Censor board
-
దేవర సెన్సార్ రివ్యూ మాస్ అరాచకం అంతే
-
సలార్ కి షాక్ ఇచ్చిన సెన్సార్
-
సెన్సార్ బోర్డుకు లంచం.. అధికారుల ముందు హాజరైన విశాల్ కార్యదర్శి
హీరో విశాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం మార్క్ ఆంటోని. ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేశారు. రిలీజ్‌కు ముందు మార్క్ ఆంటోని చిత్ర హిందీ వెర్షన్‌ను సెన్సార్ బోర్డుకు పంపగా అక్కడ సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ కావాలంటే రూ.6.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం సంచలనం సృష్టించింది. వారు అడిగినట్లుగానే విశాల్ డబ్బులు చెల్లించి సర్టిఫికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత సెన్సార్ బోర్డు సభ్యులకు బ్యాంకు ద్వారా లంచం ఇచ్చినట్లు, దానికి సంబంధించిన బ్యాంక్ చలానా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆయన ఫిర్యాదుపై మహారాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ చేపట్టాలని ముంబయి సీబీసీఐడీని కోరింది. సీబీసీఐడీ విచారణలో ముంబయి సెన్సార్ బోర్డ్ సభ్యులు లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో వారిని సస్పెండ్ చేశారు. సెన్సార్ సభ్యులకు లంచం ఇచ్చిన విశాల్ కార్యదర్శి హరికుమార్‌ను సీబీసీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. దీంతో హరికుమార్ శుక్రవారం అధికారుల ముందు హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. మరో విషయం ఏమిటంటే విశాల్ ఫిర్యాదు కారణంగా ఇప్పుడు తమిళం, తెలుగు సహా ప్రాంతీయ భాషల హిందీ అనువాద చిత్రాలకు చైన్నెలోనే సెన్సార్ సర్టిఫికెట్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. చదవండి: ఆ వ్యాధుల వల్ల ఏ పనీ చేయలేకపోతున్నా.. ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా -
రీలిజ్కి సిద్ధమైన సగిలేటికథ.. సెన్సార్ పూర్తి
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్,పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించి యూ/ఏ(U/A) సర్టిఫికేట్ జారీ చేశారు.ఈ చిత్రం చాలా న్యాచురల్ గా సగటు ప్రేక్షకుడికి నచ్చేలా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారని చిత్రబృందం పేర్కొంది. అక్టోబర్ 6న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
దేవుడి సినిమాకు 'A' సర్టిఫికెట్.. మరో కాంట్రవర్సీ?
'ఆదిపురుష్' రామాయణం ఆధారంగా తీశారు. అయితే చేతులెత్తి రాముడిని మొక్కాల్సిన ప్రేక్షకులు.. దర్శకుడిని బండబూతులు తిట్టారు. ఎందుకంటే కథని వక్రీకరించి, ఇష్టమొచ్చినట్లు తీయడమే దీనికి కారణం. సరే ఈ చిత్రం గురించి అందరూ మర్చిపోయారు అనుకునేలోపు మరో మూవీ కొత్త కాంట్రవర్సీలు సృష్టించేందుకు రెడీ అయిపోయింది. ఎందుకంటే ఇది దేవుడి సినిమా, సెన్సార్ బోర్డ్ మాత్రం 'A' సర్టిఫికెట్ ఇచ్చింది. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ) త్వరలో రిలీజ్ బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ప్రత్యేకం. ఎందుకంటే ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుంటాడు. కానీ గత రెండేళ్లలో అతడి చిత్రాలన్నీ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అలాంటి అక్షయ్ శివుడిగా నటించిన మూవీ 'ఓ మై గాడ్ 2'. 2012లో వచ్చిన 'OMG' చిత్రానికి ఇది సీక్వెల్. తొలి భాగంలో దేవుడిగా కనిపించిన అక్షయ్.. రెండో పార్ట్‌లో అదే పాత్ర పోషించాడు. ఆగస్టు 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. గొడవ ఎందుకు? ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి కొన్నాళ్ల ముందొచ్చిన టీజర్ వరకు చూస్తే ఇది దేవుడి సినిమా అనిపించేలా చేశారు. కానీ ఇందులో అంతకు మించిన కాన్సెప్ట్ ఏదో ఉందని గత కొన్నాళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే గత రెండు వారాల నుంచి సెన్సార్ బోర్డు దగ్గర ఈ సినిమా మల్లగుల్లాలు పడింది. తొలుత 'U/A' సర్టిఫికెట్ ఇచ్చి, కొన్ని సీన్స్ తీసేయాలని చెప్పారు. దర్శకనిర్మాతలు దీనికి ఒప్పుకోలేదట. దీంతో 'A' సర్టిఫికెట్(పెద్దలు మాత్రమే) ఇచ్చినట్లు తెలుస్తోంది. అలానే 27 కట్స్ చెప్పారట. సినిమాలో కంటెంట్ దీనంతటికి కారణం. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) 'OMG 2' కథేంటి? బాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఓ కుర్రాడు గే. కాలేజీలో ఈ విషయం తెలియడంతో అందరూ అతడిని ఏడిపిస్తారు. ఆ బాధ తట్టుకోలేక ఓ రోజు ఆత్మహత్య చేసుకుంటాడు. అదే కాలేజీలో ఫ్రొఫెసర్(పంకజ్ త్రిపాఠి)కి ఈ విషయం తెలిసి బాధపడతాడు. పిల్లలకు సె*క్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని, కాలేజీలో ఆ పాఠాలు కంపల్సరీ చేస్తాడు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది. భగవంతుడు కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు భూమ్మీదకు వచ్చిన శివుడు.. ఈ సమస్యని ఎలా పరిష్కరించాడు అనేది పాయింట్ అని టాక్. పోస్టర్లో అక్షయ్ శివుడిగా కనిపించడంతో పైన చెప్పిన స్టోరీ లైన్ నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే శివుడిని అర్థనారీశ్వరుడిగా కొలుస్తుంటారు. శివుడు-పార్వతి కలిసి ఒకే శరీరంలో ఉంటే ఈ పేరుతో పిలుస్తారు. అలానే అబ్బాయిలో అమ్మాయి లక్షణాలు ఉంటే గే అని పిలుస్తుంటారు!! దీన్నిబట్టి చూస్తే 'ఓ మై గాడ్ 2' సినిమా బాక్సాఫీస్ దగ్గర కాంట్రవర్సీలు సృష్టించేలా కనిపిస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో? ఒకవేళ ఇదే గనుక స్టోరీ అయితే మాత్రం థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో? (ఇదీ చదవండి: సాయితేజ్ పక్కనున్న వ్యక్తిని గుర్తుపట్టారా? స్టార్ హీరో కొడుకు!) -
'ఆదిపురుష్' దెబ్బకు ఇరకాటంలో ఆ సినిమా!
OMG 2 Movie Controversy: 'చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం' అని తెలుగులో ఓ సామెత ఉంది. మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ తీరు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే గత నెలలో రిలీజైన 'ఆదిపురుష్' విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు మరోసారి అలా జరగకుండా ముందే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. దీంతో స్టార్ హీరో నటించిన ఓ సినిమా ఇరకాటంలో పడిందనిపిస్తుంది. అక్షయ్‌కి దెబ్బ మీద దెబ్బ బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్‌ది సెపరేట్ రూటు. వేరే ఎవరికీ సాధ్యం కాని విధంగా యమ ఫాస్ట్ గా సినిమాలు చేస్తుంటాడు. ఏడాదికి 5-6 మూవీస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లుగా ఇతడికి అస్సలు కలిసి రావడం లేదు. గతేడాది ఆరు సినిమాలు రిలీజ్ చేస్తే.. అన్నీ బోల్తా కొట్టాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే 'సెల్ఫీ' అని ఓ రీమేక్ తో వచ్చాడు కానీ ఘోరంగా ఫ్లాప్ అయింది. (ఇదీ చదవండి: పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!) దేవుడే రక్షించాలి ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేస్తున్న సినిమా 'ఓ మై గాడ్ 2'. గతంలో వచ్చిన హిట్ చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో శివుడి పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు. తాజాగా టీజర్ విడుదల చేశారు. స్టోరీ ఏంటనేది పెద్దగా చూపించకుండా, కేవలం పాత్రల్ని పరిచయం చేశారంతే. ఈ సినిమా హిట్ అయితేనే అక్షయ్ కాస్తయినా కుదురుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే కష్టమే. కాంట్రవర్సీ కాన్సెప్ట్! ఈ మధ్యే రిలీజైన 'ఆదిపురుష్' విషయంలో సెన్సార్ బోర్డు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. హనుమాన్ డైలాగ్స్ వల్ల చాలామంది తిట్టారు. ఇప్పుడు 'ఓ మై గాడ్ 2'కి అలా జరగక ముందే సెన్సార్ బోర్డు కళ్లు తెరుచుకున్నట్లు తెలుస్తోంది. కథ విషయంలో అభ్యంతరం చెప్పడంతో పాటు రివిజన్ కమిటీ వద్దకు ఈ సినిమాను పంపిందట. టీజర్ లో చూపించినట్లు ఇది దేవుడి సినిమానే అయినప్పటికీ.. అసలు కాన్సెప్ట్ సెక్స్ ఎడ్యుకేషన్, ఎల్జీబీటీక్యూ(ట్రాన్స్‌జెండర్ బైసెక్సువల్ లెస్బియన్) అని తెలుస్తోంది. ఇప్పుడిది కాస్త కాంట్రవర్సీగా మారింది. ఆగస్టు 11న థియేటర్లలోకి రావాల్సి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో ఏంటో? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 19 మూవీస్) -
ఆదిపురుష్.. సెన్సార్ బోర్డుపై హైకోర్టు ఫైర్
భారీ అంచాల మధ్య విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. రామాయణం ఇతీహాసం ఆధారంగా ఓ రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ జానకిగా నటించారు. సాంకేతికపరంగా ఈ చిత్రం మెప్పించినా.. కంటెంట్ పరంగా అలరించలేకపోవడంతో పాటు కొన్ని సన్నివేశాలు రామాయణానికి విరుద్ధంగా తీర్చిదిద్దారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు పలు వివాదాలు కూడా ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. ఈ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలంటూ పలు కోర్టులో పిటిషన్స్ దాఖలయ్యాయి. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ని తొలగించాలాంటూ అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డుని ధర్మాసనం తప్పుబట్టింది. సెన్సార్‌కు పంపిన సమయంలో ఇలాంటి డైలాగ్స్‌ని ఎందుకు సమర్థించారని కోర్టు ప్రశ్నించింది. (చదవండి: ఓటీటీకి 'ది కేరళ స్టోరీ'.. ఆలస్యం అందుకేనన్న ఆదాశర్మ!) ఇలాంటి వాటి వల్ల భవిష్యతు తరాలకు ఎలాంటి సందేశాలను అందించాలనుకుంటున్నారని మండిపడింది. సినిమా దర్శకనిర్మాత విచారణకు హాజరుకాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కాగా, ఆదిపురుష్ చిత్రంలో కొన్ని సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో..చిత్రబృందం వాటిని తొలగించింది. అయినప్పటికీ వివాదం మాత్రం ఆగడం లేదు. -
ఆ సినిమాపై సెన్సార్ అభ్యంతరం.. రాజీపడని నిర్మాత!
మన దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేందుకు విఫలయత్నాలు చేస్తూ, అనునిత్యం హేయమైన కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా దురహంకారానికి వ్యతిరేకంగా తీసిన 'భారతీయన్స్' చిత్రానికి సినిమాకు సెన్సార్ పరంగా కలుగుతున్న అసౌకర్యంపై చిత్ర నిర్మాత, ప్రవాస భారతీయుడు డా.శంకర్ నాయుడు అడుసుమిల్లి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాతృదేశంపై తన అభిమానం, మమకారంతో లాభాపేక్ష లేకుండా ఎంతో కష్టపడి నిర్మించిన 'భారతీయన్స్'కు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడంలో జాప్యంపై శంకర్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్ హీరోలుగా.. సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన బహు భాషాచిత్రం 'భారతీయన్స్'. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ రచయిత - ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ ('ప్రేమించుకుందాం రా', 'కలిసుందాం రా' ఫేమ్) ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు, 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి లాంటి ప్రముఖులతోపాటు మాజీ సైనికాధికారుల ప్రశంసలు పొందిన 'భారతీయన్స్' చిత్రంలోని చైనా పేరుని, గల్వాన్ వ్యాలీ పేరును తొలగించాలని సెన్సార్ బోర్డ్ చేసిన సూచనతో తాను విభేదిస్తున్నానని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడనని నిర్మాత శంకర్ నాయుడు తేల్చి చెప్పారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!) -
నిజమెంత? నిజాయతీ ఎంత?
‘నిజజీవిత ఘటనల నుంచి ప్రేరణ పొంది తీశామ’ని అంటున్న సినిమాలో నిజాలు ఉంటాయనే ఆశిస్తాం. నిజాయతీగా ఉంటుందనే భావిస్తాం. కానీ అవే లోపిస్తే? శుక్రవారం విడుదలవుతున్న హిందీ చిత్రం ‘ది కేరళ స్టోరీ’ సరిగ్గా అవే ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. విషయం మద్రాస్, కేరళ హైకోర్ట్‌ల మొదలు సర్వోన్నత న్యాయస్థానం దాకా వెళ్ళాల్సి వచ్చింది. దాదాపు 10 కట్స్‌తో సెన్సార్ బోర్డ్ పచ్చజెండా ఊపిన ఈ వివాదాస్పద చిత్ర ప్రదర్శనను ఆపడానికి కానీ, కనీసం ‘కల్పిత పాత్రలతో అల్లుకున్న కథ’ అని టైటిల్స్‌లో వేయడానికి కానీ గడచిన మూడు రోజుల్లో 3 సార్లు సుప్రీమ్ ససేమిరా అనడంతో, బంతి ఇప్పుడు థియేటర్లలోని ప్రజాకోర్టులో పడింది. ‘సంఘ్ పరి వార్ వారి అసత్యాల కర్మాగారంలో తాజా ఉత్పత్తి’ అంటూ కేరళ సీఎం ఈ చిత్రాన్ని గర్హించారు. కేరళలో జెండా పాతాలని ప్రయత్నిస్తున్న బీజేపీ మినహా ప్రతిపక్షాలూ ఆ మాటే అంటున్నాయి. బహిష్కరణ పిలుపుతో సహా కేరళ సర్కార్ వివిధ మార్గాలు అన్వేషిస్తున్న నేపథ్యంలో కల్పనను నిజమని నమ్మించే ప్రమాదభరిత సృజనాత్మక స్వేచ్ఛ విపరిణామాలపై కచ్చితంగా చర్చ అవసరం. ఏప్రిల్ ద్వితీయార్ధంలో ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ‘కేరళ స్టోరీ’ వివాదాలకు కేంద్రబిందువైంది. తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రభావం పతాకస్థాయిలో ఉన్నవేళ కేరళ నుంచి ‘దాదాపు 32 వేల మంది స్త్రీలు’ కనిపించకుండాపోయారనీ, వారి తెర వెనుక కథల్ని ‘బహిర్గతం’ చేసే యత్నమే మత మార్పిడి అంశం ఇతివృత్తమైన ఈ చిత్రమనీ దర్శక, నిర్మాతల మాట. ‘లవ్ జిహాద్’లో భాగంగా 32 వేల మందినీ ముస్లిమ్‌లుగా మార్చి, అత్యధికులను ఐఎస్ పాలనలోని సిరియాకు తీసుకువెళ్ళారనేది ఈ చిత్ర వాదన. సాక్ష్యాధారాలు లేని ఈ కాకుల లెక్కతో కేరళను తీవ్రవాదానికి పట్టుగొమ్మ అన్నట్టు చిత్రించడంపై సహజంగానే అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇది ముస్లిమ్‌లపట్ల ద్వేషం పెంచే దుర్మార్గ ప్రయత్నమనే వాదన బలపడింది. ‘లవ్ జిహాద్’ లేదని నాటి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రే పార్లమెంట్లో చెప్పినప్పుడు కేరళపై బురద చల్లేలా ఇలాంటి సినిమా ఎలా తీస్తారన్నది ప్రశ్న. కేరళలో హిందువుల జనాభా దాదాపు 55 శాతమైతే, ఆ తర్వాత అత్యధికంగా ముస్లిమ్‌లు 26 శాతం పైగా, క్రైస్తవులు 18 శాతం ఉన్నట్టు లెక్క. దశాబ్దాల క్రితమే సంపూర్ణ అక్షరాస్యత సాధించి, నిత్యం చైతన్యం నిండిన ఆలోచనాపరుల సమాజంగా దేశంలో మలయాళ సీమది ప్రత్యేక స్థానం. సాహిత్యం, సంస్కృతి, కళలు, సినిమాలు సహా అనేక రంగాల్లో దిక్సూచిగా నిలిచిన ఘనత దానిది. మానవాభివృద్ధి సూచిలో ముందుంది. అలాంటి రాష్ట్రాన్ని పచ్చి తీవ్రవాదానికి పట్టుగొమ్మ అన్నట్టు చిత్రించడం కించపరచడమే. విమర్శలు పెరిగి, వివాదం ముదిరేసరికి సినీరూపకర్తలు సైతం సర్దు కోవాల్సి వచ్చింది. కేరళలోని ‘32 వేల మంది మహిళల కథల ఆధారంగా తీశా’మంటూ మొదట ట్రైలర్లో తొడకొట్టినవాళ్ళు చివరకు మే మొదట్లో దాన్ని ముగ్గురంటే ‘ముగ్గురు యువతులు’గా మార్చేశారు. కడుపులో ఏదో పెట్టుకొని కథ రాసుకున్నప్పటికీ కోట్లు పెట్టి సినిమా తీసినవారికి మూడుకూ, 32 వేలకూ తేడా తెలీదా? ఒకటీ అరా ఘటనలు జరిగాయేమో తెలీదు కానీ దాన్ని పట్టుకొని కేరళలోని ప్రబలమైన ధోరణి అన్నట్టు చిత్రించాలనుకోవడం ఏ రకంగా సమర్థనీయం? మొత్తం కేరళ కథ అన్నట్టు సినిమాకు పేరు పెట్టి, బురద జల్లడం ఎవరిచ్చిన సృజనాత్మక స్వేచ్ఛ? భావప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిందే. సృజనాత్మక స్వాతంత్య్రం కావాల్సిందే! కానీ ట్రైలర్‌ను బట్టి చూస్తే... వాస్తవాలను చూపుతున్నామనే పేరుతో, నిజాలను వక్రీకరించి సంచలనాత్మకం చేయడం ‘కేరళ స్టోరీ’లోని అతి పెద్ద ఇబ్బంది. ఇలా లెక్కలతో సహా అన్నిటినీ అతి చేస్తున్నప్పడు ఈ చిత్ర రూపకల్పన వెనుక ఉన్న ఉద్దేశాలపై, సాధించదలచిన లక్ష్యాలపై తప్పక అనుమానాలు తలెత్తుతాయి. పైగా, కేరళలో ముస్లిమ్, ముస్లిమేతరులుగా ప్రజలను రెండు ప్రత్యర్థి వర్గాలుగా ఏకీకృతం చేసే ప్రయత్నాలు పెరుగుతున్న సమయంలో సినిమా రావడం సందేహాల్ని పెంచుతోంది. ఆ మధ్య ‘పద్మావత్’ నుంచి ఇటీవలి ‘పఠాన్’ దాకా సినిమాలపై నిషేధపు డిమాండ్లు, కోర్టు కేసులు చూశాం. అప్పుడైనా ఇప్పుడైనా నిషేధాలు పరిష్కారం కావు. కానీ సెంటిమెంట్లను దెబ్బతీసి, ఉద్రి క్తత సృష్టించి, విద్వేషాన్ని పెంచే ప్రయత్నాలను తప్పక అడ్డుకోవాల్సిందే. శాంతిభద్రతలకు భంగం వాటిల్లినప్పుడు భావప్రకటన స్వేచ్ఛపై నిర్బంధాలు తప్పవని ఆర్టికల్ 19 (2) అనుమతిస్తోంది. శాంతిభద్రతలేమో కానీ, మనోఫలకంపై నిలిచి ఆలోచనల్లోకి ఇంకిపోయే భావోద్వేగాల ప్రభావమే అర్ధసత్య చిత్రాలతో అతి ప్రమాదం. బ్రిటిష్ వారి వద్దే మన్యం వీరుడు అల్లూరి పోలీసుగా పని చేశాడని భావితరాలు నమ్మేలా సినిమా తీసి, ఆస్కార్ల దాకా వెళ్ళిన మన కథలే అందుకు సాక్ష్యం. ‘కేరళ స్టోరీ’కీ కనీసం కల్పితపాత్రల కథనమని పేర్కొనమంటూ పిటిషనర్లు కోరిందీ అందుకే. సెకనుకు 24 ఫ్రేమ్‌ల చొప్పున తెరపై చూపే సత్యం సినిమా అనే సూక్తికి ‘కేరళ స్టోరీ’ లాంటివి నిలబడతాయా అన్నది సందేహమే! సామాన్య ప్రజలు తాము తెరపై చూసేదంతా సత్యమని భ్రమ పడితే, సమాజంలో పెచ్చరిల్లే విద్వేషాగ్నికి బాధ్యులెవరు? ‘కశ్మీర్ ఫైల్స్’తో దేశం ఆ చివరన మొద లైన అర్ధసత్య, అసత్య ప్రచార చిత్రాలు ఇప్పుడు ‘కేరళ స్టోరీ’తో ఈ చివరన కన్యాకుమారికి విస్తరించడం దేనికి సంకేతం? భావప్రకటన స్వేచ్ఛ ఓకే కానీ, నిజాన్ని వక్రీకరించి చూపడంపై గళమెత్తా ల్సిందే! ఈ రొచ్చుకు అడ్డుకట్ట ఏమిటో కనిపెట్టాల్సిందే! రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాను వాడుకొనేందుకు పెరుగుతున్న ప్రాపగాండా ప్రయత్నాలను గమనించాలి. గత తొమ్మిదేళ్ళలో ఎన్నికల ముందే ఇలాంటి చిత్రాలు ఎందుకు, ఎవరి ప్రాపుతో వస్తున్నాయో ఆలోచించాలి. -
నాని ‘దసరా’కు షాకిచ్చిన సెన్సార్ బోర్డు, భారీగా కట్స్..
నేచులర్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30 విడుదల కాబోతోంది. ఇంకా విడుదలకు కొద్ది రోజులే ఉండగా ఈ సినిమాకు తాజాగా సెన్సార్ బోర్డ్ షాకిచ్చింది. ఈ మూవీలో భారీ మార్పులు చేయాలని హెచ్చరించిదట. ఈ చిత్రంలోనే అభ్యంతరకర సన్నివేశాలను కట్ చేయాలంటూ పెద్ద జాబితే ఇచ్చింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న దసరా మూవీకి బోర్డు పలు కండిషన్స్‌తో కూడిన యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. చదవండి: అప్పట్లోనే సొంతంగా హెలికాప్టర్ కొన్న ఏకైక హీరోయిన్ కేఆర్ విజయ.. ఇప్పుడెలా ఉందంటే! ఇందులో సెన్సార్ మొత్తం 36 కట్స్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుండగా మరో వైపు 16 కట్స్ మాత్రమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంటర్వెల్ ముందు భాగంలో 20 కట్స్, ఇంటర్వెల్ తర్వాత భాగంలో 16 సీన్లను కట్ చేయాలని సెన్సార్ చూసించినట్లు తెలుస్తోంది. అంతేకాదు అసభ్యకర సంభాషణలకు మ్యూట్ పెట్టాలని, డిస్క్లైమర్(ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం) అనే ఫాంట్ పెంచమని చెప్పింది. అదే విధంగా వైలెన్స్ సన్నివేశాలను సీజీతో కవర్ చేయాలని బోర్డు చిత్ర బృందానికి సూచిందట. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేసిన బలగం.. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ సెన్సార్ బోర్డు చెప్పినట్టుగా అభ్యంతరక సన్నివేశాలు కట్ చేయగా మూవీ నిడివి 2 గంటల 39 నిమిషాలు ఉంది. కాగా ఈ సినిమా పూర్తి గ్రామీణ ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో తెలంగాణ యాసతో రావడం కొన్ని పదాలకు ఈ కట్స్ పెట్టాల్సి వచ్చినట్లు చెప్తున్నారు. ఇక నాని తొలిసారి పూర్తిగా ఊరమాస్ పాత్రలో నటించడంతో పాటు ఆయన తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో దసరా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నాని ఇటీవల నటించిన చిత్రాలేవి పెద్దగా విజయం అందుకోలేపోయాయి. ఇక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నాని ఆశలన్ని దసరాపైనే ఉన్నాయి. సింగరేణి సమీపాన ఉండే వీర్లపల్లి గ్రామం నేపథ్యంలో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. -
‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ రివ్యూ, మూవీ చూసి సెన్సార్ బోర్డు ఏమన్నదంటే..!
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీసు వద్ద సందడి చేయబోతున్నాడు. ఆయన నటించి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య జవవరి 13న థియేటర్లోకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ప్రచార పోస్టర్లకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎక్కడ చూసిన వాల్తేరు వీరయ్య హావానే కనిపిస్తుంది. దీంతో ఈ పండగా చిరు ఫ్యాన్స్‌కి ఫీస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్గా విడుదలైన పూనకాలు లోడింగ్ సాంగ్ చూస్తుంటే థియేటర్లో ఆడియన్స్‌కి పూనకాలు తెప్పించడం కాయం అనిపిస్తోంది. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన పునర్నవి మాస్ మసాలా మూవీగా రాబోతున్న ఈ చిత్రంపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు.. యూ/ఏసర్టిఫికెట్ ఇచ్చారు. ఆ పోస్టర్ ని కూడా మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. ఈసారి చిరు వాల్తేరు వీరయ్యతో థియేటర్లో రచ్చ చేయబోతున్నాడంటూ కొనియాడారని తెలుస్తోంది. చదవండి: వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన! ‘బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం రికార్డు బ్రేక్ చేయడం ఖాయం. రీఎంట్రీ తర్వాత చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకున్నారో ఈ మూవీ అలా ఉండబోతోంది. ఎమోషనల్, యాక్షన్స్ సీన్స్ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. చిరంజీవి-రవితేజ కాంబినేషన్లో ఉండే సన్నివేశాలు అయితే ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా డైరెక్టర్ డిజైన్ చేశారు’ అంటూ బోర్డు సభ్యులు ప్రశంసలు కురిపించారట. ఇక చిరంజీవి మాస్ స్టెప్పులకు వారు ఫిదా అయినట్లు తెలుస్తోంది. కాగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించింది. Its a U/A for #WaltairVeerayya 💥🤘🏾 Sankranthi ki ROUGH AADINCHESTADU 🔥❤️🔥#POONAKAALULOADING 🔥💣#WaltairVeerayyaOnJan13th Mega ⭐ @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/qeLc5q2hMr — Mythri Movie Makers (@MythriOfficial) January 2, 2023 -
చిక్కుల్లో పఠాన్ మూవీ, ఆ సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం
షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పఠాన్'. విడుదలకు ముందే ఈ సినిమాను వివాదాలు చూట్టుముడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన 'బేషరమ్ రంగ్ రో' సాంగ్‌పై పలువురు రాజకీయ నాయకులు, హిందూ సంఘాలు విమర్శలు గుప్పించారు. ఈ పాటలో దీపికా ధరించిన డ్రెస్‌పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు దీపికాపై పలువురు పొలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అదే విధంగా పాటలో మార్పులు చేయాలంటూ పలుచోట్లు షారుక్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా పఠాన్ చిత్రం మరోసారి చిక్కులో పడింది. ఈ సినిమాలోని పలు సన్నివేశాలు, పాటల విజువల్స్‌పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అభ్యంతరంగా ఉన్న పలు సన్నివేశాలను వెంటనే తొలగించాల్సిందిగా పఠాన్ చిత్ర బృందాన్ని ఆదేశించింది. తాము చెప్పిన విధంగా సినిమాల్లో మార్పులు చేసిన అనంతరం సెన్సార్ సర్టిఫికేట్ కోసం తిరిగి రమ్మని మూవీ టీంకు సెన్సార్ బోర్డు సూచించినట్లు సమాచారం. దీంతో పఠాన్ టీం సెన్సార్ బోర్డ్ ఆదేశం మేరకు చిత్రంలో మార్పులు చేసే పనిలో పడింది. కాగా ఫుల్ అవుట్ అండ్ అవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో జాన్ అబ్రహ్యం విలన్‌గా కనిపించనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ చిత్రం విడుదల కానుంది. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం, ప్రముఖ నటుడు వల్లభనేని జనార్ధన్ మృతి విషాదంలో రకుల్.. మిస్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ -
చిరంజీవి 'గాడ్‌ఫాదర్' సెన్సార్ పూర్తి.. డైరెక్టర్ ట్వీట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలె మేకర్స్ తార్ మార్ టక్కర్ మార్ అనే సాంగ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డైరెక్టర్ మోహన్ రాజా మరో అప్డేట్ను వదిలారు. ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది అని తెలిపారు. అంతేకాకుండా సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయనుందన్నది చూడాల్సి ఉంది. It’s a Clean U/A with an amazing appreciation from the Censor authorities Waiting for the audience blessing on #GodFatherOnOct5th — Mohan Raja (@jayam_mohanraja) September 23, 2022 -
అజయ్ దేవగన్‌కు షాక్, అక్కడ ‘థ్యాంక్ గాడ్’పై నిషేధం
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థాంక్ గాడ్’. తాజాగా ఈ చిత్రానికి కువైట్ ప్రభుత్వం షాకిచ్చింది. కాగా ఇటీవలె షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ క్రమంలో మూవీ ట్రైలర్ విడుదల చేయగా.. దీనిపై కువైట్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. చదవండి: కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు.. మత విశ్వాసాలను దెబ్బ తీసేలా సినిమా ట్రైలర్ ఉందనే కారణంతో ఈ చిత్రంపై అక్కడి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాపై నిషేధం విధించింది. అభ్యంతరకరమైన సన్నివేశాలను తీసేస్తేనే... సినిమా విడుదలకు అనుమతిస్తామని తెలిపింది. ఫాంటసీ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో చిత్రగుప్తుడిగా అజయ్ దేవగణ్ నటించగా.. సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్‌లు కీలక పాత్రలను పోషించారు. అక్టోబర్ 24న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. చదవండి: గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ హీరోయిన్.. షాకింగ్ లుక్ వైరల్ -
‘లైగర్’కు సెన్సార్ బోర్డ్ షాక్.. ఆ సీన్స్‌ని తొలగించాల్సిందేనట!
‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. దేశమంతా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేస్తూ.. చిత్ర యూనిట్‌కి భారీ షాక్ ఇచ్చారు. (చదవండి: వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్ దిగ్గజానికి ఏమైంది..? ) ఈ సినిమాలో కొన్ని అసభ్యకరమైన సీన్స్ ఉన్నాయని, వాటిని మార్చాలని బోర్డు సభ్యులు ఆదేశించారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ చెప్పే బోల్డ్ డైలాగ్స్‌కి సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంతో చేతులతో సంజ్ఞ చేసే సీన్‌ని పూర్తిగా తొలగించమని చెప్పింది. మొత్తంగా ఏడు సన్నివేశాలను మార్పులు చేయాల్సిందిగా బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు ఆయా సీన్స్‌ను తొలగించి లైగర్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. విజయ్ దేవరకొండ సినిమాల్లో సాధారణంగా బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉంటాయి. ఇక పూరీ లాంటి ఊరమాస్ డైరక్టర్ తోడైతే ఎలాంటి బోల్డ్ సీన్స్ ఉంటాయో ఊహించొచ్చు. మరి ఆ ఏడు సీన్ల తొలగింపు ప్రభావం సినిమాపై ఎలా ఉంటుందో చూడాలి. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. -
రిలీజ్‌కు ఒక్క రోజు ముందు భారీ షాక్.. అక్కడ ‘సీతారామం’ బ్యాన్!
విడుదలకు ఒక్క రోజు ముందు ‘సీతారామం’చిత్రానికి భారీ షాక్ తగిలింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. (చదవండి: సీతారామం’ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్.. టార్గెట్ సాధ్యమేనా?) ఈ నేపథ్యంగా తాజాగా ఈ చిత్ర యూనిట్‌కి సెన్సార్ భారీ షాకిచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్‌కు సెన్సార్ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో మతపరమైన సన్నివేశాలు ఉన్నాయని, అందువల్లే ఈ సినిమాను గల్ఫ్‌లో రిలీజ్ చేయొద్దంటూ సెన్సార్ బోర్డ్ ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమ సినిమాను గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ మరోసారి సెన్సార్ బోర్డ్ ముందుకు వెళ్లనుందట. మరి సెన్సార్ బోర్డ్ నిజంగానే గల్ఫ్ దేశాల్లో ఈచిత్రాన్ని బ్యాన్ చేస్తారా? లేదా అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి రిలీజ్‌కు అనుమతి ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ప్రభాస్ రావడంతో టాలీవుడ్లో ‘సీతారామం’పై భారీ అంచనాలు ఉన్నాయి. -
తమిళ సినిమాకు షాక్! ఆ సన్నివేశాలు తొలగించాల్సిందేనా?
మండేలా చిత్ర వ్యవహారంపై సెన్సార్ బోర్డుతోపాటు చిత్ర దర్శక నిర్మాతలకు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హాస్య నటుడు యోగిబాబు టైటిల్ పాత్రలో నటించిన చిత్రం మండేలా. ఇది ఈ నెల 4న ఓటీటీలో విడుదలైంది. మండేలా చిత్రాన్ని రీ సెన్సార్ చేయాలని తమిళనాడు క్షురవకుల సంఘం తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన మండేలా చిత్రంలో క్షురవకుల జాతి మనోభావాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని తెలిపారు. వాటిని తొలగించేలా చిత్ర నిర్మాతలకు ఆదేశించాలని కోరారు. న్యాయమూర్తి మహదేవన్ విచారణ చేపట్టి వివరణ ఇవ్వాలని సెన్సార్ బోర్డు, మండేలా చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 28కి వాయిదా వేశారు. చదవండి: సైనికుడిగా దుల్కర్ సల్మాన్.. కొత్త సినిమా గ్లిమ్స్ విడుదల -
యాంటీ ఇండియన్పై నిషేధం.. రివైజింగ్ కమిటీకి వెళతాం!
చెన్నై : యాంటీ ఇండియన్ చిత్రం కోసం రివైజింగ్ కమిటీకి వెళతామని ఆ చిత్ర నిర్మాత చెప్పారు. కోలీవుడ్‌లో బ్లూషర్ట్ మారన్ అంటే తెలియనివారుండరు. సినీ విశ్లేషకుడిగా ఈయన ప్రముఖ కథానాయకుడు, దర్శకుడు పక్షపాతం చూపకుండా చిత్రాలను విమర్శ పేరుతో తనదైన బాణీలో ఏకి పారేస్తున్నారు. అలాంటి బ్లూషర్ట్ మారన్ దర్శకుడిగా అవతారమెత్తి తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం యాంటీ ఇండియన్. దీనికి కథ, కథనం, మాటలు, సంగీతం కూడా బ్లూషర్ట్ మారన్‌నే అందించడం విశేషం. యాంటి ఇండియన్ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీంతో ఈ నెల 5వ తేదీన చిత్రాన్ని సెన్సార్ సభ్యులకు ప్రదర్శించారు. యాంటీ ఇండియన్ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు పూర్తిగా నిషేధించారు. చిత్రం గురించి చిత్ర నిర్మాత స్పందిస్తూ మత సంబంధిత సమకాలిన సమస్యలు రాజకీయాలను జోడించి రూపొందించిన ఒక చక్కని సందేశంతో కూడిన యాంటీ ఇండియన్ చిత్రాన్ని నిషేధించడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ విషయమై తాము రివైజింగ్ కమిటీకి వెళ్లనున్నట్లు నిర్మాత తెలిపారు. చదవండి: వీరప్పన్ డెన్‌లో నిధి ఉంది: కుమార్తె విజయలక్ష్మి -
వర్మకు చుక్కెదురు: ‘దిశ’ సినిమాకు బ్రేక్?
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఉదంతంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘దిశ’ ఎన్కౌంటర్ పేరుతో సినిమా తెరకెక్కించాడు. దీనికి సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్ విడుదల చేశాడు. త్వరలోనే విడుదల చేద్దామనుకుంటున్న సమయంలో సెన్సార్ బోర్డ్ ఆయనకు షాక్ ఇచ్చింది. ‘దిశ’ ఎన్కౌంటర్ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. దిశ ఎన్కౌంటర్ సినిమాకు అనుమతి ఇవ్వడంపై బోర్డులోని మెజార్టీ సభ్యులు అడ్డు చెప్పారు. సెన్సార్ ఇవ్వాలో లేదో తేల్చుకోలేకపోయినా నలుగురు సభ్యుల బోర్డ్ బృందం మాత్రం అనుమతి నిరాకరించింది. సెన్సార్ బృందం అనుమతి నిరాకరణతో సినిమా రివిజన్ కమిటీ పరిశీలనకు వెళ్లింది. ఈ నేపథ్యంలో 8 సభ్యులు ఉన్న సెన్సార్ బోర్డు మళ్లీ సినిమా చూడనుంది. అనంతరం సినిమాపై తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే వాస్తవ సంఘటనలకు దగ్గరగా దిశ ఎన్కౌంటర్ సినిమా తీశారని దిశ కుటుంబసభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులకు కూడా గతంలో ఫిర్యాదు చేశారు. నిందితుల కుటుంబసభ్యులు కూడా పోలీసులను ఆశ్రయించారు. -
బంజారా సినిమాను నిషేధించాలి
బన్సీలాల్‌పేట్: బంజారా సంస్కృతిని..కించపరుస్తూ...లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నిర్మితమైన బంజారా సినిమాను తక్షణమే నిషేధించాలని పలు లంబాడీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కవాడిగూడ సీజీఓ టవర్స్‌లోని కేంద్ర సెన్సార్ బోర్డు కార్యాలయంలో పలువురునాయకులు సెన్సార్ బోర్డు అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. లంబాడీల సంస్కృతిని సంప్రదాయాలను, మనోభావాలను కించపర్చే విధంగా ఒక అసభ్యకర అశ్లీల చిత్రానికి ‘బంజారా’ అనే నామకరణం చేయడం తగదన్నారు. చిత్రంలో లంబాడీల వేషధారణ...దుస్తులతో ఉన్న బంజారా స్త్రీని ఒక నీచమైన పడుపువృత్తి చేసే వేశ్యగా చిత్రీకరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సదరు సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, చిత్ర నటులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. లంబాడీ సంఘాల భువనగిరి గణేష్ నాయక్, మల్లేష్ నాయక్, శివనాయక్, ధారావత్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘చివరికి న్యాయం గెలిచింది.. సినిమా విడుదలవుతోంది’
సాక్షి, హైదరాబాద్ : పలు వివాదాల నడుమ ఎట్టకేలకు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రం బుధవారం అర్థరాత్రి నుంచే ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత నట్టికుమార్ ఈ సందర్భంగా ఆర్జీవీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నట్టికుమార్ మాట్లాడుతూ... ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాను 1200 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అర్థరాత్రి నుంచే సినిమా ప్రదర్శన ఉంటుంది. ఈ సినిమా విడుదల అనంతరం ఓ రాజకీయ పార్టీకి ప్రతిపక్ష హోదా పోతుంది. సినిమా విడుదలను ఆపేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది వ్యక్తులు ప్రయత్నించారు. అయితే మాకు ముంబై నుంచి రివైజింగ్ కమిటీ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది. దీన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. చివరికి న్యాయం గెలిచి సినిమా విడుదల అవుతోంది. మా సినిమా కుల, మతాలను కించపరిచేలా ఉండదు. కేవలం హాస్యభరితంగా మాత్రమే ఉంటుంది. సినిమాను ఆపడానికి ప్రయత్నించిన వారిపై చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. ’ అని తెలిపారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘మా సినిమాను ఆపడానికి ఎవరు ప్రయత్నించారో వాల్లపై లీగల్‌గా ప్రొసీడ్ అవుతాం. వాళ్లపై త్వరలోనే కేసులు పెట్టబోతున్నాం. అసెంబ్లీలో జరుగుతున్న కామెడీని ఏ డైరెక్టర్ సినిమాగా తీయలేడు. ఫైనల్‌గా సినిమా విడుదల అవుతోంది’ అని తెలిపారు. చిత్ర సమర్పకులు అంజయ్య మాట్లాడుతూ... రాంగోపాల్ వర్మ ఎవరిని టార్గెట్ చేసి ఈ సినిమా తీయలేదు. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రం ఆకట్టుకుంటుదని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర సహా నిర్మాత నట్టికుమార్, సమర్పకులు అంజయ్య,కేఏ పాల్ పాత్రధారి రాము తదితరులు పాల్గొన్నారు. కాగా పలు నాటకీయ పరిణామాల మధ్య బుధవారం రాత్రి సెన్సార్ బోర్డు సభ్యులు ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఏ పార్టీ కోసమో, వ్యక్తి కోసమో సినిమా తీయలేదు: వర్మ
సాక్షి, హైదరాబాద్ : ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో తాను ఏ కులాన్ని తక్కువ చేయలేదని దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ తెలిపారు. రూల్ ప్రకారం చూస్తే .. ఏ సినిమా రిలీజ్ కాదని, కానీ, అన్ని రూల్స్‌ను తన సినిమా మీదే ప్రయోగించారని ఆయన వాపోయారు. సెటైర్ కోసమే ఈ సినిమా చేశానని, ఏ పార్టీ కోసమో, వ్యక్తి కోసమో సినిమా తీయలేదని వర్మ తెలిపారు. తనను ఎంత గట్టిగా ఆపితే అంత గట్టిగా లేస్తానని, అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీస్తున్నానని వర్మ ప్రకటించారు. సెన్సార్ అనేది కాలం చెల్లిన వ్యవస్థగా మారిందని, దాన్ని గురించి మాట్లాడనని తెలిపారు. ‘ఓటు వేసి మనకు కావలసిన నాయకులను ఎన్నుకునే జ్ఞానం ఉన్న మనకు ఏ సినిమాను చూడాలి.. దేనిని చూడకూడదనేది తెలియదా? అది ఇద్దరు, ముగ్గురు సెన్సార్ వాళ్ళు చూసి చెప్పాలా?’ అంటూ వర్మ చిర్రుబుర్రులాడారు. -
రకుల్ సీన్‌కు సెన్సార్ కత్తెర
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సీనియర్ హీరో అజయ్ దేవగన్‌కు జోడిగా దే దే ప్యార్ దే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు కొన్ని కట్స్ సూచించారు. ఓ పాటలో రకుల్ ప్రీత్ సింగ్ విస్కీ బాటిల్ పట్టుకొని డ్యాన్స్ చేయటంపై సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ సీన్‌ను కట్ చేయటం లేదా..? బాటిల్ కు బదులుగా పూలు పట్టుకున్నట్టుగా గ్రాఫిక్స్ చేయాలని సూచించారు. మరికొన్ని కట్స్‌తో సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. అకీవ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. -
నిజాలను నిగ్గుతేల్చడానికి.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శతక్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే ఎన్నో వివాదాలతో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా శుక్రవారం (మార్చి 29) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తామంటున్నాడు. ఇప్పటికే కోర్టుల రిలీజ్‌కు అనుమతి ఇవ్వటంతో పాటు సెన్సార్‌బోర్డ్ కూడా క్లీ యు సర్టిఫికేట్ ఇవ్వటంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్‌కు అడ్డంకులన్ని తొలిగిపోయినట్టైంది. దీంతో వర్మ ప్రమోషన్ జోరు పెంచాడు. తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తూ సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాడు. తాజాగా కమల్ అనే వ్యక్తి క్రియేట్ చేసిన యానిమేషన్ ట్రైలర్‌ను తన ట్విటర్లో రిలీజ్ చేశాడు వర్మ. రామ్ గోపాల్ వర్మ స్వయంగా రిక్షా తొక్కుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను ప్రమోట్ చేస్తున్నట్టుగా ట్రైలర్‌ను రూపొందించారు. వర్మ, అగస్త్య మంజు తో కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరిలు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో రంగస్థల నటుడు విజయ్ కుమార్ నటిస్తుండగా లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞశెట్టి కనిపించనున్నారు. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నాడు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల వాయిదా
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంచలన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ సినిమాను అడ్డుకునేందుకు అధికార పక్షం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే అనివార్య కారణాల వల్ల లక్ష్మీస్ ఎన్టీఆర్ వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ సినిమా మార్చి 22న రిలీజ్ చేయాలని భావించినా, నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యం కావటంతో వారం ఆలస్యంగా మార్చి 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డ్ నిరాకరించినట్టుగా ఇటీవల వార్తలు రావటంతో రామ్ గోపాల్ వర్మ చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. కానీ కొద్ది సేపటికే సెన్సార్ సర్టిఫై చేసేందుకు అంగీకరించినట్టుగా ప్రకటించారు. తాజాగా సినిమా వాయిదా పడటంతో ఎలక్షన్లకు 12 రోజుల ముందే లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. Get Ready to know all the truths on March 29 th #LakshmisNTR pic.twitter.com/GRGTC9K3jR — Ram Gopal Varma (@RGVzoomin) 19 March 2019 -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై కుట్ర : కేసు వేయనున్న వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ వర్గాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్‌బోర్డ్ నిరాకరించిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. తొలి దశ పోలింగ్ (11-04-2019) పూర్తయ్యే వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వటం కుదరదంటూ సెన్సార్ బోర్డ్ తనకు లెటర్ ఇచ్చినట్టుగా తెలిపిన వర్మ, ఈ పరిణామాలపై చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్టుగా వెల్లడించారు. సెన్సార్ బోర్డ్ తన పరిధిని దాటి వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరిస్తూ సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరిలతో కలిసి రామ్ గోపాల్ వర్మ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అగస్త్య మంజు మరో దర్శకుడు. ఎన్టీఆర్ పాత్రలో రంగస్థల నటుడు విజయ్ కుమార్ నటిస్తుండగా, లక్ష్మీ పార్వతిగా యగ్న శెట్టి నటిస్తున్నారు. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. I AM FILING A CASE ON THE CENSOR BOARD FOR ILLEGALLY TRYING TO STOP LAKSHMI’S NTR Read the details at https://t.co/nKcycB7gtg pic.twitter.com/vKIw43mVPN — Ram Gopal Varma (@RGVzoomin) 17 March 2019 -
‘గల్లీబాయ్’లో ఆ సీన్‌కు కత్తెర!
టెంపర్ రీమేక్‌గా తెరకెక్కిన ‘సింబా’తో ప్రస్తుతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు రణ్వీర్ సింగ్. ఈ మూవీ బాలీవుడ్లో 250కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది. తాజాగా రణ్వీర్ సింగ్ నటిస్తున్న ‘గల్లీబాయ్’ సినిమాపై కూడా భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘అప్నా టైమ్ ఆయేగా’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వద్ద పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూవీలో ఓ రొమాంటిక్ సీన్ కట్ చేశారట. దాదాపు 13సెకన్ల పాటు ఉన్న ముద్దు సన్నివేశాలను తొలగించినట్టు సమాచారం. అలియా భట్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జోయా అక్తర్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. -
సెన్సార్ బోర్డ్ అభ్యంతరంతో టైటిల్ మార్పు
ఇటీవల సినిమా రిలీజ్ విషయంలో సెన్సార్ బోర్డ్ నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. నిజ జీవిత గాథలు, సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతుండటంతో అవి వివాదాస్పదమవుతున్నాయి. అదే సమయంలో కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమాలు తెరకెక్కుతున్ననాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా చీట్ ఇండియా పేరుతో రిలీజ్ రెడీ అవుతున్న ఓ సినిమా విషయంలో ఇలాంటి వివాదాలే తలెత్తాయి. ఇమ్రాన్ హష్మీ హీరోగా సౌమిక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన చీట్ ఇండియా సినిమా టైటిల్‌ను మార్చాలంటూ సెన్సార్ బోర్డ్ సూచించింది. టైటిల్ సినిమా కథా కథనాలను మిస్ లీడ్ చేసే విధంగా ఉందని బోర్డ్ అభిప్రాయపడింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా టైటిల్‌ను ‘వై చీట్ ఇండియా’ అని మార్చేందుకు అంగీకరించారు. శ్రేయా ధన్వంతరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘థాకరే’ బయోపిక్కు సెన్సార్ అడ్డంకులు
సాక్షి, ముంబై : శివసేన వ్యవస్ధాపకులు, దిగ్గజ నేత బాల్ థాకరే బయోపిక్కు కష్టాలు ఎదురయ్యాయి. బాల్ థాకరే జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన థాకరే మూవీలోని కొన్ని సన్నివేశాలపై కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మూవీలోని ఆరు డైలాగులు, రెండు సీన్ల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు అవసరమైన మార్పులు చేయాలని సూచించింది. సీబీఎఫ్సీ లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించి, సమస్యను పరిష్కరించుకుంటామని చిత్ర బృందం పేర్కొంది. చట్టబద్ధంగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలను ఎదుర్కొంటామని, సమస్యను పరిష్కరించుకంటామని చిత్ర నిర్మాత, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. కాగా చిత్ర ట్రైలర్ విడుదలకు కొన్ని గంటల ముందు సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం గమనార్హం.ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అమృతారావు మీనా థాకరే పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 23న బాల్ థాకరే జయంతి సందర్భంగా థాకరే మూవీ విడుదలవుతోంది. -
టీవీ సీరియల్స్ మీద కూడా సెన్సార్ బోర్డు నిఘా ఉండాలి
తూర్పు గోదావరి : 'మద్యం తాగించి.. పాఠశాలలోనే పూడ్చివేత' ఈ సంఘటనను చూస్తుంటే ఇటీవల వచ్చిన ‘దృశ్యం’ సినిమా గుర్తురాక మానదు. అయితే ఇందులో ప్రియురాలి భర్తను హత్య చేసి అతనిని కొత్తగా నిర్మించిన పాఠశాలలో పూడ్చిపెట్టారు. వివరాల్లోకి వెళితే.. కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన మచ్చా సత్తిబాబు, జ్యోతి దంపతులు. జ్యోతికి చంద్రమాంపల్లికి చెందిన చెక్కిడాల రాజాతో అక్రమ సంబంధం ఉంది. ఆ నేపథ్యంలో జూన్ 19న సత్తిబాబు అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ లభించకపోవడంతో అదృశ్యమైనట్టు జూన్ 26న బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో రాజా సత్తిబాబును చంద్రమాంపల్లి ఆహ్వానించాడు. అక్కడ మరో ఇద్దరితో కలసి గ్రామంలో నూతనంగా నిర్మించిన స్కూల్ కాంప్లెక్స్‌లో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న సత్తిబాబును హత్య చేసి అదే పాఠశాలలో పూడ్చిపెట్టారు. హత్యకు ఉపయోగించిన రాడ్‌ను దివిలి గ్రామ శివారులో చెత్త కుప్పలలో పడవేశారు. బైక్‌ను జి. రాగంపేటలోని ఒక యువకుడి ఇంట్లో ఉంచారు. మంచానికి కట్టేసి.. రంగంపేట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వాసంశెట్టి వీర వెంకట సత్యనారాయణ కల్లు గీత కార్మికుడు. అతను వ్యవసాయం కూడా చేస్తుంటాడు. జగ్గంపేట మండలం, కాట్రావుల పల్లికి చెందిన భవానితో 9 ఏళ్ల క్రితం అతనికి వివాహం అయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అతనిపొలంలో కోటపాడు గ్రామానికి చెందిన రాజా శ్రీను రెండేళ్లుగా పని చేస్తున్నాడు. రాజా శ్రీనుతో సత్యనారాయణ భార్య భవానికి వివాహేతర సంబంధం ఏర్పడింది. జూలై 25వ తేదీ రాత్రి 10 గంటలకు సత్యనారాయణ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఇద్దరూ కనిపించారు. దాంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. ప్రియుడితో కలసి భవాని సత్యనారాయణను మంచానికి కట్టి వేసి దాడి చేశారు. సత్యనారాయణ అరుపులు విని పొరుగువారు బాధితుడి తల్లిని తీసుకొనివచ్చే సరికి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. సత్యనారాయణ చంపేస్తున్నారు బాబోయ్ అని అరుస్తుండడంతో గ్రామస్తులు తలుపులు పగుల గొట్టుకొని లోనికి ప్రవేశిస్తుండగా వారిని నెట్టుకుంటూ భవాని, ఆమె ప్రియుడు రాజా శ్రీను పరారయ్యారు. కొన ఊపిరితో ఉన్న సత్యనారాయణను బయటకు తీసుకువచ్చే సరికి మృతి చెందాడు. మద్యం తాగించి చున్నీతో పీక నులిమి.. రాజమహేంద్రవరం రూరల్, హుక్కుంపేట కు చెందిన వడ్డి ఇమ్మానియేలు తాపీపని చేసుకుని జీవిస్తుంటాడు. ఇమ్మానియేలుకు దేవితో వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. ఇమ్మానియేలుకు పిడింగొయ్యి గ్రామానికి చెందిన గండ్రోతు శివ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. శివ దేవితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం కొనసాగించసాగాడు. వీరి అక్రమ సంబంధం తెలుసుకున్న ఇమ్మానియేలు గొడవ చేశాడు. ఆనేపథ్యంలో జూలై 26వ తేదీన సీతపల్లిలోని గండి బాపనమ్మ గుడికి వెళ్దామని ఇమ్మానియేలును శివ ఒప్పించాడు. ఇద్దరూ 26వ తేదీ మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ప్రియుడి సూచన మేరకు దేవి బస్సులో బయల్దేరింది. స్నేహితులు ఇద్దరూ గోకవరంలో ఒక మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసి సీతపల్లి వచ్చి సమీపంలోని పోలవరం ప్రాంతంలో ఇద్దరూ మద్యం సేవించారు. ఇమ్మానియేలుతో శివ అతిగా మద్యం తాగించాడు. ఇంతలో అక్కడకు దేవి చేరుకుంది. శివ, దేవి కలసి ఇమ్మానియేలు పీకను చున్నీతో బిగించి హత్య చేసి అతనిని పెట్రోల్ పోసి కాల్చారు. సెల్ ఫోన్లో సిమ్ కార్డు తీసి అక్కడే పడవేశారు. మద్యం సీసా, సెల్ ఫోన్ ఆధారంగా నిందితులను పోలీసు అరెస్ట్ చేశారు. ఇమ్మానియేలు, దేవికి పుట్టిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.మమతానురాగాలకు పుట్టిల్లు కుటుంబం. ఆ కుటుంబం.. దాంతోపాటు మానవసంబంధాలు మంటగలుస్తున్నాయి. వివాహేతర సంబంధాల ప్రభావంతో కుటుంబాలు ధ్వంసమవుతున్నాయి. భర్తలను భార్యలు, భార్యలను భర్తలు తమ ప్రియులు లేదా ప్రియురాళ్ల సహాయంతో హతమార్చేస్తున్నారు. కన్నబిడ్డలని కనికరం కూడా చూపకుండా పసివాళ్లను సైతం మట్టుబెట్టేస్తున్నారు. జిల్లాలో జరిగిన ఇలాంటి సంఘటనలు మానవత్వానికి మచ్చగా నిలిచాయి. –రాజమహేంద్రవరం క్రైం టీవీ సీరియల్స్ మీద కూడా సెన్సార్ బోర్డు నిఘా ఉండాలి దేశంలో విదేశీ సంస్కృతి పెరిగిపోయింది. టీవీ సీరియల్స్ , సినిమా ప్రభావం మహిళలపై పడుతోంది. దీంతో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. పూర్వం ఉమ్మడి కుటుంబ వ్యవస్ధ ఉండేటప్పుడు తప్పు చేస్తే పెద్దవారు దండించే వారు. ఆభయంతోనైనా సక్రమమైన మార్గంలో నడిచే వారు. ప్రస్తుతం తప్పులను సరిదిద్దే వారు లేకపోవడంతో విచ్చలవిడితనం వచ్చేసింది. అక్రమ సంబం«ధాలతోనే సుఖంగా ఉంటుందనే అపోహతో హత్యలు చేస్తూ తమ జీవితాలను చేజేతులారా సర్వనాశనం చేసుకుంటున్నారు. టీవీ సీరియల్స్ మీద కూడా సెన్సార్ బోర్డు నిఘా ఏర్పాటు చేయాలి. టీవీ సీరియల్స్‌లో అక్రమ సంబంధాల పాత్రలు నిరోధించకపోతే సమాజంలో మరిన్ని ప్రమాదకర ధోరణులు పెచ్చరిల్లుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు వాట్సప్, ఫేస్ బుక్‌లలో ఏవిధమైన మెసెజ్‌లు చూస్తున్నారో గమనించాలి. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే జీవితాలు నాశనం అవుతాయి.–ముప్పాళ్ల సుబ్బారావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు నైతిక విలువలు నేర్పించాలి విద్యార్థి దశ నుంచే నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి. ఆధునిక కాలంలో విలువలు పడిపోయాయి. మోడరన్ కల్చర్‌లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. పురుషులలో 90 మంది పరాయి స్త్రీతో మానసిక వ్యభిచారం చేయడం, అలాగే స్త్రీలలో 75 మంది పరాయి పురుషుడిని ఊహించుకోవడం జరుగుతుంది. 20 నుంచి 30 శాతం తప్పటడుగు వేస్తున్నారు. కొంత మందిలో వ్యక్తిత్వలోపం, చంచలత్వం ఉంటుంది. ఇలాంటి వారు ఒకరి కంటే ఎక్కువ మందితో సంబంధాలు కొనసాగిస్తారు. తమను అడ్డుంటే వారిని తొలగించుకోవడానికి కూడా వెనుకాడరు. ఇంట్లో మనుషులు చూపించే ప్రేమ కంటే బయటవారు చూపే ప్రేమలో ఎక్కువ విలువ ఉన్నట్టు అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన తల్లిదండ్రులు కంటే పార్కులో పరిచయమైన ప్రేమికుడు చెప్పినదే ఎక్కువగా ఆకర్షణగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి ఆనుబంధం పెరగకపోతే పరాయివారి అకర్షణకు లోనవుతారు. సాధారణంగా 10 ఏళ్ల సంసార జీవితం జరిగిన తరువాత, 40 ఏళ్లు వచ్చాక వంకర చూపులు చూస్తారు. సీరియల్స్‌లో మహిళలను విలన్‌గా చూపించే సంస్కృతి పోవాలి. విదేశాలలో మాదిరిగా కఠినమైన శిక్షలు ఉండాలి. అప్పుడే నేరాల శాతం తగ్గుతుంది.–డాక్టర్ కర్రి రామారెడ్డి, మానసిక వైద్యుడు, రాజమహేంద్రవరం -
శీలవతికి సర్టిఫికెట్ ఇవ్వని సెన్సార్ బోర్డు
-
సెన్సార్ సభ్యులకు ‘శీలవతి’ రిక్వెస్ట్
చాలా కాలం తరువాత షకీలా లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా శీలవతి. ఈ సినిమా షకీలా 250వ సినిమా కావటం విశేషం. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఈ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టైటిల్ మార్చాలంటూ సెన్సార్ సభ్యులు సూచిస్తున్నారు. కేవలం షకీలా సినిమా అన్న కారణంగానే శీలవతి టైటిల్ మార్చాలంటూ సెన్సార్ సభ్యులు సూచించటంపై నటి షకీలా అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా చూడకుండానే టైటిల్ మార్చమని చెప్పటం కరెక్ట్ కాదన్నారు. ఇప్పటికే సినిమా ఆలస్యమైంది, శీలవతి పేరుతో చాలా వరకు ప్రమోషన్ చేశాం ఈ పరిస్థితుల్లో టైటిల్‌ను మార్చలేం అంటూ ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. మరి షకీలా చేసిన అభ్యర్థనపై సెన్సార్ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
‘కాలా’ సెన్సార్ పూర్తయ్యిందా..?
రజనీకాంత్ ఈ పేరే ఒక సంచలనం. నడిచినా, నవ్వినా, అది ఒక ట్రెండే. రజనీ చిత్రం వస్తుంది అంటే ఆ రోజును సెలవు దినంగా ప్రకటించాల్సిందే. కబాలి విడుదల సందర్భంగా చాలా ప్రైవేట్ సంస్థలు సెలవు దినంగా ప్రకటించాయి కూడా. కానీ కబాలి ఆశించినంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయినా ఆ సినిమా డైరెక్టర్ పనితనం నచ్చి అదే డైరెక్టర్‌కు మళ్లీ అవకాశం ఇచ్చాడు రజనీ. ప్రస్తుతం కాలా చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే తమిళనాడులో జరుగుతున్న సినీ పరిశ్రమ నిరవధిక సమ్మెల కారణంగా ఈ చిత్రం విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది. కాలా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయనీ, సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వచ్చిందని వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సెన్సార్ సభ్యులు దాదాపు 10 మార్పులు సూచించారని కొన్ని సన్నివేశాలను తీసేశారని సమాచారం. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. -
ఆ సిన్మా కోసం ఏకంగా థియేటర్ బుకింగ్
న్యూఢిల్లీ: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే పాకిస్తాన్‌కు చెందిన ఓ అభిమాని మాత్రం సల్మాన్ ‘టైగర్ జిందా హై సినిమా’ చూసేందుకు ఏకంగా థియేటర్‌ను బుక్ చేశాడు. ఇందులో విశేషమేముంది అనుకుంటే పొరబడినట్లే.. ఎందుకంటే ‘టైగర్ జిందా హై’ సినిమాపై పాక్ సెన్సార్ బోర్డు నిషేధం విధించింది. ఈ సినిమాలో పాక్ దర్యాప్తు, నిఘా ఏజెన్సీలను కించపరిచేవిధంగా చూపించారని, ఈ సినిమా వల్ల తమ జాతీయ భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని పాక్ సెన్సార్ బోర్డు చీఫ్ మొబషీర్ హసన్ వ్యాఖ్యానించారు. అయినా.. సల్లూ భాయ్ వీరాభిమాని మాత్రం వెనుకడుగు వేయలేదు. ఒక్కసారి సినిమా చూసేందుకు వీలుగా డిజిటల్ హక్కులు సంపాదించి.. లాహోర్‌లో థియేటర్ బుక్ చేసి స్నేహితులు, సల్మాన్ అభిమానుల కోసం ప్రత్యేకంగా షో ఏర్పాటుచేశాడు. ఈ సినిమా తనకెంతగానో నచ్చిందని, భారత్- పాక్‌ల మధ్య ఉన్న అనుబంధాన్ని చక్కగా ఆవిష్కరించిందని సల్మాన్ అభిమాని సంతోషం వ్యక్తం చేశాడు. సల్మాన్ యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉన్నాయంటూ మురిసిపోయాడు. పాక్‌లో ఈ సినిమాను నిషేధించినప్పటికీ ఇరుదేశాల మధ్య సుహృద్బావం ఉండాలని తాము కోరుకుంటామని తెలిపాడు. ఈ విషయంపై సల్మాన్ తండ్రి సలీం ఖాన్ ‘మిడ్-డే’తో మాట్లాడుతూ.. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. పాక్‌లో భారత్ సినిమాలు, భారత్‌లో పాక్ సినిమాల విడుదలకు ఇరుదేశాలు సహకరించాలి. రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితులు మెరుగుపడినపుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంద’న్నారు -
పద్మావత్’పై సుప్రీం తీర్పు ఎలా ఉంటుంది?
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పదమైన ‘పద్మావత్’ బాలీవుడ్ సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని అనుకుంటున్న సమయంలో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో సినిమా విడుదలను నిషేధించారు. ఆది నుంచి ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ, వ్యయ ప్రయాసాలకోర్చి సినిమాను పూర్తి చేసిన నిర్మాతలకు సెన్సార్ బోర్డు తలనొప్పులు కూడా తప్పలేదు. (సాక్షి ప్రత్యేకం) చివరకు బోర్డు సూచన మేరకు పద్మావతి పేరును పద్మావత్‌గా మార్చగా ఐదు కట్లతో సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు యూ–ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో ఊపిరి పీల్చుకున్న సినిమా దర్శక, నిర్మాతలు ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి మంజూరు చేశాక సినిమా విడుదలను అడ్డుకునే అధికారం ఓ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఉంటే అది న్యాయబద్ధమే అవుతుందా? ఈ అంశాలను తేల్చుకునేందుకే సినిమా నిర్మాతలు బుధవారం నాడు సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) వెబ్సైట్ ప్రకారం సినిమాల ప్రదర్శన రాష్ట్రాల అంశం కనుక సినిమా ఆటోగ్రపీ చట్టం–1952 నిబంధనలను అమలు చేసే అధికారం కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలదే. ఈ కారణంగా తమ తమ రాష్ట్రాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను (ఆందోళనలను) పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమా విడుదలను అడ్డుకునేందుకు అధికారం ఉందనే విషయం స్పష్టమవుతుంది. (సాక్షి ప్రత్యేకం) సీబీఎఫ్సీ చైర్‌పర్సన్‌గా ప్రసూన్ జోషిని కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వమే నియమించింది. ( సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతించిన తర్వాత ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడం సెన్సార్ బోర్డును లెక్క చేయక పోవడం కాదా? ఓ ప్రజాస్వామ్య సంస్థ ఉనికికే ప్రమాదం తీసుకరావడం కాదా? సొంత పార్టీ ప్రభుత్వం నియమించిన సెన్సార్ బోర్డు చైర్‌పర్సన్‌ను అవమానించడం కాదా? సెన్సార్ బోర్డు తొందరపడి సినిమా విడుదలకు నిర్ణయమేమీ తీసుకోలేదు. కేంద్ర పార్లమెంటరీ ప్యానెల్, చరిత్రకారుల కమిటీ ఆమోదంతోనే సినిమా విడుదలకు సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఈ కారణంగా బీజేపీ సీఎంల ప్రవర్తన పార్లమెంటరీ ప్యానల్ అభిప్రాయాన్ని కూడా అగౌరవపర్చడమే అవుతుందికదా? సినిమాల ప్రదర్శన రాష్ట్రాల అంశం అనేదే తమకు ప్రాతిపదికగా భావిస్తే ఇక రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు సినిమాల విషయాల్లో తమ ఇష్టానుసారం వ్యవహరించే ప్రమాదకర పరిస్థితులకు దారితీయదా? తద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగదా?(సాక్షి ప్రత్యేకం) వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి అడుగడుగున సినిమా నిర్మాతలకు అడ్డం పడడం, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై దాడి చేయడం, హీరోయిన్ దీపికా పదుకొనే ముక్కు కోస్తే లక్షల రూపాయలు ఇస్తాననడం, హీరోలు రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్లను బెదిరించడం, సినిమా పేరు మార్చినంత మాత్రాన సినిమాను అనుమతించాలని ఎక్కడైన ఉందా? అంటూ సాక్షాత్తు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే ప్రశ్నించడం, సెన్సార్ బోర్డు కార్యకలాపాలను పర్యవేక్షించే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖతోపాటు ప్రధాని కార్యాలయం మౌనం వహించడం తదితర అన్ని పరిణామాలు భావ ప్రకటనా స్వేచ్ఛను తుంగలో తొక్కడమే అవుతుంది. మరి సుప్రీం కోర్టు సినిమా ప్రదర్శనకు సంబంధించిన నిబంధనలు రాష్ట్రాల పరిధిలోనివి అంటుందా? సమాఖ్య స్ఫూర్తి, భావ ప్రకటనా స్వేచ్ఛను దష్టిలో పెట్టుకొని తీర్పు చెబుతుందా? చూడాలి!((సాక్షి ప్రత్యేకం) -
పద్మావత్‌కు తొలగని కష్టాలు
-
‘మహాభారతం కన్నా బాహుబలి బెటర్’
ముంబై: ఇటీవల కాలంలో బాలీవుడ్ లో సెన్సార్ వివాదాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో సినిమాకు కూడా సెన్సార్ బోర్డ్ నుంచి సమస్యలు ఎదురయ్యాయి. సైఫ్ అలీ ఖాన్ హీరోగా తెరకెక్కిన కళాకాండీ సినిమాకు సెన్సార్ బోర్డ్ సభ్యులు ఏకంగా 72 కట్స్ సూచించారు. దీంతో రివ్యూ కమిటీని ఆశ్రయించిన సైఫ్ సింగిల్ కట్ తో సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ సాధించాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెన్సార్ సభ్యుల తీరును తప్పుపట్టిన ఈ స్టార్ హీరో సెన్సార్ బోర్డ్‌లో రాజకీయ ప్రమేయం ఎక్కువైందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో మహాభారతం లాంటి సినిమాను తీయటం కన్నా బాహుబలి లాంటి కల్పిత కథలతో సినిమాలు తీయటం బెటర్ అన్నారు. ‘ప్రేక్షకుల కూడా చాలా సన్నితంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతీ విషయాన్ని మతానికి నమ్మకాలకు ముడిపెట్టి చూస్తున్నారు, ప్రేక్షకులతో పాటు సెన్సార్ బోర్డ్ సభ్యులకు నిజానికి, కల్పనకు తేడా తెలియటం లేదు’ అని విమర్శించారు. అక్షత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కళాకాండి సినిమాలో అక్షయ్ ఒబెరాయ్, కునాల్ రాయ్ కపూర్, దీపక్ దోబ్రియాల్, విజయ్ రాజ్, శోభితా దూళిపాల కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆ పదాలకు కూడా కట్ లేకుండా సెన్సార్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, కోల్‌కతా : ఎట్టకేలకు ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ డాక్యుమెంటరీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతంలో నిషేధించిన ఆ నాలుగు పదాలకు కూడా సీబీఎఫ్సీ (కేంద్ర చిత్ర సెన్సార్ బోర్డు) ఓకే చెప్పింది. అమర్త్యసేన్ జీవితం-సేవలపై 'ది ఆర్గుమెంటేటివ్ ఇండియన్' పేరిట జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ డైరెక్టర్ సుమన్ ఘోష్ ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. దాదాపు గంటపాటు ఉండే ఈ డాక్యుమెంటరీ గత ఏడాది వివాదంలో చిక్కుకుంది. ఇందులో నాలుగు పదాలు (ఆవు, గుజరాత్, హిందుత్వ, హిందూ) అనే పదాలు తొలగించాలని, లేదంటే సర్టిఫికెట్ ఇవ్వబోమంటూ కోల్‌కతా సెన్సార్ బోర్డు అడ్డు చెప్పింది. దీంతో గత ఏడాది నుంచి ఇది విడులకు నోచుకోలేదు. అయితే, 'ఇటీవలె సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషి ఈ డాక్యుమెంటరీ ముంబయిలో ఇతర బోర్డు సభ్యులతో చూశారు. అనంతరం ఎలాంటి కట్లు చెప్పకుండా డాక్యుమెంటరీ విడుదల చేసుకోవచ్చని అన్నారు' అని ఘోష్ తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి తనకు వ్రాత పూర్వక అనుమతి వస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఈ డాక్యుమెంటరీ రెండు పార్టులుగా తీశారు. -
టీవీ చానల్స్ చర్చలతో భాషా తీవ్రవాదం
పణజి : టీవీ చానల్స్‌లో రోజూ ప్రసారం అవుతోన్న చర్చా కార్యక్రమాలపై సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎదుటివారిని ఓడించడమే లక్ష్యంగా.. చాలా సార్లు అడ్డదిడ్డంగా, కొన్నిసార్లు జుగుప్సాకరంగా, అంతూపొంతూ లేకుండా సాగుతోన్న టీవీ చర్చా కార్యక్రమాలు దేశంలో భాషా ఉగ్రవాదాన్ని పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. నిజమైన ప్రజాస్వామిక భావనలకు ఇలాంటి చర్చలు అవరోధాలని ప్రసూన్ జోషి అభిప్రాయపడ్డారు. ఆదివారం పణజి(గోవా)లో ఇండియా ఫౌండేషన్ వారు నిర్వహిస్తోన్న ‘ఇండియా ఐడియాస్ కంక్లేవ్-2017’ లో ఆయన మాట్లాడారు. ‘టీవీ చర్చల్లో.. ఆయా పక్షాలకు చెందిన కొందరు సుశిక్షితులు గెలుపు కోసమే వాదించడం చూస్తూంటాం. వారి ముందు.. విషయపరిజ్ఞానం ఉన్నవాళ్లు సైతం డీలా పడిపోతుంటారు. ఎదుటివారు వాదనను మొదలుపెట్టేలోపే ఇటు నుంచి దాడి పూర్తవుతుంది. ఇది సరైన విధానం కాదు. నిజంగా ప్రజాస్వామ్యంగా ఉండాలనుకున్నప్పుడు.. వాదనలు వినే, వాదనలు గెలవడంలో కొత్త మార్గాన్ని కనుగొనవలసి ఉంది’’ అని ప్రసూన్ జోషి అన్నారు. ప్రసూన్ జోషి (ఫైల్ ఫొటో) -
పద్మావతికి సెన్సార్ కష్టాలు
-
'అదిరింది' ఆగింది
-
'అదిరింది' ఆగింది
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న మెర్సల్ తెలుగు వెర్షన్ 'అదిరింది'కి బాలారిష్టాలు తప్పడంలేదు. ఇప్పటికే ఈచిత్రం పలు సార్లు విడుదలకు సిద్ధమై వాయిదా పడుతూ వస్తోంది. తమిళం పాటు తెలుగులోను ఒకేసారి విడుదల చేయాల్సి ఉండగా డబ్బింగ్ సమస్యతో విడుదల కాలేదు. అయితే తాజాగా చిత్రాన్ని శుక్రవారం విడుదల చేయాలని నిర్ణయించినా బ్రేక్ పడింది. సినిమాకు సెన్సార్ పూర్తి కాలేదని, అందుచేతనే విడుదల చేయట్లేదని చిత్ర నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్ సోషల్ మీడియాలో ప్రకటించింది. శుక్రవారం విడుదల నేపథ్యంలో గురువారం చిత్రం ప్రచార దృష్యాన్ని విడుదల చేశారు. కాగా ఆశ్చర్యకరంగా సెన్సార్ కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నార్త్‌స్టార్ ప్రకటించింది. త్వరలోనే విడుదల తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. సెన్సార్‌లో భాగంగా తెలుగు వెర్షన్లో జీఎస్టీ పైన ఉన్న డైలాగ్స్ తొలగించనున్నట్లు సమాచారం. జీఎస్టీపై డైలాగ్ వచ్చే సమయంలో ఆడియోను తొలగించనున్నారు. కాగా, తమిళంలో ఇప్పటికే ఈచిత్రంపై వివాదాలు నడుస్తున్నాయి. -
ఆ అడల్ట్ సినిమాకు నో కట్స్..!
ఇటీవల సెన్సార్ బోర్డ్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఒక్కో సినిమా విషయంలో చాలా కఠినంగా వ్యవహిరంచే సెన్సార్ సభ్యులు కొన్ని సినిమాల విషయంలో మాత్రం చూసి చూడనట్టుగా వెళ్లిపోతున్నారు. పహ్లజ్ నిహ్లాని సెన్సార్ బోర్డ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తరువాత ఇక వివాదాలకు తెరపడినట్టే భావించారు. అయితే కొత్త చైర్మన్ ప్రసూన్ జోషి వస్తూ వస్తూనే ఎక్స్ జోన్ సినిమాపై నిషేదం విదించి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో ప్రసూన్ కూడా అడల్ట్ సినిమాలను ఇబ్బంది పెడతారని భావించారు. కానీ అనూహ్యంగా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన జూలీ 2 సినిమాకు ఎలాంటి కట్స్ సూచించకుండా ఏ సర్టిఫికేట్ ఇచ్చి మరో షాక్ ఇచ్చారు ప్రసూన్. ట్రైలర్ లో అందాల ఆరబోతతో ఆదరగొట్టిన జూలీ, సినిమాలో కట్ చెప్పే స్థాయిలో విజువల్స్ లేవంటే ప్రేక్షకులు నమ్మలేకపోతున్నారు. -
రూట్ మార్చిన సెన్సార్ మాజీ చీఫ్
సెన్సార్ బోర్డ్ చైర్మన్ గా ఉన్న సమయంలో బాలీవుడ్ సినీ ప్రముఖులకు చుక్కలు చూపించిన పహ్లజ్ నిహ్లాని, ఆ పదవి నుంచి తప్పుకున్న తరువాత మాట మార్చారు. పదవిలో ఉండగా చాలా సినిమాల రిలీజ్ విషయంలో అడ్డుపడ్డ పహ్లజ్, ప్రస్తుతం తాను బోల్డ్ కంటెంట్ కు వ్యతిరేకం కాదంటూ ప్రకటించారు. తాను బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలకు సరైన సర్టిఫికేషన్ ఇచ్చేందుకు మాత్రమే పోరాడానని చెపుతున్నారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి అడల్ట్ మూవీగా తెరకెక్కిన జూలీ 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు తనకు గర్వంగా ఉందటూ సోషల్ మీడియాలో కామెంట్ చేయటంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. సెన్సార్ బోర్డ్ చీఫ్ గా ఉండగా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలను ఇబ్బందులకు గురి చేసిన పహ్లజ్, ఇప్పుడు తానే స్వయంగా అడల్ట్ మూవీ రిలీజ్ కు సహకరించటం సరికాదన్న వాదన వినిపిస్తుంది. Never objected BOLD content, but always insisted on FAIR CERTIFICATION. Glad to be distributor of @Julie2Film, a FILM for an ADULT FAMILY ! https://t.co/8V3hCQkI39 — Pahlaj Nihalani (@NihalaniPahlaj) 8 September 2017 -
సెన్సార్ బోర్డ్‌కు 'స్పైడర్' టీం రిక్వెస్ట్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో రికార్డ్ సృష్టించేందుకు రెడీ అవుతోంది. గత కొంత కాలంగా సెన్సార్ బోర్డ్ ఆదేశాల మేరకు సినిమాల ప్రదర్శనకు ముందే ధూమపానం, మద్యపానానికి సంబంధించిన స్టాట్యూటరీ వీడియోను ప్లే చేస్తున్నారు. ప్రతీ సినిమాలో ఏదో ఒక సందర్భంగా ధూమపానం, మద్యపానానికి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి గనుక ఈ వీడియో తప్పనిసరి అయ్యింది. అయితే మహేష్ హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాలో ఏ ఒక్క సీన్ లోనూ ధూమపానం, మద్యపానం చేస్తూ ఎవరూ కనిపంచరట. విలన్ పాత్రలో నటించిన ఎస్ జె సూర్య కూడా సినిమా అంతా గ్రీన్ టీ తాగుతూనే కనిపిస్తాడట. బ్యాక్ గ్రౌండ్ లోనూ ఇలాంటి విజువల్స్ లేవు కాబట్టి తమ సినిమాకు స్టాట్యూటరి వార్నింగ్ వీడియో లేకుండా ప్రదర్శించేందుకు అవకాశం ఇవ్వాలని సెన్సార్ బోర్డ్ ను కోరుతున్నారు స్పైడర్ యూనిట్. మరి సెన్సార్ బోర్డ్ మురుగదాస్ టీం అభ్యర్థనను ఎంత వరకు మన్నిస్తుందో చూడాలి. -
స్టార్ హీరోకు సెన్సార్ షాక్ : సినిమా రిలీజ్ వాయిదా
సెన్సార్ బోర్డ్ అధ్యక్షుడిగా పంకజ్ నిహ్లానిని తప్పించి ప్రసూన్ జోషికి బాధ్యతలు అప్పగించిన తరువాత కూడా సెన్సార్ వివాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా సెన్సార్ బోర్డ్ ఓ స్టార్ హీరో సినిమాకు ఏకంగా 70 కట్స్ ను సూచించడం మరోసారి వివాదాస్పదమైంది. సైఫ్ అలీఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కాలాకాండీ అక్షత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్ సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 8న రిలీజ్ చేయాలని భావించారు. అయితే సెన్సార్ బోర్డ్ చిత్రయూనిట్ కు షాక్ ఇచ్చింది. సినిమాలో ఎక్కువగా అసభ్య పదాలు ఉన్నాయన్న కారణంతో ఏకంగా 73 కట్స్ ను సూచించింది. దీంతో ఆలోచనలో పడ్డ చిత్రయూనిట్ ప్రస్తుతానికి సినిమాను విడువలను వాయిదా వేసిన చిత్రయూనిట్ సెన్సార్ బోర్డ్ తో యుద్ధనికి రెడీ అవుతోంది. -
48 కట్స్‌ను 8 కి తగ్గించారు..!
నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బాబు మొషాయ్ బందూక్ బాజ్' సినిమాకు గతంలో సెన్సార్ బోర్డ్ 48 కట్స్ సూచించిన సంగతి తెలిసిందే. నిబందనల పట్ల కఠినంగా వ్యవహరించిన అప్పటి సెన్సార్ బోర్డ్ చైర్మన్ పంకజ్ నిహ్లానీ రక్తపాతం, శృంగారభరిత సన్నివేశాలకు వీలైనంతగా కత్తెర వేశారు. దీంతో బాబు మొషాయ్ టీం డైలామాలో పడింది. సెన్సార్ బోర్డ్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన చిత్రయూనిట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ నుంచి బాబు మొషాయ్ చిత్రానికి రిలీఫ్ లభించింది. సెన్సార్ బోర్డ్ 48 కట్స్ సూచించిన ఈ సినిమాకు రివ్యూ కమిటీ కేవలం 8 కట్స్ మాత్రమే సూచించటం విశేషం. సెన్సార్ క్లియరెన్స్ లభించిన ఆనందంలో బాబు మొషాయ్ టీం మరో సాంగ్ ను రిలీజ్ చేసింది. -
పహ్లాజ్ నిహలానీపై వేటు
► ప్రసూన్ జోషికిసెన్సార్ బోర్డు బాధ్యతలు ► సభ్యురాలిగా విద్యాబాలన్ న్యూఢిల్లీ: జాతీయ సెన్సార్ బోర్డు(సీబీఎఫ్సీ) చైర్మన్ పహ్లాజ్ నిహలానీపై వేటు పడింది. సీబీఎఫ్సీ పదవినుంచి ఆయన్ను తొలగిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ శుక్రవారం ఆదేశించింది. ఈయన స్థానంలో బాలీవుడ్ గీత రచయిత ప్రసూన్ జోషిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సినీనటి విద్యాబాలన్‌కు కూడా కొత్త కమిటీలో చోటు కల్పించింది. జూలై చివర్లోనే నిహలానీని తప్పిస్తారని కేంద్రం సంకేతాలిచ్చింది. సీబీఎఫ్సీ కమిటీలో నిర్మాణాత్మక మార్పులు జరగనున్నాయని ఇటీవలే సెన్సార్ బోర్డులో సభ్యుడిగా ఎంపికైన∙దర్శక, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. బ్లాక్, తారే జమీన్పర్, భాగ్ మిల్కా భాగ్, రంగ్ దే బసంతి, ఢిల్లీ–6, నీర్జా చిత్రాలకు జోషి పాటలు రాశారు. పద్మశ్రీ అవార్డును, ఉత్తమ గీతరచయితగా జాతీయ అవార్డు అందుకున్న జోషి.. స్వచ్ఛ్ భారత్ అభియాన్‌తో పాటుగా పలు పథకాల ప్రచార గీతాలను రచించారు. జోషిని సీబీఎఫ్సీ చీఫ్‌గా నియమించటంపై చిత్రపరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. జోషి నేతృత్వంలోని కమిటీలో విద్యాబాలన్‌తోపాటు గౌతమీ తాడిమల్ల, జీవితా రాజశేఖర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. వివాదాల పుట్ట నిహలానీ.. 2015లో సెన్సార్ బోర్డు చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించి నప్పటినుంచీ నిహలానీ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఆరెస్సెస్ అండదండలతోనే నిహలానీకి ఈ పదవి దక్కిందనే విమర్శలూ ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు, చిత్రాల సెన్సార్ విషయంలో చిత్రసీమ నిహలానీ తీరును చాలాసార్లు బహిరంగంగానే విమర్శించింది. తనను ‘ట్రూ ఇండియన్’గా పరిచయం చేసుకునే నిహలానీ.. చాలా చిత్రాలకు కట్స్, బీప్స్, ఖండనల విషయంలో అతిగా వ్యవహరించేవారని విమర్శలున్నాయి. హాలీవుడ్ చిత్రం ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ చిత్రంలో అశ్లీలం ఎక్కువగా ఉందంటూ భారత్‌లో విడుదలకు అనుమతించ కపోవటంతో తొలిసారిగా నిహలానీ వార్తల్లో కెక్కారు. జేమ్స్ బాండ్ చిత్రం ‘స్పెక్టర్’లోనూ చాలా సీన్లను ఈయన తొలగించారు. ఆ తర్వాత ఎన్‌హెచ్ 10, దమ్ లగాకే హైస్సా, అలీగఢ్, ఉడ్తా పంజాబ్, హరామ్ ఖోర్, లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా, ఇందు సర్కార్, బాబుమషాయ్ బందూక్‌బాజ్ మొదలైన చిత్రాల్లోనూ కీలక సన్నివేశాల్లో దృశ్యాలను తొలగించారు. -
మరో సినిమాకు సెన్సార్ షాక్: 48 కట్స్
సెన్సార్ బోర్డ్ మరో బాలీవుడ్ సినిమాకు షాక్ ఇచ్చింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బాబు మొషాయ్ బందూక్ బాజ్' సినిమాకు ఏకంగా 48 కట్స్ తో ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ప్రస్తుత సెన్సార్ బోర్డ్ చైర్మన్ పంకజ్ నిహ్లానీ నిబందనల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. రక్తపాతం, శృంగారభరిత సన్నివేశాలకు వీలైనంతగా కత్తెర వేస్తున్నారు. దీంతో సెన్సార్ దెబ్బకు బాబు మొషాయ్ టీం డైలామాలో పడింది. కేవలం అభ్యంతరకర షాట్స్ మాత్రమే తొలగించమని సూచించామని, సీన్స్ ను తీసివేయలేదని సెన్సార్ బోర్డ్ చెపుతున్నా.. చిత్ర దర్శక నిర్మాతలు మాత్రం ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.' సినిమాలోని కళాత్మక కోణాన్ని పట్టించుకోకుండా, పదుల సంఖ్యలో కట్ చెప్పడం కరెక్ట్ కాదని, అలా చేస్తే సినిమా తీయటం ఎందుకు' అంటున్నారు. మరి 'బాబు మొషాయ్ బందూక్ బాజ్' టీం కూడా సెన్సార్ బోర్డ్ పై యుద్ధం ప్రకటిస్తుందేమో చూడాలి. -
సెన్సార్ బోర్డ్‌పై ఫైర్ అయిన డైరెక్టర్
రియలిస్టిక్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మధుర్ బండార్కర్. తన సినిమాలతో ఎన్నో వివాదాలకు కారణమయ్యే మధుర్ మరో వివాదాస్పద చిత్రాన్ని తెర మీదకు తెచ్చాడు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఇందు సర్కార్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఇందిరా గాంధీని పోలిన పాత్రతో పాటు సంజయ్ గాంధీ పాత్రలను తప్పుగా చూపించారన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఏకంగా 14 కట్లు సూచించారట. సినిమాలో చూపించిన మొరార్జీ దేశాయి, వాజ్ పేయ్, అధ్వానీ లాంటి ప్రముఖుల ఫోటోలను తొలగించాలని, 'అబ్ ఇస్ దేశ్ మే గాంధీ కే మైనే బదల్ చుకే హై (ఈ దేశంలో గాంధీని ఇప్పుడు నేను మార్చేశాను), భారత్ కి ఏక్ బేటీ నే దేశ్ కో బందీ బనాయా హువా హై (భారత్‌కు చెందిన ఓ కూతురు దేశం మొత్తాన్ని బందీ చేసింది), ఔర్ తుమ్ లోగ్ జిందగీ బర్ మా బేటే కి గులామీ కర్తే రహోగే (మీరు జీవితాంతం ఆ తల్లీ కొడుకులకు గులాంగిరీ చేస్తూనే బతికేస్తారా)' లాంటి డైలాగ్ లను తొలగించాలని సూచించారు. అంతేకాదు సినిమాలోఉపయోగించిన ప్రముఖుల పేర్లు వినిపించకుండా మ్యూట్ చేయాలని ఆదేశించారు. దీంతో దర్శకుడు మధుర్ బండార్కర్ సెన్సార్ బోర్డ్ పై ఫైర్ అవుతున్నాడు. గతంలో ట్రైలర్ సెన్సార్ చేసిన సమయంలో అభ్యంతరం పెట్టని సభ్యులు సినిమాకు కట్ చెప్పటం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. అందుకే సెన్సార్ ఇచ్చిన కట్స్ పై రివైజింగ్ కమిటీని ఆశ్రయించాలని నిర్ణయించారు. -
‘బాహుబలి 2’కి ఎ సర్టిఫికెట్!
అవును.. ఇది జోక్ కాదు.. నిజం... ‘బాహుబలి 2’కి సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఆల్రెడీ సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఏప్రిల్ 28న సినిమా కూడా విడుదలైంది. ఇప్పుడు సర్టిఫికెట్ జారీ చేయడ మేంటి అనుకుంటున్నారా? మరదే ట్విస్ట్. ఈ సర్టిఫికెట్ ఇక్కడిది కాదు. సింగపూర్ సెన్సార్ బోర్డు ఇచ్చినది. ఈ చిత్రంలో మితిమీరిన హింస, రక్తపాతం ఉందని భావించి, సింగపూర్ సెన్సార్ బోర్డ్‌వారు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు. భారత్‌లో ‘బాహుబలి 2’ చిత్రాన్ని పిల్లలు చూసి భలే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, సింగపూర్ పిల్లలకు మాత్రం ఈ సినిమా చూసే ఛాన్స్ లేకుండా పోయింది. త్వరలో అక్కడ ఈ చిత్రం విడుదల కానుంది. -
బాహుబలిలో సెన్సారైన దృశ్యాలు...
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన సంచలనాత్మక చిత్రం ‘బాహుబలి–2’ చిత్రంపై సెన్సార్ కత్తెర పడిందా ? పడితే ఎలాంటి సీట్లను కత్తిరించారన్న ఆసక్తి కలుగుతోంది. చిత్రంలోని రణరంగానికి సంబంధించిన సన్నివేశాల్లో తలలు తెగనరికితే రక్తం చిమ్మే కొన్ని భయానక దృశ్యాలకు మాత్రమే సెన్సార్ బోర్డ్ కట్లు చెప్పింది. రానా, ప్రభాస్‌ల ఇద్దరి మధ్య జరిగే యుద్ధానికి సంబంధించిన కొన్ని దృశ్యాలపై కూడా సెన్సార్ బోర్డు కత్తెర విధించగా, ఆ మేరకు సెన్సార్ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని చిత్ర దర్శకుడు రాజమౌళి పునర్ షూటింగ్ జరిపి వాటిని నిడివి తగ్గకుండా జోడించారు. మిగతా అభ్యంతరకర దృశ్యాలను మాత్రం యథాతధంగా తొలగించారు. సినిమాలో కట్లు సూచిస్తూ హైదరాబాద్‌లోని సీబీఎఫ్సీ రీజనల్ అధికారి పీవీఆర్ రాజశేఖరం జారీ చేసిన ఉత్తర్వుల కాపీ మీడియాకు దొరికింది. హిందీ వర్షన్ బాహుబలికి మాత్రం ఒక్క కట్ కూడా చెప్పకుండా సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. బహుశా తెలుగు వెర్షన్‌పై వ్యక్తం చేసిన అభిప్రాయలను పరిగణనలోకి తీసుకొని నిర్మాత ముందుగానే వాటిని హిందీ వర్షన్ నుంచి తొలగించి ఉండవచ్చు. -
అందుకే ఆమె లేడీ సూపర్‌స్టార్
ఒకప్పుడు గ్లామరస్ స్టార్. ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్. ఆ నటి ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్ దటీజ్ ఒన్ అండ్ ఓన్లీ నయనతార. ఇప్పుడు తను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్, టాపెస్ట్స్టార్. టాలెంటెడ్ యువ దర్శకులకు ఆశాస్టార్, నిర్మాతలకు వసూళ్ల క్వీన్. ఇంతకీ ఈ పట్టానికి ఎందుకు అర్హురాలయ్యారంటే, చిత్ర షూటింగ్లో తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కాగానే చేతులు దులుపుకుని వెళ్లి కెరవన్ వ్యాన్‌లో విశ్రాంతి తీసుకోరు. షూటింగ్ లొకేషన్లోనే ఉండి సహ నటీనటుల నటనను గమనిస్తుంటారు. షూటింగ్లో ఆలస్యం అయినా చిరాకు పడరు. కస్సుబుస్సులాడరు. ప్రశాంతంగా ఉంటారు. నటనపై అంకితభావం మెండు. ఈ విషయాలను ఆమెతో కలిసి నటించే సహ నటీనటులందరూ గ్రహించే విషయం. ప్రముఖ నటినన్న గర్వాన్ని ప్రదర్శించరు. అందుకే నయనతార అంటే అందరూ ఇష్టపడతారు. స్టార్ హీరోల నుంచి, యువ నటుల వరకూ నయనతారతో నటించాలని కోరుకుంటారు.అందుకే నయనతార లేడీసూపర్‌స్టార్ అయ్యారు.ఇలా అన్నది ఎవరో కాదు నయనతార నటించిన డోర చిత్రంలో ఆమెతో నటించిన నటుడు హరీష్ ఉత్తమన్. డోర చిత్రం ఈ నెల 31న తెరపైకి రానుంది. ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డు ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది.దీంతో సెన్సార్బోర్డుపై దర్శకుడు విఘ్నేశ్‌శివ విమర్శలు గుప్పించడం విశేషం.ఈయనకేం సంబంధం అని మాత్రం అడగకండి. ఈయన నటి నయనతార ప్రేమించుకుంటున్నారన్న వ్యవహారం గురించి మీడియాలో చాలా కాలంగానే ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్న టాక్ కోలీవుడ్‌లో గట్టిగానే వినిపిస్తోంది. అయినా ఈ విషయం గురించి ఇటు నయనతార గానీ, అటు దర్శకుడు విఘ్నేశ్శివగానీ నోరు మెదపడంలేదు. ఇంతకీ డోర చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం గురించి దర్శకుడు విఘ్నేశ్‌శివ స్పందన ఏమిటన్నదేగా మీ ఆసక్తి. అక్కడికే వస్తున్నాం. డోర చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇస్తారు. దృవంగళ్ 16, మానగరం చిత్రాలాంటి వాటికి యూఏ సర్టిఫికెట్లు ఇస్తారు. ఇటీవల విడుదలైన పలు చిత్రాలకు యూ సర్టిఫికెట్లు అందిస్తారు. రాను రాను సెన్సార్ బోర్డుపై ప్రేమ రోజురోజుకు అధికం అవుతోంది అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. -
కాటమరాయుడుకు 'యూ' సర్టిఫికెట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన కాటమరాయుడు చిత్రానికి 'యూ' సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ బృందం బుధవారం ఈ చిత్రానికి 'యూ' సర్టిఫికెట్ జారీ చేసింది. కాటమరాయుడు మార్చి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా నిడివి 2 గంటల 24 నిమిషాలు ఉండనుందట. ప్రస్తుతం టాలీవుడ్లో కాటమరాయుడు ఫీవర్ నడుస్తోంది. ఈ చిత్రం గురించి రోజుకో వార్త వెలువడుతున్న విషయం తెలిసిందే. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ (కిశోర్ పార్థసాని) దర్శకుడు. ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తుండగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. కాటమరాయుడు చిత్రంలో పవన్ పక్కా మాస్ లుక్ లో ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌కు ఆల్‌టైమ్ రికార్డుస్థాయిలో ఆన్లైన్లో వ్యూస్ దక్కాయి. దీంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు మార్చి 18న భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అదే రోజున థియట్రికల్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది. -
కత్రినా.. కరీనా సమస్య తీరింది!
‘‘మీ ఇంటి పరిస్థితి, మీ మానసిక పరిస్థితిని బట్టి మా చిత్రాల మీద అభిప్రాయం చెప్పడం న్యాయం కాదు. తెలుగు సినిమాలను ఉరి తీయకండి’’ అని సెన్సార్ బోర్డ్ పై ‘కత్రిన, కరీన, మధ్యలో కమల్‌హాసన్’ చిత్ర దర్శకుడు రత్న మండి పడ్డారు. ఇందులో శశాంక్ మౌళి, మమతా రావత్ హీరోహీరోయిన్లు. విలేకరుల సమావేశంలో రత్న మాట్లాడుతూ – ‘‘మా సినిమా షో చూసిన తర్వాత, సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డ్ నిరాకరించింది. దాంతో రివైజ్ కమిటీకి చూపించాం. వారు కూడా తిరస్కరించారు. ఆ తర్వాత ట్రిబ్యూనల్‌కి వెళ్లాం. వాళ్లు 60 రోజుల తర్వాత సినిమా చూసి, విత్ అవుట్ కట్స్‌తో ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రస్తుతం అమ్మాయిలు ఫేస్ చేస్తున్న సమస్యనే కామెడీగా తెరకెక్కించాం. మా సినిమా అభ్యంతరకరంగా ఉంటే ప్రేక్షకులే రిజెక్ట్ చేస్తారు. అంతే కాని సెన్సార్ బోర్డు ఇంతగా ఇబ్బందిపెట్టాల్సిన అవసరంలేదు’’ అన్నారు. -
సెన్సార్ బోర్డ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, ఫర్నీచర్ ధ్వంసం
-
సెన్సార్ బోర్డ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, ఫర్నీచర్ ధ్వంసం
రిజర్వేషన్ ప్రక్రియను ప్రశ్నిస్తూ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మించిన సినిమా శరణం గచ్చామి. ఈ సినిమా రాజ్యంగానికి వ్యతిరేకంగా ఉందంటూ సెన్సార్ బోర్డ్ సభ్యులు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే.. దీంతో చిత్రయూనిట్ సెన్సార్ బోర్డ్‌పై పోరాటం చేస్తోంది. తాజాగా ఈ పోరాటంలో విద్యార్థులు కూడా చేరారు. ఓయూ కు చెందిన దళిత, గిరిజన విద్యార్థులు శరణం గచ్ఛామి సినిమాకు అనుమతివ్వాలంటూ సెన్సార్ బోర్డ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆఫీస్ లో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. -
ఆ దృశ్యాలను ఎందుకు తొలగించరు?
-
ఆ దృశ్యాలను ఎందుకు తొలగించరు?
సెన్సార్ బోర్డు తీరును ప్రశ్నించిన గవర్నర్ నరసింహన్ సాక్షి, అమరావతి: పలు సినిమాలు మహిళలపై హింసను ప్రేరేపిస్తున్నా.. సెన్సార్ బోర్డు అలాంటి దృశ్యాలను ఎందుకు తొలగించడం లేదని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశ్నించారు. విజయవాడ సమీపంలో ని పవిత్ర సంగమం ఘాట్ వద్ద జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలకు గవర్నర్ శనివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలను కొందరు ఫొటోలు తీస్తున్నారని, అలాంటి వాటిని మీడియాలో చూపించడం సరికాదని, ఇలా చూపించిన మీడియాను విచారిం చే పరిస్థితి రావాలని చెప్పారు. మహిళలపై వేధింపుల కేసులను త్వరగా పరిష్కరిం చేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. 4 వారాల్లో ఆ కేసులు పరిష్కారమయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మారిన పరిస్థితుల్లో ఏ రంగంలోనూ మహిళలకు ఇబ్బందుల్లేవని, కొన్ని సంక్లిష్టమైన సమాజాల్లో మాత్రమే మహిళలు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. క్రమంగా అవి తగ్గుతున్నాయని, కానీ అలాంటి పరిస్థితులను పూర్తిగా రూపుమాపా ల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మహిళలకు ధైర్య లక్ష్మి, ధన లక్ష్మి, ధాన్య లక్ష్మి, అభయ లక్ష్మి, గృహ లక్ష్మి, మహా లక్ష్మి తదితర బహురూపాలున్నాయని చెప్పిన గవర్నర్.. తన పేరు లక్ష్మీ నరసింహన్ అని చమత్కరించారు. మహిళలు అభివృద్ధి చెందకుండా సంక్షేమం సాధ్యం కాదని, ఒక రెక్కతో పక్షి ఎగరలేదనే వాస్తవాన్ని గుర్తించాలని సూచించారు. మహిళా సాధికారిత ఉన్న ప్రాంతాల్లోనే ఆర్థికాభివృద్ధి, రాజకీయ సుస్థిరత, స్థిరమైన శాంతి నెలకొని ఉందని చెప్పారు. అనంతరం గవర్నర్‌ను సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల సన్మానించారు. మహిళా సాధికారితపై ముద్రించిన న్యూస్ బులెటిన్‌ను గవర్నర్ ఆవిష్కరించారు. -
సెన్సార్ తిరస్కరణపై సమరం : శరణం గచ్ఛామి టీం
ఇటీవల కాలం సెన్సార్ బోర్డ్ తీరు వివాదాస్పదమవుతోంది. సున్నితమైన అంశాలతో తెరకెక్కిన పలు చిత్రాల విషయంలో సెన్సార్ బోర్డ్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ లోనూ సెన్సార్ బోర్డ్ తీరు వివాదాస్పదం కాగా.. తాజాగా చిన్న సినిమాగా తెరకెక్కిన ఓ తెలుగు సినిమా యూనిట్ ఏకంగా సెన్సార్ బోర్డ్‌పై యుద్ధం ప్రకటించింది. రిజర్వేషన్ ప్రక్రియను ప్రశ్నిస్తూ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మించిన సినిమా శరణం గచ్చామి. ఈ సినిమా రాజ్యంగానికి వ్యతిరేకంగా ఉందంటూ సెన్సార్ బోర్డ్ సభ్యులు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో చిత్రయూనిట్ సెన్సార్ బోర్డ్‌పై పోరాటానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే జాతీయ సెన్సార్ బోర్డ్‌ను ఆశ్రయించిన చిత్రయూనిట్ తమ సినిమాలో ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవని కేవలం యువతను ఆలోచింప చేసేదిగా చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. 'అసభ్యత, అశ్లీలతలకు పెద్ద పీట వేస్తూ.. హింసను ప్రేరేపిస్తూ, యువతను పెడ దారి పట్టించే సినిమాలకు క్లీన్ సర్టిఫికెట్స్ జారీ చేసే సెన్సార్ బోర్డ్.. యువతరాన్ని మేల్కొలుపుతూ.. మేధావులను సైతం ఆలోచింపజేస్తూ.. క్లీన్ ఎంటర్టైనర్గా.. రూపొందించిన తమ శరణం గచ్ఛామి సినిమాను అడ్డుకోవడం తమకు ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోంద'ని అంటున్నారు చిత్ర నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ప్రేమ్ రాజ్. సహేతుకమైన కారణాలు చూపకుండా.. రివైజింగ్ కమిటీకి వెళ్లమనడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ సినిమాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేశారు. -
'సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వనంటున్నారు'
దర్శకుడు ప్రేమ్ రాజ్ తెరకెక్కించిన శరణం గచ్ఛామి సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్‌బోర్డ్ నిరాకరించటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయటంపై తెరకెక్కించిన ఈ సినిమా రాజ్యంగంలోని పలు నింబధనలను ఉల్లంఘించిందన్న కారణంతో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే తన సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను, డైలాగ్‌లను తొలగించేందుకు తాను సిద్ధమని అలాంటివేవీ చెప్పకుండా సర్టిఫికేట్ ఇవ్వకపోవటం అన్యాయం అంటున్నారు దర్శకుడు ప్రేమ్ రాజ్. ప్రాంతీయ సెన్సార్‌బోర్డ్ సెన్సార్‌కు నిరాకరించటంతో ప్రస్తుతం కేంద్ర సెన్సార్‌బోర్డ్‌ను ఆశ్రయించినట్టుగా తెలిపారు. ఇటీవల సెన్సార్‌బోర్డ్ నిర్ణయాలు వివాదాస్పద మవుతున్న నేపథ్యంలో శరణం గచ్ఛామి విషయంలో కేంద్ర సెన్సార్ బోర్డ్, ఏ నిర్ణయం తీసుకోనుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. -
బాబీసింహా చిత్ర విడుదలపై సందిగ్ధం
నటుడు బాబీసింహా చిత్రం చర్చల్లో చిక్కుకుంది. జిగర్తండా చిత్రంలో విలన్‌గా అట్టహాసం చేసి జాతీయ అవార్డును కైవసం చేసుకున్న యువ నటుడు బాబీసింహా. ఆ తరువాత కూడా ప్రతి నాయకుడిగా కొన్ని చిత్రాల్లో నటించిన ఈయన కథానాయకుడిగా అవతారమెత్తారు. అలా ఆయన హీరోగా నటించిన చిత్రాల్లో పాంబుసట్టై ఒకటి. కీర్తీసురేశ్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ఆటమ్ దాసన్ దర్శకత్వంలో నటుడు మనోబాలా నిర్మించారు. చాలా కాలం నిర్మాణంలో ఉన్న పాంబుసట్టై చిత్రం ఎట్టకేలకు విడుదలకు ముస్తాబవుతోంది. అయితే చిత్రానికి సెన్సార్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కారణం చిత్రంలో బాబీసింహా ఒక సన్నివేశంలో నగ్నంగా నటించారట. దీంతో అలాంటి కొన్ని సన్నివేశాలను తొలగించి చూపించండి చిత్రానికి (యూ) సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పారని సమాచారం. బాబీసింహా నటించిన నగ్న దృశ్యాలను ఒక్క షాట్లో కాకుండా వివిధ కోణాల్లో చిత్రీకరించారనీ, చిత్ర కథకు ప్రాధాన్యం ఉన్న ఆ సన్నివేశాలను కత్తిరించడానికి చిత్ర యూనిట్‌కు ఇష్టం లేదని సమాచారం. అయితే తాము అభ్యంతరం చెప్పిన సన్నివేశాలను తొలగిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు సభ్యులు అంటున్నారట. దీంతో ఈ నెల 30వ తేదీన పాంబుసట్టై చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించినా, ఆ తేదీని మాత్రం ప్రకటనల్లో వెల్లడించడం లేదు. దీంతో సాంబుసట్టై చిత్ర విడుదలపై సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. -
పండగ ధగధగ
సినిమా పరిభాషలో పండగ అంటే సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి. ఏం చేసినా.. ఏం పీకినా.. కెమెరా ఫోకస్ ఎటు తిప్పినా.. సెన్సార్ బోర్డు ఎన్ని కట్లు చెప్పినా.. ఎడిటర్ ఎన్ని కుట్లు వేసినా.. అందరి పరుగూ ఈ నాలుగు స్తంభాలాటలోనే. సినీ కళామతల్లి కోసం కట్టిన గుడికి ఈ నాలుగు పండగలూ నాలుగు స్తంభాలు. హీరోల దగ్గర్నుంచి అభిమానుల వరకూ అందరూ పూజించేది ఈ గుడిలోనే. అందరూ చేసుకునేది ఈ నాలుగు పండగలే. దీపావళి గడప దగ్గర నిలబడి ‘ఫన్డే’ పాఠకులకు నాలుగు పండగల సినిమాల విశేషాలు చెప్పాలని ఈ స్పెషల్ సినిమా ప్రివ్యూ మీకోసం.. ఒకరిది ప్రేమ.. ఇంకొకరిది పగ.. మరొకరిది సోకు... ఇంకొకరిది వినోదం. ప్రేమ గెలిచింది. పగ కూడా గెలిచింది. సోకు సూపర్ అనిపించుకుంది. వినోదం కాలరెగరేసింది. సంక్రాంతి రేసులోకి ముగ్గుల పోటీల్లా దూసుకొచ్చిన ‘నాన్నకు ప్రేమతో’, ‘డిక్టేటర్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ పండగ సెలవులను బాగానే క్యాష్ చేసుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల టికెట్ కలక్షన్స్, ఓవర్సీస్ రైట్స్, శాటిలైట్ సేల్స్, డబ్బింగ్ రైట్స్ తదితర అమ్మకాలన్నీ కలుపుకుని నాలుగు గొబ్బెమ్మలూ ‘ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్స్’ అయ్యాయి. ప్రేక్షకుల ప్రేమతో... సంక్రాంతి పండగ మొదటి రోజు భోగి కానుకగా వచ్చిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌తో సుకుమార్ దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. ‘మంచి ఎమోషనల్ మూవీ’ అనిపించుకుంది. హాలీవుడ్ స్థాయిలో ఉందనే టాక్నూ సొంతం చేసుకుంది. పూర్వాశ్రమంలో లెక్కల మాస్టార్ అయిన సుకుమార్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌ని కూడా లెక్క ప్రకారం తీశారు. సినిమాలో ఎన్ని లెక్కలున్నా వసూళ్లు సాదాసీదాగా ఉంటాయన్నది కొందరి లెక్క. అయితే లెక్క తప్పింది. ప్రేక్షకుల ప్రేమతో బాక్సాఫీస్ లెక్కలు కూడా బాగానే ఉన్నాయి. బడ్జెట్: రూ.60 కోట్లు, మొత్తం వసూళ్లు: రూ.70 కోట్లు (రెండు తెలుగు రాష్ట్రాల టికెట్ కలెక్షన్స్ - రూ.40 కోట్లు) కలిసొచ్చిన సంక్రాంతి గడచిన 20 ఏళ్లల్లో బాలకృష్ణ కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ సంక్రాంతికి విడుదలైనవే. దాంతో సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అయిన ‘డిక్టేటర్’పై సహజంగానే అంచనాలు నెలకొన్నాయి. దర్శకత్వం వహించడంతో పాటు ఈరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి శ్రీవాస్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగి, బాగానే వసూళ్లు రాబట్టుకోగలిగింది. బడ్జెట్: రూ.30 కోట్లు, మొత్తం వసూళ్లు: రూ.35 కోట్లు (రెండు తెలుగు రాష్ట్రాల టికెట్ వసూళ్లు రూ.20 కోట్లు) రాజాకి తిరుగులేదు శర్వానంద్‌కి మినిమమ్ గ్యారంటీ హీరో ప్లస్ కొత్త రకం సినిమాలు ట్రై చేస్తాడనే పేరుంది. ‘రన్ రాజా రాజా’ హిట్టయిన తర్వాత ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అంటూ సంక్రాంతికి సందడి చేయడానికి దూసుకొచ్చాడు. బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్‌లు చేసినవి భారీ బడ్జెట్ చిత్రాలు. వాటితో పోల్చుకుంటే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చాలా చిన్న బడ్జెట్. కానీ, మంచి వసూళ్లతో కింగ్ అనిపించుకున్నాడు. బడ్జెట్ రూ.8 కోట్లు, మొత్తం వసూళ్లు: రూ.20 కోట్లు (రెండు తెలుగు రాష్ట్రాల టికెట్ కలక్షన్స్ రూ.12 కోట్లు) సోగ్గాడు అదిరిపోయాడు సంక్రాంతి అంటే పల్లెలన్నీ కళకళలాడతాయ్. ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో ఆ కళ కనిపించింది. ‘వాసివాడి తస్సదియ్యా’ అంటూ తనకే మాత్రం అలవాటు లేని పదాలతో నాగార్జున చేసిన సందడి అందర్నీ ఆకట్టుకుంది. అందుకే సోగ్గాడు వీర విహారం చేశాడు. వసూళ్లు పరంగా దుమ్ము దులిపేశాడు. బడ్జెట్: రూ.18 కోట్లు, వసూళ్లు: రూ.60 కోట్లకు పైనే (టికెట్ కలక్షన్స్ రూ.40 కోట్లు) -
సెన్సార్ బోర్డుపై హీరోయిన్ చిందులు
న్యూఢిల్లీ: బాలీవుడ్ ఐటమ్ గర్ల్, నటి రాఖీ సావంత్ కేంద్ర సెన్సార్ బోర్డుపై విరుచుకుపడింది. రాఖీ తాజా సినిమా ఏక్ కహాని జూలీ కీ.. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం ఆమెకు కోపం తెప్పించింది. సెన్సార్ బోర్డుపై, చైర్మన్ పహ్లజ్ నిహలానీపై రాఖీ తీవ్ర విమర్శలు చేసింది. ‘సెన్సార్ బోర్డును మూసివేయాలి. పెద్ద నిర్మాతల నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప వాళ్లు చేస్తున్నదేమీ లేదు. సెన్సార్ బోర్డు సభ్యులు చిన్న నిర్మాతలను వేధిస్తున్నారు. లంచం ఇవ్వాలని పబ్లిక్‌గా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఏమీ తెలియనివారు ఉన్నారు. సెన్సార్ బోర్డు చైర్మన్ పదవి నుంచి నిహలానీని తప్పించాలి. ఆయనకు ఏమీ తెలియకుంటే పదవికి రాజీనామా చేయాలి. ఆ స్థానంలో నేను కూర్చుంటాను. నిహలానీ కంటే సమర్థవంతంగా పనిచేయగలను. వాళ్లకు మేం డబ్బులు ఇవ్వనందుకే ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. నేను ఈ సినిమాలో నటించడమే దీనికి కారణం. వాళ్లు బుద్ధి కోల్పోయారు. నేను బాలీవుడ్ స్టార్‌ను, నటిని, ఈ దేశ బిడ్డను. నేనేమీ పోర్న్ స్టార్ కాదు. ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఈ సినిమాలో అసభ్య దృశ్యాలు లేవు. ఈ విషయంపై బాంబే హైకోర్టును సంప్రదించాను. సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలని కోరాను. వాళ్లకు తగిన గుణపాఠం చెబుతా. వారిపై పోరాటం చేస్తాను. దేశంలో సెన్సార్ బోర్డు లేకుండా తొలగించాలి’ అని రాఖీ ఘాటుగా విమర్శించింది. -
సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా ప్రభు
ప్రముఖ సీనియర్ జరల్నిస్ట్ ప్రభు సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా నియమితులయ్యారు. ఈ బాధ్యతను ఆయన చేపట్టడం ఇది రెండోసారి. ఉత్తమ పాత్రికేయుడిగా నంది అవార్డును కూడా అందుకున్న ప్రభు దివంగత నటుడు ఏయన్నార్ జీవితం ఆధారంగా గతంలో తీసిన ‘నటసామ్రాట్’ అనే సీరియల్‌కు దర్శకత్వం వహించారు. ఫద్నాలుగవ అంతర్జాతీయ బాలలచలన చిత్రోత్సవాలకు మీడియా కమిటీ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. ‘‘ఏ బాధ్యత స్వీకరించినా నా వంతు న్యాయం చేయడానికి కృషి చేస్తాను’’ అని ప్రభు పేర్కొన్నారు. -
ఆ సినిమా చూడకండి.. వైరస్ వస్తోంది!
ముంబై: బాలీవుడ్ సినిమా 'ఉడ్తా పంజాబ్' విడుదలకు ముందే ఆన్లైన్ లో లీక్ అవడం పట్ల సినిమా ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. పైరసీని ప్రోత్సహించొద్దని, ధియేటర్ కు వెళ్లి సినిమా చూడాలని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. ఈ సినిమాను నిజంగా సెన్సార్ బోర్డు లీక్ చేసివుంటే అంతకన్నా అవమానం మరోటి ఉందని పలువురు వ్యాఖ్యానించారు. ఒకవేళ సెన్సార్ లీక్ చేయకుంటే పైరసీపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ లో 'ఉడ్తా పంజాబ్' లీక్ కావడం బాధ కలిగించిందని తెలుగు సినీ నిర్మాత శోభు యార్లగడ్డ అన్నారు. ఇది సినిమా రూపకర్తలను, ఫిల్మ్ ఇండస్ట్రీని అగౌరవపరచమేనని ఆయన ట్వీట్ చేశారు. 'ఉడ్తా పంజాబ్' వివాదంపై నెటిజన్లు రకరకాలు స్పందించారు. ఈ సినిమా లీక్ వెనుక ప్రధాని మోదీ హస్తం ఉందని ఒకరు అంటే, ఇదందా సెన్సార్ బోర్డు కుట్రని మరొకరు ఆరోపించారు. ముందు హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టడం మానుకోవాలని మరొకరు సలహాయిస్తే.. వివాదంతో 'ఉడ్తా పంజాబ్' మంచి పబ్లిసిటీ వచ్చిందని ఇంకొకరు కామెంట్ చేశారు. ఆన్లైన్ లో లీకైన 'ఉడ్తా పంజాబ్'తో కంప్యూటర్లకు వైరస్ ప్రమాదం ముప్పు పొంచివుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ లింకులను క్లిక్ చేస్తే వైరస్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. 'ఉడ్తా పంజాబ్' లీక్ తో నేను ఎందుకు ట్రెండింగ్ అవుతున్నానని ప్రశిస్తూ 'త్రీఇడియట్స్' సినిమాలోని 'వైరస్' పాత్రధారి ఫొటో పెట్టారు. -
'ఉడ్తా పంజాబ్' లీక్.. లీకు వీరులు సెన్సార్ బోర్డేనా?
ముంబై పోయి పోయి సెన్సార్ బోర్డుతో పెట్టుకుంటే మాటలా మరి... వాళ్లు ఏమైనా చేయగలరు. చివరకు విడుదల కాక ముందే సినిమాను టోరెంట్లలో లీక్ కూడా చేయగలరు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. చివరకు కోర్టు ద్వారా విడుదలకు గ్రీన్ సిగ్నల్ తెప్పించుకున్న 'ఉడ్తా పంజాబ్' చిత్ర యూనిట్ ఇప్పుడు తల పట్టుకుంటోంది. ఏయే టోరెంట్లలో తమ సినిమా లింకులు ఉన్నాయో వెతుక్కుని మరీ డిలీట్ చేయిస్తోంది. విషయం ఏమిటంటే... పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న డ్రగ్ కల్చర్ మీద తీసిన సంచలనాత్మక చిత్రం 'ఉడ్తా పంజాబ్' విడుదలకు ముందే టోరెంట్లలో లీకైంది. అయితే.. లీకు చేసింది సాక్షాత్తు సీబీఎఫ్‌సీకి సంబంధించిన వాళ్లేనని అంటున్నారు. ఎందుకంటే, లీకైన సినిమా ప్రింటు చూసినప్పుడు దాని మీద 'ఫర్ సెన్సార్' అని ముద్ర కనిపించడంతో పాటు.. దానికి సంబంధించిన డేట్ స్టాంప్ కూడా ఉందట. అంటే, తాము సెన్సార్ చేయడానికి ఇచ్చిన ప్రింటును యథాతథంగా లీక్ చేసేశారని ఆరోపిస్తున్నారు. దాదాపు రెండు గంటల 20 నిమిషాల నిడివి కలిగిన మూవీ లీకైంది. దీనిపై మూవీ యూనిట్‌ను ప్రశ్నించగా వారు అధికారికంగా స్పందించలేదు. సినిమాను సర్టిఫికేట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు 90కి పైగా కట్లు సూచించింది. అయితే, ఈ విషయంపై కోర్టుకెళ్లిన యూనిట్ ఒక కట్ తో 'ఏ' సర్టిఫికేట్ ను తెచ్చుకుంది. -
ఉడ్తా పంజాబ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: ఉడ్తా పంజాబ్ చిత్రంపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదలపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సినిమాలో కేవలం ఒక్క సీన్‌ను మాత్రమే కట్ చేసి, విడుదలకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం తెలుపుతూ స్వచ్ఛంద సంస్థ ఇవాళ ఉన్నత ధర్మాసనం తలుపు తట్టింది. ఉడ్తా పంజాబ్‌లో డ్రగ్స్ వాడకం అధికంగా ఉందని చూపడంతో పాటు, పంజాబ్‌లో పేదరికాన్ని ఎత్తి చూపుతున్నట్లు ఉందని తన పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తక్షణమే విచారణ జరపాలని స్వచ్ఛంద సంస్థ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అయితే పిటిషన్‌పై పూర్తి వివరాలతో రావాలని కోర్టు సూచించింది. కాగా ఉడ్తా పంజాబ్ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ప్రతిపాదించిన 89 కత్తిరింపులు చెల్లవని హైకోర్టు తీర్పునివ్వడంతోపాటు 48 గంటల్లోగా దానికి సర్టిఫికెట్ అందించాలని సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు అనేక అడ్డంకులను దాటుకంటూ ఉడ్తా పంజాబ్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల మందుకు రానుంది. కాగా ఉడ్తా పంజాబ్ సినిమాకు సంబంధించి బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రోమోలోని అభ్యంతరకర దృశ్యాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ..చిత్ర దర్శక, నిర్మాతలను ఆదేశించింది. -
ఒక్క కట్ చాలు..
‘ఉడ్తా పంజాబ్’కు 48 గంటల్లో సర్టిఫికెట్ ఇవ్వండి - సెన్సార్ బోర్డును ఆదేశించిన బాంబే హైకోర్టు - కాలానికి తగినట్టు మారాలని సీబీఎఫ్‌సీకి సూచన ముంబై: సెన్సార్ వివాదంలో చిక్కుకున్న ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగాయి. సెన్సార్ బోర్డు సూచించిన 13 కత్తిరింపులతోకాక ఒకే కత్తిరింపుతో బాంబే హైకోర్టు అనుమతినిచ్చింది. 48 గంటల్లో ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వాలని బోర్డును ఆదేశించింది. పంజాబ్‌లో మాదక ద్రవ్యాల వినియోగం ఇతివృత్తం ఆధారంగా నిర్మితమైన ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు తొలుత 89 కట్స్ చెప్పింది. రివ్యూ కమిటీ పరిశీలన తర్వాత 13కు కుదించింది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఆదేశాలను సవాలు చేస్తూ సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్‌కు చెందిన పాంటామ్ ఫిల్మ్స్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను సోమవారం విచారించిన కోర్టు ఒక్క కట్‌తో చిత్రం విడుదలకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 6న రివ్యూ కమిటీ సూచించిన సినిమాలోని మూత్ర విసర్జన సన్నివేశం తొలగింపు, డిస్‌క్లయిమర్‌లో మార్పులకు మాత్రం కోర్టు అంగీకరించింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సెన్సార్ బోర్డు అమ్మమ్మ మాదిరిగా వ్యవహరించొద్దని, కాలానుగుణంగా బోర్డూ మారాలని, కళలకు సంబంధించిన అంశాల్లో సీబీఎఫ్సీ ఓవర్ సెన్సిటివ్‌గా వ్యవహరించడం తగదని, సృ జనాత్మకతకు కోత విధించడం తగదని పేర్కొంది. సృజనాత్మక వ్యక్తులను అకస్మాత్తుగా ఆపడం తగదని, ఇది వారిని నిరుత్సాహానికి గురిచేస్తుందని, ఇది సృజనాత్మకతను చంపేస్తుందని పేర్కొంది. సెన్సార్ బోర్డు అధికారాలపైనా న్యాయస్థానం ప్రశ్నలు కురిపించింది. సినిమాటోగ్రఫీ చట్టంలో సెన్సార్ అనే పదమే లేదంది. ఒక వేళ ఒక చిత్రంలో ఏమైనా కట్స్ చెప్పాలంటే అవి రాజ్యాంగబద్ధంగా, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉండాలంది. మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా కోర్టు ఆదేశాలపై స్టే విధించాలన్న సెన్సార్ బోర్డు అభ్యర్థనను కూడా బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఈ చిత్రం స్క్రిప్ట్‌ను తాము చదివామని, ఇందులో పంజాబ్‌ను చెడుగా చిత్రీకరించేందుకు, భారత సార్వభౌమత్వాన్ని, భద్రతను దెబ్బతీసే అంశాలేవీ లేవని గుర్తించామని పేర్కొంది. అయితే ఈ చిత్రం, ఇందులోని పాత్రలు, ఫిల్మ్ మేకర్స్.. డగ్స్ వినియోగాన్ని, దుర్భాషలను ఏవిధంగానూ ప్రోత్సహించ డం లేదని డిస్‌క్లయిమర్‌లో మార్పులు చేయాలని ఆదేశించింది. ఈ నెల 17న చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. -
ఆ ఆరుగురు ఎలా డిసైడ్ చేస్తారు?
‘‘ఒక తండ్రి, తల్లి... వాళ్లకన్నా ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. ఆ ఇంటి పెద్ద తమ కుటుంబ సభ్యులు ఎలాంటి సినిమాలు చూడాలో? ఏవి చూడకూడదో నిర్ణయిస్తారు. ఆరుగురు వ్యక్తులు ఉన్న ఓ బోర్డ్ కన్నా నిర్ణయం తీసుకోవడంలో కుటుంబ సభ్యులే మిన్న’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. హిందీ చిత్రం ‘ఉడ్తా పంజాబ్’కి సెన్సార్ బోర్డ్ 89 కట్స్ చెప్పడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. భాషా భేదం లేకుండా ‘ఉడ్తా పంజాబ్’కు మద్దతుగా నిలుస్తున్నారు. ‘‘దేశంలో ఉన్న 130 కోట్ల మంది జనాభా ఎలాంటి సినిమాలు చూడాలో.. ఎలాంటివి చూడకూడదో ఆరుగురు వ్యక్తులు ఎలా నిర్ణయిస్తారు? నా మద్దతు ఎప్పుడూ ఫిలిం మేకర్స్ పక్షానే ఉంటుంది’’ అని రాజమౌళి పేర్కొన్నారు. -
సెన్సార్ బోర్డు చైర్మన్ ను మార్చనున్నారా?
న్యూఢిల్లీ: ఇటీవల ఉడ్తా పంజాబ్ సినిమా సెన్సార్ విషయంలో వివాదంలో చిక్కుకున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ)లో పెను మార్పులు చేసేందుకు సమాచార మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. సెన్సార్ బోర్డు చైర్మన్ గా ఉన్న పహ్లజ్ నిహ్లానీని తొలగించి ఆయన స్థానంలో ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ ను నియమించనున్నారని తెలుస్తోంది. ఒక టీవీ ఇంటర్వూలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ త్వరలోనే సెన్నార్ బోర్డులో పెను మార్పులు జరుగనున్నాయని చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుత చైర్మన్ నిహ్లానీ నేను మోడీ చెంచానని బాహాటంగా ప్రకటించడంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడ్డట్టు తెలుస్తోంది. రాజకీయాలకు అతీతమైన వ్యక్తిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
కట్ చేస్తే ... ‘గుండె కోత’ అంటున్న సినీ పరిశ్రమ
హృదయం... అన్నీ కావాలంటుంది! మైండ్... ‘అదెలా కుదురుతుంది’ అంటుంది! ‘సహజంగా ఉంటే చాలు... సహస్రకోటి భావాలకు వ్యక్తీకరణ ఉంటుంది’ అని హృదయం అనుకుంటే... ‘సహజంగా ఉండడానికి మనమేమన్నా పశువులమా, మృగాలమా? సహజం నాట్ ఎలౌడ్ ఇన్ సమాజం’ అని మైండ్ అంటుంది. మనిషికున్న అమూల్యమైన హక్కు - ‘భావవ్యక్తీకరణ స్వేచ్ఛ’. అలాంటి స్వేచ్ఛను వికసింపజేయాలన్నది... హృదయం ఆశ! భావప్రకటనకు కూడా హద్దులు ఉండాలన్నది మైండ్ మాట! హృదయంతో తీస్తున్న సినిమాలను... మైండ్‌తో కోస్తున్న సెన్సార్‌బోర్డ్ వైఖరికి హిందీ సినిమా ‘ఉడ్తా పంజాబ్’ వివాదం తాజా ఉదాహరణ. ‘‘ఇది నాకూ, అక్కడ (సెన్సార్ బోర్డ్‌లో) అధికారంలో కూర్చొని, కొద్దిమంది గొప్పవాళ్ళ చేతిలోని రాజ్యంలా వ్యవహరిస్తున్న ఒక నిరంకుశుడికీ మధ్య జరుగు తున్న పోరు. ఇదంతా చూస్తుంటే, నేను ఏ ఉత్తర కొరియాలోనో ఉన్నట్లుంది.’’- ‘ఉడ్తా పంజాబ్’ చిత్ర సహ నిర్మాత, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక సృజనశీలి కడుపు చించుకొని వచ్చిన ఆవేశం ఇది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పడుతున్న సంకెళ్ళపై సమాజంలోని అనేక మంది సినీ కళాకా రుల ఆక్రందనకు అద్దం ఇది. అవును. సమాజానికి దర్పణం పట్టాల్సిన సినిమాలో, సృజనాత్మక భావ వ్యక్తీకరణకు వేదిక అయిన సినిమాలో... మన చుట్టూ కళ్ళెదురుగా జరుగుతున్నది చూపిస్తే తప్పు అంటే ఆవేదన, ఆవేశం కాక ఏమొస్తాయి? ఇవాళ భారతీయ సినీ ప్రపంచమంతా హిందీ సినిమా ‘ఉడ్తా పంజాబ్’ (కొత్త హుషారుతో ఎగసిపడుతున్న పంజాబ్ అని స్థూలంగా అర్థం) గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటోంది అందుకే! ఈ నెల 17న రిలీజ్ కావాల్సిన ఈ హిందీ సినిమా పంజాబ్‌లో పెచ్చ రిల్లిన డ్రగ్స ఉపద్రవంపై తీసిన సమకాలీన సినిమా. అయితే, అలా తీయ డమే ఇప్పుడు ఇబ్బందిగా తయారైంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెన్సార్ బోర్డ దర్శక, నిర్మాతలకు చుక్కలు చూపడం మొదలుపెట్టింది. దాంతో, దేశంలో ఫిల్మ్ సర్టిఫికేషన్ సైతం రాజకీయ ఒత్తిళ్ళకు అతీతం కాదని మరోసారి ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజానికి, 2015లో పగ్గాలు చేపట్టిన ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహలానీ సారథ్యంలోని సెన్సార్‌బోర్‌డపై విమర్శలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఆధునిక జీవితంలో సర్వసాధారణమై పోయిన కొన్ని తిట్లని సైతం సినిమాలో అనుమతించేది లేదంటూ బోర్డ గత ఏడాది ఒక జాబితానే సిద్ధం చేసింది. ఫలానా సినిమా ఏ వయస్సువాళ్ళు చూడచ్చో నిర్దేశిస్తూ, సర్టిఫికెట్ జారీ చేయడమే బాధ్యతగా ఉండాల్సిన సెన్సార్ బోర్డ ‘నైతిక పోలీసింగ్’ చేయసాగింది. సెన్సార్‌వ్యవస్థపై బాగా విమర్శలు రావడంతో కొన్ని నెలల క్రితం దర్శకుడు శ్యావ్‌ుబెనెగల్ సారథ్యంలో ఒక సిఫార్సుల సంఘాన్ని కేంద్రం వేసింది. సినిమాల్ని కట్ చేసి పారేయడం కాక, 12 ఏళ్ళు పైబడిన వాళ్ళకీ, పెద్దలకీ మాత్రమే అంటూ రకరకాల వర్గీకరణ చేయాల్సిందిగా ఆ సంఘం సిఫార్సులూ చేసింది. భావప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తామన్న ప్రభుత్వం ఆ సిఫార్సుల్ని పట్టించుకొన్న పాపాన లేదు. ఇవాళ ‘ఉడ్తా పంజాబ్’పై కత్తెర వేటు దానికి తాజా ఉదాహరణ. సామాజిక ఉపద్రవమైన డ్రగ్స గురించి సినిమాల్లో ప్రస్తావిస్తే తప్పే మిటని అనురాగ్ వాదన. ఆయన మాటల్లో చెప్పాలంటే, ‘‘ఉడ్తా పంజాబ్ ఒక నిజాయతీ సినీ ప్రయత్నం. ఈ సిన్మాను వ్యతిరేకి స్తున్న పార్టీలు, వ్యక్తులు డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తున్నట్లే లెక్క!’’ వాస్తవ పరిస్థితులపై అందరి దృష్టీ పడేలా చేసి, జనాన్ని జాగృతం చేసే ప్రయత్నాలకు కత్తెర అడ్డం పెడితే తప్పెవరిది? తీసినవాళ్ళదా? కట్ చేసిన వాళ్ళదా? మీ పిల్లలు డ్రగ్స్ బారినపడ్డారా? ఇవాళ హైదరాబాద్, చెన్నై సహా దేశంలోని అనేక నగరాల్లో, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మత్తుపదార్థాల వినియోగం విచ్చలవిడిగా జరుగుతు న్నట్లు ఆరోపణలున్నాయి. యుక్తవయస్సులోని వారు తెలిసీ తెలియక ఈ ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. అలా ఇరుక్కున్నవారి లక్షణాలు ఎలా ఉంటాయంటే... కళ్ళు ఎర్రబారి ఉంటాయి. కనుపాప సాధారణం కన్నా మరీ చిన్నది, లేదా పెద్దది అయిపోతుంది ముక్కుతో పీల్చే కొకైన్ లాంటి డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కు వెంట తరచూ రక్తం కారుతుంటుంది తిండి, నిద్ర అలవాట్లు మారిపోతాయి. అకస్మాత్తుగా బరువు పెరగడమో, తగ్గడమో జరుగుతుంది శ్వాసలోనూ, ఒంటి నుంచి, దుస్తుల నుంచి అసాధారణ వాసనలు వస్తాయి కాళ్ళూ చేతులు వణకడం, మాట నత్తిగా రావడం, మనిషిలో కుదురు లేకపోవడం కనిపిస్తాయి క్లాసులు తరచూ ఎగ్గొడుతుంటారు. ఆటపాటలు, హాబీల మీద ఆసక్తి పోతుంది వినే సంగీతం, వేసుకొనే దుస్తులు, గదిలోని పోస్టర్లపై డ్రగ్స్, మద్యం అలవాట్లను ప్రతిబింబిస్తుంటాయి చటుక్కున మూడ్స్ మారిపోతుంటాయి. తరచూ తగాదాలకు దిగుతుంటారు. ఎవరితోనూ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడరు. గది తలుపులు ఎప్పుడూ బిడాయించుకొని, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. సెన్సార్‌తో సమస్యేంటి? ఏం తీసేయమంటోంది? పంజాబ్‌లో కేవలం మరో 9 నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని డ్రగ్స్ ఉపద్రవంపై అభిషేక్ చౌబే దర్శకత్వంలో రూపొందిన ‘ఉడ్తా పంజాబ్’ అధికారపక్షానికి ఇబ్బందికరమైంది. సినిమా గనక అలాగే రిలీజైతే తమకు కష్టమని అధికార ‘శిరోమణి అకాలీదళ్’ (కేంద్రంలో గద్దెపై ఉన్న నేషనల్ డెమోక్రాటిక్ ఎలయన్స్‌లో భాగస్వామ్యపక్షం) సహజంగానే భావించింది. మొదట 40... ఇప్పుడు 89 కట్స్! నిజానికి, మొదట ఈ సినిమాను సెన్సార్‌కు పంపినప్పుడు ‘కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ సంస్థ’ (సి.బి.ఎఫ్.సి. జనం భాషలో ‘సెన్సార్ బోర్డ్’) 40 కట్స్ చేయా లంది. సినిమాలోని భాష, డ్రగ్స్ వినియోగ దృశ్యాలపై ఈ కట్స్ ఇచ్చింది. నిర్మాతలు దీనిపై అప్పీలు చేసుకున్నారు. కట్స్ లేకుండా, ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తారని ఆశించారు. కానీ, సినిమా చూసిన ‘రివైజింగ్ కమిటీ’ (ఆర్.సి) ఏకంగా సినిమా పేరులో ఉన్న ‘పంజాబ్’ అనే పదాన్నే తొలగించమంది. మొత్తం 89 కట్స్ చేయాలంది. పంజాబ్ రాష్ట్రం పేరు, రాజకీయాలు, ఎన్నికల ప్రస్తావన ఎక్కడ వచ్చినా తొలగించాలంది. ‘వాస్తవికతను చూపించడం’ సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహలానీకి నచ్చినట్లు లేదు. దాంతో, అసలు ఈ సినిమా కథ అంతా ఏ రాష్ట్రంలోనూ జరిగినట్లు కాకుండా, ఎక్కడో కల్పిత ప్రాంతంలో జరిగినట్లు చూపమని బోర్డ్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే, బోర్డ్ వర్గాలు ఆ వార్తల్ని ఖండిస్తున్నాయి. రాజకీయాలతో సంబంధం లేదంటూ, ‘‘మేము కేవలం సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపాం. కావాలంటే, నిర్మాతలు ‘ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్’ (ఎఫ్.సి.ఎ.టి)ని ఆశ్రయించవచ్చు’’ అంటున్నాయి. సినీ వివాదాలు... నిషేధాలు... మూకీల కాలం నుంచి మన భారతీయ సినిమాకు సెన్సార్ కష్టాలు కొత్తేమీ కాదు. మతం, రాజకీయాలు, సెక్స్ లాంటి అంశాల కారణంగా సినిమాల్లో భావప్రకటన స్వేచ్ఛకు చాలా సార్లు సంకెళ్ళు పడ్డాయి. తెలుగునాట పెద్ద ఎన్టీఆర్ ‘బొబ్బిలి పులి’, ‘శ్రీమద్వి రాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’, కృష్ణ ‘అంతం కాదిది ఆరంభం’ సహా పలు చిత్రాలు సెన్సార్ చిక్కులు ఎదుర్కొన్నాయి. విప్లవ చిత్రాల మాదాల రంగారావు ‘విప్లవ శంఖం’, ‘ప్రజాశక్తి’, ‘ఎర్రమట్టి’ లాంటి చిత్రాల రిలీజ్ కోసం సెన్సార్‌బోర్డ్‌తో, ప్రభుత్వంతో పోరాటాలు, నిరాహార దీక్షలు చేయాల్సొచ్చింది. గత 4 దశాబ్దాల్లో వచ్చిన వివాదాల్లో కొన్ని... 1972 ‘సిద్ధార్థ’: పంపిణీ నుంచి నిషేధించిన తొలి చిత్రం. నటి సిమీ గరేవాల్ నగ్న సన్నివేశం కారణం. చివరకు 1996లో టీవీలో రిలీజ్ చేశారు. 1975 ‘ఆంధీ’: ఇందిరా గాంధీతో పోలికలున్నాయంటూ ‘ఎమర్జెన్సీ’ సమయంలో నిషేధించారు. తర్వాత గద్దె నెక్కిన జనతాపార్టీ ప్రభుత్వం రిలీజ్‌కు అనుమతించింది. 1978 ‘కిస్సా కుర్సీ కా’: ‘ఎమర్జెన్సీ’లో సంజయ్ గాంధీ అనుసరించిన విధానాలపై రాజకీయ వ్యంగ్య చిత్రం. సినిమా మాస్టర్ ప్రింట్‌నూ, కాపీలనూ సెన్సార్ బోర్డు నుంచి తీసుకెళ్ళి, కాల్చేశారు. తర్వాత కొంతకాలానికి సినిమా రిలీజైంది. 1994 ‘బ్యాండిట్ క్వీన్’: ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా లేదంటూ మాజీ బందిపోటు రాణి ఫూలన్‌దేవి వాదన. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక నిషేధం. 1996 ‘ఫైర్’: హిందూ కుటుంబంలోని ఆడవారి మధ్య స్వలింగ సంపర్కం గురించి చూపారు. దర్శకురాలు దీపా మెహతాను చంపుతామంటూ బెదిరింపులొచ్చాయి. దాంతో, సెన్సార్ బోర్డ్ తలొగ్గింది. తర్వాత కట్స్ ఏమీ లేకుండానే రిలీజ్. 1996 ‘కామసూత్ర... ఎ టేల్ ఆఫ్ లవ్’: మీరా నాయర్ తీసిన సినిమా. దృశ్యాలు మరీ ‘బాహాటంగా’ ఉన్నా యని వాదన. అన్నీ బాగా తగ్గించేసిన వెర్షన్ రిలీజ్. 2003 ‘పాంచ్’ : 1976 -77 ప్రాంతంలో జరిగిన జోషీ - అభ్యంకర్ వరుస హత్యలపై అనురాగ్ కశ్యప్ తీసిన సినిమా. సెన్సార్‌బోర్డ్ చాలా కట్స్‌తో అనుమతించింది. 2004 ‘బ్లాక్ ఫ్రైడే’: 1993 నాటి బొంబాయి పేలుళ్ళపై తీసిన సినిమా. ప్రభావం చూపుతుందంటూ, తీర్పు వచ్చేదాకా రిలీజ్ ఆపేశారు. ఆనక 2007లో రిలీజ్. 2005 ‘పర్జానియా’: గుజరాత్ అల్లర్లపై సినిమా. నేషనల్అవార్డ్ వచ్చింది. గుజరాత్లో నిషేధించారు. 2005 ‘వాటర్’: వారణాసిలోని వితంతువుల అవస్థపై దీపా మెహతా తీసిన సినిమా. ఛాందసవాదుల విధ్వంసంతో శ్రీలంకలో సిన్మా తీశారు. 2007లో ఇండియాలో రీరిలీజ్. 2013 ‘మద్రాస్ కేఫ్’: రాజీవ్ గాంధీ హత్య, శ్రీలంక అంతర్యుద్ధంలో భారత జోక్యం చుట్టూ తిరిగే సినిమా. తమిళనాట ప్రదర్శించనివ్వలేదు. 2015 ‘ఎం.ఎస్.జి - ది మెసెంజర్ ఆఫ్ గాడ్’: పంజాబ్‌లోని ‘దేరా సచ్చా సౌదా’ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను దేవుడిగా అభివర్ణిస్తూ, ప్రచారం చేసిన సినిమా. పలు సిక్కు వర్గాలు సినిమాను నిషేధించాలని ఆందోళన చేశాయి. 2015 జనవరిలో సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. తరువాత కొంతకాలానికి కట్స్‌తో ఇచ్చింది. ‘‘ఈ ‘ఉడ్తా పంజాబ్’ సినిమాను నిషేధించే బదులు పంజాబ్ ప్రభుత్వం ‘ఉడ్తా’ (ఎగసిపడుతున్న) డ్రగ్స్‌ను నిషేధించాలి. అది చేతకాకపోతే, వాళ్ళు తమను తాము నిషేధించుకోవాలి!’’ - రామ్‌గోపాల్ వర్మ, ప్రముఖ సినీ దర్శక - నిర్మాత ‘‘ఈ దేశంలో అత్యంత విలువైన ఆస్తి అయిన భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నులిమేస్తూ, దేశ పురోగతి గురించి ఎంత డబ్బా కొట్టుకొన్నా అది అర్థం లేని పని.’’- మహేశ్‌భట్, ప్రముఖ సినీ దర్శక - నిర్మాత ‘‘నా ఈ పోరాటానికి దూరంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్, ఆప్, ఇతర రాజకీయ పార్టీలను అభ్యర్థిస్తున్నా. ఇది కేవలం నా హక్కులకూ, సెన్సార్‌షిప్‌కూ మధ్య జరుగుతున్న పోరాటం. ... మిగిలినవాళ్ళు వారు పోరాటాలు వారు చేసుకోండి. నా పోరాటానికి ఎలాంటి రాజకీయ రంగులూ పులమద్దు.’’ - అనురాగ్ కశ్యప్, ‘ఉడ్తా పంజాబ్’ సహ-నిర్మాత, ప్రముఖ దర్శక - రచయిత ‘‘సెన్సార్ బోర్డ్ పనిలో కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ జోక్యం చేసుకోదు. నా మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడీ లేదు. సినిమా పూర్తిగా చూస్తే కానీ, మేము ‘పంజాబ్’ అనే పదం ఎందుకు తొలగించ మన్నామో మీకు అర్థం కాదు. ...అనురాగ్ కశ్యప్‌కు భావప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి, ఆయన ‘ఉత్తర కొరియా’ అనీ, మరొకటనీ ఏమైనా అనగలుగుతున్నారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) నుంచి ఆయన డబ్బులు తీసుకున్నట్లు నేను విన్నాను. కేవలం పబ్లిసిటీ కోసమే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు.’’ - పహ్లాజ్ నిహలానీ, కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్ - ప్రముఖ నిర్మాత -
'నిర్మాతలు లంచాలతో ప్రలోభపెట్టారు'
సిగ్గులేని వారు అలాంటి పనులు చేస్తారు సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహలానీ న్యూఢిల్లీ: భారత చలన చిత్ర సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నిర్మాతలు తమ మూవీలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని కోరుతూ వారు తనకు అనేక పర్యాయాలు లంచం ఇవ్వజూపారని సెన్సార్ చీఫ్ వెల్లడించారు. సిగ్గులేని వారు మాత్రమే ఇలాంటి నీచమైన పనులకు ఒడిగడతారని, పనిని ప్రేమించేవారు ఈ చర్యలకు పాల్పడరని వ్యాఖ్యానించారు. ఆయన క్రూరుడని, నిరంకుశ పాలన చేస్తారని ఇదే బోర్డులోని ఓ సభ్యుడు చంద్రప్రకాశ్ ద్వివేది కూడా బోర్డులోని పాలన యంత్రాంగం సరిగా లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి అక్కడ వ్యవహారాలు అంత సజావుగా ఉండవన్న విషయాన్ని బయటపెట్టాడు. సెన్సార్ బోర్డు ఎవరి నుంచీ బహుమతులు గానీ, డబ్బులు గానీ ఆశించదని పేర్కొన్నారు. మా బోర్డు సభ్యులు కూడా దీపావళి గిఫ్ట్స్ వస్తే వాటిని తిరస్కరించారని, అందుకు వారని అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు. సెన్సార్ బోర్డు అనేది జీరో కరప్షన్ బోర్డు అని, ఓ మేగజైన్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సినిమాల్లోని కొన్ని సీన్లకు కత్తెర వేయకుండా చూడాలని తనకు విజ్ఞప్తి చేసేశారని, అందుకు ప్రతిఫలంగా తనకు కొంత మేరకు డబ్బు ముట్టజెప్పాలని చూసేశారని ఆరోపించడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇలాంటి చర్యలకు తాను పూర్తిగా వ్యతిరేకమన్నారు. అయితే లంచం ఇవ్వడానికి ఆఫర్ చేసిన వారి పేర్లను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. -
ప్రభుత్వాల చెప్పు చేతల్లో సెన్సార్‌బోర్డు
ప్రభుత్వాల చెప్పు చేతల్లోనే సెన్సార్‌బోర్డు పని చేస్తోందని ప్రముఖ దర్శకుడు మణిరత్నం సంచలన వ్యాఖ్యలు చేశారు.సాధారణంగా వివాదాల కు దూరంగా ఉండే మణిరత్నం కేంద్ర సెన్సార్‌బోర్డు ప్రభుత్వ పార్టీల అధికారానికి అనుగుణంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కడం విశేషం. బెంగళూర్ లో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొన్న మణిరత్నం అక్కడి ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను 1983లో తాను కన్నడ చిత్రం పల్లవి.. అనుపల్లవి ద్వారా దర్శకుడినయ్యానని గుర్తు చేశారు. ఆ చిత్రానికి ప్రభుత్వం ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును అందించిందన్నారు. భారతీయ సినీ ప్రేక్షకుల అభిరుచిని తక్కువ అంచనా వేయరాదన్నారు. రేపటి సినిమాను కళ్లముందు ఉంచుతున్నారని పేర్కొన్నారు. ఇకపోతే సినీ సెన్సార్ బోర్డు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. ఒక్కోసారి అధికారాన్ని చేపట్టే పార్టీ అధికారం ఇష్టానుసారంగా కేంద్రప్రభుత్వ సెన్సార్‌బోర్డు వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు చేశారు. తాను దర్శకత్వం వహించిన బొంబాయి, ఇరువర్ చిత్రాలకు పలు చాలెంజ్‌లను ఎరుర్కొనే విడుదల చేయాల్సివచ్చిందన్నారు. ఇప్పుడు కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్‌గా శ్యామ్ బెనగల్ ఎంపిక కావడం సంతోషకరమైన విషయం అన్నారు. ఆయన నేతృత్వంలో సెన్సార్‌బోర్డు పునరుత్తోజం పొందుతుంతని భావిస్తున్నాను. తాను శ్యామ్ బెనగల్, కే.బాలచందర్ చిత్రా లు చూసే యదార్థ కథాచిత్రాలను సృజనాత్మకంగా తెరపై ఆవిష్కరించగలిగాను. 30 ఏళ్ల తరువాత కూడా తన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయంటే అవి సహజత్వంతో కూడి ఉండటమే కావచ్చు అని అన్నారు. -
ఈ సినిమాకు 150 సెన్సార్ కట్లు!
ముంబై: బాలీవుడ్ చిత్రం క్యా కూల్ హై హమ్ 3 (కేకేహెచ్హెచ్ 3) దర్శక, నిర్మాతలకు సెన్సార్ బోర్డు చుక్కలు చూపిస్తోంది. ఉమేష్ గాడ్గె దర్శకత్వంలో ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించిన ఈ సెక్స్-కామెడీ సినిమాకు ఏకంగా దాదాపు 150 కట్లు వేయాలని సెన్సార్ బోర్డు సూచించినట్టు సమాచారం. కేకేహెచ్హెచ్ 3 దర్శక, నిర్మాతలు ఈ ఊహించని పరిణామానికి కంగుతిన్నారు. సెన్సార్ బోర్డు ఆదేశాల ప్రకారం కేకేహెచ్హెచ్ 3కు 150 కట్లు వేస్తే.. ఈ సినిమా కాస్తా షార్ట్ ఫిలింలా అయిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. ఇక ఈ సినిమాకు ఎడల్ట్ సర్టిఫికెట్ రావడం ఖాయమేనట. కేకేహెచ్హెచ్ 3 ప్రోమోలు, ట్రైలర్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, బూతు జోక్‌లు ఉన్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో తుషార్ కపూర్, అఫ్తాబ్ శివ్‌దాసాని, మందన కరిమి ప్రధాన పాత్రలు పోషించారు. -
సెన్సార్ బోర్డు సంస్కరణకు శ్యామ్ బెనగళ్ కమిటీ
- సీబీఎఫ్సీ నిబంధనల మార్పు, మెరుగైన సూచనల కోసం కమిటీ ఏర్పాటుచేసిన కేంద్రం న్యూఢిల్లీ: కనీసం సినిమా రూపకర్తల వివరణ కోరకుండా ఏకపక్షంగా కట్ చెప్పడాలు, సినిమాలకు సర్టిఫికేషన్ల జారీలో భారీ అవకతవకలు, సభ్యుల మధ్య ఏకాభిప్రాయలేమి తదితర వివాదాలతో గందరగోళంగామారి ఇటు సినీరంగం అటు ప్రభుత్వానికి తలనొప్పిగామారిన నెన్సార్ బోర్డు ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టేందుకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సమాయత్తమయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్ సీ) లేదా సెన్సార్ బోర్డు ప్రక్షాళనకు ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగళ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. సృజనాత్మక రంగంగా భావించే సినీరంగంలో సినీమా రూపకర్తలు, సెన్సార్ బోర్డుకు మధ్య సుహ్రుద్భావ వాతావరణం నెలకొల్పాటంటే ఏం చెయ్యాలి? ఫిలిం సర్టిఫికేషన్ జారీలో ఇప్పుడున్నవాటికంటే ఎలాంటి మెరుగైన విధానాలు రూపొందించాలి? తదితర కీలక అంశాలపై బెనగళ్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. ఇందుకోసం వివిధ దేశాల్లో అమలవుతున్న ఫిలం సర్టిఫికేషన్ల విధానాన్ని కూడా పరిశీలించనుంది. ఈ కమిటీలో సభ్యులుగా రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా, పియూష్ పాండే, భావన సోమయ్య, నైనా లాథ్ గుప్తాలు నియమితులయ్యారు. జనవరి 2 నుంచి రెండు నెలల లోగా కమిటీ తన పనిని పూర్తిచేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై శ్యామ్ బెనగళ్ స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం మేరకు కేంద్రం.. నెన్సార్ బోర్డు నిబంధనలను పునారచన చేయాలనుకుంటున్నదని, తమకు అప్పగించిన బాధ్యతను సకాలంలో నిర్వర్తిస్తామని చెప్పారు. బోర్డులో వివాదాలు ముదరటంతో 2014లో నాటి సెన్సార్ బోర్డు చీఫ్ లీలా శ్యాంసన్ సహా 13 మంది సభ్యుల రాజీనామాలు చేశారు. గత ఏడాది ప్రారంభంలో పహలాజ్ నిహలానీ సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. అప్పటి నుంచి బోర్డు తీరు మరింత వివాదాస్పదంగా మారింది. పలువురు సినీ రూపకర్తలు బాహాటంగా సెన్సార్ బోర్డుపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సీబీఎఫ్ సీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. -
'భగవాన్' స్థానంలో 'ఊపర్‌వాలా'..!
ఈ మధ్యకాలంలో పహ్లాజ్ నిహలానీ నేతృత్వంలోని సెన్సార్ బృందం కత్తెర బారిన పడని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. చిన్నచిన్న విషయాలకే చాలా సినిమాలకు కత్తెర వేసినట్టు సెన్సార్ బోర్డు విమర్శలు ఎదుర్కొంటున్నది. తాజాగా 'హేట్‌స్టోరీ-3' సినిమా కూడా సెన్సార్ బోర్డు కత్తెర బారి నుంచి తప్పించుకోలేకపోయింది. ఎరోటిక థ్రిల్లర్ అయిన ఈ సినిమా సహజంగానే 'ఏ' సర్టిఫికెట్ (పెద్దలకు మాత్రమే) కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో సినిమాకు కత్తెర పడబోదని చిత్రబృందం భావించింది. అయితే నిహలానీ నేత్వత్వంలోని కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) మాత్రం ఈ సినిమాను కూడా విడిచిపెట్టలేదని తెలుస్తున్నది. విశాల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన 'హేట్‌స్టోరీ-3'లో శర్మాన్ జోషీ, కరణ్‌సింగ్ గ్రోవర్, జరీనా ఖాన్, డైసీ షా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలోని పలుచోట్ల డైలాగ్‌లకు సెన్సార్‌బోర్డు మార్పులు సూచించినట్టు తెలిసింది. చిత్రంలోని ఓ సన్నివేశంలో శర్మాన్ జోషీ 'ఓ భగవాన్ కో మై జీత్నే నహీ దూంగా' అని అంటాడు. ఈ డైలాగ్‌లో 'భగవాన్' అన్న స్థానంలో 'ఊపర్‌వాలా' అనే పదాన్ని సెన్సార్‌బోర్డు సూచించింది. 'భగవాన్' పదంతో ఓ వర్గం ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతినే అవకాశముందనే కారణంతో ఈ మేరకు మార్పులు చేయించింది. అదేవిధంగా టీజర్లో వినిపించే 'సంభోగ్' పదాన్ని తీయించి.. దాని స్థానంలో 'మిలన్' పదాన్ని చేర్చారు. ఇంకొన్ని డైలాగ్‌లు కూడా అభ్యంతరంగా ఉన్నాయంటూ మార్పులు సూచించారు. జేమ్స్‌బాండ్ సినిమా 'స్పెక్టర్'లో ముద్దు సీన్ నిడివిని సెన్సార్‌బోర్డు సగానికి తగ్గించడంపై వివాదం చెలరేగింది. అయినప్పటికీ 'హేట్‌స్టోరీ-3' సినిమాను శుద్ధిచేయడంలో సెన్సార్‌బోర్డు వెనుకంజ వేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. -
సెన్సార్‌ను రద్దు చేయాలి
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా ఇంటర్నెట్లో తక్షణం అందుబాటులో ఉంటోందని, ఇలాంటి కాలంలో సెన్సార్ బోర్డు అవసరం లేదని సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అభిప్రాయపడ్డారు. సెన్సార్ వ్యవస్థను రద్దు చేయడం మంచిదని భావిస్తున్నానన్నారు. పోర్న్ సైట్లు చూడాలనుకున్నా.. సెల్ఫోన్లలో అందుబాటులో ఉంటున్నాయని, మనం డిజిటల్ ప్రపంచంలో బతుకుతున్నామని, నలుగురైదుగురు కూర్చుని దేశం మొత్తం ఏం చూడాలి.. ఏం చూడకూడదు అనేదానిపై నిర్ణయం తీసుకోవడమనేది అసంబద్ధంగా ఉందన్నారు. జేమ్స్‌బాండ్ సిరీస్ తాజా చిత్రం స్పెక్టర్‌లో ఓ ముద్దు సన్నివేశాన్ని కుదించడంపై సెన్సార్ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న టైమ్స్ లిట్ ఫెస్టివల్ సందర్భంగా వర్మపై వ్యాఖ్యలు చేశారు. అయితే సెన్సార్ బోర్డు చీఫ్ నిహ్లానీ తన పని తాను చేశారని, నిబంధనల మేరకే నడుచుకున్నారని చెప్పారు. -
సెన్సార్‌బోర్డు అవసరమా?
ముంబై: జేమ్స్ బాండ్ సినిమా ‘స్పెక్టర్’లో ముద్దుదృశ్యం తొలగింపు వివాదం లో సెన్సార్ బోర్డు చీఫ్ పహలాజ్ నిహలానీపై బాలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 30 సెకన్ల సీన్‌ను 8 సెకన్లకు మార్చినంత మాత్రాన భారతదేశ నీతికి, సంస్కృతికి జరిగిన లాభమేంటో తెలపాలని బజరంగీ భాయ్‌జాన్ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ ప్రశ్నించారు. అసలు సెన్సార్‌షిప్‌నే తొలగించాలని దర్శకుడు శ్యామ్ బెనగల్ డిమాండ్ చేశారు. తనపై వస్తున్న విమర్శలపై నిహలానీ స్పందిస్తూ.. నిబంధనల మేరకే అన్నీ చేస్తున్నామని.. ఎవరైనా అది తప్పని భావిస్తే.. పదవినుంచి తప్పుకునేందుకు సిద్ధమన్నారు. -
ఘాటైన ముద్దు సన్నివేశాలకు కోత!
భారత్‌కు వచ్చేసరికి జేమ్స్‌బాండ్ కాస్త బుద్ధిమంతుడిగా కనిపించనున్నాడు. తన బ్రాండ్ అయిన ముద్దు సన్నివేశాల ఘాటును తగ్గించుకొని భారత్‌లో విడుదల అవుతున్నాడు. జేమ్స్‌బాండ్ తాజా చిత్రం 'స్పెక్టర్' శుక్రవారం భారత ప్రేక్షకులను పలుకరించనుంది. దేశంలో విడుదలకు అనుగుణంగా 'స్పెక్టర్'కు కేంద్ర సెన్సార్ బోర్డు కొన్ని కత్తెరలు వేసింది. ముఖ్యంగా రెండు ముద్దు సన్నివేశాల నిడివిని గణనీయంగా తగ్గించింది. అదేవిధంగా రెండుచోట్ల డైలాగ్‌లను మ్యూట్ చేసి.. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. సహజంగానే బాండ్ సినిమాలు అంటే ఘాటైన ముద్దు సన్నివేశాలు, బాండ్ గర్ల్స్‌తో సాగించే ప్రణయ సల్లాపాలు ఉంటాయి. అయితే, తాజా సినిమాలో హీరోయిన్లతో బాండ్ స్టార్ డానియెల్ క్రెయిగ్ సాగించే ముద్దు సన్నివేశాల నిడివిని దాదాపు 50శాతం వరకు తగ్గించి భారత్‌లో విడుదల చేస్తున్నట్టు తెలుస్తున్నది. తెరపై బాండ్ ముద్దులు పెట్టుకోవడంలో సెన్సార్ బోర్డుకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే, ఆ సన్నివేశాలు మరీ పొడవుగా ఉన్నాయని మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేసిందని సెన్సార్ వర్గాలు తెలిపాయి. బాండ్ సినిమాకు కత్తెరల విషయంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహాలనీ తెలిపారు. మొత్తానికి బాండ్ సినిమాకు కత్తెరలు వేసి భారత్‌లో విడుదల చేయడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ బోర్డు కత్తెరలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాండ్ తాజా సినిమా 'స్పెక్టర్' భారీ కలెక్షన్లతో అదరగొట్టింది.