రాజేశ్, విఠల్ నాయక్
బంజారా పండగలు ఏ స్థాయిలో జరుపుకుంటారు? హోళి, తీజ్ పండగల ప్రత్యేకత ఏంటి? బంజారా సంప్రదాయ దుస్తులు ఏ విధంగా ఉంటాయి? వంటి అంశాలతో తెరకెక్కనున్న చిత్రం ‘బంజారా జీవిత చరిత్ర’. నూతన నటీనటులతో డి. రాజేష్ నాయక్ దర్శకత్వంలో తాండూరు విఠల్ నాయక్ నిర్మించనున్న ఈ సినిమా మే మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో రాజేష్ నాయక్ మాట్లాడుతూ– ‘‘బంజారా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. విఠల్ నాయక్ మాట్లాడుతూ– ‘‘బంజారాలు నాటి జనరేషన్‌లో పెళ్లిని మూడు నెలలు జరుపుకునేవారు. బంజారా పండుగలను ఇంత వైభవంగా జరుపుకుంటారా? అని మా సినిమా చూసి ఆశ్చర్యపోతారు. తెలుగు, గుజరాతీ, హిందీ, కర్ణాటక భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment