
కాలా ట్రైలర్‌లోని ఓ దృశ్యం
సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమా ట్రైలర్ వచ్చేసింది. వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నటుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కబాలి డైరెక్టర్ పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ముంబై నేపథ్యంలో మరోసారి డాన్‌గా తలైవా అలరించబోతున్నాడు.
ట్రైలర్ విషయానికొస్తే... బస్తీ, దానిని రక్షించే దాదా కాలాగా రజనీ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నెగటివ్ రోల్‌లో బాలీవుడ్ నటుడు నానాపటేకర్ నటించారు. ఎవరైనా నన్ను ఎదిరించాలనుకుంటే మరణమే... అంటే పటేకర్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ‘ఒక్కచోటూ వదల్లేదు. తన వెనుక పిచ్చోడిలా తిరిగా.. నేనంటే అంత ఇష్టమా?. చెప్పలేనంత... ఐ లవ్ యూ’... అంటూ ముదురు రొమాంటిక్ యాంగిల్‌ను చూపించారు. రజనీకి జోడీగా ఈశ్వరి, హూమా ఖురేషీలు నటించారు. ‘ఈ తనవే మనకున్న ఏకైక ఆయుధం. ఇది ఈ లోకానికి చాటుదాం.. కదలండి ఉద్యమిద్దాం.’ ‘నేల నీకు అధికారం.. నేల మాకు జీవితం’ అంటూ రజనీ డైలాగులు ఓకే అనిపించాయి. సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే సూపర్ స్టార్ గత చిత్రాల స్థాయిలో హడావుడి కనిపించకపోవటం గమనించదగ్గ విషయం. జూన్ 7న కాలా అన్ని భాషల్లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment