rajesh nayak
-
మూడు నెలల పెళ్లి
బంజారా పండగలు ఏ స్థాయిలో జరుపుకుంటారు? హోళి, తీజ్ పండగల ప్రత్యేకత ఏంటి? బంజారా సంప్రదాయ దుస్తులు ఏ విధంగా ఉంటాయి? వంటి అంశాలతో తెరకెక్కనున్న చిత్రం ‘బంజారా జీవిత చరిత్ర’. నూతన నటీనటులతో డి. రాజేష్ నాయక్ దర్శకత్వంలో తాండూరు విఠల్ నాయక్ నిర్మించనున్న ఈ సినిమా మే మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో రాజేష్ నాయక్ మాట్లాడుతూ– ‘‘బంజారా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. విఠల్ నాయక్ మాట్లాడుతూ– ‘‘బంజారాలు నాటి జనరేషన్లో పెళ్లిని మూడు నెలలు జరుపుకునేవారు. బంజారా పండుగలను ఇంత వైభవంగా జరుపుకుంటారా? అని మా సినిమా చూసి ఆశ్చర్యపోతారు. తెలుగు, గుజరాతీ, హిందీ, కర్ణాటక భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నాం’’ అన్నారు. -
వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సర్పంచ్
వరంగల్: ప్రజా ప్రతినిధులు ఎవరైనా తమ బాధ్యతను గుర్తించి సమాజం పట్ల అంకిత భావంతో పని చేయాలి. అటువంటిది వారే పక్క తోవపట్టి కనీస విలువలు మరచిపోతే..ఇక ప్రజల గురించి పట్టించుకునే వారెవరు. గ్రామ సర్పంచ్ గా ఉంటూ పంచాయతీ కార్యాలయంలోనే వ్యభిచారం చేస్తే ఇక చేసేదేముంది. ఇటువంటి ఘటన తాజాగా తొర్రూరు గ్రామంలో కలకలం రేపింది. తొర్రూరు గ్రామానికి సర్పంచ్ గా ఉన్న రాజేశ్ నాయక్ అనే వ్యక్తి కాసేపు ప్రజా సమస్యలను పక్కకు నెట్టాడు. పంచాయతీనే వేదికగా చేసుకునే వ్యభిచారానికి పూనుకున్నాడు. ఈ నిర్వాకం బయటపడటంతో అతను కంగుతిన్నాడు. సర్పంచ్ ఉదంతాన్ని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. ఆ వ్యక్తి టీడీపీ సర్పంచ్ కావడంతో కేసు నుంచి తప్పించేందుకు... టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది..