నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిరాల గ్రామ సర్పంచ్ ముక్కిరాల కృష్ణపై శనివారం ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆ ఘటనలో కృష్ణ తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. దాంతో దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ముక్కిరాల కృష్ణను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా కృష్ణపై దాడికి సంబంధించి పోలీసులు ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు.