
కాలా చిత్రంలోని స్టిల్
రజనీకాంత్ ఈ పేరే ఒక సంచలనం. నడిచినా, నవ్వినా, అది ఒక ట్రెండే. రజనీ చిత్రం వస్తుంది అంటే ఆ రోజును సెలవు దినంగా ప్రకటించాల్సిందే. కబాలి విడుదల సందర్భంగా చాలా ప్రైవేట్ సంస్థలు సెలవు దినంగా ప్రకటించాయి కూడా. కానీ కబాలి ఆశించినంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయినా ఆ సినిమా డైరెక్టర్ పనితనం నచ్చి అదే డైరెక్టర్‌కు మళ్లీ అవకాశం ఇచ్చాడు రజనీ. ప్రస్తుతం కాలా చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.
అయితే తమిళనాడులో జరుగుతున్న సినీ పరిశ్రమ నిరవధిక సమ్మెల కారణంగా ఈ చిత్రం విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది. కాలా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయనీ, సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వచ్చిందని వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సెన్సార్ సభ్యులు దాదాపు 10 మార్పులు సూచించారని కొన్ని సన్నివేశాలను తీసేశారని సమాచారం. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
Comments
Please login to add a commentAdd a comment