రజనీకాంత్‌ ‘కాలా’లో ‘కుల’కలం | Rajinikanth Plays Dalit Character In Kaala Movie | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ ‘కాలా’లో ‘కుల’కలం

Published Wed, Jun 13 2018 12:37 AM | Last Updated on Wed, Jun 13 2018 7:55 AM

Rajinikanth Plays Dalit Character In Kaala Movie - Sakshi

వెనుకబడిన కులాలైన వన్నియార్లు, తేవర్లు, గౌండర్లు తమిళనాడులో కొత్త అగ్రకులాలుగా అవతరించారు. తమ కూతుళ్లు, కొడుకులు దళితులను పెళ్లాడితే వారు నిప్పులు చెరుగుతారు. ఇలాంటి పెళ్లిళ్ల విషయంలో దళితుడిని చంపి జైలుకెళ్లడం ఈ కులాలవారికి గొప్ప గౌరవంగా కనిపిస్తోంది. మరి సమాజంలో ఇలాంటి సెంటిమెంటును కాలా సినిమా మార్చగలుగుతుందా? ఇప్పుడు రజనీకాంత్‌ ఈ చిత్రంలో వేసిన దళితుడి పాత్ర కారణంగా తమిళ సమాజంలో పరివర్తన వస్తుందా? జవాబు చెప్పడం చాలా కష్టం. కానీ, సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళితుల బాధలు, కష్టాలను విస్మరించలేమనే బలమైన ఆలోచన సినిమా వంటి సృజనాత్మక కళల్లో తప్పక మొదలవుతుంది.

భారత సినిమా చరిత్రలో సాధారణమైనదేగాక చెప్పు కోదగినది కిందటి వారం. జూన్‌ 7న రజనీకాంత్‌ నటించిన కాలా విడుదలైంది. 1980ల నేపథ్యంతో నిర్మించిన ఈ సినిమాలో మురికి వాడలో నివసించే సామాన్యుడు ప్రజానాయకుడవు తాడు. అంతే కాదు, పేదల ఇళ్లను కూల్చడానికి ప్రయత్నించిన బలవంతుడైన  ఓ రాజకీయ నేతను ప్రతిఘటిస్తాడు. ఇది మామూలు విషయం. ఈ కథలో కొత్తేమీ లేదు. అయితే, రజనీకాంత్‌ స్థాయి సూపర్‌స్టార్‌తో దర్శకుడు పా రంజిత్‌ ఓ దళితుడి వేషం వేయించడం, తమిళ వాణిజ్య సినిమాలో దళి తులకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషమే. కుల వివక్షను సినిమాల్లో చూపించడం సామాన్య విషయం కాదు. మరాఠీలో సూపర్‌హిట్‌ అయిన చిత్రం ‘సైరాట్‌’ హిందీ రీమేక్‌ ‘ధడక్‌’ ట్రెయిలర్‌ విడుదలైంది. అగ్ర వర్ణ యువతి ప్రేమలో పడిన ఓ దళిత కుర్రాడి కథే సైరాట్‌. బాలీవుడ్‌ అగ్రశ్రేణి నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్‌ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్‌ ఈ కథను హిందీలో నిర్మించింది. అయితే, కుల ప్రస్తావన లేకుండా, పేద యువకుడు ధనికుడి కూతురును ప్రేమించినట్టుగా ఈ హిందీ సినిమాలో చెప్పారు.

నేటి మల్టీప్లెక్స్‌ హిందీ సినిమాలు చూసే ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగానే నిర్మాతలు కథలు రూపొందించి, సినిమాలు తీస్తారనడానికి ఇదో ఉదా హరణ. దళిత సంస్కృతి, వారి పాటలు, నృత్యాలు, వారి పండుగలు వంటి విషయాలను ప్రధాన స్రవంతి తమిళ సినిమా పట్టించుకోదనేది రంజిత్‌ అభిప్రాయం. అందుకే ఆయన తన చిత్రాల్లో ఈ అంశాలన్నిటినీ చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన దర్శకత్వం వహించిన కబాలి, కాలా ప్రత్యేకత సంతరించుకున్నాయి. కాలా కథ సాధారణమైనదేగాని పెద్దగా పట్టించుకోని కింది కులాల జీవనాన్ని చక్కగా చూపించడం, అందుకు రజనీకాంత్‌ నటన దోహదం చేయడం వల్ల ఇది విశిష్ట చిత్రంగా ఆకట్టుకుంటోంది. భారతీయ సిని మాల్లో దళితులకు ప్రాధాన్యం ఉండదు. సహాయ పాత్రలకే వారు పరిమితమౌతారు. ఆస్కార్‌ అవా ర్డుకు ప్రతి పాదించిన ఆమిర్‌ఖాన్‌ చిత్రం లగాన్‌లో దళితుడైన కచ్రా పాత్రను పరిశీలిస్తే ఈ విషయం అర్థమౌతుంది. ఆమిర్‌ పాత్రను గొప్పగా చూపించ డానికి అంటరాని వాడైన కచ్రాను వాడుకున్నారు. అంతేగాని, స్వాతంత్య్రానికి ముందు దేశంలో దళి తుల స్థితిపై ఎలాంటి వ్యాఖ్య ఇందులో కనిపించదు. 

కాలాలో శక్తిమంతుడైన బ్రాహ్మణుడిపై పోరాటాన్ని అంబేడ్కర్, బుద్ధుడి అభిమాని అయిన రంజిత్‌ 70 ఎంఎంలో గొప్పగా చిత్రించారు. అందుకే కాలాను ఓ మైలురాయి సినిమాగా పిలుస్తాను. హరిదేవ్‌ అభ యంకర్‌ అనే దుష్ట బ్రాహ్మణ పాత్ర పోషించిన నానా పటేకర్‌ రజనీకాంత్‌ పేరు కాలాను ఎగతాళి చేస్తూ, ఇదో పేరేనా అని ప్రశ్నిస్తాడు. కాలా నివసించే ముంబై మురికివాడ ధారావీని ‘అభివృద్ధి’ చేయడా నికి ప్రయత్నించిన సంస్థకు ‘మనూ రియాలిటీ’ అని పేరు పెట్టడంలో పరమార్థం ప్రేక్షకునికి అర్థంకాక పోదు. ఈ మురికివాడలో అపరిశుభ్రతపై పటేకర్‌ వ్యంగ్యాస్త్రాలు విసురుతాడు. తన వాడలోని మురికి పరిస్థితులను చూపి గర్వపడతాడు రజనీ. కింది కులాలంటే జుగుప్స ప్రదర్శించే వారిని ప్రతిబింబిం చేలా నానా పటేకర్‌ పాత్రను రంజిత్‌ రూపొందిం చారు. నేరుగా కులం పేరు ప్రస్తావించకుండా శుభత్ర, పేర్లు, దుస్తుల గురించి మాట్లాడుతూ కింది కులాలపై పైవారి మనస్సుల్లో అసహ్యం ఎంతగా ఉంటుందో కాలా చక్కగా చూపిస్తుంది. 

రంజిత్‌ చిత్రాల్లో కులానిదే కీలక పాత్ర
రంజిత్‌ సినిమాలన్నింటిలోనూ కులానిదే ప్రధాన పాత్ర. కాలాలో కులాన్ని ముఖ్య భూమికలో చూపి స్తారు. క్లైమాక్స్‌లో నీలి రంగు దళితుల విజయానికి, గౌతమ బుద్ధ విహారలో కూడా ఈ రంగు దళితుల తిరుగుబాటుకు చిహ్నాలుగా కనిపిస్తాయి. ముంబైని అతలాకుతలం చేయడానికి ధారావీ సమ్మెకు దిగు తుంది. బలంగా పాతుకుపోయిన పాలకవర్గాలను కూలదోయడానికి బడుగువర్గాలకున్న శక్తికి ఇది తార్కాణంగా నిలబడుతుంది. కాలాలో ‘క్యా రే సెటింగా!’ అనే రజనీకాంత్‌ పంచ్‌ డైలాగ్‌ను ప్రేక్ష కుల ఈలలు, చప్పట్ల కోసం రాసిన మాటలుగా భావించకూడదు. దళితులకు వ్యతిరేకంగా అగ్రకు లాలు చేతులు కలపడాన్ని ఈ డైలాగ్‌ ప్రస్తావిస్తోంది. దళితులపై దాడి జరిగినప్పుడు రజనీకాంత్‌ ఒంటరి కాదు. కుల శత్రువులపై పోరుకు ఆయన వర్గీయులం దరూ ఆయన పక్కనే ఉంటారు. ఈ సినిమాలో మంచిచెడులను సంప్రదాయబద్ధంగాగాక భిన్నంగా చూపిస్తారు. 

విలన్‌ హరిదాదా తెల్ల దుస్తులే వేసు కుంటాడు. అతని ఇంటి హాల్లో రాముడి విగ్రహం ప్రముఖంగా కనిపిస్తుంది. సోఫా సెట్లు కూడా తెల్లని రంగులో కనిపిస్తాయి. అతను రామాయణంపై ఒట్టేసి మరీ మాట్లాడతాడు. అందుకు విరుద్ధంగా కాలా నల్లని బట్టలే ధరిస్తాడు. దుమ్మూధూళి అంటే అతనికి ఇష్టమేగాని చిరాకు లేదు. కాలాను రావణ్‌ అని విలన్‌ హరి పిలుస్తాడు. కాని, పెరియార్‌ ఈవీ రామసామి నాయకర్‌ ప్రకారం రావణుడు నలుపే గాని చెడ్డవాడు కాదు. కాలా తనను యమునిగా పిలుచుకుంటాడు. తనను రామునిగా భావించే హరి దాదాను యముని రూపాన్ని ప్రతిబింబించే కరికా లన్‌ తుదముట్టిస్తాడు. హరిదేవ్‌ తన కత్తి తుప్పు పట్టకుండా ఉండడానికి నూనె రాస్తూ దాన్ని పూజి స్తాడు. ఎప్పుడైనా కత్తిని ఇతరులను చంపడానికి వాడడమే అతని లక్ష్యం. అయితే, అందుకు విరు ద్ధంగా భీమ్‌రావు అంబేడ్కర్‌ పుస్తకాలను కాలా చదు వుతాడు. దళితుల ఇళ్లు కూల్చివేయాలనుకున్న హరి దేవ్‌ వారి విలువైన స్థలాలపై కన్నేసి వారికి మెరుగైన జీవితం కల్పిస్తానని  వాగ్దానం చేస్తాడు. 

మా భూమిపై మాకే హక్కు
కాలాలో దళిత పాత్రలు కష్టాలు, కన్నీళ్లకు ప్రతిబిం బాలు కావు. తమ నేలపై తమదే హక్కని వారు వాదిస్తారు. కాలా వారి జీవితాలు, ఆత్మగౌరవానికి చిహ్నం. ఈ మురికివాడలో వినిపించే సంగీతం భిన్నంగా ఉంటుంది. భీమ్‌ వాడ, మసీదు, నికా, గొడ్డు మాంసం దుకాణం, పెరియార్‌ చౌక్‌–ఇవన్నీ ధారావీ లో కనిపించే దృశ్యాల పేర్లు. లెనిన్, భీమ్‌జీ అనే పేర్లున్న పాత్రలు తమది భిన్న ప్రపంచమనీ, మిగతా భారతావని తమను గుర్తించాలనేలా ధ్వని స్తాయి. నేటి ఆధునిక భారతంలో నిర్మించే సిని మాల్లో చక్కటి అబ్బాయిలు, అందమైన బొమ్మలను తలపించే ఆడపిల్లలే కనిపిస్తారు. వీటిలో ఎన్నికల విశ్లేషణలో ఒక్క కులాన్నే ప్రధానాంశంగా చర్చించ డానికి అవకాశం లేదు. గతంలో ధారావీ మురికివాడ నేపథ్యంతో సినిమాలు వచ్చాయిగాని కులం గురించి ఇంత విస్తృతంగా అర్థమయ్యేలా చిత్రీకరించడం ఇదే మొదటిసారి. తెల్లగా ఉంటారనే కారణంగా ఉత్తరాది కథానాయికలను తమిళ సినిమా సహా దక్షిణాది సిని మారంగం దిగుమతి చేసుకోవడం ఎప్పటినుంచో సాగుతున్న వ్యవహారమే.

కాలాలో ఇందుకు భిన్నంగా–రజనీ భార్యగా నటించిన ఈశ్వరీరావు, సామాజిక కార్యకర్తగా కని పించిన అంజలీ పాటిల్‌ ఇద్దరూ నల్లగానే ఉంటారు. జరీనా అనే  భర్తలేని ముస్లిం తల్లి పాత్ర పోషించిన హుమా ఖురేషీ ఓ ముఖ్య సామాజిక సందేశం ఇచ్చేలా కాలాలో దర్శనమిస్తుంది. కుల వివక్షతో హత్యలు జరుగుతున్న కారణంగా తమిళనాడులో కాలా ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. 2016 మార్చిలో పశ్చిమ తమిళనాడులోని ఉడుముల పేటలో శంకర్‌ అనే దళిత యువకుడిని కత్తులతో పొడిచి చంపడం తీవ్ర సంచలనం సృష్టించింది. అతని భార్య కౌశల్య తండ్రి కిరాయి హంతకులతో శంకర్‌ను హత్య చేయిస్తాడు. శంకర్‌తో పోల్చితే పెద్ద కులానికి చెందిన కౌశల్య తల్లిదండ్రులు తమ మాట వినకుండా కూతురు దళితుడిని పెళ్లాడడం సహించ లేక ఈ దారుణానికి పాల్పడ్డారు. 

ఈ హత్యకేసులో దోషులుగా తేలిన ఆమె తండ్రి, ఆయన అనుచరు లకు 2017 డిసెంబర్‌లో తిరుపూర్‌ కోర్టు శిక్షలు విధిం చింది. 2014–2016 మధ్య కాలంలో తమిళనాట పరువు హత్యల పేరుతో 83 కేసులు నమోద య్యాయి. వెనుకబడిన కులాలైన వన్నియార్లు, తేవర్లు, గౌండర్లు  రాష్ట్రంలో కొత్త అగ్రకులాలుగా అవతరించారు. తమ కూతుళ్లు, కొడుకులు దళితు లను పెళ్లాడితే వారు నిప్పులు చెరుగుతారు. ఇలాంటి కులాంతర వివాహాలను తమ కుటుంబా నికి అవమానంగా వారు భావిస్తారు. ఇలాంటి పెళ్లిళ్ల విషయంలో దళితుడిని చంపి జైలుకెళ్లడం ఈ కులా లవారికి గొప్ప గౌరవంగా కనిపిస్తోంది. మరి సమా జంలో ఇలాంటి సెంటిమెంటును కాలా సినిమా మార్చగలుగుతుందా? ఇప్పుడు రజనీకాంత్‌ ఈ చిత్రంలో వేసిన దళితుడి పాత్ర కారణంగా తమిళ సమాజంలో పరివర్తన వస్తుందా? జవాబు చెప్పడం చాలా కష్టం. కాని, సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళితుల బాధలు, కష్టాలను విస్మరించలేమనే బల మైన ఆలోచన సినిమా వంటి సృజనాత్మక కళల్లో తప్పక మొదలవుతుంది. తమిళ సినీ ప్రేక్షక ప్రపం చంలో పెద్ద సంఖ్యలో ఉన్న సామాజికవర్గాల కథలు సినిమాలకు ఇతివృత్తాలుగా మారడానికి కాలా దోహ దం చేస్తుంది.

దళితుల జీవితాలను సహానుభూతితో అర్థం చేసుకుని వారి బతుకులను కథలు కథలుగా సినిమాల్లో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందే చెప్పినట్టు మరాఠీ సూపర్‌ హిట్‌ సినిమా సైరాట్‌ను హిందీలో ‘ధఢక్‌’ పేరుతో నిర్మించడం ద్వారా దళితుల జీవితాలను విస్తృతంగా సినిమా తెర లకు ఎక్కించే అవకాశం వచ్చింది. అయితే, అగ్రశేణి దర్శకుడు కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ హిందీ సినిమా ట్రెయిలర్‌ చూస్తే అలాంటి ఆశలు అడియా శలేననే భావన కలుగుతుంది. ఈ సినిమా నిర్మాతలు కేవలం శ్రీదేవి కూతురు జాహ్నవీ కపూర్, షాహిద్‌ కపూర్‌ తమ్ముడు ఇషాన్‌ కపూర్‌ల కొత్త ముఖాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కని పిస్తోంది. కుల వివక్ష వంటి బుర్రతో ఆలోచించే కథాంశాలు, భిన్న సామాజిక వాస్తవాలతో కూడిన కథనాలు  ‘ఉన్నత స్థాయి’ హిందీ ప్రేక్ష కుల మెదళ్లకు ఎక్కకపోవడం నిజంగా దురదృష్టం.


టీఎస్‌ సుధీర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు
ఈ–మెయిల్‌ : tssmedia10@gmail.com

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement