ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కొత్త సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. సంపత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేశారు. గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)
తెలంగాణలోని రుద్రారం అనే ఊరి నేపథ్యంగా సినిమా ఉండనుంది. పరస్పరం గొడవలు పడే ఊరిలో లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నా రీసెంట్ మూవీ రామ్ నగర్ బన్నీ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది. నేను నా నెక్ట్స్ మూవీ ఎలా ఉండాలని అనుకున్నానో అలాంటి సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. దీనికి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా అని చంద్రహాస్ చెప్పాడు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment