చేతబడి అనుమానంతో వ్యక్తికి దేహశుద్ధి | Man attacked by villagers in nalgonda district | Sakshi
Sakshi News home page

చేతబడి అనుమానంతో వ్యక్తికి దేహశుద్ధి

Published Tue, Jun 30 2015 1:38 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Man attacked by villagers in nalgonda district

నల్లగొండ : చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని ఆ గ్రామస్తులు చితకబాదారు. ఈ సంఘటన మంగళవారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం కురంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటయ్య(35) అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడని గ్రామస్తులు గత కొంత కాలంగా అనుమాస్తున్నారు. ఆ క్రమంలో అతనిపై గ్రామస్తులు ముకుమ్మడిగా దాడి చేశారు.

ఈ దాడిని వెంకటయ్య సోదరుడు పెద వెంకటయ్యతోపాటు అతడి బావమరిది చంద్రయ్య అడ్డుకున్నారు. ఈ దాడిలో వారిద్దరు కూడా గాయపడ్డారు. అయితే వెంకటయ్య తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం నల్గొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement