మాల్ గ్రామ పంచాయతీ కార్యాలయం
సాక్షి,యాచారం(రంగారెడ్డి) : సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం సాయంత్రం కలెక్టర్ లోకేష్‌కుమార్ నుంచి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలకు ఉత్తర్వులు అందాయి. జనవరి 25న పంచాయతీ ఎన్నికలు జరగగా.. చెక్‌పవర్ కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు ఆలస్యం జరిగింది. ఐదు నెలల అనంతరం గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలోని 560 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
జాయింట్ చెక్ పవర్ ఉత్తర్వును సబ్‌ట్రెజరీలకు, అన్ని బ్యాంకుల మేనేజర్లకు పంపించి ఇచ్చి సర్పంచ్, ఉప సర్పంచ్‌లు సంతకాలు చేసిన మిగతా 2వ పేజీలో u uమొదటి పేజీ తరువాయి చెక్కులను అనుమతించాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. రికార్డుల సంరక్షణ బాధ్యత కార్యదర్శిదే.. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించిన ప్రభుత్వం రికార్డుల సంరక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై పెట్టింది. పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలలో సెక్షన్ 43 ప్రకారం గ్రామ పంచాయతీ నిధిని, పంచాయతీచే స్వీకరించబడిన ఇతర నిధులను సంరక్షించడానికి పంచాయతీ కార్యదర్శిని సంరక్షుడిగా నియమించింది. చెక్కులు జారీ చేసే ముందు నిధుల ఖర్చుకు సంబంధించి రికార్డులను నమోదు చేసి, అన్ని రకాల ఎంట్రీలను పూర్తి చేసిన తర్వాతే చెక్కులు రాసి సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో చెక్కుపై సంతకం తీసుకుని జారీ చేయాల్సి ఉంటుంది.
రికార్డులు సక్రమంగా లేకుండా, అవకతవకలతో చెక్కులు జారీ చేస్తే పంచాయతీ కార్యదర్శినే బాధ్యుడిని చేస్తూ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎంపీడీఓల ఎదుట సర్పంచ్, ఉప సర్పంచుల సంతకాలు.. జాయింట్ చెక్ పవర్ కల్పించే విషయంలో ప్రతి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచులు ఎంపీడీఓల ఎదుట సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. జాయింట్ సంతకాలను ధ్రువీకరించిన ఎంపీడీఓలు సంబందిత బ్యాంకుకు, సబ్‌ట్రెజరీకి, గ్రామ పంచాయతీకి జాయింట్ సంతకాలతో కూడిన పత్రాలను పంపిస్తారు. ఆయా కార్యాలయాల్లో వారి పేర్ల మీద ప్రత్యేక ఖాతాలను తెరుస్తారు. అప్పుడు సర్పంచ్, ఉప సర్పంచ్‌ల సంతకాలతో కూడిన చెక్కును డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. సర్పంచ్‌లుగా గెలిచి ఐదు నెలలవుతున్నా చెక్ పవర్ రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుబడ్డాయి. పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించలేకపోయారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు సొంత డబ్బులు వెచ్చించి పనులు చేశారు. కొందరు సర్పంచ్‌లు ఇందుకు అప్పులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment