్క చెక్‌పవర్ ఇచ్చినా.. ఈ డిజిటల్ యాప్ రాని కారణంగా చెక్‌పవర్ ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిజిటల్ విధానంతో సర్పంచులకు డబ్బుల డ్రా విషయంలో కిరికిరి తప్పేలా లేదు. -
ఎట్టకేలకు చెక్ పవర్!
సాక్షి,యాచారం(రంగారెడ్డి) : సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం సాయంత్రం కలెక్టర్ లోకేష్‌కుమార్ నుంచి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలకు ఉత్తర్వులు అందాయి. జనవరి 25న పంచాయతీ ఎన్నికలు జరగగా.. చెక్‌పవర్ కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు ఆలస్యం జరిగింది. ఐదు నెలల అనంతరం గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలోని 560 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జాయింట్ చెక్ పవర్ ఉత్తర్వును సబ్‌ట్రెజరీలకు, అన్ని బ్యాంకుల మేనేజర్లకు పంపించి ఇచ్చి సర్పంచ్, ఉప సర్పంచ్‌లు సంతకాలు చేసిన మిగతా 2వ పేజీలో u uమొదటి పేజీ తరువాయి చెక్కులను అనుమతించాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. రికార్డుల సంరక్షణ బాధ్యత కార్యదర్శిదే.. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించిన ప్రభుత్వం రికార్డుల సంరక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై పెట్టింది. పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలలో సెక్షన్ 43 ప్రకారం గ్రామ పంచాయతీ నిధిని, పంచాయతీచే స్వీకరించబడిన ఇతర నిధులను సంరక్షించడానికి పంచాయతీ కార్యదర్శిని సంరక్షుడిగా నియమించింది. చెక్కులు జారీ చేసే ముందు నిధుల ఖర్చుకు సంబంధించి రికార్డులను నమోదు చేసి, అన్ని రకాల ఎంట్రీలను పూర్తి చేసిన తర్వాతే చెక్కులు రాసి సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో చెక్కుపై సంతకం తీసుకుని జారీ చేయాల్సి ఉంటుంది. రికార్డులు సక్రమంగా లేకుండా, అవకతవకలతో చెక్కులు జారీ చేస్తే పంచాయతీ కార్యదర్శినే బాధ్యుడిని చేస్తూ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎంపీడీఓల ఎదుట సర్పంచ్, ఉప సర్పంచుల సంతకాలు.. జాయింట్ చెక్ పవర్ కల్పించే విషయంలో ప్రతి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచులు ఎంపీడీఓల ఎదుట సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. జాయింట్ సంతకాలను ధ్రువీకరించిన ఎంపీడీఓలు సంబందిత బ్యాంకుకు, సబ్‌ట్రెజరీకి, గ్రామ పంచాయతీకి జాయింట్ సంతకాలతో కూడిన పత్రాలను పంపిస్తారు. ఆయా కార్యాలయాల్లో వారి పేర్ల మీద ప్రత్యేక ఖాతాలను తెరుస్తారు. అప్పుడు సర్పంచ్, ఉప సర్పంచ్ల సంతకాలతో కూడిన చెక్కును డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. సర్పంచ్‌లుగా గెలిచి ఐదు నెలలవుతున్నా చెక్ పవర్ రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుబడ్డాయి. పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించలేకపోయారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు సొంత డబ్బులు వెచ్చించి పనులు చేశారు. కొందరు సర్పంచ్‌లు ఇందుకు అప్పులు చేశారు. -
ఇక ప్రత్యేక పాలనే?
నెల్లూరు(అర్బన్): గ్రామాల్లో ప్రజాప్రతినిధిలుగా ఓ వెలుగు వెలిగిన పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం బుధవారంతో ముగియనుంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం ఫలితాల్లో చేదు అనుభవం ఎదురవుతుందని భయపడింది. ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఐదేళ్లు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు హోదా ఉన్నవారంతా మాజీలు కానున్నారు. ఇప్పటికే తెలంగాణాలో ప్రత్యేక అధికారుల పాలన ఉండటంతో ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఇటీవల జరిగిన క్యాబినెట్లో సైతం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా తమనే పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగిస్తారని కొంతమంది ఆశావహులైన సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు. ఇతర జిల్లాలో ఓ సర్పంచ్ మరొక ముందడుగు వేసి ఏకంగా కోర్టుకెళ్లాడు. ఎన్నికలు జరిగే వరకు తమను పర్సన్ ఇన్చార్జిలుగా నియమించాలని కోరాడు. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక అధికారుల పాలన వైపే మొగ్గు చూపింది. విధివిధానాలు సిద్ధం పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు సిద్ధం చేసింది. ఉన్న నిధుల్లో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీత భత్యాలకు 30శాతం, నీటిసరఫరా కోసం 15 శాతం, పారిశుద్ధ్య నిర్వహణకు 15 శాతం, వీధి దీపాల నిర్వహణకు 15శాతం, అంతర్గత రోడ్లు, మరమ్మతుల కోసం 20 శాతం, సమావేశాలు, మిసిలేనియస్ ఖర్చుల కోసం ఐదు శాతం నిధులు వినియోగించుకోవాలి. ప్రత్యేక అధికారులు నిర్వర్తించాల్సిన విధులు తాగునీటి సరఫరాలో పరిశుభ్రత, నూతన నిర్మాణాలకు అనుమతులు, కొత్త నిర్మాణాలకు ఇంటి నంబర్లు కేటాయింపు, ట్రేడ్ లైసెన్స్‌లు, దుకాణాలు, వాణిజ్య–వ్యాపార అనుమతులు జారీ చేయడం, గ్రామ రికార్డులు అప్‌గ్రేడ్ చేయడం, తాగునీటి పైపుల లీకేజీలు అరికట్టడం, మోటార్ల మరమ్మతులు, గ్రామాల్లో మార్కెట్లు, ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసే దుకాణాలకు పన్నులు వసూళ్లు చేయడం, ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడం తదితర విధులను అధికారులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే తాగునీటిలో క్లోరినేషన్, తడిచెత్త–పొడిచెత్తను నిర్వహించడం, ప్రభుత్వ స్థలాలు, బడుల్లో మొక్కలు నాటడం, రోడ్లును ఊడ్చడం, కాల్వలను క్లీన్ చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. నిధులు వాడు కోవచ్చు పంచాయతీకి సంబంధించిన వేతనాలు, ఖర్చుల కోసం ని«ధులు విడుదల చేసే అ««ధికారాన్ని ప్రత్యేక అధికారులకు కల్పించారు. ఏదైనా సంస్థలకు అప్పు ఉంటే చెల్లించవచ్చు. ఉత్సవాల నిర్వహణకు, ప్రజల వినోదం, గ్రామంలోని పేదలను ఆదుకునేందుకు వీలు కల్పించారు. ∙జరిమానా విధించవచ్చు ∙గ్రామాల్లో ఖాళీ, పబ్లిక్ స్థలాలను రోడ్లను ఆక్రమిస్తే జరిమానా విధించవచ్చు. ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్ 90శాతం గ్రామాలు కేంద్రం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడి అభివృద్ధి పనులు సాగిస్తున్నాయి. ఎన్నికలు జరపనందున న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కేంద్రం 14తో పాటు రాబోయే 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకుండా ఆపేస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించనందున కేంద్రం ఇలాగే నిధులు ఆపేసినప్పుడు గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయిన సంఘటనలు కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ దఫా టీడీపీ ప్రభుత్వంలో అవే ఇబ్బందులు తలెత్తనున్నాయి. పల్లె ప్రగతికి ఆటంకం ప్రత్యేక అధికారుల (స్పెషల్‌ఆఫీసర్లు) పాలన రానుండటంతో పల్లె ప్రగతికి ఆటంకం ఏర్పడనుంది. నెల్లూరు జిల్లాలో 940 పంచాయతీల్లో 22 లక్షల మంది నివసిస్తున్నారు. గ్రామాల్లో తాగునీటి పథకాలు మరమ్మతులకు గురైనా, వీధిదీపాలు వెలగకపోయినా, ఇతరత్రా గ్రామ తక్షణ అవసరాలకు సర్పంచ్‌లు మొదట తమ జేబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టేవారు. తరువాత నిదానంగా బిల్లులు పెట్టుకుని డ్రా చేసేవారు. ప్రత్యేక పాలనలో ఆస్వేచ్ఛ ఉండదు. నిబంధనల ప్రకారం జరగాల్సిందే. కార్యదర్శి, ప్రత్యేకాధికారి సంయుక్త సంతకాలతో ఫైళ్లు నడవాలి. ఈ తంతు జరగాలంటే కొంత అలస్యం తప్పదు. ప్రజలు ఇబ్బందులు పాలు కాక తప్పదు. -
కొత్త పాలన
కరీంనగర్: పల్లెల్లో కొత్త పండుగకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇదివరకు సర్పంచులు, వార్డు మెంబర్ల పాలనలో సాగిన గ్రామాలు గురువారం నుంచి కొత్త అధికారులు పాలించనున్నారు. పల్లెల్లో పండుగ వాతావరణం కల్పించేందుకు స్పెషల్ ఆఫీసర్లు సమాయత్తమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 276 పాత గ్రామ పంచాయతీలతోపాటు కొత్తగా మరో 53 పంచాయతీలు ఏర్పడ్డాయి. కాగా.. కరీంనగర్ నగర పాలక సంస్థ, హుజూరాబాద్ మున్సి పాలిటీ, జమ్మికుంట నగర పంచాయతీలలో 15 పంచాయతీలను విలీనం చేశారు. కొత్తపల్లి, చొప్పదండి మండల కేంద్రాలను మున్సిపాలిటీగా గుర్తించడం, కరీంనగర్ నగర పాలక సంస్థలో విలీనంపై హైకోర్టుకు వెళ్లిన 8 గ్రామాలను తిరిగి పంచాయతీలుగా కొనసాగించాలని తీర్పు వచ్చింది. దీంతో జిల్లాలో ఉన్న మొత్తం 329 పంచాయతీల్లో స్పెషల్ అధికారుల పాలన కొనసాగనుంది. పల్లెల ప్రగతే ప్రధాన లక్ష్యంగా స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలనకు విధులు ఖరారయ్యాయి. ఈ మేరకు మార్గదర్శకాలను అధికారులు జారీ చేశారు. నిధులను ఏయే అంశాలకు ఎంత మేరకు ఖర్చు చేయాలనేది నిర్దేశించారు. గ్రామాల పాలకవర్గం పదవీకాలం మంగళవారంతో ముగిసిపోనుంది. 5 సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న సర్పంచులు, వార్డు మెంబర్లు తమ విధులకు వీడ్కోలు చెప్పనున్నారు. ఆగష్టు 2 నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. గడువు ముగిసిపోతున్న పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనా రిజర్వేషన్ల అంశాలను తేల్చేవరకు ఎన్నికలు నిర్వహించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రత్యేక అధికారుల నియామకం అనివార్యమైంది. మంగళవారం వారికి గ్రామాల బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండలస్థాయిలో ఎంపీడీవోలు ప్రత్యేక అధికారుల పాలనను అమలు చేస్తూ ప్రొసీడింగ్స్ వెలువరించనున్నారు. ప్రత్యేక అధికారుల విధులను ఖరారు చేస్తూ మార్గదర్శకాలను సైతం జారీ చేశారు. గ్రామ పంచాయతీల నిధులను వినియోగించడంపై మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. నిధుల వినియోగాన్ని ఆరు విభాగాలుగా వర్గీకరించారు. 2 నుంచి కొత్త పండుగే... ఆగష్టు 2 నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధి కారుల పాలన ప్రారంభం కానున్న నేపథ్యం లో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిం చేలా.. కొత్త పాలనను ప్రారంభించాలని ప్రభుత్వం పూనుకుంది. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్త పాలన ఎలా చేయాలి.. గ్రామాల్లో తొలి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి.. తదితర విషయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించారు. పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో సంబురంగా తొలి రోజు ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల కార్యాలయాలకు రంగులు వేసి అలంకరించాలని ఆదేశించారు. కొత్త కార్యాలయాల ప్రారంభోత్సవం సందర్భంగా కూడా పెద్దఎత్తున టపాసులు కాల్చి స్వీట్లు పంచి పెట్టాలని ఆదేశించారు. -
‘పంచాయతీ’ వాయిదాకే మొగ్గు!
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయడానికే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గుచూపుతుంది. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగుస్తుండగా..తిరిగి ఎన్నికలు నిర్వహించకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ విషయమై ప్రభుత్వం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ ఉన్నతాధికారుల అభిప్రాయం కోరింది. ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం నుంచి అందిన మెమో నం 1281కు జవాబిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం ఒక నివేదికను అందజేశారు. సకాలంలో ఎన్నికలు జరగని పక్షంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం –1994లోని సెక్షన్ 143(3) సర్పంచుల స్థానంలో గ్రామ పంచాయతీలకు వేర్వేరుగా ప్రత్యేకాధికారులను నియమించడం లేదంటే ప్రస్తుత సర్పంచులనే ఆరు నెలల పాటు పర్సన్ ఇన్చార్జులుగా నియమించాలా అన్న దానిపై ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేయాలంటూ నివేదికలో పేర్కొన్నారు. పదవీ కాలం పొడిగించాలంటూ సర్పంచుల సంఘాల వినతి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆసక్తిగా లేదన్న సమాచారంతో సర్పంచుల సంఘాలు తమ పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నాయి. అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి వీరాంజనేయులు, గుంటూరు జిల్లా ఎస్సీ సర్పంచుల సంఘం అధ్యక్షులు సుజాత కిషోర్, జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి గౌస్ సంథాని తదితర ప్రతినిధుల బృందం శుక్రవారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్య దర్శి జవహర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. -
కేసీఆర్ సర్పంచ్‌గా మాత్రమే గెలుస్తారు
నల్లగొండ టూటౌన్: వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో ఓడిపోతారని, ఎర్రవల్లి గ్రామ సర్పంచ్‌గా మాత్రం గెలుస్తారని సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు ఎవరు సంతోషంగా లేరన్నారు. వైఎస్ఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబును గడగడలాడించారని, త్వరలోనే కేసీఆర్‌కు కూడా అలాంటి పరిస్థితే వస్తుందన్నారు. -
పాపం.. సర్పంచ్
* సీఎంను కలిసేందుకు అనుమతివ్వని పోలీసులు * ఏజేసీ చెన్నకేశవరావునూ అడ్డుకున్న రోప్ పార్టీ * ఇదేమి న్యాయమని పోలీసులను నిలదీసిన రైతులు సాక్షి, విజయవాడ బ్యూరో : రాజధాని అమరావతిలో వెలగపూడి గ్రామానికి రాష్ట్ర స్థాయిలో ఓ ప్రత్యేకత ఉంది. రాజధానికి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తోంది ఇక్కడే. రాజధాని చరిత్రలో తొలి నిర్మాణాలకు నెలవుగా మారిన వెలగపూడి అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ గ్రామ సర్పంచ్‌కి మాత్రం ప్రభుత్వ, ప్రొటోకాల్ పరంగా సరైన ప్రాధాన్యం లభించడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు సర్పంచ్‌కు ఇవ్వాల్సిన గౌరవాన్ని విస్మరిస్తున్నారు. దీంతో ఏడు పదుల వయస్సున్న గ్రామ సర్పంచ్ కంచర్ల శాంతకుమారి మంగళవారం సీఎంను కలవడం సాధ్యం కాక, నిర్లిప్తతతో వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం చంద్రబాబునాయుడు వెలగపూడి సచివాలయ నిర్మాణ పనుల వద్దకు చేరుకున్నారు. ఆయనను కలిసేందుకు గంట ముందుగానే అక్కడికి చేరుకున్న సర్పంచ్ శాంతకుమారి సీఎం రాగానే లోపలకు పంపాలని అక్కడున్న పోలీసులను కోరింది. పోలీసులెవ్వరూ పట్టించుకోలేదు. కనీసం సమాధానం కూడా చెప్పలేదు. దగ్గరకెళ్లి తన చేతిలో ఉన్న గుర్తింపు కార్డును చూపి అక్కడున్న అధికారులనూ ప్రాధేయపడింది. ఫలితం లేకపోవడంతో మండు టెండలో పావుగంట సేపు నిలబడిన ఆమె ఆ తర్వాత పక్కనే ఉన్న టెంటు నీడలో కూర్చుండిపోయారు. ఎడమ కంటిలో శుక్లం తీయించుకున్న కారణంగా సోమవారం తెల్లవారు జామున జరిగిన సచివాలయ ప్రారంభోత్సవానికి రాలేకపోయానని, అదే విషయాన్ని సీఎంకు వివరించడానికి వచ్చానని ఆమె మీడియాకు వెల్లడించారు. ప్రొటోకాల్ ప్రకారం గ్రామ సర్పంచ్‌నైన తనకు సీఎంను కలిసే అవకాశం ఇవ్వాల్సి ఉందని ఆమె గుర్తు చేశారు. ఆ తర్వాత ఇక లాభం లేదనుకున్న ఆమె నిశ్శబ్దంగా లేచి ఇంటి ముఖం పట్టారు. అడ్డుకున్న రోప్ పార్టీ .. భూ సమీకరణ సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన సీఆర్డీఏ అదనపు జాయింట్ కమిషనర్ చెన్నకేశవరావుకూ ఇలాంటి అవమానమే ఎదురైంది. ఎంత చెప్పినా వినిపించుకోని పోలీసులు ఆయన్ని లోపలకు అనుమతించలేదు. రోప్ పార్టీ ఆయన్ని అడ్డుకుంది. దీంతో ఆయన కూడా వెనుదిరిగి వెళ్లిపోయారు. మండిపడ్డ రైతులు... సీఎంను కలిసి వినతి పత్రం అందజేయాలని వచ్చిన మూడు గ్రామాల రైతులు కూడా పోలీసులపై మండిపడ్డారు. ‘విజయవాడ పోతే కలవనీయరు... ఇక్కడికొచ్చినా కలిసే అవకాశం ఇవ్వరు... ఏంటండీ ఇదీ’ అంటూ పోలీసు అధికారులను నిలదీశారు. మందడం, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలకు చెందిన బెజవాడ సాంబశివరావు, నరసింహారావులతో పాటు పది మంది రైతులు వినతిపత్రంతో వచ్చారు. జరీబు భూములిచ్చిన తమకు అదనంగా మరో 50 గజాల ప్లాట్లు ఇవ్వమని కోరేందుకు వచ్చారు. పోలీసులు అనుమతివ్వకపోవడంతో సీఎం వెళ్లిపోయాక తహశీల్దార్ సుధీర్‌బాబును కలిశారు. ఈ సందర్భంగా రైతులు కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. -
ట్రాక్టర్‌పై నుంచి జారిపడి సర్పంచ్ భర్త మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ట్రాక్టర్‌పై నుంచి జారి పడడంతో ఒకరు మృతి చెందారు. జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామసర్పంచ్ అనిత భర్త నాగేశ్వరరావు(30) గురువారం ఇంటి నుంచి పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌పై నుంచి జారిపడడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామసర్పంచ్ కుటుంబంలో విషాదం నెలకొంది. -
దాడి చేసిన సర్పంచ్‌పై కేసు పెట్టాలి
సంగారెడ్డి అర్బన్: తనకు అనుకూలంగా ఓ కేసు విషయమై తప్పుడు సాక్ష్యం చెప్పాలని గ్రామ సర్పంచ్ ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ సర్పంచ్ బాల్‌రాజ్ సదాశివపేటకు చెందిన తుల్జారాంను తప్పుడు సాక్ష్యం చెప్పాలని కోరాడు. దానికి అతను నిరాకరించడంతో బాల్‌రాజ్ తన అనుచరులతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ విషయం తెలిసిన స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి తుల్జారాంను రక్షించారు. తనపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ డా.ఎ.శరత్‌కు తుల్జారాం ఫిర్యాదు చేయగా, ఈ విషయమై జేసీ శరత్ స్పందిస్తూ ఈ విషయమై తాను జిల్లా ఎస్పీతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. అలాగే వ్యక్తిగతంగా ఎస్పీని కలవాలని సూచించారు. సోమవారం ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ శరత్, సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందజేశారు. ⇒ హత్నూర మండలం పల్పనూర్ గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ⇒ మనూర్ మండలం కసర్గుత్తి గ్రామానికి చెందిన శాంతాబాయి వికలాంగుల పింఛన్ కోసం, శంకరంపేట(ఆర్)కు చెందిన రాములు వికలాంగుల కోటాలో ట్రైసైకిల్ మంజూరుకు వినతి. ⇒ మెదక్ మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కాట్రోత్ గోపాల్ గిరిజన సంక్షేమ శాఖ ద్వారా బోర్ మోటారు మంజూరుకు డిమాండ్. ⇒ కొండపాక గ్రామానికి చెందిన ఎంగయ్య తన భూమి రికార్డుల ప్రకారం సరిచేయాలని కోరారు. ⇒ న్యాల్కల్ మండలం తుజాల్‌పూర్‌కి చెందిన మణెమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు రుణం ఇప్పించాలని కోరారు. ⇒ ఝరాసంగం మండలం కుప్పనగర్ గ్రామపరిధిలోని సర్వే నెంబర్ 62 ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కంకర క్రషర్ మిషన్ నడుపుతున్నందున చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ⇒ మెదక్ మండలం ఔసలిపల్లి గ్రామానికి చెందిన శంకరమ్మ, సోని, సుజాత, కళావతి, లక్ష్మీలకు చెందిన భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని, తమకు చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ⇒ అనావృష్టి వల్ల రైతులకు తగిన దిగుబడి రానందు వల్ల పూర్తి స్థాయిలో రైతులు బ్యాంక్ రె న్యువల్ చేయడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండి బ్యాంక్ లోన్స్ రెన్యువల్స్ చేయలేకపోతున్నారని, రెన్యువల్ చేయలేని రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, నాయకులు రంగాగౌడ్, పాపయ్యలు జిల్లా జాయింట్ కలెక్టర్ శరత్‌ను కోరారు. -
గరీబోళ్ల భూములపై గద్దలు!
దళిత భూ పంపిణీలో అవినీతి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/కొండాపూర్: ప్రతి నిరుపేద దళితుణ్ణి మూడు ఎకరాల సాగు భూమికి ఆసామిని చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన దళితులకు భూమి పంపిణీ పథకం ప్రహసనంగా మారుతోంది. భూమి కొన్నది ముగ్గురి దగ్గర నుంచే.. పంచింది కూడా ముగ్గురికే కానీ, ఈ ముగ్గురిని.. ఆ ముగ్గురిని కలిపి ఓ గ్రామ సర్పంచ్ భర్త అనుచరులు, మధ్యవర్తులు కలసి ముప్పై ఆరు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. పథకం మొదలైంది కేవలం నాలుగైదు మండలాల్లో మాత్రమే.. కానీ అప్పుడే అవినీతి వ్యవహారం వెలుగు చూడటంతో దళిత వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తొలివిడత కింద 9 నియోజకవర్గాల్లో కనీసం 167మంది రైతులకు మూడు ఎకరాల చొప్పున 900 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం కోసం 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో 6 మంది.. ముఖ్యమంత్రి చేతుల మీదుగా గోల్కొండ కోట వద్ద పట్టాలు తీసుకోగా.. 34 మంది దళిత మహిళలు మంత్రి హరీష్‌రావు చేతుల మీద సంగారెడ్డిలో పట్టాలు తీసుకున్నారు. ఎమ్మార్వో పేరు చెప్పి.. కొండాపూర్ మండలం మారేపల్లిలో 11 మంది మహిళలు మొదటి విడత పంపిణీకి అర్హులని, ఇందుకోసం 33 ఎకరాల భూమి అవసరం అవుతుందని అధికారులు నిర్ధారించారు. మారేపల్లి శివారులోని అనంతసాగర్ గ్రామాలకు చెందిన రైతులు మడిగెల శేఖర్, రామప్ప, అమృతమ్మల వద్ద నుంచి 41 సర్వే నంబర్లో ప్రభుత్వం తొమ్మిది ఎకరాలను కొనుగోలు చేసింది. అధికారులు, గ్రామ కమిటీ కలసి ఎకరాకు రూ 3.50 లక్షలు నిర్ధారణ చేయగా ప్రభుత్వం పూర్తి డబ్బును చెక్కు రూపంలో రైతులకు చెల్లించింది. ఈ భూమిని మచుకూరి చంద్రకళ, లక్ష్మి, పట్లూరి సుజాత అనే దళిత మహిళలకు పంపిణీ చేశారు. అయితే భూమి ధర నిర్ణయంలో, లబ్ధిదారుల ఎంపికలో సర్పంచ్ భర్త అనుచరులు కీలక పాత్ర పోషించారు. పంపిణీ కార్యక్రమం మరుసటి రోజు నుంచే సర్పంచ్ భర్త అనుచరులు తమకు కాగితాల ఖర్చులు, అధికారుల రాకపోకలకు ఖర్చులు అయ్యాయని చెప్పి లబ్ధిదారుల నుంచి మనిషికి రూ. 10 వేలు చొప్పున తీసుకున్నారు. ఇక పట్టాదారులపై వల విసిరారు. తమ వల్లే భూమికి ఎక్కవ ధర వచ్చిందని, రూ 2 లక్షలు కూడా పలకని భూమిని రూ 3.50లక్షలు ఇప్పించాము కాబట్టి ఎకరాకు రూ 50 వేల చొప్పున తమకు ఇవ్వాలని రైతులను డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన అనుచరుడు మల్లేష్ ద్వారానే ఈ దందా నడిచినట్లు తెలుస్తోంది. పై అధికారుల నుంచి సర్పంచ్ మీద ఒత్తిడి ఉందని, ఎమ్మార్వోకు కూడా డబ్బులు ఇవ్వాలంటూ రైతుల్ని బెదిరిస్తున్నారు. ఎకరాకు రూ. 50 వేలు ఇస్తేనే భూమి తీసుకుంటామని, లేదంటే మీ భూమి మీరు తీసుకోండి అంటూ మధ్యవర్తి రైతులను బెదిరిస్తుండగా సాక్షి పేపర్, సాక్షి టీవీ రికార్డు చేసింది. కాగా బెదిరింపులు మేం భరించలేమని ప్రభుత్వం కోరితే ఇచ్చిన భూమి వెనక్కి తీసుకుంటామని రైతులు ఆవేదన తో ‘సాక్షి’తో చెప్పారు. మరో ట్విస్ట్.. అధికారులు ముగ్గురు మహిళలకు మూడు ఎకరాల చొప్పున భూమి పంపిణీ చేస్తూ పట్టాలిచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా లబ్ధిదారులకు ఒక మెలికపెట్టారు. పట్టాలు ఇచ్చినప్పటికీ వాళ్లు ఈ ఏడాది సాగు చేసుకోవడానికి వీల్లేదని మెలికపెట్టారు. ఇప్పటికే వెంకయ్య అనే కౌలు రైతు చేతిలో ఉన్న ఈ భూమిని, ఆయన కౌలు గడువు ముగిసిన తర్వాతనే కబ్జాలోకి వెళ్లాలని ఆధికారులు ఆదేశించడంతో పాపం లబ్ధిదారులు సంతోషపడలేక, బాధపడలేక మౌనంగా ఉండిపోయారు. డబ్బులు ఇవ్వకుంటే.. నేను సర్కారుకు మూడు ఎకరాలు అమ్మిన. ఎకరానికి రూ. 3.50 లక్షల చొప్పున ఇచ్చిండ్రు. ఈ డబ్బుల నుంచి రూ. 80 వేలు ఇవ్వమని పెద్దపటేల్ అనుచరులు మధ్యవర్తితో సెప్పుతుండు. గన్ని పైసలు ఎట్టా ఇత్తా పటేలా అంటే ఇంటలేడు. తాశీల్దారు గీతమ్మకు ఇయ్యాలనిజెప్పి ఒక్కటే గాయ్..గాయ్ జేస్తుండు. ‘డబ్బులు మాత్రం ఎవరికీ ఇవ్వొద్దని’ తాశీల్దార్ మేడం స్వయంగా నాతో చెప్పారు. కానీ మధ్యవర్తులు రూ .80వేలు ఇత్తవా? లేదా? అంటూ బెదిరిస్తున్నారు. నా భర్త చనిపోయాడు. బిడ్డ పెళ్లిజేసిన అప్పులు మీద పడ్డయ్. భూమి అమ్మి అప్పులు కట్టుకున్న. ఇప్పుడు సర్పంచు భర్త మనుషులు వచ్చి డబ్బులు ఇవ్వకుంటే భూమి లాక్కుంటామని బెదిరిస్తున్నారు. - మడిగెల అమృతమ్మ, అనంతసాగర్ -
గ్రామ సర్పంచ్‌పై ఆగంతకులు కత్తులతో దాడి
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిరాల గ్రామ సర్పంచ్ ముక్కిరాల కృష్ణపై శనివారం ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆ ఘటనలో కృష్ణ తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. దాంతో దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ముక్కిరాల కృష్ణను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా కృష్ణపై దాడికి సంబంధించి పోలీసులు ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. -
నేటినుంచి సంగమేశ్వర స్వామి జాతర
కౌడిపల్లి, న్యూస్‌లైన్: మండలంలోని కొట్టాల గ్రామంలో కొలువుదీరిన శ్రీ సంగమేశ్వర స్వామి జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ బెంది లత రమేష్‌గౌడ్ తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజల పాటు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. 16న బండ్ల ఊరేగింపు, 17న అగ్ని గుండాలు తొక్కుట, పాచి బండ్ల ప్రదర్శన, ఒగ్గుకథ, 18వ తేదీ రాత్రి రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్‌లకు ఓటుహక్కు కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌లకు ఓటు హక్కు కల్పించాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం రంగారెడ్డి జిల్లా శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు హజరే శ్రీనివాస్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరి గిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సర్పంచ్‌లకే కాకుండా పూర్వ సర్పంచ్‌లకు కూడా ఈ ఓటు హక్కు వర్తిం చేలా చూడాలన్నారు. రాజ్యాంగంలోని 73వ అధికరణ ప్రకారం పంచాయతీ నిధులు, విధులు గ్రామ సర్పంచ్‌లకే ఇవ్వాలన్నారు. మైనర్ గ్రామ పంచాయతీలకు తాగునీటి సరఫరా, మోటారు కరెంట్ బిల్లు, వీధిలైట్ల కరెంట్ బిల్లు ప్రభుత్వమే భరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఎస్ఎఫ్సీ బిల్లులు నేరుగా గ్రామ పంచాయతీలకే చెందేలా చూడాలన్నారు. గ్రామ సర్పంచ్‌లకు రూ.2500 వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్.నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడిగా అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా శంకర్లను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బొడ్డు నిర్మల, సంతోష, బాబు తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ హత్య...
హుజూరాబాద్, న్యూస్‌లైన్ : వీణవంక మండలం నర్సింగాపూర్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఉయ్యాల బాలరాజు దారుణహత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. ఇంతకు ముందు కూడా రాజకీయ నాయకులు హత్యకు గురైనప్పటికీ వారి కుటుంబసభ్యులో, లేక ఇతర మిత్రులో చంపడం జరిగింది. తొలిసారిగా రాజకీయ కక్షలతో బాలరాజును మట్టుబెట్టడం చర్చనీయాంశమైంది. ఫ్యాక్షన్ రాజకీయాలను తెరకెక్కిస్తూ, గొడ్డళ్లతో ఓ మాజీ ప్రజాప్రతినిధిని హత్య చేయడం వెనుక ప్రస్తుత ప్రజాప్రతినిధి హస్తం ఉందని తెలియడంతో అన్ని పార్టీల నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ సర్పంచ్, మరో ఇద్దరి హస్తం.. బాలరాజును పక్కా పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది. నర్సింగాపూర్ సర్పంచ్ జడల రమేశ్, అత డి బావమరిది వంగ రమేశ్, మరో వ్యక్తి రవీందర్‌రెడ్డి కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాలరాజు హత్యకు గురైన ప్రదేశంలో కుమార్ అనే వ్యక్తి ఉండడంతో అనుమానించి పోలీసులు అతడిని విచారణ జరపగా.. వారి పేర్లు వెల్లడించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బాలరాజుపై రమేశ్ సర్పంచ్‌గా గెలుపొందాడు. చేనేత సంఘం ఎన్నికల్లో రమేశ్ విజయం సాధించాడు. దీంతో గ్రామంలో వీరిద్దరి మధ్య వైరం నెలకొన్నట్లు తెలిసింది. పలుమార్లు వాగ్వివాదానికి దిగినట్లు చెబుతున్నారు. రమేశ్‌ను, అతడి కుటుంబసభ్యులను బాలరాజు అసభ్యపదజాలంతో దూషించాడని, ప్రతి విషయంలో, రాజకీయంగా తనకు అడ్డు వస్తున్నందునే రమేశ్ ఈ హత్యచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. రాజకీయ వర్గాల్లో కలకలం.. వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, పత్రికల ద్వారా ఆరోపించుకోవడం మాత్రమే జరిగేది. ఎన్నికల సమయంలోనూ బరిలో నిలిచేవారు వాగ్వివాదాలు చేసుకోవడం, ఎన్నికలు పూర్తికాగానే గెలుపోటములతో సంబంధం లేకుండా కలిసిపోవడం చూస్తున్నాం. తొలి సారిగా ఫ్యాక్షన్ రాజకీయాలకు అంకురార్పణ చేస్తూ ఈ హత్య జరగడంతో హుజూరాబాద్ ప్రాంతంలోని రాజకీయ వర్గాల్లో కలకలం మొదలైంది. వచ్చేది న్నికల సీజన్ కావడం, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ హత్య జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
మరీ ఇంత చులకనా!
నవాబుపేట, న్యూస్‌లైన్: ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అంటే ఇదేనేమో. గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా అన్నీతానై వ్యవహరించే గ్రామ సర్పంచ్ వేతనం అక్షరాల ఆరొందలంటే నమ్మడం కష్టంగానే ఉంటుంది. కానీ ఇది నిజం. ఈ రోజుల్లో వెయ్యి ఓట్లున్న గ్రామంలో సర్పంచ్ పదవి దక్కాలంటే కనీసం ఐదు లక్షలైనా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. హోరాహోరీ పోరులో పీఠం కోసం అనేక పాట్లు పడాలి. తీరా కుర్చీమీద కూర్చున్నాకగానీ అసలుతత్వం బోధపడదు. ఒకవైపు ఏ పనికీ పైసా విదిల్చని ప్రభుత్వం.. మరోవైపు ‘ఓట్లేస్తే గ్రామానికి ఏమీ చేయవా..’ అంటూ ప్రజల చీవాట్లు. గత అనుభవం ఉన్న వారి సంగతి వదిలేస్తే కొత్తగా ఎన్నికైన వారు మాత్రం ఈ పరిస్థితులను చూసి తలలు పట్టుకుంటున్నారు. పల్లెకు ప్రథమ పౌరులుగా వ్యవహరించే సర్పంచ్‌లకు ఉదయం లేచింది మొదలు గ్రామానికి సంబంధించిన అనేక పనులుంటాయి. పింఛన్లు, రేషన్ కార్డులు ఇప్పించడం, గ్రామంలో పంచాయతీలు చేయడం, మురికి కాలువలు, రోడ్లు.., మంచి నీటి వసతి తదితర సమస్యలు ఊపిరి సలపనివ్వవు. ఇంత చాకిరీ చేస్తున్న సర్పంచ్‌లకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం రూ.600. ఇవి ఏమాత్రం సరిపోని మాట వాస్తవం. లక్షల రూపాయలు ఖర్చు చేసి గెలుపొందిన వీరంతా ఇప్పుడు అందుతున్న వేతనం చూసి అవాక్కవుతున్నారు. మరీ ఇంత తక్కువా.. అని వాపోతున్నారు. అయితే ఇందులో ప్రభుత్వం నుంచి వస్తున్నది రూ.300లే. ఇది కూడా రెండేళ్ల కొకసారి ఇస్తుంటారు. దీనికి ఆయా గ్రామ పంచాయతీ నిధుల నుంచి మరో రూ.300లు జమ చేస్తారు. మేజర్ పంచాయతీల్లో ప్రభుత్వం రూ.500, పంచాయతీ నుంచి మరో రూ.500 ఇస్తారు. అది కూడా పంచాయతీలో జనరల్ ఫండ్ ఉంటేనే సుమా. మొదటి నుంచీ చిన్నచూపే.. పంచాయతీ కార్యదర్శికి నెలకు రూ.10 వేలకు పైగానే వేతనం అందుతోంది. పారిశుధ్య కార్మికులను రూ. వెయ్యి నుంచి మూడు వేల వరకు ఇస్తున్నారు. అయితే ఇంత తక్కువ వేతనం వస్తున్నా సర్పంచ్‌లు ఏ నాడూ వేతనాలు పెంచాలని ఉద్యమాలు చేయలేదు. ప్రస్తుతం చెక్ పవర్ కోసం చేస్తున్న ఉద్యమంలో జీతాల పెంపు అంశాన్ని చేర్చాలని పలువురు సర్పం చ్‌లు కోరుతున్నారు. కనీసం రూ.10 వేలన్నా ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇది అన్యాయం.. గ్రామంలో అన్ని పనులు చక్కబెట్టాలి. నిత్యం మండలానికి వెళ్లిరావాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే వేతనం దారి ఖర్చులకు కూడా సరిపోదు. సర్పంచ్‌లు పూర్తి సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అందుకే పనికి తగిన వేతనం ఇవ్వాలి. - భీంరెడ్డి, పులుమామిడి, సర్పంచ్ కనీసం రూ.10 వేలు ఇవ్వాలి కేవలం రూ.600లకు ఈ రోజుల్లో ఏమోస్తుంది. ఇంత తక్కువ జీతం దారుణం. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవాలి. నెలకు కనీసం రూ.10 వేలు చెల్లిస్తేనే కనీస ఖర్చులు పెట్టుకోగలం. - సుధాకర్‌రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు. -
వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సర్పంచ్
వరంగల్: ప్రజా ప్రతినిధులు ఎవరైనా తమ బాధ్యతను గుర్తించి సమాజం పట్ల అంకిత భావంతో పని చేయాలి. అటువంటిది వారే పక్క తోవపట్టి కనీస విలువలు మరచిపోతే..ఇక ప్రజల గురించి పట్టించుకునే వారెవరు. గ్రామ సర్పంచ్ గా ఉంటూ పంచాయతీ కార్యాలయంలోనే వ్యభిచారం చేస్తే ఇక చేసేదేముంది. ఇటువంటి ఘటన తాజాగా తొర్రూరు గ్రామంలో కలకలం రేపింది. తొర్రూరు గ్రామానికి సర్పంచ్ గా ఉన్న రాజేశ్ నాయక్ అనే వ్యక్తి కాసేపు ప్రజా సమస్యలను పక్కకు నెట్టాడు. పంచాయతీనే వేదికగా చేసుకునే వ్యభిచారానికి పూనుకున్నాడు. ఈ నిర్వాకం బయటపడటంతో అతను కంగుతిన్నాడు. సర్పంచ్ ఉదంతాన్ని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. ఆ వ్యక్తి టీడీపీ సర్పంచ్ కావడంతో కేసు నుంచి తప్పించేందుకు... టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది..