
సాక్షి, న్యూఢిల్లీ : పా రంజింత్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా మూవీ మిశ్రమ స్పందనతో విడుదలైనా వసూళ్లలో కొన్ని ప్రాంతాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఈ మూవీ రికార్డులు నెలకొల్పేలా ఉంది. సౌదీ అరేబియాలో విడుదల కానున్న తొలి సినిమాగా కాలా నమోదవనుంది. సౌదీలో విడుదలైన తొలి భారతీయ మూవీ బ్లాక్ పాంథర్ అయినా 35 ఏళ్లుగా సౌదీ అరేబియాలో సినిమాలపై నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా నిషేధం ఎత్తివేయడంతో సౌదీలో విడుదల కానున్న తొలి భారతీయ సినిమా కాలా కావడం గమనార్హం. ముంబయిలోని మురికివాడ ధారవిని ఆక్రమించాలన్న గ్యాంగ్‌స్టర్‌తో పోరాడి ప్రజల హక్కులను హీరో కాపాడే కథాంశమే కాలా. ఈ మూవీలో ఈశ్వరిరావు, హ్యూమా ఖురేషీ, నానా పటేకర్‌లు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment