చాలా పేరు ప్రతిష్ఠలున్న కుటుంబంలో పుట్టింది అక్షర. చదువైపోగానే మంచి ఉద్యోగం రావడంతో అమెరికా వెళ్లిపో యింది. అక్కడ నాలుగైదేళ్లు ఉన్న తర్వాత తమ మాట కాదనదన్న నమ్మకంతో తలి దండ్రులు ఆమెకు ఒక అబ్బాయితో పెళ్లి కుదిర్చారు. ఆమెని ఇండియాకు పిలిపించి, పెళ్లి చేశారు. అయితే పెళ్లయిన మర్నాడే అక్షర స్నేహితులను కలిసొస్తానని చెప్పి బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ రాక పోవడంతో ఫోన్ చేశారు. సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. అందరూ టెన్షన్ పడసాగారు. మర్నాడు అక్షర ఫోన్ చేసి, అమెరికాలో తాను ఇష్టపడ్డ వ్యక్తితో కలసి సహజీవనం చేస్తోన్న విషయం చెప్పింది. ఆ విషయం చెబుదామనుకునేలోపే తనకు పెళ్లి కుదిర్చారనీ, తలిదండ్రుల పరువు తీయడం ఇష్టం లేక పెళ్లికి తలవంచా ననీ, ఇప్పుడు చేసుకున్న వ్యక్తితో కలిసి జీవిం చడం ఇష్టం లేక వెళ్లిపోతున్నానని తెలియ జేసింది. దాంతో ఏమి చేయాలో తోచక ఆమె తలిదండ్రులు తలలు పట్టుకున్నారు.
అంతలో వరుడి తల్లిదండ్రులు నానా రభసా చేశారు. దాంతో జరిగిన దానికి విచారిస్తు న్నాననీ, జరిగినదంతా మరచిపోయి వేరే పెళ్లి చేసుకోమని వరుడికి అక్షరతో ఉత్తరం రాయించారు ఆమె తలిదండ్రులు. ఫోన్ ద్వారానూ చెప్పించారు. వారికి అమెరికన్ కోర్టు ద్వారా విడాకులు కూడా మంజూరై నాయి. అయితే అవి ఇక్కడ చెల్లవనీ ఇండియాలో విడాకులు ఇప్పించాలని వరుడి తలిదండ్రులు అభ్యర్థించారు. రెండు కుటుంబాల మధ్య పరస్పర అవగాహన ఉంది కాబట్టి, వారి మధ్య కంజుమేషన్ జరగలేదు కాబట్టి వెంటనే విడాకులు మంజూరయ్యాయి. అబ్బాయి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరూ ఎవరి దారిన వారు హాయిగా జీవిస్తున్నారు.
ఇక్కడ చెప్పొచ్చేదేమంటే, కూతురి అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్లి సెటిల్ చేయడం పెద్దవాళ్ల తప్పు. సహజీవనం చేస్తున్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టడం అక్షర చేసిన తప్పు. కనీసం పెళ్లి పీటల మీదయినా విషయం చెప్పి, పెళ్లి ఆపు చేయించివుంటే బాగుండేది. అలా కూడా చేయకండా పెళ్లయ్యాక చెప్పకుండా పారిపోవడం పెద్ద తప్పు. ఏది ఏమయినా మూర్ఖత్వానికి పోకుండా అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత ఎవరి దారిన వారు జీవించడం ఒక్కటే ఇక్కడ ప్లస్ పాయింట్.
ఎవరికీ చెప్పలేక...
Published Tue, May 19 2015 11:39 PM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement