కేటీఆర్‌పై కేసు నమోదు | Police Case Filed Against BRS KTR In SSC Question Paper Leak Controversy, More Details Inside | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌పై కేసు నమోదు

Published Wed, Mar 26 2025 9:34 AM | Last Updated on Wed, Mar 26 2025 10:24 AM

Police Case Filed Against BRS KTR

సాక్షి, నల్లగొండ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. నల్లగొండ జిల్లాలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రజిత ఫిర్యాదు మేరకు నకిరేకల్‌ పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

వివరాల ప్రకారం.. తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌, మాస్‌ కాపీయింగ్ వ్యవహారంలో నిందితులతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ తమపై కేటీఆర్ ట్వీట్ చేశారని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రజిత తెలిపారు. దీనికి సంబంధించి.. బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ రజిత.. కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలో కేటీఆర్‌తో పాటు క్రిషాంక్, కొణతం దిలీప్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. నిందితుడు చిట్ల ఆకాష్ తన డ్రైవర్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆమె ఫిర్యాదుతో నకిరేకల్‌ పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. పేపర్ లీకేజీ ఘటనలో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement