![Kaala Becomes First Indian Film To Be Released In Saudi Arabia - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/8/Kaala.jpg.webp?itok=8z71lAb3)
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కాలా. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. రజనీ కెరీర్‌లోనే అత్యల్ప వసూళ్లు నమోదు చేసిన చిత్రంగా కాలా రికార్డ్ సృష్టించింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. కింగ్‌డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో రిలీజ్ అయిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది కాలా.
దాదాపు 35 ఏళ్ల తరువాత కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా సినిమాల ప్రదర్శనపై నిషేదాన్ని ఎత్తివేసింది. సౌదీ అరేబియాలో భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తుండటంతో కాలాకు కలెక్షన్లు బాగానే ఉంటాయని భావిస్తున్నారు చిత్రయూనిట్. కబాలి ఫేం పా.రంజిత్ దర్శకత‍్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానా పటేకర్, ఈశ్వరీరావు, హూమా ఖురేసీ, సముద్రఖనిలు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment