Character
-
రోలెక్స్ వచ్చేస్తున్నాడు.
-
కొత్త ఫీచర్!! అచ్చం మనుషులతో మాట్లాడినట్టుగానే..
టెక్నాలజీ విస్తృతమైన నేటి రోజుల్లో ఆప్యాయంగా పలకరించేవారు కరువయ్యారు. అందరూ స్మార్ట్ఫోన్లకు హత్తుకుపోయి అన్నింటినీ వాటిలోనే వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే Character.AI అనే సంస్థ చాట్‌బాట్‌కు కాల్ చేసే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. క్యారెక్టర్స్ అని పిలిచే ఈ ఏఐ చాట్బాట్లను అచ్చం మనుషలతో మాట్లాడినట్టుగానే ఉండేలా ప్రోగ్రామ్ చేయవచ్చు.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఫోన్ కాల్స్ చేసి నిజమైన టెలిఫోనిక్ సంభాషణల అనుభూతిని పొందవచ్చు. ఇంగ్లిష్, స్పానిష్, జపనీస్, చైనీస్ వంటి భాషలను ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుందని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ తెలిపింది. గత నెలలో ఆర్క్ సెర్చ్ కూడా ఇలాంటి ఫీచర్‌నే విడుదల చేసింది.క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ యూజర్లందరికీ ఉచితంగా లభిస్తుందని ఏఐ సంస్థ తన బ్లాగ్ పోస్ట్ లో ప్రకటించింది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో వెబ్‌లో కూడా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు Character.AI పేర్కొంది. గత మార్చిలో కంపెనీ క్యారెక్టర్ వాయిస్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది వన్-వే కమ్యూనికేషన్. అంటే యూజర్లు ఏఐకి మెసేజ్ చేస్తే వాయిస్ రూపంలో స్పందన వస్తుంది. టెక్ట్స్ టు స్పీచ్ (టీటీఎస్) ఏఐ మోడల్ సామర్థ్యాలను ఉపయోగించి దీన్ని రూపొందించారు.ఇప్పుడు క్యారెక్టర్ కాల్స్‌తో యూజర్లు టూ-వే వెర్బల్ కమ్యూనికేషన్ చేయొచ్చు. దీని ద్వారా యూజర్లు ఏఐ క్యారెక్టర్ తో చాటింగ్ చేసే హ్యాండ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. కాల్ స్క్రీన్ ఇంటర్ఫేజ్ కనిపిస్తుంది. స్క్రీన్ లో మ్యూట్ బటన్, ఎండ్ కాల్ ఆప్షన్ ఉంటాయి. వేగవంతమైన ప్రతిస్పందనలను జనరేట్ చేయడానికి క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ తక్కువ లేటెన్సీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు యూజర్లు వివిధ వాయిస్‌లు, పిచ్‌లు, యాసలు ఎంచుకోవచ్చు. -
స్వభావం
‘‘బట్టతలకి స్వభావానికి మందు లేదు.’’ అన్న మాట అందరికీ తెలిసినదే. స్వభావం అంటే ఏమిటి? ‘స్వ’ అంటే తన యొక్క ‘భావం’ అంటే సహజ లక్షణం, లేదా సహజ గుణం. ‘సహ’ అంటే కలిసి ‘జ’ అంటే పుట్టినది. అంటే, ఒక వ్యక్తితో పాటు పుట్టేది అని అర్థం. ఒక గురువుగారు శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో ఒక ఏరు దాటవలసి వచ్చింది. ప్రవాహం మధ్యలో ఒక తేలు నీటిలో కొట్టుకుపోతూ కనిపించింది. ఒక ఆకు మీద దానిని ఎక్కించారు. పట్టుకోగానే అది కుట్టింది. బాధగా వేలిని రుద్దుకున్నారు. కొద్దిసేపటికి అది మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. తిరిగి అదే పని చేశారు. అది కూడా తన పని తాను చేసింది. చేతిని గట్టిగా విదిలించారు. మూడోసారి మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. ఈలోపు గట్టు వచ్చింది. తేలుని పట్టుకుని నేల మీద వదిలారు. మళ్ళీ ముద్దు పెట్టుకుంది. ఒక శిష్యుడికి సందేహం కలిగింది. గురువుగారు మేధావి కదా! ఇంత తెలివితక్కువగా ఎందుకు ప్రవర్తించారు? అని. ‘‘రెండుమార్లు కుట్టినా మూడోమారు కూడా ఎందుకు కాపాడారు?’’ అని అడిగాడు. ‘‘కుట్టటం దాని స్వభావం. దానిని తేలు మార్చుకోలేదు. కాపాడటం అనే నా స్వభావాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి?’’ అని సమాధానం చెప్పారు. స్వభావం అంటే తన యొక్క, ‘భావం’ తత్త్వం. తనతనం. అది పుట్టుకతో వస్తుంది. ‘‘పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే’’ అనే సామెత తెలుసు కదా! అంటే మారదు అని అర్థం. దీనిని వంకగా పెట్టుకుని తమలో ఉన్న చెడు స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయరు చాలా మంది. ఇదే మనిషి పురోభివృద్ధిని నిర్ణయించే ప్రధాన అంశం. సుమారుగా అందరికీ చాలా విషయాలు తెలుసు. ఏది మంచి ఏది చెడు అన్నదీ తెలుసు. తెలిసిన దానిని ఎంత వరకు ఆచరణలో పెట్టారు? అన్న దాని వల్ల పురోభివృద్ధిలో వ్యత్యాసం వస్తుంది. దానికి కారణం స్వభావం. స్వభావం సరిదిద్దుకో వలసినది అయితే చాలా ప్రయత్నం చేయ వలసి ఉంటుంది. ముందుగా మార్చుకోవాలి అనే సంకల్పం ఉండాలి. క్రమంగా, నిలకడగా ప్రయత్నం చేయాలి. మూతిని కట్టేసినా మాట్లాడకుండా ఉండలేని వారి చేత పాఠాలని చదివించిన ఉపాధ్యాయులని చూశాం. పెరిగాక వారిని యాంకర్లుగా చేస్తే సరి. పాఠం చదవటం వల్ల ఉచ్ఛారణ స్పష్టంగా ఉంటుంది. ఆగకుండా మాట్లాడి మంచి పేరు తెచ్చుకుంటారు. స్వభావాన్ని అనుకూలంగా ఉపయోగించుకునే మార్గం ఇది. అదేవిధంగా అబద్ధాలు ఆడే పిల్లవాడు ఉంటే, వాడి చేత కథలు రాయిస్తే వాడి సృజనాత్మకత అంతా అక్కడ చూపించటం జరుగుతుంది. నోరు విప్పని వారు ఉంటారు కొందరు. వారు రహస్యసమాచార శాఖలలో రాణిస్తారు. వ్యక్తి స్వభావాన్ని అనుసరించి తగినమార్గంలో పెడితే ఉన్నతస్థితికి చేరుకుంటారు. ఏదీ పనికి రానిది అని చెప్పటానికి వీలు లేదు. ‘స్వభావో దురతిక్రమః’’ మారదు కనుక మలచుకోవచ్చు. మంచి పనులు చేయటం ద్వారా మంచి స్వభావాన్ని పెంపొందించుకోవచ్చు. కనీసం మంచికి, మందికి ఉపయోగ పడవచ్చు. ఉదాహరణకి దేనిని చూసినా సొంతం చేసుకోవాలనే గుణం ఉంది అనుకుందాం. తప్పు అని తెలిసినా మనసు అదుపులో ఉండదు. అటువంటి వారిలో దొంగతనం అనే రోగం పోగొట్టటం ఎట్లా? వారి చేత ఇతరులకి ఇప్పిస్తూ ఉండాలి. అది తనదే కానక్కర లేదు. తీసుకున్న వారి ముఖంలో కనపడే ఆనందం చూసి ‘సెరిటోనిన్’ అనే హార్మోను విడుదల అయి వారికి ఆనందం కలిగిస్తుంది. అప్పుడు ఇతరుల వస్తువులని తీసుకోవాలనే స్వభావం క్రమక్రమంగా దూరమవుతుంది. కనీసం ఆలోచన ఆచరణ రూపం ధరించదు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
అణకువ
‘‘ఆకులందున అణిగి మణిగి కవిత కోకిల పలుకవలెనోయ్’’ అంటారు గురజాడ. తన ఘనతని తాను ప్రకటించుకోవటం కాక, ప్రతిభని అవతలి వారు గుర్తించాలి. కోకిల కనపడ నవసరం లేదు. దాని గుర్తింపు మధురమైన కంఠస్వరం మాత్రమే. కావాల్సిన వారు దానిని వెతుక్కోవాలి. ఎందుకంటే – రత్నాన్ని అన్వేషించాలే కాని, అది తనని తాను ప్రకటించుకోదు. ‘‘అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.’’ అనే సామెత తెలుసు కదా! నిండు కుండ లాగా తొణకకుండా బెణకకుండా ఉండటం సమృద్ధికి, సంపదకి సంకేతం. అది ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం. ఎగిరెగిరి పడకుండా, తన గొప్పని, లేదా తానే గొప్ప అని ప్రకటించుకుంటూ, ప్రదర్శించుకుంటూ ఉండక పోవటమే అణకువ. ఎందుకంటే ఎవరైనా ఒక రంగంలో గొప్ప అనుకుంటే, అదే రంగంలో అంతకన్న ఘనులు అప్పుడే కాని, తరువాత కాని ఉండచ్చు. కనక అహంకరించకూడదు. తన స్థాయి ఏమిటో తెలుసుకుని ఉండాలి. నీలో గొప్పతనం ఉంటే అది నువ్వు ప్రకటించుకోకూడదు. ఇతరులు గుర్తించాలి. ఎట్లా? ప్రవర్తన ద్వారా, మాట ద్వారా. తన గొప్పతనం తానే చెప్పుకున్న వాడు హాస్యాస్పదుడు అవుతాడు. అంతకన్న ముందు ఆయుః క్షీణం అని పెద్దలు చెప్పిన మాట. పైగా తనని తాను పొగడుకోవటం ఆత్మహత్యా సదృశం. మహాపాతకం. అంటే నివృత్తి లేని పరిహారం, ప్రాయశ్చిత్తం లేని పెద్ద పాపం. నోటితో చెప్పక పోయినా తమ ప్రవర్తన ద్వారా తామే చాలా ఘనులు, ఇతరులు పనికిరానివారు అనే అభిప్రాయం కలిగేట్టు ప్రవర్తిస్తారు కొందరు. అది వారి విద్యావిహీనత ను సూచిస్తుంది. విద్య వల్ల మొదట వచ్చేది వినయం. (విద్య యొసగును వినయంబు, వినయంబు వలన పాత్రత, పాత్రత వలన ధనం, ధనం వల్ల ఐహికాముష్మిక సంపదలు బడయు నరుడు) అంటే వినయం అన్నది విద్యావంతుల లక్షణం. వినయ విధేయతలు లేని వారు డిగ్రీలు ఉన్నా విద్యావంతులుగా పరిగణింపబడరు. చదువు ‘‘కొన్నవారు’’ మాత్రమే అవుతారు. ‘‘వస్త్రేణ, వపుషా, వాచా, విద్యయా, వినయేన చ నరో యాతి గౌరవం’’ గౌరవార్హతలలో ప్రధానమైన ఐదింటిలో వినయం కూడా ఒకటి. అలా ఒదిగి ఉండటం మనిషి గొప్పతనాన్ని ఏ మాత్రం తగ్గించదు. ‘‘అనువు గాని చోట అధికుల మనరాదు/ కొంచెముండు / టన్న కొదువ గాదు / కొండ అద్దమందు కొంచెమై ఉండదా? విశ్వదాభిరామ వినుర వేమ.’’ పరిస్థితులు అనుకూలం గా లేనప్పుడు కొంచెం తగ్గి ఉండటం శ్రేయస్కరం. ఎవరో నన్ను గుర్తించి గౌరవించలేదు అనుకుని కుంగిపోవటం, గుర్తింపు కోసం పాకులాడటం దుఃఖానికి అవమానాలకి హేతువు లవుతాయి. కాస్త తల ఒగ్గి అనుకూల పరిస్థితులు వచ్చాక మళ్ళీ తల ఎత్తవచ్చు. సముద్రంలో అలలు ఎగసి ‘పడుతూ’ ఉంటాయి. ఎగిరితే ఆకాశంలో ఉండలేము కదా! కింద పడక తప్పదు. పడకుండా ఉండాలంటే ఎగరకూడదు. ఎదగాలి. ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే పైకి క్రమం గా ఎక్కాలి. పైగా ఎత్తుకి వెళ్ళిన కొద్ది మరింత జాగ్రత్తగా ఉండాలి. నేల మీద ఉన్నప్పుడు పడితే చిన్న దెబ్బ. ఎంత ఎత్తునుండి పడితే అంత పెద్ద దెబ్బ. అణకువ తో ఉన్న వారి మీద పెద్దలకి వాత్సల్యం ఉంటుంది. వారి ఆశీస్సులు, సహాయ సహకారాలు ఉంటాయి. ఎంత ఒదిగితే అంత ఎదుగుతారు. – డా‘‘ ఎన్.అనంతలక్ష్మి -
దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర మరువలేం
హఫీజ్‌పేట్: దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర మరువలేమని, ఇంజినిరింగ్ ఫీల్డ్ ఎంతో విలువైనదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఎస్కీ) ప్రాంగణంలో ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ–20 సమ్మిట్, అంతర్జాతీయ సదస్సును ఆమె జ్యోతి వెలిగించి ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంజినీర్లు భారతదేశంతోనే కాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా సమగ్ర అభివృద్ధికి కావాల్సిన అవసరాన్ని కూడా గుర్తించి వారికి అందరికీ అందేలా చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాలన్నారు. ఇంజినీరింగ్ రంగంలో ఉండే వాళ్లు మొదట వారి అమ్మను సంతోషపరిచేలా చేస్తే దేశాన్ని కూడా సంతోషపరిచేలా చేస్తారన్నారు. 2030 నాటికి విద్యుత్‌కు ప్రత్యామ్నాంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించడం మంచి నిర్ణయమన్నారు. ప్రతియేటా దశాబ్దాలుగా విద్యుత్ రంగంలో 50 మిలియన్ కొత్త కనెక్షన్లు అందిస్తున్నామని, ఇవి మరింత పెరిగేలా చూడాలన్నారు. విద్యుత్‌కు ప్రత్యామ్నాయం ఆలోచిస్తే పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో తోడ్పడుతుందన్నారు. 2070 ఎనర్జీ డిమాండ్ గణనీయంగా పెరగడంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం సంతోషించదగ్గవిషయమని, 70 నుంచి 80 శాతం విద్యుత్‌ను సోలార్ ద్వారా వినియోగించేలా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు. భారత దేశం ఆర్థిక రంగం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో మరింత పటిష్టంగా మారుతోందన్నారు. చంద్రుడిపై అడుగిడడం కూడా శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల పాత్ర మరువలేనిదని, అందరినీ అభినందిం చాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సదస్సు బ్రోచర్‌ను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా అధ్యక్షుడు శివానంద్ రాయ్, ఆర్టనైజింగ్ కమిటీ చైర్మన్ పి సూర్యప్రకాశ్, ‘ఎస్కీ’ డైరెక్టర్ డాక్టర జి రామేశ్వరరావు ప్రసంగించారు. తర్వాత జరిగిన చర్చా కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ కీరిట్పారిఖ్, ఐఈఐ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఐ సత్యనారాయణరాజు, సెంటర్ ఫర్ సోషల్ ఎకనామిక్ ప్రొగ్రెస్ సీనియర్ ఫెల్లో రాహుల్టాంగియా,రీ సస్టేనబిలిటీ లిమిటెడ్, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర పీజీ శాస్త్రి, హడ్కో సీఎండీ వి సురే‹Ù, ప్రణాళికాసంఘం మాజీ కమిషనర్ అశోక్‌కుమార్ జైన్ పాల్గొన్నారు. -
ఏ క్యారెక్టర్తోనైనా... చాట్ చేయొచ్చు!
సాపేక్ష సిద్ధాంతం గురించి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో సంభాషించింది సృజన. సినిమాలు ఎక్కువగా చూసే గీతిక దర్శక దిగ్గజం ఆల్ఫ్రెడ్ హిచ్కాక్తో ‘నంబర్ 13’ నుంచి ‘ది వైట్ షాడో’ వరకు ఎన్నో సినిమాల గురించి వివరంగా సంభాషించింది. ఇక స్వరతేజకు జపనీస్ ప్రఖ్యాత వీడియో గేమ్ క్యారెక్టర్ ‘మారియో’తో సంభాషించడం సరదా! కాల్పనికత అనేది మనకు బొత్తిగా కొత్త కాదు. అయితే ఏఐ సాంకేతికత కాల్పనికతను మరోస్థాయికి తీసుకువెళ్లింది. యువతరం తాజా ఆర్టిఫిషియల్ క్రేజ్ ‘క్యారెక్టర్. ఏఐ’ ఆ సాంకేతికతలో భాగమే... ఏఐ పవర్ హౌజ్ ‘ఓపెన్ ఏఐ’ అంతర్జాల సంచలనంగా మారింది. ‘చాట్ జీపీటీ’ పాపులారిటీతో ఎన్నో టెక్నాలజీ కంపెనీలు తమ సొంత ఏఐ చాట్బాట్లను ప్రవేశపెట్టాయి. ‘చాట్‌జీపీటీ’ పాపులారిటీ సంగతి ఎలా ఉన్నా యువతరం తాజా ఆసక్తులలో ‘క్యారెక్టర్. ఏఐ’ ఒకటిగా మారింది. ‘క్యారెక్టర్. ఏఐ’ ద్వారా సెలబ్రిటీలు, చారిత్రక వ్యక్తులు, కాల్పనిక పాత్రలు, పాపులర్ వీడియో గేమ్ క్యారెక్టర్లు, థెరపిస్ట్‌లతో హాయిగా సంభాషించవచ్చు. సంభాషణల విషయంలో ఇది ‘చాట్ జీపీటి’ కంటే సహజంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ కాంబినేషన్లో ‘క్యారెక్టర్. ఏఐ’ను అభివృద్ధి చేశారు. ‘క్యారెక్టర్.ఏఐ’లో ఎకౌంట్ సెటప్ పూర్తి చేసిన తరువాత ‘క్రియేట్ ఏ క్యారెక్టర్’ ఆప్షన్‌ను క్లిక్‌చేస్తే విండో ఓపెన్ అవుతుంది. క్యారెక్టర్ తనకు తాను పరిచయం చేసుకుంటుంది. ఆ తరువాత సంభాషణ మొదలుపెట్టవచ్చు. ఉదాహరణకు...‘హారి పోటర్’ సిరీస్‌లోని ఫిక్షనల్ క్యారెక్టర్ హమైనీ గ్రేంజర్తో సంభాషించాలనుకున్నాం.‘హలో రమ్య, మై నేమ్ ఈజ్ హమైనీ గ్రేంజర్. ఇట్స్ వెరీ నైస్ టు మీట్ యూ’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటుంది హమైనీ. తన ఇష్టాయిష్టాలు, ఆసక్తుల గురించి చెబుతుంది. రిలవెంట్ ట్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. క్యారెక్టర్ వ్యక్తిత్వం ఆధారంగా డ్రాప్ డౌన్ మెన్యూ నుంచి స్పీకింగ్ వాయిస్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక క్యారెక్టర్‌తో చాట్ చేయవచ్చు లేదా మల్టిపుల్ క్యారెక్టర్స్‌తో గ్రూప్ చాట్ చేయవచ్చు. ‘క్యారెక్టర్. ఏఐ’ అనేది టెక్ట్స్‌కు మాత్రమే పరిమితం కాదు. ప్రాంప్ట్స్, చాట్స్ ఆధారంగా ఇమేజ్‌లను క్రియేట్ చేయవచ్చు. ఏఐ ఇండస్ట్రీ ప్రముఖులుగా గుర్తింపు పొందిన షాజీర్, డేనియల్ ఫ్రెటస్ గూగుల్‌లో పనిచేస్తున్నప్పుడు ‘క్యారెక్టర్. ఏఐ’కు సంబంధించి ఆలోచన చేశారు. షాజీర్ ‘అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్’ పుస్తక రచయితలలో ఒకరు. ఇక డేనియల్ ‘మీన’ అనే చాట్‌బాట్ క్రియేటర్. వ్యక్తిగత వస్తువులు ఉన్నట్లే, పర్సనలైజ్డ్ చాట్బాట్లు ఉండాలనుకునేవారికి క్యారెక్టర్ ఏఐ ఉపయోగపడుతుంది. ‘వర్చువల్ ఫ్రెండ్’ను సృష్టిస్తుంది. ‘పర్సనలైజ్డ్ చాట్‌బాట్ అంటే మాటలా? ఖర్చు బాగానే అవుతుంది కదా’ అనే సందేహం వస్తుంది. అయితే ‘క్యారెక్టర్. ఏఐ’తో ఖర్చు లేకుండానే సొంత చాట్‌బాట్‌ను సృష్టించుకోవచ్చు. ఆ.. ఏముంది... అంతా కాల్పనికమే కదా అనుకుంటే ఏమీ లేకపోవచ్చు. ఉంది అనుకుంటే మాత్రం ఎంతో ఉంది. ‘కొత్త అనుభూతిని సొంతం చేసుకున్నామా లేదా అనేది ముఖ్యం కాని వాస్తవమా కాదా అనేది ముఖ్యం కాదు’ అంటున్నాడు ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్ మైక్. ‘చాట్ జీపీటీ’ గురించి ఎంత గొప్పగా చర్చించుకున్నప్పటికీ కొన్ని ప్రయోగాలు దెబ్బతిన్నాయి. ఉదాహరణకు ... నేషనల్ ఈటింగ్ డిజార్డర్స్ అసోసియేషన్ బరువు తగ్గడానికి సంబంధించి సమస్యాత్మక సలహా ఇచ్చినందుకు తమ చాట్‌బాట్‌ను సస్పెండ్ చేసింది. క్యారెక్టర్. ఏఐ విషయంలోనూ పొరపాట్లు జరగవచ్చు. సాంకేతికతకు పరిమితులు ఉండే విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అంటుంది చెన్నైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ మనీష. రియల్ చాలెంజర్... జెమిని ఏఐ రేసులో ఓపెన్ ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ లీడింగ్‌లో ఉన్నప్పటికీ ఇది ఎప్పటివరకు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దీనికి కారణం సరికొత్తగా వస్తున్న పవర్ఫుల్ ఏఐ మోడల్స్. వీటిమాట ఎలా ఉన్నా గూగుల్ వారి ‘జెమిని’ని అసలు సిసలు రియల్ చాలెంజర్ అంటున్నారు. గూగుల్ తమ కొత్త ‘జెమిని’ ప్రాజెక్ట్‌లో భాగంగా నెక్స్›్ట– జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్‌ను లాంచ్ చేయనుంది. ‘జెమిని’ అనేది కన్వర్సేషనల్ టెక్ట్స్‌ను జనరేట్ చేయడానికి పరిమితం కాదు. ఇన్‌ఫుట్స్, వీడియోలు, ఇమేజ్ లను హ్యాండిల్ చేసే మల్టీ–మోడల్ జెమిని. గూగుల్ దగ్గర ఉన్న అపారమైన వనరులు(యాక్సెస్ టు యూ ట్యూబ్ వీడియోస్, గూగుల్ బుక్స్, సెర్చ్ ఇండెక్స్, స్కాలర్ మెటీరియల్)లతో ‘జెమిని’ ఇతర కంపెనీలకు గట్టి ప్రత్యర్థిగా మారనుంది. ‘ఎక్స్‌క్లూజివ్ టు గూగుల్’ అనే ప్రత్యేకత వల్ల జెమిని మరింత బలంగా మారనుంది. (చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం!) -
ఒక్క పాటతో మారిపోయిన కృతి సనన్ కెరీర్
-
నా కుటుంబాన్ని మిస్ అయ్యాను.. నేను ప్రేమించిన వాళ్ళ దగ్గరకు వెళ్లి బాధలు పడ్డాను
-
గురువాణి: సంస్కార వైభవం
రఘు మహారాజు పరాక్రమవంతుడు. కారణజన్ముడు. ఆయన విశ్వజిత్ అనే ఒక యాగం చేసాడు. భూమండలమంతా దిగ్విజయ యాత్ర చేసి తీసుకొచ్చిన ధనాన్నంతటినీ కొద్దిగా కూడా ఉంచుకోకుండా ఆ యాగ సమయంలో పూర్తిగా దానం చేసేసాడు. రఘువంశ రచన చేసిన కాళిదాసు –‘‘త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణామ్ యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినామ్’’ అంటాడు. రఘు మహారాజు ఎందుకు సంపాదించాడంటే.. పదిమందికి దానం చేయడానికి–అని, ఎక్కడ మాట జారితే చటుక్కున అసత్య దోషం వస్తుందేమోనని ఆయనకు అన్నీ తెలిసి ఉన్నా ఎక్కువ మాట్లాడేవాడు కాదట, దండయాత్రలు చేసేది కేవలం తన పరాక్రమాన్ని చాటడానికి తద్వారా కీర్తికోసమేనట, గృహస్థాశ్రమంలో ఉన్నది ధర్మబద్ధంగా సంతానం పొందడానికట.. అదీ రఘువంశ గొప్పదనం అంటాడు. వరతంతు మహాముని శిష్యుడు కౌత్సుడు. విద్యాభ్యాసం పూర్తయిన పిమ్మట గురువుగారికి దక్షిణ ఇవ్వాలని వెళ్ళాడు. ‘నాయనా! నీవు నాకేమీ దక్షిణ ఇవ్వక్కరలేదు. నీ క్రమశిక్షణ, మంచితనం నాకు నచ్చాయి. సంతోషంగా వెళ్ళి నీ ధర్మాలను నీవు సక్రమంగా నిర్వర్తించు’ అంటూ ఆశీర్వదించినా... దక్షిణ ఇస్తానని పట్టుపట్టి అడగమన్నాడు. హఠం చేస్తున్న శిష్యుడి కళ్లు తెరిపించాలని... ‘నా వద్ద 14 విద్యలు నేర్చుకున్నావు. కాబట్టి 14 కోట్ల సువర్ణ నాణాలు ఇవ్వు చాలు.’’ అన్నాడు. బ్రహ్మచారి అంత ధనం ఎక్కడినుంచి తీసుకురాగలడు? పని సానుకూలపడొచ్చనే ఆశతో నేరుగా రఘుమహారాజు దగ్గరికి వెళ్ళాడు. స్నాతక వ్రతం పూర్తిచేసుకొని ఒక శిష్యుడు తన సహాయం కోరి వచ్చాడని తెలుసుకున్న రఘు మహారాజు అతిథికి అర్ఘ్యం ఇవ్వడానికి మట్టిపాత్రతో వచ్చాడు. అది చూసి శిష్యుడు హతాశుడయ్యాడు. దానం ఇచ్చే సమయంలో అర్ఘ్యం ఇవ్వడానికి బంగారు పాత్రకూడా లేనంత దీనస్థితిలో ఉన్న రాజు తనకు ఏపాటి సాయం అందించగలడని సంశయిస్తుండగా.. సందేహించకుండా ఏం కావాలో అడగమన్నాడు మహారాజు. కౌత్సుడు విషయం విశదీకరించాడు. సాయం కోరి నా దగ్గరకు వచ్చినవాడు ఖాళీ చేతులతో వెడితే నా వంశానికే అపకీర్తిని తెచ్చినవాడనవుతాను. నాకు రెండు మూడు రోజుల వ్యవధి ఇవ్వు. అప్పటివరకు అగ్నిశాలలో నిరీక్షించమన్నాడు. అంత ధనం పొందడం కేవలం కుబేరుడివద్దే సాధ్యమవుతుందనిపించి కుబేరుడిపై దండయాత్రకు రథం, ఆయుధాలను సమకూర్చుకొని మరునాటి ఉదయం బయల్దేరడానికి సిద్ధమయ్యాడు. తీరా బయల్దేరే సమయంలో కోశాధికారి వచ్చి ‘మహారాజా! తమరు యుద్ధానికి వస్తున్న విషయం తెలుసుకొని కుబేరుడు నిన్న రాత్రి కోశాగారంలో కనకవర్షం కురిపించాడు– అని చెప్పాడు. దానినంతా దానమివ్వడానికి మహారాజు సిద్ధపడగా కౌత్సుడు..‘నాకు కేవలం అడిగినంత ఇస్తే చాలు. నేను బ్రహ్మచారిని. మిగిలినది నాకు వద్దు’ అన్నాడు. నీకోసమే వచ్చింది కాబట్టి అది మొత్తం నీకే చెందుతుంది’ అంటాడు మహారాజు... అదీ ఒకనాటి మన సంస్కార వైభవం. అదీ వినయ లక్షణం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
RRR సినిమాపై అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యుల అభ్యంతరం
-
ముద్దమందారం పార్వతి
పార్వతి ఓ పల్లెటూరి పేదింటి అమ్మాయి. కలవారింటి కోడలు అవుతుంది. పెద్దంటి కోడలిగా ఆ ఇంట్లో ఆమె ఎదుర్కొనే సంఘటనలతో ముద్దమందారం సీరియల్ జీ తెలుగులో ప్రసారమవుతోంది. ఈ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పార్వతిగా పరిచయం అయ్యింది తనూజ. ఈ బెంగుళూరుమందారం తెలుగింటి సింగారంగా ఎలా మారిందో ముచ్చటగా చెప్పుకొచ్చింది తనూజ. ‘‘పార్వతిగా ఇది నా డ్రీమ్ క్యారెక్టర్. సీరియల్లోకి నేను రాకముందే ఒక పల్లెటూరి అమ్మాయిలాంటి క్యారెక్టర్ని చేయడం ఎంత బాగుంటుందో కదా అనుకునేదాన్ని. ఈ మాట మా అమ్మతో తరచూ చెబుతుండేదాన్ని. ‘ముద్దమందారం’లో పార్వతి స్టోరీ చెప్పినప్పుడు మొదట నాకు అంతగా అర్ధం కాలేదు. అప్పుడు నాకు తెలుగు రాదు. ఆఫర్ వచ్చింది కదా అని క్యాజువల్‌గా ఓకే చేశాను. నిజానికి అప్పటికి ఇండస్ట్రీ గురించే అంతగా ఐడియా లేదు. అంతా కొత్త. తర్వాత్తర్వాత యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కోటి నేర్చుకుంటూ, కథ తెలుసుకుంటూ, నటిస్తూ.. క్యారెక్టర్లో లీనమైపోయా. పార్వతిగా మారిపోయా. చాలా మంది ఎంతో గొప్పగా పొగుడుతుంటారు. సలహాలు ఇస్తుంటారు. ఇప్పుడు మరో సీరియల్ చేస్తే ‘పార్వతి’గా ఉన్నప్పటి ఫాలోవర్స్ తర్వాత ఉంటారా అని భయపడుతుంటాను. టీచర్ అవ్వమన్నారు నేను పుట్టి, పెరిగింది అంతా బెంగుళూరులోనే. ముందు మా ఇంట్లో వాళ్లెవరికీ నేనీ ఫీల్డ్‌లోకి రావడం ఇష్టం లేదు. వద్దు మనకీ యాక్టింగ్ అనేవారు అమ్మనాన్న. ‘చదువులో ముందుంటున్నావు. బాగా చదువుకో, టీచర్ లేదా లెక్చరర్ అవ్వు’ అనేవారు నాన్న. హాబీ కోసం డ్యాన్స్ నేర్చుకునే టైమ్‌లో ఉదయం టీవీలో యాంకర్‌గా చేశాను. ఆ సమయంలోనే కన్నడలో ఓ షార్ట్ హారర్ మూవీలో నటించాను. అది తెలుగులో ‘చిత్రం కాదు నిజం’గా డబ్ అయ్యింది. మంచి పేరొచ్చింది. అప్పుడే ఈ తెలుగు సీరియల్ ఆఫర్ వచ్చింది. క్యాజువల్‌గా వెళ్లి కలిస్తే సెలక్ట్ అయ్యాను. దీంతో ఇంట్లో వాళ్లను ఒప్పించి ఈ ఫీల్డ్కి వచ్చాను. షార్ట్‌ఫిల్మ్, ఈ సీరియల్ బాగా హిట్టవడంతో అమ్మానాన్నలు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. అప్పట్లో వాళ్లు భయపడినంతగా ఇక్కడ ఎలాంటి నెగిటివిటీ లేదు. నా పర్సనల్ ఫ్యామిలీకన్నా సీరియల్ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఎక్కువ అయిపోయింది. సీరియల్ అయిపోతే ఇంత పెద్ద, మంచి ఫ్యామిలీని మిస్ అవుతాను కదా అనిపిస్తుంటుంది. ఈ ఇండస్ట్రీలోనే ఉండాలని వచ్చినదాన్ని కాదు. ఎలాగో వచ్చాను, నా టాలెంట్‌ను చూపించుకోవాలని కృషి చేస్తున్నాను. ఇప్పుడు మరో తమిళ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇదే నా బ్యూటిఫుల్ జర్నీ అనీ నమ్మి, వర్క్స్ చేసుకుంటూ వెళుతున్నాను. నాదైన ప్రపంచం మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ షూటింగ్‌కి కూడా రారు. ‘నీ ఓపికకు ఓ దండం తల్లీ’ అనేస్తారు. కారణం, ఉదయం ఏడు గంటలకు షూటింగ్ స్పాట్‌కి వెళితే తిరిగి ఎప్పుడు ఇల్లు చేరుకుంటానో నాకే తెలియదు. అలా ఉంటుంది వర్క్షెడ్యూల్. అయినా, ఇంకా వర్క్ కావాలి అనుకుంటున్నాను. బయటి ప్రపంచాన్ని మిస్ అవుతున్నాను అనే భావనే లేదు. నాదైన ఒక ప్రపంచం ఈ ఇండస్ట్రీలోనే ఉంది. పేరెంట్స్‌ని మిస్ అవుతున్నాను అని చెబితే చాలు... వాళ్లు బెంగుళూరు నుంచి వచ్చి ఓ రోజు టైమ్ స్పెండ్ చేసి వెళ్లిపోతారు. ‘మీరు ఈ రోజు సీరియల్లో కాస్త డల్‌గా అనిపించారు. ఎండ ఎక్కువ ఉంది, కేర్ తీసుకోండి’ అని నా ఫ్యాన్స్ చెబుతుంటారు. చాలా ఆనందంగా ఉంటుంది. మరో అదృష్టం ఏంటంటే ఎక్కడకు వెళ్లినా నన్ను అమ్మలా చూసుకునే వాళ్లు దొరుకుతారు. ఇప్పుడు హరిత(అఖిలాండేశ్వరి పాత్రగా నటిస్తున్న హరిత)మ్మ ‘ఇది తిను, కాసేపు రెస్ట్ తీసుకో’.. అని చెబుతుంటారు. డైరెక్టర్, కెమరామెన్.. ఇలా ప్రతి ఒక్కరూ నా గురించి కేర్ తీసుకుంటారు. ముగ్గురు లక్ష్ములు అమ్మానాన్నలకు ముగ్గురం ఆడపిల్లలం. అక్క అనూజ లాయర్, నేను యాక్టర్, చెల్లి పూజ ఇంజనీయర్. మా అమ్మ నాన్న ‘మా ముగ్గురు లక్ష్ములు’ అని గర్వంగా చెబుతుంటారు. మా అమ్మను ఎప్పుడైనా అడుగుతాం ‘ముగ్గురం ఆడపిల్లలమే కదా, మగ పిల్లలు పుడితే బాగుండు అనుకున్నారా!’ అని. అప్పుడు అమ్మ ‘నేను అమ్మాయిలు పుట్టాలనే మొదటి నుంచీ దేవుళ్లకు మొక్కుకున్నాను. మీరు అబ్బాయిలకన్నా ఎందులో తక్కువ’ అంటుంది. అప్పుడైతే చాలా గర్వంగా అనిపిస్తుంటుంది. నాకు కూడా ఫ్యూచర్లో ఆడపిల్లే పుట్టాలని కోరుకుంటాను మా అమ్మ లాగ. కొంచెం మోడ్రన్ ముందు నుంచీ కాస్ట్యూమ్స్ది నాదే బాధ్యత అన్నారు. అందుకే, నా క్యారెక్టర్ మొదట ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉండేలా జాగ్రత్తపడుతున్నాను. కాస్ట్యూమ్స్ విషయంలో మా మమ్మీకి థాంక్స్ చెప్పాలి. మా మమ్మీవి కొత్త కొత్త చీరలన్నీ వచ్చేటప్పుడు దొంగతనంగా తెచ్చేసుకుంటాను (నవ్వుతూ). అమ్మ ఫోన్‌చేస్తుంది ‘పెళ్లికి వెళ్లాలని తీసుకున్నాను, నువ్వు తీసుకెళ్లావా?’ అంటుంది. మా సీరియల్లో కూడా ఈ రోజు పెళ్లి ఉందని నవ్వేస్తాను. అమ్మ కూడా నవ్వేస్తుంది. మా చెల్లెలు పూజ నాకు కాస్ట్యూమ్ విషయంలో, హెయిర్ స్టైల్స్ విషయంలో సూచనలు ఇస్తూ ఉంటుంది. నాకు ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ పెద్దగా ఏమీ లేవు. ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి. వాటిలో మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు పల్లెటూరి అమ్మాయిలా యాక్ట్ చేస్తున్నాను. నెక్ట్స్ సీరియల్లో కొంచెం మోడ్రన్ అమ్మాయిలా క్యారెక్టర్ వస్తే బాగుండు అనుకుంటున్నాను.’ – నిర్మలారెడ్డి -
యమప్రేమ
ఏదో పాపం... ప్రాణాలు తీయాలన్న డ్యూటీ యముడికి వేయబట్టిగానీ... నిజానికి ఆ క్యారెక్టరుకు మనుషులంటే చాలా ఇష్టం. వారి వినోదం కోసం యముడనే ఆ క్యారెక్టరు చాలా చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. ‘‘చతుర్ముఖ ప్రసాదిత సమస్త పర్యతలోక సామ్రాజ్యాధినాథుండయిన నేను’’ అంటూ ఆయన... ‘‘అవలోకన మాత్ర విచలిత విహ్వలీకృత సమస్త చతుర్దశ భువన చరాచర భూత భయంకర పాశాంకుశధారి’’ అనే తన ఫేమస్ డైలాగులతో యమాగా హూంకరించి నప్పటికీ... యముడు తన పాశాంకుశం ఉచ్చుముడిని వదులు చేసి ఎనీఆర్ ప్రాణాలను వదిలేయాల్సి వచ్చింది ‘యమగోల’లో! ఆ తర్వాత కూడా సందర్భంలో ప్రాణాల చిట్టా పుస్తకం కనపడక కమెడియన్ హీరో అలీ తల్లి ప్రాణాలను విడిచిపుచ్చి ‘యమలీల’ చూపాల్సి వచ్చింది పాపం!! అంతెందుకు... యముడికి మొగుడైన చిరంజీవి ప్రాణాలను డ్యూయల్రోల్కి పంపుతూ ఇంకోసారి, యమదొంగ జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలను స్పేర్ చేస్తూ మరోసారి వారి వారి ప్రాణాలను మాటిమాటికీ వాపస్ ఇచ్చేయాల్సొచ్చింది!!! మరో సందర్భంలో కొత్త యముడికి మొగుడు సినిమాలో తన తండ్రి చంద్రమోహన్ ప్రాణాలను అల్లరినరేశ్కు భద్రంగా అప్పజెప్పడంతో పాటు తన కూతురు యమజనూ అతడికి ఇచ్చి కన్యాదానమూ చేయాల్సి వచ్చింది. ఇలా పాపం... సదరు యముడి క్యారెక్టరు తెలుగుతెర మీద తన డ్యూటీ తాను చేయకుండా అనేక మార్లు మనుషుల ప్రాణాలు కాపాడుతూ ఉండిపోవాల్సి వచ్చింది. పదే పదే వెండితెర మీద తారల ప్రాణాలే కాపాడి కాపాడి బోరుకొట్టిందేమో. ‘ఇలా ఎంతసేపని మాటిమాటికీ సెలబ్రిటీలనే కాపాడతాం. కాస్త మనం అలా బెంగళూరు సిటీలో సామాన్యుల ప్రాణాలను రక్షిద్దాం’’ అనిపించిందా యముడి పాత్రకు. అందుకే యమరాజు భూమికను మళ్లీ ధరించి, రోడ్డు మీదికి వచ్చి మోటారుసైకిళ్లను నడిపేవారిని హెచ్చరిస్తోందా పాత్ర. ‘‘హెల్మెట్ లేకుండా బండి నడిపితే... త్వరలోనే నువ్వు నాకు హెల్ మేట్ అవుతావం’’టూ హెచ్చరిస్తోందా యమపాత్రధారి. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ హెచ్చరికలు చేస్త ట్రాఫిక్ నిబంధలపై అవగాహన కల్పిస్తోందా పాత్ర. ఆ యముడి భూమిక దేశవ్యాప్తంగా పలువురిని ఆకర్షించింది (పై ఫొటో చూడండి). దీన్ని బట్టి మళ్లీ మరోసారి నిరూపితమవుతున్న అంశం ఏమిటంటే... ప్రాణాలు తీసే డ్యూటీ తనకు వేయబట్టిగానీ... లేదంటే... అటు తెర మీద... ఇటు రోడ్ల మీద మనుషుల ప్రాణాలను రక్షించడం అంటే ఆయనకు యమా ఇష్టం. సారీ... ‘యమ’ ‘యమ’ ఇష్టం!!! – యాసీన్ -
రజనీకాంత్ ‘కాలా’లో ‘కుల’కలం
వెనుకబడిన కులాలైన వన్నియార్లు, తేవర్లు, గౌండర్లు తమిళనాడులో కొత్త అగ్రకులాలుగా అవతరించారు. తమ కూతుళ్లు, కొడుకులు దళితులను పెళ్లాడితే వారు నిప్పులు చెరుగుతారు. ఇలాంటి పెళ్లిళ్ల విషయంలో దళితుడిని చంపి జైలుకెళ్లడం ఈ కులాలవారికి గొప్ప గౌరవంగా కనిపిస్తోంది. మరి సమాజంలో ఇలాంటి సెంటిమెంటును కాలా సినిమా మార్చగలుగుతుందా? ఇప్పుడు రజనీకాంత్ ఈ చిత్రంలో వేసిన దళితుడి పాత్ర కారణంగా తమిళ సమాజంలో పరివర్తన వస్తుందా? జవాబు చెప్పడం చాలా కష్టం. కానీ, సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళితుల బాధలు, కష్టాలను విస్మరించలేమనే బలమైన ఆలోచన సినిమా వంటి సృజనాత్మక కళల్లో తప్పక మొదలవుతుంది. భారత సినిమా చరిత్రలో సాధారణమైనదేగాక చెప్పు కోదగినది కిందటి వారం. జూన్ 7న రజనీకాంత్ నటించిన కాలా విడుదలైంది. 1980ల నేపథ్యంతో నిర్మించిన ఈ సినిమాలో మురికి వాడలో నివసించే సామాన్యుడు ప్రజానాయకుడవు తాడు. అంతే కాదు, పేదల ఇళ్లను కూల్చడానికి ప్రయత్నించిన బలవంతుడైన ఓ రాజకీయ నేతను ప్రతిఘటిస్తాడు. ఇది మామూలు విషయం. ఈ కథలో కొత్తేమీ లేదు. అయితే, రజనీకాంత్ స్థాయి సూపర్‌స్టార్‌తో దర్శకుడు పా రంజిత్ ఓ దళితుడి వేషం వేయించడం, తమిళ వాణిజ్య సినిమాలో దళి తులకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషమే. కుల వివక్షను సినిమాల్లో చూపించడం సామాన్య విషయం కాదు. మరాఠీలో సూపర్‌హిట్ అయిన చిత్రం ‘సైరాట్’ హిందీ రీమేక్ ‘ధడక్’ ట్రెయిలర్ విడుదలైంది. అగ్ర వర్ణ యువతి ప్రేమలో పడిన ఓ దళిత కుర్రాడి కథే సైరాట్. బాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ ఈ కథను హిందీలో నిర్మించింది. అయితే, కుల ప్రస్తావన లేకుండా, పేద యువకుడు ధనికుడి కూతురును ప్రేమించినట్టుగా ఈ హిందీ సినిమాలో చెప్పారు. నేటి మల్టీప్లెక్స్ హిందీ సినిమాలు చూసే ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగానే నిర్మాతలు కథలు రూపొందించి, సినిమాలు తీస్తారనడానికి ఇదో ఉదా హరణ. దళిత సంస్కృతి, వారి పాటలు, నృత్యాలు, వారి పండుగలు వంటి విషయాలను ప్రధాన స్రవంతి తమిళ సినిమా పట్టించుకోదనేది రంజిత్ అభిప్రాయం. అందుకే ఆయన తన చిత్రాల్లో ఈ అంశాలన్నిటినీ చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన దర్శకత్వం వహించిన కబాలి, కాలా ప్రత్యేకత సంతరించుకున్నాయి. కాలా కథ సాధారణమైనదేగాని పెద్దగా పట్టించుకోని కింది కులాల జీవనాన్ని చక్కగా చూపించడం, అందుకు రజనీకాంత్ నటన దోహదం చేయడం వల్ల ఇది విశిష్ట చిత్రంగా ఆకట్టుకుంటోంది. భారతీయ సిని మాల్లో దళితులకు ప్రాధాన్యం ఉండదు. సహాయ పాత్రలకే వారు పరిమితమౌతారు. ఆస్కార్ అవా ర్డుకు ప్రతి పాదించిన ఆమిర్‌ఖాన్ చిత్రం లగాన్‌లో దళితుడైన కచ్రా పాత్రను పరిశీలిస్తే ఈ విషయం అర్థమౌతుంది. ఆమిర్ పాత్రను గొప్పగా చూపించ డానికి అంటరాని వాడైన కచ్రాను వాడుకున్నారు. అంతేగాని, స్వాతంత్య్రానికి ముందు దేశంలో దళి తుల స్థితిపై ఎలాంటి వ్యాఖ్య ఇందులో కనిపించదు. కాలాలో శక్తిమంతుడైన బ్రాహ్మణుడిపై పోరాటాన్ని అంబేడ్కర్, బుద్ధుడి అభిమాని అయిన రంజిత్ 70 ఎంఎంలో గొప్పగా చిత్రించారు. అందుకే కాలాను ఓ మైలురాయి సినిమాగా పిలుస్తాను. హరిదేవ్ అభ యంకర్ అనే దుష్ట బ్రాహ్మణ పాత్ర పోషించిన నానా పటేకర్ రజనీకాంత్ పేరు కాలాను ఎగతాళి చేస్తూ, ఇదో పేరేనా అని ప్రశ్నిస్తాడు. కాలా నివసించే ముంబై మురికివాడ ధారావీని ‘అభివృద్ధి’ చేయడా నికి ప్రయత్నించిన సంస్థకు ‘మనూ రియాలిటీ’ అని పేరు పెట్టడంలో పరమార్థం ప్రేక్షకునికి అర్థంకాక పోదు. ఈ మురికివాడలో అపరిశుభ్రతపై పటేకర్ వ్యంగ్యాస్త్రాలు విసురుతాడు. తన వాడలోని మురికి పరిస్థితులను చూపి గర్వపడతాడు రజనీ. కింది కులాలంటే జుగుప్స ప్రదర్శించే వారిని ప్రతిబింబిం చేలా నానా పటేకర్ పాత్రను రంజిత్ రూపొందిం చారు. నేరుగా కులం పేరు ప్రస్తావించకుండా శుభత్ర, పేర్లు, దుస్తుల గురించి మాట్లాడుతూ కింది కులాలపై పైవారి మనస్సుల్లో అసహ్యం ఎంతగా ఉంటుందో కాలా చక్కగా చూపిస్తుంది. రంజిత్ చిత్రాల్లో కులానిదే కీలక పాత్ర రంజిత్ సినిమాలన్నింటిలోనూ కులానిదే ప్రధాన పాత్ర. కాలాలో కులాన్ని ముఖ్య భూమికలో చూపి స్తారు. క్లైమాక్స్‌లో నీలి రంగు దళితుల విజయానికి, గౌతమ బుద్ధ విహారలో కూడా ఈ రంగు దళితుల తిరుగుబాటుకు చిహ్నాలుగా కనిపిస్తాయి. ముంబైని అతలాకుతలం చేయడానికి ధారావీ సమ్మెకు దిగు తుంది. బలంగా పాతుకుపోయిన పాలకవర్గాలను కూలదోయడానికి బడుగువర్గాలకున్న శక్తికి ఇది తార్కాణంగా నిలబడుతుంది. కాలాలో ‘క్యా రే సెటింగా!’ అనే రజనీకాంత్ పంచ్ డైలాగ్‌ను ప్రేక్ష కుల ఈలలు, చప్పట్ల కోసం రాసిన మాటలుగా భావించకూడదు. దళితులకు వ్యతిరేకంగా అగ్రకు లాలు చేతులు కలపడాన్ని ఈ డైలాగ్ ప్రస్తావిస్తోంది. దళితులపై దాడి జరిగినప్పుడు రజనీకాంత్ ఒంటరి కాదు. కుల శత్రువులపై పోరుకు ఆయన వర్గీయులం దరూ ఆయన పక్కనే ఉంటారు. ఈ సినిమాలో మంచిచెడులను సంప్రదాయబద్ధంగాగాక భిన్నంగా చూపిస్తారు. విలన్ హరిదాదా తెల్ల దుస్తులే వేసు కుంటాడు. అతని ఇంటి హాల్లో రాముడి విగ్రహం ప్రముఖంగా కనిపిస్తుంది. సోఫా సెట్లు కూడా తెల్లని రంగులో కనిపిస్తాయి. అతను రామాయణంపై ఒట్టేసి మరీ మాట్లాడతాడు. అందుకు విరుద్ధంగా కాలా నల్లని బట్టలే ధరిస్తాడు. దుమ్మూధూళి అంటే అతనికి ఇష్టమేగాని చిరాకు లేదు. కాలాను రావణ్ అని విలన్ హరి పిలుస్తాడు. కాని, పెరియార్ ఈవీ రామసామి నాయకర్ ప్రకారం రావణుడు నలుపే గాని చెడ్డవాడు కాదు. కాలా తనను యమునిగా పిలుచుకుంటాడు. తనను రామునిగా భావించే హరి దాదాను యముని రూపాన్ని ప్రతిబింబించే కరికా లన్ తుదముట్టిస్తాడు. హరిదేవ్ తన కత్తి తుప్పు పట్టకుండా ఉండడానికి నూనె రాస్తూ దాన్ని పూజి స్తాడు. ఎప్పుడైనా కత్తిని ఇతరులను చంపడానికి వాడడమే అతని లక్ష్యం. అయితే, అందుకు విరు ద్ధంగా భీమ్రావు అంబేడ్కర్ పుస్తకాలను కాలా చదు వుతాడు. దళితుల ఇళ్లు కూల్చివేయాలనుకున్న హరి దేవ్ వారి విలువైన స్థలాలపై కన్నేసి వారికి మెరుగైన జీవితం కల్పిస్తానని వాగ్దానం చేస్తాడు. మా భూమిపై మాకే హక్కు కాలాలో దళిత పాత్రలు కష్టాలు, కన్నీళ్లకు ప్రతిబిం బాలు కావు. తమ నేలపై తమదే హక్కని వారు వాదిస్తారు. కాలా వారి జీవితాలు, ఆత్మగౌరవానికి చిహ్నం. ఈ మురికివాడలో వినిపించే సంగీతం భిన్నంగా ఉంటుంది. భీమ్ వాడ, మసీదు, నికా, గొడ్డు మాంసం దుకాణం, పెరియార్ చౌక్–ఇవన్నీ ధారావీ లో కనిపించే దృశ్యాల పేర్లు. లెనిన్, భీమ్జీ అనే పేర్లున్న పాత్రలు తమది భిన్న ప్రపంచమనీ, మిగతా భారతావని తమను గుర్తించాలనేలా ధ్వని స్తాయి. నేటి ఆధునిక భారతంలో నిర్మించే సిని మాల్లో చక్కటి అబ్బాయిలు, అందమైన బొమ్మలను తలపించే ఆడపిల్లలే కనిపిస్తారు. వీటిలో ఎన్నికల విశ్లేషణలో ఒక్క కులాన్నే ప్రధానాంశంగా చర్చించ డానికి అవకాశం లేదు. గతంలో ధారావీ మురికివాడ నేపథ్యంతో సినిమాలు వచ్చాయిగాని కులం గురించి ఇంత విస్తృతంగా అర్థమయ్యేలా చిత్రీకరించడం ఇదే మొదటిసారి. తెల్లగా ఉంటారనే కారణంగా ఉత్తరాది కథానాయికలను తమిళ సినిమా సహా దక్షిణాది సిని మారంగం దిగుమతి చేసుకోవడం ఎప్పటినుంచో సాగుతున్న వ్యవహారమే. కాలాలో ఇందుకు భిన్నంగా–రజనీ భార్యగా నటించిన ఈశ్వరీరావు, సామాజిక కార్యకర్తగా కని పించిన అంజలీ పాటిల్ ఇద్దరూ నల్లగానే ఉంటారు. జరీనా అనే భర్తలేని ముస్లిం తల్లి పాత్ర పోషించిన హుమా ఖురేషీ ఓ ముఖ్య సామాజిక సందేశం ఇచ్చేలా కాలాలో దర్శనమిస్తుంది. కుల వివక్షతో హత్యలు జరుగుతున్న కారణంగా తమిళనాడులో కాలా ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. 2016 మార్చిలో పశ్చిమ తమిళనాడులోని ఉడుముల పేటలో శంకర్ అనే దళిత యువకుడిని కత్తులతో పొడిచి చంపడం తీవ్ర సంచలనం సృష్టించింది. అతని భార్య కౌశల్య తండ్రి కిరాయి హంతకులతో శంకర్‌ను హత్య చేయిస్తాడు. శంకర్‌తో పోల్చితే పెద్ద కులానికి చెందిన కౌశల్య తల్లిదండ్రులు తమ మాట వినకుండా కూతురు దళితుడిని పెళ్లాడడం సహించ లేక ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ హత్యకేసులో దోషులుగా తేలిన ఆమె తండ్రి, ఆయన అనుచరు లకు 2017 డిసెంబర్లో తిరుపూర్ కోర్టు శిక్షలు విధిం చింది. 2014–2016 మధ్య కాలంలో తమిళనాట పరువు హత్యల పేరుతో 83 కేసులు నమోద య్యాయి. వెనుకబడిన కులాలైన వన్నియార్లు, తేవర్లు, గౌండర్లు రాష్ట్రంలో కొత్త అగ్రకులాలుగా అవతరించారు. తమ కూతుళ్లు, కొడుకులు దళితు లను పెళ్లాడితే వారు నిప్పులు చెరుగుతారు. ఇలాంటి కులాంతర వివాహాలను తమ కుటుంబా నికి అవమానంగా వారు భావిస్తారు. ఇలాంటి పెళ్లిళ్ల విషయంలో దళితుడిని చంపి జైలుకెళ్లడం ఈ కులా లవారికి గొప్ప గౌరవంగా కనిపిస్తోంది. మరి సమా జంలో ఇలాంటి సెంటిమెంటును కాలా సినిమా మార్చగలుగుతుందా? ఇప్పుడు రజనీకాంత్ ఈ చిత్రంలో వేసిన దళితుడి పాత్ర కారణంగా తమిళ సమాజంలో పరివర్తన వస్తుందా? జవాబు చెప్పడం చాలా కష్టం. కాని, సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళితుల బాధలు, కష్టాలను విస్మరించలేమనే బల మైన ఆలోచన సినిమా వంటి సృజనాత్మక కళల్లో తప్పక మొదలవుతుంది. తమిళ సినీ ప్రేక్షక ప్రపం చంలో పెద్ద సంఖ్యలో ఉన్న సామాజికవర్గాల కథలు సినిమాలకు ఇతివృత్తాలుగా మారడానికి కాలా దోహ దం చేస్తుంది. దళితుల జీవితాలను సహానుభూతితో అర్థం చేసుకుని వారి బతుకులను కథలు కథలుగా సినిమాల్లో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందే చెప్పినట్టు మరాఠీ సూపర్ హిట్ సినిమా సైరాట్‌ను హిందీలో ‘ధఢక్’ పేరుతో నిర్మించడం ద్వారా దళితుల జీవితాలను విస్తృతంగా సినిమా తెర లకు ఎక్కించే అవకాశం వచ్చింది. అయితే, అగ్రశేణి దర్శకుడు కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ హిందీ సినిమా ట్రెయిలర్ చూస్తే అలాంటి ఆశలు అడియా శలేననే భావన కలుగుతుంది. ఈ సినిమా నిర్మాతలు కేవలం శ్రీదేవి కూతురు జాహ్నవీ కపూర్, షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కపూర్ల కొత్త ముఖాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కని పిస్తోంది. కుల వివక్ష వంటి బుర్రతో ఆలోచించే కథాంశాలు, భిన్న సామాజిక వాస్తవాలతో కూడిన కథనాలు ‘ఉన్నత స్థాయి’ హిందీ ప్రేక్ష కుల మెదళ్లకు ఎక్కకపోవడం నిజంగా దురదృష్టం. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
ప్రతిభ కన్నా వ్యక్తిత్వం ముఖ్యం
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): వ్యక్తుల్లో ప్రతిభ కన్నా వ్యక్తిత్వం ముఖ్యమని వ్యక్తిత్వం ద్వారానే సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలిపారు. ఏలూరు నగర బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కేపీడీటీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి మహోన్నత స్థానముందని, ప్రతీ వారిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నారు. ఏలూరుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తనను ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్న ఏలూరు నగర ప్రజల ఆత్మీయతను ఎన్నటికీ మరిచిపోలేనని తెలిపారు. చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ సినీ సాహిత్యాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లిన ఘనత సీతారామశాస్త్రికే దక్కుతుందన్నారు. అనంతరం ఉగాది పంచాంగాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఉగాది పురస్కారం అందించి దంపతులకు ఘన సన్మానం చేశారు. తొలుత మాచిరాజు వేణుగోపాల్, మాచిరాజు కిరణ్ కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమానికి టీవీ యాంకర్ చిత్రలేఖ, కేఎల్వీ నరసింహం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అనంతరం బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి మహిళ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు సిరివెన్నెల చేతుల మీదుగా బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, పారిశ్రామికవేత్త అంబికా రాజా, ఏలూరు నగర బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు సత్యవాడ దుర్గాప్రసాద్, ఎంబీఎస్ శర్మ, కె.కృష్ణమాచార్యులు, ద్రోణంరాజు వెంకటరమణ, తోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పటికి పదివేల మంది ఈ ప్రశ్న అడిగారు!
‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ – కొందరు సినిమా స్టార్స్ తరచూ చెప్పే డైలాగ్ ఇది. కానీ, భరత్‌రెడ్డికి ఈ డైలాగ్ అవసరం లేదు. ఎందుకంటే... ఈయన డాక్టర్ కమ్ యాక్టర్. కార్డియాలజిస్ట్‌గా ప్రజల్లో ఎంత మంచి పేరుందో... నటుడిగా ప్రేక్షకుల్లో అంతే మంచి గుర్తింపు ఉంది. ఇటీవల విడుదలైన ‘ఘాజీ’లో భరత్ చేసిన పాత్రకు మంచి పేరొచ్చింది. ఈ సందర్భంగా భరత్‌రెడ్డి చెప్పిన విశేషాలు.... ‘డాక్టర్ అండ్ యాక్టర్‌గా చేస్తున్నారు. రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?’ – నన్ను ఎవరు కలిసినా మొదట అడిగే ప్రశ్న ఇదే. సుమారు ఓ పదివేల మందికి పైగా ఈ ప్రశ్న అడిగారు. డాక్టర్, యాక్టర్.. రెండూ విభిన్నమైన ప్రొఫెషన్స్. రెండిటినీ కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు మా అమ్మగారితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ వర్రీ అయ్యారు. నాన్నగారు ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. ‘సినిమాల్లోకి వెళుతున్నాడు. వీడి లైఫ్ ఏమౌతుంది? కార్డియాలజీ ప్రాక్టీస్ ఏమౌతుంది?’ అని అమ్మ భయపడ్డారు. పదేళ్లుగా రెండు ప్రొఫెషన్లనూ సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నా. మంచి సినిమాల్లో నటించడంతో పాటు డాక్టర్‌గా ప్రజలకు మంచి చేయాలనే ఆశయమే నన్ను ముందుకు నడిపిస్తోంది. ∙నటుడిగా ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాలు చేస్తూనే... ‘సిద్ధం’, ‘ఈనాడు’, ‘గగనం’, ‘ఘాజీ’ వంటి పలు స్ఫూర్తివంతమైన సినిమాల్లో నటించాను. నాకు పెద్దగా టార్గెట్స్ లేవు. చరిత్రలో నిలిచే ఇలాంటి సినిమాలు చేయాలని కోరిక. గతేడాది ‘భయం ఒరు పయనం’ అనే తమిళ సినిమాలో హీరోగా చేశా. అది ‘భయమే ఒక ప్రయాణం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఛాన్స్ వస్తే హీరోగా చేయడానికి రెడీ. అలాగే, మంచి పాత్రలు వస్తే ‘ఘాజీ’ వంటివీ చేస్తా. ‘ఘాజీ’లో పాత్ర నటుడిగా ఓ ఛాలెంజ్. సినిమాలో లైవ్ ఫైర్‌తో ఓ సీన్ చేశాను. అందులో గ్రాఫిక్స్ ఏం లేవు. సీన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే... నా కనుబొమలు, జుత్తు కాలిపోయి ఉన్నాయి. షాకయ్యా. లక్కీగా స్కిన్‌కి ఏం కాలేదు. జుత్తు కాలినా తిరిగి పెరుగుతుంది. డాక్టర్‌ను కాబట్టి ఆ విషయం నాకు తెలుసు. ∙జ్యోతిక, జీవీ ప్రకాశ్‌కుమార్ ముఖ్య తారలుగా దర్శకుడు బాల తీస్తోన్న ‘నాచియార్’లో కీలక పాత్ర చేస్తున్నా. బాలాగారి సినిమాలు నటీనటులకు ఎంత పేరు తెస్తాయో తెలిసిందే. అందుకే రెమ్యునరేషన్ గురించి అడగలేదు. వెంటనే ఓకే చెప్పేశాను. ఓ కమర్షియల్ తెలుగు సినిమాలో మంచి అమౌంట్ ఆఫర్ చేసినా... రొటీన్ క్యారెక్టర్, అదీ చిన్నది కావడంతో అంగీకరించ లేదు. నాకు మనీ ముఖ్యం కాదు, ఆర్టిస్ట్‌గా ఛాలెంజింగ్ రోల్స్ కోసం చూస్తున్నా. -
చిరు త్యాగం!
పాత్ర కోసం ఏం చేయడానికైనా వెనకాడని నటీనటులు కొంతమంది ఉంటారు. రామ్‌చరణ్ అలాంటి నటుడే. క్యారెక్టర్ డిమాండ్‌ని బట్టి ఫిజిక్‌ని మార్చేసుకుంటారు. ప్రస్తుతం చేస్తున్న ‘ధ్రువ’ సినిమా కోసం గుర్రపు స్వారీ చేస్తూ, ఫైట్ చేయడం నేర్చుకున్నారు రామ్‌చరణ్. ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ కోసం శాకాహారిగా మారిపోయారు. ‘‘ఈ సినిమా కోసం వెజ్జీగా మారుతున్నాను. ఈ పాత్రకు ఇలా మారడం కరెక్ట్ అని నమ్ముతున్నా’’ అని పేర్కొనడంతో పాటు కూరగాయలతో తయారు చేసిన ఓ డిష్‌ని ఆస్వాదిస్తూ, రామ్‌చరణ్ ఫొటో పోస్ట్ చేశారు. వాస్తవానికి మాంసాహారానికి అలవాటు పడినవాళ్లకు వారానికోసారైనా అది తినకపోతే శాకాహారం పెద్దగా మింగుడుపడదు. కానీ, పాత్ర కోసం చరణ్ కొన్నాళ్ల పాటు తన జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకోనున్నారు. దీన్నిబట్టి సినిమా కోసం చరణ్ చిన్న చిన్న త్యాగాలు చేయడానికి ఇష్టంగా రెడీ అయిపోతారని ఊహించవచ్చు. అఫ్కోర్స్ పెద్ద త్యాగాలకూ వెనకాడరనుకోండి. -
మొహమాటం వదిలేయాలి!
చుట్టూ నలుగురు ఉంటేనే చాలామందికి నోట మాట రాదు. మరి.. సినిమా తారల చుట్టూ వందల మంది ఉంటారు. ఎలా నటించగలుగుతారబ్బా? అనే డౌటు చాలామందికి వస్తుంటుంది. ఇదే విషయం గురించి ఇటీవల తమన్నా దగ్గర ప్రస్తావిస్తే - ‘‘ఆర్టిస్టుగా నటించాలంటే పరిసర ప్రాంతాలను మర్చిపోవాలి. మనల్ని ఎవరూ చూడటంలేదు అనుకోవాలి. ముఖ్యంగా మొహమాటం వదిలేయాలి. చేస్తున్న పాత్రకు న్యాయం చేయాలనే విషయాన్ని మాత్రమే మనసులో పెట్టుకుని, నటించాలి. నేనలానే చేస్తాను. చుట్టూ ఎంతమంది ఉన్నా టైపిస్ట్‌లు కీ-బోర్డ్‌ని టపటపలాడిస్తూ తమ పని తాము చేసుకుపోతారు. కండక్టర్లూ, డాక్టర్లూ.. ఇలా ఎవరికివాళ్లు తమ పని తాము చేస్తారు. మేం కూడా అంతే. మా పని మేం చేస్తున్నాం. చుట్టూ వేల మంది ఉన్నా మా పని మేం చేయాలి. అందరి గురించీ ఆలోచించి, బాగా చేయకపోతే మేం మాటలు పడాల్సి వస్తుంది. దాంతో పాటు వృత్తి మీద భక్తి, శ్రద్ధలు లేవని కూడా అనిపించుకోవాల్సి వస్తుంది. అందుకే కెమెరా ముందుకెళ్లాక నన్ను మర్చిపోతాను. ఇతరులనూ మర్చిపోతాను. పాత్రను మాత్రమే గుర్తుపెట్టుకుని చేస్తాను’’ అన్నారు. -
తనే నాకు తగిన జోడీ!
కలర్స్ కళ్యాణ్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే సీరియల్ రాధ- మధు. ఆ సీరియల్లో నటి మౌనిక పక్కన కళ్యాణ్ ఎంతో ముచ్చటగా కనిపిస్తూ ఇంటింటికీ ఆత్మీయుడైపోయాడు. లయ, కన్యాదానం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సీరియల్స్‌తో కెరీర్ కొనసాగించిన కళ్యాణ్ కొంత విరామం తర్వాత మళ్లీ బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ రంగం గురించి, అందులోని సాధక బాధకాల గురించి ‘సాక్షి’తోపంచుకున్నారు... ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అని టైటిల్ పెట్టారు. కానీ సీరియల్లో మీ మాటలు తేడాగా ఉన్నాయే? (నవ్వుతూ) అవును. పేరుకే హీరోని గానీ క్యారెక్టర్ పరంగా విలన్ని. వేరే అమ్మాయి కోసం భార్యని దారుణంగా మోసగించే పాత్ర. ఎప్పుడూ సాఫ్ట్‌గా కనిపించి కనిపించి బోర్ కొట్టింది. అందుకే నెగిటివ్ రోల్ ఎంచుకున్నా. ఆమధ్య బుల్లితెర మీద కనిపించలేదెందుకని? కావాలనే రెండేళ్లు గ్యాప్ తీసుకున్నా. ఈ ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదు. ఒక్కరోజులో ఎత్తేస్తారు, ఒక్కరోజులో పడేస్తారు. కాబట్టి భవిష్యత్తు కోసం మరొక ఆప్షన్ పెట్టుకోవడం అవసరమనిపించింది. అందుకే నటనకు కామా పెట్టి బిజినెస్ సెటప్ చేసే ప్రయత్నాల్లో పడ్డాను. అంతలో మంచి ఆఫర్ రావడంతో మళ్లీ మేకప్ వేసుకున్నాను. చూస్తుంటే ఇండస్ట్రీ మిమ్మల్నేదో ఇబ్బంది పెడుతున్నట్టుంది? లేదు.. నేను అలా అనలేదు. సెకెండ్ ఆప్షన్ అవసరం అని చెప్పానంతే. అయినా సమస్యలన్నవి అన్ని చోట్లా ఉంటాయి. ఇష్టపడి చేస్తే ఏదీ కష్టంగా అనిపించదు. నాకు నటనంటే ఇష్టం. ఇండస్ట్రీ అంటే ఇష్టం. కాబట్టి దీన్ని ఎప్పటికీ కష్టమనుకోను, వదలను. ఈ ఇష్టం మీరు నటుడయ్యాక పెరిగిందా... లేక ఇష్టంతోనే నటుడయ్యారా? నిజానికి ఇండస్ట్రీకి ఇష్టంతో రాలేదు, యాక్సిడెంటల్‌గా వచ్చాను. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. ఎంబీయే చేసి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నప్పుడు చిన్నా అనే అసిస్టెంట్ డెరైక్టర్ ద్వారా ‘రాధ-మధు’ సీరియల్ హీరోగా చాన్స్ వచ్చింది. నటించడం మొదలెట్టాక అందులోని ఆనందం తెలిసి వచ్చింది. పైగా అది పెద్ద హిట్. తర్వాత చేసిన ‘లయ’ కూడా మంచి హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూడలేదు. సినిమాల్లోకి కూడా వెళ్లారుగా? అవును. ‘గోపి గోపిక గోదావరి’లో సెకెండ్ హీరోగా చేశాను. నిజానికి అంతకంటే ముందే వాన, లక్ష్మి, సై, మనోరమ లాంటి కొన్ని సినిమాల్లో మంచి రోల్స్ కోసం అడిగారు. టైమ్ కుదరక చేయలేదు. కానీ వంశీగారి సినిమా అంటే వదులుకోలేకపోయాను. కానీ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు? చెప్పానుగా నటనకు కామా పెట్టానని. దానివల్లే సీరియల్స్‌తో పాటు సినిమాలకీ దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అన్నీ కలిసొస్తే లీడ్ రోల్ చేసే చాన్స్ కూడా ఉంది. సినిమా మీద ఆశతో కెరీర్‌ని పాడు చేసుకున్న సీరియల్ నటులు చాలామంది ఉన్నారు. మరి మీరు..? మీరన్నది నిజమే. కానీ టీవీ నుంచి వెళ్లి సక్సెస్ అయినవాళ్లూ ఉన్నారు. రాజీవ్ కనకాల, రావు రమేష్ అందుకు మంచి ఉదాహరణ. ఓ మంచి క్యారెక్టర్ దొరికినప్పుడు నటుడి లైఫ్ దానంతటదే టర్న్ అవుతుంది. అయితే ఒకటి. నేను సినిమాల కోసం సీరియళ్లను వదిలేసుకోవాలని అనుకోవడం లేదు. నేనెవరో అందరికీ చెప్పిందీ, నాకింత పేరు తెచ్చిందీ టీవీయే కదా! సినిమాలు హీరో చుట్టూ తిరిగితే... సీరియళ్లు హీరోయిన్ చుట్టూ తిరుగుతాయి. మరి సీరియల్ హీరోగా మీకెంత ప్రాధాన్యత ఉంది? సీరియల్ అంటే కుటుంబ కథ. వాటిలో కనిపించే పాత్రలన్నీ తమ ఇళ్లలోనే కనిపిస్తుంటాయి అందరికీ. ప్రతి ఇంటికీ ఇల్లాలు ముఖ్యం. అందుకే హీరోయిన్ పాత్రకి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలా అని మిగతా సభ్యులంతా లేకపోతే కుటుంబం అవ్వదు. సందర్భాన్ని బట్టి ఒక పాత్ర బరువవుతుంది. ఓ పాత్ర తేలికవుతుంది. అంతే తప్ప ప్రాధాన్యత లేకపోవడం అంటూ ఉండదు. ఒకవేళ సీరియల్లో సడెన్‌గా ఓ పాము ఎంటరయ్యిందనుకోండి. దానివల్ల టీఆర్పీ పెరిగితే పాము ప్రధాన పాత్రగా మారిపోతుంది. దాన్ని మిగతావాళ్లంతా అంగీకరించి తీరాలంతే. ఇండస్ట్రీలో మహిళలకు ఇబ్బందులున్నాయనేది అందరూ ఒప్పుకునే వాస్తవం. మరి మగవాళ్లకి? ఎదిగే క్రమంలో సమస్యలు అందరికీ ఉంటాయి. అధిగమించుకుంటూ వెళ్తేనే సక్సెస్. నా వరకూ నన్ను ఇబ్బంది పెట్టే విషయమైతే రూమర్స్. ఎవరితో కాస్త క్లోజ్‌గా ఉన్నా వాళ్లతో ముడిపెట్టేస్తారు. అంతకాలం కంటిన్యుయస్‌గా ఓ హీరోయిన్‌తో పని చేస్తున్నప్పుడు కాస్త స్నేహం ఏర్పడుతుంది. చనువుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. దానికి విపరీతార్థాలు తీసి, దారుణంగా కామెంట్లు చేయడం బాధనిపిస్తుంది. (నవ్వుతూ) పైగా నేను ఇద్దరు హీరోయిన్లు లేకుండా ఇప్పటి వరకూ ఏ సీరియల్ చేయలేదేమో... ఈ పుకార్ల బాధ కాస్త ఎక్కువే. వాటికి మీ ఇంట్లోవాళ్ల స్పందన? నా భార్య శ్రీలేఖ యాంకర్. కాబట్టి తనకు ఇలాంటివన్నీ తెలుసు. సో, ప్రాబ్లెమ్ లేదు. వేరే సీరియల్స్ చూస్తారా? మీ కాంటెంపరరీస్లో మీకు నచ్చే నటుడు ఎవరు? ‘వరూధినీ పరిణయం’ చాలా నచ్చుతుంది నాకు. రెండు వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్న భార్యాభర్తల జీవితాలను ముడివేసి చూపించే విధానం చాలా బాగుంది. అలాగే హిందీలో ‘బాలికావధు’, ‘ఆనంది’ క్యారెక్టర్ని బ్యాలెన్స్డ్గా చూపించే తీరు అద్భుతం. ఇక హీరోలంటారా... వాళ్ల పరిధి మేరకు అందరూ బాగానే చేస్తారు. ఎవరి స్టైల్ వారిది. డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? సీరియళ్లలో లేదు కానీ సినిమాల్లో ఉంది. ‘సాగర సంగమం’లో కమల్‌గారి పాత్ర లాంటిది చేయాలి. నిజానికి ఆయన చేసే పాత్రలు ఆయన మాత్రమే చేయగలరు. అంత గొప్పగా మరెవరూ చేయలేరు. అంతలో కొంత చేయగలిగితే చాలు... నటుడిగా జీవితం ధన్యమైనట్టే. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీని చూస్తున్నారు. ఇక్కడ ఏదైనా మారాల్సి ఉందని మీకనిపిస్తోందా? డబ్బింగ్ సీరియల్ సంస్కృతి మారాలి. ఒక్క సీరియల్ మీద కనీసం ఓ యాభై కుటుంబాలు ఆధారపడి జీవిస్తాయి. ఓ సీరియల్‌ని డబ్ చేసే బదులు రీమేక్ చేస్తే ఆ యాభై కుటుంబాలూ కడుపు నిండా తిండి తింటాయి. అది పట్టించుకోకుండా టపటపా ఇతర భాషా సీరియళ్లను దించేస్తున్నారు. ఇది ఆగాలి. నటన... బిజినెస్... ఇవేనా, ఇంకేమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా? ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చిన్న చిన్న పిల్లలు బిచ్చమెత్తుకుంటుంటే మనసు అదోలా అయిపోతుంది. వాళ్ల కోసం ఏదైనా చేయాలని ఉంటుంది. కానీ నా ఒక్కడి వల్లే అది సాధ్యం కాకపోవచ్చు. ప్రభుత్వం అందుకు పూనుకోవాలి. నిజంగా వాళ్లు ఏదైనా చేస్తే... అందులో పాలు పంచుకునే మొదటివాణ్ని నేనే అవుతాను. - సమీర నేలపూడి -
మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు...
సినిమా పేరు : పట్నం వచ్చిన పతివ్రతలు (1982) డెరైక్ట్ చేసింది : మౌళి సినిమా తీసింది : అట్లూరి రాధాకృష్ణమూర్తి, కొమ్మన నారాయణరావు మాటలు రాసింది : జంధ్యాల-కాశీ విశ్వనాథ్ పిండి కొద్దీ రొట్టె అంటారు. కానీ నూతన్ ప్రసాద్‌కి ఇంత పిండి ఇచ్చినా అంత రొట్టె చేసేవాడు. అదీ చాలా రుచికరంగా. పాత్ర చిన్నదా పెద్దదా అనేది చూసుకునేవాడు కాదు. తన పేరుకి తగ్గట్టే నూతనత్వం కోసం తపించేవాడు. అది హీరో కావచ్చు. విలన్ కావచ్చు. కేరెక్టర్ ఆర్టిస్టు కావచ్చు.కమెడియన్ కావచ్చు... ఏదైనా నూతన్‌ప్రసాద్ యాక్ట్ చేస్తే ఆ పాత్రలకో దర్జా. ఈ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చేసిన చాలా పాత్రలు ఎవర్గ్రీన్. అసలే కామెడీ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందిప్పుడు... ఈ టైమ్‌లో నూతన్‌ప్రసాద్‌ని ఓసారి స్మరించుకోవాల్సిందే! హిట్ క్యారెక్టర్ అసలు పేరు : తాడినాడ దుర్గా సత్యవరప్రసాద్ పుట్టింది : 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో తొలి చిత్రం : నీడలేని ఆడది (1973) ఆఖరి సినిమా : రాజు-మహరాజు (2009) మొత్తం చిత్రాలు : సుమారు 500 మరణం : 2011 మార్చి 30 టాప్ టెన్ మూవీస్ 1. అందాల రాముడు (1973) 2. చలి చీమలు (1975) 3. రాజాధిరాజు (1980) 4. పట్నం వచ్చిన పతివ్రతలు (1982) 5. సుందరి సుబ్బారావు (1984) 6. అహ నా పెళ్లంట (1987) 7. {పజాస్వామ్యం (1987) 8. నవభారతం (1988) 9. బామ్మ మాట-బంగారు బాట (1989) 10. వసుంధర (1992) మన రాష్ట్రంలో ఎంతమంది పోలీస్ ఇన్స్పెక్టర్లు ఉంటారు? లెక్క తెలీదు కానీ... వాళ్లందర్నీ ఓ చోట నిలబెడితే ఒకే ఒక్కడు మాత్రం చాలా స్పెషల్‌గా కనబడతాడు. ఆ ఒక్కడే - బెల్లం అప్పారావ్. మన రాష్ట్రపతి - ప్రధానమంత్రి - మిలట్రీ ఛీఫ్ - వీళ్లెవరూ కూడా దేశం గురించి ఇతను ఆలోచించినంత ఎక్కువ ఆలోచించరు. ప్రతి రోజు - ప్రతి గంట - ప్రతి నిమిషం - ప్రతి క్షణం - ఈ దేశం గురించి తెగ ఫీలైపోతుంటాడు. టెన్షన్ పడిపోతుంటాడు. ఆగమాగమైపోతుంటాడు. దేన్నైనా దేశంతో ముడిపెట్టేస్తుంటాడు. అందర్నీ ఇరకాటంలో పెట్టేస్తుంటాడు. శాంపిల్ సీన్ నం. 1 ఓ లాడ్జి ముందు పోలీస్ వ్యాన్ ఆగింది. మన స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ అండ్ ఎనర్జిటిక్ అండ్ పేట్రియాటిక్ ఇన్స్పెక్టర్ బెల్లం అప్పారావ్ దిగాడు. అతని వెనుకే అయిదుగురు కానిస్టేబుళ్లు. ‘‘కానిస్టేబుల్.. మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు. వ్యభిచారమనేది రాన్రానూ ఎక్కువైపోతోంది. మీరు ఈ లాడ్జిలోని ప్రతి రూమూ, ప్రతి మంచం, ప్రతి దుప్పటి, ప్రతి తలగడ చెక్ చేసి ఆడకూతురు కనిపిస్తే చాలు వ్యానెక్కించేయండి... అంతే’’ అని ఆర్డరేశాడు. కానిస్టేబుళ్లు లాడ్జిని అణువణువూ గాలించేస్తున్నారు. ఆ లాడ్జికొచ్చేవాళ్లకి మాలిష్ చేసే కొండల్రావ్ వచ్చి చాలా వినయంగా ‘‘దండాలండీ ఇన్స్పెక్టర్ గారూ’’ అన్నాడు. ‘‘దండలకు, దండాలకు లొంగే మనిషిని కాను నేను. ఎందుకంటే... దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు. లొంగకూడదు’’ అన్నాడు బెల్లం అప్పారావ్ చాలా సీరియస్‌గా. ‘‘మన దేశ పరిస్థితుల్లాగే తమరి తల కూడా పెనం మీద వేసిన పెసరట్టులాగా కుతకుతలాడిపోతోంది. 5 నిమిషాలు మాలిష్ చేశానంటే హెడ్ అంతా కూలింగ్ అయిపోద్ది’’ అంటూ కొండల్రావ్ చాలా నాజూగ్గా మాటల్లోకి దించి మాలిష్ చేయడానికి సిద్ధమయ్యాడు. ‘‘నేనిప్పుడు డ్యూటీ మీదున్నా. డ్యూటీలో ఉన్నప్పుడు మాలిష్ చేయించుకుంటే అమెరికా, రష్యా వాళ్లు ఏమనుకుంటార్రా ఇడియట్’’ అని తిట్టినంత పని చేశాడు బెల్లం అప్పారావ్. అయినా కొండల్రావ్ తగ్గలేదు. ఇన్స్పెక్టర్కి మాలిష్ చేసి, ఎంతో కొంత నొక్కేయాలి.‘‘రెండో కంటోడికి తెలీకుండా ఆ మూల సోఫా మీద కూర్చోబెట్టి మాలిష్ చేసేస్తా రండి’’ అంటూ ఇబ్బంది పెట్టేసి మరీ బెల్లం అప్పారావ్‌ని పక్కకు తీసుకెళ్లాడు. తన టోపీ పక్కన పెట్టి హెడ్‌ని కొండల్రావ్కి అప్పగించాడు బెల్లం అప్పారావ్. కొండల్రావ్ చాలా ఒడుపుగా మాలిష్ చేస్తున్నాడు. ‘‘మీలాంటి ఖరీదైన బుర్రకాయల్ని కొబ్బరికాయల్లాగా వదిలేయకుండా, అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి. ఎంచేతంటారా? దేశానికి ఢిల్లీ ఎలాంటిదో... మన బాడీకి తలకాయ అలాంటిదండీ’’ చెప్పాడు కొండల్రావ్. ‘‘నాదసలే తూగోజీ... కాకినాడ. పది ఢిల్లీలతో సమానం’’ గర్వంగా చెప్పాడు బెల్లం అప్పారావ్. మాలిష్ పూర్తయింది. కొండల్రావ్ చేతులు నలుపుకోవడం చూసి ‘‘ఏంటి చేతులు నలుపుకుంటున్నావ్? డబ్బులా? అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు. డబ్బులడగకూడదు... తీసుకోకూడదు’’ అని తన నెత్తి మీద టోపీ పెట్టుకుని మళ్లీ డ్యూటీకి సిద్ధమైపోయాడు ఇన్స్పెక్టర్ బెల్లం అప్పారావ్. కొండల్రావ్ మహాముదురు. ఈ ఇన్స్పెక్టర్ దగ్గర ఎలా డబ్బులు వసూలు చేయాలో బాగా తెలుసు. ‘‘అయ్యా.. విషయం చెప్పడం మరిచిపోయా. మీకు డీఎస్పీగా ప్రమోషనొచ్చినట్టు కలొచ్చింది’’ అన్నాడు కొండల్రావ్. దాంతో బెల్లం అప్పారావ్ ఖుష్ అయిపోయి, జేబులోంచి డబ్బులు తీసిచ్చేశాడు. కొండల్రావ్ ఆ డబ్బుని ముద్దు పెట్టుకుంటూ ‘‘బాబూ... మీ తలకాయను జాగ్రత్తగా చూస్కోండి’’ అన్నాడు. ‘‘నా తలకాయకు ఎటువంటి డేంజరూ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాన్నేను’’ అంటూ తన సీక్రెట్ చెప్పేశాడు బెల్లం అప్పారావ్. ఈలోగా కానిస్టేబుల్స్ వచ్చి ‘‘సార్... ఆడంగులెవరూ లేరు’’ అన్నారు. బెల్లం అప్పారావ్ ఆశ్చర్యపోతూ ‘‘వ్వాట్... ఒక్కరు కూడా దొరకలేదా? పోయినసారొచ్చినపుడు నలుగురు ఆడకూతుళ్లు దొరికారు. ఈసారి ఒక్కళ్లూ దొరకలేదంటే... దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట. పదండి... మనమే వ్యాన్ ఎక్కుదాం’’ అంటూ లాడ్జిలోంచి బయటకు దారి తీశాడు. శాంపిల్ సీన్ నం. 2 మాలిష్ కళాకారుల సంఘం మీటింగ్. చాలా వేడివేడిగా జరుగుతోంది. కొండల్రావ్ తమ జాతినుద్దేశించి చాలా ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు. అందరూ విప్లవానికి సన్నద్దం కావాలని ఉత్తేజపరుస్తున్నాడు. దాంతో అందరూ చప్పట్లు కొట్టారు. సరిగ్గా అదే టైంలో ఎంటరయ్యాడు బెల్లం అప్పారావ్. ‘‘ఆపండి... ఇది చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ కూర్చోవాల్సిన సమయం కాదిది. అసలే మన దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. లెఫ్ట్ నుంచి చైనా... రైట్ నుంచి పాకిస్థాన్... ఫ్రంట్ నుంచి వరదలు... బ్యాక్ నుంచి కరువులు... మన దేశాన్ని పట్టుకుని పీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మాలిష్ చేసే మీరు కూడా విప్లవం లేవదీస్తే - అమెరికా, రష్యా వాళ్లు ఏమనుకుంటారు మన గురించి? ఎద్దేవా చేస్తారు’’ అంటూ బెల్లం అప్పారావ్ బాగా క్లాస్ పీకి, వాళ్లందర్నీ అరెస్ట్ చేసి పారేశాడు. శాంపిల్ సీన్ నం. 3 అరెస్టయిన వాళ్లలో ఓ అమ్మాయి గర్భవతి. వెంటనే క్లాసు పీకడం మొదలెట్టాడు బెల్లం అప్పారావ్. ‘‘అసలే మన దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందిప్పుడు. ఇలాంటి టైమ్‌లో పిల్లల్ని కనకూడదు. అయినా తొలి కాన్పు కాబట్టి అమెరికా, రష్యాలు ఏమీ అనుకోవు. మగబిడ్డ పుడితే నాలా ఇన్స్పెక్టర్ని చేయ్. ఆడబిడ్డ పుడితే ఇన్స్పెక్టర్కిచ్చి పెళ్లి చేయ్’’ అనేసి వెళ్లిపోయాడు. అసలు పిల్లల్ని కనడానికీ - అమెరికా, రష్యాకీ సంబంధం ఏమన్నా ఉందా? మోకాలికీ బోడిగుండుకీ లింకు పెట్టడమంటే ఇదేనేమో! అసలీ బెల్లం అప్పారావ్కి పెళ్లయిందా? పెళ్లయినా పిల్లలున్నారా? పిల్లలుంటే స్కూలుకెళ్తున్నారా? ఇవన్నీ తెలుసుకోవాలనిపిస్తోంది కదూ. అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ టైమ్‌లో ఇవన్నీ మనకవసరం అంటారా? హ్యాపీగా మాలిష్ చేయించుకుని బుర్ర ఫ్రెష్ చేయించుకోక... - పులగం చిన్నారాయణ ఈ ఇన్స్పెక్టర్ పాత్రకు అతనే ఇన్స్పిరేషన్! నేను వైజాగ్ పోర్ట్‌ట్రస్ట్ ఆఫీసులో కొన్నేళ్లు ఉద్యోగం చేశా. అక్కడ భాస్కర్‌రావు అని ఒకతను ఉండేవాడు. మొత్తం దేశం భారమంతా తన మీద ఉన్నట్టుగా, ఎప్పుడో ఏదో ఒకటి గొణుక్కుంటూ తెగ బిల్డప్లిచ్చేవాడు. అతని ఇన్స్పిరేషన్తో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర అనుకుని ‘అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు...’ అనే ఊతపదం పెట్టా. ఓ రోజు నిర్మాత విజయ బాపినీడు గారిని కలవడానికెళ్తే ఆయన చాలా సీరియస్ మూడ్‌లో ఉన్నారు. ‘‘నాలుగు జోకులు చెప్పండి’’ అనడిగితే నేను ఈ ఇన్స్పెక్టర్, మాలిష్ కేరెక్టర్లను యాక్ట్ చేసి సరదాగా చూపించా. ఆయనకు విపరీతంగా నచ్చేసింది. అప్పటికప్పుడు బీరువాలోంచి ఓ స్క్రిప్టు తీశారు. ఓ కన్నడ సినిమా ఆధారంగా రెండేళ్ల క్రితం ఆయన, జంధ్యాలగారు కలిసి ఓ స్క్రిప్టు చేశారు. ఎందుకో నచ్చక పక్కన పెట్టేశారట. ‘‘ఈ రెండు కేరెక్టర్లనీ ఇందులో పెట్టి ఈ స్క్రిప్టుతో వెంటనే సినిమా చేద్దాం’’ అన్నారు విజయ బాపినీడు. అలా ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ మొదలుపెట్టారు. ై డెలాగ్స్ నేనే రాశా. ఇన్స్పెక్టర్ పాత్రకు నూతన్‌ప్రసాద్‌ని అనుకున్నారు. మా ఇంటికొచ్చి కేరెక్టర్ గురించి మొత్తం తెలుసుకున్నాడు. ఆ ఇన్‌పుట్స్‌ని బేస్ చేసుకుని తన బాడీలాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్కి తగ్గట్టుగా బ్రహ్మాండంగా మౌల్డ్ చేసేసుకున్నాడు నూతన్‌ప్రసాద్. ఈ ఇన్స్పెక్టర్ పాత్రకు మేం ప్రత్యేకంగా పేరు పెట్టలేదు. కానీ కాస్ట్యూమ్ మీద నేమ్ ప్లేట్లో బెల్లం అప్పారావు అని ఉంటుంది. అదే ఉంచేశాం. ఈ ఇన్స్పెక్టర్ పాత్ర సూపర్ డూపర్ హిట్. తర్వాత ఇదే పాత్రను మగమహారాజు, మగధీరుడు, హీరో, కృష్ణగారడి, దొంగకోళ్లు, దొంగల్లో దొర... ఇలా తొమ్మిది సినిమాల్లో కంటిన్యూ చేశాం. ఇదో రికార్డు కూడా. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ లోని నూతన్‌ప్రసాద్, రావుగోపాలరావుల డైలాగ్స్ - క్యాసెట్ రూపంలో కూడా వచ్చాయి. - కాశీ విశ్వనాథ్, రచయిత -
డబ్బు, స్టైలేకాదు.. ముందు విలువలుండాలి
ముంబయి: ఓ వ్యక్తి చూడ్డానికి చక్కగా కనిపించొచ్చు.. బాగా డబ్బు కలిగుండొచ్చు ఇంకా స్టైల్‌గా కూడా ఉండవచ్చు కానీ.. అలాంటి వ్యక్తికి మాత్రం మంచి ప్రవర్తన ఉండదని, ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా సరిగా తెలిసి ఉండదని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా అంది. తనది మంచి వ్యక్తిత్వం అనుకునే ప్రతి వ్యక్తి అది వాస్తవ జీవితంలోనూ, సామాజిక అనుసంధాన వేదికల్లోనూ ఒకే మాదిరిగా ఉండాలని చెప్పారు. ట్విట్టర్లో ఆమె ఆదివారం వాస్తవ జీవితంలో, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తుల ప్రవర్తనలు, నడుచుకునే తీరు అనే అంశంపై చర్చ జరిపారు. చూడ్డానికి గొప్పగా కనిపించేవారి ప్రవర్తన తీరు సరిగా లేకుంటే ఇంకే ఉన్నా వ్యర్థమే అని చెప్పారు. సాధారణంగా జీవిస్తూ దయాగుణంతో, ఎదుటి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషంగా బతికేయాలని సెలవిచ్చింది ఈ అమ్మడు. అంతేకాకుండా చిన్నారులు కూడా విలువలు మర్చిపోతున్నారని, భారత్‌లో మెయిడ్ కల్చర్ పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
బొమ్మన్ అదిరింది
దుస్తులు మార్చినంత ఈజీగా ఎక్స్ప్రెషన్లు మార్చేస్తాడు! సూర్యుడు తొంగిచూసినంత ఈజీగా చిరునవ్వులు పొంగిస్తాడు! మబ్బు తెర వేసినంత ఈజీగా కన్నీరు తెచ్చేస్తాడు! మంచినీళ్లు గ్లాసులో పడినంత ఈజీగా క్యారెక్టర్లోకి పడిపోతాడు! ఇరానీకి అదెలా సాధ్యం? జీవితం చాలా డిఫికల్ట్ అయ్యేటప్పటికి... సినిమా ఈజీ అయిపోయింది అంటాడు. బికాజ్ లైఫ్ ఈజ్ సినిమా, అండ్ ‘బొమ్మ’న్ ఈజ్ దేర్! నా కెరీర్ టాప్ 5 మై వైఫ్స్ మర్డర్ - 2005 ఖోస్లా కా ఘోస్లా - 2006 లగేరహో మున్నాభాయ్ - 2006 3 ఇడియట్స్ - 2009 వెల్డన్ అబ్బా - 2010 హిందీలో మీరు బిజీ. ఇక్కడ చేయాలనెందుకనుకున్నట్లు? నటుడనేవాడు అన్ని ఎక్స్పరిమెంట్లూ చేయాలి. బొంబాయిలోనే ఉంటే- వియ్ గెట్ ఇన్టు ఎ కంఫర్ట్ జోన్. మనలోని బెస్ట్ వర్క్ బయటకు రావాలంటే, ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజ్ తీసుకోవాలి. ఆ ఆకలి ఉంటే, ప్రతిరోజూ ఏదో కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తాం. ఇంతకీ, తెలుగులోకి రావడం ఎలా జరిగింది? గతంలో సౌత్ నుంచి 3 -4 ఆఫర్లు వచ్చినా, తీరిక లేక చేయలేకపోయా. దర్శక - రచయిత త్రివిక్రమ్ ఒకసారి ఫోన్ చేసి, ‘అత్తారింటికి దారేది’ స్క్రిప్ట్ చెప్పారు. ఆయన కథ చెప్పడం మొదలుపెట్టగానే, ‘దిస్ మ్యాన్ నోస్ హిజ్ సినిమా’ అనిపించింది. సినిమా మీడియమ్, ప్రపంచ సినిమా, సాహిత్యం, తీయనున్న కథ గురించి స్పష్టమైన అవగాహన ఉన్న దర్శకుడని అర్థమైంది. అలా రఘునందన్ పాత్ర చేశా. ‘అత్తారింటికి...’ అంత హిట్టయినా, వేరే ఏమీ చేయలేదేం? ఆఫర్లొచ్చాయి. కుదరలేదు. ఆ మధ్య దర్శక - రచయిత సంపత్ నంది బొంబాయికొచ్చారు. వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్... స్టోరీ కా బేసిక్ స్ట్రక్చర్ బోల్దియా! నాకు నచ్చింది. ఆ తరువాత ‘బెంగాల్ టైగర్’ టోటల్ స్క్రిప్ట్ చెప్పారు. రెండు గంటలు కూర్చొని, కబుర్లు చెప్పుకున్నాం. అతనితో మంచి బంధం ఏర్పడింది. నటిస్తున్నా. మళ్ళీ హైదరాబాద్, ‘బెంగాల్‌టైగర్’ అనుభవమెలా ఉంది? గౌరవంగా చూసే దర్శక, నిర్మాతల మంచి యూనిట్ ఇది. సంపత్ నంది వెరీ యాక్టివ్ మైండ్. హి కమ్స్ ప్రిపేర్డ్ ఫర్ ది సెట్. ఒక్కోసారి సెట్లో అనుకున్నదేదో చేయడానికి చటుక్కున ఇబ్బంది వస్తే, ఒకటికి నాలుగు కొత్త ఐడియాస్తో ముందుకొస్తాడు. ఇందులో నాది అశోక్ గజపతి అనే పవర్ఫుల్ విలన్ పాత్ర. దీనికి అంతకు అంత పవర్‌ఫుల్‌గా ఉంటాడు హీరో. అయామ్ ఎంజాయింగ్ వర్క్. తెలుగు ఇండస్ట్రీ గురించి మీ ఒపీనియన్? ఇక్కడివాళ్ళు పొలైట్. సిస్టమేటిక్. కష్టపడి పనిచేస్తారు. బొంబాయి సినీ పరిశ్రమలోనూ ఇప్పుడు ఆర్గనైజ్డ్గా పనిచేస్తున్నారు. పంక్చువల్‌గా ఉంటున్నారు. రెండు ఇండస్ట్రీలకీ పెద్ద తేడా ఏమీ లేదు. మంచి సినిమాలు చేయాలనే తపన కనపడుతోంది. మరి వచ్చిన ఛాన్స్‌ను అంగీకరించే ముందు ఎలాంటి అంశాలు చూస్తారు? కథా, హీరోనా? దర్శకుడా? సంస్థా? (నవ్వేస్తూ...) వాటన్నిటి కన్నా ముందు నాకు ఆ మనుషులు, ఆ వాతావరణం, వారి ప్రవర్తన కంఫర్టబుల్‌గా ఉండాలి. మనుషులు ఫ్రెండ్లీగా ఉండాలి. గర్వంతో, అహంకారంగా ప్రవర్తించేవాళ్ళతో నేను పనిచేయలేను. కాబట్టి, ఎవరితో పనిచేస్తున్నాను, ఎలాంటి యూనిట్ అనే విషయంలో నేను పర్టిక్యులర్. అదృష్టవశాత్తూ, ‘అత్తారింటికి దారేది’ టీమ్ కానీ, ‘బెంగాల్ టైగర్’ టీమ్ కానీ చాలా కంఫర్టబుల్. కానీ తెలియని భాష డైలాగ్సతో ఎడ్జస్టవడమెలా? కో-డెరైక్టర్ దగ్గర ముందు రోజే సీన్ మొత్తం తెలుసుకుంటా. మొత్తం సీన్ వివరించాక, నా డైలాగులను ఇంగ్లీష్‌లో అడిగి, విషయం అర్థం చేసుకుంటా. ఆ తరువాత తెలుగు కల్చర్‌కి దగ్గరగా వెళ్ళడం కోసం హిందీలో తెలుసుకుంటా. అర్థం, భావం తెలిశాక, అప్పుడు తెలుగు డైలాగ్‌ను హిందీ స్క్రిప్ట్‌లో రాసుకొని, ఎలా పలకాలో ప్రాక్టీస్ చేస్తా. దానివల్ల కెమేరా ముందు ఏదో ‘వన్... టూ త్రీ’ అనకుండా సరిగ్గా డైలాగ్ చెప్పగలుగుతున్నా. అంత శ్రమ పడకుండానే కొందరు నటిస్తున్నారుగా! అర్థం చేసుకోకుండా, నంబర్లంటూ నటించడమంటే, స్థానిక పరిశ్రమనూ, సంస్కృతినీ, భాషనూ అవమానించడమన్న మాటే! భాష, భావం అర్థం చేసుకుంటేనే నటన ట్రూత్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకనే, ఇంత శ్రమపడతా. ఏదో ఒక రోజున తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని నా కోరిక. భాషకు కోచ్‌ను పెట్టుకోవాలని ఉంది. అన్నట్లు మీరు వాయిస్ ఆర్టిస్ట్‌గానూ పనిచేసినట్లున్నారు! అవును. ‘ఢిల్లీ సఫారీ’ (2012)లో ఎలుగుబంటి పాత్ర సహా కొన్ని యానిమేషన్ చిత్రాల్లో గాత్రదానం చేశా. అంధుల కోసం చేసిన ఒక పబ్లిక్ సర్వీస్ ఫిల్మ్‌లో కుక్క పాత్రకు గాత్రమిచ్చా. జె.ఆర్.డి. టాటా అఫిషియల్ బయోగ్రఫీ ‘బియాండ్ ది లాస్ట్ బ్లూమౌంటెన్’ లాంటి కొన్ని ఆడియో బుక్స్ నా వాయిస్‌లో చదివా. వాయిస్ ఆర్టిస్ట్ కన్నా ముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా మీ కృషి? ఫొటోగ్రాఫర్‌గా చేస్తున్న నన్ను రంగస్థల ప్రముఖుడు శ్యామక్ దవర్ అటు లాగారు. అలెక్ పదమ్సీ ‘రోష్నీ’తో అక్కడ మొదలుపెట్టా. ‘ఫ్యామిలీ టైస్’లో డబుల్ రోల్ చేశా. ‘అయామ్ నాట్ ర్యాపోపోర్ట్’లో 34 ఏళ్ళకే 75 ఏళ్ళ వాడి వేషం వేశా. ‘అయామ్ నాట్ బాజీరావ్’, ‘మహాత్మా వర్సెస్ గాంధీ’ నాటకంలో గాంధీ పాత్ర ఎంతో పేరు తెచ్చాయి. ఇలా దాదాపు 14 ఏళ్ళ పాటు నాటకాలు వేశా. ఆ ఎక్స్‌పీరియన్సే నాకు ఒక యాక్టింగ్ స్కూల్ అనుభవం. రంగస్థల అనుభవం సినిమాల్లో ఏ మేరకు పనికొచ్చింది? రంగస్థలంపై పని చేయడానికి చాలా డిసిప్లిన్ కావాలి. దానివల్ల సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా టైమ్ పాటించడం, వాయిస్‌ను బాగా ఉపయోగించడం, మొత్తం స్క్రీన్‌ప్లేను అవగాహన చేసుకోవడం, పాత్ర స్వభావాన్నీ, పరిధినీ అర్థం చేసుకోవడం లాంటివి అలవాటవుతాయి. రంగస్థల అనుభవంతో వచ్చినవాళ్ళు తోటి నటీనటుల్ని కూడా తమ ఎడ్వాంటేజ్కు తగ్గట్లు వాడుకోగలుగుతారు. సినీ యాక్టర్‌గా లేటు వయసులో పెద్ద బ్రేక్ వచ్చినట్లుంది? నిజమే. రంగస్థలం మీద నన్ను చూసి, హ్యాండీ కామ్‌తో తీసిన ‘లెటజ్ టాక్’ అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌లో నాతో నటింపజేశారు. ఆ టైమ్‌లోనే ఒకసారి దర్శక - నిర్మాత విధు వినోద్చోప్రా నన్ను చూసి, ‘వచ్చే ఏడాది డిసెంబర్‌కు నీ డేట్స్ కావాలి’ అంటూ, రెండు లక్షలకు చెక్ ఇచ్చారు. నాకు అర్థం కాలేదు. ఆ తరువాత ఆరు నెలలకు ఫోన్ వచ్చింది. అదే ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’. అలా 44 ఏళ్ళ వయసులో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ పదకొండేళ్ళలో ఈ స్థాయికి వచ్చా. అయితే, నా దృష్టిలో ఎవరూ రాత్రికి రాత్రి సక్సెస్ కారు. ఇవాళ్టి సక్సెస్ వెనక ఒక జీవితకాలపు శ్రమ ఉంటుంది. మీరు కూడా వెయిటర్‌గా మొదలై ఎన్నోచేసి నటుడయ్యారు. (నవ్వేస్తూ...) నేనూ అనుకోలేదు. హోటల్లో వెయిటర్‌గా మొదలుపెట్టా. అక్కడ వినయం నేర్చుకున్నా. బేకరీ షాప్‌లో ఉన్నప్పుడు కస్టమర్లను చూసి మానవ స్వభావం స్టడీ చేశా. ఫొటోగ్రాఫర్‌గా లైటింగ్, మూడ్ తెలుసుకున్నా. రంగస్థలంలో నటన తెలిసింది. ఇప్పుడు సినిమాల్లో ఉన్నా. రేపేమిటో తెలియదు. ఇదో కంటిన్యుయస్ జర్నీ. సీరియస్, కామెడీ, విలనీ - ఇలా అన్నీ చేశారు. ఏది కష్టం? ఏ భావమైనా, బాగా పలికించడం ముఖ్యం. అందుకోసం బాగా ప్రిపేర్ అయిన వారికి, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. ‘3 ఇడియట్స్’లో ఫన్నీగా చేశా. ‘లగే రహో మున్నాభాయ్’లో చాలా జాలీ క్యారెక్టర్. ‘అత్తారింటికి...’లో సీరియస్ పాత్ర. ఇప్పుడిందులో విలన్. ఒక్కోటీ ఒక్కో రకం. అందుకే, ఎన్ని సినిమాలు చేశానో లెక్కపెట్టుకోలేదు. బ్యాటింగ్ కర్తే జా రహా( హూ(. మరాఠీలోనూ చేస్తా. {పస్తుతం దక్షిణాది భాషల్లో ఏమైనా ఆఫర్లున్నాయా? తమిళ్లో ఆఫర్లు వస్తున్నాయి. ఏదీ సెట్ కాలేదు. తాజాగా మలయాళంలో ఆఫరొచ్చింది. హిందీలో ‘హౌస్‌ఫుల్-3’ చేస్తున్నా. షారుఖ్‌తో ‘దిల్వాలే’ చేయడం ఎగ్జైటింగ్‌గా ఉంది. ఏమైనా, తెలుగు సినిమా, ఇక్కడి ప్రజలు నన్ను తమ వాణ్ణి చేసుకున్నారు. అయావ్‌ు హానర్డ. అమ్మే... సినిమాలకు పంపేది! నేను అమ్మ కడుపులో ఉండగానే నాన్న మరణించారు. నన్ను పెంచింది అమ్మే! బొంబాయిలో గ్రాంట్ రోడ్డులో మా ఇంటి దగ్గర చాలా హాళ్ళుండేవి. తప్పకుండా చూడాల్సినవన్నీ ఒక లిస్ట్ రాసి, మా అమ్మే నన్ను ఆ సినిమాలకు పంపేది. ఒక్కొక్క శాఖ పనినీ గమనించేందుకు ప్రతి సినిమా అయిదారుసార్లు చూడమనేది. అలా ఎన్ని క్లాసిక్స్ చూశానో! శివాజీగణేశన్ ‘నవరాత్రి’, ఎన్టీఆర్, ఏయన్నార్ ఫిల్మ్స్ చాలా చూశా. అమ్మకిప్పుడు 87 ఏళ్ళు. నాదగ్గరే ఉంటుంది. బేకరీలో... మా ప్రేమకథ! అప్పట్లో మాకు ‘గోల్డెన్ వేఫర్స్’ అనే చిన్న బేకరీ షాపుండేది. అమ్మకు ఒంట్లో బాగా లేనప్పుడల్లా నేను షాపులో కూర్చొనేవాణ్ణి. బేకరీలో కొనుక్కోవడానికి జెనోబియా రోజూ వచ్చేది. అక్కడే మా ప్రేమ పుట్టింది. మాది చాలా సింపుల్, పాత తరహా ప్రేమకథ. ఆమె రోజూ వచ్చేది. నాకు 22 ఏళ్ళప్పుడు మా పెళ్ళయింది. మా పిల్లలు దనేష్, కయోజ్ ఇరానీ - ఇద్దరూ ఇప్పుడు సినీ రంగంలోనే ఉన్నారు. మా అమ్మ తరువాత నేను అంత ప్రేమించేది మా ఆవిణ్ణే. మనసుకు నచ్చనిది రాయడు!! నా ఫేవరెట్ డెరైక్టర్లంటే రాజు హిరానీ, ఫరాఖాన్. రాజు హిరానీ, నేను ఒకేసారి కెరీర్లు ప్రారంభించాం. మేమిద్దరం ఒకరి నుంచి మరొకరం నేర్చుకున్నాం. రాజు హిరానీలోని గొప్పతనం ఏమిటంటే, తన మనసుకు నచ్చనిదేదీ అతను కాగితం మీద పెట్టడు. చివరకు ఆయన రాసే హ్యూమర్ కూడా హృదయంలో నుంచి వచ్చినదే! ఫరాఖాన్ ఏమో ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంలో దిట్ట. అదే సమయంలో ఆమె సినిమాల్లో బోలెడంత ఎమోషన్ ఉంటుంది. - రెంటాల జయదేవ -
ఉత్తముడైన గోపీ!
ఒక దశలో తమిళంలో టాప్ హీరోగా వెలుగొందారు సుధాకర్. ఆ తర్వాత తెలుగులోకి ఎంటరయ్యారు. ‘యముడికి మొగుడు’ తర్వాత తన కామెడీతో బాక్సాఫీస్‌ను ‘పిచ్చకొట్టుడు’ కొట్టారు. హీరో ఎవరైనా సరే, అప్పట్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే సుధాకర్ పర్మినెంట్. ‘శుభాకాంక్షలు’లో జగపతిబాబు ఫ్రెండ్‌గా సుధాకర్ తనదైన శైలి ఎక్స్‌ప్రెషన్స్‌తో, డైలాగ్ డెలివరీతో నవ్వులు విరబూయించారు. సినిమా పేరు : శుభాకాంక్షలు (1998) డెరైక్ట్ చేసింది : భీమనేని శ్రీనివాసరావు సినిమా తీసింది : ఎన్.వి. ప్రసాద్,శానం నాగ అశోక్‌కుమార్ మాటలు రాసింది : మరుధూరి రాజా ‘‘గంగా భాగీరథీ సమానుడైన చందూకి... మీ లవింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్‌పాయింట్ పెన్నుతో రాయునది. మీరు క్షేమంగానే ఉన్నారని అనుమానిస్తాను. ముఖ్యంగా మనిషి జన్మకు కావల్సింది మంచి స్నేహితుడు. ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం మీ జన్మజన్మల అదృష్టం.డియర్ చందూ! మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ. అసలే మీ స్నేహితుడు గోపి చాలా ఓపిగ్గా ఉండే వ్యక్తి. ఆయన పక్కన పడుకుని ఆయనను తడపకండి. పెళ్లైనా మీకు దూరంగా ఉండడం వల్ల మీరెంత బాధపడుతున్నారో - పెళ్లి కాకపోయినా గోపీ దూరమై, నేనూ అంతే బాధపడుతున్నాను. మీకు ఇల్లు ఇచ్చిన నాదబ్రహ్మ ‘ఆంధ్రా అన్నమయ్య’ అని రాశారు. ఆయన పాటే అంత బాగుంటే, ఆయనెంత బాగుంటారో కదా అనిపిస్తోంది. ఆయన పాటను క్యాసెట్ చేసి, దాంతోపాటు ఆయన ఫొటో పంపండి. ఫొటో చూస్తూ... పాట వింటూ చచ్చిపోవాలని ఉంది. ఉత్తముడైన గోపీని మరీ మరీ అడిగినట్టు చెప్పండి’’ ఇట్లు నిర్మలా మేరీ చందూ అనబడే ఓ భర్తకు... నిర్మలా మేరీ అనబడే ఓ భార్య రాసిన ఉత్తరం ఇది. ఈ ఉత్తరంలో మీకు ఏం కనిపిస్తోంది? భర్త మీద అనురాగం... ప్రేమ... తొక్క... తోటకూర... ఇవేమీ కనబడడం లేదు కదూ! ఎందుకు కనిపిస్తాయి? పానకంలో పుడక లాగా, బెల్లం జిలేబీలో కారప్పొడి లాగా మధ్యలో ఈ గోపీగాడు కొట్టొచ్చినట్టు, తన్నొచ్చినట్టు కనబడుతుంటే! అసలు ఎవడీ గోపీ? సారీ... ఎవడీ ఉత్తముడైన గోపీ? అయితే మీకు ముందు చందూ గురించి చెప్పాలి. చందు శారీ అయితే, ఈ గోపి బ్లౌజు. ఛీఛీ.. బ్యాడ్ కంప్యారిజన్. చందు ప్యాంటు అయితే, ఈ గోపీ అండర్వేర్. గోపీ లేకుండా చందూ ఎక్కడికీ వెళ్లలేడు.. ఏం చేయలేడు. అలాగని గోపి అరివీర భయంకరుడో, అపర మేధావో అనుకునేరు. గోపీకి బ్రెయినుంది కానీ, అది మోకాలి దగ్గరే ఉందని ప్రపంచంతో పాటు అతనికీ తెలుసు. బోడి సలహాలివ్వడంలో స్పెషలిస్టులకే స్పెషలిస్టు. కొంచెం మీరూ టేస్టు చేయండి... చందు... గోపి... ఇద్దరూ బ్యాచ్లర్సే. మేడ మీద గది. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంటుంది. బాత్రూమ్కు గడియ కూడా ఉండదు. ఎన్నోసార్లు పనిమనిషికి తన దివ్యమంగళ రూపాన్ని ప్రదర్శించేశాడు మన గోపి. ఓసారి వీళ్లను విపరీతమైన ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టేసింది. నెలకు రెండువేలు కూడా అద్దె కట్టలేని పరిస్థితి. అలాంటి సమయంలో ఓ గురకారావు తగులుతాడు. అతను ఎంత రెంట్ ఇచ్చినా ఎవ్వరూ రూమ్ రెంట్కివ్వరు. అంత కిరాతకమైన గురక అతనిది. గోపీకో ఐడియా వచ్చింది. ఆ గురకారావుని బుట్టలో వేసుకుని రూమ్‌లో షేర్ ఇచ్చాడు. అతనొచ్చి రూమంతా తేరిపార చూశాడు. ‘రూమ్‌లో ఫ్యాన్లు లేవా?’ అడిగాడు మొహం అదోలా పెట్టి. ‘‘నేను బాలకృష్ణ ఫ్యాన్‌ని. ఈ చందూగాడు రమ్యకృష్ణ ఫ్యాన్. మన ఇంటి ఓనర్ వాళ్ల పనిమనిషికి ఫ్యాన్... ఇన్ని ఫ్యాన్లుండగా ఇంక కొత్త ఫ్యాన్లెందుకు?’’ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు గోపి. గురకారావుకి బాగా కాలింది - ‘నేను రూమ్లోఉండనంటే ఉండను’ అని తిరుగు టపా కట్టబోయాడు. గోపీ వదులుతాడా... వెంటనే ఓ అస్త్రం వదిలాడు. ‘‘ఇదే రూమ్‌లో కె. రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి ఉండేవారు. వాళ్లెంత పైకొచ్చారో తెలుసు కదా’’ అని చెప్పాడు గోపి. అసలే సినిమా ఫీల్డ్‌లో రైటర్‌గా ట్రై చేస్తున్న ఆ గురకారావు ఆ దెబ్బకు ఫ్లాట్. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు స్టోరీ.. నైట్ టైమ్ స్టార్టయ్యింది. విమానం ఇంజిను మింగేసినట్టుగా ఒకటే గురక. వీళ్లిద్దరికీ నిద్ర కరవు, మనశ్శాంతి కరవు...‘ఇదేంట్రా బాబూ’ అని వాపోయాడు చందు. గోపీకి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. వెంటనే అప్లయ్ చేసేశాడు. గురకపెట్టి నిద్రపోతున్న ఆ గురకారావు పక్కనే పడుకుని, మీద కాలు వేశాడు. ఆ తర్వాత చేయి వేసి హత్తుకున్నాడు. ఈ దెబ్బకు ఆ గురకారావు ఉలిక్కిపడి లేచాడు. గోపీ అదోరకంగా చిలిపిగా చూశాడు. అతగాడు కంగారుపడిపోయాడు. ‘ఏంటి... నువ్వు ఆ టైపా?’ అనడిగాడు. గోపీ కవ్వింపుగా నవ్వుతూ - ‘మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నాం. రా... ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకుందాం’ అని ఆహ్వానించాడు.గురకారావుకి నిద్రమత్తు వదిలిపోయింది. ‘‘అమ్మో... ఇప్పుడు మనసు విప్పి మాట్లాడదామంటావ్. తర్వాత బట్టలు విప్పి మాట్లాడదామంటావ్. నా వల్ల కాదు’’ అని ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తాడు. గోపీ విజయగర్వంతో చందూ వైపు చూశాడు. ఓ ప్రేమ జంటను కలపడం కోసం చందు ఓ ఊరు వెళతాడు. తోడుగా గోపీ కూడా! అక్కడ వీళ్లకు ఎవరూ గది అద్దెకు ఇవ్వరు. చివరకు నానాతంటాలు పడి నాదబ్రహ్మ ఇంట్లో ఆశ్రయం పొందుతారు. ఓ విపత్కర పరిస్థితి నుంచి కాపాడే ప్రయత్నంలో చందూకి పెళ్లయిందని అబద్ధం చెబుతాడు గోపి. దాన్ని కవర్ చేయడం కోసం తనే నిర్మలా మేరీ పేరుతో చందూకి ఉత్తరాలు రాస్తుంటాడు. ఆ ఉత్తరాల నిండా చందు యోగక్షేమాల కన్నా తన గొప్పతనాన్ని పొగుడుకోవడమే సరిపోతుంది. ఓ రోజు - ఇలా దొంగ ఉత్తరం రాసి, పోస్ట్ డబ్బాలో చేయిపెడతాడు గోపి.ఇంతలో ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. తను సరదాగా అబద్ధమాడి చెప్పిన నిర్మలా మేరీ అనే క్యారెక్టర్ నిజంగానే ఎంటరైపోతుంది. గోపీకి కాళ్లూ చేతులూ ఆడలేదు. ఈ గందరగోళంలో గోపీ చేయి పోస్టుడబ్బాలో ఇరుక్కుపోయింది. అలా పోస్టుడబ్బాతోనే పరిగెత్తాడు. వెనుక పోస్ట్‌మ్యాన్ పరుగులు. తీరా అతగాడొచ్చి, పోస్టుడబ్బాలోని ఉత్తరాలు తీసుకుని వెళ్లిపోయాడు. ‘పోస్టు మావా... పోస్టు మావా... ఇరుక్కున్న నా చేతిని నరక్కుండా విడిపించవా?’ అని దీనంగా వేడుకున్నాడు. ఆ పోస్టుమ్యాన్ చాలా నిర్లక్ష్యంగా ‘సారీ! అది నా డ్యూటీ కాదు. పోస్టుమాస్టర్ గారికి లెటర్ రాస్తే, ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్‌కి రాస్తారు. ఆయనేమో సెంట్రల్‌కి రాస్తారు’ అని సలహా ఇచ్చి వెళ్లిపోయాడు. ‘ఓరి దేవుడో... ఇంత హంగామా ఉందా? అనవసరంగా సెంట్రల్ గవర్నమెంట్ నోట్లో చెయ్యిపెట్టానే’ అని లబోదిబోమన్నాడు గోపీ. ఇలా ఉంటాయండీ గోపీ పనులన్నీ. ఏదైనా చింపి చేట చేస్తాడు. అతని దగ్గర సలహా తీసుకుంటే.. మీ బతుకు మేకలు చింపిన వాల్పోస్టరైపోద్ది!బీ కేర్‌ఫుల్! సీ కేర్ ఫుల్!! డీ కేర్ ఫుల్!!! - పులగం చిన్నారాయణ పోస్ట్‌బాక్స్ కామెడీ హైలైట్ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావుకు నేనంటే ప్రత్యేక అభిమానం. ఆయన సినిమాల్లో నాకు మంచి పాత్రలిచ్చారు. పవన్ కల్యాణ్ ‘సుస్వాగతం’లో ‘త న్ము ఖ త ర్మ’ అంటూ నత్తిగా మాట్లాడే పాత్ర ఎంతో పేరు తెచ్చింది. అప్పట్లో నేనెక్కడికి వెళ్ళినా అందరూ ఆ పాత్రని గుర్తు చేసుకొనేవారు. అందులోని నత్తి మేనరిజవ్ును అనుకరించేవారు. ఈ పెద్ద హిట్ తర్వాత భీమనేని నాకిచ్చిన మరో మంచి పాత్ర ఈ ‘గోపి’. హీరో పక్క నుండే ఫ్రెండ్‌గా ఈ సినిమా నాలో మరో కొత్త కోణాన్ని చూపించింది. నేను రాసే దొంగ ఉత్తరాలు, నా చేయి ఇరుక్కొనే పోస్ట్‌బాక్స్ కామెడీ జనానికి బాగా నచ్చాయి.. మరుధూరి రాజా రాసిన మాటలు, స్క్రిప్ట్ పెట్టుకొని, డెరైక్టర్‌తో సెట్స్ మీద అప్పటికప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం. అలా ఆన్ ది స్పాట్ చేసిన ఇంప్రూవ్ మెంట్లు కూడా బాగా పేలాయి. నా కెరీర్లో ఇదొక మెమరబుల్ క్యారెక్టర్. - సుధాకర్ సుధాకర్ కామెడీని బాగా ఎంజాయ్ చేశారు తమిళంలో ఘనవిజయం సాధించిన ‘పూవే ఉనక్కాగ’కు రీమేక్‌గా ఈ సినిమా చేశాం. తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులూ చేర్పులూ చేశాం. తమిళంలో విజయ్ పక్కన చార్లీ అనే కమెడియన్ చేశారు. ఇక్కడ మనకు జగపతిబాబు పక్కన సుధాకర్ చేశారు. సుధాకర్ తన పెర్ఫార్మెన్స్తో ఈ గోపీ పాత్రను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. తమిళంలో కన్నా ఫుల్ బెటర్‌గా తీర్చిదిద్దామీ పాత్రను. సుధాకర్ కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంలో సుధాకర్ పాత్ర చాలా ఉంది. అప్పట్లో నా సినిమాలన్నింటిలోనూ సుధాకర్ కంపల్సరీగా ఉండేవారు. - భీమనేని శ్రీనివాసరావు -
ప్రతి క్యారెక్టర్ సూపర్...
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'బాహుబలి' సినిమా అభిమానుల ముందుకు వచ్చేసింది. తిరుపతిలో ఫ్యాన్స్ షో కోసం గత రాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానులు పెద్దఎత్తున బారులు తీరారు. దీంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. గ్రూప్ థియేటర్స్ వద్ద అభిమానులపై పోలీసులు లాఠీలు కూడా ఝుళిపించారు. లాఠీ దెబ్బలు తగులుతున్నా... సినిమా చూసేవరకు అభిమానులు థియేటర్లను వదల్లేదు. ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 4గంటలకు సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కోసం మూడేళ్లుగా ఎదురు చూశామని అభిమానులు తెలిపారు. తిరుపతిలో 'బాహుబలి' మొదటి షో చూసిన అభిమానులు... సినిమా సూపర్‌గా ఉందంటున్నారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగుందని... అందరూ ధీటైన నటన చూపారని అంటున్నారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని కేరింతలు కొడుతున్నారు. ఇండియన్ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రం బాహుబలి. సుమారు 250 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకల ముందుకు వచ్చింది. సుమారు 4000 వేల ధియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా ఈ సినిమా చూడాలనుకున్న అభిమాని జేబు మాత్రం చిల్లు పడుతోంది.. అర్ధరాత్రి నుంచి థియేటర్ల దగ్గర పడిగాపులు..భారీ క్యూలు..తోపులాటలు.. లాఠీచార్జీలు...బ్లాక్మార్కెట్లో టిక్కెట్ల అమ్మకాలు... బాహుబలి సంగతేమోగానీ,.. అభిమానం మాత్రం బలి అవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. -
ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే!
ఒక్కసారి కాదు... వందసార్లు చూసినా... బాషా పంచ్‌లు... మళ్లీ మళ్లీ పిడికిళ్లు బిగించేలా చేస్తూనే ఉంటాయి. చాలా కాలం తరువాత... ‘బాషా’ వచ్చాడు తెర పైకి మళ్లీ. కొన్ని వేడిలోనే బాగుంటాయి. కొన్ని చల్లబడిన తరువాత కూడా మునపటి కంటే ఎక్కువ వేడితో, వాడితో బాగుంటాయి. కొన్ని రెండిట్లోనో మహా మహా బాగుంటాయి. బాషా... వేడిలోనే కాదు... ఆ వేడి తగ్గిన కాలంలోనూ మళ్లీ వేడెక్కిస్తాడు. బాషాను చూసి చాలా కాలమే అయ్యుండవచ్చు. కానీ ఇప్పటికీ చూస్తే... ఇప్పుడే చూసినట్లు ఉంటుంది. ‘మాణిక్యం’ క్యారెక్టర్ గుండెలో తడిని తడుముతున్నట్లే ఉంటుంది. బాషా క్యారెక్టర్ కళ్లలో అగ్నులను ఉత్తేజితం చేస్తున్నట్లుగానే ఉంటుంది. ‘‘నేను మాణిక్యమైపోవాలి’’ అనుకుంటాం. మాణిక్యాన్ని బంగారం చేసింది కుటుంబం మీద అతని ప్రేమ. ఆ ప్రేమను మనకు తెలియకుండానే సొంతం చేసుకుంటాం. ఉన్నట్టుండి మనం మాణిక్యాలమై పోతాం. కుటుంబాన్ని ఇంకా... ఇంకా ప్రేమిస్తాం. తన చెల్లిని వేధించినవాడిని చావబాదుతుంటే... మనం మన సీట్లో నుంచి లేచి మాణిక్యంలో ఐక్యమైపోతాం. ఆ గూండాను-‘‘రేయ్... అంటోని గురించి నా దగ్గర చెప్పొద్దు’’ అని హెచ్చరిస్తాం. అప్పటికీ మన ఆవేశం చల్లారదు. ‘‘నీ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసు..’’ అని కాలరు పట్టుకొని వాడి చెంప చెళ్లుమనిపిస్తాం. అంతేనా... మాణిక్యంతో పాటు బాంబే వెళ్లిపోతాం. బాషా అయిపోతాం. బాషాలా చిటికేస్తాం. గొంతు పెంచి- ‘‘ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినపట్లే’’ అని గర్జిస్తాం. గాండ్రిస్తాం. చూస్తూ ఉండగానే బాషా మనల్ని ఆవహిస్తాడు. పేదోడి జోలికి వచ్చే వాడి పీక నొక్కేస్తాం. పేదోడి కడుపు కొట్టే రాబందులను నల్లుల్లా నలిపేస్తాం. ఆవేశం ఆవేశం... ఒంటి నిండా ఆవేశం... అమ్మ తల్లి పూనినట్లు... బాషా మనల్ని పూనుతాడు. వినాయకుడి గుడిలో బాంబు పెట్టడానికి వచ్చిన గుండాను మట్టికరిపించి- ‘‘నాకు పని పెట్టొద్దు. నిజం చెప్పు... తెలుసుగా... ఈ బాషా ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే’’ అని ఊగిపోతాం. బాషా మనల్ని పూనాడు కదా... ఇక భయమెందుకు? డాన్ ఆంటోని అయితేనేం... వాడి తాత అయితేనేం? ‘‘రేయ్ నువ్వు చావాలి. లేదా నేను చావాలి. నీ వాళ్లు చావాలి. లేదా నా వాళ్లు చావాలి. ప్రజలు కాదు... అమాయక ప్రజలు కాదు చావాల్సింది. ఇప్పుడు తెలిసింది... నువ్వు పిరికి వెధవ్వి. ఒక పిరికి వాడితో యుద్ధం చేయడం నాకు నచ్చదు. ఈ బాషాకు... మాణిక్ బాషాకు నచ్చదు. ఇంకా ఏడే రోజుల్లో నీ కథ ముగిస్తా. ఈ బాషా ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే! ఒక్క డైలాగ్... ఒకే ఒక్క డైలాగు... మనల్ని ఏకం చేస్తుంది... మన ధైర్యాన్ని ఏకం చేస్తుంది. మన అడుగుల్ని ఏకం చేస్తుంది. గుండెలో రగిలే రణధ్వనిని ఏకం చేస్తుంది. కొందరు భావోద్వేగాలే మనుషులైనట్లు ఉంటారు. కొందరు అవి మచ్చుకైనా లేనట్లు ఉంటారు. అంతమాత్రాన... వాళ్లు రాతిగోడలు కాదు. రాతి గోడలో కూడా తేమ ఉంటుందని గంభీరంగా నిరూపించే వాళ్లు. మనలో భావోద్వేగాల మాణిక్యాలు ఉండొచ్చు. దెబ్బకు దెబ్బ తీసే మాణిక్ బాషాలు ఉండొచ్చు. ‘‘మంచి వాడు మొదట కష్టపడతాడు... కానీ ఓడిపోడు’’ అది బాషా చెప్పిన భాష్యమే కాదు... నిజ జీవిత సత్యం అని మన జీవితాల్లో ఎన్నో ఉదాహరణలు సజీవంగా చెబుతుంటాయి. ‘‘ చెడ్డవాడు మొదట సుఖపడతాడు... కానీ ఓడిపోతాడు’’ ఓడిపోయిన చెడ్డ వాళ్లు మన ముందు దీనంగా క్యూ కడుతూనే ఉంటారు. బాషా ఒక్కడే- కానీ ఎప్పుడు వచ్చినా వందలుగా వస్తాడు. అందరినీ .... పంచ్ పవర్‌తో ఏకం చేస్తూనే ఉంటాడు. బాషా అంటే ఏకవచనం కాదు... అందరిని ఏకం చేసే సర్వనామం! సింహనాదం!! -
ఎవరికీ చెప్పలేక...
చాలా పేరు ప్రతిష్ఠలున్న కుటుంబంలో పుట్టింది అక్షర. చదువైపోగానే మంచి ఉద్యోగం రావడంతో అమెరికా వెళ్లిపో యింది. అక్కడ నాలుగైదేళ్లు ఉన్న తర్వాత తమ మాట కాదనదన్న నమ్మకంతో తలి దండ్రులు ఆమెకు ఒక అబ్బాయితో పెళ్లి కుదిర్చారు. ఆమెని ఇండియాకు పిలిపించి, పెళ్లి చేశారు. అయితే పెళ్లయిన మర్నాడే అక్షర స్నేహితులను కలిసొస్తానని చెప్పి బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ రాక పోవడంతో ఫోన్ చేశారు. సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. అందరూ టెన్షన్ పడసాగారు. మర్నాడు అక్షర ఫోన్ చేసి, అమెరికాలో తాను ఇష్టపడ్డ వ్యక్తితో కలసి సహజీవనం చేస్తోన్న విషయం చెప్పింది. ఆ విషయం చెబుదామనుకునేలోపే తనకు పెళ్లి కుదిర్చారనీ, తలిదండ్రుల పరువు తీయడం ఇష్టం లేక పెళ్లికి తలవంచా ననీ, ఇప్పుడు చేసుకున్న వ్యక్తితో కలిసి జీవిం చడం ఇష్టం లేక వెళ్లిపోతున్నానని తెలియ జేసింది. దాంతో ఏమి చేయాలో తోచక ఆమె తలిదండ్రులు తలలు పట్టుకున్నారు. అంతలో వరుడి తల్లిదండ్రులు నానా రభసా చేశారు. దాంతో జరిగిన దానికి విచారిస్తు న్నాననీ, జరిగినదంతా మరచిపోయి వేరే పెళ్లి చేసుకోమని వరుడికి అక్షరతో ఉత్తరం రాయించారు ఆమె తలిదండ్రులు. ఫోన్ ద్వారానూ చెప్పించారు. వారికి అమెరికన్ కోర్టు ద్వారా విడాకులు కూడా మంజూరై నాయి. అయితే అవి ఇక్కడ చెల్లవనీ ఇండియాలో విడాకులు ఇప్పించాలని వరుడి తలిదండ్రులు అభ్యర్థించారు. రెండు కుటుంబాల మధ్య పరస్పర అవగాహన ఉంది కాబట్టి, వారి మధ్య కంజుమేషన్ జరగలేదు కాబట్టి వెంటనే విడాకులు మంజూరయ్యాయి. అబ్బాయి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరూ ఎవరి దారిన వారు హాయిగా జీవిస్తున్నారు. ఇక్కడ చెప్పొచ్చేదేమంటే, కూతురి అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్లి సెటిల్ చేయడం పెద్దవాళ్ల తప్పు. సహజీవనం చేస్తున్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టడం అక్షర చేసిన తప్పు. కనీసం పెళ్లి పీటల మీదయినా విషయం చెప్పి, పెళ్లి ఆపు చేయించివుంటే బాగుండేది. అలా కూడా చేయకండా పెళ్లయ్యాక చెప్పకుండా పారిపోవడం పెద్ద తప్పు. ఏది ఏమయినా మూర్ఖత్వానికి పోకుండా అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత ఎవరి దారిన వారు జీవించడం ఒక్కటే ఇక్కడ ప్లస్ పాయింట్.