banjara
-
జాతి జాగృతి కోసం.. బంజారా భగవద్గీత : కేతావత్ సోమలాల
రామంతాపూర్: పురాణాల ప్రకారం, దైవత్వాన్ని పొందిన మొట్టమొదటి ధార్మిక గ్రంథం భగవద్గీత. దీన్ని భారతీయ సంస్కృతి, సంస్కారాలను ప్రభావితం చేసిన జ్ఞాన ప్రవాహంగా పరిగణిస్తారు. హిందువులకు ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక గ్రంథం. మనిషి ఎలా మసులు కోవాలి.. కష్టసుఖాల్లో ఎలా వ్యవహరించాలి తదితర విషయాలపై మానవాళిని సన్మార్గంలో నడిపే పవిత్ర గ్రంథం భగవద్గీత. భారతీయ సంస్కృతికి గోపురం వంటి గీతను సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మానవ ప్రపంచానికి అందించారు. దాదాపు ప్రపంచంలోనే అన్ని భాషల్లోకి అనువదించబడినా బంజారాలకు మాత్రం చేరలేదు. దాంతో వారికి భగవద్గీత సారాన్ని అందించాలని అనుకున్నారు హబ్సిగూడవాసి కేతావత్ సోమ్లాల. తన జాతి జాగృతం కోసం మొక్కవోని సంకల్పంతో 16 నెలలు శ్రమించి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారాభాషలోకి అనువదించారు. తెలుగు లిపిలో బంజారాలకు సులభంగా అర్థమయ్యే రీతిలో గీతను మలిచి అందజేశారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలోని ఆకుతోట బావి తండాకు చెందిన సోమ్లాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తించి వీఆర్ఎస్ తీసుకున్నారు. విద్యార్థి దశలోనే బంజారాలను చైతన్యపరుస్తూ 200లకుపైగా పాటలు రాశారు. తండాలు తిరుగుతూ ఈ పాటలు పాడి బంజారాలను ఉత్తేజపరిచారు. విద్యార్థి దశలోనే బంజారా భాషలోకి అనువాదం చేసేందుకు ఎంతో శ్రమించారు. బంజారా భాషలో మల్లె మొగ్గ అనే పదాన్ని ఏమాంటారో తెలుసుకోవడం కోసం తిరగని తండా లేదు. పువ్వుడా అంటారని తెలుసుకొని ఆ పదాన్ని గీతలోకి చేర్చారు. దాదాపు 50 భగవద్గీతలు చదివి 1988 ఆగస్టు నెలలో అనువాదం మొదలుపెట్టారు. దాదాపు 16 నెలలు కృషి చేస్తే పూర్తయింది. కానీ ముద్రణకు మాత్రం 25 ఏళ్లు నిరీక్షించాల్సి వచి్చంది. బంజారా భగవద్గీతను అప్పటి టీటీడీ ప్రెస్ అధికారి రవ్వ శ్రీహరి సహకారంతో తిరుమల బ్రహ్మోత్సవాల్లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జడ్జి రమణ ఆవిష్కరించారు. బంజారాల కోసం అనువదించిన భగవద్గీతతో పాటు ది హిస్టరీ ఆఫ్ బంజారా, బంజారా గీతమాల వంటి రచనలు చేసిన సోమ్లాల్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2001లో ఆల్ ఇండియా బంజారా సేవా సమితి ముంబై వారు సోమ్లాల్కు బంజారా జానపద బ్రహ్మ అనే అవార్డు అందించారు. మాజీ సీఎం కేసీఆర్ బంజారా సాహిత్యానికి సోమలాల్ చేస్తున్న సేవలను గుర్తించి బంగారు కంకణం తొడిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఆయనను అభినందించారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన జనగామలోని ప్రభుత్వ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న సమయంలో ఈ హాస్టల్ పక్కనే ఉన్న గీత మందిరం నుంచి ప్రతిరోజూ ఉదయం లౌడ్ స్పీకర్లో వినిపించే గీతా శ్లోకాలను వింటూ స్ఫూర్తి పొందారు. వెనుకబడిన తన బంజారా సమాజానికి గీతా సారాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. -
అక్కినేని వారి కోడలు.. సబ్యసాచి లెహెంగాలో ఫోటో షూట్ చూశారా? (ఫొటోలు)
-
విలక్షణం... బంజారాల జీవితం
అనంతపురం కల్చరల్: ‘బంజారా..’ ఈ పేరు వినగానే విభిన్నమైన వేషధారణతో ఉన్న స్త్రీలు, ఆజానుబాహులైన పురుషులు కళ్ల ముందు కనిపిస్తారు. అయితే వీరు అసమాన వీరపరాక్రమాలకు ప్రతీకలైన రాజపుత్రులకు వారసులనే విషయం కొద్దిమందికే తెలుసు. సంచార జాతులుగా జీవిస్తున్న బంజారాలు ఒకనాడు సూర్య, చంద్ర వంశాలకు చెందిన రాజ పుత్రులని చరిత్ర చెబుతోంది. వారి ఆచారాలు, వ్యవహారాలు, వేషధారణలూ విలక్షణంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో తమ సంస్కృతికి అద్దం పట్టే బోనాల పండుగను మంగళవారం శోభాయమానంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో బంజారాలు ఇలా... గిరిజన తండాలుః 649 పంచాయతీలుః 242 బంజారాల సంఖ్యః దాదాపు 2 లక్షల మంది (2011 జనాభా లెక్కల ప్రకారం)ఊరికి దూరంగా ఎందుకు? బంజారాలు సాధారణంగా అటవీ ప్రాంతాల్లో, ఊరికి దూరంగా, కొండకోనల్లో జీవిస్తుంటారు. వీరి నివాసాలను ‘తండా’లు అని పిలుస్తారు. అలా ప్రారంభమైన ఊరి బయట నివాసం కాలక్రమంలో స్థిరపడిపోయి తండాలుగా రూపుదిద్దుకున్నాయి. ‘తండా’ అంటే సరుకు నింపిన గోనె సంచుల సమూహమని అర్థం. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయమే. వారిలో కొద్ది మంది వ్యాపారాలు చేసుకుంటూ బతికేవారని ‘లంబాడీ’లని, ‘సుగాలీ’లని పిలుస్తుంటారు. ఒకప్పుడు రాథోడ్, చౌహాన్, పవార్, జాదవ్ లాంటి రాజపుత్ర వంశాల పరంపరలోనే నేటికీ వీరు కొనసాగుతున్నారు. తండా ప్రజలు ఓ నాయకుడిని ఎన్నుకొని, ఆయన అదుపు ఆజ్ఞలో నివసిస్తారు. తమ ఆచార వ్యవహారాలను, సంస్కారాలను నియమంగా ఆచరిస్తారు, పాటిస్తారు. కష్టసుఖాల్లో కలిసి జీవిస్తారు. పారదర్శక విలువలకు ప్రాధాన్యతనిస్తూ కొనసాగే తండాల విలక్షణ జీవనం ఇతరులకు ఆదర్శప్రాయం. భిన్నమైన వేషధారణ.. వేలాది మంది ఓ చోట గుంపుగా ఉన్నా... బంజారాలను వారి వస్త్రధారణ చటుక్కున పట్టించేస్తోంది. ఆధునికత పెరిగిన నేటి రోజుల్లోనూ వారు తమ సంప్రదాయ దుస్తులతో విభిన్నంగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటారు. ఆభరణాలు, గవ్వలు కలబోసి రూపొందించిన దుస్తులు చాలా బరువుగా ఉంటాయి. వెండి, బంగారు, కంచు ఇత్తడి లోహాలతోపాటు ఏనుగు దంతాలతో చేసిన గాజులు మోచేతి వరకూ ధరిస్తారు. తలపై నుంచి ధరించే వస్త్రం అంచుకు పావలా బిళ్లలు, అద్దాలు కుట్టి ఉంటాయి. కాళ్లకు ధరించే కడియాలు నడుస్తున్నపుడు చేసే వింత శబ్ధాలు కూడా ఎంతో వినసొంపుగా ఉంటాయి. విభిన్న వస్త్రధారణతో పాటు తమకే సొంతమైన పాటలతో వారు చేసే నృత్యం ఎవరినైనా మైమరపిస్తుంది. లిపి లేకున్నా వీరు ఎక్కడ జీవిస్తే ఆ భాషను వంట పట్టించుకుని లంబాడీ పదాలతో అద్భుతైన గీతాలను రచించుకున్నారు. వీటిలో దేశభక్తి ప్రబోధమైవేకాక, కామోద్రేకం కలిగించేవి, ఆధ్యాతి్మకతను పెంచేవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా వీరు కష్టజీవులు. కాయకష్టంతో జీవనం సాగించడంలో ఉన్న ఆనందం మరెందేలోనూ లేదని వీరు అంటుంటారు. శతాబ్దాల కిందటే అనంతలో.. ప్రపంచవ్యాప్తంగా సంచారం చేస్తూ అన్ని ప్రాంతాల్లో స్థిరపడినట్లే బంజారాలు ‘ఉమ్మడి అనంత’లోనూ కొన్ని వందల ఏళ్ల కిందటే వేర్వేరు ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 1978లో అప్పటి ప్రభుత్వం ‘రోటీ కపడా ఔర్ మకాన్’ పథకం కింద ప్రస్తుతమున్న నాయక్నగర్ను ఏర్పాటు చేసి చాలా మందికి పట్టాలిచ్చి ఒకచోటకు చేర్చింది. సంచార జాతులుగా కనపడే వీరు ఆధ్యాతి్మకంగానూ చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బంజారాలు ఆరాధ్య దైవంగా, కొలుచుకునే గురువుగా భాసిల్లే సేవాలాల్ మహారాజ్ కూడా అనంత వాసి కావడం విశేషం. ఆయన ఆదేశానుసారం వారి ప్రాచీన ఆచారాలను వదలకుండా ఇతర ప్రాంతాలకూ అనంత బంజారాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఉగాది, దీపావళి, హోళీ పండుగలను విశేషంగా జరుపుకుంటారు. ఆధునిక పోకడలు ఎన్ని ఉన్నా... నేటికీ ఆచారాలను వదలకుండా లంబాడీల సంప్రదాయ పర్వదినాల సందడి నిత్యనూతనంగా సాగుతోంది. అమ్మోరికి బోనాల సమర్పణ.. అనంతపురంలోని నాయక్‌నగర్ ఏర్పడిన తొలి రోజుల్లోనే బంజరాల కులదైవమైన మారెమ్మ ఆలయాన్ని ఏర్పాటైంది. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించుకుని శతాబ్దాలుగా వస్తున్న ‘«శీతలయాడి ఉత్సవం’ (అమ్మవారికి బోనాలు సమర్పించే జాతర) ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. తమ ఇష్టదైవాలైన సీతలయాడి, మే రామ భవాని, తుల్జాభవానీ, హింగ్లా భవానీ, కెంకాళి భవానీ, మంత్రాలి భవానీ, ద్వాలంగార్ భవానీ తదితర అమ్మవార్లను ఘనంగా పూజిస్తుంటారు. ఈ బోనాల పండుగకు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన బంధువులు సైతం తప్పనిసరిగా తరలివస్తారు. సంప్రదాయ దుస్తులు ధరించి నాట్యం చేసే తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో విలక్షణ శైలితో సాగే బోనాల జాతరను ఈ నెల 2న (ఆరుద్రకార్తె, మంగళవారం) అనంతపురంలోని నాయక్‌నగర్‌లో నిర్వహించేందుకు బంజారాలు సిద్ధమయ్యారు. ఎక్కడ ఉన్నా మేము ప్రత్యేకమే ఒకనాడు ప్రపంచమంతటా తిరిగి వ్యాపారాలు సాగించిన చరిత్ర బంజారాలది. ఔరంగజేబు రాకతో బంజారాలు కకావికలమయ్యారు. అలా అంతటా తిరుగుతూ మా పూరీ్వకులు అనంతకూ వలస వచ్చారు. ప్రాంతాలు వేరైనా మా సంప్రదాయాలు, పండుగలు, ఆచార వ్యవహారాలను వదలడం లేదు. మంగళవారం సాగే జాతరకు అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. – శంకరశివరావు రాథోడ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అనంతపురంసనాతన ధర్మాన్ని వీడలేదు సుగాలీలు, లంబాడీలని పిలిచే మా జాతి ఒకనాటి రాజపుత్ర వీరుల వంశానికి చెందినదంటే చాలా మంది నమ్మరు. మా ఆచారాలు భిన్నంగానే ఉంటాయి. ప్రాణం పోయినా సనాతన ధర్మాన్ని వీడి ఇతర మతాల వైపు చూడం. శ్రీరాముడు మాకు ఆదర్శ పురుషుడు. అలాగే గ్రామదేవతలైన అమ్మవార్లను పంటలు బాగా పండాలని, వానలు సమృద్దిగా కురవాలని కోరుకుంటూ బోనాలు సమరి్పస్తాం. – శాంతిబాయి, నాయక్‌నగర్, అనంతపురం -
'సార్' గా వస్తున్న ధనుష్.. లిరికల్ సాంగ్ రిలీజ్
తమిళ నటుడు ధనుష్, సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'సార్'. వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ సమర్పిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉండగా.. ఈ చిత్రంలోని బంజారా అంటూ సాగే సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా విడుదలైన 'బంజారా' లిరికల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందులోని పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి.తెలుగు, తమిళ భాషల్లో ఈసినిమాను 17 ఫిబ్రవరి, 2023న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ పాటు ప్రముఖ తెలుగు గీత రచయిత సుద్దాల అశోక్ తేజ రాశారు. మూడు దశాబ్దాల సినీ జీవితంలో ఆయన ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోశారు. 'నేను సైతం', 'సారంగ దరియా'పాటలు రాసిన ఆయన మరో మధుర గీతాన్ని అందించారు. ఈ చిత్రంలో సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు నటిస్తున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్ ఈసినిమాకు సంగీతమందిస్తున్నారు. -
అన్ని కులాలకు సమున్నత గౌరవం: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదివాసీ, బంజారాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఆల్ ఇండియా బంజారా అసోసియేషన్ ప్రతినిధులు శనివారం ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. దేశంలో సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కేసీఆర్ 84 కులాలకు హైదరాబాద్ నగరంలో ఆత్మ గౌరవ భవనాలు నిర్మించి, ప్రతి ఒక్క కులానికి సమున్నత గౌర వం కలి్పస్తున్నారని కవిత వివరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఇదీ చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ప్రేమ: వైఎస్ షర్మిల -
ఎవర్గ్రీన్ బ్యూటీ.. బంజారా ఫ్యాషన్!
బంజారా రంగుల కళ మన ప్రాచీన సంస్కృతి గిరులలో వికసించి పురజనులలో మెరిసి మురిసింది ఎల్లలు దాటి విరాజిల్లుతూనే ఉంది ఎల్లవేళలా కనులవిందు చేస్తూనే ఉంది ఎవర్గ్రీన్ బ్యూటీ అని చాటుతూనే ఉంది రాజస్థానీ ఎంబ్రాయిడరీ కళ గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. రాజస్థానీయుల్లో చాలా మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వలసలు వచ్చి స్థిరపడ్డారు. అలా ఎంతో ప్రాచీనమైన వీరి వేషధారణ దేశమంతా తెలుసు. ఇప్పటికీ బంజారాలలో పూర్తి వేషధారణను 50 ఏళ్ల వారు ధరించడం చూస్తుంటాం. ఈ ఎంబ్రాయిడరీ కళ ఫ్యాషన్ పరిశ్రమలోకి ఎలా వచ్చింది? ఇంకా ఎంతలా కట్టిపడేస్తోంది? బంజారా దారపు పోగుల గొప్పతనం, అద్దాల మెరుపులు ఫ్యాషన్ వేదికల పై ఎంతగా హొయలు పోతున్నాయి.. వంటి విషయాలు ఫ్యాషన్ డిజైనర్ మంగారెడ్డి మాటల్లో.. బంజారా ఎంబ్రాయిడరీ వర్క్ కళ గురించి? రాజస్థానీ సంస్కృతిలోనే రంగుల వెలుగులు ఉన్నాయి. వీరు పింక్, ఎల్లో, రెడ్.. వంటి సహజసిద్ధమైన, కాంతిమంతమైన రంగులతో ‘లెహిరియా’ అనే టై అండ్ డై పద్ధతిని వాడుతుంటారు. రాజస్థాన్ ఎడారి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడి వేడి వాతావరణానికి తగ్గట్టుగా బ్యాక్‌లెస్ బ్లౌజ్‌లు వాడుతుంటారు. సంస్కృతి అనేది సౌకర్యాన్ని బట్టి మారుతుంటుంది. మోడర్న్ ఫ్యాషన్ రంగాన్ని బంజారా వర్క్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఫ్యాషన్ అంటేనే మన సంస్కృతి నుంచే ఏదో ఒకదానిని తీసుకుంటూ, కలుపుకుంటూ వెళ్లడం. బంజారా డ్రెస్సింగ్, ఆ వర్క్ సంస్కృతికి కళ తీసుకువచ్చేది. ఆ కళను ఆధునిక దుస్తులకు ఎంతో కొంత జతచేసినా మంచి లుక్ వస్తుంది. అందుకే, మోడర్న్ కట్‌కి ఇండియన్ వర్క్‌ని జత చేస్తూ వచ్చారు డిజైనర్లు. నెక్కి లేదా బార్డర్ లేదా ఫుల్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వాడి మిగతా ప్లెయిన్గానో చేస్తూ వైవిధ్యం తీసుకువచ్చారు. బంజారా అమ్మాయిలే ఒకప్పటిలా డ్రెస్ ధరించడానికి ఇష్టపడరు. ఈ కాలానికి తగ్గట్టుగా ఉండాలనుకుంటారు. అలాగని, వారి మూలాలను కాదనుకోలేరు. అలా కుర్తీ, టాప్, గౌన్.. ఇలా ప్రతి దాని మీద బంజారా వర్క్ తీసుకోవడం మొదలైంది. బంజారా వర్క్‌కి ఉన్న ప్రపంచ మార్కెట్? బంజారా వర్క్ వరల్డ్‌వైడ్ ఫేమస్ కావడంతో దీని మార్కెట్ మాటల్లో చెప్పలేనంత బాగుంది. ఈ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌ని విదేశీయులు బాగా ఇష్టపడతారు. చూసిన వెంటనే గుర్తిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆ విధంగా బాగా పాప్యులర్ అయ్యింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా ఈ వర్క్ బాగా రాణించిందని చెప్పచ్చు. రాజస్థానీ వాసి అయిన రూనాదేవి అనే స్వచ్ఛందృ సేవకురాలు లక్ష మందికి ఈ వర్క్ ద్వారా ఉపాధి చూపించింది. దీని ద్వారా విపరీతమైన మార్పు వచ్చింది. బంజారావర్క్లోని ఏదో ఒక అంశాన్ని అన్ని డ్రెస్సుల మీదకు ట్రాన్స్ఫర్ చేయడంతో టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా సినిమా తారలనూ ఆకట్టుకుంది. దీంతో కూడా అంతర్జాతీయ మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు ఈ వర్క్‌కి ఉన్న ట్రెండ్..? దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన గీతాంజలి సినిమాతో బంజారా వర్క్ మిగతా డ్రెస్సుల మీదకు ఎలా తీసుకోవచ్చో పరిచయం చేసినట్టు అయ్యింది. అప్పటినుంచి ప్రతి 2–3 ఏళ్లకోసారి ఈ వర్క్ ట్రెండ్‌లోకి వస్తూనే ఉంది. ఇప్పుడు ఇండియాలో టాప్ డిజైనర్ సునీత్ వర్మ బంజారా స్టైల్ మిర్రర్ వర్క్‌తో డ్రెస్ డిజైన్స్ చేస్తున్నారు. దీని వల్ల ఇప్పుడు మళ్లీ బంజారా వర్క్ ట్రెండ్‌లోకి వచ్చిందనే చెప్పవచ్చు. తరాలు మారినా బంజారా వర్క్ అనేది ఎప్పుడూ జీవనంలోనే ఉంటుంది. రాజస్థానీ ఫర్నిషింగ్లోనూ ఈ వర్క్ వాడుతుంటారు. ఫ్యాషన్‌లోనే కాకుండా వాల్ హ్యాంగింగ్స్, బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్.. వంటి వాటిలోనూ వాడుతారు. బంజారా ఎంబ్రాయిడరీ వర్క్‌ది ఆల్‌టైమ్ బ్యూటీ. ఎప్పటికీ కళగా కొత్తపుంతలు తొక్కుతూనే ఉంటుంది. మంగారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ -
ఆడి పాడిన మంత్రి సత్యవతి రాథోడ్
సాక్షి, వరంగల్: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు వాటిని అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో ‘బంజారా గోత్రాల క్యాలెండర్-2021’ మంత్రి ఆవిష్కరించారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వాలు చేయనన్ని కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. చదవండి: వ్యాక్సిన్ : వరంగల్‌లో హెల్త్ వర్కర్ మృతి! ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజన తండాలు గ్రామపంచాయతీలుగా మారి.. లంబాడీల స్వయం పాలన కిందకు వచ్చాయన్నారు. అక్కడక్కడ గిరిజనుల పట్ల దాడులు జరగడం దురదృష్టకరమని, వీటిని నిరోధించేందుకు ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, బంజారా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేసిన గిరిజన నృత్యం పలువురిని ఆకట్టుకుంది. చదవండి: వాళ్లు సమాజానికి మూలస్తంభాలు -
బంజార టైటిల్ మార్పు
అమృత, ట్వింకిల్ కపూర్, తేజేష్ వీర, హరీష్ గౌలి, జీవా, జీవీ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బంజార’. ‘క్షుద్ర’ ఫేమ్ నాగుల్ దర్శకత్వం వహించారు. వర్కింగ్ యాంట్స్ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై కోయ రమేష్ బాబు, దేవభక్తుని నవీన నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెలలో విడుదలకానుంది. తాజాగా ‘బంజార’ టైటిల్‌ని మార్చనున్నట్లు రమేష్ బాబు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ హారర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా టీజర్ కొన్ని వర్గాల వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉందని మా దృష్టికి వచ్చింది. కథలో భాగంగానే ఆ టైటిల్‌ను పెట్టాం. ‘బంజార’ పేరుపై వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి వారి అభిప్రాయాలను, మనోభావాలను గౌరవించి త్వరలోనే టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే అన్ని మాధ్యమాల నుండి టీజర్‌ని తొలగించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: వెంకట్. -
బంజారా సినిమాను నిషేధించాలి
బన్సీలాల్‌పేట్: బంజారా సంస్కృతిని..కించపరుస్తూ...లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నిర్మితమైన బంజారా సినిమాను తక్షణమే నిషేధించాలని పలు లంబాడీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కవాడిగూడ సీజీఓ టవర్స్‌లోని కేంద్ర సెన్సార్ బోర్డు కార్యాలయంలో పలువురునాయకులు సెన్సార్ బోర్డు అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. లంబాడీల సంస్కృతిని సంప్రదాయాలను, మనోభావాలను కించపర్చే విధంగా ఒక అసభ్యకర అశ్లీల చిత్రానికి ‘బంజారా’ అనే నామకరణం చేయడం తగదన్నారు. చిత్రంలో లంబాడీల వేషధారణ...దుస్తులతో ఉన్న బంజారా స్త్రీని ఒక నీచమైన పడుపువృత్తి చేసే వేశ్యగా చిత్రీకరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సదరు సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, చిత్ర నటులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. లంబాడీ సంఘాల భువనగిరి గణేష్ నాయక్, మల్లేష్ నాయక్, శివనాయక్, ధారావత్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు నెలల పెళ్లి
బంజారా పండగలు ఏ స్థాయిలో జరుపుకుంటారు? హోళి, తీజ్ పండగల ప్రత్యేకత ఏంటి? బంజారా సంప్రదాయ దుస్తులు ఏ విధంగా ఉంటాయి? వంటి అంశాలతో తెరకెక్కనున్న చిత్రం ‘బంజారా జీవిత చరిత్ర’. నూతన నటీనటులతో డి. రాజేష్ నాయక్ దర్శకత్వంలో తాండూరు విఠల్ నాయక్ నిర్మించనున్న ఈ సినిమా మే మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో రాజేష్ నాయక్ మాట్లాడుతూ– ‘‘బంజారా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. విఠల్ నాయక్ మాట్లాడుతూ– ‘‘బంజారాలు నాటి జనరేషన్లో పెళ్లిని మూడు నెలలు జరుపుకునేవారు. బంజారా పండుగలను ఇంత వైభవంగా జరుపుకుంటారా? అని మా సినిమా చూసి ఆశ్చర్యపోతారు. తెలుగు, గుజరాతీ, హిందీ, కర్ణాటక భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నాం’’ అన్నారు. -
సరికొత్తగా...
అమృత, ట్వింకిల్ కపూర్, తేజేశ్ వీర, హరీశ్ గైలి, జీవా, బెనర్జీ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘బంజార’. గతంలో ‘క్షుద్ర’ వంటి హారర్ సినిమాతో ప్రేక్షకుల్ని భయపెట్టిన నాగుల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వర్కింగ్ యూనిట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై కోయా రమేశ్‌బాబు, దేవభక్తుని నవీన్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘టాలీవుడ్లో ఇంతవరకూ రాని సరికొత్త కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే కథాంశంతో తెరకెక్కిన మా సినిమాని తెలుగు, తమిళ భాషల్లో జనవరి నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. జీవీ, శరత్, ‘వేదం’ నాగయ్య, అనంత్, జ్యోతిశ్రీ, ‘జబర్దస్త్’ రాజు, అప్పారావు, శాంతి స్వరూప్, దొరబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: ఎం. నరేంద్ర. -
పార్లమెంటే చట్టం చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బంజారాలను ఎస్టీలుగా పరిగణించడాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఆదిలాబాద్‌కు చెందిన గోం డ్వానా సంక్షేమ సంఘం అధ్యక్షుడు హనుమంతరావు దాఖలు చేసిన వ్యాజ్యా న్ని హైకోర్టు కొట్టేసింది. ఎస్టీ జాబితాలో చేర్పులు, తొలగింపులన్నీ పార్లమెంట్ పరిధిలోని వ్యవహారాలని హైకోర్టు స్పష్టం చేసింది. లంబాడీలు, సుగాలీలను ఎస్టీల్లో చేరుస్తూ అధికరణ 342 (2) కింద పార్లమెంట్ చట్టం చేసినందున, వారిని ఆ జాబితా నుంచి తొలగించడం దాని పరిధిలోని అంశమని తేల్చిచెప్పింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గతవారం తీర్పు వెలువరించింది. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. -
ప్రకృతి బంధం తీజ్
తెలంగాణలోని, అన్ని రాష్ట్రాలలోని బంజారాల ముఖ్య పండుగల్లో ‘తీజ్’ ప్రత్యేకమైన పండుగ. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఈ తీజ్ పండుగను లంబాడీలు ఘనంగా జరుపుతారు. ఈ నాలుగవ తేదీన ప్రారంభమైన తీజ్ ఉత్సవాలు నేడు జరిగే నిమజ్జనంతో ముగియనున్నాయి. తీజ్ ఉత్సవాలను తండాల్లోని పెళ్లికాని ఆడపిల్లలే నిర్వహిస్తారు. వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఆరుద్ర పురుగును తీజ్ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా తీజ్‌గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే తీజ్‌లో గోధుమ మొలకలను పూజిస్తారు. వర్షాకాలం ప్రారంభమై నాట్లు పూర్తయిన అనంతరం తీజ్‌ను జరుపుతారు. పండుగ విధానం... తండాల్లోని పెళ్లికాని ఆడపిల్లలంతా కలిసి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్న తరువాత ఇంటింటికి తిరిగి వేడుకల కోసం విరాళాలు సేకరిస్తారు. ఆ డబ్బుతో గోధుమలు, శనగలు ఇతర సామాగ్రి తెచ్చుకుంటారు. సాయంత్రానికి గోధుమలను నానబెడతారు. మరుసటి రోజు వారి సోదరులు దుసేరు తీగతో అల్లిన చిన్న బుట్టలలో పుట్టమట్టిని తెచ్చి అందులో లంబాడీల దేవతలు దండియాడి, సేవాభయా పేర్లతో మొదటగా తండా నాయకునిచేత ఎరువు కలిపిన మట్టిని పూయిస్తారు. ఈ ఉత్సవంలో ప్రతి కార్యం పాటతోనే సాగుతుంది. ఈ బుట్టలన్నింటినీ ఒక పందిరి కింద ఉంచి, పందిరి వద్ద రోజు ఆడపిల్లలందరూ నీరు పోసి పాట పాడతారు. బోరడి ఝప్కేరో... గోధుమలను బుట్టలో చల్లేరోజు సాయంత్రం బోరడి ఝప్కేరో నిర్వహిస్తారు. పెళ్లికాని ఆడపిల్లలు రేగుముళ్లకు శనగలు గుచ్చేటప్పుడు వరుస అయిన వారు ముళ్లను కదిలిస్తారు. అయినా సహనంతో ఆడపిల్లలు శనగల్ని ముళ్లకు గుచ్చాల్సిందే. చెల్లెల్ని ఏడిపించే అన్నలూ ఉంటారు. ఢమోళి... ఇక ఏడోరోజు జరిపే కార్యక్రమమే ‘ఢమోళి’(చుర్మో). రొట్టెలు, బెల్లం కలిపిన ముద్దను మేరామాకి సమర్పించడాన్నే ఢమోళి అంటారు. ప్రతి ఇంటినుంచి బియ్యం సేకరించి కడావో (పాయసం) వండుతారు. ♦ ఎనిమిదవరోజు తమ బంజారా ఆరాధ్య దేవతల ప్రతిరూపాలను మట్టితో చేసి వారికి పెళ్లి చేస్తారు. నిమజ్జనం... తొమ్మిదోరోజున తీజ్ నిమజ్జనానికి బంధుమిత్రులందరినీ ఆహ్వానిస్తారు. కొత్తబట్టలు ధరించి మేరామా భవాని, సేవాభయా (సేవాలాల్)కు పూజలు చేస్తారు. తొమ్మిది రోజులపాటు పెంచిన గోధుమ నారు బుట్టలను, తండా నాయకుడిని పిలిచి, కొబ్బరికాయలు కొట్టి, మొదటి తీజ్‌ను నాయక్ రుమాలులో పెట్టిన తరువాత ఆపదల నుంచి తమను రక్షించాలని అన్నదమ్ములకు నారు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ♦ తీజ్ బుట్టలను పట్టుకుని వరుసగా ఆడపిల్లలు నిమజ్జనానికి డప్పు చప్పుళ్లు, పాటలు, నృత్యాలు, కేరింతలతో నిమజ్జనం సాగుతుంది. ♦ చెరువు దగ్గర తీజ్ తమను వదిలివేసి వెళ్లిపోతుందనే దుఃఖంతో ఆడపిల్లలు ఏడుస్తుంటే పెద్దలు, సోదరులు వారిని ఊరడిస్తుంటారు. ఆ తరువాత తీజ్‌ను చెరువులో నిమజ్జనం చేస్తారు. – బోనగిరి శ్రీనివాస్ సాక్షి మహబూబాబాద్ రూరల్ -
అపార్ట్మెంట్ వివాదంలో 'టీడీపీ ఎమ్మెల్యే'
-
సమైక్య రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం: కేసీఆర్
హైదరాబాద్ : అందరికి సమాన హక్కులు కల్పించేందుకు ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన గురువారం బంజారాహిల్స్‌లోని రోడ్ నం.10 లో బంజారా, ఆదివాసీ భవన్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి బంజారా, ఆదివాసీ భవన్లను నిర్మిస్తున్నామన్నారు. కమ్యూనిటీ హాల్ కట్టుకోగానే సరిపోదని, అది గిరిజనుల అభివృద్ధికి వేదిక కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. సమైక్య రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ట్రైబల్ సబ్‌ప్లాన్ నిధులు మళ్లించబడవని కేసీఆర్ తెలిపారు. అంతకు ముందు కేసీఆర్‌కు బంజారాలు, ఆదివాసీలు డబ్బులు, వాయిద్యాలతో సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆహ్వానం పలికారు. -
బంజారా భగవద్గీత
హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత.. ఎన్నో ప్రపంచ భాషల్లోకి అనువాదమైంది. అయితే బంజారాలకు మాత్రం ఇది చేరలేదు. వారికి గీతాసారాన్ని అందించాలనుకున్నారు కేతావత్ సోమ్లాల్. తన జాతి జాగృతి కోసం మొక్కవోని సంకల్పంతో పదహారు నెలల పాటు అవిశ్రాంత కృషితో భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు. తెలుగు లిపిలో బంజారాలకు సులభంగా అర్థమయ్యే రీతిలో గీతను మలచి వారికి ‘గీతోపదేశం’ చేశారు. నల్లగొండ జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావి తండాకు చెందిన సోమ్లాల్ నంద్యాలలోని ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. సాహిత్యాభిలాషి అయిన ఈయన బంజారా జాతి జాగృతం కోసం కంకణం కట్టుకున్నారు. వారిని చైతన్యపరుస్తూ 200కు పైగా పాటలు రాశారు. తండా తండాకు తిరిగి ఆ పాటలు పాడుతూ బంజారాలను ఉత్తేజితుల్ని చేశారు. రాత మార్చింది... జీవితంలోని మంచి చెడుల్ని భగవద్గీత బోధించింది. ఆ బోధనల్ని బంజారాల దరి చేర్చాలన్న ఆశయంతో గీత రచన చేశానంటారు సోమ్లాల్. అనువాదానికి ముందు ఎన్నో పరిశోధనలు చేశారు. దాదాపు 50 భగవద్గీతలు చదివి ఔపోసన పట్టారు. 8-8-1988 రోజు భగవద్గీత అనువాదం మొదలుపెట్టారు. దాదాపు 16 నెలల కృషితో పూర్తి చేశారు. పండిత రంజకంగా ఉన్న గీతను అందరి దరి చేర్చడానికి సోమ్లాల్ అవిశ్రాంతంగా పని చేశారు. మల్లెమొగ్గ అనే పదాన్ని అనువదించడం కోసం తిరగని తండా లేదు. చివరకు మల్లెమొగ్గను బంజారా భాషలో ‘పుముడా’ అంటారని తెలుసుకుని.. ఆ పదాన్ని గీతలో చేర్చారు. ఇలా ఎన్నో పదాల్ని జనపదంగా మార్చి.. వాక్యంలో కూర్చి బంజారా గీతను తీర్చిదిద్దారు. ప్రేరణ... సోమ్లాల్కు ఆరుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు. పేదరికం కమ్మేసినా.. తాత, మేనమామ ప్రోత్సాహంతో ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువు కొనసాగించారు. ‘నేను పదో తరగతి చదివే సమయంలో జనగాంలోని హాస్టల్లో ఉండేవాణ్ని. పక్కనే గీతామందిరం ఉండేది. అక్కడి నుంచి రోజూ ఉదయం లౌడ్స్పీకర్లో వినిపించే గీతను వినేవాణ్ని. అప్పటి నుంచే గీతపై అభిమానం ఏర్పడింది. అన్నివిధాలా వెనుకబడిన తన జాతి ప్రజలకూ గీతాసారాన్ని అందజేయాలని ఆనాడే నిర్ణయించుకున్నా’నని నాటి జ్ఞాపకాలు పంచుకున్నారు సోమ్లాల్. పాతికేళ్ల తర్వాత... భగవద్గీత అనువాదం 1989 నాటికే పూర్తయినా అది అచ్చవ్వడానికి సోమ్లాల్ 25 ఏళ్లు నిరీక్షించారు. ఎన్నో ఒడిదుడుకుల తరువాత బంజారా భగవద్గీతను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారు. ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ ద త్తు, జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ, టీటీడీ ఈఓ ఎం.జి.గోపాల్ ఆవిష్కరించారు. ద హిస్టరీ ఆఫ్ బంజారా, భారత్ బంజారా గీతమాల, తొలి వెలుగు వంటి రచనలు చేసిన సోమ్లాల్.. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని చెబుతున్నారు. - కంచుకట్ల శ్రీనివాస్ -
తండాల్లో ఆధ్యాత్మిక వాతావరణం
ఐకమత్యానికి ప్రతీక సేవాలాల్ దీక్షలు 41 రోజులపాటు దీక్షలు కొనసాగిస్తున్న బంజారాలు నార్నూర్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ జిల్లా గిరిజనులకు పెట్టింది పేరు.. అలాంటి గిరిజన తండాల్లో ప్రస్తుతం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బంజారాల ఆరాధ్యదైవం, కుల గురువు సంత్‌సేవాలాల్ మహరాజ్ దీక్షలు చేపట్టి బంజారాలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన ప్రారంభమైన ఈ దీక్షలు.. 41 రోజులకు ముగించనున్నారు. మరికొంత మంది సోమవారం నుంచి 21 రోజులపాటు దీక్షలు స్వీకరించనున్నారు. కాగా.. దీక్షలు శ్రీరామనవమి రోజున విరమించనున్నారు. 700 మందికి పైనే.. బంజారాల ఆరాధ్యాదైవం కుల గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ పేరిట మహాశివరాత్రి సందర్భంగా అదే రోజున ఈ దీక్షలను బంజారాలు చేపట్టారు. ఆదివారం హోలీ సందర్భంగా సేవాలాల్ భక్తులు దీక్ష భూమి వద్ద సంప్రదాయ పాటలు పాడుతూ, మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. తండాల్లో ప్రతి ఒక్కరూ ఈ దీక్షలను తీసుకుంటారు. దీంతో తండాల్లో 41 రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. మండల కేంద్రంలోని కొత్తపల్లి (హెచ్) గ్రామంలో జాతీయ స్థాయిలో బంజారాల దీక్ష భూమి ఉంది. ఇక్కడికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది బంజారాలు వస్తారు. బంజార కులగురువు శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, ఆధ్యాత్మిక మార్గంతోనే శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందని చాటి చెప్పారని పెద్దలు అంటుంటారు. 11 ఏళ్లుగా ఈ దీక్ష భూమి వద్ద బంజారాలు దీక్షలు కొనసాగించడం ఆనవాయితీగా వస్తోందని చెబుతున్నారు. మండలంలోని కొత్తపల్లిలో 150 మంది, మల్లంగిలో 80 మంది, గంగాపూర్‌లో 100 మంది, నాగల్కొండలో 80 మంది, రాజన్గూడలో 20 మంది, మాగంలో 50 మంది, బీర్పూర్లో 40 మంది, తాడిహత్నూర్‌లో 60 మంది, ఉమ్రిలో 50 మంది తదితర గ్రామాల్లో దీక్షలు తీసుకున్నారు. సంప్రదాయం ప్రకారం.. తరతరాల నుంచి ఈ సంప్రదాయం వస్తోం ది. ఈ తరం వాళ్లు కూడా సంప్రదాయానికి కట్టుబడి సేవాలాల్ దీక్షలను చేపట్టడం ఆనందంగా ఉంది. ప్రతి తండాల్లో సేవాలాల్ దీక్షలను చేపట్టడంతో అంత పవిత్రత నెలకొంది. ఇది ఎప్పటికీ కొనసాగించాలి. - జాదవ్ రవితాబాయి ఇంటికొక్కరు చొప్పున దీక్షలో.. 41 రోజులపాటు తం డాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. గ్రామంలో ఇంటికొక్క రు చొప్పున సేవాలాల్ దీక్షలను చేపడుతారు. దీక్షలు చేపట్టం వలన అంతా మంచి జరుగుతుందని నమ్మకం. పురుషులతోపాటు మహిళలు సైతం ఈ దీక్షలను చేపడుతారు. - యశ్వంత్రావ్