బన్సీలాల్‌పేట్: బంజారా సంస్కృతిని..కించపరుస్తూ...లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నిర్మితమైన బంజారా సినిమాను తక్షణమే నిషేధించాలని పలు లంబాడీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కవాడిగూడ సీజీఓ టవర్స్‌లోని కేంద్ర సెన్సార్ బోర్డు కార్యాలయంలో పలువురునాయకులు సెన్సార్ బోర్డు అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. లంబాడీల సంస్కృతిని సంప్రదాయాలను, మనోభావాలను కించపర్చే విధంగా ఒక అసభ్యకర అశ్లీల చిత్రానికి ‘బంజారా’ అనే నామకరణం చేయడం తగదన్నారు. చిత్రంలో లంబాడీల వేషధారణ...దుస్తులతో ఉన్న బంజారా స్త్రీని ఒక నీచమైన పడుపువృత్తి చేసే వేశ్యగా చిత్రీకరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సదరు సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, చిత్ర నటులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. లంబాడీ సంఘాల భువనగిరి గణేష్ నాయక్, మల్లేష్ నాయక్, శివనాయక్, ధారావత్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment