కమ్మర్‌పల్లి (నిజామాబాద్): మండలంలోని హాసాకొత్తూర్‌లో శనివారం పంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధి పనులకు రావాలని కోరుతూ గ్రామంలో ఇంటింటా బొట్టు పెట్టి పిలిచే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ఏనుగు పద్మ, ఉపాధి హామీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కూలీలకు బొట్టు పెట్టి ఉపాధి హామీ పనులకు రావాలని ఆహ్వానించారు. ఉపసర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, జీపీ కార్యదర్శి రజనీకాంత్‌రెడ్డి, సిబ్బంది రమణ, వార్డు సభ్యులు కుందేటి పుష్ప, మేట్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment