టైటిల్ : కాలా
జానర్ : యాక్షన్ డ్రామా
తారాగణం : రజనీకాంత్, నానా పటేకర్, హూమా ఖురేషి, ఈశ్వరీ రావు
సంగీతం : సంతోష్ నారాయణన్
దర్శకత్వం : పా.రంజిత్
నిర్మాత : ధనుష్
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ క్రేజ్ ఉంటుంది. అయితే రోబో తరువాత రజనీ హీరోగా తెరకెక్కిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి సినిమాకు భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో కలెక్షన్లు వచ్చినా సినిమాకు మాత్రం పాజిటివ్ టాక్ రాలేదు. అయినా రజనీ మాత్రం మరోసారి పా.రంజిత్ కే అవకాశం ఇచ్చారు. ముంబై మురికి వాడల నేపథ్యంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా కాలా. రజనీ ఏజ్‌కు ఇమేజ్ తగ్గ కథతో తెరకెక్కిన కాలా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? రజనీ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా..? కబాలితో నిరాశపరిచిన పా.రంజిత్.. కాలాతో మెప్పించాడా..?
కథ ;
కరికాలా అలియాస్ కాలా (రజనీకాంత్) ముంబైలోని మురికివాడ ధారావీకి పెద్ద దిక్కు. అక్కడే పుట్టి పెరిగిన కాలా ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటుంటాడు. అయితే ముంబైలో అత్యంత విలువైన ఈ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకునేందుకు రాజకీయనాయకులు ప్రయత్నాలు చేస్తుంటారు. (సాక్షి రివ్యూస్) ముఖ‍్యంగా అధికార పార్టీ నాయకుడు హరిదేవ్ అభయంకర్ అలియాస్ హరిదాదా (నానా పటేకర్) ఎలాగైన ధారావీని నుంచి ప్రజలను వెల్లగొట్టి అక్కడ అపార్ట్‌మెంట్లు నిర్మించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ కాలా హరిదాదా పనులకు అడ్డుతగులుతాడు. అలా హరిదాదా, కాలాల మధ్య మొదలైన యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది..? ఈ పోరాటంలో కాలా ఏం కోల్పోయాడు..? చివరకు ధారావీ ఏమైంది..? అన్నదే మిగతా కథ.
నటీనటులు ;
రజనీకాంత్ తనదైన స్టైల్స్, మేనరిజమ్స్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. నటన పరంగా సూపర్బ్ అనిపించిన రజనీ యాక్షన్ సీన్స్ లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. విలన్ గా నానా పటేకర్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా.. ఉన్నంతలో సూపర్బ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. రజనీ ఇమేజ్‌ను ఢీ కొట్టే పొలిటీషియన్ పాత్రలో నానా పటేకర్ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. రజనీ భార్యగా ఈశ్వరీ రావు నవ్వించే ప్రయత్నం చేసింది. (సాక్షి రివ్యూస్)రజనీ, ఈశ్వరీ రావ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. కీలక పాత్రలో నటించిన హూమా ఖురేషీ హుందాగా కనిపించింది. ఇతర పాత్రల్లో అంతా తమిళ నటులే కావటంతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ కావటం కాస్త కష్టమే.
విశ్లేషణ ;
కబాలి సినిమా తరువాత రజనీ ఇచ్చిన సెకండ్ చాన్స్‌ను దర్శకుడు పా.రంజిత్ వినియోగించుకోలేకపోయాడు. రజనీ నుంచే అభిమానులు ఆశించే మాస్, కమర్షియల్ అంశాలేవీ లేకుండా సినిమాను రూపొందించిన రంజిత్ పూర్తిగా నిరాశపరిచాడు. రజనీ ఎంట్రీ విషయంలో కూడా పెద్దగా హడావిడి లేకుండా సాదాసీదాగా కాలా పాత్రను పరిచయం చేశాడు. తొలి భాగం అంతా అసలు కథ ప్రారంభించకుండా ఫ్యామిలీ సీన్స్‌తో లాగించేశాడు. కథలో రజనీ హీరోయిజాన్ని మరింతగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా దర్శకుడు ఆ దిశగా ప్రయత్నం చేసినట్టుగా కనిపించలేదు. (సాక్షి రివ్యూస్)ఇంటర్వెల్ సీన్‌తో హైప్‌క్రియేట్ చేసినా ద్వితీయార్థంలో అదే టెంపో కంటిన్యూ చేయలేకపోయాడు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ కూడా అక్కడక్కడా మెప్పించినా.. చాలా సందర్భాల్లో విసిగించాడు. మూడ్‌తో సంబంధం లేకుండా రాప్ బీట్‌లతో ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టాడు. మురళీ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ధారావి మురికి వాడలను నేచురల్ గా చూపించాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
రజనీకాంత్
ఇంటర్వెల్ సీన్
మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్
ఎడిటింగ్
సంగీతం
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment